కంపెనీలు తమ వ్యాపారం కోసం క్లయింట్లను ఆకర్షించడానికి చాలా చేస్తుంటారు. అయితే ఒక స్టార్టప్ సీఈఓ క్లయింట్లకు ఫుడ్ ట్రీట్ ఇచ్చి కోట్ల రూపాయల డీల్స్ దక్కించుకున్న సంగతి మీకు తెలుసా? ఈ డీల్స్ ద్వారా ఆ స్టార్టప్‌కు ఊహించనంత ఆదాయం వచ్చింది.
న్యూయార్క్‌కు చెందిన టెక్ స్టార్టప్ యాంటిమెటల్ కో ఫౌండర్, సీఈవో మాథ్యూ పార్క్‌హస్ట్ గత ఏప్రిల్ నెలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు, టెక్ ఇన్‌ఫ్లుయన్సర్లతో సహా పలువురికి పిజ్జాలను కొనుగోలు పంపించారు. ఇందు కోసం 15,000 డాలర్లు (సుమారు రూ.12.5 లక్షలు) ఖర్చు పెట్టారు. బీటా దశలో తమ కంపెనీ గురించి అవగాహన పెంచడమే ఈ ట్రీట్ ఉద్దేశం.
కేవలం రెండు నెలల్లోనే యాంటిమెటల్ తన ఖర్చులను లాభదాయక ఒప్పందాలుగా మార్చి ఒక మిలియన్ డాలర్లకు పైగా (రూ.8.3 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. పిజ్జాతో ట్రీట్ చేసిన 75 కంపెనీలు పార్క్ హస్ట్ క్లయింట్లుగా మారాయి. ఈ విషయాన్ని సీఈవో పార్క్‌హస్ట్ సీఎన్‌బీసీ మేక్ ఇట్‌తో స్వయంగా వెల్లడించారు. నిజానికి 'పిజ్జా' తమ ఫస్ట్ ఛాయిస్ కాదని చెప్పారు. షాంపైన్ పంపించాలనుకున్నామని, అయితే దానికి చాలా ఖర్చవుతుందని, పిజ్జాను ఎంచుకున్నట్లు పార్క్‌హస్ట్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment