affordable price
-
టాప్ 5 బెస్ట్ 400సీసీ బైకులు: తక్కువ ధర.. ఎక్కువ పర్ఫామెన్స్
భారతదేశంలో 400సీసీ బైకులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీ ఈ విభాగంలో కూడా బైకులు లాంచ్ చేశాయి. ఈ బైకులు ధరలు సాధారణ బైక్ ధరల కంటే కొంత ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ కథనంలో కొంత తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బెస్ట్ 400సీసీ బైకుల గురించి తెలుసుకుందాం.బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400జెడ్400 సీసీ విభాగంలోని సరసమైన బైకుల జాబితాలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400జెడ్ ఒకటి. దీని ధర రూ. 1.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్స్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని 373 సీసీ ఇంజిన్ 39 Bhp పవర్, 35 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.ట్రయంఫ్ స్పీడ్ టీ4మార్కెట్లో అందుబాటులో ఉన్న ట్రయంఫ్ స్పీడ్ టీ4 ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ట్రయంఫ్ లైనప్‌లో అత్యంత సరసమైన 400సీసీ బైక్. ఇందులో హజార్డ్ ల్యాంప్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్ వంటివి ఉన్నాయి. ఈ బైకులోని 398 సీసీ ఇంజిన్ 30 Bhp పవర్, 36 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411400 సీసీ విభాగంలో ఎక్కువమంది ఇష్టపడే బైకులలో ఒకటి 'రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411'. దీని ధర రూ.2.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైకులో అనలాగ్ స్పీడోమీటర్లు, హజార్డ్ ల్యాంప్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులోని 411 సీసీ ఇంజిన్ 24 Bhp పవర్, 32 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.బజాజ్ డామినార్ 400బజాజ్ డామినార్ 400 కూడా 400 సీసీ విభాగంలో లభిస్తున్న ఓ సరసమైన బైక్. దీని ధర రూ. 2.26 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 373 సీసీ ఇంజిన్ 39 Bhp పవర్, 35 Nm టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ బైక్ డ్యూయల్ డిస్ప్లేలు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటివన్నీ పొందుతుంది.ఇదీ చదవండి: అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్హార్లే డేవిడ్సన్ ఎక్స్440హార్లే డేవిడ్సన్ అంటే ధరల భారీగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఈ బ్రాండ్ అంటే ఇష్టపడే కస్టమర్ల కోసం కంపెనీ ఎక్స్440 బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 440 సీసీ ఇంజిన్ 27 Bhp పవర్, 38 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. -
విటమిన్ డి లోపం.. మహిళల్లో ఈ సమస్యలకు కారణమవుతోందా?
భారతదేశంలో ప్రతీ 10 మంది మహిళల్లో 9 మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారనీ, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివ కృష్ణమూర్తి తెలిపారు. ఇది ఎముకలను బలహీనపరిచడం, బోలు ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన పరిస్థితులకు కూడా దారి తీస్తుందనీ, ఈ నేపథ్యంలోనే ఎముకల ఆరోగ్యం గురించి డ్రైవింగ్ అవగాహన తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. అపోలో హెల్త్ అండ్ లైఫ్ట్ స్టైల్ లిమిటెడ్ ద్వారా.. వరుసగా నాలుగో ఏడాది కూడా 30ఏళ్లకు పైబడిన మహిళల్లో ఎముకల ఆరోగ్య అవగాహనను కల్పించడం , పరీక్ష చేయించుకునేలా వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో దాదాపు 49.9శాతం మంది స్త్రీలు ఆస్టియోపెనియా , 18.3శాతం మంది బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారన్నారు. మహిళలు తాత్కాలిక అనాల్జెసిక్స్పై ఆధారపడకుండా,అపోలో డయాగ్నోస్టిక్స్, హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ ద్వారా విటమిన్ డీ , కాల్షింయ లోపంపై అవగాహన కల్పించి, విటమిన్ డి స్క్రీనింగ్‌ను సరసమైన ధరలో అందుబాటులోకి తెచ్చామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ బ్రాండ్ అంబాసిడర్.. నటి తాప్సీ పన్నూ సైతం పాల్గొన్నారు.అపోలో హెల్త్ & లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌తో ,హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ భారతదేశంలోని మహిళలకు డీ విటమిన్ టెస్టులను మరోసారి సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఇప్పుడు రూ. 1850కు బదులుగా కేవలం రూ. 199 కే విటమిన్ D పరీక్షను పొందవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 నాటి మాంప్రెస్సో అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 98శాతంమంది మహిళలు ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా వీరిలో 87శాతం మందికి ఈ పెయిన్స్, ఎముకల ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోలేరు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ డీ ఒక ముఖ్యమైన పోషకం. ఈ లోపాన్ని గుర్తించడానికి క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం. -
ఇక నుంచి అందుబాటు ధరలో హీరో ఎలక్ట్రిక్ టూ-వీలర్లు
-
జియో సూపర్‌హిట్ ప్లాన్.. చవగ్గా అన్లిమిటెడ్ 5జీ, కాలింగ్..
చవకైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న జియో కస్టమర్లకు ఓ సూపర్‌హిట్ ప్లాన్ ఉంది. అదే రూ. 198 ప్లాన్. ఇది 14 రోజుల పాటు అపరిమిత 5జీ డేటాను అందిస్తుంది. దీంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.జియో రూ. 198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులు 14 రోజుల పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ప్రతిరోజూ 2 జీబీఆ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు. అదనంగా జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీ వంటి జియో సూట్ యాప్‌లకు యాక్సెస్‌ను ఆనందించవచ్చు.రూ.198 ప్లాన్‌ను మైజియో యాప్ లేదా ప్రీపెయిడ్ సేవలను అందించే ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. మైజియో యాప్‌లో రీచార్జ్ చేసుకుంటే ఎటువంటి అదనపు రుసుములు ఉండవు. కానీ గూగుల్ పే, పేటీఎం లేదా ఫోన్‌పే వంటి ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 1 నుండి రూ. 3 వరకు అధిక రుసుము ఉంటుంది. -
గిట్టుబాటు కాని ఆయిల్‌పామ్
దేవరపల్లి: రెండేళ్లుగా గిట్టుబాటు ధర రాక.. పెట్టిన పెట్టుబడులు, కౌలు డబ్బులు సైతం గిట్టుబాటు కాకపోవడంతో ఆయిల్‌పామ్ సాగు పట్ల రైతుల ఆసక్తి సన్నగిల్లుతున్నది. మెట్ట ప్రాంతంల్లోని రైతులు 25 ఏళ్లుగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. మొక్క వేసిన ఏడాది నుంచి నాలుగేళ్లలో దిగుబడి మొదలై సుమారు 25 ఏళ్ల వరకు కొనసాగుతుంది. రైతులు పండించిన గెలలను పామాయిల్ తయారీ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నాయి. కొంత కాలం పంటకు గిట్టుబాటు ధర లభించింది. దీనికి తోడు ప్రభుత్వం కూడా రాయితీపై మొక్కలు సరఫరా చేయడంతో పాటు నాలుగేళ్ల వరకు ఎరువులు, పురుగు మందులపై రాయితీలు ఇచ్చి ప్రోత్సహించింది. దీంతో ఎక్కువ మంది రైతులు పొగాకు పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ వైపు మొగ్గు చూపి వేలాది ఎకరాల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. 37,654 ఎకరాల్లో.. తూర్పు గోదావరి జిల్లాలోని 18 మండలాల్లో 37,654 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. నల్లజర్ల, దేవరపల్లి, రంగంపేట మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పంట ఉంది. ఎకరాకు 10 నుంచి 13 టన్నుల గెలల దిగుబడి సాధిస్తున్నారు. ఎకరాకు సగటున 8 టన్నుల దిగుబడి వస్తున్నదని రైతులు చెబుతున్నారు. ఆయిల్‌పామ్ గెలల దిగుబడి జూన్ నుంచి ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో వచ్చే పంట దిగుబడి బాగుంటుందని రైతులు తెలిపారు. సారవంతమైన భూములు, యాజమాన్య పద్ధతులు చేపడుతున్న తోటల్లో ఎకరాకు 12 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తోంది. ఈసారి రైతులు 12 వేల ఎకరాల్లో మొక్క తోటలు వేశారు. మొక్క రూ.250 చొప్పున కొనుగోలు చేశారు. 2022లో టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర రూ.24 వేలు పలకడంతో రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. దీంతో రైతులు పొగాకు, జీడిమామిడి తోటలను తొలగించి, ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టారు. అయితే, రెండేళ్లుగా పొగాకుకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుండడంతో తిరిగి ఆయిల్‌పామ్, జీడిమామిడి తోటలను తొలగించి పొగాకు వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయిల్ రికవరీపై గెలల ధర నిర్ణయం ఫ్యాక్టరీలో గెలలను క్రషింగ్ చేసిన అనంతరం వచ్చే పామాయిల్ రికవరీ శాతంపై ప్రభుత్వం గెలల ధర నిర్ణయిస్తుంది. ఈ నెలలో ఫ్యాక్టరీకి పంపిన గెలలకు వచ్చే నెలలో ధర ప్రకటిస్తారు. ఏప్రిల్ నెలలో ఉత్పత్తి చేసిన గెలలకు మే నెలలో టన్నుకు రూ.14,095 ధర లభించింది. మే నెలలో ఉత్పత్తి అయిన గెలలకు టన్నుకు రూ.13,280 మాత్రమే లభించింది. ఒక్క నెలలోనే టన్నుకు రూ.815 ధర పడిపోయింది. పండించిన గెలలను 3ఎఫ్ ఆయిల్ ఫ్యాక్టరీ, నవభారత్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొనుగోలు చేస్తున్నాయి. గిట్టుబాటు కావడం లేదు ఆయిల్‌పామ్ సాగు గిట్టుబాటు కావడం లేదు. ఖర్చులు పెరిగాయి. దీనికి తగినట్టు మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు. గత నెలలో టన్ను గెలల ధర రూ.14,095 ఉండగా, ఈ నెలలో రూ.13,280కి తగ్గింది. పంట గిట్టుబాటు కాక చాలా మంది రైతులు తోటలు తీసేస్తున్నారు. – యాగంటి వెంకటేశ్వరరావు, రైతు, దేవరపల్లి, తూర్పు గోదావరి జిల్లా టన్ను గెలల ధర రూ.16 వేలు తగ్గకూడదు ఆయిల్‌పామ్ గెలల టన్ను ధర రూ.16 వేలకు తగ్గకూడదు. ప్రస్తుతం ఇస్తున్న ధర పెట్టుబడులకు సరిపోదు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల పెట్టుబడి అవుతున్నది. దిగుబడులు 12 టన్నుల నుంచి 8 టన్నులకు తగ్గడంతో గిట్టుబాటు కావడం లేదు. పామాయిల్ దిగుమతుల ప్రభావం కూడా ఇక్కడి పంటపై పడింది. – నరహరిశెట్టి రాజేంద్రబాబు, డైరెక్టర్, పామాయిల్ బోర్డు వర్షాభావంతో తగ్గిన దిగుబడులు వర్షాభావ పరిస్థితుల వల్ల ఆయిల్‌పామ్ గెలల దిగుబడులు తగ్గాయి. ఎకరాకు సగటున 8 టన్నుల గెలల దిగుబడి వస్తున్నది. తోటలపై శ్రద్ధ చూపిన రైతులు 10 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ఈ ఏడాది తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. దీనివల్ల తోటలు దెబ్బ తిన్నాయి. – సుజాత, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, రాజమహేంద్రవరం -
రైతుల పాలిట ‘కలప’తరువులా సర్కారు నిర్ణయం
సాక్షి, అమరావతి: జామాయిల్ (యూకలిప్టస్), సరుగుడు, ఇతర కాగితపు గుజ్జు కలప సాగుదారులకు మరింత మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అటవీ శాఖ పరిధిలోని యూకలిప్టస్, సరుగుడు తోటల వేలం పాటలను ప్రభుత్వం నిలిపివేసింది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ప్రస్తుతం పలుకుతున్న ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించారు. రైతుల ప్రయోజనార్థం వేలం వాయిదా వేయాలని కోరగా.. అటవీ శాఖకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తక్షణమే వేలాన్ని నిలిపివేస్తూ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తమ అభ్యర్థనకు మంత్రులు కాకాణి, పెద్దిరెడ్డి స్పందించిన తీరు పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రస్తుతం పలుకుతున్న ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని, ఏప్రిల్, మే నెలల్లో సుబాబుల్ టన్ను ధర రూ.5 వేలు, యూకలిప్టస్ ధర రూ.6 వేలకు పైగా పలికే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టన్నుకు వెయ్యి మిగలడం కష్టంగా ఉండేది రాష్ట్రంలో 1,04,985 మంది రైతులు 3,28,954 ఎకరాల్లో సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు పంటలు సాగు చేస్తున్నారు. ఏటా రూ.35 లక్షల టన్నులకుపైగా దిగుబడులొస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో టన్ను సుబాబుల్ రూ.4,200, యూకలిప్టస్ రూ.4,400గా ధర నిర్ణయించగా.. ఏనాడూ ఈ ధర లభించిన దాఖలాలు లేవు. గతంలో కంపెనీలు కోరుకున్న చోటకు తీసుకొస్తే కాని కొనుగోలు చేసేవారు కాదు. కటింగ్, డీ బార్కింగ్, లోడింగ్, వే బ్రిడ్జి, రవాణా చార్జీల రూపంలో టన్నుకు రూ.800కు పైగా రైతులకు ఖర్చయ్యేది. కంపెనీలు చెల్లించే మొత్తంలో ఖర్చులు పోనూ రైతులకు టన్నుకు రూ.వెయ్యి మిగలడం కష్టంగా ఉండేది. గతంలో సరైన మార్కెటింగ్ సౌకర్యాల్లేక నష్టాలను చవిచూసిన ఈ రైతులకు గడచిన ఐదేళ్లుగా ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలిచింది. రైతు క్షేత్రం నుంచే కొనుగోలు ప్రభుత్వ కృషి ఫలితంగా రైతు క్షేత్రం వద్దే కొనుగోలు చేసేందుకు 20కు పైగా కంపెనీలు ముందుకొచ్చాయి. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కంపెనీలు సైతం ఏపీకి క్యూ కట్టాయి. ఈ పంట ద్వారా నమోదు చేయడమేకాకుండా, దళారీలకు చెక్‌పెట్టేలా క్రయ విక్రయాలను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షించడం, ట్రేడర్లను ఎంచుకునే వెసులుబాటు కూడా రైతులకే కల్పించడం, నాణ్యతను బట్టి ధరలు నిర్ణయించడం, ఇరువురి అంగీకారంతో నిర్ధేశించిన తేదీన కోత కోయించి కలపను రైతు క్షేత్రం నుంచే తీసుకెళ్లడం వంటి చర్యల ఫలితంగా గతం కంటే మెరుగైన ధరలను రైతులు పొందగలిగారు. రైతుల అభ్యర్థనతో వేలం పాటలకు బ్రేకు ప్రస్తుతం రైతు క్షేత్రం వద్దే టన్ను సుబాబుల్‌కు రూ.4,500–రూ.4,800, యూకలిప్టస్‌కు రూ.5,000–రూ.5,500 మధ్య ధర లభిస్తోంది. ప్రస్తుతం రైతుకు దక్కే ధరలను స్థిరీకరించడమే కాకుండా మరింత పెరిగేలా చర్యలు చేపట్టింది. అటవీ శాఖ పరిధిలో 7,500 హెక్టార్లలో సుబాబుల్, యూకలిప్టస్ తోటలకు శుక్రవారం వేలం పాటలు నిర్వహించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. మరో 2 నెలల్లో పంట కోతకొచ్చే దశలో వేలం నిర్వహిస్తే తమకు ఆశించిన ధర దక్కదని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తక్షణం వేలం పాటల్ని నిలిపివేయాలని అభ్యర్థించారు. క్షణం ఆలోచించకుండా ఆదేశాలు గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కలప గుజ్జు రైతులకు గడచిన ఐదేళ్లుగా మంచి ధర లభించేలా చర్యలు తీసుకున్నాం. ఫలితంగా రైతు క్షేత్రం వద్దే టన్నుకు రూ.4,500కు పైగా ధర లభిస్తోంది. రైతుల అభ్యర్థన మేరకు వేలం పాటల్ని నిలిపి వేయాలని కోరగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్షణం కూడా ఆలోచించకుండా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతు క్షేత్రం వద్ద కలపగుజ్జు ధర మరింత పెరిగే అవకాశం ఉంటుంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి -
మూడే నిమిషాల్లో వేడి వేడి పిజ్జా: పిజ్జా ఏటీఎం, ఎక్కడో తెలుసా?
సాధారణంగా నగదు లావాదేవీలకుపయోగించే ఏటీఎంలతోపాటూ గతంలో గోల్డ్ ఏటీఎంను కూడా చూశాం. తాజాగా పిజ్జా ఏటీఎం కూడా వచ్చేసింది. కేవలం మూడే మూడు నిమిషాల్లో వేడి వేడి పిజ్జా మనకందించే ఏటీఎం. ఈ పేరు వింటుంటేనే.. మీచుట్టూ పిజ్జా అరోమా నిండిపోయి, నోరూరుతోంది కదా? మరి ఎక్కడ? ఏంటి? ఎలా? ఈ వివరాలు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి స్పీడీ పిజ్జా మెషిన్ ఇది. చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సు సమీపంలో ఇది కొలువు దీరింది. యమ్మీ యమ్మీ పిజ్జా కేవలం 3 నిమిషాల్లో డెలివరీ అవుతుంది. చక్కటి ప్రకృతి అందాలకే కాదు రుచికరమైన పిజ్జా కేంద్రంగా ఇపుడు సుఖ్నా సరస్సు నిలుస్తోంది. పర్యాటకులకు హాట్‌స్పాట్‌గా ఉన్న సుఖ్నా సరస్సు వివిధ వంటకాలకు పాపులర్. ఇపుడిక పిజ్జా వెండింగ్ మెషీన్ మరింత ఎట్రాక్షన్ అని చండీగఢ్ ఇండస్ట్రియల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. (మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!) ఈ ప్రత్యేకమైన ఆలోచన ఫ్రాన్స్ ప్రేరణగా వచ్చిందని ఐమ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లైసెన్స్ పొందిన డాక్టర్ రోహిత్ శర్మ వెల్లడించారు. తమ మొహాలీ ఆధారిత ఫ్యాక్టరీలో యంత్రాన్నితయారు చేయాలని నిర్ణయించుకున్నారట. గత నెలలో దీన్ని ఇన్స్టాలేషన్ చేసినప్పటినుంచీ విపరీతమైన ప్రజాదరణ పొందిందన్నారు ఆయన. ప్రస్తుతం రోజుకు సగటున 100 దాకా ఆల్ వెజిటేరియన్ పిజ్జాలను సిద్ధం చేస్తోంది. వారాంతాల్లో, ఈ సంఖ్య 200-300 మధ్య ఏదైనా పెరుగుతుంది. ఇది కేవలం మొట్టమొదటిది, కొత్తదనంతో కూడుకున్నది మాత్రమే కాదని, డొమినోస్, పిజ్జా హట్ లాంటి వాటితో పోలిస్తే దాదాపు 35శాతం తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. త్వరలోనే మరిన్ని ప్రధాన నగరాల్లో దీన్ని ఇన్స్టాల్ చేస్తామని చెప్పారు. దీంతో పిజ్జా ప్రియులందరికీ ఇది వీకెండ్ డెస్టినేషన్‌గా మారిపోనుంది. Pearl Kapur మూడు నెలల్లోనే రూ. 9800 కోట్లు : ఎలా బ్రో..?! మెషిన్లోకిఎంట్రీ ఇచ్చి తమకిష్టమైన పిజ్జాను నమోదు చేయగానే ఒక రోబోటిక్ చేయి అవసరమైన టాపింగ్‌తో పిజ్జా బేస్‌ని ఎంచుకొని, దానిని కాల్చి, కేవలం మూడు నిమిషాల్లో సర్వ్ చేస్తుందట. అంతేకాదు ఏకకాలంలో టాపింగ్స్‌తో ఏడు పిజ్జా బేస్‌లను సిద్ధం చేసే సామర్థ్యం దీని సొంతం. iMatrix వరల్డ్ వైడ్ గతంలో ముంబై రైల్వే స్టేషన్లో ఇలాంటి ఏటీఎంను లాంచ్ చేసింది. కానీ కోవిడ్ ప్రభావం కారణంగా మూసివేయాల్సి వచ్చింది. -
Farmers movement: యూరప్‌లోనూ రోడ్డెక్కిన రైతు
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భారత్‌లో కాదు, యూరప్‌లో! అవును. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల్లో అసలే జీవనవ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలవన్నట్టు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేకానేక సమస్యలు యూరప్ వ్యాప్తంగా రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్లెక్కుతున్నారు. పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడిరోడ్లపై టైర్లను, గడ్డిమోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా పారిస్, బెర్లిన్ మొదలుకుని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు!! ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంటు భవనంపైకి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వారు! పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి... రైతుల సమస్యలు ఇవీ... ► యూరప్ దేశాలన్నింట్లోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది గిట్టుబాటు ధర లేమి. ► దీనికి తోడు ఏడాదిగా వారిపై పన్నుల భారం బాగా పెరిగిపోయింది. ఆకాశాన్నంటుతున్న పంట బీమా ప్రీమియాలు దీనికి తోడయ్యాయి. ► విదేశాల నుంచి, ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతవుతున్న ఆహారోత్పత్తులతో వారి ఉత్పత్తులకు గిరాకీ పడిపోతోంది. ► దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలతో పాటు మాంసం తదితరాల దిగుమతిని మరింతగా పెంచుకునేందుకు ఈయూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ► అధికారుల అవినీతి, సకాలంలో సాయం చేయడంలో అలసత్వం మరింత సమస్యగా మారుతోంది. ► ఈయూ విధిస్తున్న పర్యావరణ నిబంధనలు మరీ శ్రుతి మించుతున్నాయన్న భావన అన్ని దేశాల రైతుల్లోనూ నెలకొంది. ► పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతూ 4 శాతం సాగు భూమిని నిరీ్ణత కాలం ఖాళీగా వదిలేయాలన్న నిబంధనను యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ► పైగా పలు దేశాలు ఏటా పంట మారి్పడినీ తప్పనిసరి చేశాయి. రసాయన ఎరువుల వాడకాన్ని 20 శాతం తగ్గించాలంటూ రైతులపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది. ► సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తేయాలన్న నిర్ణయం. దీంతో సాగు వ్యయం విపరీతంగా పెరుగుతోందంటూ చాలా యూరప్ దేశాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా యూరప్‌లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ► పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయోత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయంటూ స్పెయిన్ రైతులు వాపోతున్నారు. ► నిధుల లేమి కారణంగా ఈయూ సబ్సిడీలు సకాలంలో అందకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది. ఇవీ డిమాండ్లు... ► ఆహారోత్పత్తుల దిగుమతులకు ఈయూ అడ్డుకట్ట వేయాలి. ► ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ప్రధానంగా ఆసియా దేశాలకు మళ్లించేలా చూడాలి. ► ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులను నిలిపేయాలి. ► సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. ► 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధనను ఎత్తేయాలి. ► పలు పర్యావరణ నిబంధనలను వీలైనంతగా సడలించాలి. ► పెట్రోల్, డీజిల్‌పై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. ఆందోళనలు ఏయే దేశాల్లో... జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలండ్, స్పెయిన్, రొమేనియా, గ్రీస్, పోర్చుగల్, హంగరీ, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైతుల కోసం కనీస మద్దతు ధరల చట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా త్వరలో కనీస మద్దతు ధరల చట్టం తీసుకొస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఇలాంటి చట్టం తెస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోందన్నారు. ‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఫుడ్ హబ్–స్థిరమైన పంట రక్షణ పరిష్కారాల పాత్ర’ అనే అంశంపై ఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ సదస్సులో మంత్రి కాకాణి మాట్లాడారు. నాలుగేళ్లలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిం దన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి సాధించేలా రైతులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎన్నో చర్యలు చేపట్టామన్నారు. రైతును చేయిపట్టి నడిపించేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థ అనతి కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి గడిచిందన్నారు. సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా రైతుల ముంగిట చేరుస్తున్నామన్నారు. పంట ఉత్పత్తులను సైతం ఆర్బీకేల ద్వారా నేరుగా వ్యవసాయ భూముల్లోనే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. ఎక్కడా లేనివిధంగా ధరల స్థిరీకరణ నిధి దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని మంత్రి కాకాణి వెల్లడించారు. సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ధర పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి మరీ కొనుగోలు చేస్తూ రైతులకు ఎమ్మెస్పీ దక్కేలా చేస్తున్నామన్నారు. ఈ–క్రాపింగ్, యూనివర్సల్ కవరేజి కింద ఉచిత పంటల బీమా దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. బేయర్ క్రాప్ సైన్స్ లీడ్ శ్రీనివాస్ కరవాడి, ఫారి్మంగ్టన్ చీఫ్ ఫౌండర్ సంగీతా బోజప్ప, సింజెంటా ఇండియా చీఫ్ సస్టైనబులిటీ ఆఫీసర్ కైసీ రవి తదితరులు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ఏపీలో తీసుకొచి్చన సంస్కరణలు, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. -
‘పాల వెల్లువ’కు కేంద్రం ప్రశంసలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ(జేవీపీ) పథకానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తాయి. జేవీపీ ప్రాజెక్టు ఆలోచన అద్భుతమని కేంద్రం ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా ఏపీలో పాడి రైతులకు దేశంలోనే అత్యధిక పాలసేకరణ ధరలు దక్కుతున్నాయని పేర్కొంది. ఏపీని బెంచ్ మార్క్‌గా తీసుకొని పాడి రైతులకు గరిష్ట ధర చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించింది. పశు సంవర్ధక, డెయిరీ రంగాలపై కేరళలోని తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సదస్సులో జేవీపీ ప్రాజెక్టుపై ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహ్మద్ బాబు, పశుసంవర్ధక శాఖ డైరక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్‌తో కలసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. – సాక్షి, అమరావతి పాడి రైతులకు గిట్టుబాటు ధరే లక్ష్యం: అహ్మద్ బాబు సహకార డెయిరీ రంగాన్ని బలోపేతం చేయడం, పాడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020 డిసెంబర్లో జగనన్న పాలవెల్లువ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అమూల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. గ్రామస్థాయిలో మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా లీటర్‌కు రూ.10 నుంచి 20 వరకు పాడి రైతులకు అదనపు లబ్ధి చేకూరుతోంది. మూడు జిల్లాలతో ప్రారంభమై ప్రస్తుతం 19 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలతో మొదలై 3,775 గ్రామాలకు విస్తరించింది. 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమంలో నేడు 3.61లక్షల మంది భాగస్వాములయ్యారు. రోజూ 85 వేల మంది సగటున 1.86 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. మూడేళ్లలో పాల సేకరణ ధరలను ఎనిమిది సార్లు పెంచారు. గేదె పాల ధర లీటర్‌కు రూ.71.74 నుంచి రూ.89.76కు, ఆవుపాల ధర లీటర్‌కు రూ.34.20 నుంచి రూ.43.69కు పెంచారు. ఫ్యాట్ శాతాన్ని బట్టి లీటర్ గేదెపాలకు రూ.103, లీటర్ ఆవుపాలకు రూ.54కు పైగా పాడి రైతులకు ధర లభిస్తోంది. 10 రోజులకు నేరుగా వారి ఖాతాలకు చెల్లింపులు చేస్తున్నాం. ఇప్పటి వరకు జేవీపీ కింద 9.98 కోట్ల లీటర్ల పాలు సేకరించగా రూ.446.93 కోట్లు చెల్లించాం. ప్రైవేటు డెయిరీలు అమూల్‌తో పోటీపడి పాలసేకరణ ధరలు పెంచాల్సి రావడంతో పాడి రైతులు రూ.4,283 కోట్లకు పైగా ప్రయోజనం పొందారు. క్రమం తప్పకుండా 180 రోజుల పాటు పాలుపోసే రైతులకు బోనస్, సొసైటీలకు ఇన్సెంటివ్ ఇస్తున్నాం. వర్కింగ్ క్యాపిటల్‌గా రూ.30 వేల వరకు ఆర్థిక చేయూత ఇవ్వడమే కాకుండా పాడి గేదెల కొనుగోలుకు రూ.90 వేలకు పైగా రుణాలు ఇప్పిస్తున్నాం. ఏపీ ఆదర్శం : అల్కా ఉపాధ్యాయ, కేంద్ర పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా మహిళా పాడి రైతులకు గిట్టు బాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో పాడి రైతులకు చాలా తక్కువ ధరలు చెల్లిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఏపీలో జేపీవీ ప్రాజెక్టు ద్వారా పాడి రైతులకు గరిష్టంగా లీటర్ గేదె పాలపై రూ.100 అంతకంటే ఎక్కువ ధర లభిస్తుండడం ప్రశంసనీయం. దేశంలో పాడి ఆధారిత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించి జేవీపీ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించాలి. ఏపీని రోల్ మోడల్‌గా తీసుకుని తమ రాష్ట్రాల్లో పాడి రైతులకు గిట్టుబాటు కల్పించాలి. -
హైదరాబాద్ టూ అమెరికా: ఇలా చేస్తే తక్కువ ధరకే విమాన టికెట్లు!
అమెరికా వెళ్లే ప్రయాణికులు కాస్త ముందస్తు ప్లానింగ్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో అమెరికా ప్రయాణం చేయొచ్చు. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి అమెరికాకు ప్రయాణం చేసే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. మాములుగా అమెరికా వెళ్లే ప్రయాణికులు ఆన్ లైన్ లో తమకు నచ్చిన వెబ్ సైట్ లో అమెరికా వెళ్లేందుకు టికెట్ రేట్ ఎంత ఉందో ప్రయాణానికి కొన్ని రోజుల ముందు ప్లాన్ చేసుకుంటారు. మరికొంత మంది అయితే ఎక్కువ స్టాప్స్ ఉండే ఫ్లైట్ లను ఎంచుకుంటే తక్కువ ధర లో టికెట్ దొరుకుతుందని వెదుకుతారు. అలా సాధారణంగా ట్రై చేయకుండా మేం చెప్పే విధంగా ట్రై చేస్తే మీరు తక్కువ ఖర్చుతోనే అమెరికా వెళ్లొచ్చు. సాధారణంగా అయితే అమెరికా లోని న్యూయార్క్ నగరానికి వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులు హైదరాబాద్ నుండి న్యూయార్క్ కి టికెట్ బుక్ చేసుకుంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ముంబై వరకు డొమెస్టిక్ ఫ్లైట్ లో తీసుకువెళ్లి అక్కడి నుండి ఇస్తాంబుల్ వరకు ఇంటర్ నేషనల్ ఫ్లైట్ తీసుకువెళ్లి మళ్లి అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ లో న్యూయార్క్ కి చేరుకుంటారు. ఇలా అయితే సాధారణ ప్రయాణం కోసం టికెట్ బుక్ చేసుకుంటే ఇండిగో ఎయిర్ లైన్స్ అయితే సుమారు లక్ష రూపాయల నుండి లక్షన్నర వరకు టికెట్ చార్జ్ అవుతుంది. ఇలా ట్రై చేయండి, బోలెడంత డబ్బు ఆదా హైదరాబాద్ నుండి న్యూయార్క్ కి కొన్ని ప్రయోగాలు చేస్తే మీరు చాలా తక్కువ ఖర్చుతో నే అమెరికా వెళ్లొచ్చు. అది ఎలా అంటే మొదట హైదరాబాద్ నుండి నేరుగా దుబాయ్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే ఒక ప్రయాణికునికి ఒక నెల ముందు టికెట్ తీసుకుంటే సుమారు 10వేల నుండి 12వేల వరకు ఛార్జ్ అవుతుంది. దుబాయ్ నుండి న్యూయార్క్ కి టికెట్ సెపరేట్ గా బుక్ చేసుకుంటే సుమారు 43వేల నుండి 48 వేలల్లోనే టికెట్ లభిస్తుంది. మొత్తం కలిపితే రూ. 60 వేలు మాత్రమే అవుతుంది. దీంతో హైదరాబాద్ నుండి ముంబై మీదుగా ఇస్తాంబుల్ నుండి న్యూయార్క్ వెళితే ఒకలక్ష 25వేల నుండి లక్షన్నర వరకు అయ్యే ఖర్చు… అదే దుబాయ్ వెళ్లి అక్కడి నుండి న్యూయార్క్ కి బుక్ చేసుకుంటే కేవలం 60 వేల నుండి 70వేల తక్కువ ధరతోనే ప్రయాణం కంప్లీట్ అవుతుంది. ఇలా చేయడంతో వెయిటింగ్ పీరియడ్ తప్పడంతో పాటు ఇతర దేశాలను చూసే వీలు కూడా ఉంటుంది. కాకపోతే అరైవల్ ఆన్ వీసా ఉన్న దేశాలకు అయితే మీకు సులంభంగా అవుతుంంది. లేకుంటే వీసా దేశాలు అయితే మళ్లీ వీసా కోసం సెపరేట్ గా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మరొక విధంగా ట్రై చేయాలనుంటే అమెరికాలోని న్యూయార్క్ వెళ్లానుకుంటే ముందుగా హైదరాబాద్ నుండి శ్రీలంక దేశ రాజధాని కొలంబోకు టికెట్ బుక్ చేసుకుంటే ఒక వ్యక్తికి సుమారు 11వేల రూపాయల్లో టికెట్ వస్తుంది. కొలంబో నుండి న్యూయార్క్ కి టికెట్ బుక్ చేసుకుంటే సుమారు 56వేల రూపాయాల్లోనే టికెట్ దొరుకుతుంది. అంటే సుమారు 67వేల రూపాయలతో అమెరికాలోని న్యూయార్క్ కి చేరుకోవచ్చు. అదేవిధంగా శ్రీలంక దేశం కూడా చూసినట్లవుతుంది. కాబట్టి కొంచెం ట్రిక్కులు ప్లే చేస్తే ఇతర దేశాలను చూసినట్లుంటుంది తక్కువ ఖర్చుతోనే ప్రయాణం కంప్లీట్ అవుతుంది. -మంగ వెంకన్న, సాక్షి టీవీ -
రాష్ట్రంలో మరో 54 రైతు బజార్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో కొత్తగా మరిన్ని రైతు బజార్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రూ.41.09 కోట్ల వ్యయంతో ఒకేసారి 54 కొత్త రైతు బజార్లను నెలకొల్పుతోంది. వీటిలో ఇప్పటికే 15 రైతు బజార్లు అందుబాటులోకి రాగా.. మరో 3 రైతు బజార్లు ఈ నెల 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులతో పాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రైతుబజార్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన సమయానికి ఏపీలో 87 రైతు బజార్లు ఉండేవి. కొత్త రైతు బజార్ల ఏర్పాటు ప్రతిపాదన ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ స్థలాల కొరత, నిధుల లేమి సాకుతో గత టీడీపీ ప్రభుత్వం వాటి జోలికి పోలేదు. ఉన్న రైతు బజార్లలోనూ కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఫలితంగా రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతుబజార్ల ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. కాకినాడ జిల్లాలో 10, తూర్పు గోదావరి జిల్లాలో 4, విజయనగరం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 3 చొప్పున, విశాఖపట్నం, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో 2 చొప్పున, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, బాపట్ల, తిరుపతి, నంద్యాల, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్మిస్తారు. వీటిలో 11 టెండర్ల దశలో ఉండగా, 7 బేస్మెంట్ దÔèæ, 8 రూఫ్‌స్థాయి, 5 సీలింగ్ స్థాయిల్లో ఉండగా, మరో ఐదుచోట్ల టెండర్లు పిలవాల్సి ఉంది. నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన నాడు–నేడు కింద రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, వైఎస్సార్ జిల్లాల్లోని మొత్తం రైతుబజార్లను ఆధునికీకరిస్తున్నారు. శిథిలమైన షెడ్ల పునర్నిర్మాణంతో పాటు ఆర్వో ప్లాంట్స్, విద్యుత్, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. పార్కింగ్, హోర్డింగ్స్, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో స్వయం సంవృద్ధి సాధించే దిశగా రైతుబజార్లను తీర్చిదిద్దుతున్నారు. ఒకేసారి 54 రైతు బజార్ల నిర్మాణం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 54 కొత్త రైతుబజార్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటిలో 15 రైతుబజార్ల సేవలు అందుబాటులోకి రాగా.. మరో 3 రైతుబజార్లను ఈ నెల 15న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశాం. మిగిలిన వాటిని దశల వారీగా ప్రారంభిస్తాం. – ముల్లంగి నందకిషోర్, సీఈవో, రైతుబజార్లు -
భారత్‌లో టాప్ 5 బెస్ట్ సన్‌రూఫ్ కార్లు ఇవే!
Affordable Cars With Sunroof: ఆధునిక కాలంలో కార్ల కొనుగోలుదారులు లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న వాటిని కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. కావున కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల్లో కస్టమర్ల సౌలభ్యం మేరకు కావలసిన ఫీచర్స్ అందిస్తున్నాయి. ఒకప్పుడు సన్‌రూఫ్ అనేది కేవలం హై-ఎండ్ కార్లలో మాత్రమే లభించేది. కాగా ఇప్పుడు మనకు స్టాండర్డ్ ఎస్‌యువిలలో కూడా ఈ ఫీచర్ లభిస్తోంది. మార్కెట్లో లభించే టాప్ 5 బెస్ట్ సన్‌రూఫ్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా సన్‌రూఫ్ ఫీచర్‌తో దాని విభాగంలో లభించే సరసమైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 13.96 లక్షల నుంచి రూ. 19.20 లక్షల వరకు ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు 1.5-లీటర్, పెట్రోల్ ఇంజన్ & 1.5-లీటర్, డీజిల్ ఇంజన్ పొందుతుంది. రేండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతాయి. ఎంజి ఆస్టర్ (MG Aster) రూ. 14.21 లక్షల నుంచి రూ. 18.69 లక్షల మధ్య లభించే ఈ ఎంజి ఆస్టర్ సన్‌రూఫ్ ఫీచర్ లభించే ఉత్తమ మోడల్. ఇది 1.5-లీటర్, పెట్రోల్ అండ్ 1.3-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్స్ పొందుతుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. రెడ్ కలర్ ఇంటీరియర్ కలిగిన ఈ కారు చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. డిజైన్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే ప్రత్యేకంగా ఉంటుంది. కియా సెల్టోస్ (Kia Seltos) సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ పాపులర్ కారు సెల్టోస్ సన్‌రూఫ్ ఫీచర్‌తో లభించే అత్యుత్తమ కారు. దీని ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు 1.5-లీటర్, పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తాయి. కాగా మల్టిపుల్ గేర్‌బాక్స్ ఎంపికలు ఇందులో లభించడం విశేషం. ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు ఎంతోమంది ప్రజలకు నచ్చిన మోడల్ కావడం గమనార్హం. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) రూ. 15.41 లక్షల నుంచి రూ. 19.83 లక్షల మధ్య లభించే మారుతి సుజుకి గ్రాండ్ విటారా సన్‌రూఫ్ ఫీచర్ కలిగి టాప్ 5 కార్లలో ఒకటి. ఒక మిడ్-సైజ్ ఎస్యువి సన్‌రూఫ్ ఫీచర్‌తో రావడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఇది ఆల్ఫా పెట్రోల్ ట్రిమ్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ట్రిమ్‌లలో మాత్రమే లభిస్తుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: ఐఐటీ నుంచి సాఫ్ట్వేర్.. లక్షల ఉద్యోగం వదిలి కమెడియన్‌గా.. ఎంత సంపాదిస్తున్నాడంటే?) టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) టయోటా కంపెనీకి చెందిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మన జాబితాలో అత్యధిక ధర వద్ద లభించే సన్‌రూఫ్ ఫీచర్ కలిగిన కారు. దీని ధర రూ. 16.04 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. బ్లాక్ అండ్ బేజ్ కలర్ ఆప్షన్ ఇంటీరియర్ కలిగిన ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 1.5-లీటర్ పెట్రోల్ & 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో e-CVT పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అతితక్కువ ధరకే ఇన్ఫినిక్స్ హాట్ 30 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ తోపాటు, భారీ బ్యాటరీ ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.12 వేలకే లభ్యం కానుంది. బడ్జెట్ ఫోన్లతో ఆకట్టుకుంటున్న ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ హాట్ 30 ఫోను సేల్ జులై 18 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో హాట్ 30 సేల్ షురూ అవుతుందని సంస్థ వెల్లడించింది. రెండు వేరియంట్లలో ఇది లభించనుంది. 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.12,499 కాగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13,499 గా నిర్ణయించింది. ఇక ఆఫర్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్స్టాంట్ డిస్కౌంట్‌తో పాటు, రూ. నెలకు 2,250 చొప్పున నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ హాట్ 30 స్పెసిఫికేషన్లు 6.78 ఇంచెస్ ఫుడ్ హెచ్డీ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్ 50 + 2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -
రైతుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత సీఎం జగన్‌దే
తణుకు అర్బన్/అత్తిలి : ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థ లేకుండా రైతుకు గిట్టుబాటు ధరను నేరుగా అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రతి గింజనూ కొనుగోలు చేసి వారి బ్యాంకు ఖాతాలకే నగదు జమ చేసిన ఘనత కూడా సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. తన ధాన్యం కొనలేదు.. గిట్టుబాటు ధర ఇవ్వలేదు.. అని ఏ ఒక్క రైతూ అననప్పటికీ తగుదునమ్మా అని తణుకులో చంద్రబాబు నిర్వహించిన రైతు పోరుబాట పాదయాత్ర, సభ జనాదరణ లేక అట్టర్ ఫ్లాప్ షో అయ్యాయని చెప్పారు. తన సామాజికవర్గానికి చెందిన తణుకు టీడీపీ నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించాలనే తపనతో ఏదోరకంగా జాకీ లేసి పైకి లేపేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టిందని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లపై నాలుగేళ్లపాటు మాట్లాడని చంద్రబాబు.. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ దురుద్దేశంతో తణుకుకు రెండుసార్లు వచ్చాడని దుయ్యబట్టారు. చంద్రబాబు యాత్రలో రైతులు లేకపోగా దూరప్రాంతాల నుంచి తీసుకొచ్చిన జనంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. బీసీలను ఓటు యంత్రంగా వాడుకునే చంద్రబాబుకు రానున్న రోజుల్లో బీసీలే తగిన పాఠం చెబుతారని హెచ్చరించారు. జనం లేని సభలో టీడీపీ నాయకులు మీడియాపై కూడా దాడులకు దిగే హీనస్థితికి దిగజారిపోయారని మంత్రి కారుమూరి మండిపడ్డారు. చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం పబొ మగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన రైతు పోరుబాట యాత్రలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ.. మంత్రికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం అత్తిలి, తణుకులో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, వైఎస్సార్సీపీ బీసీ సెల్ అత్తిలి మండల అధ్యక్షుడు రంభ సూరిబాబు, పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ తదితరులు చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండించారు. అత్తిలి బస్‌స్టేషన్ సెంటర్లో, తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నా నిర్వహించి చంద్రబాబు దిష్టి»ొమ్మలను దహనం చేశారు. -
తక్కువ ధర వద్ద సన్‌రూఫ్ కారు కావాలా - ఇదిగో ఇది మీ కోసమే
ఒకప్పుడు సన్‌రూఫ్ ఫీచర్ అనేది కేవలం హై-ఎండ్ కార్లలో మాత్రమే లభించేది. ఇలాంటి కార్లు ఎక్కువ ధర కలిగి ఉండటం వల్ల సామాన్యులకు సన్‌రూఫ్ కార్లు కొనటం కొంత కష్టమయ్యేది. అయితే ఇప్పుడు తక్కువ ధరకు లభించే కార్లలో కూడా సన్‌రూఫ్ లభిస్తోంది. దేశీయ మార్కెట్లో సరసమైన ధరకు లభించే టాప్ 5 సన్‌రూఫ్ కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. హ్యుందాయ్ ఐ20 (Hyundai i20): హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ20 సన్‌రూఫ్ ఫీచర్ కలిగిన చౌకైన కార్లలో ఒకటి. ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో ఇది ఒకటి. సన్‌రూఫ్ కలిగిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన ఈ కారు ధర రూ. 9.1 లక్షలు. ఇది 1.2-లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue): భారతీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ కార్లలో చెప్పుకోదగ్గ మోడల్ వెన్యూ. సబ్-కాంపాక్ట్ ఎస్యువి సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన వెన్యూ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 10.93 లక్షలు. మహీంద్రా ఎక్స్యువి300 (Mahindra XUV300): దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్యువి300 ప్రారంభ ధర రూ. 8.41 లక్షలు. ఈ కాంపాక్ట్ ఎస్యువి సన్‌రూఫ్ కలిగి తక్కువ ధరకు లభించే ఉత్తమ మోడల్. ఇది 1.2-లీటర్ మూడు-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. కియా సోనెట్ (Kia Sonet): సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ విడుదల చేసిన కార్లలో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న సబ్-కాంపాక్ట్ ఎస్యువి సోనెట్ కూడా సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 10.49 లక్షలు. ఇది సోనెట్ మూడు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. అవి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు. టాటా నెక్సాన్ (Tata Nexon): టాటా నెక్సాన్ భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న అత్యంత సురక్షితమైన కారు. సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉన్న సరసమైన కార్ల జాబితాలో ఇది చెప్పుకోదగ్గ మోడల్. ఈ ఎస్యువి ప్రారంభ ధర రూ. 9.39 లక్షలు(ఎక్స్-షోరూమ్). టాటా నెక్సాన్ ప్రస్తుతం ఎలక్ట్రిక్, ఫేస్‌లిఫ్ట్ మోడల్స్‌లో కూడా అందుబాటులో ఉంది. -
Infinix INBook Y1 Plus Neo రూ. 20వేలకే ల్యాప్‌ట్యాప్, ఎట్రాక్టివ్ ఫీచర్స్!
సాక్షి, ముంబై: బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు,స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులతో ఆకట్టుకున్నఇన్ఫినిక్స్ ఇపుడిక ల్యాప్‌టాప్ విభాగంలో క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా పోర్టబుల్ కంప్యూటర్ లాంటి సరికొత్త ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో పేరుతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. అల్యామినియమ్ అలాయ్ మెటల్ బాడీ, 15.6 ఇంచుల ఫుల్హెచ్డీ డిస్ప్లే, ఇంటెల్ సెలెరోన్ ఎన్5100 (Intel Celeron N5100) క్వాడ్‌కోర్ ప్రాసెసర్ లాంటి ఫీచర్లను ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియోలో అందించింది. ఈ ల్యాప్‌టాప్ ఫస్ట్ సేల్‌లో లాంచింగ్ ధరను ఆఫర్ చేస్తోంది. (బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?) ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో స్పెసిఫికేషన్లు 15.6 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ సెలెరోన్ ఎన్5100 క్వాడ్‌కోర్ బడ్జెట్ ప్రాసెసర్, 260 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఇంటెల్ యూహెచ్డీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో,డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, రెండు యూఎస్బీ పోర్టులు, ఓ హెచ్డీఎంఐ పోర్టు, రెండు యూఎస్బీ టైప్-సీ పోర్టులు, ఓ మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్,బ్యాక్లిట్ కీబోర్డ్ ,యాంటీ-గ్లేర్ గ్లాస్ టచ్‌ప్యాడ్ లాంటి ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.76 కేజీలుగా ఉంది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్డీ వెబ్‌క్యామ్ , 2 వాట్ల సౌండ్ ఔట్పుట్ ఇచ్చే స్పీకర్లు, 40Wh బ్యాటరీ45 వాట్ల పీడీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ 75 శాతం చార్జ్ అవుతుందని ఇన్ఫినిక్స్ వెల్లడించింది. ఇక ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ ల్యాప్‌టాప్ 7 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో ధర, సేల్ 8 జీబీ ర్యామ్, 256 జీబీఎస్ఎస్డీ స్టోరేజ్ వేరియంట్ ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో ల్యాప్‌టాప్ ధర రూ.20,990గా ఉంది.అలాగే 8 జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.22,990లు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈనెల 26వ తేదీ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. సిల్వర్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో లభ్యం. -
అదిరిపోయే ఫీచర్లతో లావా బ్లేజ్: పరిచయ ఆఫర్ చూస్తే ఫిదా!
సాక్షి, ముంబై: దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ లావా మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లావా బ్లేజ్-2ను విడుదల చేసింది. ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్ , పంచ్-హోల్ డిస్ప్లే,డ్యూయల్ కెమెరా , 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో బ్లేజ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,999 వద్ద లాంచ్ చేసింది. అయితే పరిచయ ఆఫర్‌గా కేవలం రూ.8,999కే అందించనుంది. లావా బ్లేజ్-2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ నెల 18 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. (Billionaire Barber Story: ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్ బాబు’ స్టోరీ చూస్తే..!) టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13కి అప్‌గ్రేడ్ చేయబడుతుందని , రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని కంపెనీ వెల్లడించింది. (మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ దెబ్బ! మస్క్‌కు భారీ ఝలక్!) లావా బ్లేజ్-2 స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల హెచ్డీ + డిస్ప్లే విత్ పంచ్ హోల్ డిజైన్ యూనిసోన్ టీ616 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 6జీబీ రామ్,128 జీబీ స్టోరేజీ 13 మెగా పిక్సెల్స్ డ్యుయల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీకెమెరా 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ భారత్‌లో లావా బ్లేజ్-2 ధర రూ.8,999. గ్లాస్ బ్లూ, గ్లాస్ బ్లాక్, గ్లాస్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. ఈ నెల 18 మధ్యాహ్నం నుంచి సేల్స్ ప్రారంభం. -
భారత్‌లో తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బైకులు - వివరాలు
సాధారణంగా చాలామంది వాహన వినియోగదారులు మంచి మైలేజ్ అందించి సరసమైన ధర వద్ద లభించే వాహనాలను (బైకులు, కార్లు) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దేశీయ విఫణిలో ద్విచక్ర వాహన విభాగంలో సరసమైన ధర వద్ద లభించే ఐదు బైకులు గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. హీరో హెచ్ఎఫ్ 100: భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ హీరో హెచ్ఎఫ్ 100. ఈ బైక్ ధర రూ. 54,962 (ఎక్స్-షోరూమ్). ఇది 97 సీసీ ఇంజిన్ కలిగి 8 హెచ్‌పి పవర్ 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్: హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ మన జాబితాలో సరసమైన ధర వద్ద లభించే పాపులర్ బైక్. దీని ధర రూ. 61,232 నుంచి రూ. 68,382 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 100 సిసి విభాగంలో తిరుగులేని అమ్మకాలు పొందుతూ ఇప్పటికీ ఎక్కువ మంది కస్టమర్ల మనసు దోచేస్తున్న బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కావడం విశేషం. టీవీఎస్ స్పోర్ట్: టీవీఎస్ కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఒకప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇందులో ఒకటి 'టీవీఎస్ స్పోర్ట్' బైక్. దీని ధర రూ. 61,500 నుంచి రూ. 69,873 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ కలిగి 8.3 హెచ్‌పి పవర్ 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా షైన్ 100: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఎక్కువ అమ్ముడవుతున్న బైకులలో హోండా షైన్ 100 కూడా ఒకటి. దీని ధర రూ. 64,900 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ 99.7 సీసీ ఇంజిన్ కలిగి 7.61 హెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఎలక్ట్రిక్ స్టార్టర్ పొందుతుంది. ఇది దేశీయ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన సెల్ఫ్-స్టార్ట్ మోటార్‌సైకిల్‌గా నిలిచింది. బజాజ్ ప్లాటినా 100: భారతీయ మార్కెట్లో లభించే సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినా 100. ఈ బైక్ ధర రూ.67,475 (ఎక్స్-షోరూమ్). ఇది సిగ్నేచర్ DTS-i టెక్నాలజీ 102 సిసి ఇంజిన్ ద్వారా 7.9 హెచ్‌పి పవర్ మరియు 8.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. -
అంబానీ కీలక నిర్ణయం: మరో రంగంలో సునామీకి సిద్ధం
సాక్షి, ముంబై: ఆసియా బిలియనీర్ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరో రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయిల్, టెలికాం, రీటైల్ రంగాల్లో దూసుకుపోతున్న రిలయన్స్ ఇపుడిక హెల్త్ కేర్ సెక్టార్లో ప్రవేశించనుంది. అదీ స్థానికంగా లభించే ఇతర ఆఫర్ల కంటే తక్కువకే జినోమ్ మ్యాపింగ్ పరీక్షలను అందుబాటులోకి తీసుకురానుంది. స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ రూపొందించిన జినోమ్ కిట్‌ను 145 డాలర్లకు, మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు 86 శాతం తక్కువకే అందించనుంది. కొన్ని జన్యుపరమైన రుగ్మతలు, వ్యాధులను గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. మైజియో యాప్‌లో రాబోయే వారాల్లో ఈ టెస్ట్‌ను దూకుడుగా మార్కెట్ చేయాలని రిలయన్స్ యోచిస్తోంది. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జినోమ్ మ్యాపింగ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. క్యాన్సర్లు, న్యూరో-డీజెనరేటివ్ వ్యాధులు, గుండె సంబంధిత ప్రమాదాలు లాంటి వ్యాధులు, వాటి ప్రభావాలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రొఫైల్‌ని స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. మరికొన్నివారాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష కిట్‌ను కేవలం రూ.12 వేలకే అందుబాటులోకి తెస్తున్నట్లు స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రమేష్ హరిహరన్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన జినోమిక్ ప్రొఫైల్ ఇదేనని రమేష్ హరిహరన్ తెలిపారు. ఫలితాలను వివరించడంలో స్ట్రాండ్ సరికొత్త శాస్త్రీయ పరిశోధనలను పొందుపరుస్తుందని హరిహరన్ తెలిపారు. ఈ పరీక్ష ఔషధాల అభివృద్ధికి సహాయపడే జీవసంబంధమైన డేటా రిపోజిటరీని రూపొందించడానికి కూడా అనుమతిస్తుందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన ఈ సంస్థలో దాదాపు 80 శాతం వాటాలను రిలయన్స్ గ్రూప్ 2021లోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలోని 23andMe స్టార్టప్ మాదిరిగా తక్కువ ఖర్చుతో భారతీయులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇంకా MapmyGenome, Medgenome వంటి భారతీయ కంపెనీల పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ 1,000డాలర్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన అంబానీ తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
పోకో సీ55 స్మార్ట్‌ఫోన్: రూ.10వేల లోపు బెస్ట్ ఫోన్!
సాక్షి, ముంబై: పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లోలాంచ్ చేసింది. పోకో సీ 55 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ధరను పదివేల లోపే నిర్ణయించడం విశేషం. 5,000mAh బ్యాటరీ, లెదర్ ఫినిష్‌లాంటి ఫీచర్లతో బడ్జెట్ ఫోన్‌కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫారెస్ట్ గ్రీన్, కూల్ బ్లూ మరియు పవర్ బ్లాక్ రంగులలో ఇది లభ్యం. పోకో సీ 55 ఫీచర్లు 6.71-అంగుళాల IPS LCD డిస్ప్లే MediaTek Helio G85 SoC MIUI 13 స్కిన్‌తో Android 12 OS 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫ్లిప్‌కార్ట్ వివరాల ప్రకారం పోకో సీ 55 4జీ ప్రారంభ ధర 8,499 రూపాయలు. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999. ఈ బడ్జెట్ ఫోన్ ఫిబ్రవరి 28నుంచి సేల్స్ మొదలు. సేల్ ఆఫర్‌గా రూ. 500 ఫ్లాట్ తగ్గింపు, బ్యాంక్ కార్డ్‌లపై రూ. 500 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. -
టెక్నో పాప్ 7ప్రో: ఫీచర్లు అదుర్స్! ధర మాత్రం రూ. 7వేల లోపే
సాక్షి,ముంబై: టెక్నో మొబైల్ సంస్థ కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. టెక్నో పాప్ 7ప్రో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వరుసలో పాప్ 6 ప్రో తరువాత ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 6.56 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేతో టెక్నో పాప్ 7 ప్రో, ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ప్రత్యేక ఫీచర్లు నిలుస్తున్నాయి. రెండు కలర్ వేరియంట్లు, రెండు స్టోరేజ్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. టెక్నో పాప్ 7ప్రో ఫీచర్లు 6.56 అంగుళాల HD ప్లస్ డిస్ప్లే క్వాడ్-కోర్ MediaTek Helio A22 SoC ఆండ్రాయిడ్ 12-ఆధారిత HiOS 11.0 12మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా 5మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా 5 000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్ ధర,లభ్యత 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ధర 6,799, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ. 7,299 ఫిబ్రవరి 22 నుండి అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. -
మైక్రో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది..అత్యంత చౌక ధరలో
సాక్షి, ముంబై: భారతదేశపు అత్యంత చౌక ఎలక్ట్రిక్ కార్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన మైక్రో ఎలక్ట్రిక్ వెహికిల్ పీఎంవీ ఎలక్ట్రిక్ ఈఏఎస్-ఈ కారు నవంబరు 16న విడుదల కానుంది. దీని ధర రూ. 4లక్షలు- 5 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ముంబై ఆధారిత పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ (పర్సనల్ మొబిలిటీ వెహికిల్) ఇండియాలో తన తొలి ఫ్లాగ్షిప్ స్మార్ట్ మైక్రోకార్ EaS-Eని ఆవిష్కరించనుంది. EaS-E ఎలక్ట్రిక్ కార్ స్పెసిఫికేషన్ అంచనాలు కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభించనుంది. ప్యాషనేట్ రెడ్, ఫంకీ ఎల్లో, డీప్ గ్రీన్, రూస్టిక్ చార్కోల్, స్పార్కిల్ సిల్వర్, బ్రిలియంట్ వైట్, రాయల్ లేత గోధుమరంగు, మెజెస్టిక్ బ్లూ, వింటేజ్ బ్రౌన్, పెప్పీ ఆరెంజ్, ప్యూర్ బ్లాక్ రంగుల్లో లభ్యం. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ ఫౌండర్ కల్పిత్ పటేల్ సమచారం ప్రకారం ఈ వెహికల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-200 కి.మీ పయనిస్తుంది. నాలుగు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతంది. ఇందుకోసం 3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌ని ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. పీఎంవీ ఎలక్ట్రిక్ ఈఏఎస్-ఈలో డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఏసీ, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్, సీట్ బెల్ట్స్ వంటివి ఉన్నాయి. ఇంకా మైక్రో ఎలక్ట్రిక్ కారు 550కేజీల బరువుతో పొడవు 2,915ఎంఎం, విడ్త్ 1,157ఎంఎం, హైట్ 1,600 ఎంఎంగానూ, వీల్‌బేస్ 2,087ఎంఎంగా, గ్రౌండ్ క్లియరెన్స్ 170ఎంఎంగా ఉంటుందట. -
సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు శుభవార్త
సాక్షి, అమరావతి: సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు పేపర్ మిల్లుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ప్రస్తుతం చెల్లిస్తున్న ధరపై టన్నుకు కనీసం రూ.200 పెంచేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర కల్పనపై పేపర్ మిల్లుల ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం సచివాలయంలో చర్చలు జరిపారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ గిట్టుబాటు ధర విషయంలో సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు పేపర్ మిల్లుల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. దీనిపై పేపర్ మిల్లుల ప్రతినిధులు స్పందిస్తూ టన్నుకు కనీసం రూ.200 నుంచి సాధ్యమైనంత ఎక్కువ పెంచేందుకు చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులకే నేరుగా డబ్బులను చెల్లించాలని కంపెనీల ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. వ్యయసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ కె.లక్ష్మీభాయి, ఐటీసీ ప్రతినిధి గోబల కన్నన్, ఆంధ్రా పేపర్ మిల్స్ (రాజమండ్రి) ప్రతినిధి కె.బాలకృష్ణ, సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రతినిధి ఎన్ఎస్ కన్నబాబు, గుజరాత్ పేపర్ మిల్స్ ప్రతినిధులు టీఎస్ భగవాన్, వై.రుషికేశ్వరరావు, బీఐఎల్‌టీ ప్రతినిధి జీవీడీ ప్రసాద్ పాల్గొన్నారు. మరో మూడు సేంద్రియ ఉత్పత్తులు మార్కప్ బ్రాండ్ పేరుతో కొత్తగా మరో మూడు రకాల సేంద్రియ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇప్పటికే మార్కప్ ద్వారా 17 రకాల సేంద్రియ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురాగా... తాజాగా సేంద్రీయ బెల్లం, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పును కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మార్కెట్లోకి కొత్తగా 7 వంగడాలు రైతులకు కొత్తగా మరో ఏడు వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, పత్తిలో 2, రాగి/చోడిలలో ఒకటి చొప్పున ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ పరిశోధనా కేంద్రాలు అభివృద్ధి చేశాయి. రెండు నెలల కిందట రాష్ట్రస్థాయిలో 10వంగడాలను విడుదల చేయగా, తాజాగా మరో 7 వంగడాలు జాతీయస్థాయిలో వినియోగించుకునేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. -
సగం ధరకే రెడ్ మీ స్మార్ట్‌ఫోన్స్.. ఎక్కడంటే..!
సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్మీ పేరెంట్ కంపెనీ ఎంఐ క్లియరెన్స్ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్ అతి తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను అందిస్తోంది. ఈ సేల్‌లో కొనుగోలుదారులు రూ. 3,999కే స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎంఐ క్లియరెన్స్ సేల్కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. దీని ప్రకారం రెడ్ మీ 6ఏ, రెడ్ మీ వై3, రెడ్ మీ నోట్ 7 ప్రో. వంటి మోడల్స్ ను దాదాపు సగం ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ-లెవల్ బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 6ఏ మోడల్ ప్రారంభ ధర రూ.6,999 కాగా, క్లియరెన్స్ సేల్ లో దీన్ని రూ. 3,999కి అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఫీచర్లతో, 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీతో వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 6ఏ, దీంతోపాటు మిగతా మోడళ్లను కూడా తక్కువకే ఎంఐ సేల్‌లో లభ్యం. అయితే ఈ సేల్‌లో తగ్గింపుతో కొనుగోలు చేసిన స్మార్ట్ఫోన్లు వారంటీని కలిగి ఉండవు అనేది గమనార్హం.