అత్యంత దారుణంగా 4జీ డౌన్ లోడ్ స్పీడు
అత్యంత దారుణంగా 4జీ డౌన్ లోడ్ స్పీడు
Published Thu, Jun 8 2017 10:41 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత్ లో ఎక్కడ చూసినా మాట్లాడేది 4జీ గురించే. టెలికాం ఆపరేటర్లైతే కస్టమర్లను ఆకట్టుకోవడానికి 4జీ ఆఫర్లతో మురిపిస్తున్నాయి. కానీ అసలు భారత్ లో 4జీ డౌన్ లోడ్ స్పీడు ఏమాత్రం ఉందీ అంటే మరింత దారుణంగా ఉందని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు డౌన్ లోడ్ స్పీడులో మూడువంతు కంటే తక్కువగా భారత్ సగటు డౌన్ లోడ్ స్పీడు ఉన్నట్టు తెలిసింది. అంటే కేవలం 5.1ఎంబీపీఎస్ మాత్రమేనని టెలికాం రెగ్యులేటరీ వెల్లడించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు 3జీ స్పీడు కంటే స్వల్పంగా ఎక్కువమాత్రమేనని టెలికాం రెగ్యులేటరీ పేర్కొంది. దేశవ్యాప్తంగా సగటున 3జీ డౌన్ లోడ్ స్పీడు 1ఎంబీపీఎస్ కంటే తక్కువగా ఉందని, కొంతమంది 3జీ సబ్ స్క్రైబర్లకైతే అత్యంత తక్కువగా 10కేబీపీఎస్ వరకు ఉందని వెల్లడించింది.
రిలయన్స్ జియో ఆఫర్ చేసిన ఉచిత డేటా సర్వీలతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, దీంతో గత ఆరు నెలల కాలంలో ఒక సెకనుకు ఒక మెగాబిట్ కంటే ఎక్కువగా డౌన్ లోడ్ స్పీడు పడిపోతుందని ఓపెన్ సిగ్నల్ రిపోర్టు నివేదించింది. జియో దెబ్బకు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు కూడా డేటా రేట్లను తగ్గించాయని, దీంతో డేటా సర్వీసులకు డిమాండ్ మరింత పెరిగిందని పేర్కొంది.
డౌన్ లోడ్ స్పీడులో పాకిస్తాన్, శ్రీలంక దేశాలకంటే భారత్ పరిస్థితే అధ్వానంగా ఉంది. దీనిలో భారత్ 74వ స్థానంతో సరిపెట్టుకుంది. సింగపూర్ దేశం 4జీ స్పీడులో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. అదేవిధంగా 4జీ లభ్యతలో దక్షిణ కొరియా కూడా ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సగటు 4జీ డౌన్ లోడ్ స్పీడు 16.2ఎంబీపీఎస్ గా ఉంది. 2016 చివరికి భారత్ లో 217.95 మిలియన్ డేటా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అదేవిధంగా వారి సగటున వాడే డేటా వాడకం నెలకు 236 ఎంబీ నుంచి 884 ఎంబీ వరకు పెరిగింది.
Advertisement
Advertisement