ganta srinavasa rao
-
మాకిచ్చే గౌరవం ఇదేనా?
కొలువు దీరిన కొత్త మంత్రి వర్గంలో ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతలకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన వారిని పక్కన పెట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒక్కరినే మంత్రి పదవికి ఎంపిక చేయడంపై సీనియర్ నేతలు మండిపడుతున్నారు.. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు పై చంద్రబాబుకు ఉన్న గౌరవం ఇదేనా అంటూ తమ అనుచరులు వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పుపై ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. కొత్తగా ఎంపిక చేసిన మంత్రివర్గ జాబితాలో తమ పేర్లు లేకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రులు అయ్యన్న, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి మంత్రి పదవులు ఆశించారు.. మీరు కాకుండా వెలగపూడి రామకృష్ణ బాబు గణబాబు పల్లా శ్రీనివాస్ ఈసారి తమకు మంత్రి పదవి లభిస్తుందని భావించారు.. వీరిని ఎవరిని కాదని జూనియర్ అయినా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవిని చంద్రబాబు కట్టబెట్టారు.అయ్యన్న ఒకసారి ఎంపీ ఏడుసార్లు ఎమ్మెల్యేగా మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.. గంటా ఒకసారి ఎంపీ 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బండారు సత్యనారాయణ మూర్తి కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.. గతంలో మంత్రిగా పనిచేశారు.. వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఈసారి మంత్రివర్గ జాబితాలో తమకు స్థానము లభిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.. వీరందరి ఆశలపైన చంద్రబాబు నీళ్లు జల్లారు.. అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద అయితే టిడిపి కార్యకర్తలు కాబోయే మంత్రి అయ్యన్నపాత్రుడు కి శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు..పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ తరపున వాయిస్ వినిపించింది అయ్యన్న పాత్రుడని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు.. చంద్రబాబు లోకేష్ మాటలు విని ఆయన కేసులు కూడా పెట్టించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.. పార్టీలో సీనియర్ నేత అయిన అయ్యన్నకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. బండారు సత్యనారాయణమూర్తి అయితే పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాలను జనసేనకు విడిచిపెట్టామని గుర్తు చేస్తున్నారు.పొత్తులో భాగంగా తమ సొంత నియోజకవర్గలను వదిలి పక్క నియోజకవర్గాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.. పార్టీ కోసం త్యాగాలు చేసిన తాము చంద్రబాబుకు ఎందుకు గుర్తు రాలేదంటున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టడమేంటని మండిపడుతున్నారు.. కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఆశించి గంటా శ్రీనివాసరావు బంగపడ్డారు. గంటను కాదని తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి కట్టబెట్టారు.. 24 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే అందులో ఎంతమంది సీనియర్లకు అవకాశం కల్పించారని మంత్రివర్గంలో స్థానం లభించని నేతలు అంటున్నారు. చంద్రబాబు మంత్రివర్గ కూర్పును సొంత పార్టీ నేతలే హర్షించని పరిస్థితి ఉమ్మడి విశాఖ జిల్లాలో నెలకొంది. -
విశాఖ నార్త్ సీటుపై గంటా శ్రీనివాసరావు గరం గరం
-
గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్!
టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం తర్వాత తొలిసారి స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈ క్రమంలో ఆయన రాజీనామాను స్పీకర్‌గా ఆమోదించడంలో రాజకీయ కుట్ర ఏముందని తమ్మినేని ప్రశ్నించారు. గడువు తర్వాతే నిర్ణయం.. గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను నాకు ఎప్పుడో ఇచ్చారు. పైగా స్పీకర్ ఫార్మాట్లోనే ఆయనే ఇచ్చారు. ఎమ్మెల్యేగా తప్పుకుంటానని తెలిపారు. లేఖ ఇవ్వగానే ఆమోదించడం సరికాదని వేచిచూశాం. మనసు మార్చుకుంటాడన్న మానవతా దృక్పథంతో ఇప్పటివరకు ఆగాను. ఇప్పుడు స్పీకర్‌గా నా పదవీకాలం ముగుస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఇన్నాళ్లు అవకాశం ఇచ్చినా నిర్ణయాన్ని మార్చుకోలేని ఇప్పుడెలా మార్చుకుంటాడని భావించాను. పదవీ కాలం సమీపిస్తుండడంతో రాజీనామాను ఆమోదించాను. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు అమ్ముడుబోయి.. చరిత్రహీనులుగా మిగిలి.. ఈ విషయంలో గంటా శ్రీనివాసరావు ఏదైనా భిన్నంగా ఆలోచిస్తే.. కోర్టుల ద్వారా ముందుకు వెళ్లొచ్చు. రాజీనామా ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం అనేది సరికాదు. చట్టసభల విషయంలో నియమ నిబంధనలను పాటించాలి. ఒక వేళ గంటా శ్రీనివాసరావు ఓటుతోనే అధికార పార్టీ రాజ్యసభ సీట్లు ఆధారపడిలేవు కదా. వైఎస్సార్సీపీ రాజ్యసభ సీటు కోల్పోతుంది అని ప్రచారం చేస్తున్న విషయమే కరెక్టయితే అందరికీ నోటీసులు ఎందుకు ఇస్తాం? ఇప్పటివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ నోటీసులు ఇచ్చాను. వారంలోపు అన్ని పిటిషన్లు క్లియర్ చేస్తాం. స్పీకర్ లేఖలు.. ఒక పార్టీ నుంచి గెలిచి.. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇరుకునపడ్డారు. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఇప్పటికే అనర్హతా వేటు ఎదుర్కొంటున్నారు. వీరిపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడంతో స్పీకర్ వీరికి నోటీసులిచ్చారు. ఈ నెల 25లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాలు గడువు కావాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు కోరినట్టు తెలిసింది. వారంలో ఏం జరగనుంది? స్పీకర్‌గా తన పదవీ కాలం సమీపిస్తుండడంతో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లపై వారంలోగా నిర్ణయం తీసుకుంటానని తమ్మినేని ప్రకటించడం తెలుగుదేశంలో గుబులు రేపుతోంది. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన నలుగురిని వెంటనే లాగేసుకున్న చంద్రబాబు.. తాజాగా జరుగుతున్న పరిణామాలపై గుంభనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నలుగురికి తెలుగుదేశం టికెట్ ఇచ్చి పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు. పక్కపార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదు. 2014-19 మధ్య ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బోలెడు డబ్బు గుమ్మరించి లాగేసుకున్న చంద్రబాబుకు ఎన్నికల్లో 23 సీట్లతో సరిపెట్టారు ఓటర్లు. ఇక ఇప్పటి విషయానికి వస్తే.. అనర్హతా పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకుని వేటు వేస్తే.. ఈ నలుగురు కూడా పోటీ చేసేందుకు అర్హతా కోల్పేయే అవకాశం ఉంది. అది స్పీకర్ విశిష్టాధికారం అనర్హత వేటు అన్నది పూర్తిగా స్పీకర్ నిర్ణయం. స్పీకర్ వ్యవస్థ పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. గంటా రాజీనామాను ఆమోదించాలన్నది స్పీకర్ నిర్ణయం. ఎప్పుడు ఆమోదించాలో అన్నది కూడా ఆయన నిర్ణయమే. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు YSRCP గెలుస్తుంది. 19 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎలా గెలుస్తుందనుకుంటారు? అసలు టీడీపీకి తగినంత సంఖ్యాబలమే లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. -
విశాఖ టీడీపీలో గంటా శ్రీనివాసరావు రచ్చ.. అయ్యన్నపాత్రుడి ఆగ్రహం!
విశాఖ తెలుగుదేశంలో గంటా శ్రీనివాసరావు రచ్చ రచ్చ చేస్తున్నారు. గంటాకు ప్రాధాన్యత ఇస్తే సహించేది లేదని అయ్యన్నపాత్రుడు తెగేసి చెబుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పాలని డిసైడ్ అయ్యారట అయ్యన్న. గంటా విషయంలో బాబుతో తాడో పేడో తేల్చుకుంటానంటున్న అయ్యన్న ఏం చేయబోతున్నారు? వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా వారిమధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత గంటా కొద్ది రోజుల క్రితం వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలను అయ్యన్నపాత్రుడే నిర్వహించారు. ఈ నాలుగేళ్లలో పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమానికీ గంటా హాజరు కాలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు కూడా పార్టీలో గంటాకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇదే అయ్యన్న వర్గీయులకు మింగుడుపడటం లేదు. నాలుగేళ్ల పాటు పార్టీకి దూరంగా ఉండి.. ఇప్పుడు హడావుడి చేస్తున్న గంటాకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అయ్యన్న వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిసిన వేపాడ చిరంజీవి విజయాన్ని కూడా గంటా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తానే పెద్ద దిక్కు అయినట్లు గంటా హడావుడి చేస్తున్నారు. ఇవన్నీ అయ్యన్న వర్గీయులకు రుచించడం లేదు. నాలుగేళ్లగా తాము పార్టీ కోసం కష్టపడుతున్నామని.. గంటా మాత్రం తన వియ్యంకుడు మాజీ మంత్రి నారాయణకు ఇబ్బందులు వస్తాయని ఇంట్లోనుంచి బయటకే రాలేదని అయ్యన్న టీమ్ సెటైర్లు వేస్తోంది. చదవండి: తిరుపతిలో సుగుణమ్మకు పరపతి కరువైందా? టికెట్ వేటలో ఆమెకు పోటీగా నలుగురు! పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం మీడియాకు లీకులు ఇచ్చుచుకుంటూ నాలుగేళ్ల పాటు కాలాక్షేపం చేసిన గంటాకు పార్టీ అధినేత ప్రాధాన్యత ఇవ్వడాన్ని అయ్యన్న వర్గీయులు తప్పు పడుతున్నారు. ఆయన లాంటి నాయకులు పార్టీకి అవసరం లేదని, కులం పేరు చెప్పుకుని పదవులు అనుభవించిన చరిత్ర గంటాదని, తామెప్పుడు పదవుల ఆశించి రాజకీయాలు చేయలేదని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు. చంద్రబాబు విశాఖ టూర్ సందర్భంగా అయ్యన్న వర్గీయులు అందరూ చంద్రబాబుతో అంటీ ముట్టినట్లుగా వ్యవహరించారు. అయ్యన్నపాత్రుడు అయితే చంద్రబాబు పర్యటనకు ఒక రోజు ముందు విశాఖలో జరిగిన టీడీపీ బీసీ సదస్సుకు కూడా డుమ్మా కొట్టారు. నర్సీపట్నంలో అందుబాటులో ఉండి కూడా సదస్సుకు హాజరు కాలేదు. చంద్రబాబు విశాఖ పర్యటన ఏర్పాట్లను కూడా అయ్యన్న పర్యవేక్షించలేదు. ఉత్తరాంధ్ర సమీక్షా సమావేశంలో కూడా అయ్యన్న చంద్రబాబుతో దూరం పాటిస్తూ వచ్చారు. చంద్రబాబు సమావేశంలో పదే పదే కల్పించుకొని అయ్యన్న పేరు ప్రస్తావించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే..అయ్యన్న అలకను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని గంటా వర్గీయులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అయ్యన్నకు నర్సీపట్నం ఎమ్మెల్యే, ఆయన కుమారుడు విజయ్ కు అనకాపల్లి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఈ రెండు సీట్లపై ఇప్పటివరకు చంద్రబాబు నుంచి అయ్యన్నకు స్పష్టమైన హామీ లభించలేదు. తన కుమారునికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడం సాధ్యం కాకపోయినా మాడుగుల అసెంబ్లీ సీటు అయినా ఇవ్వాలని అయ్యన్న కోరుతున్నారు. చదవండి: టీడీపీ సీనియర్ నేతకు షాక్.. బాబు వద్దకు పంచాయితీ! ఈ రెండు సీట్లును సాధించుకోవడం కోసమే అయ్యన్నపాత్రుడు వ్యూహాత్మకంగా చంద్రబాబు పర్యటన సందర్భంగా అలక అస్త్రాన్ని తెరపైకి తెచ్చారని గంటా వర్గీయులు ఆరోపిస్తున్నారు. అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేయడం అయ్యన్నకు ఇదేమి తొలిసారి కాదని, తన కోర్కెలు నెరవేర్చుకునేందుకు వివిధ రూపాల్లో అసంతృప్తిని వ్యక్తపరుస్తారని కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోసారి అయ్యన్న, గంటా మధ్య విభేదాలు రచ్చకెక్కడం తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని.. గ్రూపు రాజకీయాలు ఎటువైపుకు తీసుకువెళ్తాయోనని ఆందోళన చెందుతున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ -
సినిమాల్లో నటించడానికి మొదట్లో భయం వేసింది: సాయిచరణ్
సాయిచరణ్, పల్లవి, ట్య్రాన్సీ ముఖ్య తారలుగా శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఐక్యూ’. కాయగూరల లక్ష్మీపతి సమర్పణలో బొమ్మదేవర రామచంద్రరావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత కేఎస్ రామారావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఒకప్పుడు సినిమాలకు టెలివిజన్ ఒక్కటే విరోధి. ఇప్పుడు ఓటీటీ కూడా. కరోనా తర్వాత కొత్త సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఆచితూచి అడుగులు వేయాలి. మంచి సబ్జెక్ట్‌తో వస్తోన్న ‘ఐక్యూ’ పెద్ద హిట్ కావాలి’’ అన్నారు కేఎస్ రామారావు. ‘యూత్‌పుల్ కంటెంట్‌తో వస్తోన్న ‘ఐక్యూ’ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు గంటా శ్రీనివాసరావు. ‘‘నాకు బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడంతో సినిమాల్లో నటించడానికి మొదట్లో భయం వేసింది. కానీ నటనపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాను’’ అన్నారు సాయిచరణ్. ‘‘యూనిక్ సబ్జెక్ట్‌తో చేస్తోన్న మూవీ ‘ఐక్యూ’. ఇది మేధస్సుకు సంబంధించిన చిత్రం’’ అన్నారు దర్శక–నిర్మాత జీఎల్బీ శ్రీనివాస్. -
గంటా గ్యాంగ్ హల్చల్
దొండపర్తి(విశాఖ దక్షిణ)/ఆరిలోవ(విశాఖ తూర్పు): సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గ్యాంగ్ హల్చల్ చేసింది. ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటినప్పటికీ.. గంటా ఇప్పటి వరకు నియోజకవర్గం మొహం చూడలేదు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. టీడీపీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విష ప్రచారం చేసి పట్టుబడిన నిందితుడు నలంద కిశోర్‌కు మద్దతుగా 3 గంటల పాటు సీఐడీ కార్యాలయం ఎదుట నిరీక్షించడంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలో నియోజకవర్గంలో ఒకసారి కూడా పర్యటించని గంటా శ్రీనివాసరావు, అతని బ్యాచ్.. ఓ కేసులో అరెస్టయిన వ్యక్తి కోసం బయటకు రావడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపైనే కాకుండా, ప్రభుత్వ పెద్దలపై నలంద కిశోర్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడంతో సీఐడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.(ఈ సోషల్ తీవ్రవాదం.. టీడీపీ ఉన్మాదం!) సీఐడీ కార్యాలయం వద్ద వేచి ఉన్న టీడీపీ నేతలు విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అతని గ్యాంగ్ పరుచూరి భాస్కరరావు, మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబుతో పాటు మరికొంత మంది ఉదయమే సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి నలంద కిశోర్‌ను కర్నూలుకు తరలించేంత వరకు అక్కడే ఉండి తెగ హడావుడి చేశారు. కిశోర్‌ను కలవడానికి సీఐడీ కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అతని లాయర్‌ను మాత్రమే లోపలకు అనుమతించారు. దీంతో గంటాతో పాటు అతని బ్యాచ్ మొత్తం ఎవరెవరికో ఫోన్లు చేస్తూ అక్కడి పరిస్థితులను వివరిస్తూ సీఐడీ కార్యాలయం ఎదుట రోడ్డు మీద కలియతిరిగారు. నిందితుyì ని కారులో కర్నూలుకు తరలించడానికి బయటకు తీసుకువచ్చిన సమయంలో కూడా గంటాకు చెందిన కొంత మంది అనుచరులు ‘అన్నా భయపడొద్దు.. మేమంతా అండగా ఉన్నాం’ అంటూ అరుపులు అరిచారు. ఉదయం 11.30 గంటలకు నిందితుడిని తరలించిన వాహనం వెనుక కొంత మంది ఫాలో అయ్యారు. గంటా మాత్రం మీడియాతో మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
సూత్రధారులకు క్లీన్చిట్
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం భూ కుంభకోణంపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక ఎట్టకేలకు మంత్రివర్గం ముందుకొచ్చింది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొం టున్న అధికార పార్టీకి చెందిన కీలక సూత్రధారులకు ‘సిట్’ క్లీన్చిట్ ఇచ్చేసింది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుచరులు, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేశ్, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్‌తోపాటు ఇతర నేతల పాత్ర ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేశ్ కనుసన్నల్లోనే విశాఖ భూకుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సిట్ సిఫార్సుల అమలుకు కమిటీ విశాఖ భూముల కుంభకోణంపై ‘సిట్’ విచారణ జరిపి, సమర్పించిన 300 పేజీల నివేదికను 9 నెలల తర్వాత మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. భూకుంభకోణంపై గ్రేహౌండ్స్ డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల దర్యాప్తు బృందం ఆరు నెలలపాటు విచారించి, ప్రభుత్వానికి 9 నెలల క్రితమే నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో సిట్ చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు కేబినెట్ తాజాగా రెవెన్యూ, సాధారణ పరిపాలన, న్యాయ శాఖ కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించింది. విశాఖ భూకుంభకోణంతో టీడీపీ ప్రజాప్రతినిధులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసేలా సిట్ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. పలువురు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి, పలువురు కిందిస్థాయి నేతలను బాధ్యులుగా గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మంత్రి గంటాకు సంబంధం లేదట! విశాఖ భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో మంత్రి గంటా కీలకంగా వ్యవహరించారని, ఆయన అనుచరులు పెద్దఎత్తున కబ్జాలకు పాల్పడ్డారని మంత్రివర్గంలో సీనియర్ సభ్యుడైన చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా అధికారులకు అందజేశారు. విశాఖ భూకుంభకోణాన్ని బయటపెట్టింది మంత్రి అయ్యన్నపాత్రుడే కావడం గమనార్హం. అయితే, మంత్రి గంటా, ఆయన అనుచర బృందానికి భూముల అవకతవకలు, ట్యాంపరింగ్‌తో సంబంధం లేదని ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సిట్ దర్యాప్తు సమయంలోనే తేల్చింది. దాన్నే నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో వేలాది ఎకరాల భూముల ట్యాంపరింగ్‌కు సూత్రధారులైన మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుచరులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు క్లీన్చిట్ లభించినట్లయింది. ప్రతిపక్ష నేతలను ఇరికించిన వైనం తన సహచర మంత్రి భూకబ్జాలకు పాల్పడినట్లు స్వయంగా మరో మంత్రే ఫిర్యాదు చేసి, ఆధారాలిచ్చినా లెక్కచేయని సిట్ ప్రతిపక్షానికి చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. ధర్మాన తన కుమారుడి పేరుతో భూములు కొన్నారని, ఇందులో అవకతవకలు జరిగాయని సిట్ పేర్కొన్నట్లు సమాచారం. మరికొందరు స్థానిక ప్రతిపక్ష నేతల పేర్లను ప్రైవేటు వ్యక్తులుగా చెబుతూ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. భూకబ్జాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలను వదిలేసి, ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తుల పేర్లను చేర్చడం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. కొన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి విశాఖ భూకుంభకోణానికి సంబంధించి ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్లు, 10 మంది డీఆర్ఓలు, 14 మంది ఆర్డీఓలు, 109 మంది ఇతర అధికారులపై కేసులు నమోదు చేయాలని సిట్ తన నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. వీరిలో పలువురు అధికారులను సస్పెండ్ చేయాలని, కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించడంతోపాటు కొన్ని రిజిష్ట్రేషన్లను రద్దు చేయాలని సిట్ సిఫార్సు చేసింది. అధికారులు, ఉద్యోగులకు సంబంధించి 49 కేసులు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి 50 కేసులు, సివిల్ వ్యవహారాలకు సంబంధించి 134 అంశాల్లో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సిట్ నివేదికను 9 నెలల తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం, అందులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును పేరును చేర్చి, ఆ విషయాన్ని మీడియాకు లీక్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ రికార్డుల పటిష్టత కోసం ‘సిట్’ సిఫార్సులు - 10,000 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు కబ్జాలు, వివాదాల్లో చిక్కుకున్నట్లు సిట్ గుర్తించింది. - 68 నిరభ్యంతర పత్రాల్లో(ఎన్‌ఒïసీలు) 55 ఎన్ఓసీలను అడ్డగోలుగా జారీ చేశారని గుర్తించారు. విశాఖపట్నంలో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల పేరిట అడ్డగోలుగా భూ కేటాయింపులు జరిగాయని నిర్ధారణకు వచ్చారు. - వీరికి కేటాయించిన భూముల్లో ఖాళీగా ఉన్న 70 శాతానికి పైగా భూములను ఏ విధంగా వెనక్కి తీసుకోవాలో సూచిస్తూ సిఫార్సు చేసింది. - ఏళ్ల తరబడి కొనసాగుతున్న రెవెన్యూ చట్టంలోని లొసుగులను నియంత్రించడంలో ప్రభుత్వాల ఉదాసీనత వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని సిట్ తన నివేదికలో పేర్కొంది. - ప్రైవేటు భూముల క్రయవిక్రయాల్లో మోసాలను అరికట్టాలంటే సింగపూర్ తరహా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని సిఫార్సు చేసింది. - సింగపూర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భూములన్నీ నేరుగా గూగుల్‌తో అనుసంధానమవుతాయి. ఏ భూమి ఎవరి పేరిట ఉంది, అంతకముందు ఎవరి పేరిట ఉండేది అనే వివరాలన్నీ గూగుల్‌లో ఉంటాయి. భూమిని ఆన్లైన్లో విక్రయానికి పెడితే.. కొనుగోలు చేసేవారు రికార్డులను, భూమిని పరిశీలించి ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తారు. వెంటనే సదరు భూమి గూగుల్ ద్వారా కొనుగోలుదారుడి పేరిట రిజిస్ట్రేషన్ అవుతుంది. - భూముల రీ సర్వే జరపాలని సిట్ సిఫార్సు చేసింది. ఆర్థిక భారం అయినప్పటికీ ప్రత్యేక విభాగాన్ని, సిబ్బందిని ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సర్వే చేయాలని సూచించింది. - గ్రామాల్లో రికార్డులను పరిరక్షించేందుకు రికార్డు అసిస్టెంట్ నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిట్ పేర్కొంది. - రెవెన్యూ చట్టాలు, అమలు తీరుతెన్నులపై రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించింది. - ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గుతూ పెద్ద ఎత్తున రికార్డుల ట్యాంపరింగ్, భూకబ్జాలను ప్రోత్సహించారని సిట్ తన నివేదికలో తప్పుపట్టింది. భూకుంభకోణంపై వైఎస్సార్సీపీ పోరుబాట విశాఖ భూ కుంభకోణం ఓ సంచలనం. సరిగ్గా 9 నెలల క్రితం వెలుగు చూసిన రికార్డుల ట్యాంపరింగ్ బాగోతం రాష్ట్రాన్ని కుదిపేసింది. సరిగ్గా అదే సమయంలో ముదుపాక భూముల ఉదంతం.. ఆ వెంటనే లక్ష ఎకరాలకు సంబంధించిన రికార్డుల గల్లంతు వ్యవహారం కలకలం రేపాయి. విశాఖ భూకుంభకోణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర విపక్షాలు, వామపక్ష పార్టీలు ఆందోళన బాట పట్టాయి. గతేడాది జూన్ 22న విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన మహాధర్నాలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అధికార టీడీపీ నేతలు తిన్నదంతా వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కక్కిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, పార్టీ నేతలంతా ముదుపాక భూములను పరిశీలించారు. బాధితులకు అండగా నిలిచారు. రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. మరోవైపు సేవ్ విశాఖ అంటూ వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్ 20న ‘సిట్’ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. సిట్ తన విచారణను జూన్ 28న ప్రారంభించింది. సిట్‌కు అందిన 2,875 ఫిర్యాదుల్లో మూడొంతులు అధికార పార్టీ నేతలపైనే ఉన్నాయి. వీటిలో 333 ఫిర్యాదులను సిట్ తన పరిధిలోకి తీసుకొని, మిగిలిన వాటిని రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఆరు నెలలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో వందలాది డాక్యుమెంట్లు, వేలాది భూ రికార్డులను పరిశీలించింది. ఈ ఏడాది జనవరి 29న తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 9 నెలలుగా ఈ నివేదిక వెలుగు చూడలేదు. చివరకు మంగళవారం కేబినెట్లో దీన్ని ఆమోదించారు. సిట్ నివేదికలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలకు ఎలాంటి సిఫార్సులు లేవని, ప్రతిపక్ష నేతల పేర్లే ఎక్కువగా ఉన్నాయంటూ ప్రభుత్వం లీకులివ్వడం గమనార్హం. -
నేటి నుంచి ఏపీ ఎంసెట్ - 2018
-
తొలిరోజే జన్మభూమిపై నిరసనలు
-
ఏపీ ఎంసెట్ భద్రతకు గవర్నర్ హామీ
విద్యార్థులకు ఇబ్బంది కలగనివ్వం: మంత్రి గంటా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఎంసెట్‌కు తెలంగాణలో ఏర్పాటు చేసే కేంద్రాల విషయంలో తగిన భద్రత కల్పించే అంశంపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఎంసెట్‌తో తమకెలాంటి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందన్న విషయాన్ని గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లిన మంత్రి గవర్నర్‌కు వివరించారు. అనంతరం మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకునేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని చెప్పారు. మేరకు తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిలకు గవర్నర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. -
గవర్నర్ చొరవతీసుకోవాలి: మంత్రి గంటా
హైదరాబాద్: ఏపీ ఎంసెట్ విషయమై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. హైదరాబాద్‌లో ఏపీ ఎంసెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, ట్రాఫిక్ సమస్యలను తెలంగాణ పోలీసులు నిర్వహించాలని అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, తెలంగాణ డీజీపీకి తెలియజేశామని చెప్పారు. ఏపీ ఎంసెట్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత రావాలన్నారు. విద్యార్థుల విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు మంత్రి గంటా చెప్పారు. -
మంత్రి కార్యాలయం ముట్టడి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని పుట్ పాత్లపై వ్యాపారుల తోపుడు బళ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడంపై చిరు వ్యాపారులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని కోరుతూ ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా అధికారులు బళ్లను తొలగించారని వారు మండిపడ్డారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన వ్యాపారులకు సూచించారు.