మండలంలో 2014–2015లో నమోదైన నకిలీ పట్టదారు పాసు పుస్తకాలు, కేసుల వివరాలపై సీఐడీ అధికారులు ఆరా తీశారు.
బ్రహ్మసముద్రం : మండలంలో 2014–2015లో నమోదైన నకిలీ పట్టదారు పాసు పుస్తకాలు, కేసుల వివరాలపై సీఐడీ అధికారులు ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తమకు అందజేయాలని తహశీల్దార్ సుబ్రమణ్యంకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయమై బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో వివరాలు సేకరించినట్లు తెలిసింది. మండలంలో 2009 నుంచి 2015 వరకు మండలంలో పనిచేసిన తహశీల్దార్ల వివరాలు, సిబ్బందిపై నమోదైన పోలీస్ కేసులు తదితర వివరాలను అడిగినట్లు తహశీల్దార్ సుబ్రమణ్యం తెలిపారు.