ఆడమ్స్‌ ఈ బైక్‌ స్టాకిస్టుగా కేఆర్‌ ఫుడ్స్‌ | KR Foods as the Adams ebike stockist | Sakshi
Sakshi News home page

ఆడమ్స్‌ ఈ బైక్‌ స్టాకిస్టుగా కేఆర్‌ ఫుడ్స్‌

Published Tue, Mar 29 2022 6:25 AM | Last Updated on Tue, Mar 29 2022 6:25 AM

KR Foods as the Adams ebike stockist - Sakshi

హైదరాబాద్‌: ఆడమ్స్‌ ఈ బైక్‌ సూపర్‌ స్టాకిస్టుగా కేఆర్‌ ఫుడ్స్‌ సంస్థ వ్యవహరించనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డీలర్ల సమావేశంలో కేఆర్‌ఫుడ్స్‌ సంస్థ ఎండీ రాజేందర్‌ కుమార్‌ కొత్తపల్లి మాట్లాడుతూ... ‘‘తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఆడమ్స్‌ ఈ బైక్స్‌ సూపర్‌ స్టాకిస్టుగా బాధ్యతలు తీసుకున్నాము. మెదక్‌ జిల్లాలో తుప్రాన్‌ మండల కేంద్రంగా 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించాము. ఈ ప్లాంట్‌ నెలకు 4 వేల ఈ బైకులను ఉత్పత్తి చేయగలదు. రోబోటిక్, ఆర్టిఫిషియల్‌ సాంకేతికతను సమకూర్చుకుంటూ ప్రస్తుత తయారీ సామర్థ్యాన్ని పదివేల యూనిట్లకు పెంచుతాము. ఇదే ప్లాంట్లులో అధిక హార్స్‌ పవర్‌ కలిగిన ట్రాక్టర్ల రూపకల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము’’ అని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement