OpenSignal
-
మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ వేగంగా ఉంది?: ఇలా తెలుసుకోండి..
దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం జియో అగ్రస్థానంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తుండగా.. మిగిలినవి తరువాత స్థానాల్లో ఉన్నాయి. తమ ప్రాంతంలో ఏ నెట్వర్క్ వేగంగా ఉంది?, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు కొంతమందికి తెలిసి ఉండదు. ఈ కథనంలో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..సరైన మొబైల్ నెట్వర్క్ లేకపోతే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక కొత్త సిమ్ కార్డును తీసుకోవడానికి ముందే.. మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ వేగంగా ఉందనే విషయం తెలుసుకోవాలి. దీనికోసం మీరు nPerf వెబ్సైట్ లేదా Opensignal యాప్ ఉపయోగించుకోవచ్చు.nPerfలో ఎలా తెలుసుకోవాలంటే..ఎన్పీఈఆర్ఎఫ్ అనేది 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్‌వర్క్‌లను గుర్తించడానికి సహాయపడే వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ ఉత్తమంగా ఉందో ఉచితంగానే తెలుసుకోవచ్చు.➤ముందుగా ఎన్పీఈఆర్ఎఫ్.కామ్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత.. ఎడమవైపు పైభాగంలో కనిపించే మై అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి.. ప్రొఫైల్ క్రియేట్ చేయాలి.➤ఆ తరువాత వెబ్సైట్లో కనిపించే మ్యాప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.➤ఆ తరువాత దేశం, మొబైల్ నెట్వర్క్ సెలక్ట్ చేసుకుని.. నగరం ఎంచుకోవాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. మీ ప్రాంతంలో ఉన్న సిగ్నెల్స్ చూడవచ్చు. ఏ సిగ్నెల్ నెట్వర్క్ ఎక్కువగా ఉందో.. గమనించి సిమ్ కార్డు తీసుకుంటే.. ఎప్పుడు నెట్వర్క్ సమస్య ఉండదు.ఇదీ చదవండి: మరో కొత్త ట్రెండ్!.. క్రికెట్ ప్లేయర్ అవతారమెత్తిన శామ్ ఆల్ట్మాన్ఓపెన్ సిగ్నల్ యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా?ఓపెన్ సిగ్నల్ యాప్ అనేది ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి యూజర్లు ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఈ యాప్ (Opensignal) డౌన్లోడ్ చేసుకోవచ్చు.➤యాప్ ఓపెన్ చేసిన తరువాత.. మీకు ఐదు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మూడో ఆప్షన్ మ్యాప్ మీద క్లిక్ చేయాలి.➤మ్యాప్ ఆప్షన్ ఎంచుకున్న తరువాత.. అక్కడే లొకేషన్, ఆపరేటర్, నెట్వర్క్ వంటి వాటిని సెలక్ట్ చేసుకోవాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ ఎంత ఉందనే విషయం తెలుస్తుంది. దాన్నిబట్టి మీరు ఏ సిమ్ కార్డు తీసుకోవాలనేది తెలుసుకోవచ్చు. -
4జీలో కోల్‌కతా టాప్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో 4జీ విస్తరణ వేగంగా చోటుచేసుకుంటున్న క్రమంలో 4జీ అందుబాటు స్కోరులో 90 శాతం పైగా సాధించి కోల్‌కతా అగ్రశ్రేణి నగరంగా నిలిచింది. దేశంలోని 22 టెలికాం సర్కిళ్లలో కోల్‌కతా మొదటి స్ధానంలో ఉందని లండన్‌కు చెందిన వైర్లెస్ కవరేజ్ మ్యాపింగ్ కంపెనీ ఓపెన్‌సిగ్నల్ వెల్లడించింది. ఇక పంజాబ్ (89.8 శాతం) బిహార్ (89.2), మధ్యప్రదేశ్ (89.1), ఒడిషా (89 శాతం)సర్కిల్లు తరువాతి స్ధానాల్లో ఉన్నాయని పేర్కొంది. 2012 నుంచి భారత్‌లో 4జీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కేవలం ఆరేళ్లలో దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీ శీఘ్రగతిన వృద్ధి చెందిందని తెలిపింది. 4జీ అందుబాటులో ఉన్న నగరాల్లో తూర్పు, ఉత్తరాది సర్కిళ్లు అగ్రభాగాన ఉన్నాయని ఓపెన్‌సిగ్నల్ వెల్లడించింది. ఇక భారత్‌లోని 20 అతిపెద్ద నగరాల్లో 4జీ అందుబాటులో ముంబై 15వ ర్యాంక్‌లో నిలవగా, ఢిల్లీ 17వ ర్యాంక్‌లో ఉందని తెలిపింది. భారత్ మరోవిడత స్పెక్ర్టమ్ వేలంకు సిద్ధమవుతున్న తరుణంలో 4జీ అందుబాటు స్కోర్లు మరింత పెరుగుతాయని అంచనా వేసింది. జియో రాకతో భారత్‌లో 4జీ ఊపందుకుందని, గ్రామీణ ప్రాంతాల్లో 8.3 కోట్ల మందికి జియో 4జీ సబ్‌స్ర్కిప్షన్లు అందించిందని మార్కెట్ పరిశోధన సంస్ధ సైబర్‌మీడియా రీసెర్చ్ అంచనా వేసింది. -
భారత్‌లో 4జీ డౌన్లోడ్ స్పీడు ఎలా ఉంది?
4జీ లభ్యతలో భారత్ టాప్ 15 దేశాల్లో ఒకటిగా ఉంది. 2017 అక్టోబర్‌లో 4జీ లభ్యత 84 శాతంగా ఉంటే, అది 2018 ఫిబ్రవరి నాటికి 86.26 శాతానికి పెరిగింది. కానీ 4జీ లభ్యత పెరుగుతున్నప్పటికీ, డౌన్లోడ్ స్పీడు పరంగా మాత్రం భారత్ ఇంకా వెనుకంజలోనే ఉంది. ఓపెన్‌సిగ్నల్ విడుదల చేసిన 'ది స్టేట్ ఆఫ్ ఎల్టీఈ(ఫిబ్రవరి 2018)' రిపోర్టులో సగటు డౌన్లోడ్ కనెక్షన్ స్పీడులో భారత ర్యాంక్ కిందిస్థాయిలో 88గా ఉన్నట్టు తెలిసింది. 6.13ఎంబీపీఎస్‌గా ఉన్న డౌన్లోడ్ స్పీడు 6.07ఎంబీపీఎస్‌కు పడిపోయినట్టు వెల్లడైంది. అంటే ఇండోనేషియా, అల్టీరియాల కంటే కూడా 4జీ డౌన్లోడ్ స్పీడు తక్కువగా ఉన్నట్టు ఓపెన్‌సిగ్నల్ రిపోర్టు చేసింది. ఆశ్చర్యకరంగా ఏ దేశం కూడా 50ఎంబీపీఎస్ స్పీడును అధిగమించలేకపోయింది. సింగపూర్ మాత్రం 44.31ఎంబీపీఎస్ స్పీడులో బెస్ట్ డౌన్‌లోడర్‌గా ఉంది. టాప్ డౌన్లోడ్ స్పీడు దేశాల్లో దక్షిణ కొరియా, నార్వే, హాంకాంగ్, అమెరికాలు ఉన్నాయి. ''అయితే కఠినమైన, వేగవంతమైన నియమావళి ఏమీ లేదు. దేశాలు ఎక్కువ యాక్సస్‌బుల్ నెట్‌వర్క్‌లను కలిగి ఉన్నాయి. కానీ వాటి వేగం పరిమితం చేయబడి ఉంది'' అని రిపోర్టు పేర్కొంది. -
అత్యంత దారుణంగా 4జీ డౌన్ లోడ్ స్పీడు
న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత్ లో ఎక్కడ చూసినా మాట్లాడేది 4జీ గురించే. టెలికాం ఆపరేటర్లైతే కస్టమర్లను ఆకట్టుకోవడానికి 4జీ ఆఫర్లతో మురిపిస్తున్నాయి. కానీ అసలు భారత్ లో 4జీ డౌన్ లోడ్ స్పీడు ఏమాత్రం ఉందీ అంటే మరింత దారుణంగా ఉందని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు డౌన్ లోడ్ స్పీడులో మూడువంతు కంటే తక్కువగా భారత్ సగటు డౌన్ లోడ్ స్పీడు ఉన్నట్టు తెలిసింది. అంటే కేవలం 5.1ఎంబీపీఎస్ మాత్రమేనని టెలికాం రెగ్యులేటరీ వెల్లడించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు 3జీ స్పీడు కంటే స్వల్పంగా ఎక్కువమాత్రమేనని టెలికాం రెగ్యులేటరీ పేర్కొంది. దేశవ్యాప్తంగా సగటున 3జీ డౌన్ లోడ్ స్పీడు 1ఎంబీపీఎస్ కంటే తక్కువగా ఉందని, కొంతమంది 3జీ సబ్ స్క్రైబర్లకైతే అత్యంత తక్కువగా 10కేబీపీఎస్ వరకు ఉందని వెల్లడించింది. రిలయన్స్ జియో ఆఫర్ చేసిన ఉచిత డేటా సర్వీలతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, దీంతో గత ఆరు నెలల కాలంలో ఒక సెకనుకు ఒక మెగాబిట్ కంటే ఎక్కువగా డౌన్ లోడ్ స్పీడు పడిపోతుందని ఓపెన్ సిగ్నల్ రిపోర్టు నివేదించింది. జియో దెబ్బకు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు కూడా డేటా రేట్లను తగ్గించాయని, దీంతో డేటా సర్వీసులకు డిమాండ్ మరింత పెరిగిందని పేర్కొంది. డౌన్ లోడ్ స్పీడులో పాకిస్తాన్, శ్రీలంక దేశాలకంటే భారత్ పరిస్థితే అధ్వానంగా ఉంది. దీనిలో భారత్ 74వ స్థానంతో సరిపెట్టుకుంది. సింగపూర్ దేశం 4జీ స్పీడులో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. అదేవిధంగా 4జీ లభ్యతలో దక్షిణ కొరియా కూడా ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సగటు 4జీ డౌన్ లోడ్ స్పీడు 16.2ఎంబీపీఎస్ గా ఉంది. 2016 చివరికి భారత్ లో 217.95 మిలియన్ డేటా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అదేవిధంగా వారి సగటున వాడే డేటా వాడకం నెలకు 236 ఎంబీ నుంచి 884 ఎంబీ వరకు పెరిగింది.