ఏపీ ఎంసెట్ భద్రతకు గవర్నర్ హామీ | AP .Concepts to ensure the security of the Governor | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్ భద్రతకు గవర్నర్ హామీ

Published Fri, May 1 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

ఏపీ ఎంసెట్ భద్రతకు గవర్నర్ హామీ

ఏపీ ఎంసెట్ భద్రతకు గవర్నర్ హామీ

  • విద్యార్థులకు ఇబ్బంది కలగనివ్వం: మంత్రి గంటా
  • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఎంసెట్‌కు తెలంగాణలో ఏర్పాటు చేసే కేంద్రాల విషయంలో తగిన భద్రత కల్పించే అంశంపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఎంసెట్‌తో తమకెలాంటి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందన్న విషయాన్ని గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లిన మంత్రి గవర్నర్‌కు వివరించారు.

    అనంతరం మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకునేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని చెప్పారు.  మేరకు తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిలకు గవర్నర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement