
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ మేకర్ లావా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. లావా జెడ్ 60కి సక్సెసర్‌గా లావా జెడ్60ఎస్ పేరుతో4జీ వోల్ట్ డివైస్‌ను లావా ఇంటర్నేషనల్ విడుదల చేసింది. దీని ధరను రూ.4949 గా నిర్ణయించింది. నవంబరు 15, 2018లోపు కొనుగోలు చేసిన వారికి వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే జియో (పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్) కస్టమర్లకు రూ.2200 తక్షణ క్యాష్‌బ్యాక్‌ఆఫర్ కూడా ఉంది. 50 రూపాయల విలువైన 44 రీచార్జ్ కూపన్లను జియో వినియోగదారులకు అందిస్తుంది.
లావా జెడ్60ఎస్
5 అంగుళాల డిస్‌ప్లే
1.5గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
1 జీబీ, 16జీబీ స్టోరేజ్
ఆండ్రాయిడ్8.1 ఓరియో(గో)
5ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2500 ఎమ్‌ఏహ్‌చ్‌బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment