లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు జపాన్ కంపెనీకి ఆహ్వానం
జపాన్‌లో రోహ్మ్ కంపెనీ సెమీ కండక్టర్ల విభాగాన్ని పరిశీలించిన భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్‌ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యా న్ని నిర్దేశించుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు తెలంగా ణలో మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్ల డించారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన గురువారం క్విటో నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్‌ను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడారు. భట్టికి రోహ్మ్ కంపెనీ ప్రెసిడెంట్ ఇనో, కంపెనీ ఉన్నతాధి కారులు తకహసి, అండో, కాత్సునో, తనాక తకా షీ తదితరులు స్వాగతం పలికారు.
తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భిన్న రంగాల్లో సెమీకండక్టర్ల ఆవశ్యకత ఎంతో ఉందని భట్టి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విడిగా కానీ ఉమ్మడి భాగస్వామ్యంతో కానీ తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని రోహ్మ్ యాజమాన్యానికి భట్టి విక్రమార్క పిలుపుని చ్చారు.
భారతదేశంలో ఇప్పటికే మూడు చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న సౌకర్యాలు వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రోహ్మ్ సంస్థ తెలిపింది. సాయంత్రం క్విటో నగరానికి సమీపంలో ఉన్న పానసోనిక్ కంపెనీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రికి ఆ కంపెనీ ప్రెసిడెంట్ నబి నకానీషి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల గురించి వివరించారు.
తాము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని భారతదేశంలోనూ ఒక ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. తెలంగాణలో పానసోనిక్ ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చని, ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని భట్టి హామీ ఇచ్చారు.
భట్టికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు
క్విటో నగరానికి సమీపంలో ఉన్న టోజీ బౌద్ధ ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులు గురువారం ఉదయం సందర్శించారు. వారికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ పర్యటనలో భట్టితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment