ఏలూరు అర్బన్: మదుపుదారులకు సొమ్ములు ఎగవేసిన కేసులో ఏ–11, ఏ–12 నిందితులుగా ఉన్న అగ్రిగోల్డ్ డైరెక్టర్లు సవడం శ్రీనివాసరావు, డొప్పా రామ్మోహనరావులను సీఐడీ పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. వీరిద్దరినీ సీఐడీ అదనపు డైరెక్టర్ టి.హరికృష్ణ విజయవాడలో అరెస్ట్ చేసి ఏలూరులోని జిల్లా కోర్టులో హాజరుపరిచిన విషయం విదితమే. నిందితులకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించగా, ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు.
కేసుకు సంబంధించి మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున ఇద్దరు డైరెక్టర్లను తమ కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తూ సీఐడీ విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.సునీత వారిని 5 రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతించారు. దీంతో రాజమండ్రి సీఐడీ కార్యాలయం నుంచి ఎస్సైలు వీరబాబు, ఏవీ రమణ ఏలూరులో జిల్లా జైలుకు చేరుకుని వారిరువురినీ తమ అధీనంలోకి తీసుకున్నారు. అప్పటికే కోర్టు నుంచి ఉత్తర్వులు అందుకున్న జైలర్ చంద్రశేఖరరావు నిందితులిద్దరికీ వైద్య పరీక్షలు చేయించి సీఐడీకి అప్పగించారు. అనంతరం వారిని విజయవాడలోని సీఐడీ ఎస్పీ కార్యాలయానికి తరలించారు.
సీఐడీ కస్టడీకి అగ్రిగోల్డ్ డైరెక్టర్లు
Published Thu, Apr 6 2017 1:05 AM | Last Updated on Mon, May 28 2018 3:04 PM
Advertisement
Advertisement