e bikes
-
మడత పెట్టుకునేలా.. ఎలక్ట్రిక్ బైక్‌లు వచ్చేస్తున్నాయ్
-
AP: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ–స్కూటర్లు అందించనున్న ప్రభుత్వం
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు. నానాటికీ పెరుగుతున్న పెట్రోలు ధరలతో ఈ సామాన్య, మధ్య తరగతి వేతన జీవులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు వాహన కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ–స్కూటర్లు అందించే దిశగా అడుగులు వేస్తోంది. తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు వీటిని అందించనుంది. కొనుగోలు చేసిన ఈ–స్కూటర్లకు ఒకేసారి కాకుండా 60 నెలల పాటు వాయిదాల పద్ధతిలో (ఈఎంఐ) డబ్బులు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలో పని చేసే ఉద్యోగులు సైతం ఈ–స్కూటర్లు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఆ సంస్థ నిర్వాహకుడు (మేనేజర్, సీఈఓ తదితర) సదరు ఉద్యోగి నుంచి ప్రతి నెలా ఈఎంఐ చెల్లించేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఇందుకు అవసరమైన ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్) అధికారులు సిద్ధం చేశారు. ఈ–స్కూటర్లు అందుబాటులోకి వస్తే.. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకోగానే 3 గంటల పాటు చార్జింగ్ పెడితే చాలు.. రోజంతా ఈ–స్కూటర్ నడుపుకోవచ్చు. పైగా పెట్రోలు భారం కూడా తప్పుతుంది. 10 వేలకు పైగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే సుమారు 10 వేలకు పైగా ఈ–స్కూటర్లు, ఈ–కార్లు ఉన్నాయి. వీటి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్‌క్యాప్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒకసారి కారుకు రీచార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణించే వీలుంటుంది. ఇప్పటి వరకూ కారుకు 6 గంటల పాటు చార్జ్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం 45 నిమిషాల్లోనే చార్జ్ చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే రాజమహేంద్రవరంలో టాటా సంస్థ రెండు చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చింది. మిగతా వాటి ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఉద్యోగులకు ప్రాధాన్యం విద్యుత్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వీటిని తొలుత ప్రభుత్వోద్యోగులకు ఇస్తాం. అనంతరం నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు ఉద్యోగులకు విక్రయిస్తాం. ఈ వాహనాల ద్వారా వాయు, శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టవచ్చు. త్వరలో జిల్లాకు వాహనాలు వచ్చే అవకాశం ఉంది. వివరాలకు నెడ్కాప్ డీఎంను 9000 550 972, డీఓను 99 899 49 144 నంబర్లలో సంప్రదించవచ్చు. – జి.సత్యనారాయణ, జిల్లా మేనేజర్, నెడ్‌క్యాప్ -
కాలిపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..కారణం ఏంటంటే?!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల బ్యాటరీలతో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఉదంతాల నేపథ్యంలో ఇలాంటి వాటిని నివారించేందుకు కెనడాకు చెందిన స్టార్టప్ సంస్థ మేకర్మ్యాక్స్ కసరత్తు చేస్తోంది. బ్యాటరీల ప్రమాదాలను.. ఫలితంగా ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించే దిశగా టెస్టింగ్ పరికరాలు, అల్గోరిథమ్‌లు రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఎం201 పరికరంతో బ్యాటరీ వాస్తవ ప్రమాణాలను .. దాని ప్రస్తుత పనితీరును విశ్లేషించి చూడవచ్చని, వ్యత్యాసాలేమైనా ఉంటే సత్వరం గుర్తించవచ్చని పేర్కొంది. తద్వారా అగ్నిప్రమాదాల ఉదంతాలను నివారించవచ్చని సంస్థ వ్యవస్థాపకుడు అక్షయ్ తెలిపారు. 100 శాతం సురక్షితమైన బ్యాటరీలను తయారు చేయాలన్నది అందరి ఆకాంక్ష అయినప్పటికీ కోటిలో ఏదో ఒక బ్యాటరీలో తప్పకుండా సమస్యలు తలెత్తవచ్చని ఆయన వివరించారు. "భారత్‌లో ద్విచక్ర వాహనాల్లో బ్యాటరీలను ఉంచే లోహపు బాక్సుల్లో తగినంత భద్రతా ఫీచర్లు ఉండటం లేదన్నారు. బ్యాటరీ నుండి వెలువడే వాయువులు తప్పించుకుపోయే మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అక్షయ్ చెప్పారు." ఈ నేపథ్యంలో ఒత్తిడిని విడుదల చేయగలిగే వాల్వ్‌లు గల మూడు లేదా అంతకు మించి కంపార్ట్మెంట్లలో బ్యాటరీలను ఉంచవచ్చని పేర్కొన్నారు. చదవండి: మంటల్లో కాలిపోతున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈవీ రంగంపై నీలి నీడలు! -
ఆడమ్స్ ఈ బైక్ స్టాకిస్టుగా కేఆర్ ఫుడ్స్
హైదరాబాద్: ఆడమ్స్ ఈ బైక్ సూపర్ స్టాకిస్టుగా కేఆర్ ఫుడ్స్ సంస్థ వ్యవహరించనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డీలర్ల సమావేశంలో కేఆర్ఫుడ్స్ సంస్థ ఎండీ రాజేందర్ కుమార్ కొత్తపల్లి మాట్లాడుతూ... ‘‘తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆడమ్స్ ఈ బైక్స్ సూపర్ స్టాకిస్టుగా బాధ్యతలు తీసుకున్నాము. మెదక్ జిల్లాలో తుప్రాన్ మండల కేంద్రంగా 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించాము. ఈ ప్లాంట్ నెలకు 4 వేల ఈ బైకులను ఉత్పత్తి చేయగలదు. రోబోటిక్, ఆర్టిఫిషియల్ సాంకేతికతను సమకూర్చుకుంటూ ప్రస్తుత తయారీ సామర్థ్యాన్ని పదివేల యూనిట్లకు పెంచుతాము. ఇదే ప్లాంట్లులో అధిక హార్స్ పవర్ కలిగిన ట్రాక్టర్ల రూపకల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము’’ అని తెలిపారు. -
పాత సైకిల్ ఇస్తే కొత్త ఈ-బైక్‌ను సొంతం చేసుకోవచ్చును..!
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఊపందుకుంది. అధిక ఇంధన ధరల నుంచి ఉపశమనం పొందేందుకు వాహనదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకే జై కొడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ప్రభుత్వాలే కాకుండా భారత్‌లో ఆయా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు కూడా కొనుగోలుదారులకు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కాగా వెస్ట్‌బెంగాల్‌కు చెందిన గోజీరో మొబిలిటీ(GoZero Mobility) సరికొత్త ఆఫర్‌ను అందించనుంది. పాత సైకిల్‌ను ఇస్తే..! ఈ-బైక్స్‌పై అమ్మకాలను మరింత పెంచేందుకుగాను గోజీరో మొబిలిటీ "స్విచ్" అనే ఒక ఎక్సేచేంజ్ ప్రమోషన్‌ను మొదలు పెట్టింది. ఈ ప్రచారంలో భాగంగా కస్టమర్స్ ఏదైనా సంప్రదాయ సైకిల్‌తో కంపెనీకి చెందని ఎలక్ట్రిక్ ఈ-బైక్‌తో ఎక్సేచేంజ్ చేసుకోవచ్చునని గోజీరో పేర్కొంది. "స్విచ్" ప్రమోషన్స్‌లో భాగంగా...రూ. 7,000 నుంచి రూ. 25 వేల విలువైన ఏదైనా బ్రాండ్‌కు చెందిన సైకిల్‌తో కొత్త ఈ-బైక్‌ను సొంతం చేసుకోవచ్చునని తెలిపింది. ఈ ఆఫర్ 2022 జనవరి 10 నుంచి 2022 ఏప్రిల్ 9 వరకు చెల్లుబాటులో ఉండనుంది. ఎక్సేచేంజ్‌తో సేకరించిన సైకిళ్లను తిరిగి ఈ-బైక్స్‌గా మార్చుతామని కంపెనీ సహావ్యవస్థాపకుడు సుమిత్ రంజన్ అన్నారు. గోజీరో స్విచ్ ప్రచారంలో ఎలక్ట్రిక్ వన్, సారధి ట్రేడర్స్, గ్రీవ్స్ ఈవీ ఆటోమార్ట్,ఆర్యేంద్ర మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. వీరి భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా గోజీరో ఈ-బైక్ అమ్మకాలను జరుపుతోంది. GoZero X-సిరీస్ ఈ-బైక్స్ ధర రూ. 34,999 నుంచి రూ. 45,999గా ఉండనున్నాయి. చదవండి: టయోటా హైబ్రిడ్ కార్ సరికొత్తగా..! పెట్రోల్‌తోనే కాదు కరెంటుతో కూడా నడుస్తోంది..! ఈ కారు..! -
ప్రపంచంలోనే చిన్న స్కూటర్.. ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం !
కొంగొత్త ఆవిష్కరణలకు ఎప్పుడు ముందుండే జపాన్ శాస్త్రవేత్తలు మరోసారి అబ్బురపరిచే ఆవిష్కరణకు తెర లేపారు. ఇప్పటి వరకు ఎవరూ కనీ వినీ ఎరుగని కాన్సెప్టుతో ఈ బైకును రెడీ చేశారు. ఈ స్కూటర్ల హవా వందేళ్ల కిందట ప్రధాన ఇంధనం అంటే బొగ్గు మాత్రమే. ఆ తర్వాత పెట్రోలు డీజిల్‌లు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. కానీ కాలుష్యానికి కారణమవుత్ను బొగ్గు, పెట్రోల వాడకాన్ని ప్రపంచ వ్యాప్తంగా తగ్గించాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయంగా సోలార్, హైడ్రోజన్, ఎలక్ట్రిక్ ఎనర్జీ వైపు చూస్తున్నారు. ఆ కోవలో ఈ బైకులు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ జపాన్ శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త రకం బైకు మాత్రం అందరి చేత ఔరా అనిపిస్తోంది. టోక్యో యూనివర్సిటీలో జపాన్‌లో యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకి చెందిన శాస్త్రవేత్తలు ఇన్‌ఫ్లాటబుల్ స్కూటర్ కాన్సెప్టుతో కొత్త రకం రవాణా సాధానం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రోటోటైప్ వెహికల్‌కి పోమో అని పేరు పెట్టారు. దీని ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. A great invention from Mercari R4D. Would you ride this?! Comment below. *This product is not designed by us #InventIndia #DailyDoseOfInnovation #Poimo #PortableScooter #ElectricScooter #Technology #Creativity #Invention #ProductDesign #DesignThinking #OutOfTheBox pic.twitter.com/Me7v1veUE4 — InventIndia Innovations Pvt. Ltd. (@Invent1ndia) June 7, 2020 ఫీచర్లు - సాధారణ బైకుల తయారీలో ఉపయోగించే మెటల్స్ కాకుండా థెర్మోప్లాస్టిక్ పాలీథరిన్ రబ్బర్‌తో బైకు బాడీని తయారు చేశారు. ఫలితంగా బాడీ తక్కువ బరువుతో పాటు మడత పెట్టేందుకు వీలుగా ఉంటుంది. - గాలి మిషన్‌తో పంపు కొడితే రెండుమూడు నిమిషాల్లో బైకు బాడీ రెడీ అవుతుంది. - ఈ బైకు ముందు, వెనకాల భాగంలో రెండు జతల వంతున ఫోర్‌వీల్స్ ఉంటాయి. ఇందులోనే మోటార్ కమ్ బ్యాటరీ ఉంటుంది. హ్యాండిల్ బార్ దగ్గర కంట్రోల్స్ ఉంటాయి. - కష్టమర్ల అవసరాలకు తగ్గట్టు ఈ బైకును విభిన్న డిజైన్లలో తయారు చేసే వీలుంది - ఈ బైకు బరువు గరిష్టంగా 5.5 కేజీలు ఉంటుంది. బైకును మడత పెట్టి బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. - ఒక్కసారి బ్యాటరినీ ఛార్జ్ చేస్తే 90 నిమిషాల పాటు నడుస్తుంది. గరిష్ట వేగం గంటికి 15 కి.మీ. సింగిల్ ఛార్జ్‌తో సుమారు 20 కి.మీ ప్రయాణం చేయగలదు. - పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, పర్సనల్ ట్రాన్స్‌పోర్టు స్థాయిలో సేవలు అందివ్వలేకపోయినా లాస్ట్‌మైల్ అవసరాలు తీర్చగలదు. అంటే రైల్వే స్టేషన్ నుంచి ఆఫీస్ వరకు, గ్రామాల్లో రోడ్ పాయింట్ నుంచి ఇంటి వరకు, ఇంటి దగ్గరి నుంచి ఫార్మ్ వరకు ఇలా ప్రధాన రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని చోట పోమో బైకు ఎంతగానో ఉపకరిస్తుందని జపాన్ శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు. - ఏడాది కిందట ఈ పోమోబైకు ప్రోటోటైప్కి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ పోమో ఈబైకును ఎప్పుడు మార్కెట్లోకి రావచ్చు. పూర్తి స్థాయి ఫీచర్లపై టోక్యో యూనివర్సిటీ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: గప్‘చిప్’గా చెప్పేస్తుంది -
BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..!
మ్యునీచ్: జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మోటార్ షోలో బీఎమ్‌డబ్ల్యూ తన కంపెనీ నుంచి వచ్చే రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రదర్శనకు ఉంచింది. హైస్పీడ్ ఎలక్ట్రిక్ సైకిల్, లో స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌లను బీఎమ్‌డబ్ల్యూ ఐఏఏ-2021 మొబిలిటీ షోలో టీజ్ చేసింది. ఈ షోలో భాగంగా బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ సీఈ-02 ఎలక్ట్రిక్ బైక్‌ను, బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ ఏఎమ్బీవై ఎలక్ట్రిక్ సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచింది చదవండి: బీఎమ్‌డబ్ల్యూ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్..! చూస్తే వావ్ అనాల్సిందే..! రేంజ్లో రారాజు..! బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ AMBYఎలక్ట్రిక్ సైకిల్ ఫీచర్స్ తెలిస్తే ఔరా అనాల్సిందే..! ఎలక్ట్రిక్ వాహన రంగంలో బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ AMBYసైకిల్ సంచలానాన్ని నమోదు చేయనుంది. బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ AMBYసైకిల్లో అధిక శక్తి గల మోటార్, అత్యధిక సామర్థ్యం ఉన్న 2000Wh బ్యాటరీని ఏర్పాటుచేసింది. బ్యాటరీ ఏర్పాటుచేయడంతో ఒక్క సారి చార్జ్ చేస్తే నార్మల్ పవర్ మోడ్‌లో ఈ సైకిల్ సుమారు 300 కిమీ దూరం మేర ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ-సైకిల్‌ను స్మార్ట్‌ఫోన్ యాప్నుపయోగించి కూడా ఆపరేట్ చేయవచ్చును. ఈ సైకిల్ కనిష్టంగా గంటకు 25 వేగంతో, గరిష్టంగా 60 కిమీ వేగంతో ప్రయాణించనుంది. ఈ బైక్‌లో సరికొత్త జియోఫెన్సింగ్ మోడ్‌ను ఏర్పాటుచేశారు. ఈ మోడ్‌తో బైక్ ఆటోమోటిక్గా స్పీడ్‌ను నియంత్రిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా ఈ సైకిళ్లను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు బీఎమ్‌డబ్ల్యూ పేర్కొంది. చదవండి: Mercedes EQE Electric Sedan: టెస్లాకు పోటీగా మెర్సిడిజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..! -
హీరో ఈసైకిల్@ 49,000
న్యూఢిల్లీ, సాక్షి: హీరో సైకిల్స్ తాజాగా ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. F6i పేరుతో ప్రవేశపెట్టిన ఈ-సైకిల్ ఖరీదు రూ. 49,000. ఈసైకిళ్ల బ్రాండ్.. హీరో లెక్ట్రో ద్వారా విడుదలైన ఈ సైకిల్‌ను 2020 మొదట్లో ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలుత ఆవిష్కరించింది. F6i సైకిల్ రెండు కలర్ కాంబినేషన్స్‌లో అంటే.. రెడ్ విత్ బ్లాక్, యెల్లో విత్ బ్లాక్ లభిస్తోంది. F6i సైకిల్ వెనుక హబ్‌కు 36v/250w సామర్థ్యంగల మోటార్‌ను అమర్చారు. ఇందుకు అనుగుణంగా 36v లిథియమ్ అయాన్ బ్యాటరీను ఏర్పాటు చేశారు. విడదీసేందుకు వీలైన ఈ బ్యాటరీని 5-6 గంటల్లో పూర్తిగా చార్జింగ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. సైకిల్‌కు అమర్చిన 7 స్పీడ్ షిమానో ఆల్టస్ సహాయంతో గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని తెలియజేసింది. (2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ) అలాయ్ ఫ్రేమ్ అలాయ్ ఫ్రేమ్‌తో రూపొందిన F6i ఎలక్ట్రిక్ సైకిల్‌కు ముందు భాగంలో 60ఎంఎం ఫోర్క్‌లు, వెనుక డ్యూయల్ డిస్క్ బ్రేకులను అమర్చారు. ముందు, వెనుక భాగంలో లైట్లు, లెడ్ డిస్ప్లేలతో సైకిల్‌ను తీర్చిదిద్దారు. యూఎస్బీ చార్జింగ్, ఆర్ఎఫ్ఐడీ లాకింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ సౌకర్యాలను సైతం కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వృద్ధి బాటలో ఉన్న ఎలక్ట్రిక్ సైకిళ్ల విభాగంలో కొత్తగా ప్రవేశపెట్టిన F6i కీలక మోడల్ అని హీరో లెక్ట్రో సీఈవో అదిత్య ముంజాల్ పేర్కొన్నారు. దేశీయంగా ప్రీమియం సైకిళ్లకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా F6iఈ సైకిల్‌ను విడుదల చేసినట్లు తెలియజేశారు. కొద్ది రోజులుగా హైఎండ్ బైకింగ్ విభాగంలో భారీ డిమాండు నెలకొన్నదని, సరైన తరుణంలో ఆధునిక సాంకేతికలతో కూడిన సైకిల్‌ను ప్రవేశపెట్టామని ఈ సందర్భంగా తెలియజేశారు. (కొత్త ఏడాదిలో మనకూ మోడల్-3 కార్లు!) -
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ...
సంగారెడ్డి టౌన్ : ఐఐటీ హైదరాబాద్ స్టార్టప్ సంస్థ ‘ప్యూర్ ఈవీ’మరో ఈ–బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. బ్యాటరీతో నడిచే సరికొత్త ద్విచక్ర వాహనాన్ని డిసెంబర్ రెండో వారంలో విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హై– స్పీడ్ లాంగ్–రేంజ్ మోడల్‌తో మార్కెట్లోకి రానున్న ఈ వాహనానికి ‘ఈ–ట్రాన్స్ నియో’గా నామకరణం చేశారు. కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగం పుంజుకోవడం దీని ప్రత్యేకత. ఈ బైక్‌కు బిగించిన 2,500 డబ్ల్యూహెచ్ పేటెంట్ బ్యాటరీ ‘ఎకో మోడ్’లో ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. వేగంగా పికప్ అందుకునేలా ‘ఈ–ట్రాన్స్ నియో’ను రూపొంచినట్లు ‘ప్యూర్ ఈవీ’సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ వడేరా తెలిపారు. యువతను ఆకట్టుకునే విధంగా బాడీ తయారు చేశామన్నారు. -
పోలీసు కేసులు ఉండకూడదని..
పార్వతీపురం: ఈ కుర్రాడి పేరు గెంబలి గౌతమ్ విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన వాసు, లక్ష్మి దంపతుల కుమారుడు. చదివింది కంప్యూటర్ సైన్స్. కానీ.. మెకానిజంలో ప్రయోగాలు చేస్తున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచి్చనపుడు ఏటా ఏదో ఒకటి చేయడం గౌతమ్ హాబీ. ఈ ఏడాది తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటలపాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. ఇలా చేశాడు.. వాహనం తయారీకి గౌతమ్ పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టం, హ్యాండ్ బ్రేక్ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయాసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్ లైట్ అమర్చాడు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా ముగిసిందని గౌతమ్ చెబుతున్నాడు. ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేసిన గౌతమ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని వాషన్ కంపెనీలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకూ నాలుగు బైక్‌లు, ఒక కారు తయారు చేశాడు. మెజీషియన్‌గా పలు వేదికలపై ప్రదర్శనలిచ్చి మెప్పించాడు. పోలీసు కేసులు ఉండకూడదనే.. బైక్‌పై వెళుతుంటే పోలీసులు అడ్డుకుని.. లైసెన్సు ఉందా, హెల్మెట్ ఉందా, సీ బుక్ ఉందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండేవారు. అవి లేకపోతే కేసులు రాసేవారు. ఇలా పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఫైన్లు కట్టడం ఇష్టం లేక ఏం చేయాలా అని ఆలోచించి ఈ–బైక్ తయారు చేశా. ఇది సైకిల్ మాదిరిగా ఉంటుంది. బరువు తక్కువ. హెల్మెట్, సీబుక్ అక్కరలేదు. డీజిల్, పెట్రోల్‌తో పనిలేదు. దీనివల్ల కాలుష్యం కూడా ఉండదు. ప్రభుత్వం సహకారం అందిస్తే ఇటువంటి వాటిని తయారు చేస్తాను. పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నాను. – గెంబలి గౌతమ్ ,పార్వతీపురం -
ఈ వాహనంపై రయ్ రయ్
సనత్‌నగర్: ‘మెట్రో’లో నగర అందాలను వీక్షిస్తూ గగన విహార అనుభూతులను పొందిన అనంతరం గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ–కార్లు, ఈ– బైక్‌లు సిద్ధంగా ఉంటున్నాయి. విధులు ముగించుకుని మళ్లీ మెట్రోస్టేషన్ వద్ద వాహనాన్ని వదిలి అదే మెట్రోలో సాగిపోయే వెసులుబాటు ప్రస్తుతం మెట్రో ప్రయాణికులకు ఊరటనిస్తోంది. ఈ కార్లు, బైక్‌లు, సైకిళ్లు అమీర్‌పేటతో పాటు మెట్రో రాకపోకలు జరుగుతున్న నాగోలు– అమీర్‌పేట, అమీర్‌పేట– మియాపూర్ మార్గాల్లోని సగానికి పైగా స్టేషన్లలో అందుబాటులోకి వచ్చాయి. అద్దె కూడా చాలా తక్కువ ఉండడంతో ఆయా వాహనాలకు ప్రయాణికుల నుంచి భారీగానే స్పందన వస్తోంది. అమీర్‌పేటలో ‘ఈ– బైక్స్’ అమీర్‌పేట మెట్రోస్టేషన్ కేంద్రంగా ఈ– బైక్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆగస్ట్ 15 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కి.మీటర్‌కు రూ.4 మేర చార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. రాత్రివేళల్లో రూ.1 చెల్లించి వాహనాలను తీసుకువెళ్లవచ్చు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మున్ముందు మరిన్ని మెట్రోస్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్డీఎస్ ఎకో మోటార్స్ డైరెక్టర్ దీపికారెడ్డి తెలిపారు. ‘డ్రైవ్‌జీ’ సేవలు.. బాలానగర్, కూకట్పల్లి, అమీర్‌పేట మెట్రోస్టేషన్లలో ప్రస్తుతం ‘డ్రైవ్‌జీ’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 125 యాక్టివా వాహనాలను ‘డ్రై వ్‌జీ’ సంస్థ మెట్రోస్టేషన్లలో అందుబాటులో ఉంచింది. మూడు స్టేషన్లలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగుతుండగా, మరో వారం రోజుల్లో మెట్టుగూడ, తార్నాక, ప్రకాష్‌నగర్, జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్లలో డ్రై వ్‌జీ యాక్టివా వాహనాలను మెట్రో ప్రయాణికుల ముంగిటకు తీసుకురాన్నట్లు సంస్థ నిర్వాహకుడు దిలీప్ తెలిపారు. కి.మీటర్‌కు రూ.3 చొప్పున, గంటకు అద్దె రూ.6 చొప్పున వసూలు చేస్తున్నారు. డ్రైవ్‌జీ వాహనాలను బుక్ చేయాలంటే ‘డ్రైవ్ జీ’ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మియాపూర్మెట్రోస్టేషన్ వద్ద ‘ఈ– కార్స్’ మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద ‘జూమ్‌కార్’ సంస్థ 25 ఎలక్ట్రికల్ కార్లు (ఈ–కార్స్) అందుబాటులో ఉంచింది. గంటకు రూ.40ల మేర రుసుం వసూలు చేస్తున్నారు. ఒకవేళ కిలోమీటర్ల విషయానికొస్తే మొదటి 20 కి.మీటర్ల వరకు ఉచితంగానే ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తుండగా, ఆ తర్వాత నుంచి కి.మీటరుకు రూ.8 చొప్పున వసూలు చేస్తారు. ఒక్క మియాపూర్ స్టేషన్ కేంద్రంగా రోజుకు 100 మంది ఈ–కార్స్‌ను వినియోగించుకుంటున్నట్లు సంస్థ నిర్వాహకులు సంతోష్‌రెడ్డి చెప్పారు. రిమ్జిమ్ రిమ్జిమ్సైకిల్వాలా.. పర్యావరణహిత బైక్‌లే కాదు.. సైకిళ్లను కూడా మెట్రోస్టేషన్లలో అందుబాటులో ఉంచారు. జూమ్‌కార్ సంస్థ బేగంపేట, రసూల్‌పురా, ప్యారడైజ్, మెట్రో స్టేషన్లలో ఒక్కో స్టేషన్లో 20 చొప్పున ‘పెడల్’ కంపెనీ సైకిళ్లను అందుబాటులో ఉంచింది. అరగంట సమయానికి రూ.3 వసూలు చేస్తున్నారు. రోజుకు 800 మందికి పైగా ఈ సైకిళ్లను నియోగించుకుంటున్నారు. వీటితో పాటు జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, మియాపూర్, కూకట్పల్లి మెట్రోస్టేషన్లలో హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ సహకారంతో స్మార్ట్ బైక్‌లను అందుబాటులో ఉంచారు. పర్యావరణపరిరక్షణకుపెద్దపీట... మెట్రో ప్రయాణం అంతా పర్యావరణహితంగా జరగాలన్నది హెచ్ఎంఆర్ ప్రధానోద్దేశం. ఇందుకోసం ఆయా స్టేషన్ల నుంచి ఈ–కార్స్, ఈ– బైక్స్‌ను అందుబాటులో ఉంచాం. – సారిక,హెచ్ఎంఆర్ ఉద్యోగి. సమయం కలిసివస్తోంది మెట్రో రాకతో నగరంలో రవాణా సౌకర్యం కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండాపోయింది. మెట్రో దిగగానే బైక్‌లు, కార్లను తీసుకుని తమ గమ్యస్థానానికి వెళ్ళే వెసులుబాటు ఉండడం వల్ల ఎంతో సమయం కలిసివస్తోంది. – సాయికుమార్, వినియోగదారుడు ఛార్జీలు చాలాతక్కువ.. ఈ– బైక్స్, కార్ల చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆటో, క్యాబ్‌లో వెళ్లాలంటే కనీసం రూ.50– రూ.100పైమాటే. అదే ఇక్కడి వాహనాలతో రూ.20లోపే పని ముగిసిపోతుండడం సంతోషదాయకం. – జునైదు, వినియోగదారుడు. -
భీమవరం ఇ–బైక్స్ అద్వితీయం
భీమవరం: భీమవరం శ్రీ విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో నాలుగు రోజులగా నిర్వహించిన విష్ణు ఇ–మోటో చాంపియన్‌షిప్–2016 ఇ–బైక్ రేసింగ్ పోటీలు సోమవారం ముగిశాయి. కర్నాటకుకు చెందిన శ్రీసాయిరాం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్‌గా నిలిచి రూ.80 వేల నగదు బహుమతి గెలుచుకున్నారు. ఓవరాల్ చాంపియన్‌షిప్ రన్నరప్‌గా భీమవరం విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు నిలిచి రూ.40 వేల నగదు బహుమతిని గెలుచుకున్నారు. ఎండ్యూరెన్స్ విభాగం విజేతగా కర్నాటకకు చెందిన శ్రీసాయిరాం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు నిలిచి రూ.10 వేలు, రన్నరప్‌గా భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు నిలిచి రూ.5 వేలు బహుమతులు అందుకున్నారు. పోటీలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు నుంచి సుమారు 500 మంది విద్యార్థులు 25 బృందాలుగా తలపడ్డారు. తయారీ రంగంపై దృష్టి సారించాలి ప్రపంచ ఇంజినీరింగ్‌లో నవీన ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్న తరుణంలో యువత తయారీ రంగం, ఆటోమొబైల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలపై దృష్టిసారించాలనిభీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్ అన్నారు. బహుమతి ప్రదానోత్సవ సభలో ఆయన మాట్లాడారు. టెక్‌మహీంద్రా డెలివరీ మేనేజర్ దండు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థి దశలో నూతన ఆవిష్కరణలు రూపొందించడం ఎలక్ట్రికల్ బైక్‌ల తయారీ, ప్రదర్శన, రేసుల్లో పాల్గొనడం ద్వారా విష్ణు ఇ–మోటో చాంపియన్‌షిప్ పోటీలు పారిశ్రామిక, తయారీ రంగాల దృష్టిని ఆకర్షించాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసరావు మాట్లాడారు. వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరాజు, సమన్వయకర్తలు వికాస్, సాగర్, మనోనీత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.