
న్యూఢిల్లీ: హీరో సైకిల్స్ కంపెనీ ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ కోసం జపాన్‌కు చెందిన రెండు కంపెనీలతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన యమహా మోటార్ కంపెనీ, మిత్సు అండ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని హీరో సైకిల్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ, టెక్నాలజీ, మార్కెటింగ్ కోసం ఈ రెండు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు హీరో మోటార్స్ కంపెనీ (హెచ్‌ఎమ్‌సీ) చైర్మన్ పంకజ్ ఎమ్ ముంజాల్ వెల్లడించారు. ఈ భాగస్వామ్యం నుంచి తొలి ఉత్పత్తిగా హీరో బ్రాండ్ కింద హై ఎండ్ ఎలక్ట్రిక్ మౌంటెన్ బైక్‌ను (ఈ–ఎమ్‌టీబీ) అందించనున్నామని వివరించారు.
లూథియానాలో సైకిల్ వ్యాలీ...
హెచ్‌ఎమ్‌సీ గ్రూప్‌లో ప్రధాన కంపెనీ అయిన హీరో సైకిల్స్ లూధియానాలో సైకిల్ వ్యాలీని ఏర్పాటు చేస్తామని ఇటీవలే ప్రతిపాదించింది. సైకిళ్ల పరిశ్రమకు కావలసిన అన్ని వస్తువులను, సేవలను సరఫరా చేసే లక్ష్యంతో ఈ సైకిల్ వ్యాలీ ప్రాజెక్ట్‌ను ఈ కంపెనీ అందుబాటులోకి తేనుంది. ఈ ప్రాజెక్ట్‌కు కీలక పెట్టుబడిదారుగా హీరో సైకిల్స్ వ్యవహరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment