హీరో ఈసైకిల్‌@ 49,000 | Hero lectro released premium Ecycle @49,000 | Sakshi
Sakshi News home page

హీరో ఈసైకిల్‌@ 49,000

Published Sat, Dec 26 2020 3:38 PM | Last Updated on Sat, Dec 26 2020 7:47 PM

Hero lectro released premium Ecycle @49,000 - Sakshi

న్యూఢిల్లీ, సాక్షి: హీరో సైకిల్స్‌ తాజాగా ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. F6i పేరుతో ప్రవేశపెట్టిన ఈ-సైకిల్‌ ఖరీదు రూ. 49,000. ఈసైకిళ్ల బ్రాండ్‌.. హీరో లెక్ట్రో ద్వారా విడుదలైన ఈ సైకిల్‌ను 2020 మొదట్లో ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలుత ఆవిష్కరించింది. F6i సైకిల్‌ రెండు కలర్‌ కాంబినేషన్స్‌లో అంటే.. రెడ్‌ విత్‌ బ్లాక్‌, యెల్లో విత్‌ బ్లాక్‌ లభిస్తోంది. F6i సైకిల్‌ వెనుక హబ్‌కు 36v/250w సామర్థ్యంగల మోటార్‌ను అమర్చారు. ఇందుకు అనుగుణంగా 36v లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీను ఏర్పాటు చేశారు. విడదీసేందుకు వీలైన ఈ బ్యాటరీని 5-6 గంటల్లో పూర్తిగా చార్జింగ్‌ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. సైకిల్‌కు అమర్చిన 7 స్పీడ్‌ షిమానో ఆల్టస్ సహాయంతో గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని తెలియజేసింది. (2021లో రియల్‌మీ కీలక ఫోన్‌- కేవోఐ)

అలాయ్‌ ఫ్రేమ్‌
అలాయ్‌ ఫ్రేమ్‌తో రూపొందిన F6i ఎలక్ట్రిక్‌ సైకిల్‌కు ముందు భాగంలో 60ఎంఎం ఫోర్క్‌లు, వెనుక డ్యూయల్‌ డిస్క్‌ బ్రేకులను అమర్చారు. ముందు, వెనుక భాగంలో లైట్లు, లెడ్‌ డిస్‌ప్లేలతో సైకిల్‌ను తీర్చిదిద్దారు. యూఎస్‌బీ చార్జింగ్‌, ఆర్‌ఎఫ్‌ఐడీ లాకింగ్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ సౌకర్యాలను సైతం కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వృద్ధి బాటలో ఉన్న ఎలక్ట్రిక్‌ సైకిళ్ల విభాగంలో కొత్తగా ప్రవేశపెట్టిన F6i కీలక మోడల్‌ అని హీరో లెక్ట్రో సీఈవో అదిత్య ముంజాల్‌ పేర్కొన్నారు. దేశీయంగా ప్రీమియం సైకిళ్లకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా  F6iఈ సైకిల్‌ను విడుదల చేసినట్లు తెలియజేశారు. కొద్ది రోజులుగా హైఎండ్‌ బైకింగ్‌ విభాగంలో భారీ డిమాండు నెలకొన్నదని, సరైన తరుణంలో ఆధునిక సాంకేతికలతో కూడిన సైకిల్‌ను ప్రవేశపెట్టామని ఈ సందర్భంగా తెలియజేశారు. (కొత్త ఏడాదిలో మనకూ మోడల్‌-3 కార్లు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement