CID officers
-
బాబుపై స్కిల్ కేసును కొట్టేయలేం
జస్టిస్ అనిరుద్ధ బోస్ ఏం చెప్పారంటే... ► స్కిల్ కేసుకు సెక్షన్ 17(ఏ) వర్తిస్తుంది.. చంద్రబాబుపై కేసు నమోదుకు ముందు గవర్నర్ అనుమతి తప్పని సరి.. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవచ్చు ► అనంతరం చంద్రబాబు విషయంలో ముందుకెళ్లొచ్చు జస్టిస్ బేలా త్రివేదీ ఏం చెప్పారంటే... ► 2018కి ముందు నేరాలకు సెక్షన్ 17(ఏ) వర్తించదు ► సెక్షన్ 17(ఏ) అమల్లో లేని కాలానికి దానిని వర్తింపజేయలేం ► చట్ట సవరణ చేసిన శాసనవ్యవస్థ ఉద్దేశం కూడా ఇదే ► 2018కి పూర్వ నేరాలకు వర్తింప చేస్తే చాలా వివాదాలు తలెత్తుతాయి ► గత నేరాలకు వర్తింప చేస్తే ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ► అంతేకాక చట్ట సవరణ తీసుకొచ్చిన ఉద్దేశమూ నెరవేరకుండా పోతుంది ► భిన్నమైన భాష్యం ప్రాథమిక దశలో దర్యాప్తునకు విఘాతం కలిగించడమే ► సెక్షన్ 17 (ఏ) తెచ్చింది అవినీతిపరులను కాపాడేందుకు కాదు ► వేధింపుల నుంచి నిజాయతీపరులైన వారిని కాపాడేందుకే ► అధికార విధుల్లో భాగం కాని నిర్ణయాలకు సెక్షన్ 17(ఏ) కింద రక్షణ సాధ్యం కాదు ► చంద్రబాబు రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు సరిగ్గానే వ్యవహరించింది ► తన పరిధి మేరకే నిర్ణయం తీసుకుంది ► 17(ఏ) కింద అనుమతి లేదని రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయలేం ► హైకోర్టు తీర్పులో కూడా ఎలాంటి చట్ట విరుద్ధత లేదు ► ఏసీబీ కోర్టు, హైకోర్టు తీర్పుల్లో ఏ రకంగానూ జోక్యం అవసరం లేదు సాక్షి, అమరావతి: యువతలో ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరుస్తామంటూ వందల కోట్లు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరిట షెల్ కంపెనీల ద్వారా వందల కోట్ల రూపాయల్ని కాజేసినందుకు చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బాబుకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్దించింది. అంతేకాకుండా ఈ కేసులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు, ప్రభుత్వ కక్షసాధింపులు లేనేలేవని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. సీమెన్స్ సంస్థకు తెలియకుండానే ఆ కంపెనీ మాజీ అధికారులను తెరపైకి తెచ్చి ... బోగస్ ఒప్పందాలతో... ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు నేరుగా వందల కోట్లను తన ఖాతాల్లోకి మళ్లించుకున్న వ్యవహారంలో ఆయనపై ఆధారాలతో సహా ఏపీ సీఐడీ విభాగం కేసు నమోదు చేయటం తెలిసిందే. కేసులో బాబును అరెస్టు చేసి, ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు పరచటంతో... కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి... ఆరోగ్యం బాగాలేదని, ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటానని చెప్పి షరతులతో బెయిలు తీసుకుని బయటకు వచ్చారు. ఈ కేసులో అరెస్టయిన తరవాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి పెద్దపెద్ద న్యాయవాదులను ప్రత్యేక విమానాల్లో తెప్పించారు. మొదటి నుంచీ తనకు ఈ కేసుతో సంబంధం లేదనిగానీ, తాను అక్రమాలకు పాల్పడలేదని గానీ, డబ్బుల్ని షెల్ కంపెనీల్లోకి మళ్లించలేదని గానీ, సీమెన్స్ సంస్థ పేరిట బోగస్ ఒప్పందం చేసుకోలేదని గానీ వాదించకుండా... తాను మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి, తనను అరెస్టు చేయాలంటే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నరు అనుమతి తీసుకోవాలని, అలా తీసుకోకుండా సీఐడీ తనను అరెస్టు చేసింది కాబట్టి ఈ అరెస్టు చెల్లదని... కాబట్టి మొత్తం కేసును కొట్టేయాలని (క్వాష్ చెయ్యాలని) చంద్రబాబు వాదిస్తున్నారు. కింది కోర్టు నుంచి అత్యున్నత సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు తరఫు లాయర్లు ఇదే వాదన వినిపిస్తూ వచ్చారు. కేసును కొట్టేయడానికి కింది కోర్టు, రాష్ట్ర హైకోర్టు నిరాకరించటంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ మధ్యలోనే అనారోగ్య కారణాలు చూపించి బాబు బెయిలుపై విడుదలయ్యారు. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం... మంగళవారం తీర్పు వెలువరించింది. కేసును క్వాష్ చెయ్యాలన్న చంద్రబాబు అభ్యర్థనను తిరస్కరించింది. సీఐడీ పెట్టిన ఎఫ్ఐఆర్ను, ప్రత్యేక న్యాయస్థానం విధించిన రిమాండ్‌ను... అన్నింటినీ సుప్రీంకోర్టు బెంచ్ సమర్థించింది. అయితే గవర్నరు అనుమతి తీసుకున్నాకే చంద్రబాబును అరెస్టు చేయాలన్న సెక్షన్ 17ఏ విషయంలో ధర్మాసనంలోని ఇరువురు న్యాయమూర్తులూ భిన్నమైన తీర్పును వెలువరించారు. చంద్రబాబు నాయుడికి సెక్షన్ 17ఏ వర్తిస్తుందని, ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నరు నుంచి అనుమతి తీసుకోవచ్చని జస్టిస్ అనిరుద్ధ బోస్ పేర్కొనగా... సెక్షన్ 17ఏ రాకముందే ఈ నేరం జరిగింది కాబట్టి చంద్రబాబుకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేదీ స్పష్టంచేశారు. నిజాయితీపరులైన అధికారులను వేధింపుల నుంచి కాపాడాలన్న ఉద్దేశంతోనే సెక్షన్ 17ఏను తెచ్చారని, అవినీతి పరులను కాపాడేందుకు కాదని ఆయన స్పష్టంచేశారు. చంద్రబాబు రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు సరిగ్గానే వ్యవహరించిందని, తన పరిధి మేరకే నిర్ణయం తీసుకుందని విస్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడేం జరుగుతుంది? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణమనేది రాజకీయ దురుద్దేశాలతో పెట్టినదని, తనను కక్షసాధింపుతోనే అరెస్టు చేశారని చంద్రబాబు చెబుతున్నారు. సుప్రీంకోర్టు మాత్రం ఈ వాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇది అవినీతికి సంబంధించిన స్పష్టమైన కేసు అని, దీన్లో రాజకీయ దురుద్దేశాలు గానీ, కక్ష సాధింపుగానీ లేవని తేలి్చచెప్పింది. సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చెయ్యడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో... ఎఫ్ఐఆర్లో ఐపీసీ 409 (ప్రజల నమ్మకాన్ని నేరపూరితంగా వంచించటం), సెక్షన్ 120బి (దురుద్దేశపూర్వక కుట్ర) వంటివి సెక్షన్ 17ఏతో సంబంధం లేనివి కనుక యథాతథంగా కొనసాగుతాయి. ఐపీసీ 409 కింద నేరం గనక రుజువైతే యావజ్జీవ శిక్ష పడుతుంది. కాకపోతే సెక్షన్ 17ఏ వర్తిస్తుందా? లేదా? అన్న విషయంలో మాత్రం బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులూ భిన్నమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు కాబట్టి... ఈ అంశాన్ని ఇద్దరికన్నా ఎక్కువ మంది న్యాయమూర్తులుండే విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిందిగా కోరుతూ... కేసు ఫైళ్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని కోర్టు రిజిస్ట్రీని బెంచ్ ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మేరకు బెంచ్ ఏర్పాటు ఉంటుంది. తీర్పుల కాపీలు అప్లోడ్ చేయకపోవడంతో అందులోని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. జస్టిస్ బోస్ ఏం చెప్పారంటే... చంద్రబాబుపై కేసు నమోదు చేసే ముందు సెక్షన్ 17(ఏ) ప్రకారం ముందస్తు అనుమతి (గవర్నర్ నుంచి) తీసుకోవడం తప్పనిసరి అని జస్టిస్ బోస్ తన తీర్పులో పేర్కొన్నారు. అలా ముందస్తు అనుమతి తీసుకోకుండా చేపట్టే విచారణ లేదా దర్యాప్తు చట్ట విరుద్ధమవుతుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అందువల్ల అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)(సీ), 13(1)(డీ), 13(2) ప్రకారం చంద్రబాబు విషయంలో ముందుకు వెళ్లడానికి వీల్లేదన్నారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గవర్నరు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవచ్చని, తదనంతరం అవినీతి నిరోధక చట్టం కింద (పీసీ యాక్ట్) చంద్రబాబు విషయంలో ముందుకెళ్లవచ్చునని తెలిపారు. అలాగే తనపై సీఐడీ నమోదు చేసిన కేసును, తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలన్న చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చుతున్నట్లు జస్టిస్ బోస్ తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోనంత మాత్రాన రిమాండ్ ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా పోవని ఆయన తేల్చి చెప్పారు. జస్టిస్ బేలా త్రివేది... 17 (ఏ) ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ బోస్ తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది విబేధించారు. సెక్షన్ 17(ఏ) అమల్లోకి రాకమునుపే ఈ నేరం జరిగిందని... అది అమల్లో లేని కాలానికి దానిని వర్తింప చేయలేమని జస్టిస్ త్రివేది తీర్పునిచ్చారు. అవినీతి నిరోధక చట్టానికి 2018లో సవరణలు చేసి సెక్షన్ 17(ఏ)ను చేర్చిన నేపథ్యంలో... 2018కి ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17(ఏ) వర్తించదని, 2018, ఆ తరవాత జరిగిన నేరాలకే ఈ సెక్షన్ వర్తిస్తుందని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. చట్ట సవరణ చేసిన శాసనవ్యవస్థ ఉద్దేశం కూడా ఇదేనన్నారు. ‘‘17(ఏ)ను పూర్వ నేరాలకు వర్తింప చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. 17(ఏ) రావడానికి ముందున్న కాలానికి దీన్ని వర్తింప చేస్తే కొత్తగా అనేక వివాదాలకు తేరలేపినట్లవుతుంది. 2018కి ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17(ఏ)ను వర్తింప చేస్తే చట్ట సవరణ చేసిన ఉద్దేశం నెరవేరకుండా పోతుంది’’ అని ఆమె తేల్చి చెప్పారు. ప్రాథమిక దశలోనే దర్యాప్తునకు విఘాతం కలిగించినట్లవుతుంది... శాసనవ్యవస్థ సెక్షన్ 17(ఏ)ను తీసుకొచ్చి న ఉద్దేశానికి మరో రకమైన భాష్యం చెప్పినా కూడా అది అసమంజసమే అవుతుందని జస్టిస్ బేలా త్రివేదీ తెలిపారు. అంతేకాక ప్రాథమిక దశలోనే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలిగించినట్లు అవుతుందన్నారు. ‘‘2018కి ముందు కేసులకు కూడా సెక్షన్ 17(ఏ) వర్తిస్తుŠందన్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనతో ఏకీభవిస్తే, పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల్లోని విచారణలు, దర్యాప్తులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీని వల్ల చాలా కేసులు నిరర్థకంగా మారతాయి. అవినీతిని రూపుమాపేందుకు తీసుకొచ్చిన చట్టం తాలుకు ముఖ్య ఉద్దేశం నెరవేరకుండా పోతుంది. అసలు అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలపై వేధింపులకు గురికాకుండా నిజాయతీపరులైన అమాయక అధికారులను కాపాడటానికే సెక్షన్ 17ఏను తీసుకువచ్చారు. అంతేతప్ప అవినీతిపరులైన పబ్లిక్ సర్వెంట్లకు రక్షణ కల్పించడానికి కాదు’’ అని జస్టిస్ బేలా తన తీర్పులో విస్పష్టంగా చెప్పారు. విధుల్లో భాగం కాని నిర్ణయాలకు రక్షణ ఇవ్వకూడదు.. అవినీతి నిరోధక చట్టం సెక్షన్లతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదైనప్పుడు, కేసు నమోదుకు ముందు సెక్షన్ 17(ఏ) కింద అనుమతి తీసుకోలేదన్న కారణంతో ఎఫ్ఐఆర్ను కొట్టేయడం సాధ్యం కాదన్నారు. అధికార విధుల్లో భాగం కాని నిర్ణయాలకు సెక్షన్ 17(ఏ) కింద రక్షణ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఏసీబీ కోర్టు తనకున్న పరిధి మేరకే రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. చంద్రబాబును రిమాండ్‌కు పంపడం ద్వారా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎలాంటి తప్పు చేయలేదని జస్టిస్ బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో సైతం ఎలాంటి దోషం గానీ, చట్ట విరుద్ధత గానీ లేదన్నారు. హైకోర్టు తీర్పులో ఏ రకంగానూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె తన తీర్పులో స్పష్టం చేశారు. మూడు నెలల తరువాత తీర్పు... ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. ప్రధానంగా సెక్షన్ 17(ఏ)పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ, సిద్దార్థ లూత్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, ఎస్.నిరంజన్ రెడ్డి, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. వాదనల అనంతరం అక్టోబర్ 17న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు 3 నెలల తరువాత మంగళవారం తీర్పును వెలువరించింది. ఇరువురు న్యాయమూర్తులు కూడా సెక్షన్ 7(ఏ) విషయంలో భిన్న తీర్పులు వెలువరించారు. ఇక ఇప్పుడేమని అరుస్తారు..? కేసు కొట్టివేతకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం తనపై అన్యాయంగా కేసు పెట్టిందని, రాజకీయంగా వేధించేందుకు జైల్లో పెట్టారంటూ చంద్రబాబు, ఆయన వందిమాగధులు చేస్తూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. తన తండ్రి విషయంలో ఏసీబీ కోర్టు అన్యాయంగా వ్యవహరించిందంటూ నారా లోకేష్ ఎల్లో మీడియా ఇంటర్వ్యూల్లో చేసిన ఆరోపణలు బూటకమని రుజువైంది. బాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు జడ్జిని, రిమాండ్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డిని సోషల్ మీడియాలో దారుణంగా దూషించిన టీడీపీకి సుప్రీం తీర్పు చెంపదెబ్బ కన్నా ఎక్కువే. సెక్షన్ 17(ఏ)ను తేల్చనున్న సీనియర్ న్యాయమూర్తి... ఇరువురు న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఏర్పాటవుతుంది. ఈ విషయంలో సీజే జస్టిస్ చంద్రచూడ్ పాలనాపరమైన నిర్ణయం తీసుకుంటారు. జస్టిస్ బోస్ కన్నా సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేస్తారు. జస్టిస్ బోస్ ఇప్పుడు సీనియారిటీలో 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయనకన్నా సీనియర్లు అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ లేదా రెండవ స్థానంలో ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, లేదా మూడవ స్థానంలో ఉన్న జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ లేదా నాల్గవ స్థానంలో ఉన్న సూర్య కాంత్.. ఈ నలుగురిలో ఒకరి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం ఏర్పాటవుతుంది. ఈ విస్తత ధర్మాసనంలో కొత్తగా వచ్చే సీనియర్ న్యాయమూర్తితో పాటు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది కూడా ఉంటారు. ఈ ముగ్గురు కలిసి తిరిగి మొదటి నుంచి చంద్రబాబు కేసును విచారిస్తారు. జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ఇప్పటికే ఓ నిర్ణయాన్ని వెలువరించిన నేపథ్యంలో విస్తృత ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి నిర్ణయం కీలకమవుతుంది. అలాగే జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది కేవలం సెక్షన్ 17(ఏ) విషయంలోనే భిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో విస్తత ధర్మాసనం సైతం ఇదే అంశంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. విస్తృత ధర్మాసనంలో ఉండే సీనియర్ న్యాయమూర్తి ఇప్పటికే నిర్ణయం వెలువవరించిన ఇరువురు న్యాయమూర్తుల్లో ఒకరి నిర్ణయాన్ని సమర్దించవచ్చు. ఎవరి తీర్పును సమర్దిస్తారో అప్పుడు 2 :1గా మెజారిటీతో ఆ తీర్పు ఖరారు అవుతుంది. ఒకవేళ జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల నిర్ణయాలతో ఏకీభవించకుండా ఆ సీనియర్ న్యాయమూర్తి మరో భిన్నమైన నిర్ణయాన్ని వెలువరిస్తే, అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును పంపాల్సి ఉంటుంది. మొట్టమొదటిసారి.... విచారణ ముంగిట చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో చంద్రబాబు ఈ కేసులో తొలిసారిగా కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు. స్కిల్ కేసులో సీఐడీ తన దర్యాప్తును పూర్తి చేసి చార్జిïÙట్ దాఖలు చేసిన తరువాత ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణను (ట్రయల్) మొదలు పెడుతుంది. విచారణ జరిగే ప్రతీ సందర్భంలోనూ చంద్రబాబు కోర్టు ఎదుటకు హాజరు కావడం తప్పనిసరి. ఈ విధంగా చంద్రబాబు ఓ కేసులో కింది కోర్టులో విచారణను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. చంద్రబాబుపై కర్షక పరిషత్ కేసు మొదలుకుని ఇప్పటి వరకు ఎన్నో కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసుల్లో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. చాలా కేసులను నేరం లోతుల్లోకి వెళ్లనివ్వకుండా సాంకేతిక కారణాలతో కొట్టేయించుకున్నారు. ఏ కోర్టు కూడా ఏ ఒక్క కేసులోనూ పూర్తిస్థాయి విచారణ (ట్రయల్) జరిపి చంద్రబాబు నేరం చేయలేదని క్లీన్చిట్ ఇచ్చిన సందర్భాలు లేవు. టెక్నికల్ అంశాలను లేవనెత్తుతూ అన్ని కేసుల్లోనూ తనకు మాత్రమే సాధ్యమైన ‘మేనేజ్మెంట్ స్కిల్స్’తో చంద్రబాబు ఇప్పటి వరకు బయటపడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన కేసును సైతం హైదరాబాద్ ఏసీబీ కోర్టు సాంకేతిక కారణాలతోనే కొట్టేసింది. ఈ కేసును కొట్టేసిన న్యాయాధికారి అటు తరువాత జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో హైకోర్టు జడ్జి అయ్యారు. ఇప్పుడు స్కిల్ కుంభకోణంలో అలా బయటపడేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. విస్మయకరంగా అరెస్టయిన 3 రోజులకే కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈసారి పాచికలు పారలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించాయి. దీంతో ఆయన ఏసీబీ కోర్టు విచారణను ఎదుర్కోక తప్పడం లేదు. బాబు కుంభకోణం నేపథ్యం ఇదీ.. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో షెల్ కంపెనీల ద్వారా ఖజానాకు చెందిన రూ.వందల కోట్లను కొల్లగొట్టారని పేర్కొంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కేసులో చంద్రబాబును నిందితునిగా చేర్చింది. గతేడాది సెపె్టంబర్ 9న ఆయనను అరెస్ట్ చేసి 10న విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అనంతరం సీఐడీ చంద్రబాబును తమ కస్టడీలోకి తీసుకుని విచారించింది. దీంతో ఈ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలంటూ చంద్రబాబు సెప్టెంబర్ 12న హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అరెస్టయిన 3 రోజులకే ఆయన ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ఈ పిటిషన్లో తన తరఫున వాదనలు వినిపించేందుకు చంద్రబాబు దేశంలోనే అత్యధిక ఫీజులు వసూలు చేసే ప్రముఖ న్యాయవాదులను రంగంలోకి దించారు. ఈ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం, చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు జíస్టిస్ శ్రీనివాసరెడ్డి నిరాకరించారు. ఏసీబీ కోర్టు రిమాండ్ ఉత్తర్వుల్లో సైతం జోక్యానికి నిరాకరించారు. అంతేకాక సెక్షన్ 17(ఏ) కూడా వర్తించదని సెపె్టంబర్ 22న వెలువరించిన తీర్పులో జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. -
అడ్డంగా దొరికిన ‘రింగ్’ మాస్టర్
సాక్షి, అమరావతి: కట్టని రాజధాని.. నిర్మించని ఇన్నర్ రింగ్ రోడ్.. కావేవీ భూ దోపిడీకి అనర్హం అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు చెలరేగిపోయారు. రాజధాని అమరావతి ముసుగులో యథేచ్ఛగా భూ దందా సాగించారు. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం తనకే సాధ్యమని నిరూపించారు. గత ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి పాల్పడ్డ అవినీతి విస్మయ పరుస్తోంది. అందుకోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌కు కూడా వాటా ఇవ్వడం కొసమెరుపు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పూర్తి ఆధారాలతో సహా వెలికి తీసి కేసు నమోదు చేసింది. అలైన్మెంట్ బాబుది.. ముద్ర కన్సల్టెన్సీది అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్మెంట్ రూపొందించారు. ఆ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. దాంతో తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, నారాయణ.. సీఆర్డీయే అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్‌లో పొందు పరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అంటే అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ‘హెరిటేజ్ ఫుడ్స్’కు భూములు ► ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు పొందారు. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని ఉన్న కంతేరు గ్రామంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందారు. ► 2014 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. అంతే కాకుండా లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకునే లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. ► క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసి పూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ చెప్పారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. ► తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ ప్రో కో కింద ఇచ్చారన్నది స్పష్టమైంది. రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లు ఎత్తుగడల వల్ల చంద్రబాబు, లింగమనేని రమేశ్ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. పవన్ కల్యాణ్‌కూ 2.40 ఎకరాల ప్యాకేజీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి పాపంలో పడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. కృష్ణా నదికి ఇవతలా అవినీతి మెలికలే ► సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. అక్కడి నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగుతుంది. అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. ► దీంతో ఈ అలైన్‌మెంట్‌పై నారాయణ సీఆర్డీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఐఆర్ఆర్ కేసులో నిందితులు ఏ–1: చంద్రబాబు ఏ–2: నారాయణ ఏ–3: లింగమనేని రమేశ్ ఏ–4: లింగమనేని వెంకట సూర్య రాజవేఖర్ ఏ–5: కేపీవీ అంజని కుమార్ (రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్) ఏ–6: హెరిటేజ్ ఫుడ్స్ ఏ–7: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ ఏ–14: లోకేశ్ బాబు, నారాయణ ఆస్తుల అటాచ్మెంట్ క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్‌లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. -
3 కేసుల్లో నేడు సీఐడీ ఎదుట బాబు హాజరు
సాక్షి, అమరావతి: మూడు కేసుల్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ఆ కేసుల దర్యాప్తు అధికారుల వద్దకు వచ్చి పూచీకత్తులు సమర్పించనున్నారు. బాబు హాయాంలో జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), ఇసుక, మద్యం అక్రమాలపై కేసులు నమోదు చేయగా.. ఈ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పూచీకత్తులను దర్యాప్తు అధికారులకు ఆయన సమర్పించాల్సి ఉంది. ఉ. 11 గంటల తర్వాత మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయానికి, ఇసుక కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయానికి మధ్యాహ్నం 3.30 గంటలకు, ఐఆర్ఆర్ కేసులో సాయంత్రం 4.20 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వెళ్లి పూచీకత్తులు సమర్పించనున్నారు. -
పని నుంచి బడికి..
రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకువస్తోంది. సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన చెందిన నాని.. ఏడో తరగతి తర్వాత చదువు మానేశాడు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఓ బైక్ మెకానిక్ షాపులో పనికి చేరాడు. రెండేళ్ల పాటు ఆ షాపులోనే సహాయకుడిగా పనిచేశాడు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలకు ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ పేరిట అవగాహన కార్యక్రమాలను చేపడుతున్న సీఐడీ అధికారులు.. నానిని చూశారు. అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చదువు ఆవశ్యకతను వివరించారు. పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వారికి అవగాహన కల్పించారు. నానిని అదే బడిలో 8వ తరగతిలో చేర్చించారు. ప్రస్తుతం నాని తోటి పిల్లలతో కలిసి చక్కగా చదువుకుంటున్నాడు. ఇక తాను పనికి వెళ్లనని, బాగా చదువుకుని ఉద్యోగం చేస్తానని ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు. బాల కార్మికుల నుంచి మళ్లీ విద్యార్థులుగా.. సామాజికబాధ్యత కింద బాల కార్మిక వ్యవస్థ నిర్మూల కోసం సీఐడీ చేపట్టిన ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ సాధించిన విజయమిది. ఇలా ఒక్క నాని మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. బాల కార్మికులుగా కష్టాల కడలిలో ఈదుతున్న వారిని సీఐడీ అధికారులు గుర్తించి సురక్షితంగా చదువుల తల్లి ఒడిలోకి చేర్చారు. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకొస్తోంది. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమాన్ని సీఐడీ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం 26 జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సీఐడీ అధికారులతో పాటు మహిళా–శిశు సంక్షేమ శాఖ, బాలల సంక్షేమ కమిటీలు, వివిధ సామాజిక సేవా సంస్థల ప్రతినిధులతో జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది. ఈ ఏడాది మొత్తం నాలుగు దశల్లో 66 రోజుల పాటు ఆపరేషన్ స్వేచ్ఛ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి బాల కార్మికులను గుర్తించింది. ప్రధానంగా బాల కార్మికులను ఎక్కువుగా పనిలో పెట్టుకునే ఇటుక బట్టీల తయారీ, హోటళ్లు, వివిధ పారిశ్రామిక యూనిట్లు, కిరాణా దుకాణాలు, మెకానిక్ షెడ్లు, ఇతర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా మొత్తం 1,506 మంది బాల కార్మికులను గుర్తించింది. వారిలో బాలురు 1,299 మంది ఉండగా.. బాలికలు 207 మంది ఉన్నారు. మొత్తం బాల కార్మికుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 609 మందిని వారి సొంత రాష్ట్రాలకు పంపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. మన రాష్ట్రానికి చెందిన 897 మంది బాల కార్మికుల తల్లిదండ్రులతో చర్చించి వారికి అవగాహన కల్పించి.. ఆ పిల్లలను మళ్లీ బడుల్లో చేర్పించింది. బాల కార్మికులుగా మారడానికి కారణాలు తల్లిదండ్రులు లేకపోవడం:36 మంది పరీక్షల్లో ఫెయిల్ కావడం29 మంది పేదరికం: 984 మంది ఇతర కారణాలు:457 మంది మళ్లీ బడిలో చేరిన బాల కార్మికులు సామాజికవర్గాలవారీగా.. ఎస్సీ259 మంది ఎస్టీ131 మంది బీసీ719 మంది మైనార్టీ190 మంది ఓసీ 207 మంది మళ్లీ బడిలో చేర్పించే నాటికి బాల కార్మికులుగా పనిచేస్తున్నవారు.. ఇటుక బట్టీల్లో 138 మంది హోటళ్లలో 117 మంది పారిశ్రామిక యూనిట్లలో 143 మంది ఇతర చోట్ల 1108 మంది బాల కార్మికులుగా చేరేనాటికి వారి చదువులు ఇలా.. నిరక్ష్యరాస్యులు264 మంది అయిదో తరగతిలోపు 270 మంది అయిదు నుంచి పదో తరగతి 792 మంది చెప్పలేనివారు 180 మంది సామాజిక, ఆర్థిక దృక్కోణంలో విశ్లేషణ.. బాల కార్మికులను గుర్తించి కేవలం మళ్లీ బడుల్లో చేర్చడమే కాదు.. ఈ సమస్య మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా సీఐడీ కార్యాచరణ చేపట్టింది. అందుకోసం బాల కార్మికుల సామాజిక, ఆర్థిక అంశాలపైనా విస్తృతంగా అధ్యయనం చేస్తోంది. తద్వారా బాల కార్మిక వ్యవస్థను సమూలంగా పెకలించి వేసి బడి ఈడు పిల్లలు అందరూ కచ్చితంగా బడుల్లోనే ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించిన బాలల వివరాలిలా ఉన్నాయి.. సమన్వయంతో సత్ఫలితాలు బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడానికి అన్ని విద్య, మహిళా–శిశు సంక్షేమ, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపట్టాం. ఇతర రాష్ట్రాలకు చెందినవారిని ఆయా రాష్ట్రాలకు సురక్షితంగా చేరుస్తున్నాం. మన రాష్ట్రానికి చెందిన బాల కార్మికుల అవగాహనను పరీక్షించి తదనుగుణంగా తగిన తరగతిలో చేర్పిస్తున్నాం. మళ్లీ వారు పనిలోకి వెళ్లకుండా.. శ్రద్ధగా చదువుకునే వ్యవస్థను కల్పిస్తున్నాం. – కేజీవీ సరిత, ఎస్పీ, మహిళా భద్రత విభాగం, సీఐడీ సామాజిక బాధ్యతకు పెద్దపీట వేస్తున్న సీఐడీ సీఐడీ విభాగం అంటే కేవలం కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ మాత్రమే కాదు. సీఐడీకి అంతకుమించి విస్తృత పరిధి ఉంది. అందులో ప్రధానమైనది సామాజిక బాధ్యత. అందుకే బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. సీఐడీలో ప్రత్యేకంగా సామాజిక విభాగం కింద ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతాం. – సంజయ్, సీఐడీ అదనపు డీజీ -
10న సీఐడీ ముందుకు నారా లోకేశ్..
సాక్షి, అమరావతి: రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో ఈనెల 10వ తేదీన సీఐడీ అధికారుల ఎదుట విచారణకు స్వయంగా హాజరు కావాలని మాజీ మంత్రి నారా లోకేశ్‌ను హైకోర్టు ఆదేశించింది. సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ కింద నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరు కావాలని లోకేశ్‌కు స్పష్టం చేసింది. ఇదే కేసులో బెయిల్ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ తనకు జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని, లేదంటే ఇంటివద్దే తనను విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ జరిపే అవకాశం ఉంది. కనిపించేంత దూరంలో న్యాయవాది ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో నారా లోకేశ్‌ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించవచ్చని, మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇవ్వాలని హైకోర్టు సూచించింది. విచారణ సమయంలో లోకేశ్ కనిపించేంత దూరం వరకు మాత్రమే న్యాయవాదిని అనుమతించాలని నిర్దేశించింది. విచారణకు వచ్చేటప్పుడు నిర్దిష్ట డాక్యుమెంట్లు తీసుకురావాలని లోకేష్‌ను ఒత్తిడి చేయబోమని సీఐడీ చెప్పిన విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, దీన్ని అడ్డం పెట్టుకుని సాగించిన భూ దోపిడీ కేసులో నారా లోకేష్‌ను 14 నిందితుడిగా సీఐడీ చేర్చింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 4న తమ ముందు హాజరు కావాలంటూ ఇటీవల సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. విచారణకు వచ్చే సమయంలో హెరిటేజ్ భూముల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను తేవాలని పేర్కొంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్ మంగళవారం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ తరఫున టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ హెరిటేజ్‌లో లోకేష్ ఓ వాటాదారు మాత్రమేనన్నారు. హెరిటేజ్‌కు సంబంధించిన కీలక విషయాలు ఆయనకు తెలిసే అవకాశం లేదన్నారు. ఆ డాక్యుమెంట్లను ఇవ్వలేదన్న కారణంతో లోకేష్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఐడీ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.దుష్యంత్‌రెడ్డి, స్పెషల్ పీపీ శివ కల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ నిర్దిష్టంగా ఫలానా డాక్యుమెంట్లు తేవాలని ఒత్తిడి చేయబోమన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇతర నిందితులతో కలిపి లోకేశ్‌ను కూడా విచారించాల్సి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 10న సీఐడీ ముందు హాజరు కావాలని లోకేశ్‌ను ఆదేశిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రింగ్ రోడ్డు కేసులో బాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, తదనుగుణంగా సాగిన భూ దోపిడీపై సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వివరాలన్నీ ఆయా ఫైళ్లలో భద్రంగా ఉన్నాయన్నారు. అందువల్ల సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ప్రశ్నే తలెత్తదన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమే జరగనప్పుడు అవకతవకలకు ఆస్కారం ఎక్కడ ఉందన్నారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ చంద్రబాబు మరో కేసులో అరెస్టై జుడీషయల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఈ కేసులో కూడా ఆయన అరెస్టయినట్లు (డీమ్డ్) భావించాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదన సరికాదన్నారు. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసే ముందు సరెంట్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ పని చేయకుండా డీమ్డ్ అరెస్ట్ పేరుతో నేరుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యాజ్యానికి అసలు విచారణార్హతే లేదన్నారు. చంద్రబాబు పిటిషన్‌ను కొట్టి వేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 41 ఏ నోటీసును రద్దు చేయండి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ తనకు జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో నిందితుడైన మాజీ మంత్రి పొంగూరు నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ తన వాంగ్మూలాలను నమోదు చేయడం తప్పనిసరి అని దర్యాప్తు అధికారి భావిస్తే తన ఇంటి వద్దనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు. విచారణ సమయంలో న్యాయవాదిని సైతం అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, పలు మేజర్ సర్జరీలు కూడా జరిగాయని పిటిషన్లో నారాయణ పేర్కొన్నారు. డాక్టర్లు తనను ఇంటి వద్దే ఉండాలని సలహా ఇచ్చారన్నారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది. -
లోకేష్ కోసం సీఐడీ వెతుకులాట..
-
చంద్రబాబు పిటిషన్లో కౌంటర్ వేయండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వరకు విచారణ చేపట్టవద్దని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ వాదన వినకుండా ఈ కేసులో ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదని న్యాయ మూర్తి స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబు నాయుడు జ్యుడీషి యల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మంగళవారం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసు ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు రిమాండ్ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం కొట్టేయాలని తన పిటిషన్లో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. మీరు ఈ వ్యాజ్యంపై విచారించేందుకు అభ్యంతరం లేదు విచారణ ప్రారంభం కాగానే వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా సిద్ధమవుతుండగా, న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. వాదనలు వినిపించే ముందు తాను ఓ విషయం చెప్పదలచుకున్నానని తెలిపారు. తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా ఉన్న సమయంలో కొన్ని కేసుల్లో పిటిషనర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా హాజరయ్యానని, దీనిపై మీకు అభ్యంతరం ఉంటే విచారణ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. దీనిపై లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ, తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ గట్టిగా చెప్పారు. ఈ వ్యాజ్యాన్ని మీరే వినాలని కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను కొనసాగించారు. లూథ్రా వాదనలు మొదలు పెడుతుండగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, ఇందుకు తమకు కొంత గడువు కావాలని కోర్టుకు స్పష్టం చేశారు. కౌంటర్ దాఖలుకు ఆదేశాలిస్తానని చంద్రబాబు న్యాయవాదులను ఉద్దేశించి న్యాయమూర్తి చెప్పగా, తాము వాదనలు వినిపిస్తామని వారు తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు రిమాండ్ చెల్లదు.. సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు అరెస్ట్ అక్రమమన్నారు. అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 17ఏ ప్రకారం పబ్లిక్ సర్వెంట్‌ను విచారించాలన్నా, కేసు నమోదు చేయాలన్నా అందుకు గవర్నర్ నుంచి అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ఈ కేసులో అలాంటి అనుమతి ఏదీ తీసుకోలేదన్నారు. ఇది చట్ట విరుద్ధమని తెలిపారు. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. సెక్షన్ 17ఏను ఏసీబీ ప్రత్యేక కోర్టు సరైన కోణంలో అర్థం చేసుకోలేదన్నారు. 2018 జూలై తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2018 తర్వాత నమోదైన కేసులకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన కేసు, అరెస్ట్, రిమాండ్ ఇవన్నీ కూడా చెల్లవన్నారు. అదువల్ల చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరారు. నిబంధనల ప్రకారమే కస్టడీ పిటిషన్ వేశాం ఈ సమయంలో అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, లూథ్రా పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తున్నారని, తాము కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు వినిపించుకోవచ్చన్నారు. సెక్షన్ 17ఏ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవా లని లూథ్రా కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అవతలి పక్షానికి సైతం అవకాశం ఇద్దామని తెలిపారు. కౌంటర్ల దాఖలకు ఎంత సమయం కావాలని ప్రశ్నిస్తూ.. తొలుత శుక్రవారం కల్లా కౌంటర్ దాఖ లు చేయాలని అదనపు ఏజీకి చెప్పారు. అంత తక్కువ సమయం సరిపోదని అదనపు ఏజీ తెలిపారు. నిబంధనల ప్రకారం రిమాండ్ విధించిన మొదటి 14 రోజుల లోపు పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగానే ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. అయితే విచారణను సోమవారానికి వాయిదా వేస్తానని, అప్పటి లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సోమవారం వినాయక చవితి సెలవు అని సుధాకర్‌రెడ్డి చెప్పడంతో అలా అయితే మంగళవారం విచారణ చేపడతానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
దారి మళ్లించేందుకే అవాస్తవాలు ప్రచారం
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో పూర్తి ఆధారాలతోనే కేసు నమోదు చేసి మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసు దర్యాప్తు ప్రక్రియలో అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ వాంగ్మూలం కేవలం ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేశాయి.అన్ని కోణాల్లో పరిశోదించి పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు వెల్లడించాయి. తన వాంగ్మూలంతోనే చంద్రబాబును సిట్ అరెస్టు చేశారని చెప్పడం హాస్యాస్పదమని, పూర్తిగా ఫైళ్లు చూడకుండా ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తారని, తాను అప్రూవర్‌గా మారలేదని పీవీ రమేశ్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను సీఐడీ వర్గాలు ఖండించాయి. సిట్ విచారణను ప్రభావితం చేసే ఉద్దేశంతో ఆయన అవాస్తవాలను ప్రచారంలోకి తెస్తున్నారని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా డిజైన్ టెక్ కంపెనీకి ప్రభుత్వ నిధులు మంజూరు చేయడాన్ని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత అభ్యంతరం తెలిపారని సిట్ వర్గాలు వెల్లడించాయి.ఆమె అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ చంద్రబాబు ఆదేశాలతో నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంటూ పీవీ రమేశ్ డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారని సిట్ తెలిపింది. అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ.371 కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు దర్యాప్తులో ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యిందని పేర్కొంది.దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో పీవీ రమేశ్ ఉద్దేశపూర్వకంగానే మీడియా ద్వారా అవాస్తవాలను ప్రచారంలోకి తెస్తున్నారని సిట్ స్పష్టం చేసింది. ప్రజల్ని అయోమయానికి గురి చేయడంతోపాటు దర్యాప్తును తప్పుదారి పట్టించాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. పీవీ రమేశ్ చెబుతున్నట్లుగా హాస్యాస్పదంగానో పేలవంగానో ఈ కేసును దర్యాప్తు చేయడం లేదని సిట్ పేర్కొంది. పక్కా ఆధారాలతో నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నందునే చంద్రబాబు అరెస్ట్‌ను న్యాయస్థానం సమర్థించి ఆయనకు రిమాండ్ కూడా విధించిందని సీఐడీ వర్గాలు తెలిపాయి. -
స్కిల్ స్కామ్: సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టును సీఐడీ.. కోర్టుకు సమర్పించింది. స్కిల్ స్కాంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని సీఐడీ పేర్కొంది. బాబుపై నేరపూరిత కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం, మోసం అభియోగాలు ఉన్నాయి. నిన్న ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశాం. స్కిల్ స్కాంలో రూ.550 కోట్ల కుంభకోణం జరిగింది. ప్రభుత్వ సొమ్మును షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్ ద్వారా దారి మళ్లించారని సీఐడీ తెలిపింది. ‘‘స్కిల్ స్కామ్‌లో ప్రభుత్వానికి రూ.300 కోట్లు నష్టం జరిగింది. ఒప్పందం ఉల్లంఘిస్తూ రూ.371 కోట్ల అడ్వాన్సులు చెల్లింపు. ప్రభుత్వ నిధుల్లో భారీ మొత్తం షెల్ కంపెనీలకు తరలించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ప్రభుత్వం నిధులు షెల్ కంపెనీలకు మళ్లించారు. కీలక డాక్యుమెంట్ల మాయం వెనుక చంద్రబాబు హస్తం ఉంది మరింత విచారణకు చంద్రబాబును కస్టడీకి తీసుకోవాల్సి ఉంది. అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలతో చంద్రబాబే సూత్రధారి అని తేలింది.’’ అని సీఐడీ పేర్కొంది. రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరును కూడా సీఐడీ ప్రస్తావించింది. కిలారి రాజేశ్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని పేర్కొంది. ‘‘స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వివరాలను అచ్చెన్నాయుడికి సమర్పించారు. ప్రాజెక్ట్‌లో లోటు పాట్లు తప్పిదాలు ఉన్నప్పటికీ చంద్రబాబు, అచ్చెన్నాయుడు కలిసి ఓకే చేశారు. స్కిల్ ప్రాజెక్టులో సిమెన్స్ కంపెనీ రూ.3281 కోట్లు గ్రాంట్‌గా ఇస్తుందని బాబు, అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పారు. చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందాయి స్కిల్ స్కాంకు సంబంధించిన ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. స్కిల్ స్కాంలో ఈడీ విచారణ కీలక దశలో ఉంది. కేసులో మనోజ్ వాసుదేవ్‌కు సెప్టెంబర్ 5న నోటీసులు ఇచ్చాం. మా నోటీసులకు జవాబు ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారు. వీళ్లను చంద్రబాబే కాపాడుతున్నారని మా అనుమానం’’ అని సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది. చదవండి: ఎన్నెన్ని పాపాల్... ఎన్నెన్ని శాపాల్! -
ఇదో కార్పొరేట్ ఫ్రాడ్.. మార్గదర్శి మోసాలపై ఏపీ సీఐడీ కీలక ప్రెస్‌మీట్
సాక్షి, అమరావతి: మార్గదర్శి వ్యవహారంలో అనేక అక్రమాలు గుర్తించామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని పేర్కొన్నారు. మార్గదర్శిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, సీఐడీ విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు. ‘‘మార్గదర్శిపై నమోదైన ఏడు క్రిమినల్ కేసులపై విచారణ చేస్తున్నాం. ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్ చేస్తూ హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆర్డర్స్ నంబర్ 104,116ల ద్వారా మొత్తంగా 1035 కోట్ల చరాస్తులు అటాచ్ చేశాం. కోర్డులోనూ అటాచ్ మెంట్ పిటీషన్ దాఖలు చేశాం. రెండు క్రిమినల్ కేసులలో 15 మందిపై చార్జిషీట్ వేశాం. ఈ రెండు కేసుల్లో ఏ1 రామోజీ రావు, ఏ2 శైలజాకిరణ్ తదితరులపై చార్జి షీట్ నమోదైంది’’ అని సీఐడీ ఎస్పీ పేర్కొన్నారు. చదవండి: మొసలికన్నీరు సంగతి సరే.. మరి ఈనాడుకు ఆ దమ్ముందా? ‘‘మోసం, డిపాజిట్లు మళ్లించడంపై చిట్ ఫండ్ యాక్ట్‌గా కేసులు నమోదు చేశాం. మిగిలిన ఐదు కేసులలో విచారణ చివరి దశకి వచ్చింది. త్వరలోనే ఆ కేసుల్లోనూ ఛార్జి షీట్ నమోదు చేస్తాం. మార్గదర్శి చిట్‌ఫండ్ డిపాజిట్ దారులను మోసం చేసి నిధులు మళ్లించారు. డిపాజిట్ దారులు సంతకాలు పెట్టే ముందే పూర్తిగా కాగితాలు చదవాలి. డిపాజిట్ దారులు మోసపోకుండా మీడియా కూడా అవగాహన కలిగించాలి. ఇది కార్పొరేట్ ఫ్రాడ్’’ అని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. -
ఖాతాదారుల హక్కుల పరిరక్షణకే.. ‘మార్గదర్శి’పై దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్ : మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఖాతాదారుల హక్కుల పరిరక్షణ, ఆర్థిక భద్రత కోసమే ఆ సంస్థలో అక్రమాలను వెలుగులోకి తెస్తున్నామని, అది తమ బాధ్యత అని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ స్పష్టం చేశారు. మార్గదర్శి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లిస్తుండటంతో ఖాతాదారులకు నష్టం కలగకుండా ఇప్పటికే రూ.1,035 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచ్‌వల్ ఫండ్స్ పెట్టుబడులను అటాచ్ చేసినట్టు తెలిపారు. మార్గదర్శి కంపెనీ ఏ కారణంగానైనా మూతపడితే ఖాతాదారులకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీపై ఉంటుందని తెలిపారు. మార్గదర్శి సంస్థ ప్రతి చట్టాన్ని, నిబంధనను అతిక్రమించిందని, ఇంకా అతిక్రమిస్తూనే ఉందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 9 బ్రాంచ్‌లలో 23 గ్రూప్ చిట్స్‌ను, వాటికి సంబంధించి రూ. 604 కోట్ల టర్నోవర్ నిలిపివేసినట్టు చెప్పారు. ఇదే తరహాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని ఇతర బ్రాంచ్‌ల్లోనూ అక్రమాలపై ఆధారాలు లభిస్తే.. వాటిలోని చిట్ గ్రూప్‌ల టర్నోవర్ నిలిచిపోతుందని చెప్పారు. చివరకు మార్గదర్శి పడిపోతుందన్నారు. సంజయ్ మంగళవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మూడేళ్ల లావాదేవీలను పూర్తిగా పరిశీలించి, అక్రమాలపై ఆధారాలు సేకరించామన్నారు. ఏపీతోపా టు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 108 బ్రాంచ్‌లలో కార్యకలాపాలపై ఆరా తీస్తున్న ట్టు తెలిపారు. ఢిల్లీలోని కేంద్ర ఏజెన్సీలకు కూడా ఈ అక్రమాల సమాచారమిచ్చామని, తెలంగాణ, ఇతర రాష్ట్రాల డీజీపీలకు సమాచారం ఇస్తున్నామన్నారు. ఏపీలో పలు ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ శాఖ ఫిర్యాదు మేరకే ఏపీ సీఐడీ కేసు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. పూర్తి నిబంధనలు పాటిస్తూనే ఈ కేసులో ఏ–1 రామోజీరావును, ఏ–2 శైలజాకిరణ్‌ను ప్రశ్నించామన్నారు. వడ్డీ ఆశ చూపి ఖాతాదారులను మభ్యపెడుతున్నారు మార్గదర్శి అక్రమాలపై ఖాతాదారుల నుంచి ఫి ర్యాదు లేకుండానే కేసు దర్యాప్తు చేస్తున్నారంటూ ఒక సెక్షన్ మీడియా ఆరోపణలు చేస్తోందని, ఖాతాదారులకు వడ్డీని ఆశజూపి ఆ సంస్థ నిబంధన లకు విరుద్ధంగా నిధులను మళ్లిస్తుండటాన్ని తాము వెలుగులోకి తెస్తున్నామన్నారు. ప్రజలు మోసపో యి ఫిర్యాదు చేసేకంటే ముందే తాము వారి సొమ్ము కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఏ బాధితుడి విషయంలో అయినా ఇదే పద్ధతి అని తెలిపారు. చాక్లెట్ ఇచ్చి బాలికను కిడ్నాప్ చేస్తే.. సమాచారం అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు కానీ, బాధితురాలు ఫిర్యాదు ఇచ్చేవరకు కూర్చోరని.. అదే తరహాలో లక్షల మంది ఖాతాదారుల సొమ్మును కాపాడేందుకు మార్గదర్శిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ అధికారులుగా ప్రజలకు న్యాయం చేస్తుంటే మార్గదర్శిపై కక్షసాధింపు అంటూ ఆ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. తమ దర్యాప్తు చట్టానికి లోబడి ఉన్నట్టే.. చిట్‌ఫండ్స్ కంపెనీ నిర్వహణలో రామోజీ సైతం చట్టానికి లోబడి ఉండాలన్నారు. నిబంధనలున్నా.. వారికి అనుకూలంగా వాడారు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ లావాదేవీలు చిట్‌ఫండ్ యాక్ట్ ప్రకారం కాకుండా రామోజీ, శైలజా కిరణ్ వారికి అనుకూలంగా కంపెనీ యాక్ట్ ప్రకారం చూపు తున్నారని దర్యాప్తులో తేలిందన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. తమకు ఆ నిబంధనలు వర్తించవన్న తరహాలో సమాధానాలిచ్చారన్నారు. ఖాతాదారుల నుంచి సొమ్ము వసూలుకు చిట్‌ఫండ్స్ చట్టాన్నే వాడుకొంటున్నారని చెప్పారు. ఇదే తరహాలో చీరాలలో రూ. 65 లక్షల డిఫాల్ట్ కేసులో ష్యూరిటీగా ఉన్న వ్యక్తి నుంచి రూ.6 కోట్లు విలువైన ఆస్తిని అటాచ్ చేయించా రని తెలిపారు. ఇలాంటి ఎన్నో అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయన్నారు. సంస్థలోని అంతర్గత లుకలుకలు బయటపడతాయనే చిట్‌ఫండ్స్ యాక్ట్ ను అమలు చేయడంలేదన్నారు. చిట్ సెటిల్మెంట్లోనూ నిబంధనలు పాటించడంలేదన్నారు. చిట్ ముగిసిన వారి వివరాలతో, కొన్నింటిలో మానేసిన ఖాతాదారుల పేర్లు వాడి మళ్లీ చిట్లు నడుపుతున్నారని తెలిపారు. చిట్ డబ్బు బ్రాంచ్‌లో లేకపోవడంపై ప్రశ్నిస్తే.. మీరెవరు ప్రశ్నించేందుకు అన్న రీతిలో సమాధానాలు ఇస్తున్నారన్నారు. చట్టానికి వారు సహకరించడం లేదని చెప్పారు. చిట్‌ఫండ్స్ చట్టం అమలు కాకుండా ఏకంగా 26 ఏళ్లు అడ్డుకున్నారు మర్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థను చిట్‌ఫండ్ యాక్ట్ 1982 మేరకు నడపడంలేదని అన్నారు. చిట్‌ఫండ్స్ సొమ్ముతో వేరే వ్యాపారం చేయకూడదన్నారు. చిట్‌ఫండ్ యాక్ట్ ప్రకారమే బ్యాలెన్స్ షీట్లు ఫైల్ చేయాల్సి ఉన్నా.. కంపెనీ యాక్ట్స్ ప్రకారం నడుచుకుంటున్నామని ఈ కేసులో ఏ–2 శైలజాకిరణ్ అవివేకంతో కూడిన సమాధానాలు చెప్పారని తెలిపారు. ఒక గ్రూప్ డబ్బు మరో గ్రూప్‌కు వాడొద్దని చట్టం చెబుతున్నా.. మార్గదర్శి బ్రాంచ్లన్నింటిలోని డబ్బు అక్రమంగా హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నట్టు అన్ని ఆధారాలు లభించాయని చెప్పారు. చిట్‌ఫండ్ యాక్ట్ రావడానికి ముందే మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ప్రారంభమైందన్న వింత వాదన తెస్తున్నారన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 1982లో చిట్‌ఫండ్ యాక్ట్ పాస్ చేస్తే.. దానిని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో పాస్ చేయాల్సి ఉందన్నారు. కానీ 26 ఏళ్ల తర్వాత 2008లో అమలు చేశారని, ఇన్నేళ్లూ రామోజీరావు పలుకుబడితో అడ్డుకున్నారని వివరించారు. చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్ వల్ల బీసీసీఐకే నష్టం.. ఏపీలో అద్భుత సౌకర్యాలు' -
రామోజీ ఇంటి వద్దకు సీఐడి అధికారులు వస్తే గేటు తీయకుండా ఓవర్ యాక్షన్!
-
రాజమహేంద్రవరంలో మరో మార్గదర్శి
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి తరహాలో మరో భారీ మోసం వెలుగుచూసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జగజ్జనని చిట్స్ పేరుతో టీడీపీ నేతలు ఆర్థిక నేరానికి పాల్పడిన విషయం బట్టబయలైంది. 1982 చిట్‌ఫండ్స్ చట్టం నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టానుసారం డిపాజిట్లు సేకరించి, వాటిని ఇతర వ్యాపారాలకు, వడ్డీలకు మళ్లించి అక్రమాలకు తెరతీసిన విషయం సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ చిట్‌ఫండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు–ఏ1, డైరెక్టర్‌గా ఉన్న ఆయన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్–ఏ2 (రాజమహేంద్రవరం సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త)లను సీఐడీ అధికారులు రాజమహేంద్రవరంలో ఆదివారం అరెస్టుచేశారు. వీరితోపాటు మరో డైరెక్టర్ అయిన ఆదిరెడ్డి అప్పారావు కుమార్తె ఆదిరెడ్డి వెంకట జ్యోత్స్నలపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 120బి, 477 (ఎ) రెడ్‌విత్ 34, రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్–5, కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జగజ్జనని చిట్‌ఫండ్స్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు సీఐడీ విభాగానికి కొన్నినెలల క్రితమే ఫిర్యాదులొచ్చాయి. అక్రమాలు వాస్తవమేనని నిర్ధారణ కావడంతో చిట్ రిజిస్ట్రార్ ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. దాంతో సీఐడీ అధికారులు ఈ ఏడాది మార్చిలో జగజ్జనని చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భారీగా ఆర్థిక అక్రమాలు వెలుగుచూశాయి. వీటిపై సంస్థ బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్) సరైన వివరణ కూడా ఇవ్వలేకపోవడంతో సీఐడీ అధికారులు కేసును లోతుగా విచారించి అవకతవకలను నిర్ధారించారు. యథేచ్చగా ఆర్థిక అక్రమాలు.. జగజ్జనని చిట్ ఫండ్స్ కంపెనీ కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సీఐడీ తనిఖీల్లో బట్టబయలైంది. ఆ కంపెనీ ఎండీ, డైరెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మళ్లించి సొంత ఆస్తులు భారీగా కూడబెట్టుకున్నట్లుగా ఆధారాలను గుర్తించారు. సీఐడీ అధికారులు గుర్తించిన కొన్ని అంశాలివీ.. ► చిట్‌ఫండ్స్ కంపెనీలు ఇతర వ్యాపారాలు చేయడం చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధం. కానీ, జగజ్జనని సంస్థ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ, అక్రమంగా రుణాలు మంజూరు చేస్తూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తోంది. 2018 నుంచి 2023 వరకు భారీగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు.. వాటిపై వడ్డీలు చెల్లించినట్లు గణాంకాలతో సహా వెల్లడైంది. అదే రీతిలో చందాదారుల సొమ్ముతో భారీగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. తద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించినట్లు వెల్లడైంది. ► చిట్టీల నిర్వహణలో జగజ్జనని చిట్‌ఫండ్స్ అక్రమాలకు పాల్పడుతోంది. ప్రతి చిట్టీలోనూ యాజమాన్య వాటా టికెట్లతోపాటు మరికొన్ని టికెట్లను కూడా కంపెనీ తమ పేరిట ఉంచుతోంది. కానీ, ఆ టికెట్లపై ప్రతినెలా చెల్లించాల్సిన చందాను చెల్లించడంలేదు. ఇతర చందాదారులు పాడిన చిట్టీ పాటల ద్వారా వచ్చే డివిడెండ్‌ను తమ ఖాతాలో జమ చేసుకుంటోంది. ఇక ఆ టికెట్ల చిట్టీ పాటల ప్రైజ్‌మనీని కూడా జమచేసుకుంటోంది. ఒక చిట్టీ గ్రూప్‌లోని చందా సొమ్మును మరో చిట్టీ గ్రూప్‌లో బుక్ అడ్జస్ట్మెంట్ల ద్వారా కనికట్టు చేస్తోంది. అంటే ఒక్క రూపాయి కూడా చందా చెల్లించకుండా అక్రమంగా ఆర్థిక ప్రయోజనం పొందుతోంది. ► చిట్టీ పాటల నిర్వహణలో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. 2022 మే నుంచి ఆగస్టు వరకు సంస్థ నిర్వహించిన చిట్టీ పాటల వేలం రికార్డులను పరిశీలించగా ఈ వ్యవహారం వెలుగుచూసింది. చిట్టీ పాట పాడిన వారికి ఇచ్చే మొత్తాన్ని (ప్రైజ్‌మనీ) వాస్తవానికి చిట్టీ పాట నిర్వహించిన తేదీ కంటే ముందే చెల్లించినట్లు బ్యాంకు రికార్డులు వెల్లడించాయి. అంటే చిట్టీ పాటల నిర్వహణ కంటే ముందే ఆ మొత్తాన్ని కొందరికి చెల్లిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. జగజ్జనని చిట్‌ఫండ్స్ నిర్వహిస్తున్న చిట్టీ పాటలు పూర్తిగా బోగస్ అని నిరూపితమైంది. ► ప్రతినెలా 41 చిట్ గ్రూపులను నిర్వహిస్తూ రూ.7,61,50,000 వార్షిక టర్నోవర్‌తో వ్యాపారం చేస్తున్నట్లుగా రికార్డుల్లో సంస్థ చూపిస్తోంది. కానీ, ఆ సంస్థ కాకినాడలోని అసిస్టెంట్ చిట్స్ రిజిస్ట్రార్‌కు సమర్పించిన చిట్ వేలం రికార్డులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆ సంస్థ ప్రతినెలా క్రమం తప్పకుండా చిట్ వేలాన్ని నిర్వహించడంలేదన్నది వెల్లడైంది. 2022, జనవరి నుంచి 2023 జనవరి వరకు రికార్డులను పరిశీలిస్తే ఒక్కనెల తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ తక్కువ చిట్ వేలమే నిర్వహించింది. ► ఈ కంపెనీ టర్నోవర్‌కు బ్యాంకులో జమచేస్తున్న చందా మొత్తాలు భిన్నంగా ఉన్నాయి. ప్రతినెలా రూ.7.61 కోట్ల టర్నోవర్ అని కంపెనీ చెబుతోంది. అంటే.. డివిడెండ్ మొత్తం మినహాయించుకుంటే ప్రతినెలా రూ.5కోట్లు చొప్పున ఏడాదికి చందా మొత్తాలే రూ.60కోట్లు జమచేయాలి. కానీ, జమచేస్తున్న మొత్తం ఆ దరిదాపుల్లో కూడా లేదు. ► చిట్టీల వేలం సొమ్ము చెల్లింపు ముసుగులో జగజ్జనని చిట్‌ఫండ్స్ నల్లధనాన్ని చలామణిలోకి తెస్తోంది. 49 చిట్టీ పాటల ప్రైజ్‌మనీ మొత్తం రూ.11,76,82,000 చెల్లింపులను పరిశీలించారు. వాటిలో 21 చిట్టీ పాటల ప్రైజ్‌మనీ రూ.4,68,45,753ను బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మిగిలిన 28 చిట్టీల వేలం పాటల ప్రైజ్‌మనీ రూ.7,08,36,247ను నగదు రూపంలో చెల్లించినట్లు చెప్పారు. నగదు రూపంలో చెల్లించడం నిబంధనలకు విరుద్ధం. అంటే.. నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చినట్లు వెల్లడైంది. ► చిట్‌ఫండ్ కంపెనీ అన్ని వ్యవహారాలు నగదులోనే నిర్వహిస్తోంది. అంటే చందాల వసూళ్లు, చిట్ పాట మొత్తం చెల్లింపులన్నీ నగదులోనే నిర్వహిస్తోంది. ఇది ఆదాయపన్ను చట్టానికి విరుద్ధం. ► బ్యాంకు ఖాతాల్లో సంస్థ భారీగా నగదు డిపాజిట్లు కూడా చేస్తోంది. చిట్ వసూళ్లతో ఆ డిపాజిట్లు సరిపోలడంలేదు. ఎక్కువగా బ్యాంకు డిపాజిట్లు నగదు రూపంలోనే చేస్తున్నారు. ► చందా చెల్లించడంలేదని చెబుతున్న చిట్ల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా నిర్వహించడంలేదు. ► మరోవైపు.. జగజ్జనని చిట్‌ఫండ్స్ వేలానికి సంబంధించిన మినిట్స్ రికార్డులకు బ్యాంకు లావాదేవీలు భిన్నంగా ఉన్నాయి. మచ్చుక్కి 11 చిట్టీ పాటల మినిట్స్‌ను సీఐడీ అధికారులు పరిశీలించారు. అందులో పేర్కొన్న మొత్తం కంటే వాస్తవంగా బ్యాంకు ద్వారా చెల్లించిన మొత్తం తక్కువగా ఉంది. అంటే.. చందాదారులను ఆ చిట్‌ఫండ్స్ సంస్థ మోసం చేస్తోందని వెల్లడైంది. ► చిట్‌ఫండ్ చట్టంలో పేర్కొన్న రికార్డులను జగజ్జనని చిట్‌ఫండ్స్ నిర్వహించడంలేదు. అలాగే, చట్టంలో పేర్కొన్న వార్షిక బ్యాలన్స్ షీట్ పార్ట్–1, పార్ట్–2లనూ సమర్పించడంలేదు. సీఐడీ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే భవానీ అడ్డం తిరిగిన అప్పారావు.. తనను అరెస్టు చేసేందుకు వీల్లేదంటూ సీఐడీ అధికారులతో ఆదిరెడ్డి అప్పారావు వాదనకు దిగారు. జీఎస్టీ ఎగవేత విషయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చర్యలను నియంత్రిస్తూ గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపుతూ తనను అరెస్టుచేయడం అన్యాయమని వాదించారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఆయనకు సీఐడీ అధికారులు స్పష్టతనిచ్చి అరెస్టుచేశారు. సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ల అరెస్టు నేపథ్యంలో రాజమహేంద్రవరం సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. రాజమహేంద్రవరంలో జరగబోయే మహానాడును అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. అప్పారావు, శ్రీనివాస్‌ను అన్యాయంగా అరెస్టుచేశారని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. సీఐడీ కార్యాలయంలో భర్త, మామను ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పరామర్శించారు. అనుమతి లేకుండా ఆఫీసులు రాజమహేంద్రవరంలోని వీఎల్ పురం, తిలక్ రోడ్డులోని డోర్ నంబర్ 79/2–4/3 చిరునామాతో చిట్‌ఫండ్ కార్యాలయం నిర్వహించేందుకు జగజ్జనని చిట్‌ఫండ్స్ అనుమతి తీసుకుంది. కానీ, అనుమతి లేకుండా 86–26–13/1 తిలక్ రోడ్డు చిరునామాతో ఉన్న భవనంలో కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. దీనిపై చిట్ రిజిస్ట్రార్‌కు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. అలాగే, జగజ్జనని చిట్‌ఫండ్స్ రాజమహేంద్రవరంలో చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించేందుకు అనుమతి తీసుకుంది. అందుకు విరుద్ధంగా కాకినాడ జగన్నాథపురంలో అనధికారికంగా మరో బ్రాంచి కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. ఇది ఖాతాదారులను మోసం చేయడమే అవుతుంది. -
జూమ్‌లో.. కామ్‌గా ఆధారాలు ధ్వంసం!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెరుకూరి రామోజీరావు (ఏ–1) కీలక ఆధారాలను మాయం చేసేందుకు విఫలయత్నం చేసినట్లు బహిర్గతమైంది. మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయాల్లో కీలక ఆధారాలు, రికార్డులను గుట్టు చప్పుడు కాకుండా ధ్వంసం చేసినట్లు తాజాగా సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ తతంగాన్ని హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయం నుంచే పర్యవేక్షించారని, అందుకోసం ఫోర్మెన్లతో ప్రత్యేకంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తేలింది. ఏ ఒక్కటీ ఆధారం దొరకకుండా రికార్డులు డిలీట్ చేయాలని మార్గదర్శి చిట్స్ బ్రాంచీల సిబ్బందిని ఆదేశించిన యాజమాన్యం జూమ్ మీటింగ్‌లో అర్థరాత్రి దాకా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించినట్లు వెలుగు చూసింది. మరోవైపు గత డిసెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా తమ లావాదేవీలు దాదాపు స్తంభించిపోవడంతో గొలుసుకట్టు తరహా మోసాలకు అలవాటుపడిన మార్గదర్శి యాజమాన్యం కొత్త చిట్టీలు లేకపోవడంతో దిక్కులు చూస్తోంది. పాడుకున్న చిట్టీల మొత్తం కోసం చందాదారులు మార్గదర్శి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా.. రశీదు రూపంలో డిపాజిట్లు చేసిన వారిలో ఆందోళన నెలకొంది. తమ వివరాలు ఏమవుతాయోనన్న ఆందోళన ఖాతాదారుల్లో నెలకొంది. అడ్డదారిలో.. గుట్టుగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమ వ్యవహారాల కేసులో తిమ్మిని బమ్మిని చేసేందుకు రామోజీరావు బరి తెగించారు. నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు పెట్టినట్లు తేలడంతో కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు అడ్డదారులు పట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో కీలక ఆధారాలు, రికార్డులను ధ్వంసం చేయించారు. దర్యాప్తులో ఉన్న కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయకూడదన్న నిబంధనను అతిక్రమించారు. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు అక్రమంగా రూ.2,600 కోట్ల డిపాజిట్లు వసూలు చేసినట్లు 2006లో బయటపడింది. నాడు రిజర్వు బ్యాంకు ఆదేశాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో సీఐడీ విభాగం మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు నమోదు చేసింది. దీంతో డిపాజిట్లు వసూలు చేయడం తమ తప్పిదమేనని రామోజీరావు అంగీకరించారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఆయన హఠాత్తుగా మూసివేశారు. ఇప్పుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో కూడా అదే తరహాలో రికార్డులను నాశనం చేసే ప్రక్రియను గుట్టు చప్పుడు కాకుండా ముగించారు. అర్ధరాత్రి విధ్వంసం.. జూమ్‌లో పర్యవేక్షణ మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలను సీఐడీ అధికారులు విస్తృతం చేయడంతో బెంబేలెత్తిన రామోజీరావు తనకు అలవాటైన రీతిలో ఆధారాలను ధ్వంసం చేసేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం బ్రాంచి కార్యాలయాల మేనేజర్లతో (ఫోర్‌మెన్) మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమాన్యం ప్రత్యేకంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. అక్రమ వ్యవహారాలకు సంబంధించిన పత్రాలు, రికార్డులు, ఇతర ఆధారాలను ఎలా ధ్వంసం చేయాలో వారికి క్షుణ్నంగా వివరించారు. ఈ తతంగాన్ని హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయం నుంచే పర్యవేక్షించారు. ప్రధాన కార్యాలయానికి మళ్లించిన చందాదారుల నగదు వివరాలు, భారీగా నిధుల తరలింపు, రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్ల వసూలు, పాట పాడిన చందాదారులకు చిట్టీ మొత్తం ఇవ్వకుండా కొంత మొత్తాన్ని అక్రమ డిపాజిట్‌గా అట్టిపెట్టడం, యాజమాన్య వాటా కింద అట్టిపెట్టిన చిట్టీల టికెట్లు, వాటిపై చందా చెల్లించకుండానే చెల్లించినట్టుగా మాయ చేయడం.. వీటన్నింటికి సంబంధించిన రికార్డులు, పత్రాలను ఆన్లైన్లో, ఆఫ్లైన్లోనూ ఎలా ధ్వంసం చేయాలో మార్గదర్శి ప్రధాన కార్యాలయ అధికారులు బ్రాంచి మేనేజర్లకు వివరించారు. ఆధారాల ధ్వంసం ప్రక్రియను ప్రధాన కార్యాలయం నుంచే అర్ధరాత్రి వరకూ పర్యవేక్షించారు. సీఐడీ అధికారులు తాజాగా నిర్వహించిన సోదాల్లో ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో తీవ్రంగా పరిగణిస్తున్నారు. ధ్వంసం చేసిన ఆధారాలు, ఆన్లైన్ రికార్డులను సీఐడీ విభాగం రిట్రీవ్ చేసింది. డిసెంబర్ నుంచి కొత్త చిట్టీలు లేవు మార్గదర్శి అక్రమ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో కొత్త చిట్టీలు వేసేందుకు చందాదారులు ముందుకు రావడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో ఆర్థిక కార్యకలాపాలు 2022 డిసెంబర్ నుంచి దాదాపుగా స్తంభించిపోయాయి. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని చిట్ రిజిస్ట్రార్ స్పష్టం చేస్తుండగా రామోజీరావు ఆ చట్టాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో కొత్త చిట్టీలు ఆగిపోయాయి. స్టాంపులు–రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల సోదాల్లో బయటపడిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మార్గదర్శి 37 బ్రాంచి కార్యాలయాల్లో రూ.273 కోట్ల వేలం టర్నోవర్‌తో 2,357 చిట్టీలను నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా రూ.6.29 కోట్లు వేలం టర్నోవర్ విలువ ఉన్న 148 కొత్త చిట్టీలను ప్రారంభిస్తారు. వాటిపై మార్గదర్శి యాజమాన్యానికి కమీషన్ రూపంలోనే రూ.31.45 లక్షల వస్తాయి. డిసెంబర్ నుంచి చందాదారులు ముందుకు రాకపోవడంతో ఏకంగా 1,200కుపైగా కొత్త చిట్టీలు ప్రారంభం కాలేదు. రూ.51 కోట్ల వేలం టర్నోవర్ ఉన్న చిట్టీలు నిలిచిపోయాయి. ఆ మొత్తాన్ని మ్యూచ్‌వల్ ఫండ్స్, షేర్ మార్కెట్లతోపాటు తమ సొంత సంస్థల్లో పెట్టుబడిగా మళ్లించేందుకు సాధ్యం కావడం లేదు. ఇక కమీషన్ రూపంలో రూ.2.55 కోట్ల మేర మార్గదర్శి యాజమాన్యానికి రాకుండా పోయింది. కొత్త చిట్టీల కోసం చందాదారులను రప్పించేందుకు బ్రాంచి మేనేజర్ల ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. చందాదారుల ప్రదక్షిణలు... డిపాజిట్‌దారుల్లో ఆందోళన గతేడాది డిసెంబర్ నుంచి కొత్త చిట్టీలు ప్రారంభం కాకపోవడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మనీ సర్క్యులేషన్ నిలిచిపోయింది. పాత చిట్టీల చందాదారులు చెల్లించిన మొత్తాన్ని రామోజీరావు అక్రమంగా తమ సొంత సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించేశారు. రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్లను మ్యూచ్‌వల్ ఫండ్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టారు. కొత్త చిట్టీలు ప్రారంభమైతే ఆ చందాదారులు చెల్లించే మొత్తాన్ని పాత చిట్టీలు పాడిన వారికి చెల్లిస్తుంటారు. గడువు తీరిన అక్రమ డిపాజిట్ల విత్‌డ్రాయల్స్ మొత్తంగా చెల్లించడం, వడ్డీలు చెల్లించడం మొదలైన వ్యవహారాలు నిర్వహించేవారు. ప్రతి చిట్టీలోనూ యాజమాన్యం వాటా కింద అట్టిపెట్టుకున్న టికెట్ల చందా మొత్తాన్ని కూడా అవే నిధుల్లో చెల్లించినట్టు రికార్డుల్లో మాయ చేసేవారు. ఈ గొలుసు కట్టు తరహా మోసాన్ని దశాబ్దాలుగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్త చిట్టీలు లేనందున మార్గదర్శి లావాదేవీలు నిలిచిపోయాయి. పాత చిట్టీలు పాడిన చందాదారులకు సకాలంలో చెల్లించడం లేదు. తాము ష్యూరిటీ సంతకాలన్నీ చేయించినా చిట్టీ మొత్తం చెల్లించకపోవడంతో చందాదారులు ఆందోళన చెందుతున్నారు. మార్గదర్శి కార్యాలయాల చుట్టూ మండుటెండల్లో ప్రదక్షిణలు చేస్తున్నారు. విజయవాడలోని లబ్బీపేట, విశాఖపట్నంలోని సీతంపేట, గుంటూరు అరండల్‌పేట బ్రాంచి కార్యాలయాలకు వచ్చి రిక్త హస్తాలతో వెనుదిరుగుతున్నారు. దీనిపై కొందరు చిట్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు కూడా చేస్తుండటం గమనార్హం. మరోవైపు గతంలో చిట్టీలు పాడిన మొత్తాన్ని వారికి చెల్లించకుండా రశీదు ఇచ్చి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. మార్గదర్శి అక్రమాలు బయటపడటంతో ఆ డిపాజిట్‌దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని, వడ్డీ లేకపోయినా అసలైనా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. బ్రాంచి కార్యాలయాల నుంచి సరైన స్పందన లేకపోవడంతో వారిలో ఆందోళన తీవ్రమవుతోంది. కొందరు సీఐడీ అధికారులను కూడా సంప్రదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను నమ్మి తమ కష్టార్జితాన్ని ధారపోసి నిండా మునిగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా నిబంధనలు పాటిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ప్రతి చిట్కూ ఓ బ్యాంకు ఖాతా ఉంటే జాప్యానికి ఆస్కారమే ఉండదని, నిధుల మళ్లింపు జరగకుంటే చిట్‌దారులకు చెల్లింపులు ఆలస్యమయ్యేవి కావని అధికారులు పేర్కొంటున్నారు. -
AP: మారదర్శి బ్రాంచ్‌లలో సీఐడీ విస్తృత సోదాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ లలో సీఐడీ విస్తృత సోదాలునిర్వహిస్తోంది. 7 జిల్లాల్లో మార్గదర్శి బ్రాంచిలలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, నరసరావుపేట, ఏలూరు, అనంతపురం మార్గదర్శి బ్రాంచ్‌లలో సోదాలు జరుగుతున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్ లిమిటెడ్ అక్రమాలు, నిధుల దారి మళ్లింపుపై సీఐడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 గా మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఏ2గా ఎండీ శైలజ కిరణ్ ఉన్నారు. మార్గదర్శి అక్రమాలపై ఇప్పటికే రామోజీరావు, శైలజ కిరణ్లన సీఐడీ విచారించింది. ఈ విచారణలో వెలుగుచూసిన అక్రమాల ఆధారంగా సీఐడీ మరోమారు మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. గతంలోను తనిఖీలునిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. కాగా.. డిపాజిటర్లకు చేసిన చెల్లింపుల్లో ఏమైనా రహస్యం దాగుందా అని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించించిన విషయం తెలిసిందే. అలాంటిదేమీ లేని పక్షంలో ఆయా వివరాలు పూర్తిగా కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. చదవండి: డిపాజిట్లలో రహస్యం ఉందా? మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కి, రామోజీరావుకి సుప్రీంకోర్టు ప్రశ్న -
మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల అక్రమ మళ్లింపు, అక్రమ పెట్టుబడుల వ్యవహారాల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారాలను సమర్థిస్తూ సదస్సులు, సమావేశాల్లో మాట్లాడుతున్న వారికి, లేఖలు రాస్తున్న వారికి, ప్రకటనలు ఇస్తున్న వారికి నోటీసులు జారీచేస్తోంది. ఏ ఆధారాలతో ఏ ప్రాతిపదికన అలా మాట్లాడారో వచ్చి వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారాలన్నీ సక్రమమే.. కేవలం రామోజీరావును వేధించేందుకే ఈ కేసు పెట్టారని జీవీఆర్ శాస్త్రి అనే ప్రొఫెసర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆయనకూ నోటీసు ఇవ్వాలని సీఐడీ విభాగం నిర్ణయించింది. అసలు కేంద్ర చిట్‌ఫండ్ చట్టం, ఏపీ డిపాజిటర్ల హక్కుల పరిరక్షణ చట్టాల గురించి ఏం తెలుసు.. ఆ చట్టాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉల్లంఘించలేదని ఎలా చెప్పగలుగుతున్నారని సీఐడీ ఆయన్ని ప్రశ్నించనుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక వ్యవహారాలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉందని ఏ ప్రాతిపదికన లేఖ రాశారో కూడా ఆయన వివరణ కోరనుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ నమోదు చేసిన కేసును తప్పుబడుతూ ఏపీలో వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో సదస్సులు, సమావేశాల్లో ప్రసంగించిన ఆడిటర్లు, న్యాయవాదులు, ఇతర రంగాలకు చెందిన వారికీ సీఐడీ నోటీసులివ్వనుంది. మార్గదర్శి చట్టాలను ఉల్లంఘించ లేదనడానికి వారివద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని ఆదేశించనుంది. చదవండి: చట్టాలకు రామోజీ అతీతుడా! వివరణలను రికార్డ్ చేయనున్న సీఐడీ ఇక మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాలపై సీఐడీ దర్యాప్తు.. మరోవైపు న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్నాయి. ఏ–1గా ఉన్న రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజలు ఎలాంటి తప్పుచేయలేదని, చట్టాలను ఉల్లంఘించలేదని ఏ ప్రాదిపదికన, ఏ ఆధారాలతో మాట్లాడారో వారు వివరించాల్సి ఉంది. నోటీసులకు వారు వ్యక్తిగతంగా హాజరై ఇచ్చే వివరణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని నిర్ణయించింది. కేసు దర్యాప్తులో ఆ అంశం కీలకంగా మారుతుందన్నది సీఐడీ ఉద్దేశం. ఆధారాల్లేకుండా కేవలం సీఐడీపై దు్రష్పచారం చేసేందుకు వారు నిరాధారణ ఆరోపణలు చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని సీఐడీ భావిస్తోంది. -
తవ్విన కొద్దీ... ‘చీట్స్’
సాక్షి, అమరావతి: సోదాలు చేస్తున్న కొద్దీ అక్రమాల పుట్టగా బయటపడుతున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో అరెస్టులకు తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న సీఐడీ అధికారులు... నలుగురు బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేసి ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇప్పటికే ఏ1గా రామోజీరావును, ఏ2గా చెరుకూరి శైలజను, ఎ3గా బ్రాంచి మేనేజర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన సీఐడీ... ఫోర్మన్లుగా పిలిచే కామినేని శ్రీనివాసరావు (విశాఖ– సీతమ్మధార బ్రాంచి), సత్తి రవి శంకర్ (రాజమండ్రి), బి.శ్రీనివాసరావు (విజయవాడ– లబ్బీపేట), గొరిజవోలు శివ రామకృష్ణ (గుంటూరు)లను అరెస్టు చేసి ఆయా ప్రాంతాల్లో న్యాయమూర్తుల ఎదుట హాజరుపరిచారు. వీరిలో కొందరికి 24 వరకూ రిమాండు విధించారు. ఈ సందర్భంగా వెలుగుచూసిన అక్రమాలు అధికారులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. చిట్ సభ్యుల స్థానంలో వేల చిట్లలో తమ పేరే రాసేసుకున్న మార్గదర్శి సంస్థ... నిబంధనల మేరకు దానికి పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు!!. చిట్లలో తనకు వచ్చే కొద్ది పాటి డిస్కౌంట్ల మొత్తాన్నే దాదాపు అన్ని చిట్లలోనూ డూప్లికేట్ చేసి చూపించి... దాన్నే తమ సొమ్ముగా పేర్కొనటంతో, ఇదంతా పచ్చి “గొలుసు’ వ్యవహారంగా మారిపోయింది. గొలుసులో ఏ చిన్న లింకు తెగినా... ఇది సంస్థ దివాలాకు దారితీసే ప్రమాదముంది. అదే జరిగితే చిట్ సభ్యుల సొమ్ము వాళ్లకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతోపాటు చిట్లలకు వేర్వేరు బ్యాంకు ఖాతాలను నిర్వహించాల్సి ఉండగా... అన్నిటికీ ఒకే ఖాతాను నిర్వహిస్తూ వాటిలో డబ్బును ఇష్టం వచ్చినట్టుగా మళ్లించటం కూడా విస్మయం కలిగిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ రూపంలో గ్రూపు సంస్థల్లోకి కోట్లాది రూపాయలు మళ్లిస్తుండటంతో పాటు... హైరిస్క్ ఉండే మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోకి కూడా ఈ ఖాతా నుంచి చిట్ సభ్యుల సొమ్మును మళ్లించటం గమనార్హం. వీటన్నిటితో పాటు... చట్ట విరుద్ధ మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థను మూసేసినా డిపాజిట్లు తీసుకోవటం మాత్రం రామోజీరావు ఆపలేదని తాజా సోదాల్లో వెల్లడయింది. చిట్ సభ్యుల నుంచి అక్రమంగా డిపాజిట్లు తీసుకుంటూ... బ్యాంకుల్లో అయితే వాటిపై టీడీఎస్ (ఆదాపు పన్ను) చెల్లించాలని, తమ దగ్గరైతే అలాంటిదేమీ ఉండదని నమ్మబలుకుతుండటం మోసాలకు పరాకాష్టగా అధికారులు చెబుతున్నారు. ఆ అక్రమాల వివరాలివీ... ఒక్క రూపాయి చెల్లించకుండా...తమపేరిట చిట్టీలు సాధారణంగా ప్రతి చిట్కూ నిర్ణీత చందాదారుల సంఖ్య ఉంటుంది. కొన్ని గ్రూపుల్లో తక్కువ మంది సభ్యులు (టికెట్లు) చేరితే కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. ఆ ఖాళీ టికెట్స్‌ను కంపెనీ తీసుకోవాలి. వాటి చందాను కంపెనీ చెల్లించాలి. తరవాత కొత్త చందాదారులు చేరితే ఆ మేరకు టికెట్స్ భర్తీ చేయొచ్చు. చిట్‌ఫండ్ చట్టంలోని 27, 32 సెక్షన్లలో నిర్దేశించిన ఈ నిబంధనలను మార్గదర్శి ఏనాడూ పట్టించుకోలేదు. గరిష్ఠంగా ఒకో గ్రూపులో 50 శాతం వరకూ టికెట్లు కంపెనీవే ఉన్నాయి. కానీ వాటికోసం మార్గదర్శి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. చిట్లపై తమకు వచ్చే డిస్కౌంట్ల మొత్తాన్ని డూప్లికేట్ చేసి అన్నిచోట్లా రికార్డుల్లో చూపిస్తోంది. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలించి కొన్ని గ్రూపుల్లో చిట్ల సభ్యులు తమ చందా చెల్లించలేకపోతే... ఇక మిగతా వాళ్లకు చిట్లు పాడుకున్నా సరే డబ్బులు రావటం కష్టం. ఎందుకంటే కంపెనీ పేరిట ఉన్న వేటికీ డబ్బులు లేవు కాబట్టి!!. ఇదిగో ఉదాహరణ.... ఎంసీఎఫ్ గుంటూరు బ్రాంచిలో 45 గ్రూపుల చిట్టీలు వేశారు. వాటిలో మొత్తం 2,040 టికెట్లు (చందాదారులు) ఉన్నాయి. 858 టికెట్లు మార్గదర్శివే. వాటి చందాగా మార్గదర్శి రూ.16.96 కోట్లు చెల్లించాలి. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని బ్రాంచి మేనేజర్(ఫోర్మేన్) అంగీకరించారు. కేవలం రికార్డుల్లో ఎంట్రీలను అటూ ఇటూ జంబ్లింగ్ చేసి చూపిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ మొత్తంగా 2,300 చిట్టీలను నిర్వహిస్తోంది. వాటిలో లక్షమందికిపైగా చందాదారులున్నారు. వాటిలో కొన్ని వేల టికెట్లు మార్గదర్శివే. కానీ సంస్థ యాజమాన్యం తన వాటాగా ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. గొలుసు కట్ట మాదిరిగా ఒక చిట్ సొమ్మును వేరే చోట సర్దుబాటు చేస్తూ... కొందరికి ష్యూరిటీల పేరిట ఆలస్యం చేస్తూ... మరికొందరికి డిపాజిట్ల పేరిట తరవాత ఇస్తామని చెబుతూ రోజులు నెట్టుకొస్తోంది. అదీ కథ. ఒక్క బ్యాంకు ఖాతా చాలట!! చిట్‌ఫండ్ సంస్థలు తమ నిర్వహించే ప్రతి చిట్టీకీ సంబంధిత బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి. మార్గదర్శి దీన్ని పట్టించుకుంటే ఒట్టు. చిట్టీల ఒప్పందాల్లో బ్యాంకు పేరును చెబుతోంది తప్ప ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను ఇవ్వటమే లేదు. ప్రతి చిట్టీకీ ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉండాల్సి ఉండగా... దాన్నీ పాటించటం లేదు. అన్నీ ఒకే బ్యాంకు ఖాతాలో భారీగా పోగేస్తోంది. నిజానికిదో పెద్ద ఆర్థిక కుట్ర. నిబంధనల ప్రకారం చిట్టీల బ్యాంకు ఖాతాలపై సదరు బ్రాంచి మేనేజర్ (ఫోర్మేన్)కు చెక్ పవర్ ఉండాలి. ఆ మేనేజరే అన్నీ చూడాలి. కానీ మార్గదర్శిలో ఏ బ్రాంచి మేనేజర్‌కూ చెక్ పవర్ లేదు. అంతా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచే నడిపిస్తున్నారు. అక్కడ ఒకరికే చెక్ పవర్ కల్పించడం వెనుక గూడుపుఠాణి ఏమంటే... ఆ ఖాతా నుంచి నిధులు మళ్లించటం ఈజీ కనక. మ్యూచువల్ ఫండ్స్, ఇతర స్టాక్ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం నేరమైనా... మార్గదర్శి చేస్తున్నది అదే. తమ గ్రూపు సంస్థ ఉషోదయ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 88.5శాతం వాటాను మార్గదర్శి చిట్స్ కొనుగోలు చేసింది. ఇతర సంస్థల్లోకీ అక్రమంగా నిధులు మళ్లించింది. హైరిస్క్ ఉన్న వీటిలో పెట్టుబడులు పెడుతున్నట్లు చందాదారులకు కనీసం తెలియకుండా... దశాబ్దాలుగా రామోజీ సాగిస్తున్న ఆర్థిక దోపిడీ ఇది. డిపాజిట్లు సేకరించటం నేరమే అయినా... చిట్టీ పాడిన చందాదారుడికి చిట్టీ మొత్తం చెల్లించినట్టుగా చిట్స్ రిజిస్ట్రార్‌కు చూపిస్తున్న మార్గదర్శి... ఆ చందాదారుడికి పూర్తిగా చెల్లించకపోవటం గమనార్హం. ష్యూరిటీలు సరిగా లేవన్న కారణాలతో పలువురు చందాదారుల నుంచి ఫ్యూచర్ సెక్యూరిటీ పేరిట మిగిలిన కాలానికి చెల్లించాల్సిన చందాను తమ వద్దే ఉంచుకుంటున్నారు. దానికి ఓ రశీదు ఇస్తున్నారు. దానిపై 4–5 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇలా డిపాజిట్లు సేకరించటం చట్టప్రకారం నేరం. రామోజీ మాత్రం అదేమీ పట్టించుకోవటం లేదు. దానికి ఇదిగో ఉదాహరణ... ఒకే వ్యక్తి నుంచి రూ.కోటికిపైగా అక్రమ డిపాజిట్లు మార్గదర్శిలో ఓ చందాదారునికి 24 చిట్టీలున్నాయి. ఆయన నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ “రశీదు’ రూపంలో రూ.కోటికుపైగా డిపాజిట్టు వసూలు చేసింది. దీనిపై ఆ సభ్యుడిని విచారించగా విస్మయకర అంశాలు వెల్లడయ్యాయి. టీడీఎస్ మినహాయించుకోకుండా తాము డిపాజిట్లు సేకరిస్తున్నామని మార్గదర్శి చిట్స్ తనకు చెప్పిందని ఆయన తెలిపారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే టీడీఎస్ చెల్లించాలి. అదే మార్గదర్శిలో అయితే టీడీఎస్ అవసరం లేదని చెప్పి ఆయన్ని ఆకర్షించారు. ఇది ఆర్బీఐ నిబంధనల ప్రకారం నేరం. నిజానికి గతంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట ఎలాంటి అనుమతులూ లేకుండా రూ.2,600 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేశారు. దీన్ని నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయటపెట్టడంతో కేసులు నమోదయ్యాయి. విచిత్రమేంటంటే కేసులు కొనసాగుతుండగా... నేరాన్ని కప్పిపుచుకోవటానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను రామోజీరావు మూసేశారు. ఇలా డిపాజిట్లు సేకరించటం ఐటీ చట్టం ప్రకారం నేరం. ఎంత సేకరిస్తే అంత మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.ఈ మేరకు ఐటీ కూడా రామోజీకి నోటీసులు జారీ చేసింది. దానిపైనా పలు కేసులు నడుస్తున్నాయి. అలాంటి సమయంలో సంస్థను కుట్రపూరితంగా మూసేయటమే కాక... ఇపుడు చిట్స్ ముసుగులో రకరకాల పేర్లతో డిపాజిట్లు సేకరిస్తుండటం గమనార్హం. మేనేజర్ల పేరిట మరో పన్నాగం... (బాక్స్) – తన అక్రమాలకు వారిని బలి చేసే కుతంత్రం – న్యాయస్థానాన్నీ తప్పుదోవపట్టించేందుకు యత్నం అవినీతి బాగోతం బయటపడే సమయంలో దానికి సాంకేతిక కారణాలు చూపించి తప్పించుకోవటంలో రామోజీది అందెవేసిన చెయ్యి. అదే తరహాలో చిట్స్ విషయంలోనూ ఈ ఉల్లంఘనలన్నింటినీ తమ బ్రాంచి మేనేజర్లు(ఫోర్‌మెన్) నెత్తిన రుద్దీ తప్పించుకునే దుర్మార్గానికి తెరతీశారు రామోజీ. కానీ స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు ఈ కేసును శాస్త్రీయంగా అధ్యాయనం చేసి... తగిన ఆధారాలు సేకరించడం ద్వారా రామోజీ ఎత్తును చిత్తు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు బయటపడగానే రామోజీరావు తన ఈనాడు పత్రికలో అరపేజీ ప్రకటన ఇచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించి అన్ని వ్యవహారాలు బ్రాంచి మేనేజర్లే(ఫోర్‌మెన్) మాత్రమే చూస్తారు ...సర్వాధికారాలు వారివేనని అందులో పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణ న్యాయస్థానంలో వేసిన పిటిషన్లో అదే మాట చెప్పారు. తద్వారా బ్రాంచి కార్యాలయాల్లో అక్రమాలతో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేశారు. కానీ స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ విభాగాలు రామోజీరావు కుట్రను సమర్థంగా తిప్పికొట్టాయి. ఎందుకంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు కేవలం నిమిత్త మాత్రులు. వారికి తమ బ్రాంచిలోని ఖాతాలకు సంబంధించి కనీసం చెక్ పవర్ కూడా లేదు. అంటే వారికి సర్వాధికారాలు ఉన్నాయని రామోజీ ఇచ్చిన ప్రకటనలో గానీ న్యాయస్థానంలో వేసిన పిటిషన్లో గానీ చెప్పినవన్నీ అబద్ధాలేనన్నది స్పష్టమైంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అన్ని అక్రమాలకు రామోజీరావు, ఆయన కోడలు శైలజే పూర్తి బాధ్యులనేది సుస్పష్టం. -
వెలుగు చూస్తున్న ‘మార్గదర్శి’ అక్రమాలు.. నలుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇండివిడ్యువల్ గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి చిట్స్ సమర్పించలేదు. బ్యాలెన్స్‌షీట్లను తెలియజేసే పత్రాలను కూడా మార్గదర్శి ఇవ్వలేదు. తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలూ బేఖాతరు చేసింది. దీంతో గడచిన మూడు నెలలుగా 444 గ్రూపులకు సంబంధించి కార్యకలాపాలను అధికారులు నిలిపేశారు. డిసెంబర్ నుంచి కూడా ఈ ఫారం నింపి మార్గదర్శి ఇవ్వలేదు. అధికారుల చర్యలతో సంబంధిత బ్రాంచ్‌ల్లో చిట్స్ బంద్ అయ్యాయి. మార్గదర్శి కేసులో నలుగురిని సీఐడీ అరెస్ట్ చేసింది. నలుగురు ఫోర్మెన్లను అదుపులోకి తీసుకుంది. నిన్నటి నుంచి మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీఐడీ.. విశాఖపట్నం మార్గదర్శి బ్రాంచ్ ఫోర్ మెన్ కామినేని రామకృష్ణ, రాజమండ్రి మార్గదర్శి బ్రాంచ్ ఫోర్ మెన్ సత్తి రవి శంకర్, విజయవాడ మార్గదర్శి ఫోర్ మెన్ బి.శ్రీనివాసరావు, గుంటూరు మార్గదర్శి ఫోర్ మెన్ గొరిజవోలు శివరామకృష్ణలను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ సోదాల్లో భారీ అక్రమాలు, ఉల్లంఘనలను సీఐడీ గుర్తించింది. మార్గదర్శిలో రికార్డులన్నీ అక్రమం అని, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని సీఐడీ గుర్తించింది. అక్రమాలకు పాల్పడినందున నలుగురు ఫోర్ మెన్లను సీఐడీ అరెస్ట్ చేసింది.. అరెస్టయిన నలుగురిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా,చట్టాన్ని యథేచ్చగా ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆ సంస్థపై సీఐడీ అధికారులు శనివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ, రామోజీరావు పెద్ద కోడలు చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వారిపై సెక్షన్లు 120(బి), 409, 420, 477(ఎ) రెడ్‌విత్ 34 సీఆర్సీపీ కింద కేసు నమోదు చేశారు. ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం–1999, చిట్ ఫండ్ చట్టం–1982 కింద కూడా కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. చదవండి: తోడు దొంగలు.. యథేచ్ఛగా అక్రమాలు, ఆర్బీఐ నిబంధనలు బేఖాతరు -
అమరావతి భూముల కుంభకోణం: నారాయణను ప్రశ్నించిన సీఐడీ
సాక్షి, హైదరాబాద్: అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను సీఐడీ అధికారులు విచారించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని నారాయణ నివాసానికి చేరుకున్న అధికారులు.. ఆయనను ప్రశ్నించారు. నారాయణ సతీమణి, ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ యజమానిని కూడా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. కూకట్పల్లి లోధా అపార్ట్మెంట్లో మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో ఏపీ సీఐడీ అధాకారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. నారాయణ సంస్థల నుంచి రామకృష్ట సంస్థలోకి నిధుల మళ్లించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అధికారుల దర్యాప్తులో బినామీల పేర్లపై అమరావతిలో అసైన్డ్ భూముల కోనుగోలు చేసినట్లు తేలింది. ఈ దందాలో నారాయణ అప్పటి మంత్రులు, వారి బినామీలు ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి అక్రమంగా అసైన్డ్ భూముల కొనుగులు చేసినట్లు గుర్తించారు. ల్యాండ్ పూలింగ్ కింద ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఈ భూముల కొనుగోలు జరిగాయని, టీడీపీ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి మందడం, వెలగపూడి రాయపూడి, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు బయటపడింది. 150 ఎకరాల అసైన్డ్ భూముల అక్రమ కొనుగోలుపై దర్యాప్తు 150 ఎకరాల అసైన్డ్ భూముల అక్రమ కొనుగోలుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాజధాని పరిసరాల్లో 65. 50 సెంట్ల భూమి నారాయణ కొనుగోలు చేశారు. ఆవుల ముని శంకర్ పేరు మీ 4.2 కోట్ల విలువగల భూమి నారాయణ కొనుగోలు చేశారు. 2017 జూన్, జూలై, ఆగస్టులలో భూములు నారాయణ కొనుగోలు చేశారు. వీటితో పాటు పొట్టూరి ప్రమీల పేరు మీద, రావూరి సాంబశివరావు పేరు మీద భూములు కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోలు సందర్భంగా ముగ్గురి అకౌంట్లలోకి భారీగా నిధులు మళ్లించారు. దీనిలో భాగంగా గతంలో నారాయణ కుమార్తెలు శరాని, సింధూర ఇళ్లలో సైతం సీఐడీ సోదాలు నిర్వహించింది. ఈ మేరకు బ్యాంకు లావాదేవీలు, మణి కూటింగ్ పోన్ కాల్స్ రికార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. తమవారికి లాభం చేకూరేలా అలైన్మెంట్ డిజైన్లు నారాయణ మార్చారు. నారాయణ ఎడ్యుకేషన్ సొపైటీ, నారాయణ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రామనారాయణ ట్రస్టు ద్వారా 17. 5 కోట్ల నిధులు మళ్లించారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సైతం భారీగా నిధుల మళ్లించి, ఆ నిధులను అసైన్డ్ భూమి రైతులకు చెల్లించారు. చదవండి: సాత్విక్ కేసు: రోజు స్టడీ అవర్‌లో జరిగింది ఇదే.. పోలీసుల రిపోర్ట్ -
ఆ మహిళలిద్దరినీ వారి ఇళ్ల వద్దే విచారించండి
సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో.. తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి, నారాయణ విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ పొత్తూరి ప్రమీల హైకోర్టును ఆశ్రయించారు. ఆ నోటీసులను కొట్టేయాలని కోరుతూ ముగ్గురూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలో ఇద్దరు మహిళలున్నారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహిళలను వారి ఇంటి వద్దే విచారించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో నారాయణను ఆయన ఇంటి వద్దే విచారించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మహిళలిద్దరినీ వారి ఇళ్ల వద్దే విచారించాలని సీఐడీని ఆదేశించారు. -
మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని శరణి నివాసంలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనీ రూటింగ్‌కు పాల్పడి అమరావతిలో భూముల కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. దాదాపు 146 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించగా.. పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్టుగా సీఐడీ వర్గాలు వెల్లడించాలి. -
సీఐడీ సీఐ భార్య ఆత్మహత్య
పటమట(విజయవాడతూర్పు): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటమట పోలీసులు తెలిపిన వివరాల మేరకు దాడి చంద్రశేఖర్ మంగళగిరిలోని ఏపీ సీఐడీలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు 2012లో కాకినాడకు చెందిన జ్యోతి(33)తో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు.. ఉద్యోగరీత్యా వీరిరువురూ పటమటలోని తోటవారి వీధిలో కాపురముంటున్నారు. కొంతకాలంగా వీరిరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం కోసం పిలిస్తే రాకపోవటంతో అనుమానం వచ్చిన పిల్లలు తలుపులు కొట్టగా అవి గడియపెట్టి ఉన్నాయి. దీంతో స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లటంతో అప్పటికే ఫ్యానుకు ఉరేసుకుని ఉంది. పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసులు ఆత్మహత్యగా కేసును నమోదు చేసినట్లు పటమట సీఐ కాశీవిశ్వనాథ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు. -
‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’!
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో టీడీపీ పెద్దలు రూ.వెయ్యి కోట్లకుపైగా నల్లధనాన్ని మళ్లించి 169.27 ఎకరాల అసైన్డ్ భూములను సిబ్బంది, పని మనుషుల పేరుతో కాజేసిన బాగోతం బట్టబయలైంది. అమరావతిలో చంద్రబాబు సర్కారు అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. టీడీపీ హయాంలో మొత్తం రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించగా నల్లధనాన్ని మళ్లించేందుకు ‘ఎన్‌స్పైర’ అనే షెల్ కంపెనీని వాడుకున్నట్లు తాజాగా తేలింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ‘ఎన్‌స్పైర’ కార్యాలయంలో మంగళవారం విస్తృతంగా సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారుల బృందం 45 హార్డ్ డిసు్కలు, బ్యాంకు ఖాతా లావాదేవీల కీలక పత్రాలను స్వాదీనం చేసుకుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ తమ కుటుంబ వ్యాపార సంస్థ ‘ఎన్‌స్పైర’ ద్వారా సాగించిన అక్రమాల బాగోతం ఇలా ఉంది. కుమార్తె, అల్లుడు డైరెక్టర్లుగా.. మాజీ మంత్రి నారాయణ తమ కుటుంబం నిర్వహించే నారాయణ విద్యా సంస్థల కోసమంటూ ‘ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి కొనుగోళ్లు, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపుల కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థను లాభాపేక్షలేని సంస్థగా ఏపీ సొసైటీల చట్టం ప్రకారం ఏర్పాటుచేశారు. విద్యాసంస్థ నిధులను నారాయణ తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు మళ్లించేందుకు వీలులేదు. దీంతో నిధుల మళ్లింపు కోసం ఎత్తుగడ వేసిన నారాయణ తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్‌స్పైర అనే కంపెనీని నెలకొల్పారు. నల్లధనం భారీగా మళ్లింపు.. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్‌స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపడం గమనార్హం. రెండు విడతల్లో ఎన్‌స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఆ నిధులు రామకృష్ణ హౌసింగ్‌లోకి.. వివిధ మార్గాల్లో ఎన్‌స్పైరలోకి మళ్లించిన నిధులను నారాయణ తమ సమీప బంధువైన కేవీపీ అంజనికుమార్ ఎండీగా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లోకి తరలించారు. దీంతోపాటు నారాయణ విద్యా సంస్థల సిబ్బంది బ్యాంకు ఖాతాల్లోకి కూడా నిధులు మళ్లించడం గమనార్హం. అనంతరం ఆ చిరుద్యోగుల పేరిట అమరావతిలో అసైన్డ్ భూములను కొనుగోలు చేశారు. తమ వద్ద పనిచేసే చిరుద్యోగులను బినామీలుగా మార్చుకుని 169.27 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. మొత్తం రూ.5,600 కోట్ల అసైన్డ్ దందా అమరావతిలో రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ పెద్దలు కొల్లగొట్టినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా అమరావతి వ్యవహారాల్లో చక్రం తిప్పిన నారాయణ కనుసన్నల్లోనే భూ దందాలు జరిగాయి. రాజధాని కోసం సమీకరించే అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా తీసుకుంటుందని రెవెన్యూ, పురపాలక శాఖ అధికారుల ద్వారా ప్రచారం చేశారు. ఇదే అదనుగా దళితులు, బీసీల భయాందోళనలను సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలను రంగంలోకి దించారు. అసైన్డ్ భూములను అయినకాడికి అమ్ముకోకుంటే ప్రభుత్వ పరమైపోతాయని పేదలను బెదిరించి కారుచౌకగా కాజేశారు. అసైన్డ్ భూములున్న వారికి నగదు చెల్లింపులు చేసి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) పొందారు. అనంతరం సేల్ డీడ్ల ద్వారా కథ నడిపించారు. రిజిస్ట్రేషన్ చట్టం 22 ఏ కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న వీటిని పకడ్బందీగా సొంతం చేసుకున్నారు. ఆ విధంగా అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు, రాయపూడి తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూములను టీడీపీ పెద్దలు కాజేశారు. అనంతరం అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం తాపీగా ప్యాకేజీ ప్రకటించడం గమనార్హం. అక్రమాలు బహిర్గతం.. అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్న కేసులో మాజీ మంత్రి పి.నారాయణను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఐపీసీ 34, 35, 36, 37, 409, 420, 506 తదితర సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన నారాయణ సన్నిహితులైన ఐదుగురిని గతంలో అరెస్టు చేశారు. కాగా అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు ఎన్‌స్పైర కంపెనీ ద్వారా నల్లధనాన్ని మళ్లించి అక్రమాల కథ నడిపించినట్లు సీఐడీ దర్యాప్తులో తాజాగా బహిర్గతమైంది. -
జయలక్ష్మీ బ్రాంచ్‌లలో విస్తృత సోదాలు
కాకినాడ రూరల్: కాకినాడ జిల్లాలో డిపాజిటర్ల సొమ్మును దారి మళ్లించి నట్టేటముంచిన జయలక్ష్మీ సొసైటీ లిమిటెడ్ గత పాలకవర్గ అవినీతి, అవకతవకలపై సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. సొసైటీ పాలకవర్గంలోని కీలకమైన గత చైర్మన్, వైస్ చైర్మన్ దంపతులతో పాటు వారి కుమారుడిని ఇప్పటికే జైలుకు పంపిన సీఐడీ అధికారులు..మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మరో వైపు జయలక్ష్మీ సొసైటీకి కొత్త పాలకవర్గం అందుబాటులోకి వచ్చింది. కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తాళాలు తెరవాలని సీఐడీ అధికారులను కోరుతూ మహాజన సభ వేదిక ద్వారా ఈ పాలకవర్గం తీర్మానించింది. కాగా, రాష్ట్రంలోని 29 బ్రాంచ్‌లలో అధికారులు సోదాలకు దిగారు. సోమవారం పిఠాపురం బ్రాంచ్‌లో తనిఖీలు ప్రారంభించిన అధికారులు మంగళవారం అన్ని బ్రాంచ్‌లకు తిరుగుతున్నారు. సర్పవరం వద్ద మెయిన్ కార్యాలయంలో మంగళవారం సీఐడీ అడిషనల్ ఎస్పీ రవివర్మ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు బుచ్చిరాజు, రమణమూర్తి, సిబ్బంది రికార్డులను తనిఖీ చేశారు. బ్రాంచ్ మేనేజరు టి.పద్మావతి, సీఏవో లీలాప్రసాద్‌తో అడిషనల్ ఎస్పీ రవివర్మ మాట్లాడారు.కాగా, ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ముగ్గురు నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. -
సీఐడీ ఆఫీస్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఓవర్ యాక్షన్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సీఐడీ ఆఫీస్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసులతో వెలగపూడి వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. అయ్యన్నను ఎందుకు అరెస్టు చేశారో సమాధానం చెప్పాలంటూ పోలీసులతో గొడవకు దిగారు. పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో వెలగపూడి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు తొలగించే సమయంలో అధికారులకు అయ్యన్న కుటుంబ సభ్యులు తప్పుడు పత్రాలు సమర్పించారు. అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించిన తప్పుడు పత్రాలపై ఇరిగేషన్ అధికారులు.. సీఐడీకి ఫిర్యాదు చేశారు. చదవండి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్ -
టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ అరెస్ట్
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టిన కేసులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని మీడియా కో ఆర్డినేటర్ దారపునేని నరేంద్రను సీఐడీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తున్న ఒక మహిళను గన్నవరం విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సెప్టెంబరు 9న అరెస్టు చేశారు. ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి భార్య అంటూ కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. ‘సీఎంవోలోని ఓ కీలక అధికారి భార్య దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ గన్నవరం విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఆమెతోపాటు ఎయిర్ ఇండియా సిబ్బందిని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు..’ అంటూ ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి ఆ మహిళ ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఏ అధికారి కుటుంబసభ్యురాలు కాదు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. దీనిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియా కో ఆర్డినేటర్ దారపునేని నరేంద్ర కూడా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. నరేంద్ర స్వయంగా దుష్ప్రచార పోస్టులు పెట్టడమేగాక ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా సూపర్ స్ప్రెడర్గా వ్యవహరించారని, కుట్రపూరితంగానే ఇదంతా చేశారని తేలింది. దీంతో అతడిపై క్రైమ్ నంబర్ 61/22 కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదే అంశంపై సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేసినం దుకు జర్నలిస్ట్ అంకబాబును సీఐడీ అధికారులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
Vijayawada: ఐ-టీడీపీపై సీఐడీ కేసు
సాక్షి, విజయవాడ: ఐ-టీడీపీపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో తన వీడియోని మార్ఫింగ్ చేసినట్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టి ప్రాథమికంగా ఆ వీడియో మార్ఫింగ్ అని తేల్చారు. ఈ క్రమంలో ఐ-టీడీపీ సహా మరికొందరిపై పలు సెక్షన్లతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఐటీ (66t), IPC 465, 469, 471, 153(a), 505(2), 120(b) సెక్షన్లతో కేసు నమోదు చేశారు. చదవండి: (సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ) -
గుజ్జల శ్రీను రూ.వందల కోట్లు స్వాహా చేశారు
సాక్షి, అమరావతి: ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీను చేనేత కార్మికుల పేరు మీద తప్పుడు సంఘాలు, ఖాతాలు, సభ్యులను సృష్టించి రూ.వందల కోట్ల మేర నిధులను స్వాహా చేశారని సీఐడీ గురువారం హైకోర్టుకు నివేదించింది. దీనిపై హైకోర్టులో విచారణ జరగాల్సిందేనని విన్నవించింది. గుజ్జల శ్రీను తదితరులపై నమోదైన కేసులో ఇప్పటివరకు 174 మంది సాక్షులను విచారించి.. పూర్తి వివరాలతో చార్జిషీట్ దాఖలు చేశామని సీఐడీ తరఫు న్యాయవాది వై.శివ కల్పనారెడ్డి కోర్టుకు నివేదించారు. ఆప్కోకు చైర్మన్‌గా వ్యవహరించడం వల్ల ఆయన ప్రజా సేవకుడు (పబ్లిక్ సర్వెంట్) కిందకే వస్తారని తెలిపారు. అందుకే గుజ్జల శ్రీనుపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద కేసు నమోదు చేశామన్నారు. చేనేత సహకార సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారన్నారు. ఈ నిధులతో గుజ్జల శ్రీను కడపలో 89 స్థిరాస్తులను కుటుంబ సభ్యుల పేరు మీద కూడబెట్టారని ఆమె కోర్టుకు వివరించారు. అందువల్ల ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయొద్దని కోరారు. ఈ కేసులో శ్రీను తరఫు న్యాయవాదులు ప్రస్తావించిన తీర్పును అధ్యయనం చేయాల్సి ఉందని, ఇందుకు కొంత గడువు కావాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ గుజ్జల శ్రీను, మరికొందరు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
అగ్రిగోల్డ్ నయా ‘భూ’గోతం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్రిగోల్డ్ కంపెనీకి అనుబంధ కంపెనీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు సంస్థలకు చెందిన 76 ఎకరాల అమ్మకం వెలుగులోకి రావడం పెనుదుమారం రేపుతోంది. దీనిపై ఇన్నాళ్లూ దర్యాప్తు చేసిన అధికారులు కళ్లు మూసుకున్నట్లు వ్యవహరించిన తీరే కారణమా అనే అనుమానాలు బలపడుతున్నాయి. బినామీ కంపెనీలుగా ఉన్న కంపెనీలకు చెందిన ఎకరాల కొద్దీ భూమిని ఓ మామూలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమ్మకం చేయగా మాజీ కానిస్టేబుల్ కొనుగోలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతున్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ చైర్మన్‌ను విచారించిన సీఐడీ.. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావును శుక్రవారం సీఐడీ అధికారులు విచారించారు. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా, ఫరూక్నగర్ మండలంలో ఉన్న అగ్రిగోల్డ్ బినామీ కంపెనీలుగా సీఐడీ భావిస్తున్న మోహనా గ్రోవిస్ ఇన్ఫ్రా, లియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మాతంగి ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఖిలేంద్ర ఇన్ఫ్రా ఆగ్రో వెంచర్స్ లిమిటెడ్‌కు చెందిన 76 ఎకరాల భూమి విక్రయ వ్యవహారంపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కంపెనీల పేరిట ఉన్న భూములను రాందాస్ అనే వ్యక్తి ఏ అధికారంతో విక్రయించారో చెప్పాలని ప్రశ్నించినట్లు సమాచారం. సంబంధిత కంపెనీల డైరెక్టర్లు రాందాస్‌కు అధికారం ఇచ్చి ఉంటారా అనే విషయం తెలియదని అగ్రిగోల్డ్ చైర్మన్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ ప్రధాన కంపెనీల నుంచి బినామీ కంపెనీల్లోకి జరిగిన లావాదేవీల పూర్తి వివరాలు అందించాలని కోరగా ఇప్పటికే పలు రాష్ట్రాల అధికారులు డాక్యుమెంట్లు సీజ్ చేశారని ఆయన సమాధానమిచ్చినట్లు తెలియవచ్చింది. అటాచ్ ప్రాపర్టీ విక్రయం ఎలా? అగ్రిగోల్డ్‌కు చెందిన 80 కంపెనీలతోపాటు బినామీ కంపెనీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 70 కంపెనీలకు చెందిన ఆస్తులను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగాలు అటాచ్ చేస్తూ గతంలోనే ఉత్తర్వులిచ్చాయి. అయితే మహబూబ్‌నగర్‌కు చెందిన ఆస్తులు తెలంగాణ పోలీస్ శాఖ ఆటాచ్ చేసిన జాబితాలో లేవు. ఈ వ్యవహారంపై రామారావును సీఐడీ అధికారులు ప్రశ్నించగా గతంలోనే ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఈ ఆస్తులను అటాచ్ చేసి ఉంటుందని, వాటిని ఎలా విక్రయించారో తనకు తెలియదని, 2016లో ఈ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు తాను జైల్లో ఉన్నట్లు రామారావు బదులిచ్చినట్లు సమాచారం. హైకోర్టులో అఫిడవిట్.. ఈ భూముల్లో కొంత భాగాన్ని మాజీ కానిస్టేబుల్ కొనుగోలు చేయడంపై గతంలో ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారి హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిసింది. మాజీ కానిస్టేబుల్ అగ్రిగోల్డ్‌కు బినామీగా వ్యవహ రించినట్లు ఆ అధికారి కోర్టు తెలిపారని తెలిసింది. అయితే దర్యాప్తు సమయంలో ఈ బినామీ కంపెనీలకు చెందిన ఆస్తులను గుర్తించడంతోపాటు విక్రయాలు జరిగాయా లేదా అనే అంశాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారన్న విషయంపై ఇప్పుడు సీఐడీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ దర్యాప్తు అధికారిని సీఐడీ వెంటనే పక్కనపెట్టి మరో అధికారికి బాధ్యతలు అప్పగించడంతో ఈ భూముల వ్యవహారంపై విచారణ లోతుగా కొనగసాగుతున్నట్లు తెలుస్తోంది. -
17న విచారణకు రండి
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, ముఖ్యమంత్రిని అవమానించేలా, కులాలను కించపరిచేలా, సమాజంలో అశాంతిని రేకెత్తించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఈ నెల 17న విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ నోటీసు జారీ చేసింది. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌లో విల్లా నంబర్ 74లో ఉన్న రఘురామ ఇంటికి సీఐడీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బృందం ఉదయం 9 గంటలకు వెళ్లింది. తొలుత సీఐడీ బృందాన్ని ఇంట్లోకి అనుమతించలేదు. రఘురామకృష్ణరాజు న్యాయవాది వచ్చిన అనంతరం ముగ్గురిని అనుమతించారు. క్రైమ్ నంబర్ 12/2021, సెక్షన్ 153, 505, 124–ఎ రెడ్ విత్ 120బి కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ ఆయనను విచారణకు పిలిచింది. 17న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు రీజినల్ సీఐడీ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని ఆ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో గతంలో అరెస్టైన రఘురామకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్యాప్తునకు సహకరించాలని, మీడియా సమావేశాలు నిర్వహించకూడదని, ప్రభుత్వాన్ని, వ్యక్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయకూడదనే షరతులు ఉన్నాయి. కేసు దర్యాప్తు అధికారి, సీఐడీ ఏఎస్పీ విజయపాల్ ఇటీవల రిటైరయ్యారు. దీంతో దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ జయసూర్యకు సీఐడీ అప్పగించింది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం రఘురామను విచారించేందుకు సీఐడీ సిద్ధమైంది. కోర్టు ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని, నోటీసు అందులో భాగమేనని సీఐడీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉంటే సీఐడీ నోటీసు ఇచ్చిన కొద్దిసేపటికే రఘురామ ఇంటికి అమరావతి జేఏసీ కీలక నేత వెళ్లి మాట్లాడటం గమనార్హం. మరిన్ని వివరాల కోసం నోటీసు ఇచ్చారు: రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించానంటూ గతంలో నమోదు చేసిన కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు నోటీసు ఇచ్చారని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. సీఐడీ నోటీసులు ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలను, న్యాయస్థానాలను గౌరవిస్తానని అన్నారు. ముఖ్యమైన సంక్రాంతి పండగకు వస్తున్నానని తెలిసే ఇప్పుడు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. రేపు నరసాపురానికి వస్తున్నానని అక్కడి కలెక్టర్, ఎస్పీకి ముందుగానే తెలిపానన్నారు. కరోనా ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా విచారణకు హాజరవుతానని అన్నారు. గతంలో తనను హింసించిన సమయంలో కెమెరాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. తనను హింసించిన వీడియోలు చూసి ఎవరు ఆనందపడ్డారో తనకు తెలుసన్నారు. ఎస్సీలపైనా ఎస్సీ కేసులు పెట్టడం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. -
ఏపీ సీఐడీ అధికారులపై రఘురామకృష్ణరాజు చిందులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులపై రఘురామకృష్ణరాజు చిందులు తొక్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీస్ అధికారులపై నోరు పారేసుకున్నారు. సీఐడీ చీప్ సునీల్‌కుమార్ ఉన్మాది అంటూ వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అధికారులపై దూషణలకు దిగారు. చదవండి: రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు -
రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు మరోమారు వచ్చారు. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని రఘురామకు నోటీసులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేయడంతో గతంలో సీఐడీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో గతంలో అరెస్టయిన రఘురామకృష్ణరాజు షరతులతో కూడిన బెయిల్‌తో బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: Nadu Nedu: ఏపీలో విద్య భేష్ -
AP: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఏ-1 గంటా సుబ్బారావు అరెస్ట్
సాక్షి, విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఏ-1 గంటా సుబ్బారావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఏబీసీ కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో షెల్ కంపెనీల ముసుగులో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) నిధులు కొల్లగొట్టిన కేసులో అరెస్టుల పర్వానికి తెరలేచింది. రూ. 241 కోట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేటు కంపెనీలకు చెందిన ముగ్గురు ప్రతినిధులను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఖన్విల్కర్, ఢిల్లీకి చెందిన స్కిల్లర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అగర్వాల్, నోయిడాలో నివసిస్తున్న సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్‌లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అక్కడి న్యాయస్థానాల నుంచి ట్రాన్సిట్ వారంట్ పొంది విజయవాడ తీసుకువచ్చారు. ఆ ముగ్గురిని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. -
అవినీతికి ‘సీమెన్స్’ ముసుగు
సాక్షి, అమరావతి : యువతకు ఉపాధి శిక్షణ ముసుగులో గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ)లో నిధులు కొల్లగొట్టిన వైనం అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ సంస్థలను కూడా విభ్రాంతికి గురి చేసింది. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థల పేర్లను కూడా వాడుకుని టీడీపీ ప్రభుత్వ పెద్దలు ప్రజాధనాన్ని దోచుకున్నారని వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వ పెద్దలు వారి స్వార్థం కోసం తమ సంస్థ పేరును దుర్వినియోగం చేసిందని ప్రముఖ కంపెనీ సీమెన్స్ అంతర్గత విచారణలో నిగ్గు తేల్చడం గమనార్హం. చదవండి: దోపిడీలో స్కిల్.. బాబు గ్యాంగ్ హల్'షెల్' ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో సీఐడీ అధికారుల దర్యాప్తులో తాజాగా ఈ విషయం వెలుగు చూసింది. యువతకు ఉపాధి శిక్షణ కోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు ఘనంగా చెప్పుకుంది. కానీ వాస్తవం ఏమిటంటే.. భారతదేశంలో సీమెన్స్ సంస్థకు అప్పట్లో ఎండీగా ఉన్న సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీ పెద్దలు కుట్రకు తెరతీశారు. దాంతో పేరుకు సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో కలిసి ఏపీఎస్ఎస్డీసీ రూ.3,556 కోట్లకు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నట్టు చూపించారు. కానీ సౌమ్యాద్రి శేఖర్ బోస్‌తో కలిసి అందుకోసం పీవీఎస్పీ ఐటీ స్కిల్స్, స్కిల్లర్ అనే షెల్ కంపెనీలను సృష్టించారు. ఏపీఎస్ఎస్డీసీ కాంట్రాక్టును ఆ సంస్థలకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు కథ నడిపించారు. అనంతరం సీమెన్స్, డిజైన్ టెక్ సమకూర్చాల్సిన 90 శాతం నిధులను సమకూర్చకుండానే.. ప్రభుత్వం తమ వాటా 10 శాతం పన్నులతో సహా రూ.371 కోట్లు చెల్లించేసింది. దాంతో ఏసీఐ అనే మరో కంపెనీ నకిలీ ఇన్వాయిస్లతో రూ.241 కోట్లను దొడ్డి దారిలో డిజైన్ టెక్ సంస్థకు చేరవేసింది. ఈ మొత్తం వ్యవహారంలో సీమెన్స్ సంస్థ అధికారిక ప్రమేయం లేదు. కానీ సీమెన్స్ తరఫున కథ నడిపినట్టుగా ఆ సంస్థ ఎండీ సౌమ్యాద్రిబోస్ తతంగం నడిపారు. ఈ విధంగా ఇటు ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే కాకుండా అటు తమ సీమెన్స్ సంస్థనూ మోసం చేశారు. సంతకంలోనూ మతలబే ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే కాంట్రాక్టు కుదుర్చుకున్న టీడీపీ ప్రభుత్వ పెద్దలు, సౌమ్యాద్రి శేఖర్ బోస్ అందుకు పక్కాగా పన్నాగం పన్నారు. ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందంలో సౌమ్యాద్రి బోస్ తన పేరును రాహుల్ బోస్‌గా సంతకం చేశారు. అలియాస్‌గా పేరు ఏదైనా ఉండొచ్చు. అధికారిక పత్రాలపై తన అసలు పేరుతోనే సంతకం చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా ఆయన రాహుల్ బోస్ పేరుతో సంతకం చేయడం గమనార్హం. అయితే గుజరాత్ ప్రభుత్వంతో సీమెన్స్ సంస్థ ఒప్పందం చేసుకున్న పత్రాలపై మాత్రం తన అధికారిక పేరు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అనే సంతకం చేశారు. కానీ ఏపీలో కేవలం నిధులు కొల్లగొట్టడానికే అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల చేతుల్లో పావుగా మారి తన అధికారిక పేరు కాకుండా అలియాస్ పేరుతో సంతకం చేశారు. అవినీతి బాగోతంపై సీమెన్స్ దర్యాప్తు 2018లో కేంద్ర జీఎస్టీ అధికారుల తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్ వ్యవహారం బయటపడింది. దాంతో ఆ విషయాన్ని సీమెన్స్ సంస్థ యాజమాన్యానికి జీఎస్టీ అధికారులు తెలిపారు. దాంతో సీమెన్స్ కంపెనీ యాజమాన్యం ఈ వ్యవహారంపై అంతర్గతంగా దర్యాప్తు నిర్వహించింది. సౌమ్యాద్రి శేఖర్ బోస్ ఈ విషయం తెలుసుకుని ఏపీఎస్ఎస్డీసీతో సాగించిన లావాదేవీలకు సంబంధించిన ఈ మెయిల్స్, ఇతర రికార్డులను తమ కంప్యూటర్లలో డిలీట్ చేశారు. కానీ జర్మనీలోని సీమెన్స్ కంపెనీ యాజమాన్యం అత్యున్నత సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిలీట్ చేసిన ఈ మెయిల్స్, ఇతర ఫైళ్లను వెలికి తీసింది. దాంతో ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం పేరుతో అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టిన విషయం నిర్ధారణ అయ్యింది. తమ తప్పు రుజువు కావడంతో సౌమ్యాద్రి శేఖర్ బోస్‌తోపాటు ఆయన సన్నిహితులు సీమెన్స్ కంపెనీకి రాజీనామా చేశారు. ఆ విషయాన్ని సీమెన్స్ కంపెనీ యాజమాన్యం అప్పటి టీడీపీ ప్రభుత్వానికి తెలిపినప్పటికీ ఏ మాత్రం స్పందించ లేదు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో షెల్ కంపెనీల ముసుగులో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) నిధులు కొల్లగొట్టిన కేసులో అరెస్టుల పర్వానికి తెరలేచింది. రూ. 241 కోట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేటు కంపెనీలకు చెందిన ముగ్గురు ప్రతినిధులను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఖన్విల్కర్, ఢిల్లీకి చెందిన స్కిల్లర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అగర్వాల్, నోయిడాలో నివసిస్తున్న సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్‌లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అక్కడి న్యాయస్థానాల నుంచి ట్రాన్సిట్ వారంట్ పొంది విజయవాడ తీసుకువచ్చారు. ఆ ముగ్గురిని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. సోదాలు నిర్వహిస్తుండగా రాధాకృష్ణ హల్చల్ సీఐడీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దారి మళ్లింపు కేసు విచారణలో భాగంగా సీఐడీ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ కె.లక్ష్మీ నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా వేమూరి రాధాకృష్ణ అక్కడకు చేరుకుని హల్చల్ చేయడం వివాదాస్పదమైంది. ఆయన తన అనుచరులతో బయట సీఐడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. సీఐడీ సోదాల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయడం ఆపాలని, బయట అనుచరులను అదుపు చేయాలని సీఐడీ అధికారులు చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదు. దాంతో సీఐడీ అధికారులు తీవ్ర ఒత్తిడి మధ్యే పంచనామా పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ పంచనామాలోని అంశాలను త్వరగా న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉన్నందున సీఐడీ అధికారులు వెంటనే విజయవాడకు తిరిగి వచ్చేశారు. అనంతరం వేమూరి రాధాకృష్ణ తమ విధులకు ఆటంకం కలిగించిన విషయంపై విజయవాడలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో 353, 341, 186, 120(బి) సెక్షన్ల ద్వారా ఆయనపై జీరో ఎఫ్ఐఆర్ కింద ఆదివారం కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు. చదవండి: దోపిడీలో స్కిల్.. బాబు గ్యాంగ్ హల్'షెల్' -
AP: స్కిల్ డెవలప్మెంట్ కేసు: దూకుడు పెంచిన సీఐడీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో రూ.242 కోట్ల స్వాహాపై విచారణ చేపట్టింది. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని సీఐడీ విచారిస్తోంది. వీరిని వేర్వేరు ప్రాంతాల్లో విచారిస్తున్న సీఐడీ.. ఇవాళ అరెస్టు చూపించే అవకాశం ఉంది. చదవండి: దోపిడీలో స్కిల్.. బాబు గ్యాంగ్ హల్'షెల్' స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను అడ్డుపెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసులో అప్పటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎస్‌డీఈఐ కార్యదర్శికి ఓఎస్డీగా ఉన్న నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు, సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులతో సహా మొత్తం 26 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ‘ఏపీఎస్ఎస్డీసీ’లో అక్రమాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన పలువురు అధికారులతోపాటు పలు కంపెనీలపై రాష్ట్ర సీఐడీ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, పూణే, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ నివాసాల్లో తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లతో పాటు వారు డైరెక్టర్లుగా ఉన్న ఇతర సంస్థలకు సంబంధించిన ఆడిటింగ్ ఫైళ్లు, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. -
దోపిడీలో స్కిల్.. బాబు గ్యాంగ్ హల్'షెల్'
అధికారం అండగా గత ప్రభుత్వ పెద్దలు సాగించిన దోపిడీ పర్వంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ‘స్కిల్ డెవలప్మెంట్’ అంటూ ‘షెల్ కంపెనీ’లతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. తూతూ మంత్రంగా ఒప్పందం చేసుకుని పనులు చేయకుండానే బిల్లులు చెల్లించేశారు. ఆ విధంగా రూ.241 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఈ కుంభకోణంపై 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా, అప్పటి టీడీపీ ప్రభుత్వం స్పందించక పోగా, సంబంధిత ఫైళ్లను మాయం చేసింది. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను అడ్డుపెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా దోపిడీకి పాల్పడ్డారు. తాజాగా సీఐడీ అధికారుల దర్యాప్తులో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో అప్పటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎస్‌డీఈఐ కార్యదర్శికి ఓఎస్డీగా ఉన్న నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు, సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులతో సహా మొత్తం 26 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్న రాష్ట్ర సీఐడీ అధికారులను ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అడ్డుకోడానికి ప్రయత్నించడం విస్మయ పరిచింది. అవినీతికి పాల్పడ్డ వారి ఇళ్లల్లో అధికారులు దర్యాప్తు చేస్తుండగా వీరు అడ్డుకోవడానికి యత్నించడం చూస్తుంటే ఈ కుంభకోణంలో టీడీపీ పెద్దలు కీలకంగా వ్యవహరించారన్నది స్పష్టమైంది. సీఐడీ విస్తృత తనిఖీలు, నోటీసులు ‘ఏపీఎస్ఎస్డీసీ’లో అక్రమాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన పలువురు అధికారులతోపాటు పలు కంపెనీలపై రాష్ట్ర సీఐడీ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, పూణే, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ నివాసాల్లో తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లతో పాటు వారు డైరెక్టర్లుగా ఉన్న ఇతర సంస్థలకు సంబంధించిన ఆడిటింగ్ ఫైళ్లు, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. విజయవాడలో ఈ నెల 13న సీఐడీ ముందు విచారణకు హాజరు కావాలని గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏపీఎస్ఎస్డీసీ నిధులు కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషించిన ఢిల్లీ, ముంబాయి, పూణే తదితర నగరాల్లోని కంపెనీలు, షెల్ కంపెనీలలో కూడా తనిఖీలు నిర్వహించారు. సీఐడీ సోదాల సమయంలో లోబీపీతో పడిపోయిన లక్ష్మీనారాయణ. హడావుడి జీవో.. అందుకు విరుద్ధంగా ఒప్పందం 2014–19లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల ‘స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకోసం రూ.3,611.05 కోట్లతో సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలి. ఈ మేరకు 2017 జూన్ 30న జీవో 4ను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. కానీ జీవో 4కు విరుద్ధంగా ఒప్పందం చేసుకునేలా ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు మొత్తం కథ నడిపించారు. కేవలం రూ.100 స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు. అందులో తేదీ కూడా వేయలేదు. రూ.3,611.05 కోట్ల విలువ మేరకు కాంట్రాక్టును ఎలా నిర్ధారించారన్నదీ లేదు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు సమకూర్చాల్సిన 90 శాతం నిధులను ఏ విధంగా లెక్కించారన్నదీ చెప్పనే లేదు. సంబంధిత మొత్తం వేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారు. వైద్యం కోసం వస్తున్న డాక్టర్లు పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపు జీవో ప్రకారం 90 శాతం నిధులు వెచ్చించాలన్న విషయాన్ని సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు పట్టించుకోలేదు. అయినా సరే ప్రభుత్వం మాత్రం తన వాటాగా చెల్లించాల్సిన 10 శాతం నిధులను జీఎస్టీతో సహా మొత్తం రూ.371 కోట్లు చెల్లించేసింది. అసలు పనులు చేయకుండానే నిధులు ఎలా చెల్లిస్తారని అప్పటి ఆడిట్ అకౌంటెంట్ జనరల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించు కోలేదు. షెల్ కంపెనీల ద్వారా బాబు అస్మదీయులకు రూ.371 కోట్లను అడ్డగోలుగా కొల్లగొట్టడానికి అప్పటి సీఎం చంద్రబాబు సన్నిహితులు ‘షెల్ కంపెనీల’ను ముందే సృష్టించారు. ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అందుకోసం ఢిల్లీ కేంద్రంగా ‘స్కిల్లర్’ అనే షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీకి సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సరఫరా కోసం రూ.241 కోట్లకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించారు. ఆ ‘స్కిల్లర్’ కంపెనీ ముంబయిలోని ‘అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏఐసీ) అనే మరో షెల్ కంపెనీకి వర్క్ ఆర్డర్ ఇచ్చినట్టుగా కనికట్టు చేశారు. ఆ మేరకు ఏపీఎస్ఎస్డీసీకి సాఫ్ట్వేర్, హార్ట్‌వేర్ సరఫరా చేసినట్టుగా ఏసీఐ కంపెనీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించింది. ఢిల్లీకి చెందిన పాట్రిక్స్ ఇన్ఫో సర్వీసెస్, ఇన్‌వెబ్ ఇన్ఫో సర్వీసెస్, అరిహంట్ ట్రేడర్స్, జీఏ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే షెల్ కంపెనీలు తెరపైకి వచ్చాయి. ఒక్కో ఇన్వాయిస్కు 5 శాతం కమిషన్ చొప్పున దాదాపు 50 నకిలీ ఇన్వాయిస్లను సమర్పించింది. ఆ నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా రూ.241 కోట్లు ఏసీఐకి చెల్లించారు. దాన్నుంచి ఏసీఐ కంపెనీ తన 5 శాతం కమిషన్‌ను తగ్గించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఢిల్లీలోని డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించింది. అంటే పనులు చేయకుండానే ప్రభుత్వం చెల్లించిన మొత్తం రెండు షెల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబు సన్నిహితులకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి వచ్చి చేరింది. ఆ విధంగా ఏపీఎస్ఎస్డీసీ నిధులను పక్కా పన్నాగంతో కొల్లగొట్టారు. ఇలా గుట్టు రట్టు.. నోట్ ఫైళ్లు మాయం 2018లో పూణేలో పన్ను ఎగవేతకు పాల్పడుతున్న పలు కంపెనీలపై కేంద్ర జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించి దాదాపు 220 షెల్ కంపెనీల గుట్టు రట్టు చేశారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీ పనులను సబ్ కాంట్రాక్టుకు తీసుకున్నట్టు చూపించిన స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. ఆ కంపెనీల ప్రతినిధులను జీఎస్టీ అధికారులు విచారించగా.. తాము ఏపీఎస్ఎస్డీసీకి ఎలాంటి సాఫ్ట్‌వేర్‌గానీ హార్డ్‌వేర్‌గానీ సరఫరా చేయలేదని తెలిపారు. డిజైన్ టెక్ కంపెనీకి తాము షెల్ కంపెనీగా వ్యవహరించామని అంగీకరించారు. జీఎస్టీ అధికారులు ఈ విషయాన్ని తెలిపినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా పట్టించుకోలేదు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీలో పాత్రధారులు జాగ్రత్తపడ్డారు. సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో కాంట్రాక్టుకు సమ్మతించిన జీవో 4కు సంబంధించిన నోట్ ఫైళ్లను సచివాలయంలో మాయం చేశారు. ఏపీఎస్ఎస్డీసీలో కూడా సంబంధిత ఫైళ్లు గల్లంతు కావడం గమనార్హం. అక్కడా, ఇక్కడా ఆయనే.. అప్పటి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ఏపీఎస్ఎస్డీసీ నిధులు కొల్లగొట్టడంలో అన్నీ తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు అదే సమయంలో ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అప్పటి సీఎం చంద్రబాబుకు ఎక్స్అఫీషియో కార్యదర్శిగా వ్యవహరించారు. అంటే ఆయనే ప్రతిపాదిస్తారు.. ఆయనే ఆమోదిస్తారు.. సీఎంవోను కూడా ఆయనే పర్యవేక్షిస్తారు. దీనికి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మీ నారాయణ అన్ని విధాల సహకరిస్తారు. తదనంతరం వచ్చిన ఏపీఎస్ఎస్డీసీ ఎండీలు కూడా ఈ అడ్డగోలు వ్యవహారం గురించి తెలిసినప్పటికీ మౌనంగా ఉండటం విస్మయపరుస్తోంది. అరెస్టులకు రంగం సిద్ధం ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ అవినీతి బాగోతంలో కీలకంగా వ్యవహరించిన షెల్ కంపెనీల ప్రతినిధులు కొందరిని ఇతర రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకుని వారిని రాష్ట్రానికి తీసుకురానున్నారు. వారి నుంచి మరిన్ని వాస్తవాలను రాబట్టి ఈ కేసులో సూత్రధారుల అవినీతి బండారాన్ని నిరూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి 2014–19 మధ్య కాలంలో ఏపీఎస్ఎస్డీసీలో నిధులు దారి మళ్లినట్టు మేము గుర్తించాం. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా నిధులు దారిమళ్లిన విషయం నిర్ధారణ అయ్యింది. దాంతో మేము ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ కేసు సీఐడీకి అప్పగించింది. పూర్తి స్థాయిలో విచారించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – అజయ్ రెడ్డి, చైర్మన్, ఏపీఎస్ఎస్డీసీ హల్చల్ చేసిన రాధాకృష్ణ, పయ్యావుల – సీఐడీ అధికారుల తనఖీలను అడ్డుకునేందుకు యత్నం – దీటుగా బదులిచ్చిన సీఐడీ అధికారులు సాక్షి, హైదరాబాద్ : ఏపీఎస్‌ఎస్‌సీడీ నిధుల గోల్మాల్ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో పలువురు నిందితుల ఇళ్లల్లో ఏపీ సీఐడీ అధికారుల తనిఖీల సందర్భంగా ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హల్ చల్ చేశారు. ఏకంగా సీఐడీ అధికారులను అడ్డుకునేందుకు వారు యత్నించడం విస్మయ పరిచింది. తమ విధులు నిర్వహించకుండా రాధాకృష్ణ అడ్డుకోవడంపై సీఐడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ అధికారులు నిందితుడు లక్ష్మీ నారాయణ నివాసంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రాధాకృష్ణ అక్కడే ఉండటం గమనార్హం. విధి నిర్వహణలో ఉన్న సీఐడీ అధికారులను అడ్డుకోవడంతోపాటు ఏబీఎన్ చానల్ కెమెరామెన్లతో తనిఖీలను వీడియో తీయించడం వివాదాస్పదంగా మారింది. దర్యాప్తు అధికారులను బెదిరింపులకు గురిచేసేలా ప్రవర్తించిన రాధాకృష్ణ వ్యవహారంపై సీఐడీ ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. రాధాకృష్ణతో పాటు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా లక్ష్మీనారాయణ నివాసానికి కార్యకర్తలతో వచ్చి హడావుడి చేశారు. తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తనిఖీలు ఎలా చేస్తారని రాధాకృష్ణ, పయ్యావుల కేశవ్ ప్రశ్నించగా సీఐడీ అధికారులు దీటుగా బదులిచ్చారు. ఎఫ్ఐఆర్తో పాటు సోదాలకు సంబంధించిన ప్రోసీడింగ్ కాపీని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఒక రోజు ముందే అందించామన్నారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు స్పందించి తనిఖీల సమయంలో తమకు సహకరిస్తున్న విషయాన్ని తెలిపారు. దాంతో వేమూరి రాధాకృష్ణ, పయ్యావుల కేశవ్ మౌనంగా ఉండిపోయారు. సోదాలు నిర్వహించే సమయంలో స్వల్ప అస్వస్థత ఉందని లక్ష్మీనారాయణ చెప్పడంతో పోలీసులు ఆయన్ను బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గంటా సుబ్బారావు ఇంట్లో సీఐడీ సోదాలు షాబాద్: ఏపీఎస్‌ఎస్‌సీడీ నిధుల గోల్మాల్ కేసుకు సంబంధించి నిందితుడైన గంటా సుబ్బారావు ఇంట్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆయన 34 ఎకరాల భూమిని కొనుగోలు చేసి.. వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకొని ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈయన ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. -
మాజీ ఐఏఎస్ ఇంట్లో సోదాలు..అధికారుల్ని అడ్డుకున్న ఏబీఎన్ రాధాకృష్ణ!
సాక్షి, హైదరాబాద్: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఏపీ సీఐడీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దీనిలో భాగంగానే.. మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ శుక్రవారం సోదాలు నిర్వహించారు. కాగా, గతంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సలహాదారుగా పనిచేశారు. తన పదవీ కాలంలో యువకులకు శిక్షణనిచ్చే క్రమంలో.. లక్ష్మినారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని పలు అభియోగాలు నమోదయ్యాయి. లక్ష్మినారాయణ మాజీ సీఎం చంద్రబాబు దగ్గర సీఎస్‌గా పనిచేశారు. లక్ష్మినారాయణ రూ. 242 కోట్ల నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయ్యింది. సోదాలో భాగంగా.. ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మినారాయణ ఇంట్లో వెళ్లినప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో రాధాకృష్ణ, లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులు ఏపీ సీఐడీ అధికారులను ఇంట్లో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం.. అధికారులు మాజీ ఐఏఎస్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి -
అప్పుడు ఓకే.. ఇప్పుడు నాట్ ఓకే
సాక్షి, హైదరాబాద్: బోధన్ కుంభకోణంలో ఆరోపణలెదుర్కొంటున్న మొత్తం 42 మంది అధికారులు, సిబ్బందిని తాము విచారించాలని చెబుతూ సీఐడీ అధికారులు ఇటీవల వాణిజ్య పన్నుల విభాగం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ లేఖకు ముందు ఆరోపణలెదుర్కొంటున్న అధికారుల పే రోల్స్‌కు సంబంధించిన వివరాలివ్వాలని సీఐడీ ఐదుసార్లు లేఖలు రాసినా పెద్దగా స్పందన రాలేదు. కాగా 2017 నుంచి పురోగతి లేని కేసు మళ్లీ తెరమీదకు రావడంతో వారంతా ప్రభుత్వంలో తమకు వత్తాసు పలుకుతున్న కీలక ఉన్నతాధికారిని ఆశ్రయించారు. దీంతో ఆయన తాను చెప్పినా వినకుండా దర్యాప్తులో దూకుడు పెంచడం ఏంటని సీఐడీపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఇకపై ఈ కేసులో ఎలాంటి విచారణలు,. అరెస్టులు అవసరం లేదని, ఇప్పటివరకు అరెస్టయిన వారిపై చార్జిషీట్ దాఖలు చేసుకోవాలంటూ సలహాలు ఇచ్చినట్టుగా వాణిజ్య పన్నుల శాఖ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఈ అధికారి మొదట్లో దర్యాప్తుకు బాగా సహకరించారని, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదని సీఐడీ అంటోంది. నిందితులు ఎంతటివారైనా అరెస్టు చేయాల్సిందేనని ప్రభుత్వం పదే పదే చెప్తుంటే.. సంబంధిత అధికారి దర్యాప్తును అడ్డుకోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్లు అప్పగించని అధికారులు ప్రతి మూడు నెలలకోసారి, ఆరునెలలకోసారి బోధన్ సర్కిల్ కార్యాలయంలో వ్యాపారులు, వాణిజ్య సంస్థలు చెల్లించినట్టు సృష్టించిన నకిలీ చలాన్ల విషయమై సీఐడీ నివేదిక అందినట్టు తెలిసింది. మొత్తంగా 70 శాతం మేర నకిలీ చలాన్లు సృష్టించినట్టు రిపోర్ట్ రావడంతో, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల లాగిన్ వివరాలు, పన్ను చెల్లింపు వివరాలు, వ్యాపారుల పేర్లతో అప్లోడ్ చేసిన వారిని విచారించేందుకు వీలుగా సర్వర్లను తమకు అప్పగించాలని సీఐడీ కోరినా వాణిజ్య పన్నుల శాఖ స్పందించడం లేదని దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఇస్తే తాము కూడా దొరికిపోతామని సంబంధిత అధికారులు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కీలక సూత్రధారులుగా ఉన్న వారి డేటా డిలిట్ చేసే అవకాశం ఉందని, అదే జరిగితే కుంభకోణాన్ని బయటపెట్టేందుకు కీలకంగా ఉన్న సాంకేతిక ఆధారాలు సేకరించడం కష్టసాధ్యమవుతుందని దర్యాప్తు విభాగం కలవరపడుతోంది. ఇదీ కుంభకోణం.. నిందితులు రెండురకాల పద్ధతుల్లో కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించారు. బోధన్ సర్కిల్లోని వ్యాపారుల నుంచి పన్ను సంబంధిత సొమ్ము వసూలు చేసిన కన్సల్టెంట్ శివరాజు పన్ను చెల్లించిన వ్యాపారుల పేరిట సగం పన్నే జమ చేశాడు. మిగతా సొమ్ము నొక్కేశాడు. అయితే వ్యాపారులు మొత్తం పన్ను చెల్లించినట్టుగా నకిలీ చలాన్లు సృష్టించి ఇచ్చాడు. అంతే మొత్తానికి అధికారులతో కుమ్మక్కై వ్యాట్ పోర్టల్‌లో అప్లోడ్ చేసినట్టుగా సీఐడీ గుర్తించింది. మరోవైపు వ్యాపారులు చెల్లించాల్సిన పన్నులో సగం మాత్రమే వసూలు చేసి మొత్తం సొమ్ము చెల్లించినట్టుగా నకిలీ చలాన్లతో పోర్టల్‌లో అప్లోడ్ చేశాడు. వ్యాపారులు చెల్లించాల్సిన మిగతా పన్నులో ఎంతో కొంత వసూలు చేసుకుని తన జేబులతో పాటు అధికారుల జేబులు నింపాడు. ఇలా మొత్తంగా రూ.275 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్టు సీఐడీ అంచనా వేసింది. -
భూస్వాహా పాత్రలపై సీ‘ఐ’డీ
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ వీఆర్వో మోహన్‌గణేష్ పిళ్లై భూబకాసుర అవతారం వెనుక పలువురి హస్తం ఉన్నట్లు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన వేల ఎకరాల కుంభకోణంలో కొందరు రెవెన్యూ ఉద్యోగుల పాత్ర సైతం ఉన్నట్లు భావిస్తున్నారు. రూ.500 కోట్ల భూబాగోతంలోని కుట్ర కోణం వెలికితీసేందుకు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు. రికార్డుల ట్యాంపరింగ్‌లో కీలక భూమిక పోషించిన కలెక్టరేట్ సిబ్బందిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకుని అక్రమ విక్రయాలకు తెరతీసిన మాజీ వీఆర్వో, టీడీపీ నేత అడవి రమణ లీలలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకువచ్చే దిశగా ముందుకు సాగుతున్నారు. ఒకే సర్వే నంబర్.. పలు విస్తీర్ణాల్లో భూములు సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె సర్వే నంబర్ 459లో 10.99 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రెవెన్యూ భూ రికార్డుల్లో నమోదైంది. ఈ భూమి కూడా గుట్ట పోరంబోకు. మోహన్‌గణేష్ పిళ్లై అదే సర్వే నంబర్లో 160 ఎకరాలకుపైగా ఉన్నట్లు నమోదు చేశారు. మరో రికార్డులో అదే సర్వే నంబర్లో 45 ఎకరాలు ఉన్నట్లు ఉంది. నిషేధిత జాబితాలో 300 ఎకరాలు ఉన్నట్లు నమోదైంది. నిషేధిత జాబితాలో అదే సర్వే నంబర్లో 300 ఎకరాలు ఉన్నట్లు చూపుతున్న రికార్డు వెలుగులోకి అక్రమ విక్రయం నకిలీ రికార్డులు సృష్టించి కాజేసిన ప్రభుత్వ, అటవీ భూములను అమ్మి సొమ్ము చేసుకునేందుకు పిళ్లై అండ్ కో ప్రయత్నించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. కొన్ని భూములకు సంబంధించి డాక్యుమెంట్లను మీ సేవ ద్వారా తీసుకుని, వాటికి నకిలీ పత్రాలను జతపరిచి టీడీపీ నేత అడవి రమణ ద్వారా విక్రయించేందుకు పిళ్లై సన్నాహాలు చేసినట్లు గుర్తించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలానికి చెందిన నాగమోహన్‌రెడ్డి అనే వ్యక్తిని బుట్టలో వేసుకుని తాము కాజేసిన భూములను అమ్మేందుకు రూ.55.60 లక్షలు తీసుకున్నట్లు ధ్రువీకరించుకున్నారు. ఈ మేరకు రాసుకున్న అగ్రిమెంట్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు. మరోవైపు టీడీపీ నేత అడవి రమణ చౌడేపల్లె మండలం చారాల గ్రామంలో రైతులకుæ కమ్యూనిటీ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద పంపిణీచేసిన భూముల్లో 35 ఎకరాలను, సీజేఎఫ్ఎస్ కాలనీకి కేటాయించిన 9 ఎకరాలను కబ్జా చేశాడని బాధితులు సోమవారం చౌడేపల్లె తహసీల్దార్ మాధవరాజుకు ఫిర్యాదు చేశారు. -
ఏపీ ఫైబర్‌నెట్ కేసు: రెండో రోజు సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ కేసును బుధవారం రెండో రోజు సీఐడీ విచారణ చేపట్టింది. రెండో రోజు సీఐడీ విచారణకు వేమూరి హరిప్రసాద్ హాజరయ్యారు. నిన్న(మంగళవారం) వేమూరితో పాటు ఇన్ కాప్ మాజీ ఎండి సాంబశివరావుని కూడా సీఐడీ విచారించింది. నోటీసులు అందుకున్న ముగ్గురిలో నిన్న ఇద్దరు విచారణకు హాజరయ్యారు. సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదు ఫైబర్ నెట్ కుంభకోణంలో A-1 వేమూరి హరిప్రసాద్, ఎ-2 మాజీ ఎండి సాంబశివరావు.. టెర్రా సాఫ్ట్‌కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడంపై సీఐడీ ప్రశ్నించింది. ఫైబర్ నెట్ కుంభకోణంపై సీఐడీ మొత్తం19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మిగిలిన నిందితులకి సీఐడీ నోటీసులు జారీ చేయనుంది. -
ఫైబర్ నెట్ కుంభకోణం: 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ
-
ఫైబర్‌నెట్ కేసులో ముగ్గురికి నోటీసులు
-
ఏపీ ఫైబర్‌నెట్ కేసు: ముగ్గురికి సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: ఫైబర్‌నెట్ కుంభకోణంపై విచారణను సీఐడీ వేగవంతం చేసింది. ఫైబర్‌నెట్ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసిన సీఐడీ.. నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వేమూరి హరిప్రసాద్, సాంబశివరావు, గోపీచంద్‌కు నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్లో రూ.320 కోట్లకి టెండర్లు పిలిస్తే 121 కోట్ల అవినీతి జరిగినట్లు సీఐడీ గుర్తించింది. టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలకి పాల్పడ్డారు. (చదవండి: ఫైబర్‌నెట్ అక్రమార్కులకు శిక్ష తప్పదు) బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌ని రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. టెండర్లలో పాల్గొనేందుకు టెండర్ గడువుని వారం రోజులు పొడిగించారు. ఈ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చదవండి: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు -
లేని భూమిని అమ్మేశారు.. అసలు భూమిని కొట్టేశారు
కోడుమూరు: అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ నాయకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో ఆ సంస్థకు కొంత భూమిని అమ్మారు. అమ్మిన భూమికి కూడా తిరిగి తమ కుటుంబ సభ్యుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ తంతు వెనుక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రధాన అనుచరుడు దామోదర్ నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారు. సీఐడీ అధికారుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో సర్వే నంబర్ 113లో ఉన్న 8.24 ఎకరాల భూమిని దామోదర్ నాయుడు సోదరులు వెంకటయ్య, నారాయణ గతంలో అగ్రి గోల్డ్ సంస్థకు విక్రయించారు. ఇది సాగులో ఉన్న భూమి కావడంతో రెవెన్యూ అధికారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని దామోదర్ నాయుడు భార్య వరలక్ష్మి, వెంకటయ్య భార్య రంగమ్మకు తిరిగి బదలాయించుకున్నారు. అలాగే సర్వే నంబర్ 146/1 రెవెన్యూ రికార్డుల్లో లేకున్నా.. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకం సృష్టించి 6.95 ఎకరాల భూమిని దామోదర్ నాయుడు అగ్రి గోల్డ్ సంస్థకు విక్రయించారు. 149బీ, 80/1, 40/2, 40, 33/7, 25/9, 84ఏ సర్వే నంబర్లలో దామోదర్ నాయుడు సమీప బంధువులు రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ, నాగేశ్వరరావు, లక్ష్మమ్మ, పుల్లయ్య, పార్వతమ్మలకు భూములు లేకపోయినా నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాల ద్వారా 21.4 ఎకరాలను అగ్రి గోల్డ్ సంస్థకు అమ్మారు. బయటపడుతున్న అక్రమాలు అగ్రి గోల్డ్ కొనుగోలు చేసిన భూముల్లో భారీ ఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి. రెవెన్యూ రికార్డులు తారుమారు కావడంతో వాటి మూలాలను వెలికి తీసేందుకు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల్ని పరిశీలించి అవకతవకలను గుర్తించారు. 40/2 సర్వే నంబర్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తి విస్తీర్ణం 2.72 ఎకరాలుండగా.. 10.61 ఎకరాలున్నట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలా రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లను సృష్టించి నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్ చేయించి భూములు అమ్మినట్టు సీఐడీ అధికారుల విచారణలో బయటపడింది. వారం పది రోజుల్లో పూర్తి నివేదికను సీఐడీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం. రికార్డులు తారుమారు రెవెన్యూ అధికారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని దామోదర్ నాయుడు కుటుంబ సభ్యులు రికార్డులను తారుమారు చేశారు. ప్రస్తుతం కృష్ణగిరి గ్రామ సర్పంచ్ వరలక్ష్మి (దామోదర్ నాయుడు భార్య) పేరిట సర్వే నంబర్ 113లో గల 4.12 ఎకరాల భూమిని గతంలోనే దామోదర్ నాయుడు అగ్రి గోల్డ్‌కు విక్రయించారు. అలాగే సర్వే నంబర్ 95లో రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ, వెంకటలక్ష్మికి ఉన్న 4.57 ఎకరాల భూమిని అగ్రి గోల్డ్‌కు అమ్మారు. అదే భూమిని వారి కుటుంబ సభ్యులు హరిబాబు, జయరాముడు, వెంకటయ్య పేర్ల మీద బదలాయించుకున్నారు. సర్వే నంబర్లు 123/1ఏ, 123/2ఏ, 123/3ఏ, 141/1, 121/2సీ, 121/1బీ, 113, 93, 92/ఏ2, 76, 68/ఏ, 64/2, 64/ఏ, 54/2, 48/5, 5/4,5,7, 144/1,2, 145/ఏ, 2సీ, 133/2, 3, 149/బీ1, 146/1బీ, 95లలో ఉన్న 126.56 ఎకరాల భూమిని గతంలో అగ్రి గోల్డ్‌కు అమ్మారు. మా దృష్టికి రాలేదు అగ్రి గోల్డ్ సంస్థ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు తారుమారైనట్టు మా దృష్టికి రాలేదు. ఏడాది క్రితమే నేను కృష్ణగిరి తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నాను. రికార్డుల మార్పులు, చేర్పులపై సీఐడీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. – రామచంద్రారావు, తహసీల్దార్, కృష్ణగిరి -
2018లో బాడీగార్డు మృతి.. బీజేపీ నేత సువేందుకు సమన్లు
కోల్‌కతా: పశి్చమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారికి రాష్ట్ర సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. సువేందుకు బాడీగార్డుగా పని చేసిన సబ్ ఇన్స్పెక్టర్ సుభభ్రత చక్రవర్తి మరణానికి సంబంధించిన కేసులో ఆయనకు సీఐడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని భవాని భనవ్ సీఐడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా చెప్పింది. 2018లో బాడీగార్డు చక్రవర్తి మరణించారు. తుపాకీతో తనకు తానే కాల్చుకొని మరణించినట్లు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఏడాది జూలైలో తన భర్త కేసును మళ్లీ దర్యాప్తు చేయాల్సిందిగా చక్రవర్తి భార్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో కేసు సీఐడీ చేతికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సువేందు అధికారికి సీఐడీ సమన్లు జారీ చేసింది. (చదవండి: వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ) -
అభ్యంతరకర పోస్టులపై యువకుడిని ప్రశ్నించిన సీఐడీ
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుమార్తెను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకుడు గనిపినేని సాయికిరణ్‌ను సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. ప్రకాశం జిల్లా దసరాజుపల్లికి చెందిన అతను ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సీఐడీ అధికారులు దీనిపై సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్ ప్రకారం సాయికిరణ్‌కు నోటీసులిచ్చి, గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి పిలిపించారు. సీఎం కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులపై ప్రశ్నించారు. రెండ్రోజుల కిందట గుంటూరుకు చెందిన చేరెడ్డి జనార్దన్‌రావునూ సీఐడీ విచారించిన విషయం తెలిసిందే. -
ఎంపీ రఘురామ విడుదల వాయిదా
సాక్షి, గుంటూరు: ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదల మరో నాలుగు రోజుల పాటు వాయిదా పడింది. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు 21వ తేదీన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందడానికి అవసరమైన పత్రాలు, ష్యూరిటీ బాండ్లను రఘురామకృష్ణ తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ గుంటూరు సీఐడీ కోర్టులో సోమవారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై మెజిస్ట్రేట్ ఆరా తీశారు. మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో ఎంపీకి చికిత్స అవసరమని వైద్యులు సూచించారని న్యాయవాదులు మెజిస్ట్రేట్‌కు చెప్పారు. ఎంపీ ఆరోగ్యం కుదుటపడ్డాక డిశ్చార్జి సమ్మరీతో కలిపి బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని మెజిస్ట్రే ట్ ఆదేశించారు. దీంతో రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా పడింది. -
రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం కోర్టు ధిక్కారమే
సాక్షి, అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గాయాల పరిశీలన నిమిత్తం రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ ఈ నెల 15న తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదంటూ సీఐడీపై హైకోర్టు మండిపడింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమేనంటూ సీఐడీ అదనపు డీజీ, సీఐడీ మంగళగిరి ఎస్‌హెచ్‌వోలపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు (జ్యుడీషియల్) సూచించింది. రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించి 15వ తేదీ మధ్యాహ్నం కల్లా నివేదిక అందచేయాలన్న తమ ఆదేశాల అమల్లో జాప్యంపై వివరణ ఇవ్వాలని మెడికల్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించిన గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తూ కేసును జూన్ 16కి వాయిదా వేసింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైనవి.. సుప్రీకోర్టులో విచారణ జరిగి... సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామరాజును తరలించిన నేపథ్యంలో హైకోర్టు తాజా ఉత్తర్వుల పట్ల అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. రమేశ్ ఆస్పత్రికి పంపాలన్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని, ఇవి అమలు చేయడానికి వీల్లేని విధంగా ఉన్నాయని చెప్పారు. వీటిని అమలు చేయాలని అధికరణ 226 కింద హైకోర్టు ఆదేశాలివ్వడం సరికాదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 54ను ఓసారి చూడాలని, దాన్ని చదివితే మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఎలా చట్టవిరుద్ధమో అర్థమవుతుందని నివేదించారు. దాంతో తమకు సంబంధం లేదని, తమ ఉత్తర్వులను అమలు చేశారా? లేదా? అన్నది మాత్రమే చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైతే వాటిని హైకోర్టులో సవాల్ చేసుకోవాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘‘మేం ఇప్పటికే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేశాం’’ అని సుధాకర్‌రెడ్డి వివరించారు. రఘురామకృష్ణరాజును రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలంటూ 15న మేం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం మళ్లీ ప్రశ్నించింది. ‘‘రాత్రి 12 గంటలకు ఆదేశాలిస్తే వాటిని అమలు చేయడం ఎలా సాధ్యం?’’ అని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పందిస్తూ.. తమ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. మీరేం చెప్పాలనుకున్నా కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ సమయంలో చెప్పుకోండని ఆమె తేల్చి చెప్పారు. కోర్టు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, తాను చెప్పే విషయాలను నమోదు చేయాలని సుధాకర్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. ఆ అవసరం లేదని న్యాయమూర్తి జస్టిస్ లలిత తెలపగా... తన వాదనలు వినేందుకు సిద్ధంగా లేకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోతానని సుధాకరరెడ్డి చెప్పారు. తన వాదనలు విననప్పుడు తాను ప్రభుత్వం తరఫున హాజరవడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు. ఇదేదో ప్రత్యేక కేసు అన్నట్టు వ్యవహరించడం సరికాదు న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పందిస్తూ.. తామిచ్చిన ఉత్తర్వులను తప్పని చెప్పే అధికారం మీకు లేదంటూ సుధాకర్‌రెడ్డికి స్పష్టం చేశారు. ‘మేం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పే హక్కు మాకు ఉంది’ అని తేల్చి చెప్పారు. ‘‘ఉదయం 10.30 గంటలకే సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ మొదలుపెట్టింది. అలాంటప్పుడు చట్టవిరుద్ధమైన మేజిస్ట్రేట్ ఉత్తర్వులను మేమెలా అమలు చేయగలం? పైపెచ్చు అంత రాత్రి మేం వెళ్లి జైలుగేట్లు తెరవలేం కదా? ఇదో ప్రత్యేక కేసు అన్నట్లు కనిపించేలా ఈ కోర్టు వ్యవహరించకూడదు. చట్టం ముందు అందరూ సమానమే. రాజ్యాంగంలోని అధికరణను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని సుధాకరరెడ్డి నివేదించారు. అయినా ఈ కేసులో అంత ప్రత్యేక ఆసక్తి ఏముందన్నారు. ఈ సమయంలో జస్టిస్ లలిత తీవ్రంగా స్పందించారు. కంట్రోల్లో ఉండి మాట్లాడాలని సుధాకర్‌రెడ్డికి సూచించారు. -
అసలు కుట్ర బయటపడకుండా పక్కదోవ పట్టించేందుకే?!
సాక్షి, అమరావతి: చేసింది ఘోరమైన తప్పిదం. కులాల మధ్య చిచ్చు పెట్టేలా... మతాల మధ్య ఘర్షణలు రేకెత్తించేలా పనిగట్టుకుని మరీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విషం చిమ్మి.. అస్థిరత పెంచేందుకు కుట్ర చేశారు. ఎల్లో మీడియా అండతో... చంద్రబాబు నాయుడు వంటి నేతల మద్దతు చూసుకుని రెచ్చిపోయారు. చివరికి వీటిపై సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేసేసరికి... అసలు విషయాన్ని పక్క దోవ పట్టించడానికి, కుట్రదారులు తెరపైకి రాకుండా చూడటానికి కొత్త కథను అల్లటం మొదలెట్టారు. తనను కస్టడీలో పోలీసులు ముసుగు వేసుకుని వచ్చి మరీ కొట్టారంటూ నమ్మలేని వాదన మొదలుపెట్టారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆడుతున్న ఈ డ్రామాపై ఆయన నియోజకవర్గ ప్రజలు, గతంలో ఆయనకు మద్దతిచ్చిన స్థానిక నాయకులు సైతం విస్తుపోతున్నారు. బెయిలు పిటిషన్ తిరస్కరించటంతో...! నిజానికి రాజకీయ ప్రత్యర్థులైనా సరే... కస్టడీలో ఉన్న నాయకులను పోలీసులు కొట్టడమనేది సాధారణంగా జరగదు. పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నించటం... తరవాత కోర్టులో హాజరు పరచటం... అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించటమనేది చట్టప్రకారం జరిగే ప్రక్రియ. ఇటీవల ఈఎస్ఐ కుంభకోణంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. సంగం డెయిరీకి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో భూములు కొట్టేసిన వ్యవహారంలో అరెస్టయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. అయితే వీళ్లెవరూ తమను పోలీసులు కస్టడీలో కొట్టారంటూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రఘురామకృష్ణంరాజు కూడా శనివారం మధ్యాహ్నం హైకోర్టు తన బెయిలు పిటిషన్‌ను తిరస్కరించేదాకా తనను కొట్టారనే ఆరోపణ చేయనేలేదు. తన బెయిలు పిటిషన్లో కూడా దీన్ని ప్రస్తావించలేదు. ఒకవేళ కొట్టి ఉంటే బెయిలు పిటిషన్లో దాన్నే ప్రధానంగా ప్రస్తావించి ఉండేవారనేది న్యాయ నిపుణుల మాట. అంతేకాదు!! అక్కడికి వచ్చిన తన కుటుంబ సభ్యులతోనూ ఆయన మాట్లాడారు. తదనంతరం మీడియాతో మాట్లాడిన రఘురామరాజు కుమారుడు భరత్ కూడా తన తండ్రిని కొట్టారని ఎక్కడా చెప్పలేదు. అయితే హైకోర్టు బెయిలును తిరస్కరించి... దిగువ కోర్టుకు వెళ్లమనేసరికి టీడీపీ పెద్దలు, ఎల్లో మీడియా సూత్రధారుల సూచన మేరకు ఈ కొట్టడం అనే కథ అల్లారని, దిగువ కోర్టులో వేసిన పిటిషన్లో దాన్నే ప్రధానంగా ప్రస్తావించటంతో పాటు... అప్పటికప్పుడు హడావుడిగా హైకోర్టుకు మళ్లీ లేఖ రాశారని విశ్వసనీయ సమాచారం. ఇదంతా టీడీపీ ముఖ్య నేత సూచన మేరకే జరిగిందని, రఘురామరాజు కస్టడీలో ఉంటే కుట్రదారులందరి పేర్లూ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కనక తానూ బయటపడతాననే భయంతోనే ఆ ముఖ్యనేత ఈ డ్రామా నడిపించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి జనంలో సానుభూతి పొందవచ్చన్నది వారి ఉద్దేశమని, దానికి తగ్గట్టే రఘురామరాజు జీవించేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాళ్లు ఎందుకు రంగు మారాయంటే... తనను అరికాళ్లపై కర్రతో, రబ్బరు తాడుతో కొట్టారని రఘురామరాజు దిగువ కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఎల్లో మీడియా దాన్ని చిలవలు పలవలు చేసి... ఆ అరికాళ్ల ఫోటోలను పతాక శీర్షికల్లో ప్రచురించింది. అవే ఫోటోలను తెలుగుదేశం పార్టీ ఆదివారం వైరల్ చేసింది కూడా. అయితే ఇదంతా కట్టు కథేనని, ఆయనకు ఎలాంటి గాయాలూ లేవని హైకోర్టు నియమించిన వైద్యుల కమిటీ ఆదివారం తేల్చటంతో ఎల్లో మీడియాకిపుడు ఎటూ పాలుపోవటం లేదు. ఎడెమా (వాపు) వల్ల ఆయన కాళ్లు అలా అయ్యాయని వైద్య నిపుణుల నివేదికలో పేర్కొన్నట్లు న్యాయమూర్తులు చదివి వినిపించారు కూడా. సూక్ష్మనాళాలు గనక దెబ్బతిని నీరు కాళ్లలోకి చేరితే సహజంగా ఈ ఎడెమా వస్తుంటుంది. కాళ్లు స్వల్పంగా వాచి నీరు చేరి ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఎక్కువసేపు నిల్చున్నా... అదేపనిగా కూర్చున్నా ఇలా జరగటం సహజమని కూడా నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. రఘురామరాజు షుగర్ వ్యాధిగ్రస్తుడు కనక ఇది సహజమేనన్నది వైద్యుల మాట. ఈ వాస్తవాలను పక్కనబెట్టి అప్పటికప్పుడు అల్లిన కథను మరింతగా ప్రచారం చేయటానికి ఎల్లో మీడియా నానాపాట్లూ పడుతుండటం తెలిసిందే. చంద్రబాబు సైతం గవర్నర్‌కు, రాష్ట్రపతికి లేఖల పేరిట హడావిడి మొదలెట్టారు. ఇదంతా తమ పాత్రలు బయటకు వస్తాయనే భయంతోనే వారు చేస్తున్నారని, రఘురామరాజు కస్టడీ కొనసాగితే విచారణలో తప్పకుండా సూత్రధారులంతా బయటపడతారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
ఒంటిపై గాయాలేవీ లేవు
సాక్షి, అమరావతి: వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడటంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు తనను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు తనను కస్టడీలో తీవ్రంగా కొట్టారంటూ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని హైకోర్టు ఏర్పాటు చేసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ నేతృత్వంలోని మెడికల్ బోర్డు ఆదివారం హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చింది. గాయాలున్నాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంది. కాళ్లలో నీరు చేరిందని (ఎడెమా), అందుకే కాళ్లు రంగు మారి కనిపిస్తున్నాయని హైకోర్టుకు వివరించింది. ఎక్కువ సేపు కూర్చున్నా, ప్రయాణించినా కాళ్లు రంగుమారుతాయని చెప్పింది. 2020 నవంబర్ 30న తనకు బైపాస్ సర్జరీ అయిందని, గుండె నొప్పిగా ఉందని రఘురామ చెప్పడంతో వెంటనే కార్డియాలజిస్ట్‌ను పిలిపించామంది. కార్డియాలజిస్ట్ పరిశీలించి, ప్రస్తుతం గుండెకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారని మెడికల్ బోర్డు తన నివేదికలో పేర్కొంది. న్యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యులు సైతం రఘురామ ఆరోగ్యం స్థిరంగా ఉందనే చెప్పారని బోర్డు తన నివేదికలో వివరించింది. కొట్టడం వల్ల ఎలాంటి గాయాలు కాలేదని బోర్డు తన నివేదికలో తేల్చి చెప్పింది. ఆయనకు కలర్ డాప్లర్, ఈసీజీ, రక్త పరీక్షలన్నీ చేశామని, అన్నీ పరీక్షల ఫలితాలు సాధారణ స్థితిలో ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు మెడికల్ బోర్డు నివేదికను హైకోర్టు న్యాయమూర్తులు చదివి వినిపించారు. బోర్డు చైర్మన్ అయిన జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో సహా మిగిలిన డాక్టర్లు కూడా వేర్వేరుగా ఒక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపింది. ఈ నివేదికను హైకోర్టు రిజిస్ట్రీ నుంచి పొందే వెసులుబాటును ఇరుపక్షాలకు ఇచ్చింది. రమేశ్ ఆస్పత్రికి పంపలేం.. మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకు రఘురామను గాయాల పరిశీలన నిమిత్తం రమేశ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీనిపై సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రమేశ్ ఆస్పత్రికి పంపడం అంటే టీడీపీ ఆఫీసుకి పంపడమేనన్నారు. అగ్ని ప్రమాదం వల్ల పలువురు కోవిడ్ రోగులు మృతి చెందడానికి కారణమైన రమేశ్ ఆస్పత్రిపై రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసిందని ఆయన వివరించారు. దీంతో రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వంపై కక్ష కట్టి ఉందని, అందువల్ల ఆ ఆస్పత్రికి పంపడానికి తమకు అభ్యంతరం ఉందని తెలిపారు. రమేశ్ ఆసుపత్రికి పంపితే నిష్పాక్షిక నివేదిక వచ్చే అవకాశం ఉండదన్నారు. అంతేకాక రఘురామ గాయాల పరిశీలనకు హైకోర్టు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన్ను రమేశ్ ఆసుపత్రికి పంపాలన్న ఉత్తర్వులను సవరించాలని కోరుతూ మేజిస్ట్రేట్ ముందు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఆయన్ను రమేశ్ ఆస్పత్రికి పంపాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై దర్మాసనం స్పందిస్తూ ఆ ఉత్తర్వులను సవాలు చేయడం గానీ, వాటిపై స్టే గానీ లేనందున, అవి అమల్లో ఉన్నాయని తెలిపింది. అందువల్ల వాటిని అమలు చేయాల్సిందేనని సీఐడీ అధికారులకు తేల్చి చెప్పింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల అమలును రేపటి వరకైనా నిలుపుదల చేయాలని పొన్నవోలు కోరగా, ధర్మాసనం ఆ అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రఘురామను రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఆదివారం రాత్రి ఉత్తర్వులిస్తూ తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లమంటే జైలుకు తీసుకెళ్లారు.. ► అంతకు ముందు రఘురామకృష్ణరాజు తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, తనను కొట్టారన్న రఘురామ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన మేజిస్ట్రేట్ అతన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రితో పాటు రమేశ్ ఆసుపత్రికి సైతం తీసుకెళ్లాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ► అయితే ఈ ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు రఘురామను జైలుకు తరలించారని చెప్పారు. హైకోర్టు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదని పోలీసులు చెబుతున్నారన్నారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల కంటే హైకోర్టు ఉత్తర్వులే అమల్లో ఉంటాయని వక్రభాష్యం చెబుతున్నారని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో ఏపీ సీఐడీ ఆయన్ను అరెస్టు చేసిన విషయం విదితమే. బెయిలు కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఆయనకు అక్కడ చుక్కెదురైంది. దీంతో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. బెయిల్ కారణాలను హైకోర్టు పరిశీలించలేదని, సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని సూచించిందని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు తనను కొట్టారంటూ పిటిషన్లో ఆరోపించారు. ఆ ఉత్తర్వులను సవరిస్తామని మేజిస్ట్రేట్ చెప్పారు.. ► దీనిపై ఏం చెబుతారని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆ విషయాన్ని రాత్రి 8.30 గంటల సమయంలో మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మేజిస్ట్రేట్ హైకోర్టు ఉత్తర్వుల కాపీ కావాలని కోరడంతో, హైకోర్టు ఉత్తర్వుల అధికారిక కాపీని ఆదివారం ఉదయం పంపామన్నారు. ఆ ఉత్తర్వులను చూసి రఘురామను రమేశ్ ఆసుపత్రికి పంపాలన్న ఉత్తర్వులను సవరిస్తామని మేజిస్ట్రేట్ చెప్పారని తెలిపారు. సవరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు. ► జస్టిస్ లలిత స్పందిస్తూ, ఉత్తర్వులను మేజిస్ట్రేట్ సవరిస్తారన్న ఊహతో రఘురామను ఎలా జైలుకు తరలిస్తారని ప్రశ్నించారు. ఆ ఉత్తర్వులపై సందిగ్ధత ఉంటే తమ దృష్టికి ఆ విషయాన్ని తీసుకొచ్చి స్పష్టత తీసుకుని ఉండాల్సిందన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా నివేదిక ఇవ్వాలని మెడికల్ బోర్డును ఆదేశిస్తే, సాయంత్రం ఎప్పుడో నివేదిక వచ్చిందని, నివేదిక ఆలస్యం అవుతుందన్న కనీస సమాచారం కోర్టుకు ఇవ్వకపోవడం ఏమిటని జస్టిస్ లలిత ప్రశ్నించారు. జైలుకు తీసుకెళ్లడంపై నిషేధం లేదు ► పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ, మెడికల్ బోర్డును తాము సంప్రదించే పరిస్థితి లేదన్నారు. మెడికల్ బోర్డు నివేదిక ఎందుకు ఆలస్యం అయిందో తమకెలా తెలుస్తుందన్నారు. పలు వైద్య పరీక్షలు చేయాల్సి రావడంతో నివేదిక ఆలస్యం అయి ఉండొచ్చని చెప్పారు. ► రిమాండ్‌కు అనుమతినిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు నిందితుడైన రఘురామను జైలుకు తీసుకెళ్లడంపై ఎలాంటి నిషేధం లేదన్నారు. పైపెచ్చు మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ అధికరణ 226 కింద హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ► ఆదినారాయణరావు జోక్యం చేసుకుంటూ, జీజీహెచ్ సూపరింటెండెంట్ వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకుని భార్య అని తెలిపారు. జైల్లో రఘురామను హత్య చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ విషయాన్ని రికార్డ్ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ► ఈ ఆరోపణలపై అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ వాటిలో అర్థం లేదన్నారు. ఆయన్ను చంపాలనుకుంటే జైల్లోనే ఎందుకు చంపాలనుకుంటుందని ప్రశ్నించారు. ఆదినారాయణరా>వు తీవ్ర స్వరంతో మాట్లాడుతుండటంతో పొన్నవోలు అభ్యంతరం తెలిపారు. మెడికల్ బోర్డును రఘురామ కోరితేనే హైకోర్టు ఏర్పాటు చేసిందన్నారు. ► సుధాకర్‌రెడ్డి కూడా తీవ్ర స్వరంతో మాట్లాడుతూ దీటుగా బదులిచ్చారు. కొద్దిసేపు ఇద్దరు న్యాయవాదులు వాదించుకున్నారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సంయమనం పాటించాలని కోరింది. ► మెడికల్ బోర్డు నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదినారాయణరావుకు ధర్మాసనం స్పష్టం చేసింది. మెడికల్ బోర్డు నివేదికను తమకు అందజేసేలా చూడాలని ఆదినారాయణరావు కోరగా, రిజిస్ట్రీని ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నేడు మేజిస్ట్రేట్ కోర్టు విచారణ.. ► రఘురామకృష్ణంరాజు తనను పోలీసులు కొట్టారని ఆరోపించిన నేపథ్యంలో ఆయనకు అయిన గాయాలను పరిశీలించేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రితో పాటు రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆదేశాలను సవరించాలంటూ మేజిస్ట్రేట్ కోర్టులో సీఐడీ సోమవారం ఉదయం పిటిషన్ దాఖలు చేయనుంది. ► పిటిషన్ సిద్ధం చేసినప్పటికీ ఆదివారం కావడంతో దాఖలు చేయలేకపోయింది. ఈ పిటిషన్‌పై మేజిస్ట్రేట్ సోమవారం విచారణ జరపనున్నారు. హైకోర్టు ఏకంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రఘురామకృష్ణంరాజును రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ఆ ఉత్తర్వులను సవరించాలని సీఐడీ తన పిటిషన్లో కోరనుందని తెలిసింది. -
రఘురామ.. ఖైదీ నంబర్ 3468
సాక్షి, గుంటూరు, అమరావతి : నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు ఆదివారం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు 3468 నంబర్‌ను కేటాయించారు. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, ఓ మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడు అయిన ఎంపీకి గుంటూరు సీఐడీ కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను జైలుకు తరలించారు. జైలులోని పాత బ్యారక్‌లో గల ఓ సెల్లో ఆయన్ను ఉంచారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు సీఐడీ పోలీసులు శనివారం రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో హాజరు పరచగా తనపై పోలీసులు దాడి చేశారని జడ్జికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎంపీ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గుంటూరు జీజీహెచ్ వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి రఘురామకృష్ణరాజును పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ డాక్టర్ సుబ్బారావులు సభ్యులుగా ఏర్పాటైన మెడికల్ బోర్డు ఎంపీకి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ స్కానింగ్, కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్, చర్మ వ్యాధులకు సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. అనంతరం నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్ భవనంలోని రెండో అంతస్తులోని గదిలోకి ఆయన్ను తరలించారు. ఆదివారం కూడా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్లో డాక్టర్ ప్రభావతి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మెసెంజర్ ద్వారా మెడికల్ బోర్డు నివేదికను హైకోర్టు ధర్మాసనానికి పంపించారు. అనంతరం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఎంపీని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామ కాల్ డేటాపై సీఐడీ కన్ను నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు చెందిన కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్‌లపై సీఐడీ దృష్టి పెట్టింది. ఎంపీకి టీడీపీ పెద్దలు, టీడీపీ అనుకూల మీడియా కీలక వ్యక్తులు ఫోన్ల ద్వారా టచ్‌లో ఉన్నట్టు సీఐడీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. వారు పలు కీలక విషయాలపై డైరెక్షన్ ఇచ్చినట్టు గుర్తించింది. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్ఐర్లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. కోర్టు ఈ నెల 28 వరకు రఘురామకృష్ణరాజు రిమాండ్‌కు అనుమతి ఇచ్చింది. -
రఘురామకృష్ణరాజు అనుకున్నదొక్కటి.. అయింది మరొకటి
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు అనుకున్నదొక్కటి.. అయింది మరొకటి అన్నట్లుంది. సీఐడీ పోలీసులు శుక్రవారం ఆయనను అరెస్ట్ చేసిన అనంతరం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన్ను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచకముందే శుక్రవారం రాత్రి బెయిల్ కోసం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. శనివారం హైకోర్టు ఇదే విషయమై తప్పు పడుతూ కింది కోర్టులోనే బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. అప్పటి వరకు బెయిల్ వస్తుందన్న ఆశతో ఉన్న రఘురామ.. ఆయన న్యాయ, ఇతర సలహాదారుల సూచన మేరకు వెంటనే ఓ కట్టుకథ సిద్ధం చేసుకున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు సీఐడీ కోర్టులో ఆయన్ను హాజరుపరచగానే పోలీసులు తనను కొట్టారంటూ కొత్త డ్రామాకు తెరలేపడం సర్వత్రా ఆశ్చర్య పరిచింది. నిజంగా పోలీసులు ఆయన్ను కొట్టి ఉంటే అప్పటి వరకు ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు సైతం ఎందుకు చెప్పలేదు? శనివారం మధ్యాహ్నం వారే ఆయనకు భోజనం తెచ్చిచ్చారు. ఆ సమయంలో వారితో ఈ విషయం చెప్పి, గాయాలు చూపించి ఉండాలి కదా? వారు బయటకు వచ్చి ఆ విషయమై మీడియా ఎదుట రచ్చ చేసి ఉండే వారు కదా? వారిలో కొందరు వారి అనుకూల మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కూడా గాయాల విషయం ప్రస్తావనకు రాలేదు. ఎప్పుడో రాత్రి పోలీసులు ఆయన్ను కొట్టి ఉంటే, శనివారం సాయంత్రం కోర్టులో హాజరు పరిచే ముందు వైద్యులు ఆయన్ను పరీక్షించినప్పుడు వారి దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం కనిపిస్తోంది. హైకోర్టులో బెయిల్ రాదని తెలిసినప్పుడే ఆయన ఈ నాటకానికి తెరతీశారు. వాస్తవానికి ఎంపీని పోలీసులు కొట్టి ఉంటే, బెయిల్ అడగడానికి అది చాలా బలమైన కారణంగా ఉండేది. ఇంతటి బలమైన కారణాన్ని ఆయన న్యాయవాది ఎందుకు ఉపయోగించుకోలేదు? బెయిల్ కోసం హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు రాలేదెందుకు? ఈ విషయాలపై న్యాయవాద వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముమ్మాటికీ కట్టుకథేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులు తన అరికాళ్లపై లాఠీలతో తీవ్రంగా కొట్టారని కోర్టులో ఎంపీ చెప్పారు. అయితే అంతకు ముందు కోర్టు ప్రాంగణంలో ఆయన కారు దిగిన సమయంలో, కోర్టులోకి ప్రవేశించే ముందు ఎవరి సాయం లేకుండా మామూలుగా నడుచుకుంటూ వెళ్లారు. అరికాళ్లపై అవి కొట్టిన దెబ్బలే అయితే 59 ఏళ్ల ఆయన ఎవరి సాయం లేకుండా మామూలుగా ఎలా నడవగలిగారన్నది ప్రశ్నార్థకం. కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలో మాత్రమే న్యాయవాదులను కోర్టులోకి అనుమతించిన నేపథ్యంలో తమనూ లోనికి అనుమతించాలని పలువురు టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు తనను కొట్టారని ఎంపీ కోర్టులో చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు. -
రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ
సాక్షి, గుంటూరు: పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్ఐర్లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా రఘురామ వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన చేష్టలు ఉన్నాయని తెలిపింది. కుల, మత, వర్గాలను టార్గెట్ చేసుకుని, టీవీ5, ABNతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు పేర్కొంది. టీవీ5, ఏబీఎన్ రఘురామకృష్ణరాజు కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించాయని, ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషంజిమ్మించాయని సీఐడీ తెలిపింది. పక్కా పథకం ప్రకారమే రఘురామ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పేర్కొంది. ఎఫ్ఐఆర్ 12/2021లో రఘురామ, TV5, ABN కుట్రను సవివరంగా సీఐడీ పేర్కొంది. రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచినందుకు CRPC 124 (A) సెక్షన్, కుట్రపూరితమైన నేరానికి పాల్పడినందుకు 120 (B) IPC సెక్షన్, కులాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు 153 (A), బెదిరింపులకు పాల్పడినందుకు CRPC 505 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చదవండి: ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ -
ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ
సాక్షి, గుంటూరు: నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును శుక్రవారం అర్ధరాత్రి వరకు సీఐడీ అధికారులు విచారించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో జరిగిన విచారణలో భాగంగా డీఐజీ సునీల్ పలు కోణాల్లో ప్రశ్నించారు. మొదటగా రఘురామకృష్ణరాజుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విచారించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎందుకు కుట్రపన్నారని, ఎవరి ప్రోదల్బంతో.. పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించింది. ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా ఎందుకు వ్యాఖ్యలు చేశారంటూ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. విచారణలో కొన్ని కీలక అంశాలను రాబట్టారు. రఘురామకృష్ణరాజు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సాంకేతిక సహకారం అందించిన వారి గురించి సీఐడీ అధికారులు కూపీ లాగినట్లు సమాచారం. ఇక అధికారులు కాసేపట్లో సీఐడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. మరోసారి రఘురామకృష్ణరాజును సీఐడీ విచారించనుంది. చదవండి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ -
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్
సాక్షి, అమరావతి, హైదరాబాద్: పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని మణికొండ జాగీర్ గోల్ఫ్‌కోర్సు బౌల్డర్స్‌హిల్స్‌లోని విల్లా నెంబర్ 17లో ఉంటున్న ఆయన నివాసానికి శుక్రవారం వెళ్లిన సీఐడీ బృందం.. అరెస్టు కారణాలను వివరిస్తూ కుటుంబ సభ్యులకు సెక్షన్ 50 నోటీసును జారీ చేసింది. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయనకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది తొలుత ఆయన్ను అరెస్టు చేయనీయకుండా వలయంగా అడ్డుపడ్డారు. వారికి సీఐడీ పోలీసులు అరెస్టుకు సంబంధించిన కారణాలు వివరించడంతో వెనక్కి తగ్గారు. ఈ సందర్బంగా రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్, కుటుంబ సభ్యులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు సీఐడీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. రఘురామకృష్ణరాజును గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్న దృశ్యం తగిన ఆధారాలతోనే.. ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిపై రఘురామకృష్ణరాజు చేస్తున్న ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలపై ప్రాథమిక విచారణ చేపట్టిన సీఐడీ తగిన ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేసింది. ఇటీవల కొన్ని న్యూస్ చానల్స్, కొందరు వ్యక్తుల ప్రోద్బలంతో రఘురామకృష్ణరాజు రోజువారీగా వీడియో ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలను చేస్తున్నట్టు గుర్తించిన ఏపీ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్ ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించారు. ‘పథకం ప్రకారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వంపై కొన్ని వర్గాలను రెచ్చగొట్టేందుకు, కొన్ని సామాజిక వర్గాలను పురిగొల్పేందుకు ఆయన వ్యాఖ్యానాలు చేశారు. కొన్ని సామాజిక వర్గాలను, వ్యక్తులను కించపరిచేలా మాట్లాడారు. రోజువారీ వీడియో ఉపన్యాసాల ద్వారా పథకం ప్రకారం పలు సామాజిక వర్గాల్లో అభద్రత, ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ముఖ్యులపై, ప్రభుత్వంపైన కించ పరిచే విమర్శలు చేయడంతోపాటు ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఉపన్యాసాలు, హావభావాలు ప్రభుత్వంపై ద్వేషం పెంచేలా, ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని చులకన చేసి మాట్లాడటం చేస్తున్నారు. పథకం ప్రకారం ప్రభుత్వంపై వరుసగా వీడియో ఉపన్యాసాలు చేస్తున్నారు. తద్వారా సామాజిక వర్గాలు, ప్రజల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు’ అని ఈ విచారణలో స్పష్టమైంది. ప్రాథమికంగా లభించిన ఈ ఆధారాలతో సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్ ఆదేశాలతో రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు 124(ఎ), సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు 153(ఎ), బెదిరింపులకు పాల్పడటం 505, కుట్ర పూరిత నేరం 120(బి) సెక్షన్లపై కేసు నమోదైంది. ఈ కేసులో రఘురామకృష్ణరాజును అరెస్టు చేశామని, కోర్టుకు తరలిస్తామని సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ తెలిపారు. కాగా, శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆయన్ను గుంటూరులోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి తరలించారు. అనంతరం అదనపు డీజీ సునీల్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. పుట్టిన రోజునే అరెస్టు చేశారు ‘మా నాన్నను పుట్టిన రోజు నాడు అరెస్టు చేయడం అన్యాయం’ అని రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ ఆరోపించారు. నాలుగు నెలల క్రితమే ఆయనకు బైపాస్ సర్జరీ అయ్యిందని, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని అన్నారు. -
సీఎం వీడియో మార్ఫింగ్ ట్యాబ్‌పై స్పష్టత ఇవ్వని ఉమా
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేసి ప్రదర్శించిన ట్యాబ్ విషయంలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దాటవేత ధోరణినే కొనసాగిస్తున్నారు. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విచారణ సందర్భంగా తన ట్యాబ్ పోయిందని ఉమా బదులిచ్చినట్టు తెలిసింది. సీఎం జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్ కేసులో ఉమాను ఇప్పటికే రెండు పర్యాయాలు సీఐడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా మూడోసారి 9 గంటలపాటు జరిగిన విచారణలోనూ ఉమా పాతపాటే పాడినట్టు విశ్వసనీయ సమాచారం. గంటల తరబడి సాగిన ఈ విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. ట్యాబ్ పోయిందని ఉమా చెప్పడంతో మీరు నిజం చెబితే సరే.. ట్యాబ్‌పోతే ఎలా కనిపెట్టాలో తమకు తెలుసని సీఐడీ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్యాబ్‌ను గుర్తిస్తామని సీఐడీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. టీడీపీ సోషల్ మీడియా విభాగం ఎవరి నిర్వహణలో ఉందని, సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగ్‌లకు ఆదేశాలు ఎవరు ఇస్తారని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ పోస్టింగ్‌లను సోషల్ మీడియాలో ఎలా అనుమతిస్తారని, వాటిని ఎవరు రూపొందిస్తారని ఆరా తీసినట్టు తెలిసింది. సోషల్ మీడియా నిర్వహణ, పోస్టింగ్‌లపై ఏమైనా మార్గదర్శకాలున్నాయా? నియమ నిబంధనలు పాటిస్తారా? అంటూ ప్రశ్నించినట్టు తెలిసింది. అనేక ప్రశ్నలకు ఉమా దాటవేత ధోరణే అవలంభించడంతో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో దర్యాప్తును కొనసాగించాలని సీఐడీ నిర్ణయించినట్టు సమాచారం. విచారణ అనంతరం ఉమా మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 7న హైకోర్టులో జరిగే విచారణలో అన్ని విషయాలను నివేదిస్తానని చెప్పారు. -
ప్రభుత్వాస్పత్రులపై సీఐడీ దాడులు
సాక్షి, అమరావతి: వైద్య పరికరాల నిర్వహణ కుంభకోణాన్ని నిగ్గు తేల్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,315 ప్రభుత్వాస్పత్రులపై సీఐడీ శనివారం ఏకకాలంలో దాడులు చేసింది. సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ ఆదేశాల మేరకు 13 జిల్లాల్లో 42 ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయి సోదాల్లో పాల్గొన్నాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోదాలు చేపట్టిన సీఐడీ బృందాలు.. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాలెన్ని? వాస్తవంగా పని చేస్తున్నవి(వర్కింగ్ కండీషన్) ఎన్ని? వాటి మార్కెట్ ధర ఎంత? వారెంటీ ఎన్నేళ్లు ఉంది? ఏఏ సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు? ఆయా సంస్థలకు నిర్వహణ సేవల కోసం ఎంత మొత్తం చెల్లించారు? తదితర వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలతో ఓ నివేదిక రూపొందించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్టులో జరిగిన కుంభకోణంపై సెక్షన్ 420, 406, 477 కింద 07/2021 నంబర్‌తో సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు, కామినేని శ్రీనివాస్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ కీలక అధికారుల అండతో రూ.కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వ్యవహారంలో క్షేత్రస్థాయి ఆధారాలు సేకరించే దిశగా సీఐడీ ముందుకు వెళ్తోంది. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియా టెలీమాటిక్, బయో మెడికల్ సర్వీసెస్ సంస్థకు 2015లో ఏడాది కాలానికి టెండర్ ఖరారు చేసిన దగ్గర్నుంచి.. దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లు కొనసాగించడం దాకా అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలుండటంతో.. వాస్తవంగా పరికరాల వినియోగం గురించి సీఐడీ ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. వారంలోగా వాస్తవాలు నిగ్గు తేలుస్తాం వైద్య పరికరాల నిర్వహణ సేవల పేరుతో జరిగిన కుంభకోణంలో ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించాం. అసలు క్షేత్ర స్థాయిలో ఏం జరిగింది? అనే కోణంలో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నాం. పరికరాల విలువ ఎంత? పనిచేస్తున్నవి ఎన్ని? కాంట్రాక్టర్లకు ఎంత చెల్లించారు? అనే వివరాలను సేకరిస్తున్నాం. వారంలోగా వాస్తవాలు నిగ్గు తేలుస్తాం. అనంతరం దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ -
నేపాల్లోనూ సీఐడీ రాధిక పర్వతారోహణ
సాక్షి, అమరావతి: పర్వతారోహణలో పట్టు సాధించిన ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ జీఆర్ రాధిక నేపాల్‌లోని హిమాలయ శిఖరాన్ని అధిరోహించి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. నేపాల్‌లోని సుమిత్ శిఖరం కింద మంచు కరగడం, భారీగా రాతి పతనం, పట్టుకునేందుకు తాడు లేకపోవడం వంటి కారణాలతో ఈ సమయం (సీజన్)లో పర్వతారోహకులు ఆ శిఖరాన్ని చేరుకోలేరు. అయినా పట్టుదలతో రాధిక పర్వతారోహణ చేపట్టారు. లోతైన పగుళ్లు, భారీ ఈదురు గాలులకు ఎదురొడ్డి మొత్తం 6,189 మీటర్ల ఎత్తున్న శిఖరంలో 6,080 మీటర్లు చేరుకోగలిగారు. నేపాల్‌లో ఆమె చేసిన మొదటి హిమాలయ పర్వతారోహణ ఇది. కాగా, తొలి నుంచి పర్వతారోహణపై మక్కువ ఉన్న రాధిక ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలు అధిరోహించి రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుని సాధించారు. ఒకవైపు గృహిణిగా, మరోవైపు సీఐడీ అధికారిణిగా, ఇంకోవైపు పర్వతారోహకురాలిగా మూడు పాత్రలు పోషించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరెస్ట్, కిలిమంజారో, కోసియోస్కో, ఎల్బ్రస్, అకాంకాగువా, దేనాలి, విన్సన్ పర్వతాలను అధిరోహించి ఆమె రికార్డు నెలకొల్పారు. తాజాగా నేపాల్‌లో పర్వతారోహణ చేసిన ఆమె తనను ప్రోత్సహిస్తున్న పోలీస్ శాఖ, సీఐడీ, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ సీఐడీ హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణకు నోటీసులు
-
టీడీపీ మాజీ మంత్రి నారాయణకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ విభాగం హైదరాబాద్‌లో బుధవారం నోటీసులు ఇచ్చింది. నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందజేసింది. ఈనెల 22న ఉదయం 11 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారాయణకు నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ సెక్షన్లు 166, 167, 217 కింద కేసులు నమోదు చేసింది. నారాయణ పేరును A2గా చేర్చిన ఏపీ సీఐడీ విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సీఐడీ సోదాలు విజయవాడ: నారాయణ విద్యాసంస్థలు, కార్యాలయాలు, నివాసంలో బుధవారం ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. సోదాలు చేస్తున్న సమయంలో అధికారులు ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదు. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరులో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. రాజధాని భూ కుంభకోణంలో నారాయణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చదవండి: అవసరమైతే చంద్రబాబును అరెస్ట్ చేస్తారు -
కదులుతున్న అక్రమాల డొంక..
సాక్షి కడప: తీగలాగితే డొంక కదిలినట్లుగా ఆప్కోలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బినామీ సొసైటీలను అడ్డుపెట్టుకుని ఆప్కో మాజీ చైర్మన్ శ్రీనివాసులు చేసిన అవినీతిని సీఐడీ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇప్పటికే గుజ్జుల శ్రీను ఇంటిలో సోదాలు జరిపి 9కిలోలకు పైగా బంగారం, 16కేజీల వెండి, రూ.కోటి 10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ప్రొద్దుటూరు, ఖాజీపేట, కడప, ఎర్రగుంట్లలో దాడులు చేశారు. రికార్డులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 70శాతం బోగస్ సొసైటీలే.. సీఐడీ అధికారులు జిల్లాలోని 126 చేనేత సొసైటీలను గుర్తించారు. 2015 నుంచి 2018 వరకూ అధిక లావాదేవీలు జరిగిన వాటిని ప్రత్యేకంగా గుర్తించారు. ఆ సోసైటీల సభ్యుల జాబితాను తీసుకున్నారు. గ్రామాలకు వెళ్లారు. సొసైటీల్లో నిజంగా సభ్యులు ఉన్నారా కాగితాలకే పరిమితమయ్యారా అనే విషయాలపై ఆరా తీశారు.దాదాపు 70శాతం బోగస్ సొసైటీలను గుర్తించారు. ఇందులో అధిక భాగం ఆప్కో మాజీ చైర్మన్ బినామీలున్నట్లు గుర్తించింది. సొసైటీల ఆర్థిక లావాదేవీలపై సీఐడీ ప్రత్యేక నిఘా ఉంచింది. బోగస్ సోసైటీలుగా ఉండి ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారనే దానిపై విచారణ చేస్తున్నారు. అందులో కీలక పాత్ర ఎవరిది.. సహకరించినవారెవరు.. అధికారులు పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కడప కేంద్ర కార్యాలయంలోని రికార్డులను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. పవర్లూమ్ నుంచి రూ. కోట్లు స్వాహా పవర్లూమ్ నుంచి మీటరు రూ. 30 నుంచి రూ 35కే లభిస్తుంది. సిరిసిల్లా, సూరత్, ఈరోడ్, ప్రొద్దుటూరులోని పవర్లూమ్పై నేసిన క్లాత్‌ను ఆప్కో మాజీ చైర్మన్ పెద్ద ఎత్తున కొనుగోలు చేసి చేనేతలు నేసినట్లు రికార్డులు తయారు చేయించారని సీఐడీ అధికారులు గుర్తించారు. ఇలా చేయడం వల్ల మీటరుకు రూ.100 నుంచి రూ.110 మిగులు తుంది. ఇలా కోటి మీటర్లు ఆప్కోకు అమ్మితే రూ.110 కోట్లు మిగిలుతుంది. ఇలా వచ్చిన డబ్బు అంతా స్వాహా అయినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతోందనే దానిపై ఆరాతీస్తున్నారు. ♦పవర్లూమ్ నుంచి తెచ్చిన క్లాత్‌ను నేరుగా ఆప్కో షోరూమ్ గోడౌన్‌కు తరలించడం ద్వారా ట్రాన్స్‌పోర్టు పేరుతో రూ. కోట్లు స్వాహా అయినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ♦ఆర్థికంగా నష్టపోయిన సొసైటీలకు ఎన్సీడీసీ పేరుతో నిధులు ఇచ్చి ఆదుకుంటారు. ప్రభుత్వం నుంచి 30శాతం సబ్సిడీ వస్తుంది. రుణాలకు ప్రభుత్వం భరోసాగా ఉంటుంది.బోగస్ సోసైటీలు నిధులు తీసుకుని సబ్సిడీలు పొంది ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టిన విషయంపై విచారణ చేస్తున్నారు. ♦విద్యార్థులకు దుస్తులు కుట్టించే విషయంలోనూ అవినీతి జరిగిందని సీఐడీ అధికారులు గుర్తించారు.చేనేత కార్మికులు నేసిన క్లాత్‌ను దుస్తులు కుట్టడానికి ఇవాల్సి ఉంటుంది. కానీ అప్పటి ఆప్కో చైర్మన్ ఆధ్వర్యంలో పవర్లూమ్ మగ్గంపై నేసిన క్లాత్‌ను తెప్పించి సరఫరా చేసినట్లు గుర్తించారు. విద్యార్థుల యూనిఫాం కుట్టినందుకు ప్రభుత్వం జతకు రూ 50 అందిస్తోంది. అయితే హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు కంపెనీల ద్వారా రూ 30కు కుట్టించి మిగతా సొమ్ము స్వాహా చేశారు. సుమారు రూ. వందల కోట్లు స్వాహా జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ♦చేనేత సంఘాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఆర్ఆర్, కార్పస్ ఫండ్‌ను ఇస్తాయి. ఇలా వచ్చిన ఫండ్ ఆప్కో మాజీ చైర్మన్ ద్వారా బినామీ సొసైటీలకు అందినట్లు గుర్తించారు. ఆప్కోలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఆప్కో మాజీ చైర్మన్ గోడౌన్‌పై దాడులు ఖాజీపేట: ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు గోడౌన్‌పై సీఐడీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గోడోన్‌లో ఉన్న క్లాత్‌ను పరిశీలించారు. వాటిని సీజ్ చేశారు. -
బోధన్ స్కాంలో మళ్లీ కదలిక
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు చిల్లుపెట్టిన బోధన్ వాణిజ్య పన్నుల స్కాంలో తిరిగి కదలిక మొదలైంది. ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసే విషయంలో సీఐడీ అధికారులు ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ఖజా నాకు గండికొట్టిన రూ.300 కోట్ల వాణిజ్య పన్నుల నకిలీ డాక్యుమెంట్ల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ సీఐడీ అధికారులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో సూత్రధారి శివరాజు ఒక సంస్థ కోసం తీసిన చలానాను పలు సంస్థల పేరిట చూపించినట్లుగా రికార్డులు రాసి, సదరు మొత్తాన్ని జేబులో వేసుకున్నారు. ఫలితంగా వాణిజ్య శాఖకు తీవ్రనష్టం వాటిల్లిం ది. కేసు దర్యాప్తులో కీలకంగా ఉన్న పలు చలానాలు, అనుమానాస్పద పత్రాలు, డాక్యుమెంట్ల ఫిజికల్ వెరిఫికేషన్ మొదలైతే త్వరలోనే చార్జిషీటు సిద్ధమవుతుందని సమాచారం. ఈ వ్యవహా రంపై పలు ఫిర్యాదులు రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణలో ప్రధాన నిందితుడు శివరాజ్, అతని కుమారుడు, మరికొందరు అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించింది. 2010 నుంచి 2016 వరకు సాగిన వీరి అక్రమాల ఫలితంగా వాణిజ్య శాఖకు, ప్రభుత్వ ఖ జానాకు రూ.300 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదిక సమర్పించిం ది. కేసు సీఐడీకి బదిలీ అయ్యాక తండ్రీకుమారులిద్దరూ అరెస్టయ్యారు. స్వాధీనమైన చలానాలు, కంప్యూటర్లు, హార్డ్‌డిస్కుల ను ఇప్పటికే సైబర్ నిపుణులు విశ్లేషించారు కూడా. చాలా కాలం తరువాత ఇప్పుడు అనుమానాస్పద పత్రాల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వాస్తవానికి ఆలస్యంగా మొదలైనా.. ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన శాస్త్రీయ ఆధారాలకు ఇది కీలకం కానుం ది. పత్రాల పరిశీలన పూర్తికాగానే చార్జిషీటు వేస్తారని సమాచారం. ఈ కేసులో తీవ్ర జాప్యం జరిగిందని సీఐడీపై విమర్శలు వస్తున్న క్రమంలో కేసులో కదలిక రావడం గమనార్హం. -
గంటా గ్యాంగ్ హల్చల్
దొండపర్తి(విశాఖ దక్షిణ)/ఆరిలోవ(విశాఖ తూర్పు): సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గ్యాంగ్ హల్చల్ చేసింది. ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటినప్పటికీ.. గంటా ఇప్పటి వరకు నియోజకవర్గం మొహం చూడలేదు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. టీడీపీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విష ప్రచారం చేసి పట్టుబడిన నిందితుడు నలంద కిశోర్‌కు మద్దతుగా 3 గంటల పాటు సీఐడీ కార్యాలయం ఎదుట నిరీక్షించడంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలో నియోజకవర్గంలో ఒకసారి కూడా పర్యటించని గంటా శ్రీనివాసరావు, అతని బ్యాచ్.. ఓ కేసులో అరెస్టయిన వ్యక్తి కోసం బయటకు రావడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపైనే కాకుండా, ప్రభుత్వ పెద్దలపై నలంద కిశోర్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడంతో సీఐడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.(ఈ సోషల్ తీవ్రవాదం.. టీడీపీ ఉన్మాదం!) సీఐడీ కార్యాలయం వద్ద వేచి ఉన్న టీడీపీ నేతలు విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అతని గ్యాంగ్ పరుచూరి భాస్కరరావు, మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబుతో పాటు మరికొంత మంది ఉదయమే సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి నలంద కిశోర్‌ను కర్నూలుకు తరలించేంత వరకు అక్కడే ఉండి తెగ హడావుడి చేశారు. కిశోర్‌ను కలవడానికి సీఐడీ కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అతని లాయర్‌ను మాత్రమే లోపలకు అనుమతించారు. దీంతో గంటాతో పాటు అతని బ్యాచ్ మొత్తం ఎవరెవరికో ఫోన్లు చేస్తూ అక్కడి పరిస్థితులను వివరిస్తూ సీఐడీ కార్యాలయం ఎదుట రోడ్డు మీద కలియతిరిగారు. నిందితుyì ని కారులో కర్నూలుకు తరలించడానికి బయటకు తీసుకువచ్చిన సమయంలో కూడా గంటాకు చెందిన కొంత మంది అనుచరులు ‘అన్నా భయపడొద్దు.. మేమంతా అండగా ఉన్నాం’ అంటూ అరుపులు అరిచారు. ఉదయం 11.30 గంటలకు నిందితుడిని తరలించిన వాహనం వెనుక కొంత మంది ఫాలో అయ్యారు. గంటా మాత్రం మీడియాతో మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
'ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు'
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై ఏపీ సీఐడీ కొరడా ఝుళిపిస్తోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విషయంలో అసత్య ప్రచారం చేసిన గుంటూరు వాసి రంగనాయకమ్మపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా... ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపడుతూ పెట్టిన పోస్టుకు సహకరించిన రఘునాద్ మల్లాడిపై సీఐడీ దృష్టి సారించింది. సున్నితమైన అంశంలో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రచారం జరిగిందని సీఐడీ ఎస్పీ సరిత తెలిపారు. చదవండి: గుర్రాల నుంచే కోవిడ్ వ్యాక్సిన్ ఆమె బుధవారం రోజున మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల విషయంలో హెచ్చరికలు చేస్తున్నా పోస్టింగులు పెట్టినందువల్లే రంగనాయకమ్మను అరెస్ట్ చేశాము. ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు. మొదటిసారి తప్పు చేసిన వారికి న్యాయస్థానం 3 ఏళ్ల జైలుశిక్ష , రూ.5 లక్షల జరిమానా విధిస్తుంది. రెండోసారి తప్పుచేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తుందని సీఐడీ ఎస్పీ సరిత హెచ్చరించారు. చదవండి: బెంగళూరుని బెంబేలెత్తించిన భారీ శబ్ధాలు -
ఫేక్ న్యూస్‌పై ఫ్యాక్ట్ చెక్
సాక్షి, అమరావతి: కరోనాకు సంబంధించి కొందరు ఆకతాయిలు, అవకాశవాదులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు, వాస్తవాలు తేల్చేందుకు ఏపీ సీఐడీ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ నంబర్ 90716 66667కు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రారంభించిన రెండు రోజుల్లోనే 4,200 మంది ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఫేక్ న్యూస్‌లపై వాస్తవాలు కోరడంతోపాటు, కొన్నిటిపై ఫిర్యాదు కూడా చేశారు. వీటికి స్పందిస్తున్న సీఐడీ వాస్తవాలను అందించడంతోపాటు తమ వెబ్సైట్లో ఫేక్, ఫ్యాక్ట్ అనే ప్రత్యేక ఫీచర్ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న అంశాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచేలా ఈ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవి.. ► రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ వి.కనగరాజ్ ఒక పాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ఫోటోతో సహా అసత్య ప్రచారం చేయగా ఆ ఫోటోలో ఉన్నది రెవరెండ్ ఎడ్విన్ జయకుమార్ అనే వేరే వ్యక్తి అని తేలింది. దీనిపై పోలీసు విచారణ కొనసాగుతోంది. ► మరుగుతున్న నీటి ఆవిరిని పీలిస్తే కరోన వైరస్‌ని 100% చంపి వేస్తుందని, చైనీస్ నిపుణుడు చెప్పినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త కూడా ఫేక్ న్యూస్ అని పీఐబీ పేర్కొంది. ► కోవిడ్–19 చికిత్స కోసం ఆర్మీ 8 రోజుల్లో వేయి పడకల ఆసుపత్రిని రాజస్థాన్‌లో నిర్మించిందని, నిత్యావసరాలను రైళ్ల ద్వారా రాష్ట్రాలకు పంపిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు అవాస్తవం. ► ఏప్రిల్ 9 న దీపాలు, కొవ్వొత్తులు వెలిగించిన సమయంలో తీసిన ప్రత్యక్ష చిత్రాన్ని నాసా తీసిందని చెప్తూ, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో కూడా అది పాత ఫోటోనే. ► కోవిడ్–19 కి రొచే లాబరేటరీస్ వాళ్ళు ఔషధాన్ని కనిపెట్టారని, మిలియన్ డోసులు రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా పూర్తి అసత్యం. గుడ్డిగా నమ్మొద్దు సోషల్ మీడియా, ఆన్లైన్ వెబ్సైట్లలో అత్యంత నమ్మకం కలిగించేలా వైరల్ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మొద్దు. ఫ్యాక్ట్ చెక్ చేసుకునేందుకే వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చాం. సంస్థలు, మతాలు, కులాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను కించపరిచేలా పోస్టింగ్‌లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు. –పీవీ సునీల్‌కుమార్, ఏపీ సీఐడీ, ఏడీజీ -
ఇన్సైడర్ ట్రేడింగ్‌పై ఆధారాలు సేకరించిన సీఐడీ
-
ఎంసెట్ స్కాంలో ఎట్టకేలకు చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో కలకలం రేపిన ఎంసెట్ (మెడికల్) స్కాంలో సీఐడీ పోలీసులు ఎట్టకేలకు చార్జిషీట్ దాఖలు చేశారు. 2016 జూలైలో లీకేజీ ఉదంతం వెలుగుచూడగా 2019 జూలై అంటే నాలుగేళ్ల విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలైంది. 90 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో దర్యాప్తు జరుగుతుం డగానే ఇద్దరు మరణించగా ఇప్పటిదాకా 67 మంది అరెస్టయ్యారు. వరంగల్ నుంచి మొదలైన సీఐడీ దర్యాప్తు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, కటక్ తదితర ప్రాంతాలకు విస్తరించింది. పలుమార్లు విచారణాధికారులు మారడం, కేసులో జేఎన్టీయూ, శ్రీచైతన్య కార్పొరేట్ కళాశాల డీన్‌కు ఉన్న సంబంధాలు వెలుగుచూడటంతో కేసు మలుపులు తిరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ చరిత్రలో ఒక కుంభకోణంలో చార్జిషీట్ దాఖలుకు ఇంత సుదీర్ఘ సమయం తీసుకున్న అరుదైన కేసుగా ఈ ఘటన నిలిచింది. తాజాగా చార్జిషీటు దాఖలుతో కోర్టులో వాదనలు మొదలు కానున్నాయి. ఢిల్లీ లింకుతో మొదలు.. వరుసగా రెండోసారి కూడా ఎంసెట్ (మెడికల్) పేపర్ లీకైందన్న విషయం కలకలం రేపడంతో దర్యాప్తు చేసిన నాటి డీఎస్పీ బాలు జాదవ్, కానిస్టేబుల్ సదాశివరావు, మరో ఇన్స్పెక్టర్ నిందితుల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని సస్పెండ్ చేశారు. దర్యాప్తు తీరుపై విమర్శలు రావడంతో కేసును సీఐడీకి బదిలీ చేశా రు. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ఢిల్లీలోని జేఎన్టీ యూ ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ లీకైన విషయా న్ని గుర్తించింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీసింగ్ను సూత్రధారిగా తేల్చింది. ప్రశ్నపత్రాన్ని ఎస్బీ సింగ్ తన మనుషుల ద్వారా బయటకు తెప్పించాడని గుర్తించింది. ఈ కేసులో 62 మంది బ్రోకర్లు సహా మొత్తం 90 మందిని నిందితులుగా పేర్కొంది. స్థానికంగా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు గుమ్మడి వెంకటేశ్, ఇక్బాల్‌లు విద్యార్థులకు లీక్ చేసిన పేపర్లను చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. వారితోపాటు శ్రీచైతన్య కాలేజీ డీన్ వాసుబాబు (ఏ–89), మరో ఏజెంట్ శివనారాయణరావు(ఏ–90)లతో కలిపి 90 మంది నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో కమిలేశ్ కుమార్ సింగ్ (55), రావత్ (43)లు మరణించారు. పకడ్బందీగా చార్జిషీటు.. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. వివిధ రాష్ట్రాలకు విస్తరించిన ఈ కేసులో ఆధారాలు, సాక్ష్యాల సేకరణ క్లిష్టంగా మారింది. ఎస్బీ సింగ్‌ను 2017లో సీఐడీ పోలీసులు అరెస్టు చేసినా తగినన్ని సాక్షాలు లేక చార్జిషీట్ దాఖలు ఆలస్యమైంది. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకొని చివరకు పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా పకడ్బంది సాక్ష్యాలు సేకరించినట్లు సమాచారం. కేసులో 90 మంది నిందితులు, 400 మందికిపైగా తల్లిదండ్రులు, విద్యార్థులు, వారికి సహకరించిన వారు సాక్షులుగా ఉన్నారు. -
కొంపలు కూల్చారు
సాక్షి, ఒంగోలు సబర్బన్: అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని అన్నట్లు తయారైంది అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి. అగ్రిగోల్డ్ సంస్థకు వేల కోట్ల విలువగల ఆస్తులున్నా వాటిని అమ్మి బాధితులకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డు గోడలా మారారు. దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులపై చంద్రబాబు కన్ను పడింది. ఆయనతోపాటు ఆయన పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గద్దల్లా వాలిపోయారు. ఇంకేముంది దొరికిన కాడికి ఆస్తులు లాగేసుకున్నారు. అయినా ఇంకా డిపాజిట్‌దారులకు చెల్లించేదానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితులపై కనికరం లేకుండాపోయింది. నాలుగున్నరేళ్లుగా బాధితులను అవిగో ఇస్తున్నా.. ఇవిగో ఇస్తున్నా అంటూ ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తున్నారంటే చంద్రబాబుది ఎంత కాఠిన్యమైన మనస్సో అర్థమవుతుంది. చివరకు ఆయన ఐదేళ్లు పరిపాలనా ఫలాలు అనుభవించాడు. కానీ బాధితులకు మాత్రం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. వేల కుటుంబాలను నిలువునా ముంచాడనటంలో సందేహం లేదు. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న వారు కొందరు.. ఉన్నదానిలోనే కొంత దాచుకున్న వారు మరి కొందరు.. వడ్డీ వస్తుందిలే అని ఉన్నది మొత్తం డిపాజిట్ చేసిన ఇంకొందరు.. వృత్తి పని, ఉద్యోగాలు చేస్తూ ప్రవృత్తిగా డిపాజిట్ల సేకరణ చేపట్టిన వారు ఇంకొందరు.. ఇలా అగ్రిగోల్డ్ సంస్థను నమ్మిన వారంతా దగా పడ్డారు. డబ్బు తిరిగొస్తుందో రాదోననే ఆందోళనలో ప్రాణాలు సైతం తీసుకున్నారు. అవ్వా వెంకట రామారావు చైర్మన్‌గా 1995లో అగ్రిగోల్డ్ సంస్థను ప్రారంభించిన నాటి నుంచి సంస్థపై కేసులు పెట్టే వరకు ఎందరో నమ్మి డబ్బు దాచుకుంటే వారి నోట్లో మట్టి కొట్టి చోద్యం చూస్తున్నారు. సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని డిపాజిటర్లకు డబ్బు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నాలుక మడతేసింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు ఉన్నారు. ప్రస్తుతం వారు అగ్రిగోల్డ్ బాధితులుగా మారారు. ఏపీ సీఐడీ లెక్కల ప్రకారం 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే 19.52 లక్షల మంది ఉన్నారు. డిపాజిటర్లకు మొత్తం రూ.6,380 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఒకానొక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం రూ.10 వేల కోట్లు ఉన్నాయని ప్రకటించారు. ఇకపోతే పలువురు మంత్రులు రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇన్ని ఆస్తులున్నప్పుడు బాధితులకు డబ్బు చెల్లించేందుకు అభ్యంతరం ఏమిటీ అంటే ఆలస్యమయ్యేకొద్దీ డైరెక్టర్ల పేరు మీద, సంస్థలోని బినామీల పేరుమీద ఉన్న ఆస్తులను కొట్టేయడానికి పరిపాలనలో ఉన్న పెద్దలు వేసిన ఎత్తుగడ. అందుకే గత నాలుగున్నరేళ్లుగా కాలయాపన చేస్తూ బాధితుల ఉసురు పోసుకుంటున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. తాను ఎంతో అనుభవమున్న ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు తన అనుభవాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి అమాయకులను, కడు పేద వారిని నిలువునా మోసం చేసి కంటి మీద కునుకు లేకుండా చేయటంలో దిట్ట అనిపించుకుంటున్నాడు. చివరకు గుంటూరు–విజయవాడ హైవేపై ఉన్న హాయ్‌ల్యాండ్ లాంటి రూ.వందల కోట్ల విలువ గల ఆస్తిని కొట్టేయటానికి కూడా వెనుకాడలేదంటే బాధితులను ఆదుకోవాలన్న ఆలోచన ఏమేరకు ఉందో అర్థమవుతుంది. ఆది.. అంతం.. బాబు జమానాలోనే.. 1995లో అగ్రిగోల్డ్ సంస్థను అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారు. అప్పట్లో చంద్రబాబు ఈ సంస్థకు చెందిన కొన్ని ప్రారంభోత్సవాలకు కూడా వెళ్లారు. డిపాజిట్ల ద్వారా అగ్రిగోల్డ్ కూడబెట్టిన ఆస్తులు దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా చేరాయి. చివరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు లబోదిబోమంటున్నారు. జేబు సంస్థ సీఐడీతో కాలయాపన సీఐడీని తన కనుసన్నల్లో పెట్టుకుని కోర్టుకు ఎప్పడికప్పుడు సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కనీసం చలనం లేకుండా ముఖ్యమంత్రి చెప్పినట్టు నడుచుకుంటూ బాధితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలుగా ఆస్తులన్నీ గుర్తించామని చెబుతున్న సీఐడీ గత మూడు నెలల క్రితం అగ్రిగోల్డ్ వ్యవహారంలో చంద్రబూబు, రాష్ట్ర సీఐడీ విభాగం అధికారులు హైడ్రామాకు తెరలేపారు. సంవత్సరాల తరబడి అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ కాళ్లా...వేళ్లా పడినా కనికరించని చంద్రబాబు ప్రభుత్వం ఇక ఎన్నికలు దగ్గర పడేకొద్దీ 2019 డిసెంబరులో కొత్త ఎత్తుగడలకు తెరలేపింది. వేల కోట్ల రూపాయల విలువగల ఆస్తులు స్వాధీనం చేసుకున్న సీఐడీ పోలీసులు కోర్టుకు కూడా సక్రమంగా ఆస్తుల వివరాలు అందించకుండా దాచిపెట్టి ఉంచారు. అధునాతనంగా జిల్లాల వారీగా కొత్తగా కొన్ని ఆస్తులు కనుగొన్నామని చెప్పడం బాధితుల ముఖాలకు మసిపూసి మారేడు కాయ చందంగా తయారైంది. చివరకు సీఐడీ అధికారుల పనితీరు ఎలా ఉందంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది. కళ్ల ముందు జిల్లాలో రూ.కోట్ల విలువైన ఆస్తులు ఉన్నా గతంలో తూతూ మంత్రంగా అగ్రిగోల్డ్ ఆస్తులు గుర్తించినట్లు కోర్టులకు సమాధానాలు చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ.. తీరా ఎన్నికలు సమీపిస్తుండే సరికి ప్రభుత్వ పెద్దల ఎత్తుగడలకు ఊతమిస్తూ సాక్షాత్తు సీఐడీ అధికారులు ఇప్పుడు కొత్తగా ఏదో కష్టపడినట్టు.. నూతనంగా ఆస్తులు గమనించామని చెప్పటం విడ్డూరంగా మారింది. దీంతో అగ్రిగోల్డ్ బాధితులు ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల వేళ ‘ఎల్లో’ నాటకం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి మాత్రమేనని చెప్పారు. అలా చూసుకున్నా సీఐడీ గణాంకాల ప్రకారం 6.49 లక్షల మంది ఉన్నారు. ఆ లెక్కన చూసుకుంటే బాధితులకు రూ.336 కోట్లు అవసరం ఉంది. రూ.250 కోట్లు చెల్లించిన ప్రభత్వం మిగతా రూ.86 కోట్ల సంగతి చెప్పనేలేదు. అది కూడా ఎన్నికలు దగ్గర పడేసరికి ప్రకటించారు. ఇక ఎన్నికల షెడ్యూలు వచ్చింది ఎన్నికల తేదీ ఏప్రెల్ 11.. అంటే ఎన్నికల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు వచ్చే పరిస్థితి లేనట్లే. అదికూడా రూ.10 వేల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి మాత్రమే. రోజు వారీ, నెలవారీ, మూడు నెలల వారీ చెల్లించిన వారికి డబ్బు చెల్లించే అవకాశమే లేదు. బాధితుల ఒత్తిడికి గ్రామాలు విడిచిన ఏజెంట్లు అగ్రిగోల్డ్ ఏజెంట్లుగా మారి డిపాజిట్లు వసూలు చేసిన వారు బాధితుల ఒత్తిడితో స్వగ్రామాలు వదిలి వెళ్లిపోయారు. కొందరైతే భార్యా పిల్లలను సైతం వదిలి వెళ్లారు. ఊరుకాని ఊర్లలో హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పనిచేసి జీవనం సాగిస్తున్నారు. బలికోరిన అగ్రిగోల్డ్.. డిపాజిట్ డబ్బులు వస్తున్నాయని ఆశపెట్టటంతో ఎంతగానో ఎదురుచూసిన బాధితులు నాలుగున్నర సంవత్సరాలుగా రాకపోయేసరికి ఎంతో మనోవేదన చెందారు. డబ్బుపై ఆశలు వదలుకున్న బాధితులు ఆత్మహత్యలే శరణ్యంగా భావించారు. దీంతో రాష్ట్రం మొత్తం మీద 260 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లాలో 28 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ మరణాలకు చంద్రబాబే బాధ్యుడని అగ్రిగోల్డ్ బాధితులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదిలా ఉండగా బాండ్ల వెరిఫికేషన్ పేరిట బాధితులను జిల్లా నలు మూలలనుంచి జిల్లా కేంద్రానికి రప్పించి మరీ పరిశీలన చేశారు. గతంలో పోలీసులతో పరిశీలింపజేసిన ప్రభుత్వం తీరా ఎన్నికలు దగ్గరపడే సరికి మళ్లీ రెండోసారి కోర్టుల ద్వారా బాండ్ల వెరిఫికేషన్ అని పితలాటకం పెట్టింది. రెండు దఫాలుగా వ్యవప్రయాసలకోర్చి ఒంగోలు వచ్చినా బాధితులకు డబ్బు ఇవ్వలేదు. కళ్లకు గంతలు కట్టుకున్న సీఐడీ జిల్లాలో వందల ఎకరాలు భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఖరీదైన స్థలాలు నేరుగా అగ్రిగోల్డ్ పేరుతో ఉన్నా సీఐడీ అధికారులు గుర్తించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వెలిగండ్ల మండలం బొంతగుంటపల్లి గ్రామంలో ఏకంగా అగ్రిగోల్డ్ పేరుతో 112.99 ఎకరాల భూములు ఉన్నాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పండ్ల తోటలు, వృక్ష జాతి పంటల విస్తీర్ణాల వివరాల నమోదులో బయటపడిన ఆస్తులివి. కానీ ఈ ఆస్తుల వివరాలను సిఐడీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొనలేదు. బొంతగుంటపల్లి సర్వే నంబర్ 22లో 8.52 ఎకరాలు, 23లో 5.94, 24లో 7.39, 25లో 21.94, 45లో 11.25, 46లో 9.16, 47లో 12, 49/1లో 3.58, 52లో 13.80, 53లో 7.01, 55లో 12.40 ఎకరాలు, మొగుళ్లూరు గ్రామంలోనూ 57.42 ఎకరాలు అగ్రిగోల్డ్ పేరుమీద ఉన్నాయి. సర్వే నంబర్ 334/1లో 10.31 ఎకరాలు, 334/2లో 3.77, 335/1లో 20.83, 335/2లో 8.42, 336లో 14.09 ఎకరాలు ఉన్నాయి. డైరెక్టర్ల అరెస్ట్‌లో సీఐడీ డ్రామాలు సంస్థ చైర్మన్‌తో పాటు పలువురు డైరెక్టర్లను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 20 మందికి పైగా డైరెక్టర్లను అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అరెస్టయిన వారితో పాటు బయట ఉన్న డైరెక్టర్ల బినామీ ఆస్తులను వేల కోట్ల రూపాయల విలువగల వాటిని ఇప్పటికే కొట్టేశారు కూడా. ఇకపోతే ప్రశాశం జిల్లాలో ఉన్న ప్రధాన డైరెక్టర్లను సీఐడీ అధికారులు అరెస్ట్ కూడా చేయలేదు. కొందరిని అరెస్ట్ చేసిన సీఐడీ.. వీరిని విడిచిపెట్టడంపై విమర్శలొస్తున్నాయి. జిల్లాలో అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ఐదుగురు ఉన్నారు. వారిలో ఎస్వీపీ ఆంజనేయులుతో పాటు సంతపేటలోని అగ్రిగోల్డ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న జి.శేషగిరిరావు, కరవదికి చెందిన శిగాకొల్లి మోహనరావు, పెరిదేపికి చెందిన పి.శివరామకృష్ణ, స్థానిక రంగారాయుడు చెరువు సమీపంలో వ్యాపారిగా స్థిరపడిన సాయిని శ్రీనివాసరావు డైరెక్టర్లుగా ఉన్నారు. నేరుగా డైరెక్టర్ల పేర్ల మీద, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. సంతనూతలపాడు మండలం ఎండ్లూరు గ్రామానికి చెందిన, ప్రస్తుతం ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో నివాసం ఉంటున్న ప్రధాన డైరెక్టర్ ఎస్వీపీ ఆంజనేయులు కోట్ల రూపాయలకు పడగలెత్తారు. జిల్లాలో ఇప్పటి వరకు 170.41 ఎకరాల భూములు అగ్రిగోల్డ్ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. ఇంకా గుర్తించాల్సిన ఆస్తులు చాలా ఉన్నాయి. దానికితోడు వెలిగండ్ల మండలం బొంతగుంటపల్లి గ్రామంలో 16.24 ఎకరాల భూమి ఎస్వీపీ ఆంజనేయులు పేరుమీద ఆస్తులు ఉన్నాయి. సర్వే నంబర్లు 21/1, 35/1, 35/2, 36, 17/2, 32/1లో ఉన్న ఈ ఆస్తిని ఎస్వీపీ ఆంజనేయులు 2007 డిసెంబర్ 18న కొనుగోలు చేశారు. అదే గ్రామంలో నేరుగా అగ్రిగోల్డ్ పేరు మీద 21/1 సర్వే నంబర్లో 5.50 ఎకరాలు ఉంది. ప్రకటనలకే పరిమితం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని బాండ్లు సేకరిస్తూ ఉన్నారు. కానీ ఇంత వరకు న్యాయం జరగలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సార్లు బాధితులకు న్యాయం చేస్తారని చెప్పారు. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాం. నేను అగ్రిగోల్డ్ వలన రూ.లక్ష నష్టపోయా. – మారం రామిరెడ్డి, దర్శి అగ్రిగోల్డ్ లో చేరి తీవ్రంగా నష్ట పోయా అగ్రిగోల్డ్ సంస్థలో ఏజెంట్‌గా చేరి తీవ్రంగా నష్ట పోయాం. డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగం రాకపోవడంతో జీవనాధారం కోసం అగ్రిగోల్డ్ సంస్థలో ఏజెంట్‌గా చేరా.రూ.2 లక్షలకు పైగా పాలసీ కట్టించా. ఆ సంస్థను మూసివేయడంతో డబ్బు ఇప్పించాలని పాలసీదారులు గోల చేస్తున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. – గోను వెంకటనారాయణరెడ్డి, అగ్రిగోల్డ్ ఏజెంట్, జంగంవారిపల్లి డబ్బు కోసం ఎదురు చూస్తున్నా.. నేను కిరాణా వ్యాపారం చేస్తుంటా. దానిమీద వచ్చే ఆదాయంతో నెలకు కొంత మొత్తం చెల్లిస్తూ అగ్రిగోల్డ్ సంస్థలో సుమారు 1.20 లక్షలు దాచుకున్నా. ఇప్పుడేమో కంపెనీ దివాళా తీసింది. నా డబ్బులు ఎప్పుడు వస్తాయో అర్థం కావడం లేదు. ఇటీవల రూ.10 వేల లోపు డిపాజిట్ చెల్లిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి కోర్టు వద్ద అధికారులకు 15 వేల రూపాయల విలువ గల బాండ్లు, బ్యాంక్ పాస్ పుస్తకం ఇచ్చాం. 20 రోజుల్లో వస్తాయన్నారు. ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నా. - కందగడ్డల సుబ్రహ్మణ్యం, సింగరాయకొండ ఆత్మహత్య చేసుకుంటున్నా జాలి లేదా? అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వ పెద్దలకు కనీసం జాలి కూడా ఉండటం లేదు. లక్షల కుటుంబాలు బజారున పడ్డాయి. కొత్తగా సీఐడీ అధికారులు జిల్లాతో పాటు రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులు కనుగొన్నామని చెప్పటం విడ్డూరంగా ఉంది. ఆస్తులను సీఐడీ అధికారులు ఎప్పుడో కనుగొన్నారు. డైరెక్టర్ల ఆస్తులు కూడా కనుగొన్నారు. కానీ అన్నీ తెలియనట్టు సీఐడీ అధికారులు నటిస్తున్నారు. ఇది అత్యంత దారుణం. సంస్థ దెబ్బకు తమకు నష్టమేమీ జరుగలేదు. కేవలం ప్రభుత్వం వల్లనే తాము పూర్తిగా నష్టపోయాం. – అద్దంకి కోటేశ్వరరావు, అగ్రిగోల్డ్ ఏజెంట్ జగనన్నతోనే అయితేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జగనన్న ముఖ్యమంత్రి అయితేనే అగ్రిగోల్డ్ కస్టమర్లకు, ఏజెంట్లకు న్యాయం జరుగుతుంది. మా కుటుంబ సభ్యులం రూ.3 లక్షలదాకా అగ్రిగోల్డ్ సంస్థకు కిస్తీలు కట్టా. అదే విధంగా ఏజెంటుగా సుమారు 300 మందితో రూ.1.50 కోట్లమేర డిపాజిట్లు కట్టించా. నేటికి ఒక్కరికి కూడా నయాపైసా రాలేదు. గతంలో డబ్బు ఇస్తామని పోలీస్‌స్టేషన్‌లో బాండ్లు, ఇతర వివరాలు అందజేశాం. నేడు మళ్లీ కోర్టు ఆదేశాలతో రూ..10 వేల లోపు డిపాజిటర్ల వివరాలు ఇవ్వాలంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీడీపీ ప్రభుత్వం, నాయకులే అగ్రిగోల్డ్ సొమ్మును కాజేసి కస్టమర్లను అన్యాయం చేయాలని చూస్తున్నట్లు ఉంది. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయితేనే అగ్రిగోల్డ్ డిపాజిట్లు తిరిగి వస్తాయని నమ్మకముంది. రానున్న ఎన్నికల్లో జగన్‌కు అండగా ఉంటాం. – ఎ.వెంకట సుబ్బమ్మ, అగ్రిగోల్డ్ కస్టమర్, ఏజెంట్, పామూరు -
పనితనం చూపకపోతే వేతనం కోతే!
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో మంచి ఫలితాలు రాకపోతే టీచర్లు బాధ్యత వహించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. అదే రీతిలో ఇప్పుడు పోలీస్ శాఖ కూడా మెరుగైన ఫలితాలు రాకపోతే చర్యలు తీసుకునేందుకు వినూత్న కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిసింది. అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వ్యవస్థను పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. నేరాల నియంత్రణ, ముందస్తు చర్యలు, నేరస్తుల కట్టడికి టెక్నాలజీ ఆయుధాన్ని అందించింది. ఇంత చేస్తున్నా కొన్ని విభాగాల్లో ఆశించిన రీతిలో ఫలితాలు రావడం లేదు. దీంతో వారిపై చర్యలు తీసుకుంటేనే వ్యవస్థలో మార్పు వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముందుగా సీఐడీపైనే నజర్.. రాష్ట్రంలో తీవ్రత ఎక్కువగా ఉన్న నేరాలు లేదా సంచలనాత్మకంగా మారిన కేసుల దర్యాప్తు పర్యవేక్షించే రాష్ట్ర నేరపరిశోధన విభాగం (సీఐడీ)లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు పోలీస్ శాఖ కృషిచేస్తోంది. సీఐడీలో పనిచేస్తున్న వాళ్లకు 25 శాతం అదనపు వేతనం అందిస్తుంది. ఎందుకంటే ఇది శాంతి భద్రతల విభాగం కాకుండా సాధారణ నేరాలు, ఆర్థికమైన నేరాలు, సైబర్ క్రైమ్ నేరాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించే విభాగం. కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంకు వరకు అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేస్తుంటారు. అయితే ఈ విభాగంలో ఆశించిన రీతిలో ఫలితాలు వెల్లడికాకపోవడం, ఏళ్లకేళ్లుగా కేసులు పెండింగ్‌లోనే ఉండటం, కేసుల్లో శిక్షల శాతం పెరగకపోవడం ఇలా అనేక రకాల సమస్యలు పోలీస్ శాఖను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. ఈ విభాగాన్ని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా ప్రతి దర్యాప్తు అధికారి బృందం టార్గెట్ రీచ్ అయ్యేలా ఉన్నతాధికారులు మానిటరింగ్ చేయాల్సి ఉంది. దీనికోసం కేసు దర్యాప్తులో పురోగతి చూపించడంతో పాటు కోర్టులో విచారణ వేగవంతం చేయించడం, శిక్షలశాతం పెంచేలా చర్యలు చేపట్టబోతున్నారు. వీటిలో ఏ ఒక్క దానిలో కూడా పురోగతి సాధించకపోతే రెండు నుంచి మూడు సార్లు నోటీసులందించడం, ఆ తర్వాత కూడా పనితీరు మెరుగు పడకపోతే ఈ విభాగంలో పనిచేస్తున్నందుకు వచ్చే 25శాతం అదనపు వేతనం కోత విధించేలా పోలీస్ పెద్దలకు సిఫారసు చేసేలా విభాగాధిపతులు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అకాడమీలో కచ్చితంగా.. పాఠశాలల్లో పిల్లలు సరిగ్గా చదివితేనే వారి భవిష్యత్‌తో పాటు సమాజ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడదే రీతిలో రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల వ్యవహారంపై దృష్టి పెట్టింది. అయితే వీళ్లకి ఏడాదిపాటు శిక్షణ ఇచ్చే అధికారులు, సిబ్బంది (ట్రైనర్లు) పనితీరుపై అకాడమీ పెద్దలు దృష్టి పెట్టారు. ఏడాదిపాటు సరైన రీతిలో శిక్షణ పొందితే సంబంధిత నూతన అధికారులు, సిబ్బంది పోలీస్ శాఖకు వన్నెతేవడంతో పాటు సమాజ భద్రతలో పూర్తిస్థాయిలో విజయం సాధిస్తారు. కాబట్టి ఇక్కడే ట్రైనర్లు లోతైన అధ్యయనం చేసి ఏవిధమైన శిక్షణ ఇవ్వాలి, ఔట్ డోర్ శిక్షణలో మెళకువలు పెంచడం, ఇండోర్‌లో లెగ్ వర్క్ చేయించడం, కేసు స్టడీస్‌పై అవగాహన కల్పించడం, సమాజంలో ఎవరితో ఎలా మెలగాలి, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న అంశాలపై గ్రౌండ్ లెవల్లో నేర్పించాలి. ఇలాంటి వాటిలో సంబంధిత అధ్యాపకులుగా ఉన్న పోలీస్ అధికారులు మెరుగైన ఫలితాలు రాబట్టడంతో విఫలమైనా, సరైన రీతిలో శిక్షణ ఇవ్వకపోయినా అకాడమీ వారికి చెల్లిస్తున్న 15 శాతం అదనపు వేతనం కోతపెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. రెండుసార్లు హెచ్చరిక నోటీసులు జారీచేయడం, జారీచేసిన అంశాలపై ముందస్తుగానే ఫీడ్‌బ్యాక్ తీసుకొని మరీ చర్యలు చేపట్టేందుకు అకాడమీ పెద్దలు వర్క్ఔట్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే కొంత మంది ట్రైనర్లకు 15శాతం అదనపు వేతనం కోతపెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. -
హైకోర్టు ఆదేశాలతో సీఐడీలో చలనం
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ అస్తులు, నిందితుల అరెస్టుల విషయంలో ఇన్నాళ్లూ నిర్లిప్తంగా వ్యవహరించిన నేర పరిశోధన సంస్థ(సీఐడీ) ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో ఎట్టకేలకు ముందుకు కదిలింది. హాయ్‌ల్యాండ్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) అల్లూరి వెంకటేశ్వరరావును బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేసింది. హాయ్‌ల్యాండ్ తమది కాదంటూ ఈ నెల 16న అగ్రిగోల్డ్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు విషయంలో సీఐడీ వ్యవహరిస్తున్న తీరుపైనా న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తు తీరు మారకుంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసి, ఈ కేసు విచారణ బాధ్యతను దానికి అప్పగిస్తామని తేల్చిచెప్పింది. అగ్రిగోల్డ్‌కు, హాయ్‌ల్యాండ్‌కు సంబంధం లేదనే విషయాన్ని ముందుగానే ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీసింది. ఇవన్నీ తెలుసుకోలేనప్పుడు ఇక ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో తెలుసుకుని ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. హాయ్‌ల్యాండ్ విషయంలో చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఐడీ అధికారులు రంగంలోకి దిగక తప్పలేదు. ఉదయ్ దినకర్‌ను వదిలేసిన అధికారులు హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావుకు గురువారం గుంటూరు ఆరో అదనపు కోర్టు రిమాండ్ విధించింది. బుధవారం రాత్రి హాయ్‌ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) ఉదయ్ దినకర్‌లను గుంటూరులో అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో విచారించారు. అనంతరం ఉదయ్ దినకర్‌ను వదిలేసి అర్ధరాత్రి సమయంలో వెంకటేశ్వరరావు అరెస్టును చూపించారు. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావుతో కలిసి హాయ్‌ల్యాండ్ విషయంలో కుట్ర చేశాడనే అభియోగంపై డిపాజిట్ల యాక్ట్ 402, 403, 420 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. 27కు చేరిన అగ్రిగోల్డ్ నిందితుల సంఖ్య ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్(హాయ్‌ల్యాండ్) ఎండీగా 2005 ఆగస్టు 29న వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఆయన అరెస్టుతో అగ్రిగోల్డ్ కేసులో నిందితుల సంఖ్య 27కు చేరింది. వెంకటేశ్వరరావు ఆర్కా లీజర్స్తోపాటు మరో 18 కంపెనీల్లో అదనపు డైరెక్టర్, డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు. ఇవన్నీ అగ్రిగోల్డ్ గ్రూపునకు సంబంధించిన డొల్ల కంపెనీలే. వీటిలో 14 కంపెనీల్లో అగ్రిగోల్డ్ కేసుల్లో నిందితులైనఅవ్వా వెంకటశేషునారాయణరావు, కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, అవ్వా సీతారామారావు, సవడం శ్రీనివాస్, ఇమ్మడి సదాశివ వరప్రసాద్, అవ్వా హేమసుందర వరప్రసాద్, పఠాన్‌లాల్ అహ్మద్‌ఖాన్ తదితరులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. వివిధ రకాల ఆకర్షణీయ పథకాల పేరిట సేకరించిన డిపాజిట్ల సొమ్మును మొత్తం 156 డొల్ల సంస్థల్లోకి అగ్రిగోల్డ్ యాజమాన్యం మళ్లించడంపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గకుండా సీఐడీ దర్యాప్తు చేపడితేనే తమకు న్యాయం జరుగుతుందని డిపాజిటర్లు, ఏజెంట్లు కోరుతున్నారు. సీఐడీకి నిబద్ధత లేదు డీజీపీకి అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ వినతి సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ ఆస్తులు, కేసుల విషయంపై సీఐడీ దర్యాప్తులో నిబద్ధత లేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు విమర్శించారు. దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. ఈ మేరకు వారు గురువారం డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం, సీఐడీ దర్యాప్తులో నిర్లక్ష్యం వల్ల 211 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని చెప్పారు. అగ్రిగోల్డ్ సిస్టర్స్ కంపెనీలుగా ఉన్న 156 సంస్థల డైరెక్టర్లను సీఐడీ కçస్టడీలోకి తీసుకొని విచారించాలని, వారి పేరిట, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకొని బాధితులకు పంచాలని విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్లు, వారికుటుంబ సభ్యుల పేరిట ఉన్నబినామీ ఆస్తులను జప్తు చేసేందుకు సీఐడీ ఏనాడూ తగిన శ్రద్ధ చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీని కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అధ్యక్షులు బి.విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, ఉపప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్‌రావు ఉన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలోనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని డీజీపీ హామీ ఇచ్చినట్లు సమాచారం. -
ఐలయ్యపై కేసు నమోదుకు ఏపీ డీజీపీ ఆదేశం
సాక్షి, అమరావతి: ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై కేసు నమోదుకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు ఇచ్చారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాసి...కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆర్యవైశ్య సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఐలయ్యపై కేసు నమోదు చేయాలని సీఐడీ అధికారులను డీజీపీ మంగళవారం ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాతే డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే నవలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఐలయ్యకు వ్యతిరేకంగా రెండు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తక్షణమే వివాదాస్పద పుస్తకాన్ని నిషేధించిన, న్యాయపరంగా ఐలయ్యపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్యవైశ్య సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
డేంజర్ గేమ్... నేను మాత్రం బతికిపోయా!
కోల్‌కతా: రష్యాలో మొదలైన బ్లూ వేల్ ఛాలెంజర్.. సూసైడ్ గేమ్‌గా మారి 100 మందికి పైగా ప్రాణాలు బలి తీసుకున్న విషయం తెలిసిందే. మనదేశంలో కూడా ఇప్పటిదాకా అరడజను విద్యార్థులు ఈ భూతానికి బలైపోయారు. అయితే కోల్‌కతాకు చెందిన ఓ స్టూడెంట్ మాత్రం ప్రాణాలతో బయటపడి, ఆ భయానక అనుభవాన్ని వివరిస్తున్నాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఆ యువకుడు వాట్సాప్‌లో వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో బ్లూ వేల్ ఆటపై మక్కువ పెంచుకున్నాడు. ఓ స్నేహితుడి ల్యాప్ టాప్ నుంచి గేమ్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆట ఆడటం మొదలుపెట్టాడు. ఒక్కో లెవల్ దాటుకుంటూ మెల్లిగా 8 లెవల్‌కి చేరుకున్నాడు కూడా. తర్వాతి లెవెల్లో భాగంగా పెదవులను కోసుకోవాల్సి ఉంది. కానీ, భయంతో తాత్కాలికంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇంతలో అతను బ్లూ వేల్ గేమ్ ఆడుతున్న విషయాన్ని గమనించిన తోటివిద్యార్థులు విషయాన్ని కాలేజీ రిజిస్ట్రారర్ తపస్ సతాపతి దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే సోషల్ మీడియాలో దీని గురించి అవగాహన కల్పించటంతో తపస్ పోలీసుల సాయం కోరారు. గత బుధవారం ఓ సీఐడీ అధికారి, విద్యార్థిని మరియు అతని తల్లిదండ్రలను కూర్చోబెట్టి ఈ రాకాసి గేమ్ గురించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేశారు. ఆటలో భాగంగా తన చేతిపై బ్లేడ్‌తో గేమ్ సింబల్‌ను గీసుకున్న బాలుడు ఆ గాయన్ని చూపిస్తూ ‘నేను ప్రాణాలతో బతికిపోయా’ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ‘క్రమక్రమంగా బ్లూవేల్‌కు నేను బానిసను అయ్యాను. అందులోని ఒక్కో సూచనలు నాలో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. అయితే శరీరానికి గాయాలు చేసుకున్న సమయంలో మాత్రం కాస్త వణికిపోయాను’ అని అతను వివరించాడు. తన స్నేహితులకు, ఉపాధ్యాయులకు మరియు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐడీ ఆఫీసర్‌కు రుణపడి ఉంటానని సదరు విద్యార్థి చెబుతున్నాడు. బ్లూవేల్ గేమ్ దాటికి గత నెలలో ముంబైలో ఓ స్కూల్ విద్యార్థి భవనం నుంచి దూకి చనిపోగా, కేరళలోనూ ఓ ఆత్మహత్య నమోదయ్యింది. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో 13 ఏళ్ల పార్థ్ సింగ్ ఉరి వేసుకుని చనిపోయిన విషయం విదితమే. -
జేఎన్టీయూ నిర్లక్ష్యం కూడా కారణమే!
ఎంసెట్ లీకేజీపై చార్జిషీట్లో పేర్కొననున్న సీఐడీ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో జేఎన్టీయూ నిర్లక్ష్యం కచ్చితంగా ఉందంటూ సీఐడీ చార్జిషీట్లో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉన్న ఎంసెట్ ప్రశ్నపత్రాల ప్రింటింగ్‌లో నిర్లక్ష్యం బయటపడిందని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ శివారులోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి దేశవ్యాప్తంగా అనేక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకైనట్టు కేసులున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా అదే ప్రింటింగ్ ప్రెస్‌కు కాంట్రాక్ట్ ఇవ్వడంపై చార్జిషీట్లో అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. పలు రాష్ట్రాలకు చెందిన 9 ప్రశ్నపత్రాలు లీకైన దాఖలాలను తెలుసుకోకుండా ఏళ్లకేళ్లుగా అదే ప్రింటింగ్ ప్రెస్‌కు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనకున్న కారణాలను సైతం సీఐడీ అధికారులు చార్జిషీట్లో పేర్కొనబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, జేఎన్టీయూ వ్యవహారంపై విచారణ జరిపామని, నిందితులతో ఎక్కడా సంబంధా లున్నట్టు ఆధారాల్లేవని సీఐడీ చార్జిషీట్లో స్పష్టం చేయనుంది. అధికారుల పాత్ర పైనా తాము విచారణ జరిపామని, నిందితులతో గతంలో కూడా ఎలాంటి సంబంధాలున్నట్టు బయటపడలేదని సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. ఈ వారంలో ఎంసెట్ లీకేజీపై చార్జిషీట్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. -
సునీల్ చెక్కేశాడా..?
► వాణిజ్య పన్నుల శాఖలో పన్నుఎగవేత కుంభకోణం కేసు నిందితుడు ► ఫిబ్రవరిలో ఎక్స్పైర్డ్ అయిన సునీల్ పాస్‌పోర్టు.? ► బినామీ పాస్‌పోర్టుపై విదేశాలకు వెళ్లాడా..? ఆరా తీస్తున్న సీఐడీ అధికారులు నిజామాబాద్ :బ్యాంకులకు రూ. వేల కోట్ల కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు వెళ్లిపోయిన విజయ్‌మాల్యా మాదిరిగానే.. వాణిజ్య పన్నుల శాఖకు రూ.వందల కోట్ల పన్ను ఎగనామం పెట్టిన సునీల్ కూడా విదేశాలకు చెక్కేశాడా..? బోధన్ వాణిజ్యపన్నుల శాఖలో జరిగిన కుంభకోణంలో కీలక సూత్ర, పాత్రధారి శివరాజ్ కుమారుడు సునీల్ దేశం విడిచి వెళ్లిపోయాడా.? ఈ కోణంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు సునీల్ పాస్‌పోర్టు వివరాలపై ఆరా తీసింది. అయితే సునీల్ పాస్‌పోర్టు మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎక్స్పైర్డ్ అయినట్లు సీఐడీ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో సునీల్ దేశంలో రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడా.? బినామీ పాస్‌పోర్టుపై విదేశాలకు వెళ్లిపోయాడా..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రూ. వందల కోట్లు వ్యాట్, సీఎస్టీ ఎగనామం పెట్టిన కేసులో శివరాజ్ తర్వాత సునీల్ రెండో కీలక సూత్ర, పాత్రధారి. అయితే ఎ1 నిందితుడిగా ఉన్న శివరాజ్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేసినప్పటికీ.. అనారోగ్యం పేరుతో ఆయన్ను పూర్తిస్థాయిలో ïసీఐడీ అధికారులు ప్రశ్నించలేకపోతున్నారు. ఇటీవల న్యాయస్థానం అనుమతితో కేవలం ఒకరోజు మాత్రమే కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు తిరిగి జైలుకు పంపారు. వైద్యుల పర్యవేక్షణలో శివరాజ్‌ను సీఐడీ ప్రశ్నించాల్సి వచ్చింది. దీంతో అనుకున్న మేరకు ఈ కేసు దర్యాప్తు వేగవంతం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శివరాజ్‌తో పాటు కుంభకోణాన్ని నడిపిన సునీల్‌ను అరెస్టు చేసి, విచారిస్తే కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. మూడు నెలలుగా జాడ లేదు.. ఈ కుంభకోణంపై వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతా«ధికారులు బోధన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శివరాజ్, సునీల్‌లతో పాటు, బోధన్ సీటీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏసీటీఓ విజయ్‌కృష్ణ, మరో ఇద్దరు సిబ్బంది హన్మాన్‌సింగ్, వేణుగోపాల్‌లపై ఫిబ్రవరి 2న బోధన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దాదాపు 40 రోజుల అనంతరం విజయ్‌కృష్ణ యాంటిసిపేటరీ బెయిల్ కోసం బోధన్ కోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు జుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విజయ్‌కృష్ణను బోధన్ జైలుకు తరలించారు. వేణుగోపాల్, హన్మాన్సింగ్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత శివరాజ్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కానీ సుమారు మూడు నెలలుగా సునీల్ జాడ లేకుండా పోయింది. -
సీఐడీ కస్టడీకి అగ్రిగోల్డ్ డైరెక్టర్లు
ఏలూరు అర్బన్: మదుపుదారులకు సొమ్ములు ఎగవేసిన కేసులో ఏ–11, ఏ–12 నిందితులుగా ఉన్న అగ్రిగోల్డ్ డైరెక్టర్లు సవడం శ్రీనివాసరావు, డొప్పా రామ్మోహనరావులను సీఐడీ పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. వీరిద్దరినీ సీఐడీ అదనపు డైరెక్టర్ టి.హరికృష్ణ విజయవాడలో అరెస్ట్ చేసి ఏలూరులోని జిల్లా కోర్టులో హాజరుపరిచిన విషయం విదితమే. నిందితులకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించగా, ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. కేసుకు సంబంధించి మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున ఇద్దరు డైరెక్టర్లను తమ కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తూ సీఐడీ విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.సునీత వారిని 5 రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతించారు. దీంతో రాజమండ్రి సీఐడీ కార్యాలయం నుంచి ఎస్సైలు వీరబాబు, ఏవీ రమణ ఏలూరులో జిల్లా జైలుకు చేరుకుని వారిరువురినీ తమ అధీనంలోకి తీసుకున్నారు. అప్పటికే కోర్టు నుంచి ఉత్తర్వులు అందుకున్న జైలర్ చంద్రశేఖరరావు నిందితులిద్దరికీ వైద్య పరీక్షలు చేయించి సీఐడీకి అప్పగించారు. అనంతరం వారిని విజయవాడలోని సీఐడీ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. -
సీఐడీ అదుపులో అగ్రిగోల్డ్ డైరెక్టర్లు
-
నిజామాబాద్ జైలుకు శివరాజ్
- మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన అధికారులు - 14 రోజుల కస్టడీకి ఆదేశం సాక్షి, నిజామాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో వందల కోట్ల రూపాయల పన్ను ఎగవేత కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్‌ను సీఐడీ అధికారులు బుధవారం తెల్లవారు జామున బోధన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సౌజన్య ముందు హాజరుపర్చారు. వారం క్రితమే శివరాజ్‌ను అదుపులోకి తీసు కున్న సీఐడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో బోధన్‌కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. శివరాజ్‌ను 14 రోజు ల జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యా యమూర్తి సౌజన్య ఆదేశించారు. అనంతరం శివరాజ్‌ను నిజామాబాద్ సబ్‌జైలుకు తరలిం చారు. కాగా వారం క్రితం శివరాజ్‌ను పట్టు కున్న క్రమంలో ఆయన అస్వస్థతకు గురికాగా కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం శివ రాజ్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి అర్ధరాత్రి బోధన్‌కు తరలించారు. అరెస్టు ప్రక్రియలో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. రెండు నెలలుగా పరారీలో.. రూ.వందల కోట్ల పన్ను ఎగవేత కుంభకోణం కేసులో శివరాజ్ ప్రధాన నిందితుడు. అతని కుమారుడు సునీల్ ఏ–2గా ఉన్నాడు. మిగతా ముగ్గురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. శివరాజ్‌తో పాటు, అతని కుమారుడు సునీల్ రెండు నెలలుగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పరారీలోనే ఉన్న సునీల్ కోసం సీఐడీ ప్రత్యేకబృందాలు గాలిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో సునీల్‌ను కూడా సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరిన్ని రికార్డులు స్వాధీనం ఈ కేసులో సీఐడీ అధికారులు శివరాజ్‌కు సంబంధించిన మరిన్ని రికార్డులను మంగళ వారం స్వాధీనం చేసుకున్నారు. నిజామా బాద్‌లో పలుచోట్ల దాచిన రికార్డులు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని సీఐడీ అధికారులు సేకరించారు. తాజాగా మంగళ వారం కూడా కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. శివరాజ్‌ను కస్టడీకి ఇవ్వాలని గురువారం సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది. -
బాబూ.. మా గోడు పట్టదా?
-
దర్యాప్తును క్యాష్ చేసుకున్నారు!
⇒ కమర్షియల్ ట్యాక్స్ స్కాం దర్యాప్తులో సీఐడీ అధికారులపై ఆరోపణలు ⇒ నిందితులు లొంగిపోయేందుకు సహకారం ⇒ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కేసు నీరుగార్చిన వైనం ⇒ ఉన్నతాధికారుల విచారణలో తేటతెల్లం ⇒ దర్యాప్తు అధికారితోపాటు మరో ఇద్దరిపై వేటుకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: బోధన్ కమర్షియల్ ట్యాక్స్ కేసు పక్కదారి పట్టింది. వందల కోట్లు దిగమింగిన కేసులో నిందితులకు సీఐడీ అధికారులు సహకరించినట్టు ఆరోపణలు రావడం సంచలనాత్మకంగా మారింది. నిందితు లతో కుమ్మక్కై, వారు అరెస్ట్ కాకుండా నేరుగా కోర్టులో లొంగిపోయేలా సహకరించడంతో పాటు స్కాంలో ఆరోపణలెదుర్కొంటున్న ఉన్నతాధికారుల పాత్ర బయటకు రాకుండా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ ముఖ్యమంత్రికి నివేదిక అందించి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధాన నిందితుడితో డీల్ బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాం దర్యాప్తును కొందరు అధికారులు సొమ్ము చేసుకున్నట్టు సీఐడీ చేసిన అంతర్గత విచారణలో బయటప డింది. నిందితులకు సహకరించడంతోపాటు లొంగిపోయేలా తోడ్పాటు అందించారని దర్యాప్తు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. నిందితులను అరెస్ట్ చేసేందుకు ఉన్నతాధి కారులు కృషి చేస్తుంటే దర్యాప్తు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది నిందితులతో ఒప్పం దం కుదుర్చుకున్నట్టు విచారణలో బయటకు వచ్చింది. ప్రధాన నిందితుడు శివరాజ్‌తో ఈ డీల్ కుదుర్చుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. అలాగే కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ముగ్గురు జాయింట్ కమిషనర్ల పాత్రపై వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు కూడా ఒప్పందం జరిగినట్లు తేటతెల్లమైంది. అందులో భాగంగా మొదటి దశలో.. ఏసీ టీవో, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ లొంగి పోయినట్టు ఉన్నతాధికారులు బయట పెట్టారు. రెండో దశలో.. ప్రధాన నిందితుడు, కేసులో సూత్రధారి అయిన ఏ1 శివరాజు, ఏ2 గా ఉన్న అతడి కుమారుడు సునీల్ లొంగి పోయేలా సహకరించేందుకు ప్రయత్నాలు చేశారని అధికారులు తెలిపారు. బయటకు పొక్కడంతో.. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ.. పైగా ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న ఈ కేసులో ముగ్గురు నిందితులు లొంగిపోయిన వ్యవహారంపై ఆరోపణలు బయటకు పొక్కాయి. దీనితో రెండో దశలో భాగంగా లొంగిపోవాలని ప్రయత్నించిన శివరాజు వ్యవహారంలో ఒప్పందం అడ్డం తిరిగింది. సీఐడీ ఉన్నతా ధికారులు సీరియస్‌గా స్పందించడంతో దర్యాప్తు అధికారులు శివరాజు కోసం వేట సాగించారు. తమిళనాడు సరిహద్దులో అదు పులోకి తీసుకోవడం, తీవ్ర ఒత్తిడికి గురైన శివరాజుకు గుండెపోటు రావడం.. ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే ఎక్కడా విషయం బయటకు పొక్కకుండా దర్యాప్తు అధికారులు ప్రయత్నించారని ఉన్నతాధికా రుల ద్వారా తెలిసింది. ప్రభుత్వ విభాగంలో వందల కోట్లు కాజేసిన కీలక కేసులోనే సీఐడీ అధికారులు ఇలా వ్యవహరించారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థమవుతోంది. ఇలాంటి అధికారుల తీరుపై సొంత విభాగం అధికారులే సిగ్గుపడుతున్నారు. దర్యాప్తు అధికారిపై వేటుకు రంగం సిద్ధం స్కాం దర్యాప్తు తీరు, కుంభకోణం జరిగిన పూర్తి వ్యవహారంపై సీఐడీ ఉన్న తాధికారులు సీఎం కేసీఆర్‌కు నివేదిక పంపి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. బోధన్‌లో మాత్రమే కాదని, ఇలా పలుచోట్ల 2010 నుంచి జరిమానాల సొమ్ము పక్క దారి పట్టినట్టు అనుమానాలున్నాయన్న విష యాన్ని సీఐడీ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. ప్రసుత్తం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న డీఎస్పీతో పాటు ఇద్దరు ఇన్ స్పెక్టర్లపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు డీజీపీ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. డీఎస్పీ స్థాయి అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లను కేసు నుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలిపాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా కచ్చితమైన ఆదేశాలు వచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.