Hero Cycles
-
ఆన్లైన్లో హీరో సైకిల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైకిల్స్ తయారీలో ఉన్న హీరో సైకిల్స్ ఈ–కామర్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. కస్టమర్లు నేరుగా ఈ వెబ్సైట్ ద్వారా తమకు నచ్చిన సైకిల్ కోసం ఆర్డర్ చేయవచ్చు. తద్వారా ఉచితంగా ఇంటి వద్దనే ఉత్పత్తులను అందుకోవచ్చు. దేశవ్యాప్తంగా 3,000 పైచిలుకు డీలర్ల వ్యాపారం పెరుగుదలకు ఈ వేదిక దోహదం చేయనుందని కంపెనీ చెబుతోంది. ‘సైకిళ్లు, ఈ–సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని భావిస్తున్నాం. ఈ దిశగా వెబ్సైట్ సేవలు అందిస్తుంది’ అని హీరో సైకిల్స్ డైరెక్టర్ ఆదిత్య ముంజాల్ తెలిపారు. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
ఎలక్ట్రిక్ సైకిల్, కిలోమీటర్ ఖర్చు 7 పైసలేనా
ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా జోరందుకుంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు రోజుకో కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో లెక్ట్రో ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. బ్యాటరీ, మోటార్లను అమర్చడంతో పాటు నాలుగు రకాలైన పెడల్, పెడలెక్, త్రొటిల్, క్రూయిజ్ రైడింగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.25వేలు నిర్ణయించింది. ఈ సైకిల్ కు రెండు రకాలైన నార్మల్ మోడ్, ఎలక్ట్రిక్ మోడ్లు ఉన్నాయి. ఈ ఫీచర్స్‌తో కావాలనుకుంటే సైకిల్‌గా తొక్కొచ్చు లేదంటే ఎలక్ట్రిక్ డ్రైవింగ్ చెయ్యవచ్చు. సైకిల్ ఆఫ్, ఆన్‌ను బట్టి మీరు ఎంత వేగంతో వెళ్లాలనేది చెక్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ డెకల్స్ తో దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ వాటర్ ప్రూఫ్ డెకల్స్తో వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనైనా డ్రైవ్ చేయవచ్చు. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే..,ip67 లిథియం అయాన్ బ్యాటరీతో 3,4గంటల పాటు ఛార్జింగ్ పెట్టుకోచ్చు. 2ఏళ్లు వారెంటీగా ఉన్న ఈ సైకిళ్లను ఒక్కసారి ఛార్జింగ్ పెడిగే 25 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఈ సైకిళ్లపై కిలోమీటర్‌కి 7పైసలే ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. ఈ సైకిళ్ల గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. అందువల్ల వీటిని వాడేవారికి డ్రైవింగ్ లైసెన్స్, సైకిల్‌కి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటివి తప్పనిసరి కాదు. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలు, 22 నగరాల్లో 500 ఛార్జింగ్ పాయింట్లు -
హీరో ఈసైకిల్@ 49,000
న్యూఢిల్లీ, సాక్షి: హీరో సైకిల్స్ తాజాగా ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. F6i పేరుతో ప్రవేశపెట్టిన ఈ-సైకిల్ ఖరీదు రూ. 49,000. ఈసైకిళ్ల బ్రాండ్.. హీరో లెక్ట్రో ద్వారా విడుదలైన ఈ సైకిల్‌ను 2020 మొదట్లో ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలుత ఆవిష్కరించింది. F6i సైకిల్ రెండు కలర్ కాంబినేషన్స్‌లో అంటే.. రెడ్ విత్ బ్లాక్, యెల్లో విత్ బ్లాక్ లభిస్తోంది. F6i సైకిల్ వెనుక హబ్‌కు 36v/250w సామర్థ్యంగల మోటార్‌ను అమర్చారు. ఇందుకు అనుగుణంగా 36v లిథియమ్ అయాన్ బ్యాటరీను ఏర్పాటు చేశారు. విడదీసేందుకు వీలైన ఈ బ్యాటరీని 5-6 గంటల్లో పూర్తిగా చార్జింగ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. సైకిల్‌కు అమర్చిన 7 స్పీడ్ షిమానో ఆల్టస్ సహాయంతో గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని తెలియజేసింది. (2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ) అలాయ్ ఫ్రేమ్ అలాయ్ ఫ్రేమ్‌తో రూపొందిన F6i ఎలక్ట్రిక్ సైకిల్‌కు ముందు భాగంలో 60ఎంఎం ఫోర్క్‌లు, వెనుక డ్యూయల్ డిస్క్ బ్రేకులను అమర్చారు. ముందు, వెనుక భాగంలో లైట్లు, లెడ్ డిస్ప్లేలతో సైకిల్‌ను తీర్చిదిద్దారు. యూఎస్బీ చార్జింగ్, ఆర్ఎఫ్ఐడీ లాకింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ సౌకర్యాలను సైతం కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వృద్ధి బాటలో ఉన్న ఎలక్ట్రిక్ సైకిళ్ల విభాగంలో కొత్తగా ప్రవేశపెట్టిన F6i కీలక మోడల్ అని హీరో లెక్ట్రో సీఈవో అదిత్య ముంజాల్ పేర్కొన్నారు. దేశీయంగా ప్రీమియం సైకిళ్లకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా F6iఈ సైకిల్‌ను విడుదల చేసినట్లు తెలియజేశారు. కొద్ది రోజులుగా హైఎండ్ బైకింగ్ విభాగంలో భారీ డిమాండు నెలకొన్నదని, సరైన తరుణంలో ఆధునిక సాంకేతికలతో కూడిన సైకిల్‌ను ప్రవేశపెట్టామని ఈ సందర్భంగా తెలియజేశారు. (కొత్త ఏడాదిలో మనకూ మోడల్-3 కార్లు!) -
హీరో ఎలక్ట్రిక్ సైకిళ్లు జపాన్ కంపెనీలతో ఒప్పందాలు
న్యూఢిల్లీ: హీరో సైకిల్స్ కంపెనీ ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ కోసం జపాన్‌కు చెందిన రెండు కంపెనీలతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన యమహా మోటార్ కంపెనీ, మిత్సు అండ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని హీరో సైకిల్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ, టెక్నాలజీ, మార్కెటింగ్ కోసం ఈ రెండు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు హీరో మోటార్స్ కంపెనీ (హెచ్‌ఎమ్‌సీ) చైర్మన్ పంకజ్ ఎమ్ ముంజాల్ వెల్లడించారు. ఈ భాగస్వామ్యం నుంచి తొలి ఉత్పత్తిగా హీరో బ్రాండ్ కింద హై ఎండ్ ఎలక్ట్రిక్ మౌంటెన్ బైక్‌ను (ఈ–ఎమ్‌టీబీ) అందించనున్నామని వివరించారు. లూథియానాలో సైకిల్ వ్యాలీ... హెచ్‌ఎమ్‌సీ గ్రూప్‌లో ప్రధాన కంపెనీ అయిన హీరో సైకిల్స్ లూధియానాలో సైకిల్ వ్యాలీని ఏర్పాటు చేస్తామని ఇటీవలే ప్రతిపాదించింది. సైకిళ్ల పరిశ్రమకు కావలసిన అన్ని వస్తువులను, సేవలను సరఫరా చేసే లక్ష్యంతో ఈ సైకిల్ వ్యాలీ ప్రాజెక్ట్‌ను ఈ కంపెనీ అందుబాటులోకి తేనుంది. ఈ ప్రాజెక్ట్‌కు కీలక పెట్టుబడిదారుగా హీరో సైకిల్స్ వ్యవహరించనుంది. -
గిఫ్ట్ అందుకున్న ‘అను’
సాక్షి, చెన్నై: వర్షాలు, వరదలు విపత్తు ఈ పదాలకు అర్థాలు తెలియకపోయినా, తన తోటి చిన్నారుల కష్టాన్ని చూసి చలించిపోయిన తమిళనాడు అనుప్రియ (9) దానగుణంతో తన కోరికను నెరవేర్చుకుంది. అలాగే అనుప్రియకు కొత్త సైకిల్ ఇస్తామని ప్రకటించిన హీరో సైకిల్స్ కూడా తన మాటను నిలబెట్టుకుంది. మంగళవారం అనుప్రియను కలిసిన సంస్థ ఎండీ, ఛైర్మన్ పంకజ్ ఎం ముంజాల్ బ్రాండ్ న్యూ సైకిల్‌ను బహూకరించారు. ఈ సందర్బంగా అనుప్రియతో మాట్లాడటం, ఆమె తల్లిని కలవడం సంతోషంగా ఉందని, జీవితాంతం అనుప్రియ ఇదే వ్యక్తిత్వాన్ని కలిగి వుండాలంటూ ఆయన ట్వీట్ చేశారు. కేరళ వరదల్లో తన తోటి చిన్నారుల కష్టాలను టీవీలో చూసి కేవలం బాధపడి ఊరుకోకుండా, తనవంతు సాయం చేసేందుకు పెద్ద మనసు చేసుకుంది. యతద్వారా తమిళనాడు విల్లుపురానికి చెందిన అనుప్రియ(9) వార్తల్లో నిలిచింది. సైకిల్ కొనుక్కునేందుకు ఐదు పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును వరద బాధితులకు విరాళమిచ్చి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేరళ వరద విరాళాల ట్రాన్సాక్షన్స్ ద్వారా లక్షలాదిమంది యూజర్లను సాధిస్తూ, కోట్లాది రూపాయల టర్నోవర్‌ను సొంతం చేసుకుంటున్న పేటీఎం సీఈవో విజయ్‌శేఖర్ శర్మకంటే ఈ చిన్నారి చాలా నయం. అనుప్రియకు సాల్యూట్స్ అంటూ నెటిజన్లు చిన్నారిని అభినందించారు. అటు అనుప్రియ ఔదార్యానికి స్పందించిన హీరో మోటార్ సైకిల్స్ సంవత్సరానికి ఒక బైక్ (కిడ్స్) అందిస్తామని ట్విటర్ ద్వారా వెల్లడించింన సంగతి తెలిసిందే. Thanks to you dear Anupriya and pleasure to talk to your mom. I had read every act of kindness has a ripple effect. Through you I experienced, “Some act of kindness may bring an avalanche “. You are truly blessed and keep up this character of strength that you carry. pic.twitter.com/Ab8plZnKHM — Pankaj M Munjal (@PankajMMunjal) August 20, 2018 -
వైకింగ్ బ్రాండ్ మళ్లీ తెస్తున్న హీరో సైకిల్స్
న్యూఢిల్లీ: ప్రపంచపు అతిపెద్ద సైకిళ్ల తయారీ కంపెనీ ‘హీరో సైకిల్స్’ తాజాగా బ్రిటన్‌కు చెందిన 110 ఏళ్ల చరిత్ర కలిగిన మోస్ట్ పాపులర్ సైకిల్ బ్రాండ్ ‘వైకింగ్’ను మళ్లీ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వైకింగ్ బ్రాండ్‌ను కలిగిన అవోసెట్ సైకిల్స్‌ను 2015లో హీరో సైకిల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల తర్వాత యూకేలోని సైకిల్ షాప్స్‌లో వైకింగ్ బ్రాండ్ సైకిళ్లు అందుబాటులోకి రానున్నాయి. ‘‘యాజమాన్యం మార్పు సహా పలు అంశాల కారణంగా దశాబ్దాల నుంచి వైకింగ్ బ్రాండ్ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. హీరో సైకిల్స్ మా సంస్థను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి యూకే మార్కెట్‌పై ప్రభావం చూపించాలని ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు అవకాశం వచ్చింది’’ అని ఎవోసెట్ సీఈవో శ్రీరామ్ వెంకటేశ్వరన్ తెలిపారు. -
హీరో సైకిల్స్ ‘లెక్ట్రో’ బ్రాండ్
హైదరాబాద్: సైకిళ్ల తయారీ దిగ్గజం హీరో సైకిల్స్ భారత మార్కెట్లో లెక్ట్రో బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ నుంచి ఇది తొలి యూరోపియన్ బ్రాండ్ కావడం విశేషం. ఎలక్ట్రిక్ పెడల్ అసిస్టెడ్ సైకిళ్ల (ఈపీఏసీ) విభాగంలో లెక్ట్రో సంచలనం సృష్టిస్తుందని కంపెనీ తెలిపింది. హీరో ప్రస్తుతం నాలుగు మోడళ్లను విడుదల చేసింది. త్వరలోనే ఈ సంఖ్యను 20కి చేర్చనుంది. హైదరాబాద్‌లోనూ ఇవి లభిస్తాయి. భారత్‌లో ఈపీఏసీ విభాగం ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోందని హీరో సైకిల్స్ సీఎండీ పంకజ్ ముంజాల్ తెలిపారు. పర్యావరణ అనుకూల సైకిళ్ల విక్రయాలకు దేశంలో మంచి భవిష్యత్ ఉందన్నారు. -
హీరో.. 4 కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లు
• ధరలు రూ.42,000-రూ.83,000 • 4 గంటలు రీచార్జ్ 50 కి.మీ. ప్రయాణం న్యూఢిల్లీ: హీరో సైకిల్స్ కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ సెకిళ్లను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఎలక్ట్రిక్ పెడల్ అసిస్టెడ్ టెక్నాలజీ సైకిల్(ఈప్యాక్)ను లెక్ట్రో బ్రాండ్ కింద అందిస్తున్నామని హీరో సైకిల్స్ తెలిపింది. ప్రస్తుతం నాలుగు మోడళ్లను అందుబాటులోకి తెచ్చామని, వీటి ధరలు రూ.42,000 నుంచి రూ.83,000 రేంజ్లో ఉన్నాయని కంపెనీ సీఎండీ పంకజ్ ముంజాల్ చెప్పారు. ఈ మోడల్ సైకిళ్లలో బ్యాటరీని విడిగా బయటకు తీసుకోవచ్చని, నాలుగు గంటలు రీచార్జ్ చేస్తే 50 కిమీ దూరం ప్రయాణించవచ్చని వివరించారు. ఈ సైకిళ్లను మొదటగా బెంగళూరు, పుణే, ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ సైకిళ్లలో త్వరలో 20 మోడళ్లను అందిస్తామని వివరించారు. -
హీరో సైకిల్స్ చేతికి బీఎస్ హెచ్ వెంచర్స్
శ్రీలంక కంపెనీలో 60% వాటా కొనుగోలు న్యూఢిల్లీ: శ్రీలంకకు చెందిన బీఎస్‌హెచ్ వెంచర్స్‌లో 60 శాతం వాటాను హీరో సైకిల్స్ కొనుగోలు చేసింది. దీంతో హీరో సైకిల్స్ కంపెనీ ఆరు నెలల్లో మూడు కంపెనీలను కొనుగోలు చేసినట్లయింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు, అంతర్జాతీయంగా తమ స్థానాన్ని మరింత పటి ష్టం చేసుకునేందుకుగాను బీఎస్‌హెచ్ వెంచర్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేశామని హీరో సైకిల్స్ తెలిపింది. ఈ శ్రీలంక సైకిల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నామని హీరో సైకిల్స్ సీఎండీ పంకజ్ ముంజాల్ చెప్పారు. ఇంతకు ముందు హీరో సైకిల్స్ కంపెనీ ఇంగ్లాండ్‌కు చెందిన అవోసెట్ స్పోర్ట్స్, ఫైర్ఫాక్స్ బైక్స్ కంపెనీలను కొనుగోలు చేసింది. అవొసెట్ స్పోర్ట్స్ కొనుగోలుతో యూరప్ సైకిల్ మాస్ సెగ్మంట్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఫైర్ఫాక్స్ బైక్స్ కంపెనీ కొనుగోలు- భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం సైకిల్ సెగ్మెంట్లో హీరో స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని అంచనా. -
హీరో సైకిల్స్ తొలి విదేశీ టేకోవర్
న్యూఢిల్లీ : ప్రముఖ సైకిళ్ల తయారీ కంపెనీ హీరో సైకిల్స్ యూకేకు చెందిన అవోసెట్ స్పోర్ట్స్ కంపెనీలో అధిక వాటాను కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. ఈ కొనుగోలు ద్వారా కంపెనీ యూరప్ సైకిల్ మార్కెట్లో అడుగుపెట్టాలని భావిస్తోంది.