స్కిల్‌ స్కామ్‌: సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు | Skill Development Scam: Key Points Of Cid Remand Report | Sakshi
Sakshi News home page

స్కిల్‌ స్కామ్‌: సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Published Sun, Sep 10 2023 7:46 AM | Last Updated on Sun, Sep 10 2023 11:12 AM

Skill Development Scam: Key Points Of Cid Remand Report - Sakshi

సాక్షి, విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రిమాండ్‌ రిపోర్టును సీఐడీ.. కోర్టుకు సమర్పించింది. స్కిల్‌ స్కాంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని సీఐడీ పేర్కొంది. బాబుపై నేరపూరిత కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం, మోసం అభియోగాలు ఉన్నాయి. నిన్న ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును అరెస్ట్‌ చేశాం. స్కిల్‌ స్కాంలో రూ.550 కోట్ల కుంభకోణం జరిగింది. ప్రభుత్వ సొమ్మును షెల్‌ కంపెనీలు, ఫేక్‌ ఇన్వాయిస్‌ ద్వారా దారి మళ్లించారని సీఐడీ తెలిపింది.

‘‘స్కిల్‌ స్కామ్‌లో ప్రభుత్వానికి రూ.300 కోట్లు నష్టం జరిగింది. ఒప్పందం ఉల్లంఘిస్తూ రూ.371 కోట్ల అడ్వాన్సులు చెల్లింపు. ప్రభుత్వ నిధుల్లో భారీ మొత్తం షెల్‌ కంపెనీలకు తరలించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ప్రభుత్వం నిధులు షెల్‌ కంపెనీలకు మళ్లించారు.  కీలక డాక్యుమెంట్ల మాయం వెనుక చంద్రబాబు హస్తం ఉంది మరింత విచారణకు చంద్రబాబును కస్టడీకి తీసుకోవాల్సి ఉంది. అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలతో చంద్రబాబే సూత్రధారి అని తేలింది.’’ అని సీఐడీ పేర్కొంది.

రిమాండ్‌ రిపోర్టులో నారా లోకేష్‌ పేరును కూడా సీఐడీ ప్రస్తావించింది. కిలారి రాజేశ్‌ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని పేర్కొంది. ‘‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ వివరాలను అచ్చెన్నాయుడికి సమర్పించారు. ప్రాజెక్ట్‌లో లోటు పాట్లు తప్పిదాలు ఉన్నప్పటికీ చంద్రబాబు, అచ్చెన్నాయుడు కలిసి ఓకే చేశారు. స్కిల్‌ ప్రాజెక్టులో సిమెన్స్‌ కంపెనీ రూ.3281 కోట్లు గ్రాంట్‌గా ఇస్తుందని  బాబు, అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పారు.

చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ ద్వారా ముడుపులు అందాయి స్కిల్‌ స్కాంకు సంబంధించిన ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్‌ చేసింది. స్కిల్‌ స్కాంలో ఈడీ విచారణ కీలక దశలో ఉంది. కేసులో మనోజ్‌ వాసుదేవ్‌కు సెప్టెంబర్‌ 5న నోటీసులు ఇచ్చాం. మా నోటీసులకు జవాబు ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారు. వీళ్లను చంద్రబాబే కాపాడుతున్నారని మా అనుమానం’’ అని సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపింది.
చదవండి: ఎన్నెన్ని పాపాల్‌... ఎన్నెన్ని శాపాల్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement