1/6
2/6
ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ (Infinix Hot 50 5G) ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ అనేది 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లే పొందుతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ పొందుతుంది. ఇది 4జీబీ, 8జీబీ ర్యామ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 5,000 mAh బ్యాటరీ కలిగి 18 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో కాల్స్ చేయడానికి 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కూడా పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.9,499.
3/6
మోటో జీ45 5జీ (Moto G45 5G) మార్కెట్లో సరసమైన మొబైల్ ఫోన్ల జాబితాలో మోటో కంపెనీకిని చెందిన 'జీ45 5జీ' ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 10,000. ఇది 4 జీబీ. 8 జీబీ ర్యామ్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఎందుకుని వేరియంట్‌ను బట్టి ధరలు మారుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6.45 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే పొందుతుంది. ఇది క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
4/6
రియల్‌మీ సీ63 (Realme C63) రియల్‌మీ సీ63 ధర రూ. 8,999 మాత్రమే. ఇది 6.67 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, 120 Hz వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్‌నెస్ వంటివి పొందుతుంది. ఈ మొబైల్ 64 జీబీ, 128 జీబీ ర్యామ్ ఆప్షన్ పొందుతుంది. ఇది 5000 mAh బ్యాటరీ కలిగి 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది.
5/6
రెడ్‌మీ 13 సీ 5జీ (Redmi 13C 5G) మార్కెట్లో 'రెడ్‌మీ 13 సీ 5జీ' ధర రూ. 7,199. ఇది 6.74 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను 600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్.. 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందే ఈ ఫోన్ 8 జీబీ, 6 జీబీ ర్యామ్ ఆప్షన్స్ పొందుతుంది. అంతే కాకుండా ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, మరొక 2 మెగా పిక్సెల్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ పొందుతుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ వంటి వాటి కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.
6/6
వివో టీ3 లైట్ (Vivo T3 Lite) తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ స్మార్ట్‌ఫోన్లలో.. వివో టీ3 లైట్ ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 10,000. ఇది 6.65 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లే, 840 నిట్స్ బ్రైట్‌నెస్ పొందుతుంది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 మిమీ జాక్ కూడా పొందుతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. కెమెరా సెటప్ కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.