2021 సెప్టెంబర్ గాను పలు టెలికాం సంస్థల డౌన్‌లోడింగ్, ఆప్‌లోడింగ్ స్పీడ్స్‌ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసింది. ఎప్పటిలాగే రిలయన్స్ జియో డౌన్‌లోడింగ్ స్పీడ్ విషయంలో మరోసారి అగ్రస్థానంలో కొనసాగుతోంది. రిలయన్స్ జియో అత్యధికంగా 20.9 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని సాధించింది. ట్రాయ్ 4జీ స్పీడ్ చార్ట్ ప్రకారం... డౌన్‌లోడింగ్ విషయంలో వోడాఫోన్ ఐడియా సగటున 14.4 ఎమ్‌బీపీఎస్ వేగంతో, ఎయిర్‌టెల్ సగటున 11.9 ఎమ్‌బీపీఎస్ వేగాన్ని సాధించాయి.
చదవండి: ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోండి!
వోడాఫోన్ ఐడియానే టాప్...!
అప్‌లోడింగ్ విషయంలో వోడాఫోన్ ఐడియా 7.2 ఎమ్‌బీపీఎస్ వేగంతో అగ్రస్థానంలో నిలిచింది. వోడాఫోన్ ఐడియా తరువాత రిలయన్స్ జియో 6.2 ఎమ్‌బీపీఎస్, భారతీ ఎయిర్‌టెల్ 4.5 ఎమ్‌బీపీఎస్ అప్‌లోడ్ వేగాన్ని సాధించాయి. వినియోగదారులకు ఇంటర్నెట్ నుంచి కంటెంట్‌ను యాక్సెస్ చేయడంలో రిలయన్స్ జియో ముందుంది. గత నెలలో మూడు టెలికాం ప్రైవేట్ ఆపరేటర్ల 4జీ అప్‌లోడ్ వేగం మెరుగుపడినట్లు ట్రాయ్ వెల్లడించింది.
డౌన్‌లోడింగ్, అప్‌లోడింగ్ వేగాన్ని వేగాన్ని ట్రాయ్ తన మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో లెక్కిస్తోంది.ట్రాయ్ డేటా ప్రకారం...జియో 4జీ నెట్‌వర్క్ వేగం 15 శాతం మేర పెరిగింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వరుసగా 85 శాతం, 60 శాతం మేర డౌన్‌లోడింగ్ స్పీడ్ పెరిగింది.
చదవండి: షావోమీ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు ..! ఎప్పుడు వస్తాయంటే..?
Comments
Please login to add a commentAdd a comment