dealers
-
BH రిజిస్ట్రేషన్.. బయటపడ్డ డీలర్ల మోసాలు
-
మారుతీ సుజుకీ డీలర్లకు బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తాజాగా యూనియన్ బ్యాంక్‌తో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మారుతీ సుజుకీ డీలర్లకు యూనియన్ బ్యాంక్ రుణ సాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా 4,000 పైచిలుకు మారుతీ విక్రయ శాలల్లో వాహనాల నిల్వకు కావాల్సిన నిధుల సమీకరణ అవకాశాలను ఈ భాగస్వామ్యం మెరుగుపరుస్తుందని సంస్థ మంగళవారం ప్రకటించింది. డీలర్ నెట్‌వర్క్‌ను పెంపొందించడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. 2008 నుంచి మారుతీ సుజుకీ, యూనియన్ బ్యాంక్ మధ్య బంధం కొనసాగుతోంది. 3,00,000 పైచిలుకు కస్టమర్లకు యూనియన్ బ్యాంక్ వాహన రుణం సమకూర్చింది. -
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
టాటా డీలర్లకు ఐసీఐసీఐ గుడ్ న్యూస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ డీలర్స్కు గుడ్ న్యూస్. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించే డీలర్లకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం సమకూరుస్తుంది.తీసుకున్న రుణాన్ని సౌకర్యవంతంగా తిరిగి చెల్లించేలా కాల పరిమితి ఉంటుంది. టాటాకు చెందిన డీజిల్, పెట్రోల్ వాహనాలను విక్రయిస్తున్న డీలర్లకు ఇప్పటికే ఈ బ్యాంక్ రుణం అందిస్తోంది. -
పెట్రో డీలర్ల ఆందోళన
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌పై కమీషన్ పెంచాలని కోరుతూ ‘పెట్రో’డీలర్లు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ‘నో పర్చేజ్ డే’పాటించి నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇంధన కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకుండా రాష్ట్రంలోని డీలర్లంతా సంఘీభావాన్ని ప్రకటించారు. 2017 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు అయినప్పటికీ, డీలర్ల కమీషన్ మాత్రం పెంచలేదని, ఇటీవల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో తాము చెల్లించిన మొత్తం నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పెట్రోల్, డీజీల్ డీలర్ల సంఘం పిలుపు మేరకు హైదరాబాద్, సూర్యాపేట, రామగుండం, వరంగల్‌లలో ఉన్న మూడు చమురు కంపెనీలకు చెందిన 7 పెట్రోల్, డీజిల్ డిపోల నుంచి వాహనాలు బయటకు వెళ్లకుండా ఆందోళన దిగారు. ఈ సందర్భంగా కుషాయిగూడలో ఎనిమిది మంది డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని మధ్యాహ్నం వదిలి వేశారు. ఈ ఆందోళనల కారణంగా రాష్ట్రంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కాగా, ఆర్నెల్లకోసారి డీలర్ల కమీషన్‌ను సవరించాల్సి ఉండగా, 2017 నుంచి దాని గురించి పట్టించుకోలేదని రాష్ట్ర పెట్రో డీలర్ల సంఘం అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడాన్ని తప్పుపట్టడం లేదని, తాము చెల్లించిన మొత్తాన్ని రీయంబర్స్మెంట్ చేయాలని చమురు కంపెనీలను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
ఆడమ్స్ ఈ బైక్ స్టాకిస్టుగా కేఆర్ ఫుడ్స్
హైదరాబాద్: ఆడమ్స్ ఈ బైక్ సూపర్ స్టాకిస్టుగా కేఆర్ ఫుడ్స్ సంస్థ వ్యవహరించనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డీలర్ల సమావేశంలో కేఆర్ఫుడ్స్ సంస్థ ఎండీ రాజేందర్ కుమార్ కొత్తపల్లి మాట్లాడుతూ... ‘‘తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆడమ్స్ ఈ బైక్స్ సూపర్ స్టాకిస్టుగా బాధ్యతలు తీసుకున్నాము. మెదక్ జిల్లాలో తుప్రాన్ మండల కేంద్రంగా 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించాము. ఈ ప్లాంట్ నెలకు 4 వేల ఈ బైకులను ఉత్పత్తి చేయగలదు. రోబోటిక్, ఆర్టిఫిషియల్ సాంకేతికతను సమకూర్చుకుంటూ ప్రస్తుత తయారీ సామర్థ్యాన్ని పదివేల యూనిట్లకు పెంచుతాము. ఇదే ప్లాంట్లులో అధిక హార్స్ పవర్ కలిగిన ట్రాక్టర్ల రూపకల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము’’ అని తెలిపారు. -
ఎవ్వరూ చెప్పినా వినేది లేదు..చర్యలు తప్పవు: సిద్ధిపేట కలెక్టర్
-
వరి సాగు చేస్తే ఊరుకునేది లేదు: సిద్ధిపేట కలెక్టర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, మెదక్: సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తాజాగా ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. వరి సాగు చేస్తే ఊరుకునేది లేదని, రైతులకు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ అధికారులు, విత్తనాలు, ఎరువుల డీలర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు విక్రయించినా ఊరుకునేది లేదని.. అమ్మితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. వ్యాపారం రద్దు చేసి షాపుని మూయిం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. డీలర్లు సుప్రీం కోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా షాపు ఓపెన్ చేసేది లేదని తేల్చిచెప్పారు. ‘నేను చెప్పిన దానికి విరుద్ధంగా సుప్రీం కోర్టు జడ్జి చెప్పినా, రాష్ట్ర హైకోర్టు జడ్జి చెప్పినా, ప్రజా ప్రతినిధులు చెప్పినా నేను కలెక్టర్‌గా ఉన్నంతకాలం ఎటువంటి పరిస్థితులలో షాపులు తెరుచుకోవు. ఒకవేళ డీలర్లు విత్తనాలు అమ్మితే సంబంధిత ఏఈవోలు, అధికారులు సస్పెండ్ అవుతారు.’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి. -
డీలర్లకు ఓటీపీ.. లబ్ధిదారులకు టోపీ
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు సరఫరా చేస్తున్న రాయితీ బియ్యం పక్కదారి పడుతోంది. పేదల అవగాహనాలేమిని డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. లబ్ధిదారుల నుంచి ఓటీపీని తీసుకొని అరకొర బియ్యం పంపిణీ చేసి, మిగతా బియ్యాన్ని అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఓటీపీ నంబర్‌ను సేకరించి డీలర్లు చేస్తున్న దోపిడీపై రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’జరిపిన పరిశీలనలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రేషన్‌షాపులున్నాయి. ఇందులో 2.85 కోట్లమంది లబ్ధిదారులు ఉన్నారు. కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నాయి. ప్రతినెలా 1.78 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్రానికి సçరఫరా అవుతోంది. రేషన్ డీలర్లు ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 లేదా 20వ తేదీ వరకు సరకులనున లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. సరుకుల పంపిణీ వేళ రేషన్‌లబ్ధిదారుడు నుంచి ఓటీపీ లేదా ఐరిస్ తీసుకొని సరుకులు ఇస్తారు. బియ్యం కాజేసేది ఇలా...! ఒక రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే ఆ కుటుంబానికి 40 కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. నిర్దేశిత సమయాల్లో రేషన్çషాపు వద్ద భారీగా లబ్ధిదారులు ఉంటే, అక్కడ వేచి చూసే ఓపికలేని లబ్ధిదారులు ఆ షాపు డీలర్‌కు ఫోన్ చేసి తమ రేషన్‌కార్డు నంబర్ చెబుతారు. మిషిన్‌లో సదరు నంబర్‌ను సంబంధిత డీలర్ ఎంటర్ చేయగానే లబ్ధిదారుల ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిందంటే ఆ లబ్ధిదారు సరుకులు తీసుకున్నట్లు లెక్క. ఆ తర్వాత డీలర్లు సూచించిన తేదీకి బియ్యం కోసం వెళ్తే కోటా అయిపోయిందని చెబుతున్నారు. లేదంటే, ‘ఇప్పుడు కొన్ని తీసుకెళ్లు.. మిగతావి తర్వాత కొన్ని ఇస్తాను’అని తిప్పి పంపుతున్నారు. ఇలా 15 తేదీ నుంచి 20 వరకు జాప్యం చేసి, తీరా ఆ నెల కోటా అయిపోయిందని చెప్పేస్తున్నారు. ఇలా కనీసం 5 లేక 10 కిలోలను లబ్ధిదారుల నుంచి డీలర్లు కాజేస్తున్నారు. కార్డుపోతుందనే భయంతోనే.. కొందరు లబ్ధిదారులు ప్రతినెలా రేషన్ తీసుకోరు. మరికొందరేమో రేషన్ బియ్యం ఎందుకులే అని తీసుకోవడంలేదు. రేషన్‌కార్డు ఉంటే చాలు అని ఇలాంటి వాళ్లు భావిస్తుంటారు. ప్రతినెలా ఆయా రేషన్ డీలర్లకు ఓటీపీ చెప్పి వదిలేస్తున్నారు. రేషన్‌డీలర్లు ఇలా కాజేసిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. టిఫిన్ సెంటర్లకు, బియ్యం వ్యాపారులకు కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. సన్నబియ్యం రావడమే కారణం ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి రేషన్‌డీలర్లకు సన్న, దొడ్డు రకం బియ్యం సరఫరా చేస్తోంది. అయితే రేషన్ డీలర్లు ఒక్కో సంచిని పరిశీలించి సన్నబియ్యం బస్తాలను పక్కకు పెట్టేస్తున్నారు. సంబంధిత షాపునకు మొత్తంగా సన్నబియ్యం వస్తే అందులోంచి దాదాపు 20 శాతం మందికి కొంత కోటా ఆపి మిగతా బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అలా ఆపిన బియ్యాన్ని డీలర్లు ఇతరులకు అమ్ముకుంటున్నారు. చదవండి: జూబ్లీహిల్స్: ఫుడ్కోర్ట్ టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్ -
బయోమె‘ట్రిక్’తో బియ్యం మాయం
సాక్షి, కామారెడ్డి: బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. అడ్డూఅదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతోంది. కరోనా నేపథ్యంలో రేషన్ సరుకుల పంపిణీకి బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేయడంతో బియ్యం దొంగలకు వరంగా మారింది. ఫలితంగా రెవెన్యూ సిబ్బందిని మచ్చిక చేసుకుని అక్రమాలకు తెరలేపారు. ఇతర జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు సంబంధించిన బియ్యాన్ని కాజేస్తున్న వైనం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. లబ్ధిదారుల ఆహార భద్రత కార్డుల నంబర్లను సేకరించి రెవెన్యూ సిబ్బంది సహకారంతో బియ్యాన్ని దారి మళ్లించారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో కొందరు డీలర్లు మహబూబాబాద్, భద్రాద్రి, మంచిర్యాల జిల్లాలకు చెందిన లబ్ధిదారుల పేరిట పెద్ద ఎత్తున బియ్యాన్ని తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఎల్లారెడ్డి పట్టణంలో ఒక రేషన్ దుకాణం, బాన్సువాడ పట్టణంలో రెండు దుకాణాలు, బీర్కూర్ మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్, దామరంచ గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. దీంతో ఆరుగురు డీలర్లతో పాటు సహకరించిన వీఆర్వో, వీఆర్ఏలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఐదుగురు వీఆర్ఏలను, ఒక వీఆర్వోను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దుర్వినియోగం ఈ దందా ఇతర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. ఆహార భద్రత కార్డుల ద్వారా పేదలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తుండగా.. అక్రమాలకు అలవాటు పడిన కొంత మంది రేషన్ డీలర్లు, మాఫియా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతూ తమ దందాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తాజాగా కరోనా కాలాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకుని కొత్త దారులు వెతికారు. బయోమెట్రిక్‌కు బదులు రెవెన్యూ సిబ్బంది ఆథరైజేషన్‌తో సరుకులు పంపిణీ చేస్తుండటంతో సిబ్బందిని మచ్చిక చేసుకుని లబ్ధిదారుల బియ్యాన్ని మింగేస్తున్నారు. అది కూడా ఇతర జిల్లాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను సేకరించి వారికి సంబంధించిన నెలనెలా మిగిలిపోతున్న బియ్యాన్ని మింగేశారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం దుర్వినియోగమైనట్టు తెలుస్తోంది. అక్రమాలకు హైదరాబాద్‌తో లింకు..! పొరుగు జిల్లాల లబ్ధిదారులకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేసే మాఫియాకు హైదరాబాద్‌తో లింకు ఉన్నట్టు తెలుస్తోంది. బియ్యం మాఫియా ఎంచుకున్న కొన్ని రేషన్ దుకాణాల ద్వారా అక్కడి సిబ్బందిని మేనేజ్ చేసుకుని ఇతర జిల్లాల లబ్ధిదారుల పేరుతో బియ్యాన్ని కాజేస్తోంది. దీనికి హైదరాబాద్‌లోని మాఫియా, యంత్రాంగం అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. లబ్ధిదారుల ఆహార భద్రత కార్డుల నంబర్లు రాజధాని నుంచే డీలర్ల వాట్సాప్‌లకు వచ్చినట్లు సమాచారం. కామారెడ్డి జిల్లాలో అక్రమాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పౌరసరఫరాల అధికారులు ఇతర జిల్లాలపై దృష్టి సారించారు. -
విక్రయాల్లో విచిత్రాలెన్నో..
కర్నూలు(అగ్రికల్చర్): యూరియా అమ్మకాల్లో ప్రయివేటు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమాలకు ఒడిగట్టారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి సమగ్ర విచారణ చేపట్టాలంటూ కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పుల్లయ్యతో విచారణ చేయిస్తున్నారు. ఇప్పటికే డీఆర్వో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేశారు. ఈ క్రమంలో డీలర్ల ‘వేషాలు’ వెలుగు చూశాయి. ♦నందికొట్కూరులోని రెండు దుకాణాల్లో ముగ్గురు వ్యక్తులే 188 టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు రికార్డు అయ్యింది. దీనిపై డీఆర్వో విచారణ చేయగా.. ఆ ముగ్గురూ ఆయా షాపుల్లో పనిచేసే గుమాస్తాలేనని తేలింది. బిజినవేములకు చెందిన ఇర్ఫాన్ 84.6 టన్నులు, షేక్ సికిందర్ 49.14 టన్నులు, చెరుకుచెర్లకు చెందిన శివన్న 54.945 టన్నులు కొన్నట్లు డీలర్లు రికార్డు చేశారు. ♦నంద్యాలలోని ఒక ఫర్టిలైజర్ దుకాణంలో బి.గోవిందు అనే వ్యక్తి ఏకంగా 174.555 టన్నుల యూరియా (3,491 బస్తాలు) కొనుగోలు చేసినట్లు రికార్డు అయ్యింది. ఒక మండలానికి సరిపోయే యూరియాను ఒకే వ్యక్తి కొన్నట్లు డీలర్లు మాయ చేశారు. అలాగే అద్దంకి సత్యనారాయణ అనే వ్యక్తి 169.155 టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు చూపారు. ♦ఇలా 23 మంది వేలాది బస్తాల యూరియా కొనుగోలు చేసినట్లు డీలర్లు చూపడం వెలుగులోకి వచ్చింది. యూరియాతో సహా రసాయనిక ఎరువులను పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణం మేరకు ఈ–పాస్ మిషన్‌లో రైతు వేలిముద్ర తీసుకుని పంపిణీ చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ డీలర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. 3 షాపుల లైసెన్స్ సస్పెండ్ యూరియా అధిక ధరకు అమ్ముతున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో తేలిన నేపథ్యంలో కల్లూరు మండలం చిన్నటేకూరులోని ధనుంజయ ఫర్టిలైజర్స్, కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని సాయికృప ఏజెన్సీస్, వసుంధర ఆగ్రో ఏజెన్సీస్ లైసెన్స్‌లను సస్పెండ్ చేస్తూ కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ ఆర్.విజయశంకర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
బంపర్ ఆఫర్లతో స్వాగతం.. బండి కొనండి
సాక్షి, సిటీబ్యూరో : వాహన అమ్మకాలు మరింతగా పెంచుకునేందుకు ఆటోమొబైల్ డీలర్లు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లతో సిద్ధమయ్యారు. ఇయర్‌ఎండర్‌ను తమకు అనువుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మకాలు ఎక్కువగానే జరిగినా, అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు. ఈ ఏడాది ముగింపునకు మరో 14 రోజులే మిగిలిఉంది. వీలైనన్ని ఎక్కువ వాహనాలను విక్రయించేందుకు డీలర్లు ఇస్తున్న ఆఫర్లు ఆకట్టుకోలేకపోతున్నాయి. ద్విచక్ర వాహనాలపై రూ. 5 వేలు, లగ్జరీ కార్లు, మధ్యతరగతి వేతన జీవులు కొనుగోలు చేసే వివిధ రకాల వాహనాలపైన రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు తగ్గించి విక్రయిస్తున్నారు. కొన్ని సంస్థలు రెండేళ్ల బీమా మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. అయినా కొనుగోలుదారుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. కొత్త ఏడాదిలో కొత్త బండి కొనుగోలు చేయాలనే సెంటిమెంట్‌తో రెండుమూడు నెలలుగా వాహన కొనుగోళ్లు భారీగా తగ్గాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వం భారత్ స్టేజ్–6 ప్రమాణాలు కలిగిన వాహనాలను ప్రవేశపెడుతోంది. వాహనం ఇంజిన్ సామర్థాన్ని పెంచడంతో పాటు ఇంధనాన్ని పూర్తిస్థాయిలో మండించి కాలుష్య కారకాలను బాగా తగ్గించే బీఎస్–6 వాహనాలు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయగలవని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది. కానీ ఆటోమొబైల్ సంస్థలు జనవరి నుంచే వీటిని విక్రయానికి సిద్ధం చేస్తున్నాయి. ఈ ఏడాది 2.29 లక్షల వాహనాల విక్రయాలు అదనం సాధారణంగా రవాణారంగానికి చెందిన వాహనాల కంటే వ్యక్తిగత వాహనాలే పెద్దఎత్తున అమ్ముడవుతాయి. రూ.కోట్ల విలువైన లగ్జరీ కార్లు, రూ.లక్షల ఖరీదైన లగ్జరీ బైక్‌లు మొదలుకొని మధ్యతరగతి బడ్జెట్లో లభించే వివిధ రకాల కార్లు, దిచక్ర వాహనాల అమ్మకాలే టాప్‌గేర్‌లో ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతిరోజు 1500 నుంచి 2000 వరకు వివిధ రకాల వాహనాలు నమోదైతే, వాటిలో 85 శాతం వరకు వ్యక్తిగత వాహనాలే ఉంటాయి. ఈ క్రమంలో నగరంలోని ఆటోమొబైల్ రంగం కూడా రవాణావాహనాల కంటే వ్యక్తిగత వాహన విక్రయాలపైనే ఆధారపడి ఉంది. కానీ ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం వాహనరంగంపై పెను ప్రభావాన్ని చూపింది. తయారీ సంస్థలు సైతం వాహనాల తయారీని నిలిపివేశాయి. నగరంలోని మధ్యతరగతినికూడా మాంద్యం ప్రభావితం చేసింది. ‘కేంద్రం ప్రకటించిన కొన్ని సడలింపుల నేపథ్యంలో అమ్మకాలు ఊపందుకుంటాయని భావించినప్పటికీ గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉంది’ అని ఆటోమొబైల్ డీలర్ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. గత సంవత్సరం డిసెంబర్‌నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 53,22,694 వాహన అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది ఇప్పటి వరకు 55,52,416 వాహనాలు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే 2,29,722 వాహనాలు ఎక్కువే అయినా, ఆర్థిక రంగం బాగుంటే మూడు లక్షల సంఖ్యను దాటేది. -
సిండి‘కేటు’
అల్లాదుర్గం(మెదక్) : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఎరువుల వ్యాపారుల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఉమ్మడి అల్లాదుర్గం మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో సిండికేట్ దందా ప్రారంభించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతులకు కావల్సిన ఎరువులు, ఫెస్టిసైడ్, విత్తనాలను ఉద్దేరకు ఇస్తూ ఆ డబ్బుపై అధిక వడ్డీలు వేస్తూ మోసం చేస్తున్నారు. దీనికితోడు రైతులు పంట వచ్చిన తర్వాత ఆ పంటను ఉద్దెర ఇచ్చిన ఫర్టిలైజర్ దుకాణాదారులకే విక్రయించాలనే ఒప్పం దంపై ఎరువులు,విత్తనాలు అరువు ఇస్తున్నారు. ధర కూడా వారు చెప్పిన దానికే అమ్మాలి. ఉద్దెర సొమ్ముకు వందకు రూ. 5 వడ్డీని వసూలు చేస్తూ రైతుల నడ్డి విరిస్తున్నారు. పత్తి కొనుగోళ్ల సమయంలోనూ తూకంలో మోసాలకు పాల్ప డుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ దందా అల్లాదుర్గం ఉమ్మడి మండలంలో ఐదేళ్లుగా యథేచ్చగా కోనసాగుతుంది. ఒక్కో గ్రామం ఒక్కో దుకాణం.. ఉమ్మడి అల్లాదుర్గం మండలంలో సుమారు 45 ఫర్టిలైజర్ దుకాణాలున్నాయి. పేరుకు ఇవి ఉన్నా ప్రతి గ్రామంలో అక్రమంగా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారులంత సిండికెట్‌గా మారి యూరియా బస్తాపై 20, నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఉద్దెర తీసుకున్న రైతులు మాత్రం ఏమీ అనడం లేదు. నగదు ఇచ్చి కొనుగోలు చేసే రైతులు ప్రశ్నిస్తే ఇదే ధరకు ఇస్తాం కొంటే , కొనండి లేకుంటే మీ ఇష్టం అని దురుసుగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల బిల్లు మాత్రం ఉన్న రేటు వేసి, అదనంగా వసూలు చేసేది వేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా ఏమీ లాభం లేకుండా పోతుంది. ఈ వ్యాపారులు అందరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఆ గ్రామంలో వేరే దుకాణాల వారు విక్రయించొద్దని నిబంధనలతో విక్రయిస్తున్నారు. ఒక షాప్ వారు అమ్మే ఊరికి వేరే దుకాణాల వారు అమ్మోద్దని నిబంధనతో విక్రయిస్తున్నారు. గ్రామానికో బ్రోకర్.. దుకాణదారులు ఈ మండలంలో ప్రతి గ్రామంలో కొంత మంది బ్రోకర్లుగా పెట్టుకుని అక్రమ ఎరువులు, విత్తనాలు, ఫెస్టిసైడ్ మందులు విక్రయిస్తున్నారు. వట్పల్లి కేంద్రంగా ఎటువంటి అనుమతులు లేకుండా జీరో దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వ్యాపారి కోటి రూపాయలపైనే ఉద్దెర ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వట్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కల్తీ విత్తనాలు అమ్మడంతో ముప్పారం గ్రామానికి చెందిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు విచారణ జరిపినా ఆ వ్యాపారిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు. అధిక ధరలకు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు అటు వైపు కన్నేత్తి చూడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సిండికేట్ వ్యాపారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తీవ్రంగా మోసం చేస్తున్నారు ఫర్టిలైజర్ షాపు యజమానులు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిలువునా మోసం చేస్తున్నారు. ఉద్దెర పెరుతో అధిక ధరలకు మందులకు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి నకిలీ మందులు, విత్తనాలు అమ్ముతున్నారు. గత ఏడాది నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయాం. – నాగరాజు రైతు, ముప్పారం. చర్యలు తీసుకుంటాం.. ఈ సిండికేట్ అక్రమ వ్యాపరం గురించి మా దృష్టికి రాలేదు. మండల వ్యవసాయ అధికారి ద్వారా విచారణ చేపడతాం. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు ఎరువులకు బిల్లులు తప్పని సరిగా తీసుకోవాలి. అధిక ధరలకు విక్రయించినా, అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. –పరుశురాం నాయక్, జిల్లా వ్యవసాయాధికారి -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
సాక్షి, పెద్దపల్లిరూరల్ : గౌరవ వేతనం చెల్లించడంతోపాటు పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని రేషన్‌డీలర్లు జిల్లా కేంద్రంలో శుక్రవారం భిక్షాటన చేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి వెం కటేశం మాట్లా డుతూ... కేంద్ర ప్రభుత్వం 2015 అక్టోబర్ నుంచి పెంచిన కమీషన్, పాత బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యంచేయడం తగదన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఈ విషయమై ప్రభుత్వానికి విన్నవించుకున్నా... ఇప్పటికి ఫలితం లేదని వాపోయారు. బకాయి ఉన్న 400 కోట్ల రూపాయల కమీషన్‌ను వెంటనే చెల్లించి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న బియ్యం పంపిణీతో తమకు అందే కమీషన్ రేటు సరిపోవడంలేదన్నారు. నెలాఖరులోగా ప్రభుత్వం స్పందించకుంటే వచ్చేనెల ఒకటి నుంచి సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం నాయకులు మద్దెల నర్సయ్య, ఎలబోతారం శంకరయ్య, అడిచెర్ల రమేశ్, నంబయ్య, పెర్క లింగయ్య, కిషన్‌రెడ్డి, జయప్రద, పద్మ, సరస్వతీ, భారతీ, శ్రీనివాస్, ప్రభంజన్‌రెడ్డి, తోట శ్రీనివాస్, సత్యం, సాదిక్‌పాషా పాల్గొన్నారు. -
సకాలంలో తెరుచుకోని రేషన్ షాపులు 27 వేలు
సాక్షి, అమరావతి : రేషన్ డీలర్లు 95 శాతం మందికి పైగా రేషన్ షాపులను నిర్ణయించిన సమయాల్లో తెరవడం లేదని ప్రభుత్వం గుర్తించింది. షాపుల నిర్వహణ, వాటి సమయ పాలనపై ప్రభుత్వం ఇటీవల సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో 28 వేలకుపైగా రేషన్ షాపులు ఉంటే వాటిలో దాదాపు 27 వేల షాపులు సరిగా తెరవడం లేదని సర్వేలో తేలింది. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుతున్నవి 1,177 షాపులు మాత్రమేనని అధికారులు తేల్చారు. మిగిలిన షాపులు ఎలాంటి సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో పనివేళలు సరిగా పాటించని డీలర్లపై జరిమానా విధించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజంతా షాపు తెరవకపోతే డీలర్‌కు రూ.500 ఫైన్ వేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లను పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. ప్రతి నెలా 1 నుంచి 15 వరకు లబ్ధిదారులకు సబ్సిడీ సరుకులు పంపిణీ చేయాలని, తప్పనిసరిగా పనివేళలు పాటించాలని రేషన్ డీలర్లకు అధికారులు స్పష్టం చేశారు. షాపులను తెరవలేదనే విషయం ఈ–పాస్ మిషన్ల ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో ఎప్పటికప్పుడు అలాంటి డీలర్లను గుర్తించి వారికిచ్చే కమీషన్లో పెనాల్టీ మొత్తాన్ని జమ చేసుకొని మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టిసున్నారు. రేషన్ షాపులకు కేటాయించిన సరుకుల పంపిణీని 5వ తేదీకల్లా పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో డీలర్లు కూడా ఆ మేరకు పంపిణీ చేస్తున్నారు. డీలర్ పరిధిలోని లబ్ధిదారులందరికీ సరుకులు పంపిణీ చేసిన తర్వాత రేషన్ షాపును ఎందుకు తెరవాలి? ఇలాంటి విషయాలు గుర్తించకుండా డీలర్లు షాపులను తెరవలేదని అధికారులు చెప్పడం సరికాదు. డీలర్ల సమస్యలు పరిష్కరించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోకుండా మాపైనే నెపం వేయడం ఎంతవరకు సమంజసం? – దివి లీలామాధవరావు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఎరువుల డీలర్లకు సహకారం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, విత్తన డీలర్లకు పూర్తి సహకారం అందిస్తామని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు హామీనిచ్చారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల డీలర్ల సంఘం (స్పెడ్) రాష్ట్ర అధ్యక్షుడు కె.పృథ్వీ బుధవారం మంత్రి హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. నూతనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పృథ్వీకి అభినందనలు తెలుపుతూ, రైతుల కోసం డీలర్ల సంఘం పనిచేయాలని మంత్రి సూచించారు. తమ సంఘం గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తారని పృథ్వీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
హెల్ప్ మి
వారు ఒంటరివారు..రేషన్ డీలర్‌గా బతుకు బండి లాగుతున్నారు. సరుకుల పంపిణీ చేసేందుకు సహాయక (హెల్పర్)ని ప్రభుత్వం నియమించకపోవడంతో కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీలో ఆపసోపాలు పడుతున్నారు. నామినీగా భార్యాభర్తలో ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చని ప్రభుత్వం ఆదేశించినా వచ్చే అంతంతమాత్రం ఆదాయానికి ఇద్దరు ఒకేచోట ఉండిపోతే పోషణ భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినీ బదులుగా హెల్పర్లను నియమించాలని వేడుకొంటున్నారు. ఉయ్యూరులోని 0682020 నంబర్ రేషన్ దుకాణాన్ని ఒక మహిళా డీలర్ నిర్వహిస్తున్నారు. ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. బతుకుతెరువు కోసం రేషన్ డీలర్ గా ఉన్నారు. జీవిత భాగస్వామి లేకపోవడంతో నామినీని పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. హెల్పర్‌ను నియమించుకునే అవకాశం ఇవ్వమని కోరుతున్నా స్పందనలేదు. విజయవాడ సర్కిల్–2 కార్యాలయ పరిధిలో పి.వెంకటేశ్వరరావు( నంబర్ 0684263 ) రేషన్ డిపో నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య లేదు. ఒంటరిగా ఉండటంతో ప్రభుత్వం నిబంధనల ప్రకారం నామినీని నియమించుకునే అవకాశం లేదు. తాను ఒక్కడినే దుకాణం నడపుకోలేనని హెల్పర్ కావాలని కోరినా స్పందన శూన్యం. సాక్షి, విజయవాడ : జీవనోపాధి కోసం రేషన్ దుకాణం నడిపే డీలర్ల మెడపై ప్రభుత్వం ఆంక్షల కత్తి పెడుతోంది. దీంతో డీలర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తలాతోక లేకుండా తీసుకున్న నిర్ణయాలు కొంతమంది డీలర్లకు శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగి జీవిస్తూ, రేషన్ దుకాణం నడుపుకునే డీలర్లకు నామినీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నామినీలకు బదులుగా హెల్పర్లకు అవకాశం ఇవ్వమని డీలర్లు ముక్తకంఠంతో కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా వారికి చుక్కలు చూపిస్తోంది. నామినీలను తగ్గించడంతో ఇబ్బందులు రేషన్ దుకాణాన్ని ఒక డీలరే నడుపుకోలేరని గతంలో ఇద్దరు నామినీలను ఇచ్చేవారు. రేషన్ డీలర్ వేలిముద్రలతో పాటు మరో ఇద్దరి వేలిముద్రలు ఈపోస్ మిషన్‌లో నమోదు చేసే వారు. డీలర్ దుకాణంలో లేని సమయంలో మిగిలిన ఇద్దరిలో ఎవరైనా సరుకులు ఇచ్చే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఇద్దరు నామినీలను తీసి వేసి కేవలం భార్య లేదా భర్త మాత్రమే నామినీగా ఉండాలని వారే సరుకులు పంపిణీ చేయాలని నిబంధన విధించింది. భర్త పేరుతో రేషన్ దుకాణం ఉంటే భార్య, భార్య పేరుతో ఉంటే భర్త వేలిముద్రలు మాత్రమే ఈపోస్ మిషన్ తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. భార్య, భర్త మినహా ఇతరుల వేలిముద్రలు నమోదు చేయడానికి వీలు లేదు. రెండో నామినీని తొలగించారు. కొండనాలుకకు మందేస్తే... రేషన్ దుకాణాలు బినామీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని విమర్శలు రావడంతో బినామీలను అరికట్టేందుకు అధికారులు ఇద్దరు నామినీలను తొలగించి, జీవిత భాగస్వామిని మాత్రమే నామినీగా ఉంచారు. కొండనాలుకకు మందేస్తే.. ఉన్ననాలిక ఊడినట్లు ఇప్పుడు ఈ నిబంధన కొంతమంది డీలర్లకు శాపంగా మారింది. జిల్లాలో 2,147 రేషన్ దుకాణాలు ఉండగా అందులో 73 దుకాణాల డీలర్లకు జీవిత భాగస్వాములు లేరు. ఇప్పుడు వారికి నామినీని పెట్టుకునే అవకాశం లేకపోయింది. దీంతో డీలర్లు నానా అవస్థలు పడుతున్నారు. డీలర్లకు కష్టాలు ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప ఇతర సరుకులు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. దీంతో డీలర్లు కటుంబాలు గడవడం ఇబ్బందిగా మారింది. దీంతో జీవిత భాగస్వాములు కూడా వేరే పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు వారిని మాత్రమే నామినీగా నియమించడం వల్ల వాళ్లు మరో పనిచేసుకునే వీలులేకుండా పోయింది. హెల్పర్స్ను నియమించాలని మంత్రికి వినతి చౌకధరల దుకాణదారుల సంఘం రాష్ట్ర నాయకులు ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావును కలిసి నామినీకి బదులుగా హెల్పర్స్ను నియమించుకునేందుకు అవకాశం కల్పించమని కోరారు. హెల్పర్‌కు వేతనం కాని, కమీషన్ కాని ప్రభుత్వం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కేవలం రేషన్ దుకాణం నిర్వహిస్తే ఆదాయం సరిపోక నామినీలు కూడా వేరొక పనిచేసుకుంటున్నారని వివరించారు. నామినీకి బదులుగా హెల్పర్ వేలిముద్రను ఈపోస్ మిషన్‌లో తీసుకోవాలని కోరుతున్నారు. అయితే దీనిపట్ల మంత్రి సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. హెల్పర్స్ను అనుమతించం కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం డీలర్లు కోరిన విధంగా హెల్పర్స్‌ని నియమించడం సాధ్యపడదు. అయితే జీవిత భాగస్వామి లేని పక్షంలో డీలర్ రేషన్‌కార్డులో ఉన్న వారిలో ఒకరిని నామినీగా నియమిస్తాం. – డీఎస్వో నాగేశ్వరరావు హెల్పర్‌ను నియమించండి నామినీకి బదులుగా హెల్పర్‌ను ఇవ్వమని ఇప్పటికే మంత్రిని కలిసి విన్నవించాం. హెల్పర్‌ను ఇస్తే డీలర్లకు ఉపయుక్తంగా ఉంటుంది. డీలర్ల కుటుంబ సభ్యులు మరో పని చేసుకునే అవకాశం ఉంటుంది. – కె.కొండ(జేమ్స్), రేషన్‌డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
విత్తన కేటుగాళ్లు వస్తున్నారు..!
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ప్రతి యేడాది నకిలీ విత్తనాల బారినపడి వేలాది మంది రైతులు మోసపోతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. కంపెనీలు, డీలర్లు మాయమాటలు చెప్పి రైతులను వలలో వేసి నాణ్యత లేని విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీలు కూడా డిమాండ్ పెరగడంతో అప్పటికప్పుడు నకిలీ సీడ్స్‌ను సృష్టించి రైతులకు అంటగడుతున్నాయి. అమాయక రైతులు వారి మోసానికి గురై సాగులో పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టుకోలేని పరిస్థితుల్లో ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ప్రతి యేడాది నకిలీ విత్తనాల దందాను అరికడతామని చెప్పడమే కానీ క్షేత్రస్థాయిలో ఇలాంటి మోసాలను మొదటినుంచే అదుపు చేయడంలో విఫలమవుతోంది. తాజాగా బుధవారం బెల్లంపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడం సంచలనం కలిగించింది. జిల్లాలోనూ గ్రామాల్లోకి ఇలాంటి కేటుగాళ్లు మళ్లీ చొరబడుతున్నారు. రైతుల దగ్గర డబ్బులు తీసుకొని విత్తనాలకు సంబంధించి ముందే బుకింగ్ చేసుకుంటున్నారు. పత్తి విత్తన రకానికి సంబంధించి బడా భూస్వాముల చేలలో ఆ రకం విత్తనాలను సాగు చేయడం ద్వారా ఇంత కాత, పూత వస్తుందని డీలర్లు రైతులకు చూపించి ఎరవేయడం వారికి ఈ దందాలో అందవేసిన చెయ్యి. ఆ తర్వాత నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు వానకాలం పంటల సాగుకు ముందే ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే సంయుక్తంగా తనిఖీలు చేపడితే దీన్ని అరికట్టవచ్చు. అయితే జిల్లాలో ఇప్పటివరకు ఈ టాస్క్ ప్రారంభం కాకపోవడం చోద్యమే. గతేడాది వేల ఎకరాల్లో నష్టం.. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల కారణంగా వేల ఎకరాల్లో రైతులు పంట నష్టం చవిచూశారు. ప్రభుత్వ అనుమతి పొందిన ఒక రకం పత్తి విత్తనాలను దాదాపు 3500 మంది రైతులు 8800 ఎకరాల్లో సాగు చేశారు. బేల, జైనథ్, ఆదిలాబాద్, తలమడుగు, తాంసి, ఇచ్చోడ మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఈ విత్తనం సాగు చేసిన రైతుకు ఎకరానికి రెండు క్వింటాళ్ల లోపే పత్తి దిగుబడి వచ్చింది. సగటున ఎకరానికి ఐదున్నర క్వింటాళ్ల పైబడి దిగుబడి రావాలి. దీంతో నష్టపోయిన రైతులందరు అప్పట్లో అధికారులను ఆశ్రయించారు. దీంతో శాస్త్రవేత్తలతో పంట చేలల్లో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 2007 కాటన్‌సీడ్ యాక్ట్ ప్రకారం విత్తనం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు నష్టపరిహార కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్త, ఎక్కువ పంట నష్టపోయిన గ్రామానికి సంబంధించి ఒక ప్రతినిధి, విత్తన కంపెనీ ప్రతినిధి సభ్యులుగా ఈ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇతర విత్తనాల పరంగా సగటున ఎకరానికి ఐదున్నర క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ నాసిరకం పత్తి విత్తనాల కారణంగా రెండు క్వింటాళ్లలోపే పత్తి దిగుబడి వచ్చినట్లు నిర్ధారించారు. మిగతా మూడున్నర క్వింటాళ్ల పత్తిని నష్టపోయినందునా దాని పరిహారం కనీస మద్దతు ధర ఆధారంగా చెల్లించాలని ఆదేశించారు. గతేడాది పత్తి కనీస మద్దతు ధర రూ.4320 కాగా, 3500 మంది రైతులకు 8800 ఎకరాల్లో సుమారు రూ.13 కోట్లు రైతులకు చెల్లించాలని ఇటీవల స్పష్టం చేశారు. దానికి మార్చి 16లోగా చెల్లించాలని కంపెనీ ప్రతినిధులకు గడువు విధించారు. అయితే ఆ కంపెనీ చెల్లిస్తుందా లేదో తెలియదు. ప్రభుత్వం నకిలీ విత్తనాల మోసాలను అరికట్టేందుకు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దాని ప్రభావం కనబడటం లేదు. పీడీ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాలి ప్రభుత్వం పీడీ యాక్ట్‌ను కఠినంగా అమలు చేసి నకిలీ విత్తన మోసాలను అరికట్టాలి. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది. రైతులను మోసం చేసేవారిని వదలకూడదు. ఖమ్మంలో మిర్చి సీడ్స్ నకిలీవి విక్రయించిన కంపెనీపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలోనూ గతేడాది నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులను ఏకం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నష్టానికి సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారణ చేసింది. వారికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – బాలూరి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ రైతు సంఘం అధ్యక్షుడు సంయుక్తంగా తనిఖీలు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా దాడులు చేసేందుకు బృందాలను మండల వారీగా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే కిసాన్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి తెలియజేయాలి. రైతులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ విత్తనాల బారిన పడకూడదు. కంపెనీలు, డీలర్లు చెప్పే మాయమాటలను నమ్మవద్దు. – ఆశకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్ -
రేషన్.. కేరాఫ్ కరప్షన్!
కర్నూలు(అగ్రికల్చర్)/ కల్లూరు రూరల్: పేదలకు తక్కువ ధరకు సరకులు అందించే రేషన్ దుకాణాలు అవినీతి, అక్రమాలకు మారుపేరుగా మారాయి. యాభై శాతం కార్డుదారులకు చక్కెర ఇవ్వకుండా బయటి మార్కెట్లో అమ్ముకుని డీలర్లు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ–పాస్ మిషన్‌లో బియ్యం, చక్కెరకు ఒకేసారి వేలిముద్ర వేయించుకొని బియ్యం మాత్రం ఇస్తూ చక్కెరను నొక్కేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. గట్టిగా అడిగిన వారికి మాత్రమే చక్కెర ఇస్తున్నట్లు డీలర్స్ అసోసియేషన్‌కు చెందిన ఓ నాయకుడే ఒప్పుకోవడం గమనార్హం. బియ్యం పంపిణీలో కూడా తక్కువ తూకాలు వేస్తూ కార్డుదారుల నోళ్లలో మట్టి కొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పునఃపంపిణీ నుంచి.. ఏడాది క్రితం రేషన్‌కార్డులకు చక్కెర పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జనవరి నుంచి అన్ని కార్డులకు అరకిలో ప్రకారం పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలో 11,82,111 రేషన్‌కార్డులకు సంబంధించి 2,242 చౌక దుకాణాలున్నాయి. ఇందులో అంత్యోదయ అన్న యోజన కార్డులు 60వేల వరకున్నాయి. తెల్లకార్డులకు డిసెంబరు వరకు చక్కెర బంద్ చేసినప్పటికీ అంత్యోదయ కార్డులకు కిలో ప్రకారం ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జనవరి నుంచి తెల్ల కార్డులకు అర కిలో ప్రకారం ఇస్తున్నా రు. ఫిబ్రవరికి సంబంధించి అన్ని చౌకదుకాణాల డీలర్లు డీడీలు చెల్లించి చక్కెర లిఫ్ట్ చేసినట్లు స్పష్టమవుతోంది. గట్టిగా అడిగితేనే చక్కెర.. ఫిబ్రవరికి సంబంధించి బుధవారం సాయంత్రం వరకు 9,87,385 కార్డులకు సరుకులు పంపిణీ చేశారు. అంత్యోదయ కార్డులకు కిలో రూ.13.50, తెల్లకార్డులకు అరకిలో రూ.10 ప్రకారం చక్కెర పంపిణీ చేయాల్సి ఉంది. అయితే 50 శాతం కార్డులకు చక్కెర ఇచ్చిన దాఖలాలు లేవు. అడిగిన వారికి ఇస్తున్నామని డీలర్లే చెబుతుండడాన్ని బట్టి అక్రమాలు ఏస్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. జిల్లా యంత్రాంగం మొత్తం కొలువైన కర్నూలులోనే పలువురు డీలర్లు చక్కెర ఇవ్వకపోవడం గమనార్హం. ఇలా మిగుల్చుకున్న చక్కెరను కిలో రూ.30 నుంచి రూ.35 ప్రకారం బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రసీదులు ఇవ్వరు.. ఈ–పాస్ మిషన్‌లో వేలిముద్ర వేయించుకొని బియ్యంతో పాటు చక్కెర కూడా ఇవ్వాల్సి ఉంది. పంపిణీ చేసిన సరుకులు, వాటి ధర వివరాలతో కార్డుదారులకు రసీదులు ఇవ్వాలి. అయితే తమ అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశ్యంతో డీలర్లు ఎక్కడా రసీదులు ఇవ్వడం లేదు. -
మొరాయిస్తున్నాయి..!
‘‘ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. అందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ, అందులో నెలకొంటున్న సాంకేతిక సమస్యలను సత్వరం పరిష్కరించకపోవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.’’ జడ్చర్ల : ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబందించి ఈ–పాస్ విధానాన్ని అమలులోకి తేగా సాంకేతిక సమస్యలతోఅటు డీలర్లు ఇటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివైస్‌లకు సంబందించి గ్రామీణప్రాంతాలలో పూర్తి స్థాయిలో నెట్ రాకపోవడంతో పంపిణీలో ఆలస్యం చోటు చేసుకుం టుంది. దీనికి తోడు ఇటీవల డివైస్‌లలో సాఫ్ట్‌వేర్‌ను ఆకస్మికంగా మార్పు చేయడంతో ఈనెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ నిలిచిపోయింది. ఏమైంది అన్న విషయం అర్థం గాక మొదటి రోజు అటు అధికారులు ఇటు డీలర్లు తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. తీరా వయాసిస్ కంపెనీ తమ సాఫ్ట్వేర్ మార్పు చేసి ఆధార్ అనుసంధానంగా సర్వర్‌తో లింక్ చేసే కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి అమలు చేస్తుందని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్తోనే.. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ పూర్తి చేసే విధంగా అధికారులు విధివిధానాలను రూపొందించారు. 15వ తేదీ తర్వాత బియ్యం పంపిణీ ఉండదు. ఆ సమయంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసే విధంగా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆకస్మికంగా 1వ తేదీనుంచి అంటే బియ్యం పంపిణీ ప్రారంభంరోజు నుంచే సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేయడంతో సమస్య నెలకొందని అటు అధికారులు ఇటు రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ సమస్యలు ఈ–పాస్ విధానంలో తరచు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేక పోవడంతో సమస్య నెలకొంటుందని అంటున్నారు. తమకు ఎయిర్టెట్, ఐడియా సిమ్‌లు జారీ చేశారని అయితే కొన్ని ప్రాంతాల్లో ఆయా సిమ్‌లు పనిచేయడం లేదన్నారు. ఒక వేళ పనిచేసినా నెట్ సిగ్నల్ సరిగ్గా లేక నెట్ నెమ్మదిగా ఉంటుందని.. దీంతో పొద్దస్తమానం సమయం వెచ్చించే పరిస్థితి ఉంద న్నారు. 4జీ నెట్ అందించే జియో సిమ్‌లను సరఫరా చేస్తే బాగుంటుందని వారు పేర్కొంటున్నారు. నెట్ స్పీడ్‌గా వస్తే పని కూడా సులువు అవుతుందని, బియ్యం పంపిణీని త్వరగా పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నా మని కొందరు డీలర్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేగాక మిషన్లలో సాంకేతిక సమస్య తలెత్తితే సదరు మిషన్‌ను తీసుకుని సంబందిత తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని టెక్నిషియన్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంటుందన్నారు. దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు ఇటీవల డివైస్(మిషన్)లలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఓ టెక్నీషియన్‌ను తమ కార్యాలయంలో అందుబాటులో ఉంచి సమస్యను సరిచేయిస్తున్నాం. దాదాపుగా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి బియ్యం పంపిణీకి చర్యలు తీసుకున్నాం. – లక్ష్మీనారాయణ, తహసీల్దార్, జడ్చర్ల -
జీఎస్టీ డీలర్ల పంపకాలు పూర్తి!
సాక్షి, హైదరాబాద్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలులో కీలక ఘట్టం ముగిసింది. ఇన్నాళ్లూ జీఎస్టీ కట్టాల్సిన డీలర్ల(వ్యాపారులు) నుంచి ఏ శాఖ పన్ను వసూలు చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉండగా, ఇప్పుడు ఈ సమస్య పరిష్కారమైంది. ఈ అంశానికి సంబంధించి సెంట్రల్ ఎక్సైజ్, రాష్ట్ర పన్నుల శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ పరిధిలోకి వస్తున్న 1.83 లక్షల మంది డీలర్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా 33 వేల మందిని సెంట్రల్ ఎక్సై జ్‌కు, 1.5 లక్షల మందిని పన్నుల శాఖకు కేటాయించారు. ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేశారు. లాటరీ పద్ధతిన ఎంపిక..: జీఎస్టీ కింద పన్ను చెల్లించేందుకు రాష్ట్రంలో 2.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 1.6 లక్షల మంది వ్యాట్ నుంచి జీఎస్టీకి బదిలీ కాగా, మరో 90 వేల మంది కొత్తగా జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకున్నారు. వ్యాట్ పరిధిలో రిజిస్టర్ అయిన డీలర్లంతా (సర్వీసు ట్యాక్స్ చెల్లించే డీలర్లు మినహా) పన్నుల శాఖ పరిధిలోకి వచ్చేవారు. కానీ, జీఎస్టీ నిబంధనల ప్రకారం వార్షిక టర్నోవర్ 1.5 కోట్ల లోపు ఉన్న డీలర్లలో 90 శాతం మందిని పన్నుల శాఖ, 10 శాతం మందిని సెంట్రల్ ఎక్సైజ్ శాఖ పర్యవేక్షించాలి. రూ.1.5 కోట్ల కన్నా ఎక్కువ వ్యాపారం చేసే డీలర్లలో చెరో 50 శాతం పంచుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఇరుపక్షాలు డీలర్లను పంచుకునేందుకు 1,83,327 మంది డీలర్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో 1.5 కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న 36,830 మందిలో 18,414 మందిని సెంట్రల్ ఎక్సైజ్‌కు, 18,416 మంది రాష్ట్ర పన్నుల శాఖకు కేటాయించారు. రిజిస్ట్రేషన్ ప్రకారం ఒకటో నంబర్ డీలర్ ను రాష్ట్ర పన్నుల శాఖకు, రెండో నంబర్ డీలర్‌ను సెం ట్రల్ ఎక్సైజ్‌కు కేటాయించారు. 1.5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న 1,46,497 మంది డీలర్లలో 14,649 సెంట్రల్ ఎక్సైజ్‌లోకి, 1,31,848 మంది రాష్ట్ర పన్నుల శాఖ పరిధిలోకి తెచ్చారు. 10 మంది డీలర్లను తీసుకుని, 8వ నంబర్‌ను సెంట్రల్ ఎక్సైజ్ శాఖకు కేటాయించారు. 10 మంది డీలర్ల చొప్పున విభజించి లాటరీ పద్ధతిన పంపిణీ ప్రక్రియను పూర్తి చేశారు. కాగా, జీఎస్టీ అమల్లోకి వచ్చిన ఆరునెలలకు పూర్త యిన ఈ ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణకు అధికారిక ఆమోదముద్ర లభించనుంది. -
నానో.. కథ ముగిసినట్టేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : రతన్ టాటా డ్రీమ్ కార్గా గుర్తింపు తెచ్చుకున్న నానో మార్కెట్‌నుంచి తెరమరుగు కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లలో మెజారిటీదారులు.. నానో బుకింగ్స్ నిలిపేసినట్లు తెలుస్తోంది. ఆరంభంలోనే అంతంతమాత్రంగా ఉన్న బుకింగ్స్.. గత నాలుగు నెలలుగా మరింత తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని డీలర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లోనూ నానో కార్ల ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో నానో కార్ల ఉత్పత్తి 180 ఉండగా.. అక్టోబర్ నాటికి దీనిని 5కు తగ్గించారు. టాటా నానో కార్‌ను ప్రకటించిన సమయంలో కేవలం లక్ష రూపాయలకే సామాన్యుడికి కారు అందిస్తున్నట్లు రతన్ టాటా 2008లో ప్రకటించారు. తరువాత అనేక వివాదాలు, సమస్యలు, ప్లాంట్ తరలింపు, ఇతర కారణాల వల్ల దీని ధర మారుతూ వచ్చింది. ప్రస్తుతం నానో ధర.. రూ.2.69 లక్షలుగా ఉంది. ప్రస్తుతం టాటా మోటార్స్‌కు నానో మోడల్ ఒక వైట్ ఎలిఫెంట్‌లా మారింది. -
అమలు చేసేదెట్లా?
జీఎస్టీపై వాణిజ్య పన్నుల శాఖలో ఆందోళన.. రేపు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తు సేవల పన్ను ♦ ఇప్పటికే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో 22% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జీఎస్టీ అమలు చేయాలంటే మరో 22% పోస్టులు కావాలి. ఉద్యోగులకు జాబ్‌చార్ట్ ఏమిటో తేలకపోవడం సమస్యగా మారింది. సర్కిళ్లు, డివిజన్లను పెంచక పోవడంతో పనిఒత్తిడి తీవ్రం కానుంది. ♦ రూ.1.5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న డీలర్లలో 90% వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించాలని.. 10% సెంట్రల్ ఎక్సైజ్‌కు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో సమస్య తలెత్తింది. దీంతో 1.70 లక్షల మంది డీలర్లను వాణిజ్య శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ♦ జీఎస్టీ అమలులో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కొరత మరో సమస్యగా పరిణమించింది. పోర్టల్ బిజీగా ఉండి స్తంభిస్తుండటంతో.. డీలర్లు రిజిస్ట్రేషన్లకు ధ్రువపత్రాలను సమర్పించడంలో జాప్యమవు తోంది. ఇక డీలర్లు ప్రతినెలా సమర్పించాల్సిన వివరాల పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేయలేదు. ప్రతిష్టాత్మకంగా అమల్లోకి వస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు చుక్కలు చూపుతోంది. అసలే సిబ్బంది కొరత.. ఇప్పటికే 22 శాతం పోస్టులు ఖాళీగా ఉండడం.. ఆపై జీఎస్టీ కోసం అదనంగా మరో 22 శాతం సిబ్బంది అవసరం కావడం ఇబ్బందికరంగా మారింది. డీలర్ల సంఖ్యకు అనుగుణంగా సర్కిళ్లు, డివిజన్లను ఏర్పాటు చేయకపోవడం.. ఉద్యోగులకు ఇంకా జాబ్‌చార్ట్ ఏమిటో తేలకపోవడం.. తగిన సంఖ్యలో కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం.. వెబ్ పోర్టల్ సమస్యలు వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి పరిష్కారంపై వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతా ధికారులు దృష్టి సారించినా... జీఎస్టీ అమల్లోకి వచ్చాక రెండు, మూడు నెలల వరకు సమస్యలు కొనసాగే అవకా శాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శాఖ పునర్వ్యవస్థీకరణ కోసం ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. – సాక్షి, హైదరాబాద్ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు? వాస్తవానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ అమలు బాధ్యత రెండు శాఖలపై పెట్టారు. ఒకటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ ఎక్సైజ్ శాఖ కాగా, మరొకటి ఆయా రాష్ట్రాల పరిధిలో ఉండే వాణిజ్య పన్నుల శాఖ. అయితే కేంద్ర పరిధిలోని సెంట్రల్ ఎక్సైజ్ శాఖ జీఎస్టీ చట్టం అమలుకు అనుగుణంగా రాష్ట్రంలో తన శాఖను పునర్వ్యవస్థీకరించుకుంది. తమ అధీనంలోకి వచ్చే డీలర్ల సంఖ్యకు అనుగుణంగా 8 కమిషనరేట్లు, 30 డివిజన్లు, 150 సర్కిళ్లను ఏర్పాటు చేసుకుని సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మాత్రం ఇంకా ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ చేయలేదు. పదేళ్ల క్రితం నుంచి ఉన్న ఒక కమిషనరేట్, 12 డివిజన్లు, 91 సర్కిల్ కార్యాలయా లతోనే జీఎస్టీ అమలుకు సిద్ధమయింది. డీలర్ల లెక్క తేలకనే.. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పూర్తిగా సిద్ధం కాకపోవడానికి ఇతర కారణాలూ ఉన్నాయని చెబుతున్నారు. జీఎస్టీ కౌన్సిల్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయడంతో కొన్ని రాష్ట్రాల్లో మినహా దేశవ్యాప్తంగా ఈ సమస్య నెలకొందని అంటున్నారు. ముఖ్యంగా రూ.1.5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న డీలర్లలో 90 శాతం వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించాలని.. కేవలం 10 శాతమే సెంట్రల్ ఎక్సైజ్‌కు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో సమస్య తలెత్తిందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని దాదాపు 3 లక్షల మంది డీలర్లలో 60 శాతం మంది రూ.1.5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న వారే. అందులో 90 శాతం అంటే దాదాపు 1.70 లక్షల మంది డీలర్లను వాణిజ్య పన్నుల శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేగాకుండా రూ.1.5 కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న డీలర్ల పన్ను చెల్లింపులతో పోలిస్తే తక్కువ టర్నోవర్ ఉన్న వారి పన్ను చెల్లింపులు అంత పారదర్శకంగా ఉండవనే అభిప్రాయముంది. డీఫాల్టర్లు, రిటర్నులు ఇవ్వని డీలర్లు ఈ జాబితాలోనే ఎక్కువగా ఉంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖపై అదనపు భారం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక జీఎస్టీ అమలుకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఉన్నతాధికారులు కార్యాచరణ వేగవంతం చేశారు. ఉద్యోగ సంఘాలు కోరినన్ని కాకపోయినా సర్కిళ్లు, డివిజన్లు పెంచే ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగుల్లో ఆందోళన కనీసం 2 వేల మంది డీలర్లకు ఒక సర్కిల్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 153 సర్కిళ్లు, 20 డివిజన్లు, తొమ్మిది కమిషనరేట్లు, ఒక చీఫ్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా పదోన్నతులిచ్చి దాదాపు 1,600 ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతున్నాయి. ఇక జీఎస్టీ అమలుపై ఏర్పాటు చేసిన శాఖాపరమైన కమిటీ కూడా కొత్తగా 5 కమిషనరేట్లు, 8 డివిజన్లు, 49 సర్కిళ్లు ఏర్పాటు చేసి 864 పోస్టులను భర్తీ చేయాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో శాఖ పునర్వ్యవస్థీకరణపై తర్జనభర్జన జరుగుతోంది. ఇక రెండు, మూడు రోజుల్లోనే (జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశం ముగిసిన తర్వాత) ఉద్యోగుల జాబ్‌చార్ట్ కూడా వెలువడనుంది. తప్పని ఆన్లైన్ తంటాలు జీఎస్టీ అమలు విషయంలో రాష్ట్రంలో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కొరత మరో సమస్యగా పరిణమించింది. పోర్టల్ బిజీగా ఉండి స్తంభించిపోతుండడంతో.. డీల ర్లు రిజిస్ట్రేషన్ల కోసం సమర్పించాల్సిన ధ్రువపత్రా లను తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. దీనికి తోడు డీలర్లు సమర్పించాల్సిన వివరాలకు సంబం« దించి చాంతాడంత జాబితా ఉండడంతోనూ రిజిస్ట్రేష న్కు చాలా సమయం తీసుకుంటోంది. ఇక డీలర్లు ప్రతినెలా సమర్పించాల్సిన, అప్లోడ్ చేయాల్సిన వివరాలకు సంబంధించి ఇంతవరకు పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేయలేదు. మరోవైపు జీఎస్టీ అమలు కోసం ప్రతి అధికారికి డిజిటల్ సిగ్నేచర్ ఉండడం, దాని ద్వారానే లాగిన్ అవ్వాల్సి ఉండడంతో సర్కిల్ కార్యాలయాల్లో కంప్యూటర్ల కొరత ఏర్పడనుంది. సర్కిళ్ల పెంపుపై ప్రతిపాదనలు జీఎస్టీ అమలు నేపథ్యంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల ఉద్యోగుల జేఏసీ నేతృత్వంలో ఆ శాఖ ఉద్యోగులు బుధ వారం కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమ య్యారు. వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ ఆఫీసర్ల అసోసియే షన్ (టీసీటీజీవోఏ), వాణిజ్య పన్నుల శాఖ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీసీటీఎన్జీఓసీఏ), వాణి జ్య పన్నుల శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం (టీసీ టీసీ– ఐVఏ) ప్రతినిధులు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికీ జీఎస్టీ వల్ల ఇబ్బంది ఉండదని, పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని సర్కిళ్ల పెంపు ప్రతిపాదనలను కూడా ప్రభుత్వానికి పంపించామని ఈ సందర్భంగా కమిషనర్ చెప్పినట్టు సమాచారం. త్వరగా పునర్వ్యవస్థీకరించాలి ‘‘జీఎస్టీ అమలు కోసం వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్య వస్థీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా విజ్ఞప్తి మేరకు ప్రతిపా దనలు సిద్ధం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, అధికారులకు కృతజ్ఞ తలు తెలియజేస్తున్నాం. కానీ ఇది ఇప్పటికే ఆలస్యమైంది. వీలైనంత త్వరగా పున ర్వ్యవస్థీకరణపై కసరత్తు పూర్తి చేయాలి. అవసరమైన మేరకు ఉద్యోగులను పెంచుకుని సర్కిళ్లు, డివిజన్లు, కమిషనరేట్లు పెంచాలి..’’ – తూంకుంట వెంకటేశ్వర్లు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ -
19 నుంచి రంజాన్‌తోఫా పంపిణీ
– ఈ నెల16 నుంచి 18 వరకు డీలరు పాయింట్లకు సరుకులు చేర్చాలి –జేసీ ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): రంజాన్‌తోఫా సరుకులను ఈనెల 19 నుంచి 27వ రకు పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ... ముస్లింలకు సంబంధించి ఇప్పటి వరకు 2.02 లక్షల కార్డులు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేసిన కొత్తకార్డుల్లో ముస్లింల కార్డులను గుర్తించాల్సి ఉందని చెపా్పరు. ఈ ప్రక్రియ 14వ తేదీకి కొలిక్కి వస్తుందని వెల్లడించారు. ఈ నెల 16 నుంచి స్టాక్ పాయింట్ల నుంచి డీలరు పాయింట్‌కు సరుకులు లిప్ట్ చేయాలని సూచించారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి సరుకులు అందే విధంగా చూడాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కానుకలు పంపిణీ చేయాలన్నారు. ఆలూరు, పత్తికొండ సీఎస్‌డీటీలకు షోకాజ్ నోటీసులు రంజాన్ తోఫా కానుకల పంపిణీపై నిర్వహించిన సమావేశానికి ఆలూరు, పత్తికొండ సీఎస్డీటీలు గైర్హాజరు కావడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జేసీ డీఎస్ఓను ఆదేశించారు. సమావేశంలో డీఎస్ఓ సుబ్రమణ్యం, జిల్లా పౌరసరఫరాల సంçస్థ మేనేజర్ జయకుమార్, ఏఎస్ఓలు రాజరఘువీర్, వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధికి ఎసరు
– జైల్‌రోడ్డులో చిరువ్యాపారులపై నగరపాలక సంస్థ యంత్రాంగం ప్రతాపం – రోడ్డు పక్కల వ్యాపారాలు చేయకూడదంటూ హుకుం – ఆశీల దోపిడీ ఆపాలని కోరిన చిరువ్యాపారులు – అది పట్టించుకోకుండా బడుగుజీవుల ఉపాధిపై వేటు – వైఎస్సార్సీపీ నేతల జోక్యంతో ఊరట సాక్షి, రాజమహేంద్రవరం: కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా ఉంది నగరంలోని బడుగుజీవుల పరిస్థితి. తమ వద్ద ఆశీలు కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ సరిహద్దులు దాటి వచ్చి మరీ రోజుకు రూ. 20 నుంచి రూ. 40లు వసూలు చేస్తున్నారని, ఈ దోపిడీ ఆపాలని కోరిన చిరు వ్యాపారులకు నగరపాలక సంస్థ యంత్రాంగం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. నగరంలోని వై జంక్షన్ నుంచి లాలాచెరువు వరకు ఉన్న జైల్ రోడ్డుకు ఇరు వైపులా చిరు వ్యాపారులు సైకిళ్లు, మోటారు సైకిళ్లు, బుట్టలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలా కోరుకొండ రోడ్డు, ఏవీ అప్పారావు, జేఎన్ రోడ్డు, పేపర్ మిల్లు రోడ్డులు, జన సంచారం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. జైల్ రోడ్డులో దాదాపు 200 మంది బడుగు జీవులు పుచ్చకాయ, బొప్పాయి, తాటిముంజలు, సపోటా తదితర ఫలాలు అమ్ముకుంటూ సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతున్నారు. వీరిలో పది మంది వికలాంగులు కూడా ఉన్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి ఉపాధి చూపకపోయినా సొంతంగా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నాలుగు రోజుల నుంచి నగరపాలక సంస్థ అధికారులు ఈ తరహా వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అధికారులు, పోలీసులు వచ్చి ఈ రోడ్డుకు ఇరువైపులా వ్యాపారాలు చేయకూడదని హడలెత్తిస్తున్నారు. ‘ఈ రోడ్డు రాజవీధి లాంటిది. ఎంతో మంది రాజులు (వీఐపీలు) ఈ రోడ్డులో ప్రయాణిస్తుంటార’నే కారణం చెబుతూ హడావుడి చేస్తున్నారు. రాజధానుల్లో లేని నిబంధనలు ఇక్కడా...? వీఐపీలు తిరిగే ఈ రహదారిలో చిరువ్యాపారులు జీవనం సాగిస్తుంటే తప్పేంటని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాజధాని హైదారాబాద్‌లో, విజయవాడలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చీపోయే సచివాలయం ఎదుట, దేశ, విదేశాల యాత్రికులు సందర్శించే ట్యాంక్ బండ్‌పైన చిరుతిళ్ల బండ్లు, షోడా బండ్లు, జామ, పుచ్చకాయల వ్యాపారాలు చేసుకుంటూ వందలాది మంది జీవిస్తుంటారు. సచివాలయం, ట్యాంక్బండ్లు నగరంలోని జైల్‌రోడ్డు కంటే ప్రాముఖ్యమైనవి కాదా?, అక్కడ బడుగు జీవులు చిరువ్యాపారాలు చేసుకుని బతుకుతుండగా లేనిది ఇక్కడ విచిత్ర నిబంధనలు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఆశీలు కాంట్రాక్టర్లు నగరంలో దొరికినకాడ దొరికినట్లు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తుంటే పట్టించుకోని యంత్రాంగం తమ ఉపాధిని పోగొట్టేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ జోక్యంతో బడుగుజీవులకు న్యాయం.. తమకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నేతలకు చిరువ్యాపారులు విన్నవించుకున్నారు. బుధవారం వైఎస్సార్సీపీ నేతలు కందుల దుర్గేష్, రౌతు సూర్యప్రకాశరావు, మేడపాటి షర్మిలారెడ్డి, గుత్తుల మురళీధర్‌రావు తదితరులు అధికారులతో మాట్లాడి చిరు వ్యాపారులకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
దళారుల్లో దడ..
► చండూరు కొనుగోలు కేంద్రంలో కందులు విక్రయించిన దళారులకు బిగుస్తున్న ఉచ్చు ► ఇటు రెవెన్యూ.. అటు విజిలెన్స్ శాఖలు సమన్వయంతో ముందుకు.. ► 20 క్వింటాళ్ల పైబడి అమ్మిన వారి వివరాలు సేకరించే పనిలో అధికార యంత్రాంగం ► ఇప్పటికే జిల్లాలోని తహసీల్దార్లకు వెళ్లిన మెయిల్ చండూరు: చండూరు వ్యవసాయ మార్కెట్లో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో కందులు విక్రయించిన దళారులకు ఉచ్చు బిగుస్తోంది. మరో వారంలో దళారులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు అటు రెవెన్యూ.. ఇటూ విజిలెన్స్.. రెండు శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం జేసీ నారాయణరెడ్డి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసినప్పుడు దళారుల లిస్టు తయారు చేసి తనకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా గత శుక్రవారం విజిలెన్స్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో ఓ బృందం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఈ కొనుగోలు కేంద్రంలో 20 క్వింటాళ్లకు పైగా విక్రయించిన వారి వివరాలను స్థానిక తహసీల్దార్‌కు అందించాలని ఆయన మార్కెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్లో జరిగిన తతంగంపై రైతుల çనుంచి సమాచారం తీసుకున్నారు. కేంద్రంలో ఏ మండలం నుంచి ఎంత మంది 20 క్వింటాళ్లకు పైగా విక్రయించారో వివరాలతో కూడిన సమాచారాన్ని ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లకు చండూరు తహసీల్దార్ వెంకట్‌రెడ్డి మెయిల్ పంపిం చారు. కందులు విక్రయిం చిన రైతులకు భూమి ఉందా.. ఉంటే కందులు పండించారా.. ఎంత పంట పండింది.. అనే కోణంలో విచారించి కలెక్టర్‌కు నివేదిక అందించనున్నారు. 147 మంది సమాచారం కోసం.. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 37,559 క్వింటాళ్ల కందులను 4505 మంది రైతుల ద్వారా కొనుగోలు జరిపారు. ఇందులో 158 మంది 20 క్వింటాళ్లకు పైగా విక్రయించినవారున్నారు. ఇందులో చండూరు మండలానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. 11 మందిలో కస్తాల గ్రామానికి చెందిన ఓ వ్యాపారి, భార్యతో కలిసి భూమి లేకుండానే కందులను అమ్మినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. మిగిలిన 147 మంది దళారుల సమాచారం కోసం రెవెన్యూ సిబ్బంది వేట సాగిస్తోంది. కందుల కొనుగోలు కేంద్రాన్ని చండూరు మార్కెట్లో జనవరి 23 తేదీన హాకా ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఫిబ్రవరి 23 వరకు 1994 మంది రైతులకు రూ.8 కోట్ల పైచిలుకు బకాయిలు చెల్లించారు. ఇంకా రూ.5.2 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. -
డీలర్లకు తూకం సరకులు
–జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జయకుమార్ కర్నూలు(అగ్రికల్చర్): పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి స్టాక్ పాయింట్లలో డీలర్లకు సరుకులు విధిగా కాటా వేసి ఇవ్వాల్సి ఉందని, ఇందుకు అనుగుణంగా స్టాక్ పాయింట్ ఇన్‌చార్జీలకు ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జయకుమార్ తెలిపారు. ఆయన బుధవారం సాక్షితో మాట్లాడుతూ... తాను ఇటీవలనే జిల్లా మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నానన్నారు. వచ్చిన వెంటనే డీలర్లకు సరుకులను తూకం వేసి ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో 2,423 చౌక ధరల దుకాణాలు ఉండగా ఏప్రిల్ నెలకు సంబందించి 90 శాతం షాపులకు సరుకులు చేర్చినట్లు తెలిపారు. మిగిలిన షాపులకు 30వ తేదీ సాయంత్రానికి చేరుతాయన్నారు. చక్కెర కొంత ఆలస్యమైనా.. అన్ని కార్డులకు విడుదల అయిందని వివరించారు. చౌకదుకానికి సరుకులు చేరినట్లు డీలర్లు..ఈ–పాస్ మిషన్‌పై వేలిముద్ర వేయాల్సి ఉంటుందన్నారు. -
ఈ-పాస్ మిషన్లతోనే ఎరువుల పంపిణీ
- 1 నుంచి పకడ్బందీగా ప్రక్రియ - కర్నూలు సబ్ డివిజన్ డీలర్ల అవగాహన సదస్సులో ఏడీఏ కర్నూలు(అగ్రికల్చర్): మే నెల 1నుంచి రసాయన ఎరువులను విధిగా ఈ-పాస్ మిషన్ల ద్వారానే పంపిణీ చేయాలని కర్నూలు ఏడీఏ రమణారెడ్డి సూచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీపై కర్నూలు సబ్ డివిజన్లోని రసాయన ఎరువుల డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ...డీలర్లకు నాగార్జున, గ్రీన్‌ఫీల్డ్, క్రిప్కో కంపెనీలు ఈ-పాస్ మిషన్లను సరఫరా చేస్తాయన్నారు. ప్రతి డీలరు విధిగా తమ వివరాలను ఈ-పాస్ మిషన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రైతుల ఆధార్ నెంబర్లు, వెబ్‌ల్యాండు వివరాలను కూడా వీటిలో అప్లోడ్ చేస్తామన్నారు. మే నెల 1నుంచి మాన్యువల్‌గా ఒక్క బస్తా కూడా విక్రయించరాదన్నారు. భూసార పరీక్ష పలితాలను బట్టి, సాగు చేసే పంటను బట్టి ఎన్ని బస్తాల ఎరువులు అవసరమో అన్ని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీ చేయలేమని భావించే డీలర్లు ఈ వ్యాపారం నుంచి వైదొలగవచ్చన్నారు. జేడీఏ కార్యాలయ ఫర్టిలైజర్ ఏఓ వేదమణి, సీ.బెళగల్ ఏఓ సురేష్‌బాబు ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు, కల్లూరు వ్యవసాయాధికారులు అశోక్‌కుమార్‌రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ భారం
సబ్సిడీ సిలిండర్ ధరపై రూ.90 పెంపు నేటి నుంచి అమలు జిల్లావాసులపై నెలకు రూ.86 కోట్లు అదనపు భారం పెంచిన మొత్తం సబ్సిడీ రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటన చిత్తూరు(కార్పొరేషన్): జిల్లావాసులపై కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌బండ భారాన్ని మరింతగా మోపింది. సబ్సిడీ సిలిండర్‌పై ఏకంగా రూ.90 ధర పెంచడంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెంచిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో తిరిగి ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే సబ్సిడీ సక్రమంగా జమకాక ఇబ్బంది పడుతున్న తమకు కేంద్రం తాజా నిర్ణయంతో మరిన్ని ఇబ్బందులు ఖాయమని జనం వాపోతున్నారు. ప్రసుత్తం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.738 ఉండగా అది రూ.828కు పెరిగింది. అయితే పెంచిన మొత్తాన్ని ఖాతాల్లో సబ్సిడీ రూపంలో జమచేయనున్నట్లు ప్రకటించారు. దీంతో జిల్లావాసుల పై నెలకు రూ.86 కోట్లకు వరకు అదనపు భారం పడనుంది. గ్యాస్‌ధర పెంపు నిర్ణయం గురువారం నుంచి అమలులోకి రానుంది. అయితే బుధవారం కేంద్రం ప్రకటన చేసిన వెంటనే డీలర్లు రూ.850కు సిలిండర్లను విక్రయించారు. ఇదేంటని ప్రశ్నిస్తే రేటు పెరిగిందని సమర్థించుకుంటున్నారు. తొమ్మిదిన్నర లక్షల మందిపై భారం.. జిల్లా జనాభా 42 లక్షలు ఉండగా ఇందులో 9,58,786 మంది సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. 90 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా 2,800 మంది నాన్ సబ్సిడీ సిలిండర్లను,3200 మంది వాణిజ్య అవసరాల సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఈ లెక్కన 9,58,786 మంది వినియోగదారులపై నెలకు అదనంగా రూ.86 కోట్లు వ్యయం వేశారు. ఈ మొత్తం ఖాతాల్లో జమచేస్తామని చెబుతున్నారు. వాణిజ్య సిలిండర్లపై రూ.148.50 పెంచారు. ఆ లెక్కన ప్రతినెలా అదనంగా మరో రూ.10 లక్షలు భారం పడనుంది. ఇది వరకు రూ.738 ఉన్న సిలిండర్‌ను రూ.760కు విక్రయించగా ఇకపై అది రూ.828కి చేరనుంది. డెలివరీతో పాటు రూ.850 వరకు వసూలు చేస్తారు. బుధవారమే దోపిడీ నూతనంగా పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలు గురువారం నుంచి అమలులోకి వస్తాయి. కానీ డీలర్లు బుధవారం కూడా రూ.850(హోమ్ డెలీవరీ) వసూలు చేశారు. ఈ లెక్కన రోజులోనే లక్షలాది రూపాయలు దోచుకున్నారని వినియోగదారులు వాపోయారు. -
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిద్దాం
- డీలర్ల అవగాహన సదస్సులో ఎల్డీఎం కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో వందశాతం నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టాలని ఎల్డీఎం నరసింహారావు సూచించారు. నగదు రహిత లావాదేవీలపై చౌకధరల దుకాణాల డీలర్లకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పినో కంపెనీ, ఐజీఎస్ ఇంటిగ్రాస్ కంపెనీలు ప్రజాపంపిణీలో నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు సాంకేతిక సహకారం ఇవ్వడంతో పాటు అవగాహన కల్పిస్తున్నట్లు ఎల్డీఎం తెలిపారు. నగదు ప్రమేయం లేని లావాదేవీలు వంద శాతం అమలు కావాలంటే కార్డుదారుల బ్యాంకు ఖాతాను ఆధార్ నెంబరుతో అనుసంధానించాలన్నారు. బ్యాంక్ సర్వర్‌ను ఎన్ఐసీ సర్వర్‌తో లింకప్ చేయడం ద్వారా ఈ-పాస్ మిషన్ ద్వారానే నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చన్నారు. కార్డుదారులు ఈ-పాస్ మిషన్‌లో వేలిముద్ర వేస్తే బ్యాంకు ఖాతా వివరాలు వస్తాయని తెలిపారు. సరుకులు, వాటి ధరలను బట్టి వెంటనే బిల్లు జనరేట్ అవుతుందని, దాని ప్రకారం అమౌంటు కార్డుదారుని ఖాతా నుంచి డీలరు ఖాతాకు జమ అవుతుందని వివరించారు. జిల్లాలో 1556 మంది డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించినట్లు వివరించారు. కార్యక్రమంలో కర్నూలు అర్బన్ ఎఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, పినో కంపెనీ ప్రతినిధి చంద్రమోహన్ నాయుడు, ఐజీఎస్, ఇంటిగ్రాస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
విజిలెన్స్ అధికారుల దాడి
- 123.60 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం - ప్రముఖ వ్యాపారి హస్తం ఉన్నట్లు సమాచారం కర్నూలు (అగ్రికల్చర్): డీలర్ల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని వ్యాపారి బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేస్తుండగా మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నుంచి ప్రతినెల వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యం గుట్టుచప్పుడు కాకుండా జిల్లా సరిహద్దులు దాటిపోతున్నాయి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారి బాబురావు ఆదేశాల మేరకు కల్లూరు శ్రీనివాసనగర్‌లోని జంగాల కొట్టాల దగ్గర ఉన్న రేకుల షెడ్‌ను తనిఖీ చేశారు. అందులో బ్లాక్‌మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన 300 బస్తాల బియ్యాన్ని ప్రత్యేక తహసీల్దారు రామకృష్ణారెడ్డి, విజిలెన్స్ ఎన్స్‌ఫోర్‌మెంట్ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ సుబ్బరాయుడు, విజిలెన్స్ కానిస్టేబుళ్లు శేఖర్‌బాబు, ఈశ్వరరెడ్డి, మునిస్వామి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 123.60 క్వింటాళ్ల బియ్యం విలువ రూ.3 లక్షలు ఉంటుందని విజిలెన్స్ తహసీల్దారు తెలిపారు. ప్రజాపంపిణీలో జరుగుతున్న అక్రమాలను అదుపు చేసేందుకు ఈ–పాస్ యంత్రాలు ఉన్నా అక్రమాలకు అడ్డకట్ట పడటం లేదు. ప్రతి నెల డీలర్లు 10 నుంచి 25 క్వింటాళ్ల వరకు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తునే ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. బియ్యం వ్యాపారీ చరణ్ సూత్రధారి: విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బియ్యం ప్రముఖ బియ్యం వ్యాపారి చరణ్‌కు చెందినవిగా విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు దాడికి వెళ్లినపుడు షెడ్ వద్ద కాపలాగా ఎరుకలి వీరన్న అనే వ్యక్తి ఉన్నారు. బియ్యం గురించి వీరన్నను ప్రశ్నించగా చరణ్ అనే వ్యాపారికి చెందిన ఈ బియ్యానికి కాపలాగా ఉన్నట్లు తెలిపారు. చరణ్ చెప్పిన వారికి డబ్బులు చెల్లిసు్తంటానని పేర్కొన్నారు. డీలర్ల నుంచి చరణ్ బియ్యం కొనుగోలు చేసి స్థానికంగా ఉండే రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. అంతేగాక బళ్లారి, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటాడని సమాచారం. కర్నూలు నగరంలోనే డీలర్ల నుంచి ప్రతి నెల దాదాపు 2500 క్వింటాళ్ల బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కర్నూలు డీలర్లతో పాటు గ్రామీణ ప్రాంత డీలర్ల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న బియ్యంపై విజిలెన్స్ అధికారులు కల్లూరు తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో పంచానామా చేయించారు. అనంతరం ఒక లారీ ద్వారా ఏ క్యాంపులోని సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్‌కు తరలించారు. వ్యాపారి చరణ్, ఎరుకలి వీరన్నపై కేసు నమోదు చేసి జేసీ కోర్టుకు పంపుతున్నట్లుగా విజిలెన్స్ ప్రత్యేక తహసీల్దారు రామకృష్ణారెడ్డి తెలిపారు. -
ప్రజాపంపిణీలో అక్రమాలు
- డోన్‌లో ముధుసూదన్ గుప్త బినామీలే డీలర్లు -2వేల రేషన్ కార్డులు వస్తే కొందరికే ఇచ్చారు - ఆహార సలహా సంఘం సమావేశంలో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో అక్రమాలు పెరిగిపోయని, నిజాయితీగా వ్యవహరించే డీలర్లపై వేధింపులు అధికమమ్యాయని ఏపీసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా ఆహార సలహా సంఘం సమావేశం జేసీ హరికిరణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో మూడేళ్లుగా ఏ మండలంలోనూ ఆహార సలహా సంఘం సమావేశాలు జరిగిన దాఖలాలు లేవన్నారు. డోన్ పట్టణంలో 4, 7, 10, 17, 68 చౌకదుకాణాలకు మధుసూదన్ గుప్త అనే వ్యక్తి డీలరుగా ఉన్నారని, ఈయన పేరుతో బినామీలు డీలర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతి నెలా ఒకరు సరుకులు పంపిణీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పట్టణంలో 27 మంది డీలర్లు ఉండగా సగం మందిని వేధిస్తున్నారని, గ్యాస్ కనెక్షన్ ఉన్నా లేనట్లుగా చూపి కిరోసిన్ వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. డోన్ మున్సిపాలిటీకి కొత్తగా 2000 రేషన్ కార్డులు వస్తే కొందరికి మాత్రమే ఇచ్చారన్నారు. దీనిపై జేసీ స్పందిస్తూ..ఒకే వ్యక్తి ఆరు షాపులను నిర్వహించడంపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ప్రతి రెండు నెలలకోసారి విధిగా ఆహార సలహా సంఘం సమావేశం నిర్వహిస్తామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించండి ఈ–పాస్ కుంభకోణాన్ని బయటపెట్టిన కారణంగానే డీలర్ వెంకటేష్గౌడును హత్య చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని కమిటీ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ నేత తోట వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు తీర్మానం చేసి ఎస్పీకి పంపుదామని జేసీ తెలిపారు. కోడుమూరులో డీలర్ల దగ్గర బోగస్ కార్డులు ఉన్నాయని, ధనవంతులకు రేషన్ కార్డులు ఇచ్చారని కోడుమూరుకు చెందిన కమిటీ సభ్యుడు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఉల్లిని నిల్వ చేసుకునేందుకు గోదాములు నిర్మించాలని జెడ్పీ మాజీ చైర్మన్ ఆకేపోగు వెంకటస్వామి కోరారు. కర్నూలు కొత్త బస్టాండులో అన్ని వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్నారని జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ విజయకుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేటు, కొత్త బస్టాండు ప్రాంతాల్లోని రైస్ మిల్లులు, కారం, పసుపు, దాల్ మిల్లుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, కల్తీలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత నరసింహులు యాదవ్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. తెలుపగా జేసీ స్పందిస్తూ విచారణ జరిపిస్తామని తెలిపారు. సమావేశంలో డీఓస్ఓ శశీదేవి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఉద్యాన శాఖ ఏడీ రఘునాథరెడ్డి, కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓలు సత్యనారాయణ, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
చౌక దుకాణ డీలర్లకు స్మార్ట్ ఫోన్లు
అనంతపురం అర్బన్: చౌక దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు రుణ పద్ధతితో డీలర్లకు స్మార్ట్ ఫోన్లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 2,969 మంది డీలర్లు ఉన్నారు. ప్రభుత్వం 1,281 స్మార్ట్ ఫోన్లను జిల్లాకు కేటాయిస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులను సోమవారం జారీ చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతగా జిల్లాకు 100 స్మార్ట్ ఫోన్లు ఒకటి రెండు రోజులు రానున్నాయి. స్మార్ట్ ఫోన్ తీసుకున్న డీలర్ నెల వారీ రుణ వాయిదాలను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. -
స్టోర్లలో సరుకులు ఉచితం కాదు
అనంతపురం అర్బన్: ప్రభుత్వ చౌక దుకాణా(స్టోర్ల)ల్లో నిత్యావసర సరుకులు ఈ నెల ఉచితంగా ఇవ్వడం లేదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సరుకులు తీసుకునేందుకు వచ్చే కార్డుదారులు డబ్బులు ఇవ్వలేకపోతే వారికి అప్పు కింద ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వీలైనంత వరకు అందరికీ ఈ నెల అప్పు పద్ధతిలోనే సరుకులు పంపిణీ చేయాలని డీలర్లను అధికారులు ఆదేశించారు. ఈ నెల సరుకులకు కార్డుదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని, జనవరి నెలలో సరుకులు తీసుకున్నప్పుడు రెండు నెలల మొత్తాన్ని స్వైపింగ్ ద్వారా కార్డుదారుల ఖాతాల నుంచి తీసుకోవాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. -
పది మంది రేషన్ దొంగల అరెస్టు
కర్నూలు: రేషన్ పంపిణీలో ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్ కేసును పోలీసులు నీరుగారుస్తున్నారనే విమర్శల నేపథ్యంలో పది మంది చౌక డిపో డీలర్లను అరెస్టు చేశారు. వీరిలో కర్నూలులో ఐదుగురు, నందవరంలో ఐదుగురు ఉన్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి బుధవారం సాయంత్రం సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది, టూటౌన్ పీఎస్ పరిధిలో 42 మంది, త్రీటౌన్ పీఎస్ పరిధిలో 15 మంది, ఫోర్త్‌టౌన్ పీఎస్ పరిధిలో 11 మంది డీలర్లపై కేసులు నమోదయ్యాయి. ఇందులో వన్‌టౌన్ పరిధిలో ఖాశీం, శ్రీనివాసులు, టూటౌన్ పరిధిలో షేక్ చాంద్ బాషా, చంద్రబాబు, ఫోర్త్‌టౌన్ పీఎస్ పరిధిలో సోము సాయిబాబాలను పోలీసులు అరెస్టు చేశారు. చౌక దుకాణాల్లో అవినీతిని అడ్డుకోవడానికి గత ఏడాది ఈ–పాస్ మిషన్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్‌తో క్లోజింగ్ బ్యాలెన్స్‌లో తక్కువ చూపించి రూ.లక్షల్లో ప్రభుత్వానికి గండి కొట్టారు. జిల్లా వ్యాప్తంగా 149 మంది డీలర్లు ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు దర్యాప్తులో తేల్చారు. పౌర సరఫరాల, రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కర్నూలు డివిజన్లో 121, నందికొట్కూరు పట్టణ పరిధిలో 12, కర్నూలు అర్బన్ తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో 5, శ్రీశైలం పీఎస్ పరిధిలో 3, వెల్దుర్తి పీఎస్ పరిధిలో 1, పాణ్యం పీఎస్ పరిధిలో 3, నంద్యాల డివిజన్ పరిధిలో 3, దేవనకొండలో 3, నందవరంలో 7, ఎమ్మిగనూరు పట్టణ పరిధిలో 15, ఆదోని డివిజన్ పరిధిలో 25 మంది డీలర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్‌కు పాల్పడిన డీలర్లందరినీ త్వరలో అరెస్టు చేస్తామని, వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఒకటవ పట్టణ సీఐ కృష్ణయ్య, తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి, నాల్గవ పట్టణ సీఐ నాగరాజ రావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో... రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడిన కేసులో నందవరం మండలానికి చెందిన ఐదుగురు డీలర్లను అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. బుధవారం రాత్రి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్ఓ, ఆర్డీఓ, తహసీల్దార్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. అరెస్ట్ చేసిన వారిలో నందవరం మండలం గంగవరానికి చెందిన డీలర్ సత్యనారాణయశెట్టి, నాగలదిన్నెకు చెందిన డీలర్లు సుమిత్రబాయి, షబ్బిర్, ప్రేమకుమారి, కనకవీడు డీలర్ బోయ కోటేష్‌లు ఉన్నట్లు చెప్పారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారన్నారు. ఇకపోతే పట్టణంలో 13 మంది, రూరల్‌లో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయని.. వీరంతా పరారీలో ఉన్నట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో నందవరం ఎస్ఐ జగన్మోహన్ పాల్గొన్నారు. -
డీలర్లపై వేటు
దేవనకొండ: ఈ–పాసును బైపాస్ చేసి నిత్యావసర సరుకుల పంపిణీలో అవినీతికి పాల్పడిన రేషన్‌డీలర్లపై అధికారులు చేపట్టారు. దేవనకొండలోని 17, 18, 30కు చెందిన ముగ్గురు డీలర్లపై సస్పెన్షన్ వేటు పడినట్లు ఆర్ఐ ఆదిమల్లన్నబాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీ నందవరం : మండలంలోని 7గురు డీలర్లపై వేటుపడింది. నందవరంలో 3వ షాపు లచ్చప్ప, గంగవరంలో 8వ షాపు సత్యనారాయణశెట్టి, నాగలదిన్నెలో 12వ షాపు తిప్పన్న, 13వ షాపు షబ్బీర్, 33వ షాపు ప్రేమ్‌కుమార్, టి.సోమలగూడూరులో 17వ షాపు మాదన్న, కె.పేటలో 21వ షాపు ఈరన్న అనే డీలర్లు వేటు చేసినట్లు తహసీల్దార్ హుశేన్‌సాహెబ్ తెలిపారు. ఈ నెలలో ఆయా డీలర్లు ద్వార డీడీ కట్టించుకోవడం లేదని, కొత్త డీలర్లు వచ్చే వరకు ఇన్‌చార్జ్‌ల ద్వార డీడీలు కట్టించి కార్డుదారులకు సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ తెలిపారు. ఎమ్మిగనూరు రూరల్: మండలంలో 15 మంది డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మండలంలో ఇద్దరు, పట్టణంలో 13 మంది డీలర్లపై రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటూ వారి నుంచి రికవరీకి చేస్తున్నట్లు సమాచారం. -
డీలర్లకు కొత్త బాధ్యతలు
నెలలో సగం రోజులు బ్యాంకు ఏజెంట్లుగా విధులు త్వరలోనే వీరికి శిక్షణ తిరుపతి మంగళం: చౌక దుకాణాల డీలర్ల సేవలను ప్రభుత్వం విసృ్తతం చేయాలని నిర్ణరుుంచింది. ఇన్నాళ్లూ లబ్ధిదారులకు సరుకులు మాత్రమే అందించేవారు. ఇప్పుడు బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెంట్ (బీసీ)లుగా కూడా వారు పనిచేయనున్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓిపీ) ద్వారా వారిని నియమించాలని ఈనెల 15న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ చర్యలు చేపట్టారు. జిల్లా స్థారుు బ్యాంకర్ల కమిటీ (డీఎల్‌బీసీ) సమావేశం నిర్వహించేందుకు సిద్ధ మయ్యారు. తమ పరిధిలోని డీలర్లకు ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆర్డీవోలు, తహశీల్దార్లను ఆదేశించారు. దీనిపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్‌సప్లైస్ అధికారులతో సివిల్‌సప్లైస్ రాష్ట్ర కమిషనర్ రాజశేఖర్, డెరైక్టర్ రవిబాబు వీడియోకాన్ఫరెన్స నిర్వహించారు. నెలలో పదిహేను రోజులు లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తారని, మిగతా పదిహేను రోజులు బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉపయోగించుకుని బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని తెలిపారు. డీలర్ల వద్ద ఉన్న ఈ-పాస్ మిషన్‌కు యాప్‌ను జోడించి శిక్షణ కల్పిస్తారు. డీలర్లు ఏంచేయాలంటే.. డీలర్లు తమ పరిధిలో, ప్రాంతంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగిస్తారు. బ్యాంకులకు ప్రజలు చెల్లించాల్సిన రుణాలను స్వీకరించడం, వాటిని బ్యాంకుల్లో జమచేయం, రుణాలు తీసుకోదలచినవారికి అవసరమైన ఫారాలను ఇవ్వడం లాంటివి చేస్తారు. ఖాతాదారులకు, బ్యాంకులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ఇందుకుగాను వీరికి కమీషన్ చెల్లిస్తారు. -
కిరోసీన్ మారుతోంది
నల్లబజారుకు తరలుతున్న బ్లూ కిరోసిన్ చాకచక్యంగా దోపిడీ చేస్తున్న డీలర్లు లీటర్ కిరోసిన్ రూ.30 వరకు విక్రయం కన్నెత్తి చూడని అధికార గణం లబోదిబోమంటున్న కార్డుదారులు పేదలకు అందాల్సిన సబ్సిడీ కిరోసిన్ చౌకదుకాణాల డీలర్ల చేతివాటంతో యథేచ్ఛగా నల్లబజారుకు తరలుతోంది. లీటరు కిరోసిన్ రూ.30 వరకు విక్రరుుంచి జేబులు నింపుకుంటున్నారు. దీనిపై ప్రశ్నించిన కార్డుదారులపై కొందరు డీలర్లు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. చిత్తూరు (కలెక్టరేట్): జిల్లాలో మొత్తం 10,27,892 కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులు ఉన్నారుు. ప్రతినెలా ప్రభుత్వం చౌకదుకాణాల ద్వారా సబ్సిడీపై 11.4 లక్షల లీటర్ల మేరకు కిరోసిన్ పంపిణీ చేస్తోంది. గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలకు లీటరు రూ.15 చొప్పున, గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలకు లీటరుకు రూ.4 చొప్పున పెంపుదల చేసి రూ.19 మేరకు విక్రరుుస్తున్నారు. ఈ విధానాన్ని ఈ నెల కోటా నుంచి అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్లు ఉన్న 6,95,188 కుటుంబాలకు పెంపుదల చేసిన రేట్లు వర్తిస్తారుు. ఇలా దోపిడీ సబ్సిడీ కిరోసిన్‌ను చౌకదుకాణాల ద్వారా ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు కార్డుదారులకు పంపిణీ చేయాలి. బియ్యం, చక్కెర, వివిధ సరుకులతోపాటు కిరోసిన్‌నూ డీలర్లు ఒకేసారి అందించాలి. అరుుతే కొందరు డీలర్లు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రేషన్ సరుకులు అందించే సమయంలో కిరోసిన్ ఇవ్వడం లేదు. ఇదేమని లబ్ధిదారులు ప్రశ్నిస్తే ‘కిరోసిన్ ఇవ్వడం వల్ల చేతు లు పాడవుతారుు, అదే చేతులతో రేషన్ సరుకులు ఇవ్వడం వల్ల అవికూడా కిరోసిన్ వాసన వస్తా రుు, వారం తరువాత రండి’.. అంటూ బోల్తాకొట్టిస్తున్నారు. బయోమెట్రిక్ విధానంలో కిరోసిన్ ఇచ్చినట్లు వేలిముద్రలు వేసి తిప్పి పంపుతున్నారు. తీరా వారం తర్వాత వచ్చినాలబ్ధిదారులకు కిరోసిన్ ఇవ్వడంలేదు. టైం అరుుపోరుుందంటూ బుకారుుస్తున్నారు. గట్టిగా నిలదీస్తే ‘అధికార’ అండదండలు చూసుకుని కొందరు భౌతిక దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పుట్టగొడుగుల్లా ఏజెంట్లు సబ్సిడీ కిరోసిన్‌ను నల్ల బజారులో విక్రరుుంచేందకు ఏజెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లోని ప్రొవిజన్ షాపులు, చిల్లర దుకాణాలను వారు ఆవాసంగా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. డీలర్లు దోపిడీ చేసిన కిరోసిన్‌ను గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట ఏజెంట్లకు తరలిస్తున్నారు. వారి వద్ద రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఏజెంట్లు సేకరించిన కిరోసిన్‌ను లారీ డ్రైవర్లు, ఫ్యాక్టరీలకు రూ.40 చొప్పున విక్రరుుస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేమి చౌకదుకాణాల్లో రేషన్, కిరోసిన్ పంపిణీపై ఎప్పటికప్పుడు పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి. అరుుతే సంబంధిత అధికారులు చౌకదుకాణాలకు వెళ్లిన దాఖలాలు లేవు. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నారుు. కిరోసిన్ ఇవ్వడంలేదు ప్రతినెలా 1 నుంచి 15 తేదీ వరకు రేషన్ మాత్రం ఇస్తున్నారు. కిరోసిన్ ఇవ్వడంలేదు. డీలర్‌ను ప్రశ్నిస్తే మేము ఉన్నప్పుడు వస్తే ఇస్తాం, లేదంటే ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. - అశ్విని, గిరింపేట, చిత్తూరు -
డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు
జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి గుడిహత్నూర్ : రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరుకులు దుర్వినియోగానికి గురైతే వేటు తప్పదని హెచ్చరించారు. డీలర్లు కాకుండా ఇతరులు దుకాణం నడిపించడానికి వీలు లేదని, అలా జరిగితే లెసైన్స్ రద్దు చేసి దుకాణం మూరుుస్తామని పేర్కొన్నారు. సకాలంలో సరుకులు అందుబాటులో ఉంచి అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్ఫోర్సమెంట్ డీటీ రాజ్‌మోహన్, డిప్యూటీ తహసీల్దార్ నలంద ప్రియ, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
డీలర్లూ.. తూకం బయట ఉంచండి
కరప : రేషన్ డీలర్లు కార్డుదారులకు కనిపించేలా తూకం ఏర్పాటు చేయాలని, అలా చేయని వారిపై చర్యలు తప్పవని పౌరసరఫరాలశాఖాధికారి (డీఎస్ఓ) ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. మండల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన కరపలోని రేషన్ షాపులు తనిఖీ చేశారు. కొందరు డీలర్లు పోర్టబులిటీ ద్వారా సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు, స్టాకులేదని కుంటిసాకులు చెపుతున్నట్టు తెలిసిందని, అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 90 వేల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఒక్కసారి కూడా సరుకులు తీసుకోకపోవడంతో వారు జిల్లాలో లేనట్టుగా గుర్తిచామన్నారు. జిల్లాలోని తెలుపురంగు రేషన్ కార్డుదారులందరికీ డిసెంబరు నెలాఖరు నాటికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీఎస్ఓ చెప్పారు. -
నూతన టెక్నాలజీతో వాహన రిజిస్ట్రేషన్లు
విజయవాడ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ–ప్రగతి కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే కంప్యూటరీకరణలో ముందంజలో ఉన్న రవాణా శాఖ అధికారులు నూతన సాఫ్ట్వేర్ 1.2 వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీని అమలులో భాగంగా లయోలా ఇంజినీరింగ్ కాలేజీలో నూతన సాఫ్ట్‌వేర్‌పై వాహన డీలర్లకు రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను గురువారం ఉప రవాణా కమిషనర్ ఇ.మీరా ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ నంబర్ కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. ఇప్పుడున్న ఆన్లైన్ విధానంలో వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించి యజమాని వివరాలు నమోదు చేసేవారని చెప్పారు. ఇలాంటి సమయాల్లో కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉందన్నారు. నూతన విధానంలో ఆధార్ నంబరు నమోదు చేయగానే యజమానికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడవుతాయని, ఇదే సమయంలో వాహన వెబ్సైట్లోకి వెల్లడం ద్వారా ఇంజిన్, చాసిస్ వంటివి తప్పులు లేకుండా ఆటోమేటిగ్గా నమోదు అవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవోలు ఎం.పురేంద్ర, ఎస్.వెంకటేశ్వరరావు, డి.ఎస్.ఎన్.మూర్తి, ఎంవీఐలు వి.శ్రీనివాస్, మూర్తి, కాశీ, రాజుబాబు, వాహన డీలర్లు పాల్గొన్నారు. -
ఈసారైనా అర్హులకు అందేనా ?
జిల్లాలో 463 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రెవెన్యూ డివిజన్ల వారీగా దరఖాస్తుల స్వీకరణ అర్హుల ఎంపికకు త్వరలో రాత పరీక్ష మండపేట : రేషన్ దుకాణాల డీలర్ల ఖాళీల భర్తీ ప్రక్రియ మరోమారు తెరపైకి వచ్చింది. జిల్లాలోని 463 దుకాణాల్లో డీలర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. రెవెన్యూ డివిజన్ల వారీగా దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. అర్హుల ఎంపికకు త్వరలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఈసారైనా గతంలో మాదిరి పక్షపాతం చూపకుండా అర్హులకు షాపులు కేటాయించాలని అభ్యర్థులు కోరుతున్నారు. జిల్లాలో తెల్లరేషన్ కార్డులు 14,39,183 ఉండగా, అంత్యోదయ కార్డులు 84,742, అన్నపూర్ణ కార్డులు 1,199 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,647 దుకాణాలు ద్వారా వీరికి సరుకులు అందిస్తున్నారు. ఒక్కో రేషన్ దుకాణం పరిధిలో 500 కార్డులు మాత్రమే ఉండాలి. కాగా 800 నుంచి 1200ల వరకు కార్డులు ఉన్న రేషన్‌షాపులు ఎన్నో ఉన్నాయి. అధిక సంఖ్యలో కార్డులు ఉండటంతో సరుకులు తీసుకునేందుకు వినియోగదారులు ఇబ్బం దులు పడుతున్నారు. ఏడాదిక్రితం ఒక్కో షాపు పరిధిలో 500 కార్డులతో షాపుల సర్ధుబాటు చేయగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన 173 షాపులు, ఇన్చార్జిల పరిధిలో ఉన్న మరో 100 దుకాణాలు కలిపి 273 షాపుల్లో డీలర్ల భర్తీకి ఏడాది క్రితం రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. డీలర్ల ఎంపికకు రాత పరీక్షతో ఇంటర్వూ్యలు కూడా నిర్వహించారు. కాగా అర్హతతో నిమిత్తం లేకుండా పలు రెవెన్యూ డివిజన్లలో అధికార పార్టీ వారు చెప్పిన వారికి, తెలుగు తమ్ముళ్లకు షాపులు కట్టబెట్టే ప్రయత్నాలు అప్పట్లో ముమ్మరంగా జరిగాయి. ఇంటర్వూ్యల నిర్వహణలోను నిబంధనలకు నీళ్లొదిలి కావాల్సిన వారికి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అభ్యర్థుల ఎంపికపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు విచారణకు సైతం ఆదేశించారు. పలు విమర్శల నడుమ అప్పట్లో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా మరోమారు షాపుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కార్డుల సర్దుబాటుతో... కొత్తగా 463 దుకాణాల భర్తీకి ఇటీవల ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. కార్డుల సర్దుబాటుతో జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన షాపులు 300లు కాగా ఇన్చార్జిల పరిధిలో ఉన్న 163 షాపులు భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా జిల్లాలోని ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇప్పటికే షాపుల అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. 80 మార్కుల ప్రాతిపదికన త్వరలో రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్వూ్య నిర్వహిస్తారని సమాచారం. కాగా ఈసారైన పక్షపాతానికి తావులేకుండా పూర్తి పారదర్శకంగా భర్తీ ప్రక్రియను నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. అర్హులకు మాత్రమే షాపులు కేటాయించాలంటున్నారు. -
రేషన్ పంపిణీ వేగవంతం చేయండి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో రెండు రోజులుగా 4 లక్షల మంది రేషన్ కార్డుదారులకు రేషన్ సరఫరా చేశామని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అధికారులు, రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లాలోని సివిల్ సప్లైస్ అధికారులు, ఆర్డీవోలు, స»Œ æకలెక్టర్లు, మండల తహసీల్దార్లు, డెప్యూటీ తహసీల్దార్లతో మాట్లాడారు. జిల్లాలో 5వ తేదీ నాటికి 100 శాతం రేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి రేషన్ ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రతి ఒక్కరికీ రేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పలు మండలాల్లో రేషన్ ప్రక్రియ ప్రారంభమైనా పంపిణీ మందకొడిగా సాగడాన్ని ఆయన ప్రశ్నించారు. సర్వే సమస్యలను అందరికీ తెలపండి జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే వల్ల వచ్చే సమస్యలను సర్వే సిబ్బంది అందరికీ తెలపాలని, కొత్త సమస్యలు ఎదురైతే ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయో అనే విషయాలు ఒకరికొకరు తెలియజేయాలన్నారు. దీని కోసం గ్రూపు మెసేజ్‌లను, లేదంటే వాట్సప్లను ఉపయోగించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. జిల్లాలో దీపం పథకం నూరు శాతం ప్రతి ఒక్కరికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో గ్యాస్ కనెక్షన్లు లేని వారి సమాచారాన్ని సేకరించాలని జేసీ కోటేశ్వరరావు ఆదేశించారు. -
స్టాప్ సేల్..అయితే మాకేం?
– ఎరువుల డీలర్ల ఇష్టారాజ్యం – యథేచ్ఛగా అమ్మకాలు – జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కర్నూలు(అగ్రికల్చర్): తనిఖీల సమయంలో వ్యవసాయ అధికారులు.. నిబంధనలు పాటించని ఎరువుల దుకాణాల్లో అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేయడం(స్టాప్ స్టేల్) సర్వసాధారణం. తిరిగి అనుమతులు ఇచ్చేవరకు ఎరువుల అమ్మకాలు ఎట్టి పరిస్థితుల్లోను నిర్వహించరాదు. అయితే ఎరువుల దుకాణాల డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. స్టాప్సేల్స్ను బేఖాతర్ చేస్తూ ఎరువుల అమ్మకాలు య«థావిధిగా నిర్వహిస్తున్నారు. ఇటీవల జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు(జేడీఏ) ఉమామహేశ్వరమ్మ జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాల తనిఖీలకు ఇంటర్నల్ స్వా్కడ్ బందాలను నియమించారు. ఒక సబ్‌డివిజన్ ఏడీఏను మరో సబ్‌డివిజన్‌లోని ఎరువుల దుకాణాల తనిఖీలకు స్వా్కడ్ అధికారిగా నియమించారు. తనిఖీలు వేగం పుంజుకున్నాయి. ప్రై వేటు డీలర్లకు వ్యవసాయశాఖ ఇచ్చిన లైసెన్స్‌లో ఎరువుల కంపెనీలు ఇచ్చిన ఓ–ఫామ్‌ను నమోదు చేయించుకోవాలి. లైసెన్స్‌లో ఓ– ఫామ్ ఇంక్లూజన్ లేకపోయినా ఆ కంపెనీల ఎరువులను అమ్ముతున్నారు. ఈ విషయం ఏడీఏల తనిఖీల్లో బయటపడింది. ప్రతి ఏటా తప్పనిసరి ప్రై వేటు డీలర్లు ఎరువుల కంపెనీల ఉత్పత్తులను అమ్ముకోవాలంటే ఆయా కంపెనీల ఓ–ఫామ్‌ను ప్రతి ఏటా తీసుకోవాలి. లైసన్స్లో ఓ–ఫామ్ ఇంక్లూజన్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దానిని వ్యవసాయ యంత్రాంగం పరిశీలించి ఇంక్లూజన్ చేస్తుంది. జిల్లాలో హోల్‌సేల్ డీలర్లు 900 మంది వరకు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది ఓ–ఫామ్ ఇంక్లూజన్ లేకుండానే ఎరువుల వ్యాపారం సాగిస్తుండటం గమనార్హం.. స్టాఫ్సేల్స్ ఇచ్చినా.. కర్నూలు ఏడీఏ రమణారెడ్డిని నంద్యాల తనిఖీ అధికారిగా నియమించారు. ఈయన మంగళవారం వివిధ షాపులు తనిఖీ చేయగా ఓ–పామ్ ఇంక్లూజన్ లేకుండానే అయా కంపెనీల ఎరువులు అమ్మతున్నట్లు గుర్తించి రూ. 1.20 కోట్ల విలువ చేసే ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చి వెళ్లారో లేదో యథావిధిగా ఎరువుల అమ్మకాలు చేపట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒక్క నంద్యాలలోనే కాదు డోన్, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి నెలకొని ఉంది. స్టాప్ సేల్ ఇచ్చినా అమ్మకాలు యథావిధిగా జరుగుతున్న విషయం వ్యవసాయాధికారులకు తెలిసినా చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ఎరువు..బరువు!
తగ్గని ఎరువుల ధర కేంద్రం ప్రకటించినా పట్టించుకోని డీలర్లు ఖరీఫ్‌లో 1.08 లక్షల టన్నుల వినియోగం రూ.50 కోట్లపైగా రైతులపై అదనపు భారం! యూరియా, డీఏపీ, ఏవోపీ లాంటి ఎరువుల ధరలను టన్నుకు రూ.5వేల వరకు తగ్గించామని కేంద్రం అట్టహాసంగా ప్రకటించింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ఊదరగొట్టేసింది. ఇలా ప్రకటించి పది రోజులు కావస్తున్నా ఎరువుల ధరలు తగ్గలేదు. అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో డీలర్లు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో ఈ ఒక్క ఖరీఫ్‌లోనే రైతులపై రూ.50 కోట్లపైగా అదనపు భారం పడనున్నట్టు సమాచారం. చిత్తూరు : రసాయన ఎరువులకు ఉపయోగించే ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుముఖంపట్టాయి. దీంతో ఎరువుల ధరలను తగ్గించాలని కేం ద్రం నిర్ణయించింది. టన్నుకు రూ.5వేలు తగ్గిస్తున్నామని, ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని పది రోజుల క్రితం పత్రికల ద్వారా ప్రకటనలు గుప్పించింది. కానీ జిల్లాలో ఇప్పటివరకు ఆ ధరలు అమలు కాలేదు. ఎరువుల ధరల విషయమై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని డీలర్లు చెబుతున్నారు. అధికారులు తమ పరిధిలో లేదంటూ చేతులెత్తేయడంతో రైతులు ఈ ఒక్క ఖరీఫ్‌లోనే సుమారు రూ.50 కోట్ల వరకు నష్టపోవాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఎరువుల ధరల విషయమై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడంలేదు. చిన్నచిన్న సమస్యలను కూడా రాష్ర్ట ప్రభుత్వ పెద్దలు కేంద్రాన్ని అడిగే సాహసం చేయలేకపోవడంపై రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రకటనలు ఆర్భాటంగా చేస్తూ చేతలకు వచ్చే సరికి రిక్త హస్తాలు చూపించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు షరా మామూలైపోయిందని విమర్శిస్తున్నారు. జిల్లాలో ఉన్న సగం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నాయి. వీరిపై కరుణ చూపడానికి మాత్రం వారికి మనసు రావడం లేదని పలువురు నాయకులు వాపోతున్నారు. ఇప్పటివర కు ఆదేశాలు ఇవ్వలేదు ఎరువుల ధరలు తగ్గించామని కేంద్రం ప్రకటించిందే కానీ ఇప్పటివరకు వ్యవసాయ శాఖకు ఆదేశాలు ఇవ్వలేదు. కేంద్రం మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. తగ్గించిన ధరలకు అనుగుణంగా ఎరువులు అమ్మాలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి. - మాగంటి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర రైతు సంఘ నాయకుడు ఇంకో వారంలో కొత్త ధరలు ఇంకో వారంలో కొత్త ధరలతో ఎరువులు అందుబాటులోకి వస్తాయి. దిగుమతి చేసుకున్న ఎరువులను కొంత వరకు తగ్గించి అమ్ముతున్నాం. దేశంలో ఉత్పత్తయ్యే ఎరువులు ఇప్పటికీ పాత ధరలకే అమ్ముతున్నాం. వీటిపై ఇంకో వారంలో స్పష్టత వస్తుంది. - సురేష్‌బాబు, సుబ్రమణ్యేశ్వర ట్రేడర్స్, ఆర్సీ రోడ్, తిరుపతి తగ్గించిన ధరలకే అమ్మాలి కేంద్రం డీపీ, ఎంవోపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించింది. ఈ విషయం చాలా మంది రైతులకు తెలీదు. అయినా మునుపటి ధరలకే షాపుల వారు అమ్ముతున్నారు. దీని వల్ల రైతు బాగుండాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. కేంద్రం తగ్గించిన ధరలకే ఎరువులను అమ్మేలా చూడాలి. - గుర్రాల కుమార్, కురబలకోట మండలం -
మసాలాల మాటున మాదక ద్రవ్యాలు!
అబుధబిః మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టును అబుధబి పోలీసులు రట్టు చేశారు. మసాలా దినుసుల మాటున మాదకద్రవ్యాలను ఎగుమతి చేస్తున్న ముగ్గురు మహిళలతో సహా 8 మంది నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. మసాలాల పేరుతో మాదక ద్రవ్యాలు కలిగిన 398 సంచులను వారివద్దనుంచీ స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో కూడిన మొత్తం ఎనిమిది సభ్యులతో కూడిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాను అబుధబి పోలీసులు పట్టుకున్నారు. మసాలా దినుసులు, సంప్రదాయ ఔషధాల పేరున ముఠా... మాదక ద్రవ్యాల రవాణా జరుపుతున్నట్లు సిఐడీ డైరెక్టర్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ తెలిపారు. ముఠాలోని సభ్యులంతా ఇంచుమించుగా 21-28 సంవత్సరాల మధ్య వయస్కులేనన్న పోలీసులు, సుమారు 25 లక్షల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలు వారి అధీనంలో ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై అక్రమ రవాణా, మత్తు పదార్థాల విక్రయం తదితర కేసులను నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన వారిలో అరబ్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు, ముగ్గురు యూరోపియన్లు, వివిధ దేశాలకు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
గజిబిజి పంపిణీ
అస్తవ్యస్తంగా పౌర సరఫరాల శాఖ సరుకుల పంపిణీలో స్పష్టత లేక డీలర్లు, లబ్ధిదారుల అవస్థలు ఈ-పోస్పై ప్రజల పెదవివిరుపు తమిళనాడు తరహా వేతనాల కోసం డీలర్ల డిమాండ్ త్వరలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ విజయవాడ బ్యూరో : ప్రయోగాలు.. సంస్కరణలతో ప్రభుత్వ ప్రజాపంపిణీ విధానం అస్తవ్యస్తంగా మారింది. చౌకబియ్యం పంపిణీలో ప్రభుత్వ యంత్రాంగం రోజుకో నియమం పెడుతూ ప్రజలు, డీలర్లను అయోమయానికి గురిచేస్తోంది. డీలర్లపై ఒత్తిడి పెంచడంతోపాటు వినియోగదారులకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కావాల్సిఉండగా వాయిదా పడింది. డీలర్ల వేతనం, కమీషన్ అంశాలపై అధ్యయనం చేయడంతోపాటు ప్రజాపంపిణీ విధానంలో లోపాలపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి నెల 15వ తేదీలోగా రేషన్ సరుకుల పంపిణీ పూర్తికావాలని సివిల్ సప్లయిస్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. నెల మొదటి వారంలోనే రేషన్ పంపిణీ పూర్తికావాలంటూ జిల్లా అధికారులు డీలర్ల మెడపై కత్తిపెట్టారు. దీంతో పలు జిల్లాల్లో డిపోల ద్వారా ఇచ్చే సరుకుల గడువుపై చాటింపులు కూడా వేయించారు. కృష్ణా జిల్లాలో ఏడో తేదీ వరకు సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా వారం రోజుల్లో సరుకుల పంపిణీ పూర్తిచేయని డీలర్లకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ ఈ నెల 15 వరకు గడువు పొడిగించారు. ఇలా పేదలను, డీలర్లను అయోమయానికి గురిచేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గతంలో నెలాఖరు వరకు సరుకులు ఇచ్చే వారని, ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు తెచ్చుకునేవారమని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పోసొప్పో చేసి కొందరు సరుకులు తెచ్చుకోగా ఇంకొందరు ఇంకా బియ్యం తెచ్చుకోలేక వదిలేసుకున్నారు. ఇదంతా మిగులు అని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. బాలారిష్టాలు దాటని ఈ-పోస్ రాష్ట్రంలోని ప్రజాపంపిణీ డిపోల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ-పోస్ విధానం ఏడాదైనా ఇంకా బాలారిష్టాలు దాటలేదు. సకాలంలో సరుకులు రాక, సర్వర్లు మొరాయించడంతో గంటలు, రోజుల తరబడి క్యూల్లో నిల్చోలేక పలువురు సరుకులు వదులుకోవాల్సి వస్తోంది. గతేడాది ఫిబ్రవరి 20న కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన ఈ-పోస్ విధానం క్రమంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు విస్తరించారు. ఈ విధానం అమలులోకి తెచ్చిన తొలి రెండు నెలల్లో ఏకంగా 24 శాతం బియ్యం, నిత్యావసర సరుకులు మిగులు కనిపించడంతో ప్రభుత్వం అందంతా మిగులు అని భావించిందే తప్ప వినియోగదారుల చెంతకు సరుకులు వెళ్లడం లేదని విషయాన్ని గుర్తించలేకపోయింది. ఇప్పుడు రాష్ట్రమంతటా చౌకడిపోల్లో ఈ విధానం అమలు చేయడంతో నెలకు సగటున 16 శాతం సరుకులు మిగిలిపోతున్నాయంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. మంత్రివర్గ ఉపసంఘం భేటీ వాయిదా డీలర్ల విజ్ఞాపనలు పరిశీలించి ఒక విధానం రూపొందించేందుకు నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం విజ యవాడలో జరగాల్సి ఉండగా వాయిదాపడింది. డీలర్లకు కమీషన్ కమీషన్ ఇవ్వాలా? ఎంత ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? జీతం ఇవ్వాలా? ఎన్ని రోజులు పని చేయించాలి? వంటి అంశాలను ఉపసంఘం పరిశీలించి ప్రభుత్వానికి నివేది స్తుంది. కమిటీలోని యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత డీలర్ల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. రాష్ట్రంలోని రెండు డీలర్ల సంఘాల ప్రతినిధులు, అన్ని జిల్లాల డీలర్ల సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయవాడ సమావేశానికి రావాలంటూ సమాచారం పంపించారు. -
బియ్యం మాఫియాకే ‘ప్రజా పంపిణీ’
► కొరవడిన అధికారుల నిఘా ► బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రేషన్ బియ్యం ► అరకొర పంపిణీతో పేదల పాట్లు నరసరావుపేట టౌన్ : పౌర సరఫరాల శాఖాధికారుల నిర్లక్ష్యానికి చౌకదుకాణ డీలర్ల అక్రమాలు తోడు కావడంతో పేదలకు అందాల్సిన నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయి. ఎంఎల్ఎస్ గోడౌన్ నుంచి ఎగుమతైన నిత్యావసరాలు అధికారుల పర్యవేక్షణ లోపించడంతో రూటుమారి నల్లబజారుకు తరలిపోతున్నాయి. పేరుకే నిబంధనలు నరసరావుపేట ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ప్రతి నెలా తెల్ల రేషన్ కార్డు దారులకు పంపిణీ కోసం నిత్యావసరాలు రేషన్ షాపులకు దిగుమతి అవుతుంటాయి. నరసరావుపేట పట్టణ పరిధిలో 238 టన్నుల బియ్యం, రూరల్ పరిధిలో 248, రొంపిచర్ల 228, నకరికల్లు 235, ఫిరంగిపురం 264 టన్నులు చౌక దుకాణాలకు చేరతాయి. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఎగుమతై రేషన్ దుకాణంలో నిత్యావసరాలు దిగుమతయ్యే వరకూ రూట్ అధికారి వీఆర్వో పర్యవేక్షణ తప్పనిసరి. చౌక దుకాణంలో రేషన్ దించాక సంబంధిత డీలర్, రూట్ అధికారి ఈపాస్ మిషన్‌పై వేలిముద్రలు వేసి సరుకు అందినట్లు నిర్ధారించాలి. అయితే ప్రజాపంపిణీ దిగుమతి, ఎగుమతిలో రూట్ అధికారి, రేషన్ డీలర్ కుమ్మక్కైన కారణంగా నిత్యావసరాలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎగరేసుకుపోతున్న బియ్యం మాఫియా ముందుగా కుదిరిన ఒప్పందం మేరకు రూట్ అధికారి ఆ పరిసరాల్లోనే కనిపించడంలేదు. ఈ పాస్ మిషన్‌పై వేలిముద్రలు ఎక్కడ వేస్తున్నారన్న విషయం అంతు చిక్కకుండా ఉంది. దుకాణానికి సరుకు చేరినరోజే వాటిని అధికార పార్టీకి చెందిన బియ్యం మాఫియా ఎగరేసుకు పోతున్నారని ఆరోపణలు లేకపోలేదు. గతంలో ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకూ రేషన్ షాపుల్లో ప్రజా పంపిణీ కొనసాగేది. ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకు వచ్చి ఐదో తేదీలోపే పంపిణీ పూర్తిచేసి ముగించాలన్న ఆదేశాలు డీలర్లకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఈపాస్ మిషన్ మొరాయిస్తుందన్న సాకు చూపి రేషన్ డీలర్లు అసలు దుకాణాలే తెరవడం లేదు. పంపిణీ అవుతున్న సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి. దీంతో విసుగెత్తుతున్న కార్డుదారులు డీలర్లు ఇచ్చినంత పుచ్చుకుని వేలిముద్రలు వేస్తుండటంతో పేదలకు పంచాల్సిన రేషన్‌ను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. డీలర్ల అక్రమాలపై ఎన్ని ఫిర్యాదులు అందుతున్నా అసలు చౌక దుకాణాలపై అధికారులు తనిఖీలు చేయడానికి ధైర్యం చేయలేక పోతున్నారు. దీనికి ముఖ్య కారణం డీలర్లంతా అధికార పార్టీకి చెందినవారు కావడమనేది జగమెరిగిన సత్యం. బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ ప్రజా పంపిణీ ద్వారా ప్రతి నెలా తెల్ల కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే ప్రభుత్వం ద్వారా అందుతోంది. గత ప్రభుత్వం అమ్మహస్తం పేరుతో బియ్యం, పంచదార, గోధుమపిండి, పామాయిల్, పసుపు, కారం, గోధుమలు, చింతపండు, కందిపప్పు ఇలా 9 రకాల సరుకులు పంపిణీ చేసేది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ ప్రజా పంపిణీగా పేరు మార్చి బియ్యం, కందిపప్పు, పంచదార, గోధుమ పిండి పంపిణీ చేస్తోంది. అయితే ఐదు నెలల నుంచి వాటిలో బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ అవుతున్నాయి. మిగిలిన సరుకుల గురించి కార్డుదారులు ఎవ్వరైనా డీలర్లను ప్రశ్నిస్తే పైనుంచి సరఫరా లేదని చెబుతున్నారు. దీంతో పేదలు కడుపునిండా ఆహారానికి నోచుకోవడంలేదు. ఇప్పటికైనా రేషన్‌షాపు ద్వారా అందించే సరుకులు పూర్తి స్థాయిలో పంపిణీ అయ్యేలా చూడాల్సి ఉంది. -
చక్కెర రాలే...
రేషన్ షాపులకు విడుదలకాని కోటా స్టాక్ లేకపోవడమే కారణం హసన్‌పర్తి : జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపులకు చక్కెర నిలిచిపోరుుంది. సుమారు 15లక్షల మంది లబ్ధిదారులకు ఈ నెల చక్కెర అందలేదు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని రేషన్‌షాపుల్లో లబ్ధిదారులకు బియ్యంతో పాటు చక్కెర, ఇతర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ నెలలో డీలర్లు లబ్దిదారులకు బియ్యం మాత్రమే ఇచ్చారు. చక్కెరతో పాటు ఇతర సరుకుల విషయమై ప్రశ్నించినప్పటికీ ఇంకా రాలేదని సమాధానం చెప్పారు. స్టాక్ లేకపోవడం వల్ల ఈ నెల (మార్చి)లో చక్కెర కోటా విడుదల చేయలేకపోయినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. డీలర్లు ప్రతీ నెల మాదిరిగానే ఈ నెల కూడా యధావిధిగా బియ్యంతో పాటు చక్కెరకు డీడీలు చెల్లించారు. ఇప్పటి వరకు చక్కెర చేరకపోవడంతో అబ్ధిదారులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2018 రేషన్‌షాపులు ఉండగా మార్చిలో ఎక్కడ కూడా చక్కెర విడుదల కాలేదు. ప్రతి షాపునకు ప్రతీ నెలా రెండున్నర క్వింటాళ్ల నుంచి మూడు క్వింటాళ్ల వరకు చక్కెర విడుదలవుతుంది. ఒక్కో రేషన్ షాపులో సుమారు ఐదువందల నుంచి ఆరువందల కార్డుల వరకు ఉన్నాయి. -
కార్డుదారులకు ప‘రేషన్’
* కొన్ని గంటల్లో నిలిచిపోనున్న సరుకుల పంపిణీ * ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న గడువు * ఇప్పటివరకు జిల్లాలో 79.55 శాతమే పంపిణీ * పేదలకు కష్టాలు ..డీలర్లకు అవస్థలు చిలకలూరిపేట: అంతా హడావుడి... రేషన్ పంపిణీకి ప్రభుత్వం నిర్దేశించిన సమయం అటు డీలర్లకు, ఇటు రేషన్‌కార్డుదారులకు ఇబ్బందిగా మారింది. కూలి పనులు మానుకొని పేదలు రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా 10వ తేదీ లోగానే రేషన్ సరుకుల పంపిణీ విధానం విమర్శల పాలవుతోంది. ఇక కొన్ని గంటల్లో సరుకుల పంపిణీ నిలిచిపోనుంది. ప్రచారం ఏదీ..? ఒక పథకంలో మార్పులు , చేర్పులు, సవరణలు చేయాలనుకున్నప్పుడు పథకంపై విసృత ప్రచారం నిర్వహించాల్సి ఉంది. కానీ డీలర్ల సమావేశం నిర్వహించి నిర్దేశించిన గడువులోగా సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించటంతో వారు హడావుడిగానే సరుకుల పంపిణీ ప్రారంభించారు. పది రోజు ల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ దుకణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉం డగా జిల్లాలో కొంతమంది డీలర్లు రెండు, మూడు తేదీలలో మాత్రమే సరుకుల పంపిణీ చేస్తున్నారు. పథకం పై ప్రచారం కొరవడటంతో ఎప్పటిలాగే సరుకులు అందజేస్తారని ప్రజలు ఆశించారు. కానీ ఆ నోట, ఈ నోట విషయం తెలిసి పరుగున రేషన్‌షాపులకు వచ్చిన పేదలకు ఈ-పాస్ విధానం ఎప్పటిలాగే చుక్కలు చూపించింది. అప్పుడప్పుడు సర్వర్ మెరాయిస్తుండటంతో ప్రజలకు అవస్థతలు తప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో ఎంఎల్ పాయింట్ల నుంచి రేషన్ సరకుల పంపిణీ ఆలస్యంగా జరగటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అధికార వెబ్సైట్లో వివరాలు.. ఇంతా చేసి ఈ నెల 8తేదీ నాటికి జిల్లాలో 79.55 శాతం సరుకులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ అధికార వెబ్సైట్లో పొందుపరిచారు. ఇదీ నమ్మశక్యంగా లేదు. జిల్లాలోని మొత్తం 2728 రేషన్ దుకాణాల ద్వారా 13,58,883 కార్డుదారులకు మొదటిరోజు అంటే మార్చి ఒకటో తేదీన 6.68 శాతం మాత్రమే పంపిణీ చేయగలిగారు. మార్చి రెండో తేదీ నాటికి 20.17, మార్చి 5వ తేదీకి 58.16 శాతం సరుకులు పంపిణీ చేసినట్లు గణాంకాలు రూపొందించారు. ముగింపు(10వ)తేదీకి పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రజల నుంచి అనుకున్న స్పందన రాకపోవటంతో ముందుగా ఐదోతేదీవరకు మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. తర్వాత దాన్ని 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కొన్ని మండలాలల్లో పౌరసరఫరాల అధికారులు హడావుడి చేయటం విశేషం. సాధించేది ఏమిటి? ఇటు డీలర్లను, అటు పేదలను ఇబ్బందులు పెట్టడం మినహా నిర్దేశించిన 10 రోజల కాలపరిమితితో సాధించిందేమిటన్నది సమాధానం లేని ప్రశ్న. కూలినాలి చేసుకొని జీవించే సగటు జీవులు ఏ మాత్రం ఉపక్షేంచినా ఆ నెల రేషన్ వదులుకోవాల్సి వస్తుందని ఉరుకులు పరుగులు పెట్టారు. వలసకూలీలు తప్ప ని సరిగా పనులు మానుకొని సరకులు తీసుకువెళ్లారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. -
‘ఎక్స్ట్రా’ షోరూంలకు తాళం
♦ కొరడా ఝుళిపిస్తున్న రవాణా శాఖ ♦ అదనపు చార్జీలకు ముకుతాడు సాక్షి, హైదరాబాద్: డీలర్లు కంపెనీ పేర్కొన్న ఎక్స్‌షోరూం రేటు కన్నా ఎక్కువ ధరలకు వాహనాలు విక్రయిస్తుండటాన్ని రవాణా శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. వాహన షోరూంలు నిబంధనలకు విరుద్ధంగా హ్యాండ్లింగ్ చార్జీ పేర రూ.8 వేలు, ఫెసిలిటేషన్ చార్జీ కింద 1,900, లాజిస్టిక్ పేరు తో రూ.800 అదనంగా వసూలు చేస్తున్నాయి. అవేంటని షోరూం నిర్వాహకులను అడిగితే... కంపెనీ నుంచి షోరూం వరకు కారు తేవటానికి అయ్యే ఖర్చని అంటున్నారు. దీనిపై కొనుగోలుదారులకు అవగాహన లేక డీలర్లు వారి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇంతకాలం కళ్లుమూసుకున్న రవాణా అధికారులు ఇప్పు డు డీలర్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్‌లోని 4 షోరూంలపై ఇలాంటి ఫిర్యాదులు అందడంతో అధికారులు వాటికి తాళాలు వేసి వాహనాల అమ్మకంపై ఆంక్షలు విధిం చారు. పక్షం రోజుల పాటు కార్యకలాపాలు సాగకుండా చర్యలు తీ సుకున్నారు. కార్లు గానీ ద్విచక్రవాహనాలు గానీ ఏ ధరకు అమ్మాలో తయారీ కంపెనీ ఖరారు చేసిన ధరకే డీలర్లు విక్రయించాలి. ఈ విష యం నిబంధనల్లో స్పష్టంగా ఉంది. కానీ చాలామంది డీలర్లు కంపెనీలు రకరకాల పేర్లతో ఎక్కువ రుసుములను బిల్లుల్లో చేరుస్తున్నారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు సహా మరికొన్ని న్యాయస్థానాలు ఈ వసూళ్లపై స్పందించడంతో రాష్ట్ర రవాణాశాఖ అధికారులు కళ్లుతెరిచారు. కంపెనీలతో చర్చించి అసలు ధరలెలా ఉండాలో తెలుసుకుని ప్రత్యక్ష చర్యలకు దిగారు. -
రేషన్‌కు నిబంద్‌నలు!
ప్రభుత్వం విధించిన నిబంధనలు చాలామందికి రేషన్ సరుకులు అందకుండా చేశాయి. ప్రతి నెల 15వ తేదీలోగా రేషన్ కార్డుదారులకు సరుకులు అందజేయాలనే నిబంధన ఈ నెల నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ-పాస్ యంత్రాలు సక్రమంగా పని చేయకపోవడం, వేలిముద్రలు పడకపోవడం, సర్వర్ ఇబ్బందులు పెట్టడం వంటి కారణాలతో సుమారు 16 శాతం మంది తిండి గింజలకు నోచుకోలేదు. సోమవారంతో గడువు ముగియడంతో కార్డుదారులు, డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రేషన్ సరుకులపంపిణీకి ముగిసిన గడువు 16 శాతం మందికి అందని తిండిగింజలు ఆందోళన చెందుతున్న కార్డుదారులు, డీలర్లు వీరఘట్టం: జిల్లాలో 2,001 రేషన్ షాపులు ఉండగా 8,25,094 కార్డుదారులకు 13,530.730 మెట్రిక్‌టన్నుల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నారు. ఈ నెల ఇంతవరకు 6,93,078 మంది కార్డుదారులకు(84 శాతం మందికి) బియ్యం పంపిణీ చేశారు. ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో మరో 16 మంది సరుకులు నోచుకోలేదు. అలాంటి వారంతా గడువు ముగియడంతో ఆందోళన చెందుతున్నారు. డీలర్ల ఇబ్బందులు మరోపక్క మరుసటి నెల సరుకుల కోసం ప్రతి నెల 16వ తేదీనే డీడీలు తీయాలనే నిబంధనను ప్రభుత్వం విధించడంతో డీలర్లలో కలవరం మొదలైంది. దీనికితోడు ఒకటో తేదీ నుంచి 15వ తేదీ లోపు రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచిరాత్రి 8 గంటల వరకు తప్పనిసరిగా రేషన్ షాపులు తెరవాలని నిబంధన సైతంతో వారిలో ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజులు గడువు కోరాం సుమారు 16 మందికి సరుకులు అందని విషయాన్ని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి సుబ్రహ్మణ్యం వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా సోమవారంతో రేషన్ బియ్యం పంపిణీకి గడువు ముగిసిందన్నారు. మరో రెండు రోజులు గడువు పెంచాలని ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. -
వదల బొమ్మాళీ..వదల..
సంతకవిటి/వీరఘట్టం టాస్క్ఫోర్సు : ఈ-పాస్ విధానం అమలు చేసి తీరాలని ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఈ విధానం ద్వారా గత మూడు నెలలుగా సరుకులు పంపిణీలో విఫలమైన ప్రభుత్వం.. తెరపైకి కొత్త సర్వర్‌ను తీసుకువచ్చింది. రేషన్ లబ్ధిదారులు, డీలర్ల గగ్గోలును పెడచెవిన పెడుతోంది. ఈ పాస్ యంత్రాలకు గతంలో అనుసంధానం చేసిన ఏపీ ఆన్లైన్ సర్వర్‌ను పక్కనబెట్టి ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్) సర్వర్ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఐసీ ద్వారా సిగ్నల్స్ బాగా వస్తాయని, ప్రతి నెలా 5వ తేదీ లోగా సరుకుల పంపిణీ పూర్తి చేయవచ్చునని అధికారులు డీలర్లకు నచ్చజెపుతున్నారు. కొత్త సర్వర్ పనితీరు అంతంత మాత్రమేఫిబ్రవరిఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఎన్ఐసీ సర్వర్ పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. తొలి రోజే సర్వర్మోరాయించడంతోపలువురుడీలర్లుతహశీల్దార్కార్యాలయాలకుపరుగులుతీశారు.ఇలాఅయితేసరుకులుపంపిణీతమ వల్ల కాదని తేల్చి చెబుతున్నారు. వలస కూలీలకు కొత్త కష్టాలు ఈ-పాస్ అమలు ద్వారా ప్రభుత్వానికి భారీగా రేషన్ సరుకులు మిగులుతున్నాయి. వలస కూలీలకు మాత్రం కొత్త కష్టాలు మొదలయ్యాయి. బయోమెట్రిక్ మిషన్‌పై వేలి ముద్ర వేస్తేనే రేషన్ సరుకులు అందుతాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లిన వసల కూలీలు రేషన్ సరుకుల కోసం ప్రతి నెలా స్వగ్రామాలకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. వంద రూపాయల సరుకుల కోసం నెల నెలా 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయని, రాకుంటే కార్డు రద్దవుతుందని వాపోతున్నారు. భారీగా సరుకుల మిగులు మరోవైపు బయోమెట్రిక్ యంత్రాల్లో వేలిముద్రలు పడని కారణంగా నెల నెలా భారీగా సరుకులు మిగులుతున్నాయి. సంతకవిటి మండలంలో 1400 కార్డులకు, పాలకొండ మండలంలో 2800 కార్డులకు, వీర ఘట్టంలో 2500 కార్డులకు గత మూడు నెలలుగా రేషన్ సరుకులు నిలిచిపోయాయి. జిల్లాలోని ప్రతి మండలంలో ఈ సమస్య ఉంది. కుష్ఠు వ్యాధిగ్రస్తులు, కదల్లేని రోగులకు ఒక్కో మండలంలో 110 నుంచి 130 మందికి మాత్రమే వీఆర్వో సమక్షంలో రేషన్ సరుకులు ఇస్తున్నారు. మిగిలిన సరుకులు ప్రభుత్వానికి చేరుతున్నాయి. -
ఆదివారం పెట్రో డీలర్ల సమావేశం
మంగళగిరి రూరల్(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర పెట్రోలియం డీలర్ల సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత పాల్గొంటారని పేర్కొన్నారు. -
దళారుల చేతుల్లో చిక్కుకున్న రైతు బజార్లు
-
చుక్కలు చూపిస్తున్న చంద్రన్న కానుక
-
చంద్రన్న కానుక పంపిణీకి డీలర్ల అవస్థ
-
రేషన్‌కార్డులతో పరేషాన్
మంజూరైనా ప్రింటింగ్ కాని వైనం కొత్తకార్డులకూ వస్తువులు ఇస్తామంటూ ప్రభుత్వ ప్రకటన డీలర్ల చుట్టూ కార్డుదారుల ప్రదక్షిణలు విజయవాడ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు జారీచేసే రేషన్ కార్డులు ఒక ప్రహసనంగా మారింది. గతంలో తెల్లకార్డులు ఉండగా ప్రస్తుతం కొత్తగా ఇచ్చే కార్డుల రంగు మార్చేసి పచ్చకార్డులతో ప్రభుత్వం జారీచేస్తోంది. గతంలో జరిగిన జన్మభూమిలో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోగా, వాటిని ఇప్పుడు మంజూరు చేస్తున్నారు. కార్డుల రంగు మార్చడంపై ప్రభుత్వం చూపించిన శ్రద్ధ పేదలకు కొత్తకార్డులు మంజూరు చేయడంలో చూపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. నగరంలో 22వేల కార్డులు... గత జన్మభూమిలో నగరంలో 28,480 మంది కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో సుమారు 19,500 పచ్చకార్డులు మంజూరయ్యాయి. ఇందులో డివిజన్-1లో 10,200 కార్డులు మంజూరు కాగా, డివిజన్-2 పరిధిలో 9,300 కార్డులు మంజూరయ్యాయి. ఈ కార్డులను జన్మభూమిలో పేదలకు ఇస్తున్నారంటే తప్పులో కాలేసినట్లే. ప్రభుత్వం సకాలంలో మంజూరు చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, కంప్యూటర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల నగరంలో కేవలం 13000 కార్డులు ప్రింటిం గ్ కు వచ్చాయి. మిగిలిన 6,500 కార్డులు ఇం కా ప్రింటిం గ్‌కు నోచుకోలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో పరిస్థితి మరింత అయోమయంగా ఉంది. కార్డులు మంజూరైనట్లు జాబితాలు వచ్చినా కార్డులు రాకపోవడంతో ప్రజలకు సకాలంలో పచ్చకార్డులు అందచేయలేకపోతున్నారు. ప్రతి రోజూ జరిగే జన్మభూమి కార్యక్రమంలో కార్డులు మంజూరైన వారి పేర్లు చదివినా అందరికీ కార్డులు రాలేదని తరువాత ఇస్తామంటూ అధికారులు సర్ది చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. కార్డు కోసం డీలర్ల చుట్టూ, సివిల్‌సప్లయీస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని పేదలు వాపోతున్నారు. ప్రభుత్వ ఆర్భాటం పేద ప్రజలందరికీ కార్డులు కాపోయినప్పటికీ కొత్త కార్డుదారులకు కూడా రేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కార్డులు రానివారంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తమ పేరు లిస్టులో చదివారని, తమకు మాత్రం కార్డు ఇవ్వడం లేదని, డీలరు సూచన మేరకు కార్డు కోసం సివిల్ సప్లయీస్ కార్యాలయానికి వచ్చానని కృష్ణలంకకు చెందిన ఒక మహిళ సాక్షికి తెలిపింది. తప్పుల తడకలు కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు లబ్ధిదారులకు కుటుంబసభ్యులందరితో ఫొటోను, పేర్లు, వివరాలు ఇవ్వమని సూచించారు. అధికారులు కోరినట్లే కుటుంబసభ్యులందరితో కలిపిన ఫొటోలు ఇచ్చారు. ప్రస్తుతం అనేక కార్డులలో ఫొటోలో నలుగురు ఉంటే ఒకరిద్దరి పేర్లు మాత్రమే వస్తున్నాయని కార్డు దారులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల పేర్లు నమోదు కావడం లేదు. కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ఫొటోలో నలుగురు ఉన్నట్లు చూపితే.. కార్డులో ఇద్దరి పేర్లు మాత్రమే ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి రేషన్ డిపో పరిధిలోనూ కనీసం నలుగురైదుగురికి ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సింగ్‌నగర్, పాయకాపురంలో ఫొటోలు లేకుండా కార్డులు వస్తున్నాయని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఆధార్ నెంబర్లు సరిగా సరిపోల్చక పోవడం, ఆధార్ కార్డుల జిరాక్స్‌లు సరిగా ఇవ్వకపోవడం వల్లనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని సివిల్ సప్లయీస్ అధికారులు చెబుతున్నారు. -
ఇద్దరు రేషన్ డీలర్లకు జరిమానాలు
కొమరోలు: తూకాల్లో అక్రమాలకు పాల్పడుతూ.. పేద ప్రజలను మోసగిసతున్న ఇద్దరు రేషన్ డీలర్లకు అధికారులు జరిమానాలు విధించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలులో బుధవారం వెలుగుచూసింది. స్థానిక కొమరోలు -1, కొమరోలు -2 రేషన్ దుకాణాల్లో కొలతల్లో అవకతవకలు జరుగుతున్నాయనే సమాచారంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు బియ్యం తూకాల్లో 35 కిలోలకు గాను 33 కిలోలు మాత్రమే ఉండటాన్ని గుర్తించి ఇద్దరు దుకాణ దారులపై రూ. 10 వేల చొప్పున జరిమానాలు విధించారు. -
ప్రజా పంపిణీ 'డీలా'ర్లు
శ్రీకాకుళం టౌన్ : ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ నానాటికీ నిర్వీర్యం అవుతోంది. గత ప్రభుత్వం పంపిణీ చేసిన నిత్యావసర సరుకులు ఇప్పుడు కనిపించడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కొత్త విధానంవల్ల డీలర్లకు కొత్త తలనొప్పులు వచ్చి చేరాయి. కమిషన్లు పెంచక పోగా సాంకేతిక కారణాల వల్ల ఉన్న రేషన్ కార్డులు తొలగిస్తూ గ్రామాలకు సరిపడా సరకులు ఇవ్వడం లేదు. దీంతో డీలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి మాత్రమే సరఫరా చేయాలని నిర్ణయించినా పెరిగిన ధరల వల్ల అవికూడా అందని పరిస్థితి నెలకొంది. కేవలం బియ్యం, పంచదారకే ప్రజాపంపిణీ వ్యవస్థ పరిమితమవుతోంది. డీలర్ల నెత్తిన నిర్వహణ వ్యయం డీడీలకు బ్యాంకుల్లో కమిషన్ చెల్లించినా ఆ మొత్తాలు డీలర్లకు చెల్లించడం లేదు. దీనికి తోడు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న రె వెన్యూ అధికారులకు మామూళ్లు, డిపో నిర్వహించడానికి అవసరమైన గోదాంలు, ఇద్దరు హమాలీలు, కరెంటు బిల్లులు, అన్లోడింగ్ చార్జీలు, తూనికలు కొలతలశాఖ మామ్మూళ్లు, వెరసి ఒక్కోడీలరుకు రూ.5000వరకు ఖర్చు అవుతోంది. రూ.50 మెట్రిక్‌టన్నుల బియ్యం పంపిణీ చేస్తే క్వింటా ఒక్కింటికి రూ.20మాత్రమే పౌరసరఫరాలశాఖ కమిషన్‌గా చెల్లిస్తోంది. లబ్థిదార్లకు కావాల్సిందేమిటి? జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డులు,అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిపి 7.56లక్షల వరకు ఉన్నాయి. అందుకోసం 12,484,084 కిలోల బియ్యం, 7,32,561కిలోల పంచదార,7,55,793కిలోల కందిపప్పు, 37,77,690 కిలోలు,గోధుమపిండి 37,77,751కిలోల వంతున నిత్యం సరఫరా చేయాల్సిఉంది. గోధుమలు, గోధుమ పిండి కొనుగోలు అంతంత మాత్రమే ఉండడంతో వాటిని డీలర్ల వద్ద నెలల తరబడి ఉండిపోతున్నాయి. -
కిరోసిన్ కష్టాలు!
అనంతపురం అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలందిస్తామంటూ ఆ శాఖ మంత్రి మొదలు అధికారులు చెప్పుకుంటున్నా పౌరసరఫరాల శాఖలో వాస్తవ పరిస్థితులు తద్భిన్నంగా ఉన్నాయి. గత మూడు నెలలుగా నిత్యావసరాల పంపిణీలో అడుగడుగునా లోపాలు కనిపిస్తున్నాయి. కిందిబేడలు విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఉంటే... కిరోసిన్ విషయంలో అధికారులు పర్యవేక్షణ లోపం... హోల్‌సేలర్ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే... ఈ నెల కోటా కిరోసిన్‌ని కొన్ని రేషన్ దుకాణాలు, హాకర్లకు సరఫరానే కాలేదు. జిల్లా వ్యాప్తంగా 43 వేల లీటర్లు ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. అనంతపురం నగరంలోని దాదాపు 45 మంది డీలర్లు, హాకర్లకు 19 వేల లీటర్లు సరఫరా కాలేదంటున్నారు. కొన్ని చౌక ధర దుకాణాల డీలర్లకు కిరోసిన్ సరఫరా చేయకపోవడం అంటూ ఒక రకంగా ప్రజలను ఇబ్బందికి గురిచేసినట్లే అవుతుంది. డీలర్ల ఫిర్యాదు వరకు మౌనం హోల్‌సేలర్ కిరోసిన్‌ని జిల్లాలోని కొన్ని చౌక ధరల దుకాణాలకు, హాకర్లకు ఈ నెల సరఫరా చేయలేదు. ఈ విషయం అధికారులకు డీలర్లు ఫిర్యాదు చేసేంతవరకు మౌనంగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజా పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అనేదానిపై అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా పర్యవేక్షణ ఉండి ఉంటే హోల్‌సేలర్ సరఫరా కాలేదన్న విషయం వెంటనే తెలిసి ఉండేది. అలా కాకుండా డీలర్లు పిర్యాదు చేసిన తరువాత అధికారుల్లో కదలిక వచ్చిందంటే ఎంత బాధ్యతారహితంగా ఉన్నారో స్పష్టమవుతోంది. లోగుట్టు వ్యవహారమనే విమర్శలు హోల్‌సేలర్ కిరోసిన్ సరఫరా చేయలేదన్న విషయాన్ని డీలర్లు చెప్పే వరకు అధికారులు పట్టించుకోక పోవడం వెనుక లోగుట్టు వ్యవహారం ఉందనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ నెల కోటాలో కొన్ని దుకాణాలకు సరఫరాను ఎగనామం పెడితే అది మిగులుగా ఉంటుంది. ఈ మొత్తాన్ని బ్లాక్‌లో విక్రయించే ఎత్తుగడతో భాగంగానే వ్యవహారం నడిపినట్లు ఆరోపలు వినవస్తున్నాయి. కొందరు డీలర్లకు, హాకర్లకు ఈ నెల కోటాని హోల్‌సేలర్ సరఫరా చేయని విషయం కొందరు అధికారులకు తెలిసే జరిగిందనే విమర్శలు ఉన్నాయి. -
మిగులు బియ్యం... 2 వేల క్వింటాళ్లు!
నల్లగొండ : రేషన్ దుకాణాల్లో బియ్యం మిగులు నిల్వలపై లెక్కతేలింది. డీలర్లు మిగులు నిల్వలపై సరైన సమాచారం ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై జిల్లా పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయగా మిగిలిన నిల్వలపై పారదర్శకంగా సమచారం ఇవ్వకుండా డీలర్లు బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలించడం సర్వసాధారణంగా మారింది. దీంతో డీలర్ల అక్రమాలు అరికట్టి బియ్యం నిల్వలపై సమగ్ర సమాచారం రాబట్టేందుకు జిల్లా పౌరసఫరాల శాఖ ప్రతి నెలా 13వ తేదీ నాటికి డీలర్ల వద్ద మిగులు నిల్వల సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తోంది. రెండు మాసాల నుంచి అమలు చేస్తున్న ఈ విధానాన్ని అధికారులు ఇటీవల మరింత ఉధృతం చేశారు. జిల్లావ్యాప్తంగా రేషన్ దుకాణాలు 2,082 ఉన్నాయి. 9.89 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం 30 లక్షల యూనిట్లు ఉన్నాయి. ఈ కుటుంబాలకు ప్రతినెలా రేషన్ బియ్యం లక్షా 80 వేల క్వింటాళ్లు పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేయగా జూలైలో 1500 క్వింటాళ్లు మిగులు ఉన్నట్లు డీలర్లు లెక్కలు సమర్పించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం డీలర్లపై నిఘా మరింత పెంచడంతో ఆగస్టుకు వచ్చే సరికి 2,238 క్వింటాళ్లకు పెరిగింది. సచ్ఛీలురూ వీరే.... ఈ నెలలో లక్షా 80 వేల క్వింటాళ్లు డీలర్లకు సరఫరా చేశారు. దీంట్లో లబ్ధిదారులకు పం పిణీ చేయగా డీలర్ల వద్ద 2,238 క్వింటాళ్లు మిగులు ఉన్నట్లు తేలింది. దీంట్లో తమ వద్ద గింజ బియ్యం కూడా నిల్వ లేదని 14 మంది డీలర్లు లెక్కలు సమర్పించారు. క్వింటాకు తక్కువ బియ్యం నిల్వలు కలిగిన దుకాణాలు 50 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అతితక్కువ బియ్యం నిల్వలు ఉన్న మండలాల్లో చిట్యాల మండల పరిధిలోని దుకాణాల్లో 14 క్వింటాళ్లు, పెద్దవూర మండలంలో 19 క్వింటాళ్లు, బీబీనగర్ మండలంలో 8 క్వింటాళ్లు, సూర్యాపేట 12 క్వి ంటాళ్లు, అర్వపల్లి 13 క్వింటాళ్లు, మర్రిగూడ మండల పరిధిలోని దుకాణాల్లో 10 క్వింటాళ్లు మాత్రమే బియ్యం నిల్వలు మిగిలి ఉన్నట్లు పౌరసరఫరాల శాఖకు లెక్కలు ఇచ్చారు. నేటినుంచి విస్తృత తనిఖీలు... జీరో బ్యాలెన్స్ దుకాణాలు, అతితక్కువ నిల్వలు కలిగిన రేషన్ దుకాణాలపై శుక్రవారం నుంచి జిల్లా యంత్రాంగం విస్తృత తనిఖీలు నిర్వహించనుంది. ఈ తనిఖీల్లో సరుకుల నిల్వలు తేలితే అక్కడికక్కడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ తనిఖీల అనంతరం కీ రిజిస్టర్ రూపొం దిస్తారు. ఆ తర్వాత మీ సేవా కేంద్రాల్లో డీలర్లందరూ బియ్యం సహా అన్ని సరుకులకు ఒకేసారి డీడీలు చెల్లించాల్సి ఉం టుంది. మీ సేవా కేంద్రాల్లో ఎంటర్ అయిన దుకాణాల డీడీలను తహసీల్దార్లు పరిశీలించిన పిదప గోదాములకు పంపుతారు. అక్కడినుంచి డీలర్లుకు రేషన్ సరుకులు సరఫరా చేస్తారు. ఈ విధానం ద్వారా డీడీలు చెల్లించే క్రమంలో డీలర్లు రెండు సార్లు కాకుండా ఒకేసారి డీడీలు చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ఒకేసారి సరుకులన్నీ దుకాణాలకు చేరుతాయి. లబ్ధిదారులకు పంపిణీ కూడా ఏకకాలంలో పూర్తవుతుంది. -
అన్నీ నాసిరకమే!
కొందరు రేషన్‌షాపు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర వస్తువులేగాక నాసిరకమైన సబ్బులు, సర్ఫ ప్యాకెట్లు, టీపొడి, మంచినూనె, కొబ్బరినూనె తదితర వస్తువులను విక్రయిస్తున్నారు.. అవి వద్దన్నా బలవంతంగా లబ్ధిదారులకు అంటగడుతూ ఇబ్బందులపాలు చేస్తున్నారు.. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు.. - పూడూరు - రేషన్ షాపుల్లో కల్తీ వస్తువులు - పట్టించుకోని అధికారులు - ఆందోళనలో లబ్ధిదారులు మండలంలో మొత్తం రేషన్ 34 షాపులు ఉన్నాయి. అందులో కొన్ని మినహా అన్నిట్లో ఈ సరుకులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం కేవలం బియ్యం, పంచదార, కందిపప్పు, కిరోసిన్, గోధుమలు మాత్రమే సరఫరా చేస్తోంది. అయితే పూడూరు మండలంలోని కొన్ని రేషన్ షాపుల డీలర్లు నాసిరకమైన సబ్బులు, ఇతర వస్తువులను కార్డుదారులకు అంటగడుతున్నారు. అధికారులు, డీలర్లు కుమ్మక్కై తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని షాపుల్లో ఈ వస్తువులన్నీ తప్పనిసరి కొనాల్సిందేనని నమ్మబలుకుతున్నారు. లే దంటే వచ్చేనెల రేషన్ కట్ అవుతుందని బెదిరిస్తున్నారు. ఈ తంతు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందని ఈ వ్యవహారంపై ఎవరూ పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా డీలర్ల సంఘం రాష్ట్ర నాయకుడే వీటిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. వాటిని అమ్మండి ఏమైనా ఇబ్బందులు వస్తే.. నేను చూసుకుంటాను.. అని అతను హామీ ఇస్తున్నారని డీలర్లు చెబుతున్నారు. ఈ సరుకులు అమ్మకుంటే ఉన్నతాధికారులతో తనిఖీలు చేయిస్తూ వేటు వేయిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాడన్నారు. డీలర్‌షిప్‌లు రద్దు చేస్తాం రేషన్ షాపుల్లో ప్రభుత్వం అందించే వస్తువులు మాత్రమే విక్రయించాలి. కొన్ని రేషన్‌షాపుల్లో కిరాణా వస్తువులు సైతం అనుమతి లేకుండా అమ్ముతున్నట్లు మాకు ఫిర్యాదులు అందాయి. ఇతర వస్తువులు అమ్మితే చర్యలు తీసుకుని డీలర్‌షిప్‌ను రద్దు చేస్తాం. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి పంచదార, బియ్యం, గోధుమలు, కిరోసిన్, గోధుమపిండి, కందిపప్పు సరఫరా అవుతోంది. త్వరలో అన్ని రేషన్‌షాపుల్లో తనిఖీలు నిర్వహించి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటాం. - వెంక ట ఉపేందర్‌రెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్, పూడూరు తనిఖీలు నిర్వహించాలి రేషన్ షాపుల్లో నాసిరకం సరుకులు అమ్ముతూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వచ్చిన సరుకులు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్న లబ్ధిదారులకు వాటిని అంటగట్టడం తగదు. ఏకంగా డీలర్ల సంఘం రాష్ర్ట నాయకుడే ఇలా పంపిణీ చేస్తున్నారు. వెంటనే అధికారులు ఆయా రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలి. - హరీశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం మండల అధ్యక్షుడు బ్లాక్‌లో అమ్ముతున్నారు కొందరు రేషన్ డీలర్లు బ్లాక్‌లో సరుకులను అమ్ముతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇవి అమ్ముకోవాలని జీఓ ఉందని చెబుతున్నారు. ప్రతి మండలంలో ఇదే తంతు జరుగుతున్నా పౌరసరఫరాలశాఖ అధికారులు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఇతర సరుకుకులు కొంటేనే బియ్యం ఇస్తామని లబ్ధిదారులకు బలవంతంగా అంటగడుతున్నారు. వెంటనే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి. - కోళ్ల యాదయ్య, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి -
నిఘా నీడ.. డీలర్లకు దడ
శివార్లలో ‘బియ్యం కోటా’ మాయ..! పీడీఎస్ బియ్యంపై పెరిగిన నిఘా స్టాక్ ఎత్తని రేషన్ డీలర్లు గిడ్డంగులు దాటని బియ్యం నిల్వలు ఈ నెల పంపిణీపై అనుమానాలు సాంకేతిక ఇబ్బందులంటున్న అధికారులు సిటీబ్యూరో: నగర శివార్లలోని పౌరసరఫరాల శాఖ గోదాములపై విజిలెన్స్ నిఘా పెరగడంతో డీలర్లలో దడ మొదలైంది. బియ్యం అక్రమాలపై ఆకస్మిక తనిఖీలు, క్రిమినల్ కేసుల నమోదు వంటి చర్యలు బెంబేలెత్తిస్తుండడంతో గోదాముల నుంచి బియ్యం నిల్వలు కదలడం లేదు. ఆగస్టు ఒకటవ తేది నుంచి పేదలకు బియ్యం పంపిణీ ప్రారంభం కావల్సి ఉన్నా.. ఇప్పటి వరకు బియ్యం బస్తాలు చౌకధరల దుకాణాలకు చేరకపోవడం గమనార్హం. ఈనెల కోటాను ఈ-పీడీఎస్ ద్వారా పౌరసరఫరాల అధికారులు కేటాయించినా... డీడీలు కట్టి బియ్యం స్టాకును డ్రా చేసేందుకు డీలర్లు ముందుకు రావడంలేదు. ఒకవైపు గోదాముల్లో పుష్కలంగా బియ్యం నిల్వలున్నా.. డీలర్లు అనాసక్తి కనబర్చడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీలర్ల గుండెల్లో గుబులు.. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం నల్ల బజారుకు తరలుతుండడంతో నగర శివార్లలోని పౌరసరఫరాల గోదాములపై విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ, టాస్క్‌ఫోర్స్ విభాగాల నిఘా పెరగడంతో రేషన్ డీలర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వాస్తవానికి ప్రతి నెల 25లోగా డీడీ లు చెల్లించి అవసరమైన మేర బియ్యం కోసం ఆర్డర్ పెట్టి డ్రా చేసుకొవాల్సి ఉంటుంది. కానీ ఇటీవల ప్రజా పంపిణీ వ్యవస్థలో పేదల బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి నల్ల బజారుకు తరలిస్తుండడాన్ని సర్కారు పసిగట్టి నిఘా పెంచింది. అంతేకాదు ప్రతినెలా గోదాముల నుంచి నేరుగా సుమారు 50 శాతం కోటా పక్కదారి పడుతున్నట్లు పౌరసరఫరా శాఖ అధికారులు గుర్తించారు. అక్రమాలిలా.. వాస్తవంగా డీలర్లు తమ కోటా కేటాయింపు జరగగానే డీడీ చెల్లించి సరుకులను డ్రా చేస్తారు. బియ్యం బస్తాలు చౌకధరల దుకాణాలకు సరఫరా చేసే సమయంలో స్టేజ్ టూ కాంట్రాక్టర్లతో డీలర్లు కుమ్మక్కై 50 శాతం బియ్యం బస్తాలను నల్ల బజారు తరలించి భారీ సొమ్ము చేసుకుంటారు.ఈనెల పీడీఎస్ బియ్యం సరఫరాపై నిఘా పెరగడంతో తమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని డీలర్లు సరుకులు డ్రా చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. శివార్లలో పరిస్థితి ఇలా.. శివార్లలోని సరూర్‌నగర్, ఉప్పల్, బాలానగర్ సర్కిళ్ల పరిధిలో 688 దుకాణాల్లో సుమారు 6,25,113 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. అందులో సుమారు 20, 02,405 యూనిట్లు (లబ్దిదారులు )ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున మొత్తం 12.14 వేల టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఇందులో కేవలం 10 శాతం కోటాకు మాత్రమే డీలర్లు డీడీలు కట్టి ఆర్డర్ పెట్టినట్లు తె లిసింది. జూలై మాసం మిగులు కోటా వివరాలు కూడా డీలర్లు సమర్పించకపోవడం గమనార్హం. అయితే పౌరసరఫరా కార్పొరేషన్ అధికారులు మాత్రం మీ-సేవా సాంకేతిక కారణాలతో డీలర్ల నుంచి ఆర్వోలు అందలేదని పేర్కొంటుండడం గమనార్హం. శివారు ప్రాంతాలు మినహాయించి మిగతా ప్రాంతాల ఆర్వోలు పూర్తి స్థాయిలో వచ్చిన వైనంపై ‘సాక్షి’ సంబంధిత అధికారుల వివరణ కోరగా వారి నుంచి సరైన సమాధానం కరవైంది. -
మేమే పాస్
- ఈ-పాస్‌లోనూ డీలర్ల అక్రమాలు - కమిషనర్ కార్యాలయంలో వెలుగులోకి.. - వారం రోజులుగా కొనసాగుతున్న విచారణ - రెండు రోజుల్లో జిల్లాకు అక్రమార్కుల జాబితా కర్నూలు: పౌర సరఫరాల శాఖలో కొత్తగా అమల్లోకి వచ్చిన బయెమోట్రిక్ విధానం కూడా డీలర్లకు వరంగా మారింది. వేలిముద్రల ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తే బోగస్‌ను అరికట్టవచ్చని ప్రభుత్వం ఈ-పాస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పద్ధతి కూడా అక్రమార్కులను నిలువరించలేకపోతోంది. సాంకేతిక మిషన్లను సైతం బురిడీ కొట్టించి కొందరు డీలర్లు లాభాలు గడిస్తున్నారు. సరుకుల సరఫరా సందర్భంగా ఒకేసారి రెండు మూడు ఈ-పాస్ మిషన్లను ఓపెన్ చేసి కార్డుదారు వేలిముద్ర సహాయంతో సరుకులను కాజేసిన బాగోతాన్ని హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో సాంకేతిక నిపుణులు గుర్తించారు. ఈ విషయాన్ని డిప్యూటీ డెరైక్టర్ విజయలక్ష్మి దృష్టికి తీసుకుపోవడంతో ఆమె విచారణ చేపడుతున్నట్లు సమాచారం. కార్డుదారు వేలిముద్రను ఈ-పాస్ మిషన్‌పై నమోదు చేసిన వెంటనే చిన్న కాగితం ముక్క(బిల్లు) వస్తుంది. అందులోని లెక్కల ప్రకారం ఎలక్ట్రానిక్ కాటాపై కచ్చితమైన తూకంతో కార్డుదారులకు సరుకులను అందించాల్సి ఉంది. ఇక్కడే డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలను సైతం డీలర్లు అనుకూలంగా మలచుకున్నట్లు బయటపడింది. రెండు, మూడు మిషన్లను ఒకేసారి ఆన్ చేసి అన్నింటిలోను వేలిముద్రలతో బిల్లింగ్ కొట్టి ఒక మిషన్ ద్వారా వచ్చిన సరుకులను మాత్రం కార్డుదారులకు కట్టబెట్టి, మిగిలిన మిషన్ల ద్వారా వచ్చిన సరుకులను కాజేసి ప్రభుత్వానికి బురిడీ కొట్టించినట్లు గుర్తించారు. పోర్టబిలిటీ విధానంతో డీలర్ల చేతివాటం రేషన్ పోర్టబిలిటీ(ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానం) అమలులో ఉన్నందున డీలర్లు కూడబలుక్కుని చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. జీపీఆర్ అనుసంధానంతో ఈ-పాస్ మిషన్లు పనిచేస్తున్నందున కర్నూలు డీలర్ల అక్రమాలు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో బయటపడ్డాయి. ఒకటికి మించి చౌక డిపోలు నిర్వహిస్తున్న వారు, సొంత చౌక డిపోలతో పాటు ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న డీలర్లు ఇలాంటి తరహా అక్రమాలకు పాల్పడి ప్రభుత్వానికి శఠగోపం పెట్టినట్లు వెలుగు చూసింది. ఈ- పాస్ విధానం వల్ల రేషన్ బియ్యం భారీగా మిగిలిందని భావిస్తున్న తరుణంలో కొత్త తరహాలో అక్రమాలు వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ తరహా మోసానికి ఎవరెవరు పాల్పడ్డారు, ఎంత మొత్తంలో సరుకులు కాజేసి ప్రభుత్వానికి బురిడీ కొట్టించారనే విషయాలపై కమిషనర్ కార్యాలయంలో జాబితా సిద్ధమయిందని సమాచారం. రెండు మూడు రోజుల్లో జిల్లా అధికారులకు నివేదిక అందే అవకాశముందని పౌర సరఫరాల శాఖ అధికారుల ద్వారా తెలిసింది. పెలైట్ ప్రాజెక్టుగా కర్నూలు రాష్ట్రంలోనే కర్నూలును పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఏప్రిల్ మాసం నుంచి జిల్లాలో ఈ-పాస్ అమలు చేస్తున్నారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, గూడూరు, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె మున్సిపల్ పట్టణాల్లోని 457 చౌక డిపోల్లో ఈ-పాస్ యంత్రాలతో సరుకుల పంపిణీ జరుగుతోంది. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మరో 680 చౌక డిపోల్లో ఆగస్టు 1 నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే నాలుగు మాసాలు గడవకముందే కర్నూలు నగరంలో డీలర్లు బయోమెట్రిక్ విధానాన్ని కూడా బురిడీ కొట్టించి అక్రమాలకు పాల్పడటం పౌర సరఫరాల శాఖలో చర్చనీయాంశమైంది. -
అటకెక్కిన అదనపు చక్కెర
తెనాలి : రంజాన్ పర్వదినం కానుకగా రాష్ట్రంలోని తెల్ల రేషను కార్డుదారులందరికీ ఈ నెలలో అరకిలో చొప్పున అదనంగా చక్కెర పంపిణీ చేస్తామని చెప్పిన రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు తూచ్ అంటోంది. ఈ ప్రకారం రేషను డీలర్లకు పౌరసరఫరాలశాఖ సంక్షిప్త సందేశాలను పంపింది. దీనితో ఈనెలలో మరో అరకిలో చక్కెర అదనంగా వస్తుందని భావించిన సాధారణ కార్డుదారులకు నోరు చేదయినట్టే! భిన్న ప్రకటనలు.. సాధారణ కోటా కింద అరకిలో, రంజాన్ సందర్భంగా మరో అరకిలో కలిపి మొత్తం ఒక్కో కార్డుకు కిలో చొప్పున చక్కెర ఇవ్వనున్నట్టు పౌరసరఫరాలశాఖ డెరైక్టర్ జి.రవిబాబు గత నెల 24న ప్రకటించారు. ఈ చక్కెరను డీలర్లు విధిగా అందరూ కార్డుదారులకు జూలైలో ఇవ్వాలని, ఇతర పథకాలకు మళ్లించరాదని ఆయన స్పష్టంచేశారు. దీనితో బియ్యంతోపాటు అదనపు చక్కెరకు రేషను డీలర్లు డీడీలు తీయాలని అధికారులు హడావుడి మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గత నెల 27న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ముస్లిం కార్డుదారులకు రంజాన్ కానుకను ప్రకటించారు. అందుకనుగుణంగా పౌరసరఫరాల శాఖ ‘చంద్రన్న రంజాన్ తోఫా’ పేరుతో చౌకదుకాణాల ద్వారా ఒక్కో ముస్లిం కార్డుదారుకు అయిదు కిలోల గోధుమపిండి, రెండు కిలోల చక్కెర, ఒక కిలో సేమియా, వంద గ్రాముల నెయ్యి సహా ఉచితంగా అందించేందుకు సన్నాహాల్లో ఉన్నారు. ఇప్పటికే కార్డుపై ఒక కిలో గోధుమపిండిని ఇస్తున్నచోట ఈ కానుక కింద మరో నాలుగు కిలోలు ఇస్తారని చెప్పినా, గోధుమపిండిని జిల్లాలో ఎక్కడా చౌకదుకాణాల్లో ఇవ్వటం లేదు. మొత్తం అయిదు కిలోలు ఇప్పుడు ఇవ్వాల్సివుంటుంది. నెలనెలా ఇస్తున్న అర కిలో చక్కెర కు మరో కిలోన్నర అదనంగా కలిపి మొత్తం రెండు కిలోలు ఇస్తారు. రాష్ట్రంలో 10-12 లక్షల ముస్లిం కార్డుదారులకు ఈ కానుక అందించనున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ తెల్లరేషను కార్డుదారులకు అదనంగా ఇస్తామన్న అరకిలో చక్కెర హామీ అటకెక్కించారు. సాధారణ కోటా కింద నెలనెలా అందిస్తున్నట్టే జూలై నెలకూ అరకిలో చొప్పున ఇవ్వాలని, అదనపు కోటా లేదని పౌరసరఫరాల అధికారులు చౌకడిపోల డీలర్లకు సంక్షిప్త సందేశాలు పంపారు. దీనితో ఈసారి ఇతర అదనపు చక్కెరకు కార్డుదారులు ఆశను వదిలేసుకున్నారు. ఉన్నతస్థాయిలో సమన్వయం లేనందునే కొన్ని కీలకమైన నిర్ణయాలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయనీ, ఫలితంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో గందరగోళానికి దారితీస్తోందనే అభిప్రాయానికి అదనపు చక్కెర వ్యవహారం బలం చేకూరుస్తోంది. -
రేషన్ షాపులకు సమైక్యల సహకారం
- జిల్లాలో ప్రారంభం కానున్న కొత్తవిధానం - జిల్లా వ్యాప్తంగా 421 షాపుల్లో ఏర్పాటు - ఈపాస్‌లు, ఐరీష్ల నిర్వాకంతో డీలాపడ్డ డీలర్లు మదనపల్లె: ప్రజా పంపిణీ వ్యవస్థలో పౌరసరఫరాల శాఖ నూతనంగా అవలంబిస్తున్న విధానాల్లో సమైక్య మహిళలు కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే ఈ కొత్త విధానాలతో ఇటు వినియోగదారులు, అటు రేషన్ డీలర్లకు చుక్కలు కనబడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలనే లక్ష్యంతో ఆ శాఖ మరో కొత్త విధానానికి నాంది పలకనుంది. సాంకేతిక సమస్యల వల్ల ఈపాస్, ఐరీష్లు పనిచేయకపోవడంతో రేషన్ వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు తీసుకోవ డం వారికి ఇబ్బందిగా మారింది. అయితే ఈ కొత్త విధానం వల్ల వారికి కొంత ఊరట లభించనుంది. తొలిరోజుల్లో ఈపాస్, ఐరీష్ లతో సరుకులను పంపిణీ చేస్తారు. వేలిముద్రలు పనిచేయని వారికి, మ్యానువల్‌గా ఇచ్చేవారికోసం ఒక్కోషాపులో ఇద్దరు సమైక్య లీడర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రాలను ఆదేశాలు అందాయి. సమైక్య లీడర్లు మ్యాన్యువల్‌గా తీసుకునే వారిని గుర్తించి సరుకులు ఇవ్వాలని డీలరుకు సిఫార్సు చేయనున్నారు. జిల్లాలో మే నెల మొదటి వారం నుంచి రేషన్ షాపులలో ‘ఈపాస్‘ విధానాన్ని అమలులోనికి తెచ్చిన విషయం తెల్సిందే. జిల్లా వ్యాప్తంగా 2,891 రేషన్‌షాపులుండగా, వాటిలో ప్రయోగాత్మకంగా 421షాపుల్లో ఏర్పాటు చేశారు. ఇదే షాపులకు సమైక్యలీడర్లు కూడా సహకారం అందించనున్నారు. సమస్యలను అధిగమించేందుకే సమైక్యల సహకారం... రేషన్ షాపుల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకే సమైక్యల సహకారం తీసుకోనున్నామని సీఎస్‌డీటీ అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈపాస్‌లు, ఐరీష్ల కు సాంకేతిక సమస్య లు వస్తున్నాయని డీ లర్లు తమ దృష్టికి తె స్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సమై క్య లీడర్ల లిస్టుకోసం మున్సిపల్ అధికారులకు లేఖ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విధా నం ఎంతమాత్రం విజయవంతం అవుతుందో వేచిచూడాల్సిందే. -
డీలర్లతో ప్రభుత్వానికి చెడ్డపేరు
- రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు - సబ్ కలెక్టర్‌కు ఆహార సలహా సంఘం సభ్యుల ఫిర్యాదు తాండూరు రూరల్: పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేయడంలో డీలర్లు జాప్యం చేస్తున్నారని, దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని పలువురు ఆహార సలహా సంఘం సభ్యులు వికారాబాద్ సబ్ కలెక్టర్ ఆలగు వర్షిణికి ఫిర్యాదు చేశారు. తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరగిన నియోజకవర్గస్థాయి ఆహార సలహా సంఘం సమావేశంలో సంఘం సభ్యులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికీ పేదలకు రేషన్ సరుకులు అందడం లేదన్నారు. చాలామంది పేదలు ఆహార భద్రత కార్డులు అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రామాల్లో రేషన్ డీలర్లు నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. రేషన్ డీలర్లకే 17వ తేదీ తర్వాత సరఫరా చేస్తే... వారు లబ్ధిదారులకు ఎప్పుడు పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. పెద్ద గ్రామపంచాయతీలకు అదనంగా రేషన్ డీలర్లను నియమించాలని కోరారు. విజిలెన్స్‌తో విచారణ జరిపించాలి,, ఆహార సలహా సంఘం సమావేశంలో తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, తాండూరు, యాలాల ఎంపీపీలు కొస్గి లక్ష్మమ్మ, సాయన్నగౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో పేదలకు రేషన్ సరుకులు అందడం లేదని, ఈ విషయమై ప్రభుత్వం విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో రేషన్ సరుకులు రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు.. రేషన్ సరుకుల పంపిణీలో డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని వికారాబాద్ సబ్ కలెక్టర్ అలగు వర్షిణి హెచ్చరించారు. సరుకులు పంపిణీ చేసి పేదలకు న్యాయం చేయాలన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. గ్యాస్ సరఫరాలో వినియోగదారులకు ఇబ్బందులు కలిగించ వద్దని ఏఎస్ఓ దీప్తని ఆదేశించారు, సమావేశంలో ఆహార సలహా సంఘం సభ్యులు సురేందర్రెడి, మల్లారెడ్డి, కృష్ణ ముదిరాజ్, బంట్వారం భద్రేశ్వర్, శరణప్ప, శ్రీనివాస్, బుగ్గప్ప, ఆయా మండలాల తహసీల్దార్లు గోవింద్రావు, ప్రేమ్‌కుమార్, భిక్షపతినాయక్ పాల్గొన్నారు. -
డీలర్ చెబితేనే రేషన్ కార్డు!
సాక్షి, హన్మకొండ : ఒక రేషన్‌షాపు పరిధిలో ఉన్న రేషన్‌కార్డులు(ఆహార భద్రత కార్డు) మరో షాపు పరిధిలోకి మారుతున్నారుు. ఇది కంప్యూటర్ తప్పి దం వల్లో.. అధికారుల పొరపాటు వల్లో కా దు.. ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ఆదేశాల తో డాటా ఎంట్రీ ఆపరేటర్లు రేషన్‌షాపు డీలర్లకు చేస్తున్న సహాయం. 2015 జనవరిలో కొ త్త రేషన్ కార్డులు మంజూరైన తర్వాత రాంనగర్, యాదవనగర్, రెడ్డికాలనీ ప్రాంతాల్లోని రే షన్ దుకాణాలకు చెందిన వందకుపైగా కా ర్డులు 71వ నంబర్ రేషన్ దుకాణం పరిధిలోకి వెళ్లాయి. ఇదే పద్ధతిలో కాజీపేటలోని 102 నం బరు చౌకదుకాణం పరిధిలో ఉన్న లబ్ధిదారులను రహమత్ నగర్ రేషన దుకాణం పరిధిలోకి మార్చారు. ఇలా లాభం.. కార్డులు ఒక చౌకధర దుకాణం నుంచి మరో చౌకధర దుకాణం పరిధిలోకి మార్చడం వల్ల లబ్ధిదారులు మొదట ఇబ్బంది పడతారు. తెలియని ప్రాంతానికి వెళ్లి రేషన్ సరుకులు తీసుకునే వారి సంఖ్య తగ్గుతుంది. ఓ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఆ కార్డుకు 24 కిలోల బియ్యం వస్తాయి. ఇలా నాలుగు కార్డులు కలిస్తే ఒక క్వింటాలు బియ్యం మిగులుతారుు. రేషన్ దుకాణాల మార్పిడి ప్రక్రియ వల్ల ప్రస్తుతం కనీసం ఒక్కో చౌకదుకాణం పరిధిలో 50 రేషన్ కార్డుల బియ్యం పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఇంటి నంబర్లతో షాపుల కేటాయింపు సహజంగా పాతకార్డులు చించేసి కొత్తగా దరఖాస్తు చేసుకున్నావారికి పాత కార్డు ఉన్న షాపులోనే కొత్త కార్డు ఇవ్వాలి. కానీ అధికారులు కొత్త పద్ధతికి తెరలేపారు. ఇంటి నంబర్ల ఆధారంగా కార్డులకు రేషన్‌షాపులకు కేటాయించారు. దీనివల్ల చాలా కార్డులు కంటి పక్కన ఉన్న షాపు కాకుండా ఎక్కడో ఉన్న షాపుకు మళ్లాయి. ఆపరేటర్ల అండతో.. రేషన్‌కార్డుల డేటా ఎంట్రీ విషయంలో ప్రైవేటు ఆపరేటర్ల ఇష్టారాజ్యం సాగుతోంది. కొందరు డీలర్లు ఆపరేటర్లను మచ్చిక చేసుకుని తమ పనులు చక్కబెట్టు కుంటున్నారు. ఈ విషయంలో ఎవరికి అందాల్సిన వాటా వారికి పక్కాగా అందుతుండటంతో నాలుగు నెలలుగా ఈ దందా కొనసాగుతోంది. ఈ వ్యవహారం బాగుండటంతో పకడ్బందీగా అమలు చేసేందుకు కొద్ది రోజుల క్రితం కాజీపేట సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో డీలర్లు, అధికారులు సమావేశమైనట్లు సమాచారం. విషయం వేరే వారికి తెలియకూడదని, అవసరాన్ని బట్టి రోటేషన్ పద్ధతి పాటించాలని సయోధ్య కుదుర్చుకున్నట్లుగా సమాచారం. దీనితోపాటు ఎక్కువ కార్డులు పొందిన డీలర్లు అదనపు మొత్తంలో ముట్టచెప్పాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. -
ప‘రేషన్’
దుకాణాలకు చేరని రేషన్ బియ్యం! కర్నూలు: పౌర సరఫరాల శాఖకు ఈ-పాస్ అమలు కుదిపేస్తోంది. రేషన్ కోటా తీసుకెళ్లేది లేదని డీలర్లు మొండికేస్తుండగా.. నోటీసులు జారీ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 10 శాతం సరుకు మాత్రమే చౌకధరల దుకాణాలకు చేరింది. అది కూడా ఈ-పాస్ యంత్రాలు లేని దుకాణాలకు సరుకు చేర్చిన అధికారులు అంతా సవ్యంగానే ఉన్నట్లు చాటుకుంటున్నారు. మరోవైపు భారత ఆహారసంస్థ(ఎఫ్‌సీఐ) గోదాముల నుంచి తూకాలు వేసి నేరుగా చౌక డిపోలకు బియ్యం సరఫరా చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయంతో హమాలీలు ఆందోళన చేపట్టారు. దీంతో మధ్యాహ్నం వరకూ గోదాములకు తాళాలు పడ్డాయి. చివరకు ఆందోళన కొలిక్కి వచ్చినప్పటికీ సరుకు తీసుకునేందుకు డీలర్లు జిల్లాలో లేకపోవడం గందరగోళానికి తావిస్తోంది. చౌక డిపోల్లో ఈ-పాసు యంత్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ చౌక డిపో డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా నుంచి భారీ ఎత్తున డీలర్లు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. సోమాజీగూడలోని సివిల్ సప్లయ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఫలితంగా ఏప్రిల్ నెల సరుకులు కాస్తా సకాలంలో వినియోగదారులకు అందే పరిస్థితి కరువైంది. సాంకేతిక ఇబ్బందులు గోదాముల నుంచి చౌక దుకాణాలకు సరుకుల తరలింపు, అనంతరం కార్డుదారులకు సరఫరా మొత్తం ఈ-పాసు యంత్రాల ద్వారా తూకాలు వేసి పంపిణీ జరగాల్సి ఉంది. అయితే గోదాముల వద్ద ఒక్కో ప్యాకెట్ 50 కిలోల 650 గ్రాములు లెక్కకట్టి ఇవ్వాల్సి ఉండగా కేవలం 48 కిలోలు మాత్రమే ఇస్తుండటంతో డీలర్లు బియ్యం తీసుకుపోవడానికి ముందుకు రాని పరిస్థితి. తమకు సరైన తూకంలో సరుకులు ఇస్తేనే ఈ-పాస్ అమలుకు ఒప్పుకుంటామని డీలర్లు మొండికేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ఈ-పాస్ అమలు చేయాలంటే 3జీ సిమ్ అవసరం ఉంది. అయితే, జిల్లాలో అనేకచోట్ల నెట్వర్క్ లేకపోవడంతో త్రీజీ సిమ్ పనిచేసే అవకాశం లేదు. అంతేకాకుండా కర్నూలు పట్టణంలోని ఓల్డ్‌సిటీలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ-పాస్ అమలుకు ఇచ్చిన ఐడియా సిమ్‌లు పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోడౌన్ వద్ద హమాలీల ఆందోళన వేయింగ్ మిషన్ ద్వారా బియ్యం లారీని తూకం వేసి ఇవ్వాలని డీలర్లు పట్టుబట్టడంతో ఖాళీ లారీని కాటా వేసి లోడు లారీతో మరోసారి కాటా వేయడానికి ఎక్కువ సమయం పడుతున్నందున ట్రక్కు డ్రైవర్లు అందుకు నిరాకరించారు. దీంతో ఎఫ్‌సీఐ గోడౌన్ వద్దే లోడు చేసిన లారీని వేయింగ్ మిషన్‌లో కాటా వేసేలా పౌర సరఫరాల శాఖ అధికారులు ట్రక్కు డ్రైవర్లను ఒప్పించారు. అయితే అందువల్ల తాము ఉపాధి కోల్పోతామంటూ మండల స్టాక్ పాయింట్ వద్ద పనిచేస్తున్న హమాలీలు మంగళవారం ఆందోళనకు దిగారు. బియ్యం లోడుతో సరుకులు బయటకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేసి ఆందోళనకు దిగడంతో డీఎస్ఓ ప్రభాకర్‌రావు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేష్‌తో పాటు ఇతర అధికారులు గోదాము వద్దకు చేరుకుని హమాలీలతో చర్చలు జరిపారు. గోదాములో ఉన్న నిల్వలన్నీ పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచే సరుకులు రవాణా చేయాలన్న ఒప్పందంతో ఆందోళన విరమించారు. హమాలీల ఆందోళనతో మధ్యాహ్నం వరకు సరుకు రవాణా స్తంభించింది. తర్వాత హమాలీలు ఆందోళన విరిమించినప్పటికీ కోటాను తీసుకునేందుకు డీలర్లు మాత్రం ముందుకు రాలేదు. -
'రేషన్ డీలర్ల సమస్యలపై పోరాటం'
హైదరాబాద్: రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్ల పరిష్కారానికి ఢిల్లీ కేంద్రంగా పోరాడతామని చౌక ధరల దుకాణ దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు వెల్లడించారు. ఈ నెల 17న 10వేల మంది రేషన్ డీలర్లతో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీలర్ల సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రికి విన్నవించామని, తమ డిమాండ్లను పరిష్కరించేందుకు వారు చొరవ చూపాలని కోరారు. రేషన్ డీలర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కారుణ్య నియామకాలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. డీలర్లందరికీ రూ.10 లక్షల గ్రూప్ బీమా అమలు చేయాలని, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. -
డీలర్ల మాయాజాలం
యాక్టివేట్‌లోకి బోగస్ కార్డులు ఆధార్ యూఐడీ నెంబర్లు హైజాక్ బోగస్‌కార్డులకు సీడింగ్ భారీగా అవకతవకలు చేతులు మారుతున్న సొమ్ములు విశాఖపట్నం: ఆధార్‌ను అడ్డంపెట్టుకుని డీలర్లు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. అర్హులైన అల్పాదాయ వర్గాల వారికి అందాల్సిన నిత్యావసర సరకులును లూటీ చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. నిరుపేదల బలహీనతలను ఆసరాగా చేసుకుని వేలాది కార్డులను తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రతినెలా టన్నుల కొద్దీ నిత్యావసరాలను పక్కదారి పట్టించే ఈ అక్రమార్కులు ఇప్పుడు తమ కడుపు కొడుతున్న ఆధార్‌నే అస్త్రంగా చేసుకుని బోగస్‌కార్డులను..ఇన్‌యాక్టివ్ కార్డులకు జీవం పోస్తున్నారు. జిల్లాలో 2012రేషన్‌షాపుల పరిధిలో 11,15,106 కార్డులున్నాయి. వీటి పరిధిలో 39,50,420మంది అల్పాదాయవర్గాల వారున్నారు. ఒక్కొక్క షాపు పరిధిలో 200 నుంచి 3,500 వరకు రేషన్‌కార్డులున్నాయి. ఒక్కొక్క షాపు పరిధిలో 50 నుంచి 500 వరకు బోగస్‌కార్డులు (తనఖా పెట్టిన, వలసపోయిన వారి) ఉంటాయని అంచనా. వీటికి సంబంధించిన సరకులను ఇప్పటివరకు ఆయా రేషన్ డీలర్లే డ్రా చేసుకుని పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకునే వారు. ఇప్పుడు ఆధార్ ఈ అక్రమార్కుల పాలిట బ్రహ్మాస్త్రంగా తయారైంది. మొన్నటి వరకు ఈఐడీ సీడింగ్ ఉంటే చాలు సరకులు ఇచ్చేవారు. ప్రస్తుతం యూఐడీ సీడింగ్ ఉంటే కాని సరకులు ఇవ్వడం లేదు. యూఐడీ సీడింగ్ ఉన్న కార్డులకే డిజిటల్ కీ రిజిస్ట్రర్ ప్రకారం సరకులు రిలీజ్ అవుతున్నాయి. దీంతో రేషన్‌షాపు డీలర్ల వద్ద ఉన్న బోగస్ కార్డుల్లో 80 శాతం ఇన్‌యాక్టివ్ అయిపోయాయి. ఇటీవల జిల్లా జాయింట్ కలెక్టర్ నివాస్ జనార్ధనన్ ప్రకటించిన 70,066 ఇన్‌యాక్టివ్ కార్డుల్లో ఎక్కువగా వీరి వద్దే ఉన్నాయి. వీటన్నింటిని ఇప్పుడు యాక్టివ్‌లోకి తీసుకొచ్చేందుకు డీలర్లు కొత్త ఎత్తుగడ వేశారు. ఇందుకు తాజా ఉదాహరణే ఈ ఘటన. జీవీఎంసీలోని సర్కిల్-3 పరిధిలోని ఉన్న ఓ రేషన్‌షాపులో 3వేలకు పైగా కార్డులున్నాయి. ఆధార్ సీడింగ్ కూడా ఈ షాపులో దాదాపు వంద శాతం పూర్తయింది. అలాంటిది ఉన్నట్టుండి ఈ షాపులో ఫిబ్రవరి నెలకొచ్చేసరికి ఏకంగా 1612 కార్డులు ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లిపోయాయి. ఆరా తీస్తే అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ డీలర్ చుట్టుపక్కల మరో 10వరకు రేషన్‌షాపులున్నాయి. ఆయా షాపుల వరిధిలో కూడా పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులున్నాయి. వాటన్నింటిని యాక్టివ్‌లోకి తీసుకొచ్చేందుకు ఈ షాపులోని సీడింగ్ అయిన కార్డులకు చెందిన యూఐడీ నంబర్లను తొలగించి అన్సీడింగ్ జాబితాలో చేర్చి ఆ యూఐడీ నంబర్లను తమ పరిధిలోని బోగస్‌కార్డుల్లోని యూనిట్లతో సీడింగ్ చేశారు. దీంతో ఆయా షాపులపరిధిలోని సుమారు 1500కు పైగా బోగస్‌కార్డులు యాక్టివ్‌లోకి వచ్చేశాయి. వీటికి ఫిబ్రవరి నెలకు సరకులు కూడా రిలీజ్ అయ్యాయి. సర్కిల్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లతో డీలర్లు కుమ్మక్కై ఈ అవకతవకలకు పాల్పడినట్టు తెలియవచ్చింది. ఈ ఒక్క షాపు లోనే కాదు..దాదాపు సర్కిల్ పరిధిలోని వందకు పైగా ఉన్న షాపుల్లో ఈ విధమైన అక్రమాలు జరిగినట్టుగా సమాచారం. జిల్లా వ్యాప్తంగా గత రెండుమూడునెలల్లో వేలాదికార్డులు యాక్టివ్ లోకి రావడం కూడా పలు అనుమానాలకుతావిస్తోంది. కొన్ని డిపోల్లో అయితే ఏపీఎల్ కార్డు దారుల యూఐడీ నంబర్లను బోగస్‌కార్డుల్లోని యూనిట్లతో సీడింగ్ చేసి ఇన్‌యాక్టివ్ కార్డులను పెద్ద సంఖ్యలో యాక్టివ్‌లోకి తీసుకొస్తున్నట్టుగా తెలియవచ్చింది. యూఐడీ నంబర్ సరైనదైతే చాలు ఆటోమేటిక్‌గా సీడింగ్ అయిపోతుంది. దీన్ని సాకుగా చూపే ఈ అక్రమార్కులు చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. -
అమ్మో ‘ఈ-పాస్’
ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలపై చౌక డీలర్లలో ఆందోళన అసలు ఎంఎల్సీ గోడౌన్లపైనే నిఘా పెట్టాలని వినతి విజయవాడ : అమ్మో ఈ-పాస్ విధానం అంటూ డీలర్లు బెంబేలెత్తుతున్నారు. ఈ విధానం ఆచరణలోకి వస్తే తమ పరిస్థితి అగమ్య గోచరమేనని చౌకధరల దుకాణాల డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఈ-పాస్ డివైస్ పరికరం ద్వారా ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో రాష్ట్రంలో 6 వేల చౌక ధరల దుకాణాలకు కొత్త విధానాన్ని రూపొందించగా కృష్ణాజిల్లాలో 600 షాపుల్లో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో విజన్‌టెక్ సంస్థ ద్వారా పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే డీలర్లు కొత్త విధానంపై ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం హైదరాబాద్, విజయవాడల్లో డీలర్ల సంఘాలు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ భవిష్యత్ కార్యచరణపై కసరత్తులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో జిల్లాలో 2,200 మంది డీలర్లు, 1200 మంది కిరోసిన్ హాకర్లు ఉన్నారు. వీరు ప్రతి నెల బియ్యం, పంచదార, కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. బియ్యంపై కిలోకు 25 పైసలు, పంచదారపై 13 పైసలు, కిరోసిన్‌పై 25 పైసలు కమీషన్ ఇస్తున్నారు. ఆ విధంగా నెలవారీ ఒక్కో డీలర్లకు రూ.2,500 లేదా 3,000లు కమీషన్ వస్తుంది. అయితే డీలర్లకు సరుకులు సరఫరా చేసే మండల్ లెవల్ మెయిన్ పాయింట్ల నుంచి వచ్చే సరుకులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోంది. దాదాపుగా అన్ని పాయింట్లలో 50 కేజీల బియ్యం బస్తాకు 2నుంచి 3 కేజీల బియాన్ని అక్కడి అధికారులు దిగమింగటం బహిరంగ రహస్యమే. అయితే ఆ తూకం నష్టాన్ని డీలర్లు ప్రజలపై రుద్దుతుంటారు. ఈ క్రమంలో కలెక్టర్ బాబు.ఎ రూపొందించిన కొత్త విధానం డీలర్లను ఆర్థికంగా నష్టానికి గురిచేస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌సి పాయింట్లలో భారీ మోసం జరుగుతోందని, ఎంఎల్సీ పాయింట్లలో ఎలక్ట్రానిక్ కాటాలు పెడితే తమకు ఇబ్బంది ఉండదని డీలర్ల అసోసియేషన్ నాయకులు చెపుతున్నారు. వేతనాలు ఇవ్వాలి కాగా డీలర్లకు కమీషన్ విధానం రద్దు చేసి నెలవారి వేతనాలు ఇస్తే ప్రజాపంపిణీ వ్యవస్థ పారదర్శకంగా ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పౌరసరఫరాల కమిషనర్‌ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించినట్లు వారు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారని జిల్లా ప్రతినిధులు సాక్షికి వివరించారు. -
కానుక... ఇదేమి తూనిక
కిలోకు ఎన్ని గ్రాములు : 1000, అరకిలోకు: 500 ఈ లెక్క కూడా తెలియదా... ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లగాడినడిగినా ఠపీమని చెబుతాడు ... ఇవేమి పిచ్చి ప్రశ్నలనుకుంటున్నారా ... చంద్రబాబు సర్కారు బడిలో చదువుకున్న పౌరసరఫరాల అధికారులు, డీలర్లు మాత్రం వేరే లెక్క చెబుతున్నారు. కిలో అంటే 750 గ్రాములే.. అర కిలో అంటే 400 గట్టిగా మాట్లాడితే 350 గ్రాములే అంటున్నారు. ఇదేమి లెక్కని ‘చంద్రన్న సంక్రాంతి కానుక’లందుకున్న కార్డుదారులు ఎదురుతిరిగితేఅది అంతేనంటూ తెగేసి చెబుతున్నారు. కురిచేడు : ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పేరుతో తెలుగు దేశం ప్రభుత్వం ప్రకటించిన సరుకుల్లో కూడా చేతివాటం ప్రదర్శించడంతో లబ్ధిదారులు గొల్లుమంటున్నారు. పేదలకు ఇచ్చే నిత్యావసరాల్లో కూడా ఇంత కక్కుర్తా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇలా ఎందుకు ఇస్తున్నారని నిలదీస్తే ‘ఊరకనే ఇచ్చేదాంట్లో ఇవేమి ప్రశ్న’లంటూ డీలర్లు ఇచ్చే సమాధానాలకు విస్తుపోవడం కార్డుదారులవంతయింది. గోధుమపిండి, శనగలు కిలో చొప్పున, నూనె అరకిలో, నెయ్యి వంద గ్రాములు, పప్పు, బెల్లం అరకిలో చొప్పున పంపిణీ చేస్తున్నట్టు ఇన్నాళ్లూ ఆర్భాటంగా ప్రచారం చేశారు. అయితే రేషన్ షాపులకు సరఫరా చేసే గోడౌన్ల వద్దనే అవినీతి తొంగి చేసింది. కందిపప్పు, బెల్లం, శనగల గోతాలలో తూకాలు తగ్గిపోయాయి. శనగలు 50 కిలోలకు 48 కిలోలు, కందిపప్పు 50 కిలోలకు 48 కిలోలు, బెల్లం పదికిలోలకు 9 కిలోల 200 గ్రాములు మాత్రమే రేషన్ షాపులకు చేరాయి. ఇక రేషన్ షాపులకు వచ్చిన తరువాత మేము మాత్రం తక్కువ తిన్నామానంటూ రేషన్ దుకాణాలకు వచ్చిన సరుకుల్లో మరింత కోత పెట్టారు. తక్కువతో ప్యాకింగ్‌లు... శనగలు కిలో, కందిపప్పు అరకిలో, బెల్లం అరకిలో ప్రకారం ప్యాక్ చేయాల్సి ఉంది. కందిపప్పు 400 గ్రాములు, శనగలు 750 గ్రాములు, బెల్లం 350 గ్రాములుండేలా డీలర్లు రీ ప్యాక్ చేశారు. చేతికి అందుకోగానే ఏదో తేడా ఉందని గమనించిన కార్డుదారులు పక్క దుకాణంలో తూకం వేయించుకుని చూస్తే తక్కువుగా ఉన్నాయి. ఇదేమని డీలర్లను ప్రశ్నిస్తే ఊరకనే వచ్చాయి ... ‘తక్కువ తూకం వస్తే మీకేమి నష్టం లేద’ంటూ నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారు. సరుకులు తక్కువగా ఇచ్చారు -నుసుం సుబ్బారెడ్డి, కార్డుదారుడు సరుకులు తక్కువ తూకంతో ఇస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటంతో ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారు. ఒక్కవస్తువు కూడా సక్రమంగా కాటాకు రాలేదు. అన్ని సరుకులు తరుగుతోనే వచ్చాయి. తూకాలలో చేతివాటం -కోవెలకుంట్ల నారాయణ, కార్డుదారుడు సరుకులన్నీ తిరకాసులా ఉన్నాయి. శనగలు, కందిపప్పు కూడా ఒక్కొక్కరికీ ఒక్కోరకంగా తూకం వచ్చాయి. ఇదేమని అడిగితే ఊరక ఇచ్చేవి అదే ఎక్కువ వెళ్లు ... వెళ్లండంటున్నారు. -
నెయ్యితో పప్పన్నం డౌటే!
ఏలూరు (టూటౌన్) :జిల్లాలోని తెల్లరేషన్ కార్డుల వారందరికి ఉచితంగా ఇవ్వనున్న చంద్రన్న కానుకలో భాగంగా కందిపప్పు అరకేజీ, పామాయిల్ అరకేజీ, బెల్లం అరకేజీ, నెయ్యి 100 గ్రాములు, గోధుమపిండి కేజీ, శనగలు కేజీతో కూడిన సంచి ఇవ్వాలని, ఈనెల 12వ తేదీ నాటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లావ్యాప్తంగా 14 మార్కెట్ యార్డులలో రెండురోజుల పాటు ప్యాకింగ్ నిర్వహించినప్పటికీ పూర్తికాలేదు. బెల్లం ప్యాకింగ్‌కు ఇచ్చే చార్జి తమకు గిట్టుబాటు కాదని మహిళలు ప్యాకింగ్ మధ్యలో ఆపేశారు. కందిపప్పు అరకేజీ ప్యాక్ చేసేందుకు 25 పైసలు, అరకేజీ బెల్లం ప్యాకింగ్‌కు 50 పైసలు చొప్పున ఇస్తామని అధికారులు చెప్పటంతో తమకు చాలదంటూ మహిళలు ప్యాకింగ్‌కు రావడానికి ఇష్ట పడటం లేదు. బెల్లం గడ్డలు పగులకొట్టి ప్యాకింగ్ చేయాలి కాబట్టి అరకేజీ ప్యాకింగ్‌కు రెండు రూపాయలు ఇవ్వాలని అడ గటంతో అధికారులు ఆ బాధ్యతలను డీలర్లకు అప్పగించారు. స్థానిక డ్వాక్రా మహిళలతో పాటు జన్మభూమి కమిటీలతో ప్యాకింగ్ చేయించుకుని ప్రజలకు అందించాలని అధికారులు డీలర్లను ఆదేశించారు. కానీ అధికారులు అనుకున్న స్థాయిలో ప్యాకింగ్ ముందుకు సాగటం లేదు. మంచినూనె మాత్రం అరకేజీ ప్యాకింగ్‌తో రావటంతో అధికారులకు కొంత ఊరట కలిగించింది. మిగిలిన ఐదు సరుకులు ప్యాకింగ్ చేయటమే అధికారులకు పెద్ద సమస్యగా మారింది. అరకొరగా సరుకులు జిల్లావ్యాప్తంగా 48 మండలాలలో 11లక్షల 27వేల 551 మందికి 2వేల 122 రేషన్ షాపుల ద్వారా చంద్రన్న కానుక అందించాల్సి ఉంది. దీనికి 570 టన్నుల బెల్లం అవసరం ఉండగా 370 టన్నులే అందుబాటులో ఉంది. మరో 200 టన్నుల బెల్లాన్ని రప్పించినా నాసిరకంగా ఉండటంతో అధికారులు శుక్రవారం ఏలూరు మార్కెట్ యార్డు నుంచి తిప్పి పంపేశారు. దాని స్థానంలో మంచి బెల్లాన్ని అర కేజీ ప్యాకింగ్ ద్వారా అందించాలని పంపిణీదారుడికి అధికారులు సూచించారు. శనగలు 1127 టన్నులు అవసరం కాగా 700 టన్నులు మాత్రమే వచ్చారుు. నెయ్యి 112 టన్నులకు 45 టన్నులు, కందిపప్పు 570 టన్నులకు 300 టన్నులు, గోధుమపిండి 1127 టన్నులకు 450 టన్నులు మాత్రమే వచ్చింది. అధికారులకు తిప్పలు సరుకుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ప్రజలు తెలిపేందుకు టోల్ ఫ్రీ నంబర్ 9963479152ను కేటాయించారు. ప్రభుత్వం మరో రెండు రోజులు గడువు పెంచితే తమకు ఈ తిప్పలు తప్పేవని జిల్లాకు చెందిన ఒక అధికారి తన సిబ్బంది వ్యాఖ్యానించటం వెనుక అధికారులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో అర్థమవుతుంది. ఆదివారం జిల్లాలో కొన్నిచోట్ల చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ లాంఛనంగా ప్రారంభించినా ఆరు సరుకులను మాత్రం అందించలేదు. కొన్నిచోట్ల మూడింటిని ఇచ్చి మిగిలినవి వచ్చాక ఇస్తాం అని డీలర్లు చెప్పారు. పూర్తిస్థాయిలో సరుకులు సోమవారం వస్తాయి చంద్రన్న కానుక కు ఇచ్చే సరుకులలో పామాయిల్ పూర్తి స్థారుులో వచ్చింది. మిగిలిన సరుకులు 70 శాతం వచ్చాయి. 30 శాతం సోమవారం ఉదయానికి వచ్చే ఏర్పాట్లు చేశాం. వచ్చిన వెంటనే ఆయా రేషన్‌షాపులకు పంపిస్తాం. కొంత ఆలస్యం అయినా పూర్తిస్థాయిలో తెల్లరేషన్‌కార్డు దారులందరికీ చంద్రన్న కానుక అందేలా చర్యలు తీసుకుంటున్నాం. పెద్ద మొత్తంలో సరుకులు తీసుకువచ్చి ప్యాకింగ్ చేయూల్సి రావడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. జిల్లాకు ప్రస్తుతం వచ్చిన సరుకులన్నీ ప్యాకింగ్ నిమిత్తం డీలర్లకు పంపించి వేశాం. వారు డ్వాక్రా మహిళలు, జన్మభూమి కమిటీలతో ప్యాకింగ్ చేరుుస్తున్నారు. - డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి -
అరకొర సరకులతో.. పండగ చేసుకోండి
చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీపై అనుమానాలు పది శాతం మందికీ సరిపడని సరకులు 12లోగా పంపిణీ కష్టమేనంటున్న అధికారులు విశాఖపట్నం: చంద్రన్న సంక్రాంతి కానుక సవాలుగా మారిం ది. సంక్రాంతి పండుగ చేసుకోండంటూ సర్కారు చేసిన ఉచిత సరకుల ప్రకటన ప్రచార ఆర్భాటంగానే కనిపిస్తోంది. పామాయిల్(అరలీటర్), కందిపప్పు (అరకేజీ), శనగలు(కేజీ), గోధుమపిండి (కేజీ), బెల్లం (అరకేజీ), నెయ్యి (100 గ్రాములు) కలిపి ఒక కిట్ రూపంలో ప్రతీ తెల్లకార్డుహోల్డర్లకు అందజేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. ఈ నెల 12వ తేదీలోగా వీటిని ఉచితంగా అందించాలని ఆదేశించింది. జిల్లాలో 10,79,576 కార్డులున్నాయి. ప్యాకెట్ల రూపంలో ఇచ్చే ప్రతీ సరుకూ కార్డుల సంఖ్యకనుగుణంగానే జిల్లాకు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు చేరిన పామాయిల్,గోధుములు, శనగలు, కందిపప్పు 10 శాతం మందికి కూడా సరిపోయే పరిస్థితి లేదు. నెయ్యి, బెల్లం జాడే లేదు. కార్డుల సంఖ్యను బట్టి 10.79లక్షల పామాయిల్ ప్యాకెట్లు(అరకిలో చొప్పున), 1122 మెట్రిక్ టన్నుల శనగలు, గోధుమలు, 561 మెట్రిక్ టన్నుల బెల్లం, కందిపప్పు, 112.205 కేజీల నెయ్యి కేటాయించాల్సి ఉంది. పామాయిల్ 2.80 లక్షల ప్యాకెట్లే వచ్చాయి. 1.83లక్షల గోధుమ పిండి ప్యాకెట్లు , 2.16 లక్షల శనగల ప్యాకెట్లు, అరకిలో చొప్పున పంపిణీ చేయాల్సిన కందిపప్పు 1.28 లక్షల ప్యాకెట్లే చేరుకున్నాయి. బెల్లం 80వేల ప్యాకెట్లు వచ్చినట్లు సమాచారం..కార్డులకూ వచ్చిన సరకుతో పోలిస్తే ఏమాత్రం సరిపోవు. కష్టమేనంటున్న డీలర్లు షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టాల్సి ఉంది.కేటాయింపులు ఇలా చేస్తే తామెలా సరఫరా చేయగలమని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. తామేదో స్వాహా చేసిన భావన కార్డుహోల్డర్లకు కలుగుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. దాడికి దిగే అవకాశాలున్నాయని భీతిల్లుతున్నామన్నారు. వీటి పంపిణీ బాధ్యత.. పర్యవేక్షణలను జన్మభూమి కమిటీలకు అప్పగించడం వివదాస్పదమవుతుంది. ఇప్పటికే పింఛన్ల తనిఖీలు, రుణమాఫీ జాబితాల్లో ఈ కమిటీల మితిమీరిన జోక్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ వీరికే సంక్రాంతి కానుక బాధ్యత అప్పగించడం పట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. కాగా యూఐడీ సీడింగ్ కానీ సభ్యులతో పాటు ఆధార్, కుటుంబ వివరాలు, ఫ్యామిలీ ఫొటో అప్లోడ్ కాని రచ్చబండ కూపన్‌దారులు సంక్రాంతి కానుకకు దూరమవుతున్నారు. -
కొత్త పరేషన్
ఆదిలాబాద్ అర్బన్ : కొత్త ఏడాదిలో ప్రజలకు కొత్త కష్టాలు వచ్చి పడేలా ఉన్నాయి. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పేరిట ఈనెల 31లోగా ఆహార భద్రత కార్డులు అర్హులకు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి జిల్లాకు 6,69,554 ఆహార భద్రతా కార్డులు అందాయి. అధికారులు మండలాల వారీగా వాటిని పంపిణీ చేశారు. కాగా, జిల్లాలో 7.57 మంది లబ్ధిదారులు ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగతా లక్షా 76 వేలకు పైగా దరఖాస్తుదారులను అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు చెప్పకనే చెబుతున్నారు. అయితే.. ఈ ఆహార భద్రతా కార్డుల అలాట్మెంట్లోనే తహశీల్దార్ కార్యాలయ అధికారులు నిమగ్నమయ్యారు. వీటికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో విచారణ పూర్తికాగా.. పట్టణాల్లో ఇంకా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. కొత్త కార్డులు లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 88,500 మంది లబ్ధిదారులకు ఈ కార్డులు అందాయి. కార్డులు అందని కుటుంబాలు జనవరి నెల కోటా సరుకులు ఇప్పుడు తీసుకోవాలని ఆందోళన చెందుతున్నారు. పరేషాన్ ఇలా.. ఆహార భద్రతా కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికీ వెళ్లి అధికారులు విచారణ చేపట్టారు. విచారణ పూర్తై గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. ఆ జాబితాలో ఉన్న వారు రెండు ఫొటోలు డీలర్లకు ఇవ్వాల్సిందిగా సూచించారు. మొన్నటి వరకు విచారణ చేపట్టిన అధికారులు ఆయా డీలర్ల ద్వారా లబ్ధిదారుల ఫొటోలను సేకరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంకా లబ్ధిదారుల ఫొటోల సేకరణే పూర్తి కాలేదు. ఇలా ఫొటోలను సేకరించిన డీలర్లు మండలాల అధికారులకు అందజేస్తారు. ఓ ఫొటోను కొత్త కార్డుపై అతికించి దానిపై కార్యాలయ స్టాంప్ వేయాల్సి ఉంటుంది. కార్డుపై కుటుంబ సభ్యుల పేర్లు రాసి రిజిస్ట్రార్‌లో నమోదు చేసి తహశీల్దార్ సంతకం పెట్టి లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డు అందజేయాల్సి ఉంది. అయితే కొన్ని గ్రామాల్లో ఫొటోల సేకరణ ప్రారంభం కాలేదు. ఇందుకు మరో పదిహేను రోజులు సమయం పట్టవచ్చు. మరోపక్క అధికారులు కొత్త కార్డుల పంపిణీకి సిద్ధమవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 31లోగా లబ్ధిదారులకు ఆహార భద్రతా కార్డులు పంపిణీ చేసినట్లైతే జనవరి మొదటి నుంచి కోటా సరుకులు పొందుతారు. జనవరి 10 వరకు పంపిణీ పూర్తి చేస్తామని, 15 వరకు కోటా సరుకులు తీసుకోవచ్చని, కార్డు అందని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సి అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. -
అర్హులకు ఆరు కిలోల బియ్యం
సంగారెడ్డి అర్బన్: వచ్చే నెల 1,2 తేదీల్లో జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్డీఓలు, తహాశీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార భద్రత కార్డులకు 7లక్షల 91వేల దరఖాస్తులు అందాయని , అన్ని దరఖాస్తులను పరిశీలించడం పూర్తయిందన్నారు. తహాశీల్దార్లు పంపిణీ కేంద్రాల్లో పండగ వాతావరణం కల్పించాలని, తమ ప్రాంత ప్రజా ప్రతినిధులను సప్రందించి వారితో పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నెల 31 లోగా డేటా ఎంట్రీ పూర్తిచేసి అర్హులకు బియ్యం అందజేయాలని సూచించారు. డీలర్లు కూడా ఇంటింటికి వెళ్లి సంబంధిత కుటుంబాలకు మంజూరైన బియ్యం వివరాలు తెలపాలని, అధికారులు చాటింపు వేయించాలన్నారు. పింఛన్ల పథకాన్ని సమీక్షించి దాదాపు 3 లక్షల పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇటీవల కొందరు లబ్ధిదారులు వారి వయస్సును ఆధార్ కార్డుల్లో మార్పు చేయించి లబ్ధిపొందుతున్నారని తెలిసిందని, వారంతా అర్హులా కాదా అనే విషయాన్ని మరోమారు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. జనవరి 1 నుంచి జిల్లాలోని 264 సంక్షేమ వసతి గృహాల్లో సన్నబియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి ప్రతి వసతి గృహానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించడం జరిగిందన్నారు. వారంతా ఈ నెల 31, జనవరి 1న వారికి కేటాయించిన వసతి గృహాలకు వెళ్లి సబ్సిడీ బియ్యంతో వండిన భోజనాన్ని విద్యార్థులకు అందించే విధంగా పర్యవేక్షించాలన్నారు. వెల్దుర్తి తదితర మండలాల్లో ఇసుక అక్రమ రవాణ కొనసాగుతున్నట్లు గమనించామని, తహాశీల్దార్లు సంబంధిత వాహనాలను సీజ్ చేసి వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని , అంతే కాకుండా ఎప్పటికప్పుడు వివరాలను కలెక్టర్‌కు నివేదిక రూపంలో పంపితే ఎలాంటి పైరవీలకు ఆస్కారం ఉండదన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్, డీఆర్డీఏ పీపీ సత్యనారాయణరెడ్డి, డీఎస్ఓ ఏసురత్నం, డీఏం సివిల్ సప్లయీస్ జయరాం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బోగస్ కార్డుల గుట్టు రట్టు
కర్నూలు : బోగస్ కార్డులను కాపాడుకునేందుకు డీలర్లు వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. ఇతరుల ఆధార్ నంబర్లు అనుసంధానం చేసి వారిని కాపాడుకునేందుకు ఆదోని అర్బన్ డీలర్లు చేసిన ప్రయత్నం గుట్టు రట్టయ్యింది. ‘డీలర్లు..మాయగాళ్లు’ శీర్షికతో ఈనెల 27వ తేదీన సాక్షిలో వెలువడిన కథనంపై జేసీ స్పందించి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీశారు. ఆదోని అర్బన్ ప్రాంతం నుంచి దాదాపు 50 మందికి పైగా డీలర్లు శుక్రవారం ఉదయం కర్నూలులోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల దాకా జేసీ కన్నబాబు తన చాంబర్లో కూర్చుని బోగస్ కార్డుల వ్యవహారంపై విచారణ జరిపారు. పౌర సరఫరాల శాఖలోని కొందరు ఉద్యోగుల సహకారంతోనే డీలర్లు బోగస్ కార్డులను పునరుద్ధరించుకున్నారని వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారానికి రింగ్ లీడర్లుగా వ్యవహరించిన ఏడుగురు డీలర్లతో స్టేట్మెంట్లు రికార్డు చేశారు. కొంతమంది డీలర్లు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వాస్తవ విషయాలను రాబట్టారు. డీలర్ల మాయాజాలంతో పేదలు కూడా కార్డులు కోల్పోయారా అనే కోణంలో విచారణ జరిపారు. దుకాణాల వారీగా డీలర్లను చాంబర్లోకి పిలిపించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం, మహబూబ్ నగర్, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఈఐడీ నంబర్లను డీలర్ల దగ్గర ఉన్న బోగస్‌కార్డులకు అనుసంధానం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. పౌర సరఫరాల శాఖలో పనిచేసే ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్సిబ్బంది ఈ అక్రమాలకు సహకరించారు. ఆదోని ప్రాంతంలో మొత్తం ఏడు మంది డీలర్లు రింగ్‌గా ఏర్పడి పౌర సరఫరాల శాఖలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందితో చేతులు కలిపి ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు వెలుగు చూసింది. డీఎస్ఓ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగితో పాటు ఆదోని అర్బన్ ప్రాంతంలో పనిచేసే ముగ్గురు ఔట్సోర్సింగ్ సిబ్బంది ఈ వ్యవహారంలో సూత్రధారులుగా వ్యవహరించి సహకరించారు. నలుగురు కంప్యూటర్ ఆపరేటర్ల పేర్లు కూడా విచారణలో వెలుగు చూశాయి. డిపార్ట్మెంట్లో ఎవరు సహకరించారు, ఈఐడీ నంబర్లు ఎలా సంపాదించారు అనే విషయాలపై జేసీ పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఆధార్ కార్డులు ఇవ్వకపోతే రేషన్‌కార్డులను బోగస్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆధార్ అనుసంధానం వంద శాతం పూర్తి చేయడానికి జిల్లా అధికారులు చర్యలు చేపట్టి మీ సేవ సెంటర్ల ద్వారా కూడా ఈ ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతించారు. ఇదే అక్రమార్కులకు అవకాశంగా మారింది. జిల్లాలోని కొన్ని మీ సేవ సెంటర్లలో ఉన్న ఆధార్ నంబర్లను కూడా హైక్ చేసి డీలర్లు తమ వద్ద ఉన్న బోగస్ కార్డులకు అనుసంధానం చేసుకున్నారు. -
డీలర్లపై టీడీపీ కక్షసాధింపులు
జేసీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి ఫిర్యాదు చిత్తూరు(సెంట్రల్) : జిల్లాలో అధికార పార్టీకి అనుకూలంగా లేని చౌకదుకాణ డీలర్లపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, తహసీల్దార్లు, ఆర్డీవోలపై ఒత్తిడి తీసుకొచ్చి వారి దుకాణాలను రద్దు చేయిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూ రు ఎమ్మెల్యే నారాయణస్వామి గురువారం జిల్లా సంయుక్త కలెక్టర్ భరత్‌గుప్తకు ఫిర్యాదు చేసారు. ప్రధానంగా తన నియోజకవర్గ పరిధిలోని జీడీ నెల్లూరు, కార్వేటినగరం, వెదురుకుప్పం, పాలసముద్రం మండలాల్లోని చౌకదుకాణ డీల ర్లు మాజీ ఎమ్మెల్యే హయాంలోనే నియమితులయ్యారని, అప్పట్లో వారి వద్ద వేలాది రూపాయలు తీసుకుని డీలర్‌షిప్‌లు ఇప్పించారని, ఇప్పుడు వైఎస్సార్సీపీకి మద్దతిచ్చారనే నెపంతో వారిని తొలగించేందుకు మంత్రి గోపాలకృష్ణారెడ్డి ద్వారా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం 18కిలోల బియ్యం తక్కువ వచ్చాయని వెదురుకుప్పంలోని షాప్ నెం. 6,28లను రద్దు చేయూలని డిమాండ్ చేస్తున్నార ని ఆయన జేసీ దృష్టికి తీసుకెళ్లారు. తన నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో పనిచేస్తున్న అందరు తహశీల్దార్లను బది లీ చేసి కొత్తవారిని నియమించాలని జేసీని కోరారు. ఈ సందర్భంగా ఆయ న విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిలా వ్యవహరించడంలేదని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని వి మర్శించారు. తన నియోజకవర్గం పరి ధిలో గతంలో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలను పరిశీలించి ఎవరి అనుభవంలో ఉందన్నది నిగ్గుతేల్చాలన్నారు. జేసీని కలసినవారిలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, జీడీ నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని నాయకులు ఉన్నారు. మహాధర్నాను జయప్రదం చేయండి డిసెంబర్ 5వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని నారాయణస్వామి కోరారు. ఈ మేరకు పలమనేరు, బంగారుపాళెం, చిత్తూరు నగరంలో నాయకులను కలసి ధర్నాకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలను తరలించాలని కోరిన ట్లు ఆయన పేర్కొన్నారు.