సాక్షి, విశాఖపట్నం: వారం రోజుల క్రితం సోషల్ మీడియా కార్యకర్త రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ వచ్చి రమణారెడ్డిని ప్రకాశం జిల్లా పోలీసులు తీసుకెళ్లారని.. రోజుకోక పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమణారెడ్డి వివరాలు అడిగినా పోలీసులు చెప్పడం లేదంటున్నారు. అర్ధరాత్రి వేళ తీసుకెళ్తూ.. ఇంటి సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు డీలీట్ చేశారు.
ఇంటికి వచ్చిన వెంటనే రమణారెడ్డి నుంచి మొబైల్‌ను పోలీసులు తీసేసుకున్నారు. బెయిల్ ఇస్తామంటూ ప్రకాశం జిల్లాలోని స్టేషన్లను పోలీసులు తిప్పుతున్నారు. మామ ఆచూకీ కోసం పోలీస్‌స్టేషన్ల చుట్టూ రమణారెడ్డి అల్లుళ్లు తిరుగుతున్నారు. రమణారెడ్డి ఆచూకీ తెలియక తల్లి,భార్య, కుమార్తెలు తల్లడిల్లిపోతున్నారు. రమణారెడ్డి ఫోన్‌ను పోలీసులు తీసేసుకున్నా ఆయన ఫోన్ నుంచి ఎక్స్‌లో పోస్టులు పెట్టినట్లుగా కనిపిస్తున్నాయని ఆయనకు కుమార్తె తెలిపింది. రమణారెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆయన కుటుంబసభ్యులు అంటున్నారు.
కాగా, కూటమి సర్కార్ తప్పిదాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి అక్రమ కేసులు బనాయిస్తోంది. నిన్నటివరకు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారని నేరుగా కేసులు పెట్టి వేధించడంపై విమర్శలు రావడం, న్యాయస్థానం సైతం గట్టిగా ప్రశ్నించడంతో సరికొత్త పన్నాగం పన్నింది. ప్రభుత్వ పరంగా నేరుగా కేసులు పెట్టకుండా పచ్చ బ్యాచ్‌ను రంగంలోకి దించింది. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క బాపట్ల జిల్లాలోనే ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు (24 గంటల్లో) 29 కేసులు నమోదు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment