న్యూఢిల్లీ: టెలికం గేర్స్ తయారీ దిగ్గజం నోకియా మరో ఘనతను సాధించింది. 5జీ సేవల్లో డౌన్‌లోడ్ వేగం గరిష్టంగా సెకనుకు 1.2 గిగాబిట్ నమోదు చేసింది. భారత్‌లో భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి మొదటి 5జీ నాన్ స్టాండలోన్ క్లౌడ్ రేడియా యాక్సెస్ నెట్‌వర్క్ పరీక్షల సమయంలో నోకియా ఈ రికార్డు నమోదు చేసింది.
5జీ కోసం 3.5 గిగాహెట్జ్, 4జీ కోసం 2100 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వినియోగించి ఓవర్–ది–ఎయిర్ వాతావరణంలో పరీక్ష జరిగింది. ఎయిర్‌టెల్ వాణిజ్య నెట్‌వర్క్ ద్వారా డేటా కాల్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. క్లౌడ్ నెట్‌వర్క్ టెక్నాలజీని ఉపయోగించి నోకియా, ఎయిర్‌టెల్ ఈ ట్రయల్ నిర్వహించాయి.
Comments
Please login to add a commentAdd a comment