Download speed
-
సెకనుకు 1.2 జీబీ స్పీడ్.. నోకియా ఘనత
న్యూఢిల్లీ: టెలికం గేర్స్ తయారీ దిగ్గజం నోకియా మరో ఘనతను సాధించింది. 5జీ సేవల్లో డౌన్లోడ్ వేగం గరిష్టంగా సెకనుకు 1.2 గిగాబిట్ నమోదు చేసింది. భారత్‌లో భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి మొదటి 5జీ నాన్ స్టాండలోన్ క్లౌడ్ రేడియా యాక్సెస్ నెట్వర్క్ పరీక్షల సమయంలో నోకియా ఈ రికార్డు నమోదు చేసింది.5జీ కోసం 3.5 గిగాహెట్జ్, 4జీ కోసం 2100 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వినియోగించి ఓవర్–ది–ఎయిర్ వాతావరణంలో పరీక్ష జరిగింది. ఎయిర్టెల్ వాణిజ్య నెట్వర్క్ ద్వారా డేటా కాల్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. క్లౌడ్ నెట్వర్క్ టెక్నాలజీని ఉపయోగించి నోకియా, ఎయిర్టెల్ ఈ ట్రయల్ నిర్వహించాయి. -
మొబైల్ స్పీడ్‌లో మెరుగుపడ్డ భారత్.. 5జీ రాకతో దూకుడు!
దేశంలో 5జీ సేవలు విస్తృతం కావడంతో మొబైల్ స్పీడ్‌లో భారత్ మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా సగటు మొబైల్ వేగంలో మన దేశం జనవరిలో 10 స్థానాలు ఎగబాకింది. డిసెంబర్లో 79వ స్థానంలో ఉన్న భారత్ జనవరిలో 69వ స్థానానికి చేరుకున్నట్లు ఊక్లా నివేదిక పేర్కొంది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లోనూ భారత్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది. డిసెంబర్లో 81వ స్థానంలో ఉండగా జనవరిలో 79వ స్థానానికి చేరుకుందని నెట్వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్సైట్స్ ప్రొవైడర్ ఊక్లా నివేదించింది. ఫిక్స్డ్ మొబైల్ స్పీడ్ సగటు డిసెంబర్లో 49.14 ఎంబీపీఎస్ ఉండగా జనవరిలో 50.02 ఎంబీపీఎస్‌కి స్వల్పంగా పెరిగింది. కాగా ఓవరాల్ మొబైల్ స్పీడ్ సగటులో భారత్ నవంబర్‌లో 105వ స్థానంలో ఉండేది. ఈ ఓవరాల్ మొబైల్ స్పీడ్ సగటు గత డిసెంబర్లో 25.29 ఎంబీపీఎస్ ఉండగా జనవరిలో 29.85 ఎంబీపీఎస్‌కు మెరుగుపడింది. జనవరి స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ ఓవరాల్ సగటు మొబైల్ స్పీడ్ చార్ట్‌లో యూఏఈ అగ్రస్థానంలో ఉంది. ఇదే సమయంలో పపువా న్యూగినియా ర్యాంక్ ఏకంగా 24 స్థానాలు మెరుగుపడటం గమనార్హం. ఇక ఫిక్స్డ్ మొబైల్ స్పీడ్ సగటులో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా సైప్రస్ 20 స్థానాలను మెరుగుపరుచుకుంది. -
బ్రాడ్‌బ్యాండ్ నిర్వచనం మార్పు
న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ నిర్వచనాన్ని ప్రభుత్వం సవరించింది. కనీస డౌన్లోడ్ స్పీడ్‌ను 2 ఎంబీపీఎస్‌కు (మెగాబిట్స్ పర్ సెకండ్) పెంచింది. 2013 జూలై నాటి నిర్వచనం ప్రకారం ఇది 512 కేబీపీఎస్‌గా (కిలోబిట్స్ పర్ సెకండు) ఉండేది. తాజా మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంత వినియోగదారులకు ఈ కొత్త నిర్వచనంతో ప్రయోజనం చేకూరగలదని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం ప్రెసిడెంట్ టీవీ రామచంద్రన్ చెప్పారు. డౌన్లోడ్ స్పీడ్‌ను బట్టి ఫిక్సిడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను బేసిక్, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఊక్లా నిర్వహించే స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం గతేడాది డిసెంబర్లో భారత్‌లో సగటున మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ 25.29 ఎంబీపీఎస్‌గా నమోదైంది. నవంబర్‌లో ఇది 18.26 ఎంబీపీఎస్‌గా ఉండేది. 2022 నవంబర్ 30 నాటికి దేశీయంగా 82.54 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఉండగా, వీరిలో 79.35 కోట్ల మంది వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. -
అదిరిపోయేలా 5జీ డౌన్‌లోన్ స్పీడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా 5జీ డౌన్లోడ్ స్పీడ్ 5.92 జీబీపీఎస్ నమోదైనట్టు ప్రకటించింది. ఎరిక్సన్తో కలిసి మహారాష్ట్రలోని పుణేలో నిర్వహిస్తున్న 5జీ పరీక్షల్లో ఈ మైలురాయిని చేరుకున్నట్టు కంపెనీ శుక్రవారం వెల్లడించింది. గతంలో డౌన్లోడ్ స్పీడ్ 4 జీబీపీఎస్ నమోదైందని వివరించింది. చదవండి: 5జీ ప్రొడక్ట్స్ తయారీకి విప్రో, హెచ్ఎఫ్సీఎల్ జోడీ -
రిలయన్స్ జియో సరికొత్త రికార్డు..!
2021 సెప్టెంబర్ గాను పలు టెలికాం సంస్థల డౌన్లోడింగ్, ఆప్లోడింగ్ స్పీడ్స్‌ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసింది. ఎప్పటిలాగే రిలయన్స్ జియో డౌన్లోడింగ్ స్పీడ్ విషయంలో మరోసారి అగ్రస్థానంలో కొనసాగుతోంది. రిలయన్స్ జియో అత్యధికంగా 20.9 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని సాధించింది. ట్రాయ్ 4జీ స్పీడ్ చార్ట్ ప్రకారం... డౌన్లోడింగ్ విషయంలో వోడాఫోన్ ఐడియా సగటున 14.4 ఎమ్‌బీపీఎస్ వేగంతో, ఎయిర్టెల్ సగటున 11.9 ఎమ్‌బీపీఎస్ వేగాన్ని సాధించాయి. చదవండి: ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోండి! వోడాఫోన్ ఐడియానే టాప్...! అప్లోడింగ్ విషయంలో వోడాఫోన్ ఐడియా 7.2 ఎమ్‌బీపీఎస్ వేగంతో అగ్రస్థానంలో నిలిచింది. వోడాఫోన్ ఐడియా తరువాత రిలయన్స్ జియో 6.2 ఎమ్‌బీపీఎస్, భారతీ ఎయిర్టెల్ 4.5 ఎమ్‌బీపీఎస్ అప్లోడ్ వేగాన్ని సాధించాయి. వినియోగదారులకు ఇంటర్నెట్ నుంచి కంటెంట్‌ను యాక్సెస్ చేయడంలో రిలయన్స్ జియో ముందుంది. గత నెలలో మూడు టెలికాం ప్రైవేట్ ఆపరేటర్ల 4జీ అప్లోడ్ వేగం మెరుగుపడినట్లు ట్రాయ్ వెల్లడించింది. డౌన్లోడింగ్, అప్లోడింగ్ వేగాన్ని వేగాన్ని ట్రాయ్ తన మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో లెక్కిస్తోంది.ట్రాయ్ డేటా ప్రకారం...జియో 4జీ నెట్వర్క్ వేగం 15 శాతం మేర పెరిగింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వరుసగా 85 శాతం, 60 శాతం మేర డౌన్లోడింగ్ స్పీడ్ పెరిగింది. చదవండి: షావోమీ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు ..! ఎప్పుడు వస్తాయంటే..? -
4జీ స్పీడ్‌లో రికార్డు సృష్టించిన జియో..!
న్యూ ఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరోసారి సత్తా చాటింది. 4జీ నెట్వర్క్ డౌన్లోడింగ్ స్పీడ్ విషయంలో జియోకు సాటిలేదని మరోసారి రుజువైంది. మే నెలలో డౌన్లోడింగ్ స్పీడ్ విషయంలో ఇతర నెట్వర్క్లకంటే సెకనుకు సరాసరి 20.7 ఎమ్‌బీపీఎస్ స్పీడ్‌తో జియో నెట్వర్క్ ముందంజలో ఉంది. కాగా ఈ విషయాన్ని టెలికాం రెగ్యూలేటర్ ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతోపాటుగా వోడాఫోన్ అప్లోడింగ్ స్పీడ్‌లో ముందంజలో నిలిచింది. వోడాఫోన్ సుమారు 6.7 ఎమ్‌బీపీఎస్ అప్లోడింగ్ స్పీడ్‌ను కలిగి ఉంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జూన్ 8 న ప్రచురించిన గణాంకాల ప్రకారం.. వోడాఫోన్-ఐడియా మే నెలలో సగటున 6.3 ఎమ్‌బిపిఎస్ అప్లోడ్ వేగాన్ని కలిగి ఉండగా, దీని తరువాత రిలయన్స్ జియో 4.2 ఎమ్‌బీపీఎస్ వేగంతో, భారతి ఎయిర్టెల్ 3.6 ఎమ్‌బీపీఎస్ అప్లోడింగ్ వేగాన్ని కల్గి ఉన్నట్లు ట్రాయ్ పేర్కొంది. కాగా తాజాగా రిలయన్స్ జియో 4జీ నెట్వర్క్ స్పీడ్ స్వల్పంగా పెరగ్గా, ఇది వోడాఫోన్-ఐడియాతో పోల్చితే మూడు రెట్లు ఎక్కువ. ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ ఎంచుకున్న ప్రాంతాల్లోనే 4జీ సేవలను ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ 4జీ స్పీడ్‌ను ట్రాయ్ తన నివేదికలో తెలుపకపోవడం గమనార్హం. దేశ వ్యాప్తంగా రియల్ టైమ్ ప్రాతిపదికన నెట్వర్క్ స్పీడ్‌ను మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో ట్రాయ్ లెక్కిస్తుంది. చదవండి: జియో మరో కీలక నిర్ణయం..! ఎలాంటి డిపాజిట్ లేకుండానే.. -
ఎయిర్టెల్ కాదు.. జియోనే టాప్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం జియో ఇంటర్నెట్ డౌన్లోడ్ వేగంలో మరోసారి తనస్థానాన్ని నిలబెట్టుకుంది.భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019 సెప్టెంబర్‌లో సెకనుకు 21 మెగాబైట్ల సగటు డేటా డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. భారతి ఎయిర్టెల్ నెట్వర్క్ సగటు డౌన్లోడ్ వేగం 8.3 ఎంబీపీఎస్‌ను నమోదు చేసింది. వొడాఫోన్ 6.9 ఎంబీపీఎస్, ఐడియా సెల్యులార్ 6.4 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్నినమోదు చేసింది. ఈ వివరాలను తాజాగా విడుదల చేసింది. వొడాఫోన్, ఐడియాలు విలీనమైనప్పటికీ నెట్‌వర్క్‌ల విషయంలో వేర్వేరుగానే ఉండటంతో వాటి వేగాలను కూడా ప్రత్యేకంగా వెల్లడిస్తోంది ట్రాయ్. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ 3జీ మాత్రమే కలిగి ఉంది. అప్లోడ్ విషయానికి వస్తే 5.4 ఎంబీపీఎస్‌తో ఐడియా, 5.2 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్ కంపెనీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 4.2 ఎంబీపీఎస్‌తో జియో మూడో స్థానంలో ఉండగా, 3.1 ఎంబీపీఎస్‌తో ఎయిర్టెల్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇది ఇలా వుంటే ప్రైవేట్ మొబైల్ డేటా అనలిటిక్స్ సంస్థ 'ఓపెన్ సిగ్నల్' లెక్కలప్రకారం ఎయిర్టెల్ డౌన్ లోడ్ వేగంలో టాప్‌లో ఉంది. టెలికాం కంపెనీల ఇంటర్నెట్ వేగ గణన సర్వే వివరాలను నిన్న(అక్టోబర్ 22, మంగళవారం) వెల్లడించింది. 2019 జూన్-ఆగస్టు కాలానికి ఎయిర్టెల్ కంపెనీయే అత్యధిక స్పీడ్‌ను నమోదు చేసినట్టు తెలిపింది. అయితే ట్రాయ్ సర్వేలో మాత్రం జియోనే మళ్లీ మొదటి స్థానంలో రావడం గమనార్హం. మై స్పీడ్ అప్లికేషన్ ఆధారంగా ట్రాయ్ ఇంటర్నెట్ సరాసరి వేగాల్ని గణించే విషయం తెలిసిందే. -
మళ్లీ జియోనే టాప్
సాక్షి, ముంబై : రిలయన్స్ జియో డౌన్లోడ్ స్పీడ్‌లో తన ఆధిక్యాన్ని మరోసారి నిరూపించుకుంది. జనవరి మాసంతో పోలిస్తే మరింత పుంజుకుని ఫిబ్రవరిలో 20.9 ఎంబీపీఎస్‌గా నమోదైంది. మరో టెలికం కంపెనీ భారతి ఎయిర్టెల్ 9.4 ఎంబీపీఎస్ రెండవస్థానంలో నిలిచింది. 6.8 ఎంబీపీఎస్‌తో వోడాఫోన్ మూడవ స్థానాన్ని సాధించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ గణాంకాలను విడుదల చేసింది. ఫిబ్రవరిలో సగటున సెకన్ కి 20.9 మెగాబిట్ స్పీడ్ తో రిలయన్స్ జియో అన్నిటి కంటే వేగమైన 4జి నెట్ వర్క్ గా నిలిచింది. జనవరిలో పోలిస్తే భారతీ ఎయిర్టెల్ స్పీడ్ 9.5 వద్ద, వొడాఫోన్ స్పీడ్ 6.7ఎంబీపీఎస్ గా నమోదయ్యాయి. మరోవైపు ఐడియా డౌన్ లోడ్ స్పీడ్ స్వల్పంగా పుంజుకుంది. ఫిబ్రవరిలో ఐడియా నెట్ వర్క్ సగటు డౌన్ లోడ్ స్పీడ్ 5.7 ఎంబీపీఎస్‌గా ఉంది. జనవరిలో ఇది 5.5 ఎంబీపీఎస్ గా ఉంది. అయితే వోడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు మెగా మెర్జర్ అనంతరం వోడాఫోన్ ఐడియాగా అవతరించిన సంగతి తెలిసిందే. కానీ ట్రాయ్ ఈ రెండు నెట్ వర్క్ ల ప్రదర్శన గణాంకాలను వేర్వేరుగా విడుదల చేసింది. సగటు అప్లోడ్ స్పీడ్ విషయంలో వోడాఫోన్ మిగతా నెట్ వర్క్‌ల కంటే ముందుంది. ఫిబ్రవరిలో వోడాఫోన్ అప్ లోడ్ స్పీడ్ 6ఎంబీపీఎస్ గా ఉంది. గత నెలలో ఇది 5.4 ఎంబీపీఎస్ మాత్రమే ఐడియా, ఎయిర్టెల్ సగటు 4జి అప్ లోడ్ స్పీడ్ లు తగ్గి వరుసగా 5.6 ఎంబీపీఎస్, 3.7 ఎంబీపీఎస్ గా ఉన్నాయి. జియో సగటు అప్ లోడ్ స్పీడ్ కొంత మెరుగై 4.5ఎంబీపీఎస్ కి చేరింది. -
జియో తగ్గింది..అందులో వొడాఫోన్ టాప్!
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అన్లిమిటెడ్ డేటాతో వినోదాన్ని అందిస్తున్న టెలికాం సంచలనం రిలయన్స్ జియో డౌన్లోడ్ స్పీడ్ గణనీయంగా తగ్గిందని ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. గతేడాది నవంబరులో 20.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడుతో సరికొత్త రికార్డును నమోదు చేసిన జియో.. డిసెంబరులో మాత్రం ఈ స్పీడును 8 శాతానికి తగ్గించి(18.7 ఎంబీపీఎస్) యూజర్లను నిరాశపరిచింది. కాగా జియో దాటికి తట్టుకోలేక చతికిల పడిన ఎయిర్టెల్, వొడాఫోన్- ఐడియా మాత్రం ఓ మోస్తరుగా స్పీడును పెంచాయి. నవంబరులో 9.7 ఎంబీపీఎస్‌గా ఎయిర్టెల్ 4జీ నెట్వర్క్ డౌన్లోడ్ స్పీడు డిసెంబరులో 9.8 ఎంబీపీఎస్‌కు చేరింది. ఇక జియో నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు ఒకే గొడుగు కిందకి వచ్చినప్పటికీ వొడాఫోన్- ఐడియాల డౌన్లోడ్ స్పీడు మాత్రం మెరుగుపడలేదు. అయితే ఈ రెండు నెట్‌వర్క్‌లకు సంబంధించిన గణాంకాలను ట్రాయ్ విడివిడిగానే ప్రకటించింది. నవంబరులో 6.8 ఎంబీపీఎస్‌గా ఉన్న వొడాఫోన్ స్పీడు.. డిసెంబరులో 6.3 ఎంబీపీఎస్.. అదేవిధంగా ఐడియా డౌన్లోడ్ స్పీడు నవంబరులో 5.6 ఎంబీపీఎస్ కాగా డిసెంబరులో 5.3 ఎంబీపీఎస్‌కు తగ్గింది. అయితే డౌన్లోడ్ స్పీడు తగ్గినప్పటికీ ఏడాది కాలంగా ఈ కేటగిరీలో జియో తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం. డేటా షేరింగ్, బ్రౌజింగ్, వీడియోల వీక్షణ తదితర అంశాల్లో కీలకమైన నెట్వర్క్ స్పీడు యూజర్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పీడు కాస్త తగ్గినప్పటికీ ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే జియోనే తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఇక అప్లోడింగ్ విషయానికొస్తే... నవంబరులో 4.5 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో స్పీడు డిసెంబరులో 4.3కి తగ్గగా.. వొడాఫోన్ మాత్రం 4.9 నుంచి 5.1ఎంబీపీఎస్‌కి స్పీడును పెంచిందని ట్రాయ్ పేర్కొంది. మైస్పీడ్ యాప్ రూపొందించిన డేటా స్పీడ్ వివరాల ఆధారంగా ట్రాయ్ ఈ గణాంకాలను వెల్లడించింది. -
టాప్ ప్లేస్ నిలబెట్టుకున్న జియో, ఐడియా
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో దూసుకుపోతోంది. 4జీ సర్వీస్ డౌన్లోడ్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నవంబర్ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌తో పోలిస్తే4జీ వేగంకొంచెం తగ్గినప్పటికీ 20.3 సెకునుకు ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో టాప్ ఉంది. అక్టోబర్‌లో ఇది 22.3 గా ఉంది. యూజర్లకు 4జీ సర్వీసు అందించడంలో మిగతా నెట్‌వర్క్‌ల కంటే జియో ముందుంది. ట్రాయ్ అందించిన లెక్కల ప్రకారం నవంబరులో డౌన్లోడ్ స్పీడ్‌లో జియోదే పైచేయి. అప్లోడ్ స్పీడ్‌లో ఐడియా సెల్యులార్ టాప్‌లో నిలిచింది. మరోవైపు సమీప ప్రత్యర్థి భారతీ ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ ఈ నెలలో కొంచెం మెరుగుపడింది. ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ 9.7 ఎంబీపీఎస్ నమోదైంది. గత నెలలో ఇది 9.5గా ఉంది. వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడ్ కూడా స్వల్పంగా మెరుగుపడింది. అక్టోబర్ 6.7 ఎంబీపీఎస్గాఉండగా.. ప్రస్తుత నెలలో 6.8స్థాయికి పెరిగింది. ఐడియా సెల్యులార్ 4జీ డౌన్లోడ్ స్పీడ్ 6.4 నుంచి 6.2 కి పడిపోయింది. అయితే అప్లోడ్ స్పీడ్‌లో (5.9ఎంబీపీఎస్) తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంది ఐడియా. సెకండ్ ప్లేస్‌లో వోడాఫోన్ (4.9)నిలవగా, జియో (4.5) మూడవస్థానంతో సరి పెట్టుకుంది. అయితే ఇక్కడ కూడా ఎయిర్టెల్ స్వల్పంగా పుంజుకుంది. అయితే యూజర్ల విషయంలో డౌన్లోడ్ స్పీడే చాలా ముఖ్యం. వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, యాప్స్ ఆపరేట్ చేయడంలో డౌన్లోడ్ స్పీడ్ ప్రభావం చూపిస్తుంది. ఎవరికైనా వీడియోలు, ఫోటోలు, ఇతర ఫైల్స్ షేర్ చేయాలనుకుంటే మాత్రం అప్లోడ్ స్పీడ్ చూస్తారు. మైస్పీడ్ అప్లికేషన్లో రియల్ టైమ్ ఆధారంగా సగటు స్పీడ్ తెలుసుకోవచ్చు. -
మళ్లీ జియోనే టాప్!!
న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 4జీ డౌన్లోడ్ స్పీడ్ ఛార్ట్‌లో మళ్లీ రిలయన్స్ జియోనే ముందంజలో నిలిచింది. ఆగస్టు నెలలో 22.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడుతో, అత్యంత వేగవంతమైన 4జీ ఆపరేటర్‌గా జియో నిలిచినట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. జియో డౌన్లోడ్ పరంగా దూసుకెళ్లగా.. ఐడియా సెల్యులార్ కంపెనీ హయ్యస్ట్ అప్లోడ్ స్పీడు నెట్‌వర్క్‌గా నిలిచినట్టు ట్రాయ్ రిపోర్టు తెలిపింది. జియో సగటు 4జీ డౌన్లోడ్ స్పీడులో, తన ప్రత్యర్థి కంపెనీ భారతీ ఎయిర్టెల్ కంటే రెండింతలు ముందంజలో ఉంది. సెకనుకు 10 మెగాబిట్స్ డౌన్లోడ్ స్పీడ్‌ను జియో నమోదు చేసినట్టు ట్రాయ్ తన మైస్పీడ్ పోర్టల్‌లో ప్రచురించింది. అదేవిధంగా ఐడియా 4జీ నెట్వర్క్ డౌన్లోడ్ స్పీడ్ ఫ్లాట్‌గా 6.2 ఎంబీపీఎస్‌గానే ఉంది. వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడ్ జూలై నెలలో 6.4 ఎంబీపీఎస్‌గా ఉండగా.. ఆగస్టు నెలలో 6.7 ఎంబీపీఎస్‌కు పెరిగింది. ఐడియా 4జీ అప్లోడ్ స్పీడ్‌లో 5.9 ఎంబీపీఎస్‌తో అగ్రస్థానంలో ఉంది. వీడియోలను చూడటానికి, నెట్ బ్రౌజ్ చేయడానికి, ఈమెయిల్స్‌ను యాక్సస్ చేసుకోవడంలో డౌన్లోడ్ స్పీడ్ కీలక పాత్ర పోషిస్తోంది. -
4జీ డౌన్లోడ్ స్పీడ్‌లో ఎయిర్టెల్ టాప్!
న్యూఢిల్లీ: దిగ్గజ టెలికం కంపెనీ ‘భారతీ ఎయిర్టెల్’ తాజాగా 4జీ డౌన్లోడ్ స్పీడ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. తన నెట్‌వర్క్‌లో 4జీ డౌన్లోడ్ స్పీడ్ 9.31 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. రీసెర్చ్ సంస్థ ఓపెన్ సిగ్నల్ తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సంస్థ 2017 డిసెంబర్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్యకాలంలో పరీక్షలు నిర్వహించింది. వీటి ప్రకారం.. ఎయిర్టెల్ తర్వాతి స్థానంలో ఐడియా, వొడాఫోన్ ఉన్నాయి. వీటి డౌన్లోడ్ స్పీడ్ వరుసగా 7.27 ఎంబీపీఎస్‌గా, 6.98 ఎంబీపీఎస్‌గా ఉంది. ఇక రిలయన్స్ జియో డౌన్లోడ్ స్పీడ్ 5.13 ఎంబీపీఎస్‌గా రికార్డ్ అయ్యింది. అయితే 4జీ నెట్వర్క్ కవరేజ్ పరంగా చూస్తే జియో టాప్‌లో ఉంది. -
డౌన్లోడ్ స్పీడ్.. మనం వెనకే!
ముంబై: భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.. చౌక టారిఫ్‌ల వల్ల మొబైల్ వినియోగదారుల్లో డేటా వినియోగం భారీగా పెరిగింది.. మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. అదే మరొకవైపు చూస్తే.. మొబైల్ ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్‌లో మన దేశం టాప్–10, టాప్–50, అఖరికి టాప్–100లో కూడా స్థానం దక్కించుకోలేదు. 109వ స్థానంలో నిలిచింది. మొబైల్ ఫోన్లో సగటు డౌన్లోడ్ స్పీడ్ ఫిబ్రవరిలో 9.01 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. ఇది గతేడాది నవంబర్‌లో 8.80 ఎంబీపీఎస్. ఇక్కడ స్పీడ్ కొద్దిగా పెరిగినా కూడా స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 109వ స్థానంలోనే ఉన్నాం. ఓక్లా స్పీడ్ టెస్ట్ ఇండెక్స్ ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. మొబైల్ డౌన్లోడ్ స్పీడ్‌లో నార్వే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశంలో సగటు డౌన్లోడ్ స్పీడ్ 62.07 ఎంబీపీఎస్. ఇక ఫిక్స్డ్ బ్రాడ్‌బాండ్ విషయంలో మాత్రం భారత్ ర్యాంక్ గతేడాది నవంబర్ నుంచి చూస్తే ఈ ఫిబ్రవరి చివరి నాటికి 76 నుంచి 67కు మెరుగుపడింది. ఇదే సమయంలో ఫిక్స్డ్ బ్రాడ్‌బాండ్ డౌన్లోడ్ స్పీడ్ కూడా 18.82 ఎంబీపీఎస్ నుంచి 20.72 ఎంబీపీఎస్‌కి పెరిగింది. ఫిక్స్డ్ బ్రాడ్‌బాండ్ విభాగంలో సింగపూర్ టాప్‌లో ఉంది. ఇక్కడ డౌన్లోడ్ స్పీడ్ 161.53 ఎంబీపీఎస్‌గా రికార్డ్ అయ్యింది. కాగా మొబైల్ డేటా వినియోగంలో నెలకు 150 కోట్ల గిగాబైట్స్తో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ కాంత్ గత డిసెంబర్లో ప్రకటించారు. అమెరికా, చైనా రెండు దేశాల డేటా వినియోగం కన్నా ఇది ఎక్కవని పేర్కొన్నారు. -
భారత్‌లో పేరుకే 4జీ... స్పీడ్ వెరీ పూర్
సాక్షి, న్యూఢిల్లీ : 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్లు 4జీ సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి భారత్ దూసుకుపోతున్నప్పటికీ డేటా డౌన్‌లోడ్‌లో స్పీడ్ మాత్రం వెరీ పూర్. ఓపెన్ సిగ్నల్ సంస్థ డేటా విశ్లేషకుల అంచనాల ప్రకారం 4జీ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రపంచ దేశాల్లో భారత్ 14వ స్థానంలో ఉంది. మొదటి ఐదు స్థానాల్లో దక్షిణ కొరియా, జపాన్, నార్వే, హాంకాంగ్, అమెరికా దేశాలు కొనసాగుతున్నాయి. ఎవరు ఎక్కువ నెట్వర్క్ సమయాన్ని ఉపయోగిస్తున్నారన్న అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈ ర్యాంకులను అంచనా వేశారు. నెట్వర్క్ సమయంలో 86. 26 శాతం సమయాన్ని భారతీయ వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారు. దక్షిణ కొరియా 97.49 శాతం, జపాన్ 94.7 శాతం, నార్వే 92.16 శాతం, హాంకాంగ్ 90.34 శాతం, అమెరికా వినియోగదారులు 90.32 శాతం సమయం వినియోగించుకుంటున్నారు. భారత్‌లో 4జీ డేటా డౌన్లోడ్ స్పీడ్ సెకనుకు 6.07 మెగాబైట్లు మాత్రమే. ఇది దక్షిణ కొరియాలో 37.5 మెగాబైట్లు, నార్వేలో 34.8, హంగేరిలో 31, సింగపూర్‌లో 30, ఆస్ట్రేలియాలో 26.3 మెగాబైట్ల వేగంతో ఉన్నాయి. నెట్వర్క్ సమయాన్ని ఉపయోగించడంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న నార్వే 4జీ డేటా డౌన్లోడ్ స్పీడ్‌లో మాత్రం ప్రపంచంలో 38వ స్థానంలో కొనసాగుతోంది. దాని 4జీ డేటా డౌన్లోడ్ స్పీడ్ సెకనుకు 12 మెగాబైట్లు. ఇక 12. 6తో హాంకాంగ్ 35వ స్థానంలో, 12.48 మెగాబైట్లతో అమెరికా 37వ స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్ మాత్రం 6.07 శాతం స్పీడ్‌తో 77వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఇంతవరకు 4జీ సర్వీసుల్లో సెకనుకు 50 మెగా బైట్ల మైలురాయిని ఏ దేశమూ దాటలేదు. కొన్ని టెలికమ్ కంపెనీలు తాము ఈ స్పీడ్‌ను దాటేశామని చెబుతున్నప్పటికీ.. 46.6 మెగాబైట్లతో సింగపూర్, 45.9 స్పీడ్‌తో దక్షిణ కొరియా టెలికాం కంపెనీలు దాటిన సందర్భాలు ఉన్నాయి. అయితే నిరంతరాయంగా ఆ స్పీడ్ కొనసాగడం లేదు. ఏ దేశంలోనైనా డేటా డౌన్లోడ్ స్పీడ్ ఎల్టీఈ (లాంగ్ టెర్మ్ ఎవొల్యూషన్)కి ఎంత స్పెక్ట్రమ్ కేటాయించారు? ఎల్టీఈ అడ్వాన్స్డ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని 4జీకి ఉపయోగిస్తున్నారా? నెట్వర్క్ సాంద్రత ఎంత ? ఆ నెట్‌వర్క్‌లో రద్దీ ఎంత? అన్న అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. మరోమాటలో చెప్పాలంటే డౌన్లోడ్ స్పీడ్‌ను పెంచే వాయు తరంగాల ఖరీదు చాలా ఎక్కువ. ఖరీదు ఎక్కువన్న కారణంగానే 2016లో భారత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెక్ట్రమ్ వేలం పాటను టెలికమ్ కంపెనీలు బహిష్కరించాయి. ఎల్టీఈ నెట్‌వర్క్‌ల కోసం ప్రీమియర్ 700 ఎంహెచ్‌జెడ్ స్పెక్టమ్ విక్రయాన్ని యూనిట్‌కు 11,485 కోట్ల రూపాయలను కనీస మొత్తంగా నిర్ణయించడమే బహిష్కరణకు కారణం. అయినప్పటికీ ఇప్పుడు కొన్ని టెలికమ్ కంపెనీలు అడ్వాన్స్డ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఎల్టీఈకి ఎయిర్టెల్ 2300 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగిస్తుండగా, రిలయన్స్ నెట్వర్క్ తన జియో స్కీమ్‌కు 1800 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగిస్తున్నట్లు తెల్సింది. అయితే అధికారికంగా రిలయన్స్ అదేమి చెప్పడం లేదు. జియో రాకతో నెట్‌వర్క్‌లో రద్దీ పెరిగి డేటా స్పీడ్ కూడా పడిపోయింది. దీంతో డేటా స్పీడ్‌ను పెంచి, కాల్‌డ్రాప్స్‌ను తగ్గించడం కోసం రిలయెన్స్ సంస్థ దేశంలో రెండు లక్షల బహిరంగ వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేస్తోంది. -
42% : ఇంకా ‘డౌన్’లోడింగే
ఓ పాత జోకు.. భారతీయుల మనస్తత్వాన్ని తెలిపేందుకు.. ఇంట్లో కరెంటు పోయిందట.. జపానోళ్లు అయితే ఫ్యూజ్ చెక్ చేస్తారట.. అమెరికాలో పవర్ హౌస్‌కు ఫోన్ చేస్తారట.. మరి మన దగ్గరో.. పక్కింట్లో కరెంటు ఉందో లేదో చెక్ చేస్తారట.. అదే అలవాటు ప్రకారం ఓసారి 4జీ గురించి కూడా పక్కింట్లో(పొరుగు దేశాల్లో) చెక్ చేసి వద్దాం.. ఎందుకంటే.. ఇప్పుడంతా 4జీ మయం.. ఇంత స్పీడ్ అంత స్పీడ్ అని చెప్పుకుంటున్నాం.. అందుకే ఓసారి అక్కడి పరిస్థితి ఎలా ఉందో చెక్ చేసి వద్దాం.. వాళ్లతో పోలిస్తే.. మన 4జీ ఎల్టీఈ(లాంగ్ టెర్మ్ ఎవల్యూషన్) స్పీడ్ ఎంతో లెక్కేసి వద్దాం.. అయితే.. జోకులో అన్నట్లుగా పక్కింట్లోనూ కరెంటు లేదా.. అయితే ఓకే అని ఇక్కడ అనుకోవడానికి లేదు.. ఎందుకంటే.. మన పొరుగుదేశాల్లో 4జీ స్పీడు మనకంటే చాలా మెరుగ్గా ఉంది. ఎక్కడో ఉన్న అమెరికాలాంటివి వద్దు.. పక్కనున్న పాకిస్తాన్, శ్రీలంకతో పోల్చినా కూడా అదే పరిస్థితి. అంటే.. మన అందరి వద్ద 4జీలు ఉన్నా.. స్పీడు విషయానికొస్తే.. అవన్నీ ‘స్లో’జీలే అన్నమాట.. వైర్లెస్ కవరేజీని మ్యాపింగ్ చేసే బ్రిటన్ సంస్థ ‘ఓపెన్ సిగ్నల్’ మొత్తం 88 దేశాల్లో 4జీ ఎల్టీఈ స్పీడ్‌కు సంబంధించిన ఫిబ్రవరి నెల నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో మనం మొదటి స్థానంలో ఉన్నాం! అయితే.. చివరి నుంచి!! భారత్‌లో సగటు డౌన్లోడ్ స్పీడు 6.07 ఎంబీపీఎస్ (మెగాబైట్స్ పర్ సెకండ్) అట. అదే పాకిస్తాన్లో ఈ వేగం 13.56.. శ్రీలంకలో 13.95 ఎంబీపీఎస్‌గా ఉంది. మొదటి స్థానంలో ఉన్న సింగపూర్‌లో 4జీ స్పీడు 44 ఎంబీపీఎస్‌గా ఉంది. అయితే.. స్పీడు విషయంలో ఎలాగున్నా.. 4జీ విస్తృతి.. లభ్యత విషయంలో మాత్రం మనం 14 స్థానంలో ఉన్నాం. దేశంలో 4జీ కవరేజీ 86.26 శాతంగా ఉంది. ఈ జాబితాలో దక్షిణ కొరియా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 96 శాతం 4జీ కవరేజీ పరిధిలో ఉంది. పాక్‌లో ఇది 66 శాతంగా.. శ్రీలంకలో 45 శాతంగా ఉంది. 4జీ ఎల్టీఈకి సంబంధించి అడ్వాన్స్డ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని దేశాలు స్పీడు విషయంలో ముందంజలో ఉన్నాయని ‘ఓపెన్ సిగ్నల్’ పేర్కొంది. అయితే.. దక్షిణ కొరియా, సింగపూర్ వంటి చోట్ల మొబైల్ టారిఫ్ ఎక్కువగా ఉంటుందని.. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి తక్కువగా ఉండి.. వేగం విషయంలో స్థిరత్వం ఉందని.. భారత్ వంటి దేశాల్లో మొబైల్ నెట్ వినియోగదారులు ఎక్కువని.. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి ఎక్కువగా పడి.. స్పీడు తగ్గుతోందని తెలిపింది. ఎల్టీఈ అడ్వాన్స్డ్ నెట్‌వర్క్‌ను విస్తృతపరచడమొక్కటే దీనికి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు మన దగ్గర కూడా 4జీ డౌన్లోడ్ స్పీడు బాగా పెరుగుతుందని పేర్కొంటున్నారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
భారత్‌లో 4జీ డౌన్లోడ్ స్పీడు ఎలా ఉంది?
4జీ లభ్యతలో భారత్ టాప్ 15 దేశాల్లో ఒకటిగా ఉంది. 2017 అక్టోబర్‌లో 4జీ లభ్యత 84 శాతంగా ఉంటే, అది 2018 ఫిబ్రవరి నాటికి 86.26 శాతానికి పెరిగింది. కానీ 4జీ లభ్యత పెరుగుతున్నప్పటికీ, డౌన్లోడ్ స్పీడు పరంగా మాత్రం భారత్ ఇంకా వెనుకంజలోనే ఉంది. ఓపెన్‌సిగ్నల్ విడుదల చేసిన 'ది స్టేట్ ఆఫ్ ఎల్టీఈ(ఫిబ్రవరి 2018)' రిపోర్టులో సగటు డౌన్లోడ్ కనెక్షన్ స్పీడులో భారత ర్యాంక్ కిందిస్థాయిలో 88గా ఉన్నట్టు తెలిసింది. 6.13ఎంబీపీఎస్‌గా ఉన్న డౌన్లోడ్ స్పీడు 6.07ఎంబీపీఎస్‌కు పడిపోయినట్టు వెల్లడైంది. అంటే ఇండోనేషియా, అల్టీరియాల కంటే కూడా 4జీ డౌన్లోడ్ స్పీడు తక్కువగా ఉన్నట్టు ఓపెన్‌సిగ్నల్ రిపోర్టు చేసింది. ఆశ్చర్యకరంగా ఏ దేశం కూడా 50ఎంబీపీఎస్ స్పీడును అధిగమించలేకపోయింది. సింగపూర్ మాత్రం 44.31ఎంబీపీఎస్ స్పీడులో బెస్ట్ డౌన్‌లోడర్‌గా ఉంది. టాప్ డౌన్లోడ్ స్పీడు దేశాల్లో దక్షిణ కొరియా, నార్వే, హాంకాంగ్, అమెరికాలు ఉన్నాయి. ''అయితే కఠినమైన, వేగవంతమైన నియమావళి ఏమీ లేదు. దేశాలు ఎక్కువ యాక్సస్‌బుల్ నెట్‌వర్క్‌లను కలిగి ఉన్నాయి. కానీ వాటి వేగం పరిమితం చేయబడి ఉంది'' అని రిపోర్టు పేర్కొంది. -
4జీ డౌన్లోడ్ స్పీడ్.. జియో టాప్
న్యూఢిల్లీ: ఎప్పటిలాగే 4జీ డౌన్లోడ్ స్పీడ్‌లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్ నెలలో జియో డౌన్లోడ్ స్పీడ్ గరిష్టంగా 21.8 ఎంబీపీఎస్ నమోదయ్యింది. ఇక అప్లోడ్ స్పీడ్‌లో మాత్రం ఐడియా సెల్యులర్ 7.1 ఎంబీపీఎస్‌తో టాప్‌లో ఉంది. ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. జియో 4జీ డౌన్లోడ్ స్పీడ్ తన సమీప ప్రత్యర్థి వొడాఫోన్ డౌన్‌లోన్ స్పీడ్ (9.9 ఎంబీపీఎస్)తో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఉంది. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో జియో డౌన్లోడ్ స్పీడ్ స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్‌లో జియో స్పీడ్ 21.9 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. ఇక భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులర్ డౌన్లోడ్ స్పీడ్ వరుసగా 9.3 ఎంబీపీఎస్‌గా, 8.1 ఎంబీపీఎస్‌గా ఉంది. -
జియోదే టాప్ స్పీడ్: ట్రాయ్
-
జియోదే టాప్ స్పీడ్: ట్రాయ్
న్యూఢిల్లీ: మనం టీవీల్లో చూసే ఉంటాం.. ఎయిర్టెల్ 4జీ స్పీడ్ చాలెంజ్ యాడ్‌ని. డౌన్లోడ్ స్పీడ్‌లో ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను కొట్టే టెలికం కంపెనీ మరొకటి లేదని ఈ యాడ్ సారాంశం. కానీ నిన్నటికి నిన్న ఎయిర్‌టెల్‌కి ఆస్కీ షాకిచ్చింది. డౌన్లోడ్ స్పీడ్ తమ నెట్‌వర్క్‌లోనే ఎక్కువని ఎయిర్టెల్ ఎక్కడ చెప్పుకోకూడదంటూ నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో డౌన్లోడ్ స్పీడ్ జియో నెట్‌వర్క్‌లోనే ఎక్కువని తాజాగా టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రకటించింది. దీని ప్రకారం చూస్తే.. ఫిబ్రవరి నెలలో డౌన్లోడ్ స్పీడ్ జియోలో 16.48 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. ఈ స్పీడ్ జనవరిలో 17.42 ఎంబీపీఎస్‌గా ఉంది. జనవరి నుంచి ఫిబ్రవరికి వచ్చేసరికి స్పీడ్ తగ్గినా కూడా జియోనే టాప్‌లో కొనసాగుతోంది. ఐడియా, ఎయిర్టెల్ కన్నా రెట్టింపు స్పీడ్ రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో డౌన్లోడ్ స్పీడ్ (16.48 ఎంబీపీఎస్) తన ప్రత్యర్థులైన ఐడియా, ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లలోని డౌన్లోడ్ స్పీడ్‌కు రెట్టింపుగా ఉంది. డౌన్లోడ్ స్పీడ్ ఐడియాలో 8.33 ఎంబీపీఎస్‌గా, ఎయిర్‌టెల్‌లో 7.66 ఎంబీపీఎస్‌గా నమోదైంది. వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడ్ 5.66 ఎంబీపీఎస్‌గా, బీఎస్ఎన్ఎల్ స్పీడ్ 2.01 ఎంబీపీఎస్‌గా రికార్డు అయ్యింది. ఇక ఆర్‌కామ్, టాటా డొకొమో, ఎయిర్‌సెల్ డౌన్లోడ్ స్పీడ్లు వరుసగా 2.67 ఎంబీపీఎస్‌గా, 2.52 ఎంబీపీఎస్‌గా, 2.01 ఎంబీపీఎస్‌గా ఉన్నాయి. ఈ లెక్కలన్నీ ట్రాయ్ వెల్లడించినవి. -
డౌన్లోడ్ స్పీడ్.. ఎయిర్టెల్ టాప్..
న్యూఢిల్లీ: డౌన్లోడ్ స్పీడ్ అంశంలో ఎయిర్టెల్ తన దూకుడును కొనసాగి స్తోంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జనవరిలో భారతీ ఎయిర్టెల్ మొబైల్ నెట్‌వర్క్‌లో డౌన్లోడ్ స్పీడ్ సగటున సెకనుకు 8.42 మెగాబైట్స్గా (8.42 ఎంబీపీఎస్) నమోదయ్యింది. కాగా గతేడాది డిసెంబర్లో ఇదే కంపెనీ డౌన్లోడ్ స్పీడ్ 4.68 ఎంబీపీఎస్‌గా ఉంది. అంటే నెల ప్రాతిపదికన చూస్తే ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో డౌన్లోడ్ స్పీడ్ దాదాపు రెట్టింపు అయ్యింది. ఇక రిలయన్స్ జియో విషయానికి వస్తే.. ఈ నెట్‌వర్క్‌లో డౌన్లోడ్ స్పీడ్ అనూహ్యంగా 8.34 ఎంబీపీఎస్‌గా రికార్డు అయ్యింది. డిసెంబర్లో దీని డౌన్లోడ్ స్పీడ్ గరిష్టంగా 18.14 ఎంబీపీఎస్‌గా నమోదు కావడం గమనార్హం. అంటే నెలవారీగా చూస్తే రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో డౌన్లోడ్ స్పీడ్ సగానికిపైగా క్షీణించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి జనవరి వరకు చూస్తే ఎయిర్టెల్ మూడు సార్లు డౌన్లోడ్ స్పీడ్ అంశంలో అగ్రస్థానంలో నిలిచింది. -
డౌన్‌లోడ్‌లో మనమెంత స్లోనో తెలుసా?
ముంబై: నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కోసం కేంద్రం కలలు కంటోంది. హైస్పీడ్ ఇంటర్నెట్, అత్యున్నత సైబర్ భద్రత ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. కానీ ఒకవైపు పెద్దనోట్ల రద్దు.. మరోవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలోనూ సైబర్ భద్రత విషయంలో దేశం పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. తాజా అంతర్జాతీయ సర్వేలో డౌన్లోడ్ స్పీడ్ విషయంలో భారత్ 96వ స్థానంలో నిలువగా, బ్యాండ్‌విడ్త్ అందుబాటు విషయంలో మరీ దారుణంగా 105స్థానంలో ఉంది. ఇంటర్నెట్ భద్రత విషయంలోనూ దేశం చాలా వెనుకబడి ఉంది. డౌన్లోడ్ స్పీడ్ విషయంలో బంగ్లాదేశ్, నేపాల్ కంటే వెనుకబడి ఉన్న భారత్.. ’రాన్సమ్వేర్ అటాక్’ (సైబర్ దాడుల) విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంకులు, రహస్య సమాచారం కలిగిన సంస్థలు లక్ష్యంగా ఇటీవలికాలంలో హ్యాకింగ్లు, సైబర్ దాడులు పెరిగిపోవడం గమనార్హం. దేశంలో నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో, డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు సామాన్య ప్రజలు వెనుకాడుతున్నారని, తాము కూడా హ్యాకింగ్ బారిన పడి.. వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం కోల్పోయే అవకాశముందని పలువురు ఆందోళన చెందుతున్నారని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్లో నిర్వహించే నగదు లావాదేవీలన్నింటికీ తగిన భద్రత కల్పించాలని, ఇందుకు అవసరమైన నిఘా, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. సైబర్ నేరాలు అత్యధికంగా జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ ఆరోస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇక బ్యాండ్‌విడ్త్ అందుబాటు విషయంలో శ్రీలంక, చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేసియా మనకంటే ఎంతో ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఇంటర్నెట్ అందుబాటును మరింతగా పెంచడమే కాకుండా.. అటు సైబర్ భద్రతను మరింత పటిష్టపరచాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.