
సాక్షి, న్యూఢిల్లీ : నోకియా మొబైల్ ఫోన్‌ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ అందుబాటు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎక్స్ 20 పేరుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది . 5జీ సపోర్ట్‌తో స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ను జోడించిన నోకియా ఎక్స్ 20 త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.దీంతోపాటు గురువారం జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఒకటి రెండు కాదు ఆరు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్, టాప్ లైన్‌లలో భాగంగా వీటిని తీసుకురావడం విశేషం.
నోకియా ఎక్స్ 20 ఫీచర్లు
6.67అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 11
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్
32 ఎంపీ సెల్ఫీకెమెరా
64 + 5+2+2 ఎంపీ క్వాడ్ కెమెరా
6 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్
4470 ఎంఏహెచ్ బ్యాటరీ
ఈయూ మార్కెట్లో దీని ధర సుమారు 31,000 రూపాయలు. మిడ్‌నైట్ సన్ నార్డిక్ బ్లూ రంగులలో వస్తుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో మేలో సేల్ ప్రారంభం.
చదవండి : స్మార్ట్‌ఫోన్‌తో ఆక్సిజన్ లెవల్స్ ఇలా చెక్ చేసుకోండి
Comments
Please login to add a commentAdd a comment