![Ganta Srinivasa Rao Gang Hulchul In Front of CID Office Visakhapatnam - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/24/ganta3.jpg.webp?itok=WEaMrl5n)
దొండపర్తి(విశాఖ దక్షిణ)/ఆరిలోవ(విశాఖ తూర్పు): సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గ్యాంగ్ హల్‌చల్ చేసింది. ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటినప్పటికీ.. గంటా ఇప్పటి వరకు నియోజకవర్గం మొహం చూడలేదు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. టీడీపీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విష ప్రచారం చేసి పట్టుబడిన నిందితుడు నలంద కిశోర్‌కు మద్దతుగా 3 గంటల పాటు సీఐడీ కార్యాలయం ఎదుట నిరీక్షించడంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలో నియోజకవర్గంలో ఒకసారి కూడా పర్యటించని గంటా శ్రీనివాసరావు, అతని బ్యాచ్.. ఓ కేసులో అరెస్టయిన వ్యక్తి కోసం బయటకు రావడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపైనే కాకుండా, ప్రభుత్వ పెద్దలపై నలంద కిశోర్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడంతో సీఐడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.(ఈ సోషల్ తీవ్రవాదం.. టీడీపీ ఉన్మాదం!)
సీఐడీ కార్యాలయం వద్ద వేచి ఉన్న టీడీపీ నేతలు
విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అతని గ్యాంగ్ పరుచూరి భాస్కరరావు, మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబుతో పాటు మరికొంత మంది ఉదయమే సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి నలంద కిశోర్‌ను కర్నూలుకు తరలించేంత వరకు అక్కడే ఉండి తెగ హడావుడి చేశారు. కిశోర్‌ను కలవడానికి సీఐడీ కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అతని లాయర్‌ను మాత్రమే లోపలకు అనుమతించారు. దీంతో గంటాతో పాటు అతని బ్యాచ్ మొత్తం ఎవరెవరికో ఫోన్లు చేస్తూ అక్కడి పరిస్థితులను వివరిస్తూ సీఐడీ కార్యాలయం ఎదుట రోడ్డు మీద కలియతిరిగారు. నిందితుyì ని కారులో కర్నూలుకు తరలించడానికి బయటకు తీసుకువచ్చిన సమయంలో కూడా గంటాకు చెందిన కొంత మంది అనుచరులు ‘అన్నా భయపడొద్దు.. మేమంతా అండగా ఉన్నాం’ అంటూ అరుపులు అరిచారు. ఉదయం 11.30 గంటలకు నిందితుడిని తరలించిన వాహనం వెనుక కొంత మంది ఫాలో అయ్యారు. గంటా మాత్రం మీడియాతో మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment