ప్యూర్ ఈవీ తయారు చేసిన ద్విచక్రవాహనం
సంగారెడ్డి టౌన్ : ఐఐటీ హైదరాబాద్ స్టార్టప్ సంస్థ ‘ప్యూర్ ఈవీ’మరో ఈ–బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. బ్యాటరీతో నడిచే సరికొత్త ద్విచక్ర వాహనాన్ని డిసెంబర్ రెండో వారంలో విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హై– స్పీడ్ లాంగ్–రేంజ్ మోడల్‌తో మార్కెట్‌లోకి రానున్న ఈ వాహనానికి ‘ఈ–ట్రాన్స్ నియో’గా నామకరణం చేశారు. కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగం పుంజుకోవడం దీని ప్రత్యేకత. ఈ బైక్‌కు బిగించిన 2,500 డబ్ల్యూహెచ్ పేటెంట్ బ్యాటరీ ‘ఎకో మోడ్’లో ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. వేగంగా పికప్ అందుకునేలా ‘ఈ–ట్రాన్స్ నియో’ను రూపొంచినట్లు ‘ప్యూర్ ఈవీ’సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ వడేరా తెలిపారు. యువతను ఆకట్టుకునే విధంగా బాడీ తయారు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment