
ఇప్పటికే భారతీయ టీవీ మార్కెట్‌లో చవక ధరల్లో స్మార్ట్‌టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన కంపెనీ జేవీసీ చవక ధరలో మరో సరికొత్త టీవీని లాంచ్ చేసింది. 55 అంగుళాల అల్ర్టా హెచ్‌డీ ఇంటిలిజెంట్ స్మార్ట్‌టీవీనీ సోమవారం విడుదల చేసింది. 55ఎన్ 7105 సీ 4కె ఎల్‌ఈడీ టీవీని తీసుకొచ్చింది. దీని ధరను రూ. 38,999గా నిర్ణయించింది.
3840x2160 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ , ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్, 50వాట్స్ సౌండ్ అవుట్ పుట్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, అమోలాజిక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్క్వాడ్-కోర్ ప్రాసెసర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే సాధారణ రిమోట్‌తోపాటు క్వార్టీ కీబోర్డుతో రూపొందించిన మరో స్మార్ట్‌రిమోట్‌ను అందిస్తోంది. హాట్‌స్టార్, యూ ట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి దాదాపు 500 యాప్‌లను ప్రీ లోడెడ్‌గా అందిస్తున్నామని జేవీసీ డైరెక్టర్ శరణ్ మయాని తెలిపారు. ఒక సంవత్సరం వారంటీతో ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌టీవీ లభ్యం కానుంది.
కాగా ఓఈఎం వియరా పేరుతో భారత టీవీ మార్కెట్లోకి ప్రవేశించిన జేవీసీ ఇటీవల సరసమైన ధరల్లో (ప్రారంభ ధర రూ.16,999 ) ఎల్‌ఈడీ టీవీలను లాంచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment