
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్ సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అతితక్కువ ధరకే ఇన్‌ఫినిక్స్ హాట్ 30 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ తోపాటు, భారీ బ్యాటరీ ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.12 వేలకే లభ్యం కానుంది.
బడ్జెట్ ఫోన్‌లతో ఆకట్టుకుంటున్న ఇన్‌ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ హాట్ 30 ఫోను సేల్ జులై 18 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో హాట్ 30 సేల్ షురూ అవుతుందని సంస్థ వెల్లడించింది.
రెండు వేరియంట్లలో ఇది లభించనుంది. 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.12,499 కాగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13,499 గా నిర్ణయించింది. ఇక ఆఫర్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌తో పాటు, రూ. నెలకు 2,250 చొప్పున నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది.
ఇన్‌ఫినిక్స్ హాట్ 30 స్పెసిఫికేషన్లు
6.78 ఇంచెస్ ఫుడ్ హెచ్‌డీ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్
మీడియా టెక్ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్
50 + 2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment