న్యూఢిల్లీ: అతి వేగవంతమైన 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి తన సత్తా చాటుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అక్టోబరు 4జీ స్పీడ్ టెస్ట్ గణాంకాలను విడుదల చేసింది. జియో సగటు 4G డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం, జియో సగటు 4G డౌన్‌లోడ్ వేగం సెప్టెంబర్‌లో 19.1 Mbps నుండి అక్టోబర్‌లో 20.3 Mbpsకి పెరిగింది. (మస్క్ మరో బాంబు: వన్ అండ్ ఓన్లీ అప్షన్, డెడ్‌లైన్)
సగటు డౌన్‌లోడ్ స్పీడ్ విషయంలో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మధ్య గట్టి నెలకొంది. అక్టోబర్‌లో ఎయిర్‌టెల్ సగటు 4జీ డౌన్‌లోడ్ వేగం 15 Mbps కాగా Vi (వోడాఫోన్-ఐడియా) 14.5 Mbps. కానీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాతో పోలిస్తే జియో 4జీ సగటు డౌన్‌లోడ్ వేగం 5 Mbps ఎక్కువ. (త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన)
సగటు 4G అప్‌లోడ్ వేగం పరంగా కూడా, రిలయన్స్ జియో గత నెలలో మొదటి సారి తొలి స్థానానికి చేరుకుంది. అక్టోబర్ నెలలో కూడా కంపెనీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 6.2 Mbps సగటు 4G అప్‌లోడ్ వేగంతో జియో టాప్ లో నిలిచింది. వోడాఫోన్-ఐడియా 4.5 Mbps వేగంతో రెండవ స్థానంలో కొనసాగింది. అదే సమయంలో, ఎయిర్‌టెల్ అప్‌లోడ్ స్పీడ్‌లో నిరంతర క్షీణత ఉంది. అక్టోబర్‌లో ఎయిర్‌టెల్ సగటు 4జీ అప్‌లోడ్ వేగం ఆందోళనకరంగా 2.7 Mbpsకి చేరుకుంది. ఎయిర్‌టెల్ అప్‌లోడ్ వేగం జియోలో సగం కంటే తక్కువకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment