ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్ కేసులో మరో నిందితుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్ కేసులో మరో నిందితుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు రామకృష్ణను పుణెలో అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిని పంజాబ్లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే సీఐడీ అధికారులు మాత్రం అరెస్ట్ను ధ్రువీకరించలేదు. మరోవైపు కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. న్యూఢిల్లీ శివారులోని కపూర్ ప్రింటర్స్ నుంచి ప్రశ్నాపత్రం లీకైనట్లు నిర్థారించారు. పేపర్ లీక్ చేసిన ఖలీల్... అయిదుగురు దళారులకు విక్రయించినట్లు గుర్తించారు.
ఈ ప్రశ్నాపత్రాన్ని ఖలీల్ అనే వ్యక్తి చెన్నై, పూనె, భువనేశ్వర్, ముంబై, బెంగళూరులో విక్రయించాడు. సుమారు 200మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సీఐడీ అధికారుల విచారణలో నిర్థారణ అయింది. కాగా ఎంసెట్-2ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు మెడికల్ కోర్సుల కోసం దాదాపు ఐదు ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులంతా మరోసారి ప్రవేశపరీక్ష రాసి తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.