Japan company
-
2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యా న్ని నిర్దేశించుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు తెలంగా ణలో మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్ల డించారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన గురువారం క్విటో నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడారు. భట్టికి రోహ్మ్ కంపెనీ ప్రెసిడెంట్ ఇనో, కంపెనీ ఉన్నతాధి కారులు తకహసి, అండో, కాత్సునో, తనాక తకా షీ తదితరులు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భిన్న రంగాల్లో సెమీకండక్టర్ల ఆవశ్యకత ఎంతో ఉందని భట్టి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విడిగా కానీ ఉమ్మడి భాగస్వామ్యంతో కానీ తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని రోహ్మ్ యాజమాన్యానికి భట్టి విక్రమార్క పిలుపుని చ్చారు. భారతదేశంలో ఇప్పటికే మూడు చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న సౌకర్యాలు వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రోహ్మ్ సంస్థ తెలిపింది. సాయంత్రం క్విటో నగరానికి సమీపంలో ఉన్న పానసోనిక్ కంపెనీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రికి ఆ కంపెనీ ప్రెసిడెంట్ నబి నకానీషి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల గురించి వివరించారు. తాము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని భారతదేశంలోనూ ఒక ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. తెలంగాణలో పానసోనిక్ ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చని, ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని భట్టి హామీ ఇచ్చారు. భట్టికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు క్విటో నగరానికి సమీపంలో ఉన్న టోజీ బౌద్ధ ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులు గురువారం ఉదయం సందర్శించారు. వారికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ పర్యటనలో భట్టితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
షార్ప్ ఇండియా చైర్మన్‌గా సుజయ్
న్యూఢిల్లీ: జపాన్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం షార్ప్ తమ భారత విభాగం చైర్మన్‌గా సుజయ్ కరమ్పురిని నియమించింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వచి్చందని సంస్థ తెలిపింది. డిస్ప్లే వ్యాపార విభాగానికి సారథ్యం వహిస్తూ భారత్‌లో షార్ప్ బ్రాండ్‌ను వృద్ధిలోకి తేవడం, ఇంజినీరింగ్ ఉత్పత్తులు.. సొల్యూషన్స్ తయారీ, టెక్నాలజీ బదలాయింపునకు వ్యూహాత్మక భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడం తదితర బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సుజయ్ పలు కీలక హోదాల్లో పని చేశారు. -
180 ఎకరాల విస్తీర్ణంలో జపాన్ కంపెనీ ప్లాంట్.. ఎక్కడంటే?
న్యూఢిల్లీ: ఐఫోన్లకు కావాల్సిన బ్యాటరీలను సరఫరా చేస్తున్న జపాన్ కంపెనీ టీడీకే భారత్‌లో లిథియం అయాన్ సెల్స్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. హర్యానాలోని మనేసర్ వద్ద 180 ఎకరాల విస్తీర్ణంలో ఇది రానుంది. దశలవారీగా ఈ కేంద్రానికి కంపెనీ రూ. 6,000–7,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. పూర్తి స్థాయి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అయ్యేనాటికి సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మేడిన్ ఇండియా ఐఫోన్లలో వాడే బ్యాటరీల కోసం ఈ ప్లాంటులో సెల్స్‌ను తయారు చేస్తారని మంత్రి తెలిపారు. అయితే తయారీ కేంద్రం స్థాపనకై పర్యావరణ అనుమతి కోసం టీడీకే వేచి చూస్తోందని సమాచారం. లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో ఉన్న చైనాకు చెందిన యాంపీరెక్స్ టెక్నాలజీని (ఏటీఎల్) 2005లో టీడీకే కొనుగోలు చేసింది. అనుబంధ కంపెనీ అయిన నవిటాసిస్ ఇండియా ద్వారా భారత్‌లో ఏటీఎల్ కార్యకలాపాలు సాగిస్తోంది. రీచార్జేబుల్ బ్యాటరీ ప్యాకేజ్‌లను హర్యానాలోని బావల్ వద్ద ఉన్న ప్లాంటులో నవిటాసిస్ తయారు చేస్తోంది. -
ప్రపంచ చరిత్రలో సరికొత్త మైలురాయి.. అదరగొట్టిన జపాన్ కంపెనీ!
కార్ల తయారీలో సరికొత్త రికార్డు నమోదైంది. జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం (టయోటా) ఈ రికార్డును నెలకొల్పింది. కంపెనీ మొదలై 88 సంవత్సరాలు కాగా.. మొత్తం 30 కోట్ల కార్లు తయారు కావడం విశేషం. ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో ఇన్ని కార్లు తయారు చేసిన కంపెనీ ఇంకోటి లేకపోవడం చెప్పుకోవాల్సిన విషయం. 1933లో టయోడా ఆటోమాటిక్ లూమ్ వర్క్స్‌లో భాగంగా కార్ల తయారీ ప్రారంభించింది ఈ కంపెనీ. మోడల్ -జీ1 కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి ట్రక్కు. ఆ తరువాత 1937లో టయోటా మోటర్ కంపెనీ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కంపెనీ తయారు చేసిన కార్లు మొత్తం 30 కోట్లు. అయితే ఇందులో జపాన్‌లో ఉత్పత్తి అయినవాటితోపాటు ఇతర మార్కెట్లలోనివి కూడా చేర్చారు. జపాన్‌లో మొత్తం 18.05 కోట్ల కార్లు ఉత్పత్తి కాగా.. ఇతర దేశాల్లో తయారైనవి 11.96 కోట్లు. టయోటా 1941 నుంచి విస్తరణ పథం పట్టింది. టయోడా మెషీన్ వర్క్స్ (1941), టయోటా ఆటోబాడీ (1945) వంటి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుంది. 1960, 70లలో జపాన్‌లో తయారు చేసిన కార్లను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేసింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1982లో టయోటా మోటర్ కంపెనీ కాస్తా... టయోటా మోటర్ కార్పొరేషన్ గా మారింది. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో టయోటా కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిన 'కొరొల్లా' (Corolla) ఉత్పత్తి మొత్తం 5.33 కోట్ల కంటే కంటే ఎక్కువ. 1966 నుంచి ఈ సెడాన్ అనేక అప్డేట్స్ పొంది అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికీ బాగా అమ్ముడుపోతోంది. భారతీయ మార్కెట్లో కూడా టయోటా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ.. మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. -
2035 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే.. నవీన్ సోనీ
సాక్షి, అమరావతి:స్థానిక సంప్రదాయాలు, కళలతో మమేకం అవడం ద్వారా భారతీయ మార్కెట్లో వేగంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జపాన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ప్రకటించింది. ఇందుకోసం కారు కొనుగోలుదారులను అతిథులుగా గౌరవిస్తూ స్థానిక కళలకు ప్రాచుర్యం కల్పించే విధంగా విశాలమైన ప్రాంగణాలను మెరాకీ పేరుతో ఏర్పాటు చేస్తోంది. దేశంలో అయిదో లెక్సస్ మెరాకీని విజయవాడ సమీపంలో మంగళగిరి వద్ద ఏర్పాటు చేసింది. దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ఇప్పటి వరకు ఈ రంగంలో ఆధిపత్యం ఉన్న జర్మనీ బ్రాండ్లకు జపాన్ బ్రాండ్ గట్టి పోటీనివ్వనుందని లెక్సస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ సోనీ తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాటామంతీ.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశీయంగా లగ్జరీ కార్ల అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న కార్ల అమ్మకాల్లో కేవలం ఒక శాతం మాత్రమే లగ్జరీ కార్లు ఉంటున్నాయి. ఏటా సుమారుగా 40 లక్షలకు పైగా కార్లు అమ్ముడవుంతుంటే అన్ని లగ్జరీ బ్రాండ్లు కలిసి ఏటా 40,000 కార్లను విక్రయిస్తున్నాయి. అదే చైనాలో మొత్తం కార్ల అమ్మకాల్లో 15 నుంచి 16 శాతం, యూరప్‌లో 17 శాతం, అమెరికాలో 14 నుంచి 15 శాతం, జపాన్‌లో 3 నుంచి 5 శాతం అమ్మకాలు జరుగుతున్నాయి. దీని ప్రకారం చూస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని 5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జరిగితే తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయి నుంచి 6 రెట్లు పెరుగుతుంది. ఇదే దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్‌ను శాసించే ప్రధానాంశం. కోవిడ్ తర్వాత పడిపోయిన లగ్జరీ కార్ల అమ్మకాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? లాక్‌డౌన్‌కు ముందు ఏటా 40 నుంచి 42 వేల లగ్జరీ కార్లు అమ్ముడవుతుంటే అది కోవిడ్ సమయంలో 18,000 యూనిట్లకు పడిపోయింది. ఆ తర్వాత సాధారణ కార్ల అమ్మకాలు పెరిగినంత వేగంగా లగ్జరీ కార్ల అమ్మకాలు పెరగలేదు. 2021లో 26,000కు, 2022లో 36,000కు చేరిన లగ్జరీ కార్ల అమ్మకాలు ఈఏడాది 43,000 మార్కును దాటుతాయని అంచనా వేస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి ఈ రంగం కూడా వేగంగా వృద్ధి చెందే అవకాశాలున్నాయి. దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్లోకి ఆలస్యంగా ప్రవేశించిన లెక్సస్ మార్కెట్ అమ్మకాలను పెంచుకోవడానికి ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళుతోంది? రెండేళ్ల క్రితం కేవలం 4 నగరాల్లో ఉన్న లెక్సస్‌కు ఇప్పుడు 19 నగరాల్లో 26 షోరూమ్‌లు ఉన్నాయి. అమ్మకాల సంఖ్యను చెప్పలేను కానీ, దేశీయ మార్కెట్లో లెక్సస్ వేగంగా విస్తరిస్తోందని మాత్రం చెప్పగలను. కేవలం కొనుగోలుదారులుగా కాకుండా వారిని అతిథులుగా గౌరవిస్తూ దానికి అనుగుణంగా కార్ల డిజైన్లను రూపొందించి విక్రయించనున్నాం. ఇందుకోసం వేగంగా విస్తరించడం కంటే వినియోగదారు, షోరూమ్ భాగస్వాములు ప్రయోజనం పొందే విధంగా అడుగులు వేస్తున్నాం. గతంలో హైదరాబాద్‌కు పరిమితమైన లెక్సస్ ఇప్పుడు విజయవాడలో అడుగుపెడుతోంది. రానున్న కాలంలో విశాఖ, నెల్లూరు వంటి నగరాలకు విస్తరణ అవకాశాలను పరిశీలిస్తాం. వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల రంగంలో లెక్సస్ భవిష్యత్తు ప్రణాళికలేంటి? ప్రస్తుతం హైబ్రీడ్ మోడల్స్‌లో ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాం. ఇప్పటికే సింగిల్ చార్జీతో 1000 కి.మీ ప్రయాణించే విధంగా కాన్సెప్ట్ కారును విడుదల చేశాం. వాణిజ్యపరంగా ఈ కారును 2026 నాటికి విడుదల చేయనున్నాం. 2035 నాటికి లెక్సన్‌ను పూర్తి ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. -
నగరవాసికి 'జపాన్' జాబ్ కలకలం! బెంగళూరు జపాన్ ఎంబసీలో ఆరా తీయగా.. బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: జపాన్‌లో ఉద్యోగం ఉందంటూ నగరవాసిని నట్టేట ముంచారు సైబర్ నేరస్తులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.29.27 లక్షలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూసాపేటకు చెందిన యువతి గత జులైలో ఆన్లైన్లో ఉద్యోగం కోసం వెతకగా.. ఓ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఈ–మెయిల్ వచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ ఉపకరణాల తయారీ సంస్థలో సీనియర్ అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం ఉందని మెయిల్ సారాంశం. ఆగస్టు నెలలో కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న కోజిన్ నాకాకిత బాధితురాలిని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేశాడు. ఆ మర్నాడు ఉదయం ఆమె మెయిల్‌కు కంపెనీ నుంచి జాబ్‌కు సెలెక్ట్ అయ్యావంటూ జీతభత్యాలు, బెనిఫిట్స్‌తో కూడిన ఆఫర్ లెటర్ వచ్చింది. అయితే డాక్యుమెంటేషన్, జీఎస్టీ ఇతరత్రా చార్జీల కోసం రూ.33,780 డిపాజిట్ చేయాలని ప్రతినిధులు సూచించడంతో.. నిజమేనని నమ్మిన ఆమె సొమ్మును బదిలీ చేసింది. ఆ తర్వాత కొద్ది సేపటికి పెట్టుబడుల మీద 40 శాతం బోనస్‌తో కలిపి వస్తాయని ఆశ చూపించడంతో రూ.29,27,780 పెట్టుబడులు పెట్టింది. జీ–20 సదస్సుతో క్యాన్సిల్ అంటూ.. ఢిల్లీలో జపాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందని బాధితురాలిని నమ్మించారు. రోజులు గడుస్తున్నా మీటింగ్ ఖరారు కాకపోవడంతో ఆరా తీయగా.. ఢిల్లీలో జీ–20 సమావేశాల నేపథ్యంలో మీటింగ్ వాయిదా పడిందని మాయమాటలు చెప్పారు. ఈసారి సమావేశం బెంగళూరులో అక్టోబర్ నెలలో ఉంటుందని చెప్పారు. ఈ సమావేశం కూడా జరగకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు బెంగళూరులోని జపాన్ ఎంబసీలో ఆరా తీయగా.. అసలు విషయం తెలిసి ఖంగుతింది. అసలు సదరు జపాన్ కంపెనీ ఎలాంటి రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టలేదని తెలిసింది. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. ఇవి చదవండి: సినీ నిర్మాత కోసం.. సీసీఎస్ వేట! అసలేం జరిగిందంటే? -
అచ్చు శునకంలా
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. వెర్రి వేయి విధాలు. జపాన్‌లో ఓ వ్యక్తి చేసిన పని చూస్తే ఇలాంటి సామెతలన్నీ వరుసబెట్టి గుర్తు రాక మానవు! అచ్చం కుక్కలా కనిపించేందుకు మనవాడు ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. పైగా ఆ వేషంలో ఆరుబయట యథేచ్ఛగా తిరిగాడు. అలా జీవితకాల ముచ్చట నెరవేర్చుకుని మురిసిపోయాడు! జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్. తన చానల్ పేరేమిటో తెలుసా? ఐ వాంట్ టు బీ యాన్ యానిమల్’ (జంతువులా మారాలనుకుంటున్నా). దానికి ఏకంగా 31 వేల మందికి పైగా సబ్స్రై్కబర్లున్నారు. మనవాడి జీవితకాలపు కోరికుంది. ఏమిటో తెలుసా? ఎలాగైనా కుక్కలా మారడం! దాన్ని తీర్చుకోవడానికి జపాన్‌లో సినిమాలకు, టీవీ షోలకు కాస్ట్యూమ్స్ సరఫరా చేసే జెప్పెట్ అనే ప్రముఖ స్థానిక కంపెనీని సంప్రదించాడు. తన కోరిక వివరించాడు. అచ్చం కుక్కలా కనిపించే కాస్ట్యూమ్ డిజైన్ చేసిచ్చేందుకు వాళ్లూ సరేనన్నారు. అయితే తాను కుక్కను కాదని మనుషులు కాదు కదా, కనీసం కుక్కలు గుర్తు పట్టొద్దని టోకో షరతు విధించాడు. కుక్క వేషంలో తన లుక్ అంత సహజంగా ఉండాలన్నాడు. అందుకోసమని ఏకంగా 20 లక్షల యెన్లు (రూ.12 లక్షలు) చెల్లించాడు. కంపెనీ వాళ్లు దీన్నో సవాలుగా తీసుకున్నారు. 40 రోజులు కష్టపడి మరీ టోకోకు కావాల్సిన కుక్క కాస్ట్యూమ్ తయారు చేసిచ్చారు. పార్కులో ‘డాగ్’ వాక్ ► అంతా రెడీ అయ్యాక, ఒక మంచి రోజు చూసుకుని తను తయారుచేయించుకున్న కుక్క వేషం వేసి మనవాడు తొలిసారిగా షికారుకు బయల్దేరాడు. సమీపంలోని పార్కుకు వెళ్లి సందడి చేశాడు. అచ్చం కుక్కలా దొర్లుతూ, తోటి కుక్కల దగ్గరికెళ్లి వాటిని వాసన చూస్తూ హడావుడి చేశాడు. దీన్నంతటినీ వీడియో తీయించుకోవడం మర్చిపోలేదు. దాన్ని తన యూట్యూబ్ చానళ్లో అప్లోడ్ చేస్తే చూస్తుండగానే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చి పడ్డాయి! ‘‘నా కుక్క వేషం సూపర్‌హిట్టయింది. జీవితకాల కలా నెరవేరింది. వీడియో కూడా బంపర్ హిట్టయింది. ఎలా చూసుకున్నా కుక్క వేషం కోసం పడ్డ ప్రయాసకు తగిన ఫలితం దక్కింది’’ అంటూ టోకో సంబరపడిపోతున్నాడు. గతేడాదే చెప్పాడు ► మనోడు తన మనోగతాన్ని గతేడాదే బయట పెట్టాడు. మానవ శునకంగా మారాలనుందని డైలీ మెయిల్ వార్తా పత్రిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘‘ఇలాంటి నా అభిరుచులు బయటికి తెలియడం నాకిష్టముండదు. ముఖ్యంగా నా సహోద్యోగులకు. ఎందుకంటే మరీ కుక్కలా మారాలనుందంటే వాళ్లకు విచిత్రంగా తోస్తుందేమో కదా! అందుకే ఇప్పుడు నా అసలు రూపం ఎలా ఉంటుందో అందరికీ చూపించదలచలేదు. ఇలా కుక్కలా మారాలనుందని నా క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా చెప్పలేదు. పిచ్చనుకుంటారేమోనని భయం’’ అన్నాడు టోకో! కుక్క వేషంలో తొలిసారి పార్కుకు వెళ్లినప్పుడు కాస్త నెర్వస్‌గా, మరికాస్త భయంగా అనిపించిందట మనవాడికి. ‘‘అయితే, అక్కడ నన్ను చూసిన మనుషులతో పాటు కనీసం కుక్కలు కూడా నేను కుక్కను కాదని పొరపాటున కూడా అనుకోలేదు. అంటే నా మిషన్ గ్రాండ్ సక్సెస్ అన్నట్టే కదా’’ అంటూ సంబరపడిపోయాడు. టోకో కోరిక మేరకు కోలీ జాతి కుక్కలాంటి కాస్ట్యూమ్ తయారు చేసిచ్చాం. అది వేసుకున్న వాళ్లు కుక్క కాదని చెప్పినా ఎవరూ నమ్మరు. అంత సహజంగా కుదిరిందది – కాస్ట్యూమ్స్ తయారీ కంపెనీ జెప్పెట్ అధికార ప్రతినిధి -
వైరల్‌గా మారిన వెరైటీ కారు.. గ్రాఫిక్స్ కాదు, నిజమేనట
చల్నేకీ నహీ హై యే గాడీ... వైరింగ్తో ఉన్న బాడీ.. వేగంలో చేయదు దాడి.. వేడెక్కి ఆగదు ఓడి..! మరైతే ఈ ఫొటోలో కనిపిస్తున్నదేంటీ? కారే! కానీ రోడ్డు మీదకొచ్చి షికారు చేయదు. ఆగ్మెంటెడ్ రియాలిటీగా కనిపించే వాహనం. వైర్‌తో ఫ్రేమ్ చేసిన ఈ కారు ‘యమగుచి సీసాకుషో’ అనే జపాన్ కంపెనీ సృష్టి. తమ కంపెనీ సామర్థ్యాన్ని, సాంకేతికతను జగమంతటికీ తెలియజేయాలని ఈ కారును తయారుచేసింది. మొదట ఒక కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి.. లేజర్ కట్టర్ల సాయంతో ప్రత్యేకమైన మెటల్ షీట్లను తయారు చేశారు. ఆ షీట్లను చిన్న చిన్న కడ్డీలుగా కత్తిరించి, వాటి చుట్టూ మెటల్ వైర్లతో ఫినిషింగ్ ఇచ్చారు. తర్వాత వాటన్నింటినీ కారు డిజైన్ ఆధారంగా వెల్డింగ్ చేశారు. అలా 2016లో మొదలైన ఈ కారు తయారీ ఇప్పటికి పూర్తయింది. దీని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్ అయింది. పలు ప్రముఖ టీవీ చానళ్లలో ఈ కారు గురించి ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్నా .. ఇప్పటికీ చాలామంది ఇది నిజమైన కారు కాదు, గ్రాఫిక్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
575 కోట్ల పెట్టుబడి 1,600 మందికి ఉపాధి
షాబాద్: రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో రూ.575 కోట్ల పెట్టుబడితో జపాన్‌కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్‌కు, నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్ కంపెనీ ఏర్పాటుకు శుక్రవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా 1,600 మందికి, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పారు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నిరుద్యో గ యువతకు కంపెనీల్లో ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే కంపెనీల యాజమాన్యం స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకోవడం జరిగిందని, వారి అవసరాలకు తగ్గట్లు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లాలోపెట్టుబడులు అభినందనీయం ‘తయారీ రంగంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శం. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాను. నిజానికి అక్కడ సహజ వనరులు తక్కువ. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా తిరిగి లేచి నిలబడింది. ఉన్న కొద్దిపాటి వనరులను ఉపయోగించుకుని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తు ఉత్పత్తి, నాణ్యత అంశంలో అందరికంటే ముందుంది. పారిశ్రామిక ఉత్పత్తిలో తమ సత్తా చాటుకుంటోంది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక జపాన్ వస్తువు ఉంటుంది. అలాంటి దేశానికి చెందిన రెండు ప్రముఖ కంపెనీలు రంగారెడ్డి జిల్లాలో పెట్టుబడులు పెట్టడం అభినందనీయం..’ అని కేటీఆర్ చెప్పారు. మరిన్ని పెట్టుబడులకు సహకరించండి ‘స్థానిక నాయకులు, ప్రజల చొరవతో ఇక్కడికి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. టెక్స్టైల్స్ మొదలుకొని ఎలక్ట్రిక్ వాహనాల దాకా విభిన్నమైన కంపెనీలు ఈ ప్రాంతాన్ని తమ కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందనవెళ్లి ఎదుగుతుంది..’ అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా సహకరించాల్సిందిగా జపాన్ కాన్సులేట్‌ను కోరుతున్నానని కేటీఆర్ చెప్పారు. జపాన్ కంపెనీల కోసం అవసరమైతే ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా తాము సిద్ధమని అన్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.900 కోట్లతో ఓరియంటల్ ఈస్ట్ ప్లాంటు
న్యూఢిల్లీ: ఈస్ట్ తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం ఓరియంటల్ ఈస్ట్ కంపెనీ మహారాష్ట్రలోని ఖండాలా ఎంఐడీసీ వద్ద అత్యాధునిక ప్లాంటు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి కంపెనీ రూ.900 కోట్లు ఖర్చు చేసింది. బేకరీ, డిస్టిల్లరీస్, ఇతర ఆహార పదార్థాల్లో వాడే ఈస్ట్‌ను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. 33,000 మిలియన్ టన్నుల ఈస్ట్ తయారీ సామర్థ్యంతో ప్లాంటు తొలి దశ అందుబాటులోకి వచ్చింది. విదేశాలకూ ఈస్ట్‌ను ఎగుమతి చేస్తారు. కోబో బ్రాండ్‌లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్లాంటు రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో భారత్ ఒకటని ఓరియంటల్ ఈస్ట్ కంపెనీ జపాన్ ప్రెసిడెంట్, ఓరియంటల్ ఈస్ట్ ఇండియా చైర్మన్ మసాషి నకగవ తెలిపారు. అంతర్జాతీయంగా విస్తరణలో కొత్త ప్లాంటు ముందడుగు అని, భారత్ పట్ల కంపెనీ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. -
భారత్‌కు నిస్సాన్ గ్లోబల్ మోడల్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ నిస్సాన్.. అంతర్జాతీయంగా విక్రయిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌ను (ఎస్యూవీ) భారత మార్కెట్లో పరిచయం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో మాగ్నైట్, కిక్స్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్–ట్రయల్, జూక్, కష్కాయ్ మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఎక్స్–ట్రయల్, కష్కాయ్ వాహనాలను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత రోడ్లపై ఈ రెండు మోడళ్ల పరీక్ష మొదలైందని వెల్లడించింది. భారతీయ రోడ్లు, విభిన్న భూభాగాలకు ఈ వాహనాలు అనుకూలమా కాదా అన్న అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. వినియోగదారుల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని ఈ పరీక్షలు అంచనా వేస్తాయని కంపెనీ తెలిపింది. పరీక్షలు పూర్తి అయ్యాక సానుకూల ఫలితాలు వస్తే తొలుత ఎక్స్–ట్రయల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ తర్వాత కష్కాయ్ కూడా రోడ్డెక్కనుంది. ఉద్గారాలను బట్టి పన్ను..: వాహనాల పొడవు, ఇంజన్ పరిమాణం కంటే ఉద్గారాల ఆధారంగా ప్రయాణికుల వాహనాలపై పన్ను విధించడాన్ని భారతదేశం పరిగణించాలని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ రాకేష్ శ్రీవాస్తవ అన్నారు. ‘ఆటోమొబైల్స్ ద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి హైబ్రిడ్ల వంటి బహుళ సాంకేతికతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్గారాల స్థాయిని బట్టి వేర్వేరు పన్ను స్లాబ్‌లు ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికే నాలుగు మీటర్ల లోపు, నాలుగు మీటర్ల కంటే పొడవు, ఇంధనం పరంగా భిన్నమైన పన్ను నిర్మాణాన్ని కలిగి ఉంది. జీఎస్టీ విధానం ప్రకారం కార్లపై 28 శాతం పన్నుతోపాటు సెస్ విధిస్తున్నారు. 4 మీటర్ల కంటే పొడవు ఉండే కార్లు, ఎస్‌యూవీలకు 50 శాతం, హైబ్రిడ్ వాహనాలకు 43 శాతం, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు 5 శాతం జీఎస్టీ ఉంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
55" సూపర్ స్మార్ట్ టీవీ తక్కువ ధరలో
ఇప్పటికే భారతీయ టీవీ మార్కెట్లో చవక ధరల్లో స్మార్ట్‌టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన కంపెనీ జేవీసీ చవక ధరలో మరో సరికొత్త టీవీని లాంచ్ చేసింది. 55 అంగుళాల అల్ర్టా హెచ్డీ ఇంటిలిజెంట్ స్మార్ట్టీవీనీ సోమవారం విడుదల చేసింది. 55ఎన్ 7105 సీ 4కె ఎల్ఈడీ టీవీని తీసుకొచ్చింది. దీని ధరను రూ. 38,999గా నిర్ణయించింది. 3840x2160 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ , ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్, 50వాట్స్ సౌండ్ అవుట్ పుట్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, అమోలాజిక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్క్వాడ్-కోర్ ప్రాసెసర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే సాధారణ రిమోట్‌తోపాటు క్వార్టీ కీబోర్డుతో రూపొందించిన మరో స్మార్ట్రిమోట్ను అందిస్తోంది. హాట్‌స్టార్, యూ ట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి దాదాపు 500 యాప్‌లను ప్రీ లోడెడ్‌గా అందిస్తున్నామని జేవీసీ డైరెక్టర్ శరణ్ మయాని తెలిపారు. ఒక సంవత్సరం వారంటీతో ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌టీవీ లభ్యం కానుంది. కాగా ఓఈఎం వియరా పేరుతో భారత టీవీ మార్కెట్లోకి ప్రవేశించిన జేవీసీ ఇటీవల సరసమైన ధరల్లో (ప్రారంభ ధర రూ.16,999 ) ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేసింది. -
హీరో ఎలక్ట్రిక్ సైకిళ్లు జపాన్ కంపెనీలతో ఒప్పందాలు
న్యూఢిల్లీ: హీరో సైకిల్స్ కంపెనీ ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ కోసం జపాన్‌కు చెందిన రెండు కంపెనీలతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన యమహా మోటార్ కంపెనీ, మిత్సు అండ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని హీరో సైకిల్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ, టెక్నాలజీ, మార్కెటింగ్ కోసం ఈ రెండు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు హీరో మోటార్స్ కంపెనీ (హెచ్‌ఎమ్‌సీ) చైర్మన్ పంకజ్ ఎమ్ ముంజాల్ వెల్లడించారు. ఈ భాగస్వామ్యం నుంచి తొలి ఉత్పత్తిగా హీరో బ్రాండ్ కింద హై ఎండ్ ఎలక్ట్రిక్ మౌంటెన్ బైక్‌ను (ఈ–ఎమ్‌టీబీ) అందించనున్నామని వివరించారు. లూథియానాలో సైకిల్ వ్యాలీ... హెచ్‌ఎమ్‌సీ గ్రూప్‌లో ప్రధాన కంపెనీ అయిన హీరో సైకిల్స్ లూధియానాలో సైకిల్ వ్యాలీని ఏర్పాటు చేస్తామని ఇటీవలే ప్రతిపాదించింది. సైకిళ్ల పరిశ్రమకు కావలసిన అన్ని వస్తువులను, సేవలను సరఫరా చేసే లక్ష్యంతో ఈ సైకిల్ వ్యాలీ ప్రాజెక్ట్‌ను ఈ కంపెనీ అందుబాటులోకి తేనుంది. ఈ ప్రాజెక్ట్‌కు కీలక పెట్టుబడిదారుగా హీరో సైకిల్స్ వ్యవహరించనుంది. -
ఏపీ సర్కారుపై 'మకీ' సంచలన ఆరోపణలు
-
దేశ ప్రతిష్టను మంట కలిపిన బాబు సర్కారు
-
దేశ ప్రతిష్టను మంటకలిపింది
-
దేశ ప్రతిష్టను మంటకలిపింది
ఏపీ సర్కారుపై కేంద్రానికి జపాన్ సంస్థ మకీ ఫిర్యాదు అమరావతి బ్యూరో పెట్టుబడుల పోటెత్తుతాయంటూ ఒకవైపు ‘భాగస్వామ్య సదస్సు’లో ప్రభుత్వం ఊదరగొడుతోంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం అంటూ ప్రకటనలు ఒకవైపు గుప్పిస్తుంటే.. ఇంకోవైపు రాజధాని అమరావతి నిర్మాణంలో పారదర్శకత లేశ మాత్రం కూడా లేదంటూ ‘డిజైన్’ కాంట్రాక్టు దక్కించుకున్న జపాన్ సంస్థ ‘మకీ అండ్ అసోసియేట్స్’ సంచలన ఆరోపణలు చేసింది. భారతీయ వాస్తు శిల్పి శాస్త్ర నిపుణుల (ఇండియన్ ఆర్కిటెక్చురల్ ప్రొఫెషన్) ప్రతిష్టను ఏపీ ప్రభుత్వం పణంగా పెట్టిందని మండిపడింది. అంతర్జాతీయ టెండర్లో పాల్గొని కాంట్రాక్టు దక్కించుకున్న తమను అనైతికంగా తప్పించారని, ప్రభుత్వ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం, వారికి కావాల్సిన సంస్థను ఎంపిక చేసుకోవడానికి తమ సంస్థకు దక్కిన కాంట్రాక్టును రద్దు చేశారని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ సర్కార్ వ్యవహరించిన తీరుతో భారతదేశంలో పనిచేసేందుకు అంతర్జాతీయ ఆర్కిటెక్టులు ఎవరూ సాహసం చేయలేరంటూ ‘మకీ అండ్ అసోసియేట్స్’ ప్రిన్సిపల్ ఆర్కిటెక్టర్ ఫుమిహికో మకీ 2016 డిసెంబర్ 21న భారత ఆర్కిటెక్చర్ సమాఖ్య ఉపాధ్యక్షుడు విజయ్ గర్గ్‌కు లేఖ రాశారు. భారతదేశంలో ఆర్కిటెక్చర్ వృత్తి నైతికత కాపాడటానికి అమరావతి వ్యవహారాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అమరావతి వ్యవహారంలో పారదర్శకత లేశమాత్రం కూడా కనిపించలేదని, అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. తాము విదేశీయులం కాబట్టి.. సమాచార హక్కు కింద సమాచారాన్ని తీసుకోలేమని, ఆర్కిటెక్చర్ సమాఖ్య ప్రతినిధులు శ్రద్ధ తీసుకొని ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరిస్తే.. స్వార్థ ప్రయోజనాల పరిరక్షణకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ పెద్దల బండారం బయటపడుతుందని సూచించారు. రాష్ట్రంలో విదేశీ, స్వదేశీ పెట్టుబడులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకాన్ని ఫుమిహికో మకీ తన లేఖలో ఇలా వివరించారు... మకీని ఎంపిక చేసిన అంతర్జాతీయ జ్యూరీ రాజధానిలో వెయ్యి ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయం (అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్, డైరెక్టరేట్లు)ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ భవనాల సముదాయం డిజైన్ల కోసం అంతర్జాతీయ పోటీ ద్వారా మాస్టర్ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపికకు ప్రొఫెసర్ క్రిస్టపర్ బెన్నింగర్ అధ్యక్షతన కేటీ రవీంద్రన్, ఎర్విన్ విరే, సుహా ఓజ్కాన్, పద్మభూషణ్ రాజీవ్ సేథీ, కేశవ్ వర్మ సభ్యులుగా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాస్టర్ ఆర్కిటెక్ట్ పోటీలో పాల్గొనాలని కోరుతూ జపాన్‌కు చెందిన మకీ అసోసియేట్స్‌కు ప్రభుత్వం డిసెంబర్ 12, 2015న లేఖ రాసింది. కానీ అంతకు ముందే భారతీయ వాస్తు నిపుణులు, రోజర్స్, స్టిర్క్, హార్బర్ పార్టనర్స్(ఇంగ్లండ్) ప్రభుత్వ భవన సముదాయం డిజైన్లపై కసరత్తు బాధ్యతను అప్పగించింది. అంతర్జాతీయ పోటీలో సంస్థలు అందించిన ప్రతిపాదనలను పరిశీలించిన జ్యూరీ మకీ అసోసియేట్స్‌ను మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక చేస్తున్నట్లు మార్చి 25, 2016న ప్రకటించింది. మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా మకీ అసోసియేట్స్‌ను ఎంపిక చేసినట్లు సీఆర్డీఏ అప్పటి కమిషనర్ శ్రీకాంత్ ఆ సంస్థ చీఫ్ ఫుమిహికో మకీకి ఏప్రిల్ 7, 2016న లేఖ రాశారు. ఇదే అంశంపై కాంట్రాక్టు ఒప్పందం చేసుకోవాలని సీఆర్డీఏకు మకీ అసోసియేట్స్ ప్రతిపాదనలు పంపింది. కారణం చెప్పకుండా మకీపై వేటు మాస్టర్ ఆర్కిటెక్ట్ ఒప్పందంపై సీఆర్డీఏ అధికారులు స్పందించకపోవడంతో మే 15న మకీ బృందం విజయవాడకు వచ్చి సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. డిజైన్లలో మార్పులు చేర్పులు చేయాలన్న సీఎం సూచనలకు అంగీకరించింది. కానీ ప్రభుత్వం మే నెలలో మరో ఏడుగురు ఆర్కిటెక్టర్లకు ప్రభుత్వ కార్యాలయాల సముదా యం డిజైన్లు సమర్పించే పని అప్పగించింది. అందులో ముగ్గుర్ని ఎంపిక చేస్తామని, ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని డిజైన్ చేయడంలో వారు మకీకి సహాయం చేస్తారని తర్వాత చెప్పారు. ‘దానికి కూడా అంగీకరించాం. భారతదేశానికి వచ్చి.. ఆర్కిటెక్టులను ఎంపిక చేయడానికి సీఆర్డీఏ నియమించిన ప్రొఫెసర్ రవి ఆనంద్‌ను కలిసి చర్చించాం. ఆయన పూర్తి సమాచారం చెప్పలేదు. రవి ఆనంద్ రూపొందించిన అర్హత ప్రమాణా ప్రకారం.. డిజైన్ ప్రతిపాదనలు సమర్పించిన ఏడు సంస్థల్లో ‘హఫీజ్ కాంట్రాక్టర్’ ఆఖరు స్థానంలో నిలిచినట్లు ఇతర మార్గాల ద్వారా తెలిసింది. ఆఖరు స్థానంలో నిలిచిన ‘హఫీజ్ కాంట్రాక్టర్’నే డిజైన్ల రూపకల్పనకు ఎంపిక చేశారు. ‘రాజకీయ కారణాల’తో హఫీజ్ కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసినట్లు రవి ఆనంద్ మాకు చెప్పారు. డిజైన్లపై చర్చించేందుకు జూలై 8, 2016న ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ జపాన్‌కు వెళ్లి టోక్యోలోని మకీ కార్యాలయంలో ఆరు గంటలపాటు గడిపినా డిజైన్లపై చర్చించలేదు. ఆ తర్వాత ఫీజుల తగ్గింపునకు వీలుగా సంప్రదింపులకు అంగీకరిస్తామని తెలిపాం. హఫీజ్ కాంట్రాక్టర్‌తో కలిసి పనిచేయాలన్న నిబంధనకూ అంగీకరించాం. మా సాంకేతిక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మేము పూర్తి చేసిన ప్రాజెక్టులను సందర్శించాలని సూచించాం. కానీ వారు ఆ పని చేయలేదు. హఫీజ్ కాంట్రాక్టర్, ఫోస్టర్ అండ్ పార్టనర్(లండన్) పూర్తి చేసిన ప్రాజెక్టును అధికారుల బృందం సమర్శించింది. డిజైన్లలో మకీ మార్పులు చేర్పులు చేస్తుండగానే ఆ సంస్థను మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా తొలగిస్తున్నట్లు అక్టోబర్ 24, 2016న ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా మమ్మల్ని తొలగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కనీసం సమాచారం ఇవ్వలేద’ని మకీ చీఫ్ ఫుమిహికో మకీ పేర్కొన్నారు. ఫోస్టర్ పార్ట్నర్స్ ఎంపికపై వివాదం మకీపై వేటు వేసిన రోజే అక్టోబర్ 24, 2016న ప్రభుత్వ భవన సముదాయం డిజైన్‌కు మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపికకు మరోసారి ప్రతిపాదనలను ఏపీ సర్కార్ ఆహ్వానించింది. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జ్యూరీని పక్కన పెట్టి.. నిబంధనలకు విరుద్ధంగా లండన్‌కు చెందిన ఫోస్టర్ పార్ట్నర్స్, హఫీజ్ కాంట్రాక్టర్ (ముంబై)లను మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపికకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్యూరీని విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫోస్టర్ పార్ట్నర్, హఫీజ్ కాంట్రాక్టర్లు రూపొందించిన డిజైన్లను ఇప్పటివరకూ అటు సీఆర్‌డీఏగానీ.. ఇటు ప్రభుత్వంగానీ బహిర్గతం చేయకపోవడం గమనార్హం. ఇదే అంశాన్ని మకీ చీఫ్ పుమిహికో మకీ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాజకీయ నేతల వ్యక్తిగత ప్రయోజనాలు రాజధానితో ముడిపడినట్లు చెప్పారనే అంశాన్ని మాస్టర్ ఆర్కిటెక్ట్ పోటీలో తమతో సంప్రదింపులు జరిపిన అధికారులు చెప్పారని ప్రధానంగా ప్రస్తావించారు. జ్యూరీ ఎంపిక చేసిన తమకు కనీస సమాచారం ఇవ్వకుండా వేటు వేసి.. నిబంధనలకు విరుద్ధంగా ఫోస్టర్ పార్టనర్స్–హఫీజ్ కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు ఇచ్చిన డిజైన్లను ప్రభుత్వం బహిర్గతం చేయలేదని.. సమాచార హక్కు ద్వారా వాటి వివరాలు కోరడానికి తాము భారతీయ పౌరులు కాలేకపోవడం వల్ల నిస్సహాయులుగా మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్టకు విఘాతం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎవరిని ఎంపిక చేసినా తమకు నష్టం లేదని.. కానీ ఏపీ సర్కార్ వ్యవహరించిన తీరు వల్ల భారతదేశ ప్రతిష్టకు విఘాతం కలిగిందని మకీ చీఫ్ ఫుమిహికో మకీ పేర్కొన్నారు. ఇలాగైతే భారతదేశంలో పనిచేసేందుకు అంతర్జాతీయ నిపుణులు ఎవరూ సాహసించలేరని స్పష్టీకరించారు. ఏదిఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నట్లు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రాజధాని నిర్మాణం సాకారం కావాలని ఆశిస్తున్నట్లు పేర్కొంటూ ఆయన కేంద్రానికి రాసిన లేఖ బహిర్గతం కావడం కలకలం రేపుతోంది. ఇదే విధంగా ప్రధాని కార్యాలయానికి కూడా మకీ లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై పీఎంఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చర్యలతో రాష్ట్ర ప్రతిష్ట మసకబారిందని నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు విజయ్గర్గ్కు మకీ అండ్ అసోసియేట్స్ రాసిన లేఖ .. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కు ఫుమిహికో మకీ రాసిన లేఖ -
కదలకుండానే ఇల్లు తుడవొచ్చు...
ఒకవైపు ఇంట్లో నేలంతా మురికి మురికిగా ఉంటుంది. తుడవాలంటే నడుం వంచక తప్పదు. మరోవైపు టీవీలో నచ్చిన సీరియల్ వస్తూ ఉంటుంది. బద్ధకంగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ గడిపేయాలని ఉంటుంది. అలాగని ఇంటిని మురికిగా వదిలేయాలని కూడా అనిపించదు. ఇలాంటి విపత్కర సమస్యకు పరిష్కారమెలా అని ఆలోచిస్తున్నారా..? ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫ్లోర్ డస్టర్ ఒకటి ఇంట్లో ఉంటే చాలు... మీరు సోఫాలోంచి ఏమాత్రం కదలనక్కర్లేదు. నేలను శుభ్రం చేయడానికి నడుం వంచి కష్టపడనవసరమే లేదు. ఒక చేత్తో టీవీ రిమోట్ పట్టుకుని చానెల్స్ మార్చేస్తూ ఉన్నట్లే, మరో చేత్తో ఈ ఫ్లోర్ డస్టర్ రిమోట్ కూడా పట్టుకుని, కావలసిన దిశలో దీనిని మళ్లిస్తూ ఉంటే చాలు... ఇల్లంతా ఇట్టే శుభ్రం చేసేస్తుంది. ‘రూంబా’ పేరిట ఒక జపాన్ కంపెనీ ఈ ఫ్లోర్ డస్టర్‌ను రూపొందించింది. దీనికోసం మొత్తం ఆరు ‘ఏఏ’ సైజు బ్యాటరీలు కావాల్సి ఉంటుంది. నాలుగు బ్యాటరీలను డస్టర్‌లో, రెండింటిని రిమోట్లో అమర్చుకోవాల్సి ఉంటుంది. -
‘మకి’కి మరో అవకాశం
-
‘మకి’కి మరో అవకాశం
వారంలో డిజైన్లు మార్చి ఇవ్వాలన్న సీఆర్డీఏ సాక్షి, అమరావతి: రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయం డిజైన్లకు సంబంధించి జపాన్ కంపెనీ మకి అసోసియేట్స్‌కు మరో అవకాశం ఇవ్వాలని సీఆర్డీఏ నిర్ణయించింది. వారంలోపు కొత్త డిజైన్లు ఇవ్వాలని కోరింది. ఆ డిజైన్లూ ప్రభుత్వానికి నచ్చని పక్షంలో డిజైన్ల పోటీలో రెండో స్థానంలో నిలిచిన లండన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్ కంపెనీని ఆహ్వానించే యోచనలో ప్రభుత్వ పెద్దలున్నారు. మలేసియాకు చెందిన హారిస్ ఇంటర్నేషనల్ ఇచ్చిన డిజైన్లతోపాటు దేశంలోని సీపీ ఖురేజా అసోసియేట్స్, హపీజ్ కాంట్రాక్టర్ డిజైన్లను కూడా పరిశీలించాలని భావిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల్లో మకి మార్చిన డిజైన్లను సీఆర్డీఏకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20లోపు డిజైన్లపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ చెబుతున్నారు. -
జికా ఉన్నా.. జిల్జిల్ జిగా..
జికా వైరస్ అంటే అందరూ జడుసుకు చస్తున్నారు.. మరి ఇలాంటి టైమ్‌లో పర్యాటకులు ఏం చేయాలి? జికా వైరస్ ఉన్న దేశాల్లో తిరక్కూడదంటే ఎలా? అని అంటే.. ఇదిగో ఇదేసుకుని తిరిగేయండి అంటోంది ఓ జపాన్ కంపెనీ. మొత్తం అంతటినీ కప్పేసేలా నెట్స్మెన్ పేరిట ఈ దోమ తెరను తయారుచేసింది. ఇదేసుకుని ఎంచక్కా తిరిగేయొచ్చని చెబుతోంది. జికా కాదు.. డెంగీతోపాటు దోమల వల్ల వచ్చే వ్యాధులన్నిటి నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ‘బిబిల్యాబ్’ కంపెనీ చెబుతోంది. దీన్ని తీయాల్సిన పని కూడా లేదట. కాళ్లు, చేతులు కడుక్కోవాలన్నా.. బాత్రూంకు వెళ్లాలన్నా అందుకు వీలుగా.. ఎక్కడికక్కడ జిప్‌లను ఏర్పాటు చేశారు. పర్యాటకులతోపాటు జికా వైరస్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకూ ఉపయోగపడుతుందని అంటోంది. దీని ధర రూ.4,200. -
మళ్లీ సర్వేకు వస్తే ఖబడ్దార్
పోలాకి : రాష్ట్ర ప్రభుత్వ జపాన్ కంపెనీతో సంయుక్తంగా నిర్మించ తలపెట్టిన పోలాకి థర్మల్ పవర్ ప్లాంట్ సర్వేకు సహకరించేది లేదని, మరోసారి సర్వే పేరిట వస్తే ఖబడ్దార్ అంటూ థర్మల్ ప్రతిపాదిత గ్రామస్తులు అధికారులను హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ థర్మల్ సర్వేను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ప్లాంట్ ప్రభావిత గ్రామాలైన చీడివలస, గవరంపేట, ఓదిపాడుల్లో తహశీల్దార్ జెన్ని రామారావు, జెన్కో ఏఈ టీవీ మధు ఆధ్వర్యంలో మంగళవారం అధికారుల బృందం పర్యటించింది. ప్రస్తుత సర్వే కేవలం భౌగోళిక స్థితిగతులపై అంచనా వేసేందుకు మాత్రమేనని ప్రజలు సహకరించాలని నచ్చజెప్పేందుకు అధికారులు చేసిన ప్రయత్నం మరోసారి విఫలమైంది. మరోసారి సర్వేకు రావద్దని ప్రజలు గట్టిగానే హెచ్చరించారు. ముందుగా చీడివలస గ్రామానికి చేరుకున్న అధికారులకు అక్కడి యువకులు గోబ్యాక్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం ఓదిపాడు, గవరంపేటల్లో కూడా అధికారులను అడ్డుకున్నారు. అభివృద్ధి పేరిట మా బతుకులు బుగ్గి చేయొద్దని నిజంగా అభివృద్ధి చేయూలంటే ట్రిపుల్ ఐటీ వంటి జాతీయ సంస్థలను నిర్మించాలని, మా భూములు ఇచ్చేందకు సిద్ధంగా ఉన్నామని తహశీల్దార్ బృందానికి వినతిపత్రాలు అందజేశారు. మహిళలు సైతం అధికారులను నిలదీశారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. సర్వే నిలుపుదల చేస్తున్నట్టు తహసీల్దార్ తెలిపారు. అధికారుల బృందంలో ఆర్ఐ బాలకృష్ణ, వీఆర్వోలు కృష్ణమోహన్, వెంకటరమణ ఉన్నారు. థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావు, ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు, ఇతర నాయకులు కె.సురేష్‌బాబు, నీలంరాజు, కోట అప్పారావు ప్రజలకు మద్దతుగా నిలిచారు. పోలాకి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రెచ్చగొట్టొద్దు... థర్మల్‌పవర్ ప్లాంట్ నిర్మాణాలకు జిల్లాలో వ్యతిరేకత వుంది. సర్వే పేరుతో ప్రజలను రెచ్చగొట్టవద్దు. గతంలో కాకరాపల్లి, సోంపేటలలో కూడా అనవసరంగా ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారు. ఇక్కడ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకత తెలుపుతున్నా వినిపించుకోవటం లేదు. జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వం, అధికారులే వహించాల్సి వుంటుంది. -కోట అప్పారావు, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు -
మళ్లీ మారనున్న ఏపీ రాజధాని డిజైన్లు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని డిజైన్లు మళ్లీ మొదటికే వచ్చినట్లు అయింది. మరోసారి రాజధాని డిజైన్లు మారనున్నాయి. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం కోసం జపాన్ రూపొందించిన డిజైన్ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందనే విమర్శలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రముఖ ఆర్కిటెక్ట్స్ సంస్థలతో మంత్రి నారాయణ సోమవారం విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్లో సంప్రదింపులు జరిపారు. డిజైన్ వ్యవహారం మళ్లీ మొదటికే రావడంతో 2017 ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయి డిజైన్లు రూపొందించి 2018 కల్లా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలనే ప్రభుత్వ ప్రయత్నం ఫలించే సూచనలు కనిపించడం లేదు. మొదట సింగపూర్ మాస్టర్ ప్లాన్ అని, ఆ తర్వాత జపాన్ కంపెనీకి సంబంధించి డిజైన్లు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ డిజైన్ లోని అసెంబ్లీ భవనాలు పొగగొట్టాల్లా ఉండడం, అదే తరహా అసెంబ్లీ భవనం చండీగఢ్‌లో ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక్కడి డిజైన్లనే కాపీ కొట్టి జపాన్ కంపెనీ అంతర్జాతీయ స్థాయి అన్నట్టు చూపించిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచలో పడింది. ఇప్పటికే సింగపూర్, జపాన్ సంస్థల నుంచి డిజైన్లు తీసుకున్న ఏపీ సర్కార్ తాజాగా కొత్తగా మూడో డిజైన్ కోసం ప్రయత్నిస్తోంది. రాజధాని డిజైన్ల కోసం సింగపూర్ కంపెనీకి రూ.11 కోట్లు, జపాన్ సంస్థ మకీ డిజైన్‌కు రూ.కోటి ఖర్చు చేసింది. ఎంపిక తతంగానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, తీరా అది తుస్సుమనడంతో డిజైన్‌ను మార్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
రాజధాని డిజైన్ మళ్లీ మొదటికి..!
► జపాన్ సంస్థ విమర్శలతో సర్కారు పునరాలోచన ► డిజైన్‌ను పూర్తిగా మార్చాలని నిర్ణయించిన సీఎం ► మళ్లీ మకి అసోసియేట్స్‌కే బాధ్యత విజయవాడ: రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం కోసం జపాన్ రూపొందించిన డిజైన్ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందనే విమర్శలతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. జపాన్ కంపెనీతోనే మళ్లీ కొత్తగా డిజైన్ తయారు చేయించాలని నిర్ణయించింది. డిజైన్ వ్యవహారం మళ్లీ మొదటికే రావడంతో 2017 ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయి డిజైన్లు రూపొందించి 2018 కల్లా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలనే ప్రభుత్వ ప్రయత్నం ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఈ డిజైన్ కోసం సీఆర్డీఏ మూడు నెలల పాటు కసరత్తు చేసింది. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌ల మధ్య పోటీ పెట్టింది. 900 ఎకరాల్లో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్, శాఖాధిపతుల కార్యాలయాలు, వీఐపీల నివాసాలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆయా ప్రదేశాల్లో గ్రీనరీ (పచ్చదనం) ఉండేలా అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ చేయాలని సూచించింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఐకానిక్ భవనాలుగా అత్యద్భుతంగా ఉండాలని సచివాలయం కూడా అదేస్థాయిలో ఉండాలని పేర్కొంది. ఉత్తమ డిజైన్ ఎంపికకు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ క్రిస్టోఫర్ బెనిగర్ నేతృత్వంలో దేశ, విదేశీ ఆర్కిటెక్ట్‌లతో ఒక జ్యూరీని ఏర్పాటు చేసింది. పలు జాతీయ, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌లు డిజైన్లు రూపొందించగా అంతిమంగా జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్, లండన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్, భారత్‌కు చెందిన వాస్తు శిల్ప కన్సల్టెంట్స్ డిజైన్లను తుదిపోటీకి ఎంపిక చేసింది. గత నెలలో ఈ మూడు డిజైన్లను పరిశీలించిన జ్యూరీ చివరకు జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్ డిజైన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగగా ఆ డిజైన్‌ను ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అప్పుడు అత్యద్భుతం అన్న సీఎం ప్రభుత్వం, సీఆర్డీఏ, ఆర్కిటెక్ట్‌లు మకి డిజైన్ అద్భుతంగా ఉందన్నా వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. డిజైన్‌లోని అసెంబ్లీ భవనాలు పొగగొట్టాల్లా ఉండడం, అదే తరహా అసెంబ్లీ భవనం చండీగఢ్‌లో ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక్కడి డిజైన్లనే కాపీ కొట్టి జపాన్ కంపెనీ అంతర్జాతీయ స్థాయి అన్నట్టు చూపించిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచలో పడింది. ఈ డిజైన్‌కు మకి అసోసియేట్స్‌కు రూ.97.5 లక్షలు సీఆర్డీఏ చెల్లించింది. ఎంపిక తతంగానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. తీరా అది తుస్సుమనడంతో డిజైన్‌ను మార్చడానికి కసరత్తు చేస్తోంది. అప్పట్లో మకి డిజైన్ అద్భుతమని పొగిడిన చంద్రబాబు సోమవారం మీడియా సమావేశంలో.. జపాన్ డిజైన్ ఫైనల్ కాదని మనకు కావాల్సిన విధంగా ఆ కంపెనీతో డిజైన్ చేయిస్తామంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు సోమవారం మకి అసోసియేట్స్‌తో సమావేశమై అసెంబ్లీ భవన డిజైన్‌ను పూర్తిగా మార్చాలని, హైకోర్టు డిజైన్లోనూ మార్పులు చేయాలని సూచించినట్లు తెలిసింది. -
మేడిన్ జపాన్.. అంతా తూచ్!
రాజధాని భవనాల డిజైన్‌పై ప్రభుత్వం పునరాలోచన! ♦ పరిశ్రమల్లోని పొగ గొట్టాల్లా అసెంబ్లీ భవనాలు ♦ ఛండీగఢ్ అసెంబ్లీని తలపిస్తున్న డిజైన్ ♦ సర్వత్రా విమర్శలు.. సామాజిక మాధ్యమాల్లో సెటైర్ల హోరు ♦ అయోమయంలో సీఆర్డీఏ, రాష్ట్ర ప్రభుత్వం ♦ డిజైన్ మార్పుపై మల్లగుల్లాలు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని పరిపాలనా భవనాలకు ఎంపికైన జపాన్ కంపెనీ ఫుమిహికో మకి అసోసియేట్స్ డిజైన్‌పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ డిజైన్ ఎంపికైనట్లు ఆర్భాటంగా ప్రకటించినా.. దీనిపై అధికారవర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవడం, సామాజిక మాధ్యమాల్లోనూ పెద్దఎత్తున సెటైర్లు రావడంతో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. డిజైన్‌లో రూపొందించిన అసెంబ్లీ భవనాలు పరిశ్రమల్లోని పొగగొట్టాల మాదిరిగా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఛండీగఢ్ అసెంబ్లీ భవనం కూడా ఇంచుమించు ఇలాగే ఉండడంతో జపాన్ కంపెనీ కొత్తగా చేసిందేమిటనే ప్రశ్నలకు సమాధానం కరువైంది. హైకోర్టు భవనం సైతం ఆకట్టుకునేలా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఆర్డీఏ మూడు నెలల పాటు హంగామా చేసి చివరికి ఇలాంటి డిజైన్ ఎంపిక చేయడం ఏమిటనే వాదన అధికారవర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం సీఆర్డీఏ దీనిపై ప్రజలు, నిపుణుల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. ఈ దశలోనే డిజైన్‌ను మార్చితే ఎలా ఉంటుందనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. మొత్తం డిజైన్‌నే మార్చేద్దామా.. పరిపాలనా భవనాల డిజైన్ల కోసం అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌లతో సీఆర్డీఏ పెద్ద వర్క్‌షాప్ నిర్వహించింది. ఆ తర్వాత తుది పోటీకి లండన్, ఇండియా, జపాన్‌లకు చెందిన మూడు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ కంపెనీలను గుర్తించి వారి మధ్య పోటీ నిర్వహించింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఐకానిక్ కట్టడాలుగా నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం వాటి డిజైన్లు అత్యద్భుతంగా ఉండాలని ఆ కంపెనీలకు సూచించింది. ఈ మూడింటిలో ఒకదాన్ని ఎంపిక చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌లతో ఒక జ్యూరీని సైతం ఏర్పాటు చేసింది. క్రిస్టోఫర్ బెనిగర్ నేతృత్వంలోని ఈ జ్యూరీ లండన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్, ఇండియాకు చెందిన వాస్తు కన్సల్టెంట్స్ రూపొందించిన డిజైన్లను పక్కనపెట్టి జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్ డిజైన్‌ను ఎంపిక చేసింది. ప్రభుత్వం కూడా ఏ మాత్రం ఆలోచించకుండా దీనికి ఒకే చెప్పింది. ప్రభుత్వానికి భజన చేసే వారంతా డిజైన్ విడుదలైన మొదట్లో అత్యద్భుతంగా ఉందని కీర్తించినా.. ఆ తర్వాత నుంచి వాస్తవ విశ్లేషణలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలోనూ సెటైర్లు.. అలాగే సోషల్ మీడియాలోనూ ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టిందనే సెటైర్లు హోరెత్తుతున్నాయి. ఒప్పందం ప్రకారం రెండు ఐకానిక్ భవనాల పూర్తి స్థాయి డిజైన్లను పోటీలో గెలిచిన మకి అసోసియేట్స్ రూపొందించాల్సి ఉంది. కానీ అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో సీఆర్డీఏ దీనిపై కొట్టుమిట్టాడుతోంది. ఐకానిక్ భవనాల డిజైన్లను మార్చాలా లేక మొత్తం 900 ఎకరాల పరిపాలనా భవనాల డిజైన్‌నే మార్చాలా అనే అంశంపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. నాలుగైదు నెలల పాటు బోలెడంత ప్రక్రియ నిర్వహించి.. రూ.కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత వాటిపై అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ప్రభుత్వానికి, సీఆర్డీఏకు పాలుపోవడం లేదు. -
ఆంధ్రప్రదేశ్ అధికార పీఠం మేడిన్ జపాన్
- రాజధాని భవనాలకు మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఫుమిహికో మకి అసోసియేట్స్ - జ్యూరీ నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు - ఐకానిక్ నిర్మాణాలుగా అసెంబ్లీ, హైకోర్టు - వీటి పూర్తిస్థాయి డిజైన్ల బాధ్యత మాస్టర్ ఆర్కిటెక్ట్‌కు - ఇందుకోసం 2017 ఏప్రిల్ వరకు గడువు - మిగతా డిజైన్లు రూపొందించే సంస్థలకు ‘మకి’ సహకారం - జపాన్ సంస్థకు రూ.97.5 లక్షలు చెల్లించనున్న సీఆర్డీఏ సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణానికి జపాన్ డిజైన్ ఎంపికైంది. ఇందుకోసం నిర్వహించిన పోటీలో టోక్యోకు చెందిన ఫుమిహికో మకి అసోసియేట్స్‌ను మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా సీఆర్డీఏ నియమించిన జ్యూరీ ఎంపిక చేసింది. శుక్రవారం నగరంలోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయం ప్రకటించారు. అంతకుముందు.. తుది పోటీలో నిలిచిన మూడు సంస్థలు రూపొందించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. ఆ సంస్థలు ఇచ్చిన ప్రజెంటేషన్లను వీక్షించారు. ఆ తర్వాత జ్యూరీ చైర్మన్ క్రిస్టోఫర్ బెనిగర్ తాము ఎంపిక చేసిన డిజైన్ కవర్‌ను ముఖ్యమంత్రికి అందించగా ఆయన ప్రకటన చేశారు. మకి అసోసియేట్స్ ఐకానిక్ కట్టడాలుగా గుర్తించిన అసెంబ్లీ (లెజిస్లేచర్), హైకోర్టు భవనాలకు తుది డిజైన్లు రూపొందిస్తుంది. మిగతా భవనాల డిజైన్లకు సంబంధించి మార్గదర్శకాలు అందజేస్తుంది. ఇందుకోసం మకి సంస్థకు సీఆర్డీఏ రూ.97.5 లక్షలు చెల్లించనుంది. అసెంబ్లీ, హైకోర్టు భవనాల పూర్తిస్థాయి డిజైన్లను 2017 ఏప్రిల్ నాటికల్లా సీఆర్డీఏకు మకి అసోసియేట్స్ సమర్పించాల్సి ఉంది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే వీటి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. 2017 మే నెల కల్లా నిర్మాణాన్ని ప్రారంభించి 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన సచివాలయం, రాజ్‌భవన్, సీఎం నివాసం, స్టేట్ గెస్ట్ హౌస్, విభాగాధిపతుల కార్యాలయాలు, నివాస సముదాయాలు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు తయారు చేయడానికి సీఆర్డీఏ ఎనిమిది ఆర్కిటెక్ట్ సంస్థలు, మూడు ల్యాండ్ స్కేప్, మూడు ఇంటీరియర్ డిజైన్ సంస్థలను ఎంపిక చేయనుంది. 2016 డిసెంబర్‌కల్లా డిజైన్లు ఖరారుచేసి అదే నెలలో టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. 2017 జనవరి కల్లా వీటి నిర్మాణాన్ని ప్రారంభించి 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. తుది రేసులో భారతీయ సంస్థ సింగపూర్ కంపెనీలు పరిపాలనా రాజధాని (సీడ్ క్యాపిటల్), రాజధాని నగరం, రాజధాని రీజియన్లకు విడివిడిగా మాస్టర్ప్లాన్లు సమర్పించాయి. ప్రభుత్వం తొలి దశలో 900 ఎకరాల్లో పరిపాలన రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించి అందుకోసం డిజైన్ల పోటీ నిర్వహించింది. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్, సీఎం నివాసం, విభాగాధిపతుల కార్యాలయాలు, ఇతర ముఖ్య భవనాల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఇచ్చేందుకు దేశ, విదేశాలకు చెందిన పలువురు ఆర్కిటెక్ట్‌లు పోటీపడ్డారు. కానీ బ్రిటన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్ (రోజర్స్ స్ట్రిక్ హార్బర్ అండ్ పార్టనర్స్), భారత్‌కు చెందిన బీవీ దోషి నేతృత్వంలోని వాస్తు శిల్ప కన్సల్టెంట్స్, మకి సంస్థలు మాత్రమే తుది రేసులో నిలిచాయి. రిచర్డ్ రోజర్స్ స్థానిక పరిస్థితులకనుగుణంగా అత్యాధునిక డిజైన్ తయారు చేయగా, వాస్తు శిల్ప కన్సల్టెంట్స్ భారతీయత ఉట్టిపడేలా డిజైన్‌ను ఇచ్చింది. మకి అసోసియేట్స్ స్థానిక చరిత్ర, వారసత్వం, ఆధునిక నిర్మాణ రీతులను ప్రతిబింబించేలా డిజైన్‌ను రూపొందించింది. మూడు డిజైన్లను ఈ నెల 23వ తేదీ నుంచి ప్రఖ్యాత భారతీయ ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ బెనిగర్ నేతృత్వంలోని జ్యూరీ సభ్యులు విశ్లేషించి ఆధునిక నిర్మాణ రీతులు, పర్యావరణం, సోలార్ వ్యవస్థలతో సరికొత్తగా డిజైన్‌ను రూపొందించిన మకి అసోసియేట్స్‌ను విజేతగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అసలు పని మొదలైంది : చంద్రబాబు మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపికతో రాజధానిలో అసలు పని మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఏ పోటీలోనైనా విజేతను ఎంపిక చేయడానికి గంట సమయం తీసుకుంటారని, కానీ మాస్టర్ డిజైన్ ఎంపికకు చాలారోజులు సమయం కేటాయించి సహకరించారంటూ.. జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తుది పోటీలో నిలిచిన మూడు సంస్థల డిజైన్లు బాగున్నాయని చెప్పారు. విజేతగా నిలిచిన సంస్థతో పాటు మిగిలిన సంస్థలు రూపొందించిన డిజైన్లలో కీలకమైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎంపిక చేసిన డిజైన్‌పై ప్రజల అభిప్రాయం తీసుకుంటామని, ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లోనూ దీనిపై చర్చ పెడతామన్నారు. అమరావతిలో నిర్మించే ఐకానిక్ బ్రిడ్జిని కూచిపూడి వారసత్వానికి చిహ్నంగా నిలిచేలా డిజైన్ చేయిస్తున్నామని, చైనా ఈ పనిచేస్తోందని తెలిపారు. జ్యూరీ సభ్యులు మాట్లాడుతూ.. ప్రకృతి, సంస్కృతి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మకి సంస్థ డిజైన్‌ను ఎంపిక చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, పుల్లారావు, దేవినేని ఉమ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, జ్యూరీ సభ్యులు కేటీ రవీంద్రన్, ఇర్విన్ విరే, కేశవ్ వర్మ, సుహా ఓజ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నేడు, రేపు ప్రదర్శన తుది పోటీలో నిలిచిన మూడు సంస్థలు రూపొందించిన డిజైన్లను ఈ నెల 26, 27 తేదీల్లో నగరంలోని డీవీ మనార్ హోటల్లో ప్రజల కోసం ప్రదర్శించనున్నారు. ఈ మూడు సంస్థలకు రూ.3 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. -
భూమి సీఆర్‌డీఏది.. అభివృద్ధి హక్కు జపాన్ సంస్థలది
రాజధాని అభివృద్ధిలో జపాన్ సంస్థలకు వాటా * ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని అభివృద్ధిలో సమాన భాగస్వాములుగా ఉండేందుకు జపాన్ సంస్థలు సూత్రప్రాయంగా అంగీకరించాయని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. భూమి సీఆర్డీఏకే చెందినా.. అభివృద్ధిలో ఆయా సంస్థలకు హక్కు ఉంటుందని తేల్చిచెప్పారు. ఐదు రోజుల జపాన్ పర్యటన అనంతరం గురువారం ఢిల్లీ చే రుకున్న చంద్రబాబు శుక్రవారం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, ఉమాభారతిని కలిశారు. * కేంద్ర మంత్రి ఉమాభారతిని కలవడానికి ముందు ఏపీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఐదు రోజుల పర్యటనలో జపాన్ ప్రధానమంత్రి షింజో అబే, మరో నలుగురు మంత్రులు, జపాన్ ప్రభుత్వ సంస్థలైన జైకా, జెబిక్ ప్రతినిధులు... ఫుజి, మిత్సుబిషి, తదితర ప్రయివేటు కంపెనీల ప్రతినిధులను కలిశారు. వారంతా విస్తృతంగా పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి యొకహామా పోర్టు కార్పొరేషన్ సహకరిస్తుంది. సుమిటొమో కార్పొరేషన్ శ్రీకాకుళంలో అల్ట్రా పవర్ ప్రాజెక్టుకు సహకరిస్తామని చెప్పింది. * జైకాను 2029కు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని కోరాం. విశాఖ-చెన్నై కారిడార్‌కు ఏడీబీలో జైకాను భాగస్వామిగా చేరాలని కోరాం. బెంగుళూరు-కృష్ణపట్నం ప్రాజెక్టులోనూ చేరాలని కోరాం. శ్రీకాకుళంలోని మెగాపవర్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించేందుకు జెబిక్ ముందుకొచ్చింది. మిజుహో బ్యాంకును అమరావతిలో ఒక శాఖను ఏర్పాటుచేయాలని కోరాం. అమరావతిని గొప్ప ఫైనాన్షియల్ హబ్ చేయాలనుకుంటున్నాం. సాఫ్ట్‌బ్యాంకు కూడా మేకిన్ ఇండియాలో భాగంగా భారీ ఎత్తున విద్యుదుత్పత్తి ప్లాంటు స్థాపనకు ముందుకొచ్చారు..’’ అని వివరించారు. బాబు ఇంకా ఏమన్నారంటే.. * 7,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని ఉంటుంది. పోర్టు ఆధారిత ఇండస్ట్రీ టౌన్షిప్ అభివృద్ధి కావాలి. మచిలీపట్నం పోర్టు ఉంది. వ్యాన్‌పిక్ లిటిగేషన్ కూడా తొందరలోనే క్లియర్ చేయాలి. హాసింగపూర్ ప్రభుత్వం 20న సీడ్ క్యాపిటల్ ప్రణాళిక ఇస్తుంది. అక్టోబరు 22న పునాదిరాయి వేస్తాం. మన ప్రధాని, జపాన్ ప్రధాని, సింగపూర్ ప్రధానిని ఆహ్వానించాం. హా టోక్యోలో వంద మెట్రిక్ టన్నుల చెత్త నుంచి ఒక మెగావాటు విద్యుత్తు తయారుచేస్తున్నాయి. ఏడు ప్లాంట్లు ఏర్పాటుచేయనున్నాం. హా ఎనర్జీ, లాజిస్టిక్స్, వాటర్, అక్వా, హాస్పిటాలిటీ, స్పోర్ట్స్ వర్సిటీలు ఏర్పాటుచేస్తాం. పబ్లిక్-ప్రయివేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దుతాం. * గత ఏడాది కరవు నిధులు రూ.1,937 కోట్లు కావాలంటే రూ.320 కోట్లే ఇచ్చారు. ఇవి సరిపోవని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి అడిగాం. సెక్షన్-8, మిగిలిన విషయాలపై మాట్లాడాం. హా సమస్యల పరిష్కారానికి ఎవరి పని వాళ్లు చేయాలి. పవన్ కల్యాణ్‌కు కాదు కానీ.. కొంతమందికి రాష్ట్రం అభివృద్ధి కాకూడదన్న ఎజెండా ఉంటుంది. ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారంపై.. * మైనింగ్ మాఫియా పోవాలి. ఇసుక లూటీ చేసి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేశారు. అందుకే కొత్త విధానం తెచ్చాం. ఇప్పటికే రూ.640 కోట్లు ఆదాయం వచ్చింది. చింతమనేని వ్యవహారంపై నేను ఆ ఎమ్మార్వోతో మాట్లాడాను. నేను వెళ్లాక అన్నీ కనుక్కుని ఎక్కడ తప్పుంటే అక్కడ సరిచేస్తాం. * వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అరెస్ట్ పోలీసు డ్యూటీకి సంబంధించిన వ్యవహారం. ఎవరెవరిని కంట్రోల్లో పెట్టాలో అందరినీ పెడతాను. -
మెట్రోకుపచ్చజెండా
అమరావతికి హైస్పీడ్ రైళ్లు ► శ్రీధరన్ డీపీఆర్‌ను ఆమోదించిన సర్కారు ► త్వరలో డీఎంఆర్సీ ఆధ్వర్యంలో నిర్మాణం ► వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేది 40 శాతం ► జపాన్ కంపెనీ నుంచి 60 శాతం రుణం! సాక్షి, విజయవాడ బ్యూరో : ఇక నవ్యాంధ్ర రాజధానిలో హైస్పీడ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకోసం రాష్ట్రంలోని మెట్రోప్రాజెక్టుల సలహాదా రు శ్రీధరన్ సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదించడంతో ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రూ.5,705 కోట్ల అంచనా వ్యయమున్న ఈ ప్రాజెక్టును శ్రీధరన్ నేతృత్వంలోని డీఎంఆర్సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) చేపట్టనుంది. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన 60 శాతం మొత్తాన్ని జపాన్‌కు చెందిన జైకా వంటి విదేశీ కంపెనీల నుంచి రుణం ద్వారా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూసమీకరణకయ్యే రూ.769 కోట్ల ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో కొనుగోళ్లకయ్యే ఖర్చులో ఆరు శాతం మొత్తాన్ని సర్వీసు చార్జిగా తీసుకుని డీఎంఆర్సీ నిర్మాణాన్ని చేపడుతుంది. తొలినుంచి అనుకున్నట్లుగానే ఏలూరురోడ్డు, బందరు రోడ్డు కారిడార్లను 25.76 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మెట్రో మెయిన్ స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి కంట్రోల్ రూమ్, బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకూ 12.76 కిలోమీటర్ల మేర 12 స్టేషన్లతో పెనమలూరు వరకూ ఒకటో కారిడార్ నిర్మితమవుతుంది. రెండో కారిడార్‌ను బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్, అలంకార్ మీదుగా ఏలూరురోడ్డు అక్కడి నుంచి నిడమానూరు వరకూ 13 కి.మీ. మేర 13 స్టేషన్లతో నిర్మిస్తారు. భవి ష్యత్తులో చేపట్టే రెండో దశ ప్రాజెక్టులో ఒక టో కారిడార్‌ను రాజధాని వరకూ పొడిగిస్తారు. ఇందుకోసం బస్టాండ్ సమీపంలో కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించి అక్కడి నుంచి కారిడార్‌ను తుళ్లూరు వరకూ పొడిగిస్తారు. రెండో దశలోనే రెండవ కారిడార్‌ను ఒకవైపు గన్నవరం ఎయిర్‌పోర్టు వరకూ, మరోవైపు గొల్లపూడి సెంటర్ వరకూ విస్తరిస్తారు. రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరలో రూపొందించనున్నారు. 25.76 కి.మీ. తొలి దశ మెట్రో ప్రాజెక్టును 2019 కల్లా పూర్తి చేస్తామని ప్రారంభంలో గంటకు 40 నుంచి 50 వేల మంది ప్రయాణిస్తారని డీఎం ఆర్సీ అంచనా వేసింది. 2019 నాటికి గంటకు 2.91 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉందని ట్రాఫిక్ సర్వే ద్వారా తేల్చారు. మెట్రో రైళ్లలో 5 కి.మీ. వరకూ టికెట్ ధర రూ.10, 5 నుంచి పది కి.మీ. అయితే రూ.20, పది కి.మీ. దాటితే రూ.30 వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ధరల ద్వారా ఏడు సంవత్సరాల్లో మెట్రో ప్రాజెక్టు ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చని అంచనా. మరోవైపు రాజధాని అమరావతిని హైస్పీడ్ రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అనుసంధానించే విషయంపై ప్రభుత్వం డీఎంఆర్సీ సలహాను కోరింది. బెంగళూరు-అమరావతి, విశాఖ నుంచి అమరావతి మీదుగా తిరుపతి వరకూ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని శ్రీధరన్‌ను సీఎం కోరారు. విజయవాడ-మంగళగిరి-గుంటూరు-తెనాలి సర్క్యూట్‌ను మెట్రో నుంచి మినహాయించి ర్యాపిడ్ రైల్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించాలని శ్రీధరన్ డీపీఆర్‌లో ప్రతిపాదించారు.