
న్యూఢిల్లీ: దిగ్గజ టెలికం కంపెనీ ‘భారతీ ఎయిర్‌టెల్’ తాజాగా 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. తన నెట్‌వర్క్‌లో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ 9.31 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. రీసెర్చ్ సంస్థ ఓపెన్ సిగ్నల్ తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సంస్థ 2017 డిసెంబర్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్యకాలంలో పరీక్షలు నిర్వహించింది.
వీటి ప్రకారం.. ఎయిర్‌టెల్ తర్వాతి స్థానంలో ఐడియా, వొడాఫోన్ ఉన్నాయి. వీటి డౌన్‌లోడ్ స్పీడ్ వరుసగా 7.27 ఎంబీపీఎస్‌గా, 6.98 ఎంబీపీఎస్‌గా ఉంది. ఇక రిలయన్స్ జియో డౌన్‌లోడ్ స్పీడ్ 5.13 ఎంబీపీఎస్‌గా రికార్డ్ అయ్యింది. అయితే 4జీ నెట్‌వర్క్ కవరేజ్ పరంగా చూస్తే జియో టాప్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment