4జీ లభ్యతలో భారత్ టాప్ 15 దేశాల్లో ఒకటిగా ఉంది. 2017 అక్టోబర్‌లో 4జీ లభ్యత 84 శాతంగా ఉంటే, అది 2018 ఫిబ్రవరి నాటికి 86.26 శాతానికి పెరిగింది. కానీ 4జీ లభ్యత పెరుగుతున్నప్పటికీ, డౌన్‌లోడ్ స్పీడు పరంగా మాత్రం భారత్ ఇంకా వెనుకంజలోనే ఉంది. ఓపెన్‌సిగ్నల్ విడుదల చేసిన 'ది స్టేట్ ఆఫ్ ఎల్‌టీఈ(ఫిబ్రవరి 2018)' రిపోర్టులో సగటు డౌన్‌లోడ్ కనెక్షన్ స్పీడులో భారత ర్యాంక్ కిందిస్థాయిలో 88గా ఉన్నట్టు తెలిసింది. 6.13ఎంబీపీఎస్‌గా ఉన్న డౌన్‌లోడ్ స్పీడు 6.07ఎంబీపీఎస్‌కు పడిపోయినట్టు వెల్లడైంది.
అంటే ఇండోనేషియా, అల్టీరియాల కంటే కూడా 4జీ డౌన్‌లోడ్ స్పీడు తక్కువగా ఉన్నట్టు ఓపెన్‌సిగ్నల్ రిపోర్టు చేసింది. ఆశ్చర్యకరంగా ఏ దేశం కూడా 50ఎంబీపీఎస్ స్పీడును అధిగమించలేకపోయింది. సింగపూర్ మాత్రం 44.31ఎంబీపీఎస్ స్పీడులో బెస్ట్ డౌన్‌లోడర్‌గా ఉంది. టాప్ డౌన్‌లోడ్ స్పీడు దేశాల్లో దక్షిణ కొరియా, నార్వే, హాంకాంగ్, అమెరికాలు ఉన్నాయి. ''అయితే కఠినమైన, వేగవంతమైన నియమావళి ఏమీ లేదు. దేశాలు ఎక్కువ యాక్సస్‌బుల్ నెట్‌వర్క్‌లను కలిగి ఉన్నాయి. కానీ వాటి వేగం పరిమితం చేయబడి ఉంది'' అని రిపోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment