స్వల్పంగా పెరగనున్న వంటగ్యాస్ ధర!
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. డీలర్లకు చెల్లించే కమీషన్‌ను 9 శాతానికి పైగా పెంచాలన్న సిఫారసులను ప్రభుత్వం ఆమోదిస్తే ఇది అమల్లోకి రానుంది. పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం 14.2 కేజీల గ్యాస్ సిలిండర్‌పై డీలర్లకు చెల్లించే కమీషన్‌ను రూ.3.46 పెంచి రూ. 40.71చేయాలని సిఫారసు చేసింది. 5కేజీల సిలిండర్‌పై కమీషన్‌ను రూ.1.73 పెంచి రూ.20.36 చేయాలని సిఫారసు చేసింది.