ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ శుభవార్త చెప్పింది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెల్కోలు ఇటీవల తమ టారీఫ్‌లను పెంచడంతో చాలా మంది ఇపుడు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వినియోగదారులు ఎదుర్కొంటున్న సిగ్నల్ సమస్యలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైన బీఎస్‌ఎన్‌ఎల్ దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించింది.
4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ 1 2వేల వరకు సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. 4జీ సేవల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ టీసీఎస్, తేజస్ నెట్‌వర్క్, ప్రభుత్వ ఐటీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రైవేట్ టెల్కోలు టారిఫ్‌లు పెంచినప్పటి నుంచి 2.5 లక్షల మందికిపైగా బీఎస్‌ఎన్‌ఎల్‌కి పోర్ట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment