Infinix
-
గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్: ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో , ఫీచర్లు చూస్తే!
Infinix gt 10 pro: ఇన్ఫినిక్స్ ఇండియా తాజాగా జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. మొబైల్ గేమింగ్‌కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన ధరలో దీన్ని లాంచ్ చేసింది. సుపీరియర్ ప్రాసెసింగ్ పవర్, కూల్ టెక్నాలజీ,10-బిట్ FHD+AMOLED డిస్ప్లేను దీన్ని తీసుకు రావడం విశేషం. రియర్ కెమెరా ద్వారా 4K వీడియో రికార్డింగ్, సెల్ఫీ కెమెరా 2K వీడియో రికార్డింగ్ సదుపాయంతోపాటు AI ఫిల్మ్ మోడ్‌ను కూడా జోడించింది. ఇండియాలోదీని లాంచింగ్ ప్రైస్ రూ. 19,999గా ఉంది. అయితే బ్యాంక్ డిస్కౌంట్ల కారణంగా, ప్రస్తుతం రూ. 17,999కి అందుబాటులో ఉంది. ఫోన్‌తో పాటు,తొలి 5,000 మంది కస్టమర్లు ప్రో గేమింగ్ కిట్‌ను కూడా అందుకునోఛాన్స్ ఉంది. సైబర్ మెకా డిజైన్, రంగు మార్చే వెనుక ప్యానెల్, 6.67 ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి. 108 ఎంపీ అల్ట్రా క్లియర్ ట్రిపుల్ కెమెరా, ప్రకాశవంతమైన సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ 5జీ సిమ్ దీనిలో ఉన్నట్లు సంస్థ సీఈవో అనీష్ కపూర్ తెలిపారు. ఇది సైబర్ బ్లాక్, మిరాజ్ సిల్వర్ రంగుల్లో లభిస్తుందని పేర్కొన్నారు. జీటీ 10 ప్రో స్పెసిఫికేషన్స్ 6.67-అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 1300ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 108+2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 1 టీబీ దాకా విస్తరించుకునేసదుపాయం 5000mAh బ్యాటరీ -
తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అతితక్కువ ధరకే ఇన్ఫినిక్స్ హాట్ 30 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ తోపాటు, భారీ బ్యాటరీ ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.12 వేలకే లభ్యం కానుంది. బడ్జెట్ ఫోన్లతో ఆకట్టుకుంటున్న ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ హాట్ 30 ఫోను సేల్ జులై 18 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో హాట్ 30 సేల్ షురూ అవుతుందని సంస్థ వెల్లడించింది. రెండు వేరియంట్లలో ఇది లభించనుంది. 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.12,499 కాగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13,499 గా నిర్ణయించింది. ఇక ఆఫర్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్స్టాంట్ డిస్కౌంట్‌తో పాటు, రూ. నెలకు 2,250 చొప్పున నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ హాట్ 30 స్పెసిఫికేషన్లు 6.78 ఇంచెస్ ఫుడ్ హెచ్డీ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్ 50 + 2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -
బైపాస్ చార్జింగ్: కొత్త ఫీచర్‌తో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్
భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ( Infinix Note 30 5G) తాజాగా విడుదలైంది. 6.78 అంగుళాల 120హెడ్జ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 8GB వరకు ర్యామ్‌తో కూడిన ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ ఇది. హై రిజల్యూషన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, JBL సౌండ్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తోంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ, గేమింగ్ సమయంలో వేడెక్కడాన్ని తగ్గించడానికి బైపాస్ చార్జింగ్ మోడ్‌ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఇక 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లు రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ అమ్మకాలు జూన్ 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్నాయి. స్పెసిఫికేషన్లు ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత XOS 13 ఆపరేటింగ్ సిస్టమ్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 580 నిట్ల వరకు గరిష్ట బ్రయిట్నెస్తో పెద్ద 6.78అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, మాలి G57 MC2 GPU, 8GB వరకు ర్యామ్ హై-రిజల్యూషన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండు అదనపు సెన్సార్లు ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా. JBL సౌండ్‌ని అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు. హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్ 256 జీబీ వరకు స్టోరోజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉపయోగించి విస్తరించవచ్చు. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్‌తో సహా వివిధ కనెక్టివిటీ ఆప్షన్లకు మద్దతు యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి అనేక సెన్సార్లు. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీ. గేమర్లు నేరుగా మదర్‌బోర్డుకు చార్జ్ చేసే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్. 168.51x76.51x8.45mm కొలతలు, 204.7 గ్రాముల బరువు. Time to live life in the fast lane with Note 30 5G, thanks to India's first MediaTek Dimensity 6080 Processor, a smooth 120Hz Display, up to 16GB* RAM, and 256 Storage! Sale starts 22nd June, 12PM, only on Flipkart. Click here to know more: https://t.co/6DNmOKpB2z#ChangeTheGame pic.twitter.com/HVXgXOlDtB — Infinix India (@InfinixIndia) June 14, 2023