సాక్షి, హన్మకొండ : ఒక రేషన్‌షాపు పరిధిలో ఉన్న రేషన్‌కార్డులు(ఆహార భద్రత కార్డు) మరో షాపు పరిధిలోకి మారుతున్నారుు. ఇది కంప్యూటర్ తప్పి దం వల్లో.. అధికారుల పొరపాటు వల్లో కా దు.. ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ఆదేశాల తో డాటా ఎంట్రీ ఆపరేటర్లు రేషన్‌షాపు డీలర్లకు చేస్తున్న సహాయం. 2015 జనవరిలో కొ త్త రేషన్ కార్డులు మంజూరైన తర్వాత రాంనగర్, యాదవనగర్, రెడ్డికాలనీ ప్రాంతాల్లోని రే షన్ దుకాణాలకు చెందిన వందకుపైగా కా ర్డులు 71వ నంబర్ రేషన్ దుకాణం పరిధిలోకి వెళ్లాయి.
ఇదే పద్ధతిలో కాజీపేటలోని 102 నం బరు చౌకదుకాణం పరిధిలో ఉన్న లబ్ధిదారులను రహమత్ నగర్ రేషన దుకాణం పరిధిలోకి మార్చారు.
ఇలా లాభం..
కార్డులు ఒక చౌకధర దుకాణం నుంచి మరో చౌకధర దుకాణం పరిధిలోకి మార్చడం వల్ల లబ్ధిదారులు మొదట ఇబ్బంది పడతారు. తెలియని ప్రాంతానికి వెళ్లి రేషన్ సరుకులు తీసుకునే వారి సంఖ్య తగ్గుతుంది. ఓ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఆ కార్డుకు 24 కిలోల బియ్యం వస్తాయి. ఇలా నాలుగు కార్డులు కలిస్తే ఒక క్వింటాలు బియ్యం మిగులుతారుు. రేషన్ దుకాణాల మార్పిడి ప్రక్రియ వల్ల ప్రస్తుతం కనీసం ఒక్కో చౌకదుకాణం పరిధిలో 50 రేషన్ కార్డుల బియ్యం పక్కదారి పట్టే అవకాశం ఉంది.
ఇంటి నంబర్లతో షాపుల కేటాయింపు
సహజంగా పాతకార్డులు చించేసి కొత్తగా దరఖాస్తు చేసుకున్నావారికి పాత కార్డు ఉన్న షాపులోనే కొత్త కార్డు ఇవ్వాలి. కానీ అధికారులు కొత్త పద్ధతికి తెరలేపారు. ఇంటి నంబర్ల ఆధారంగా కార్డులకు రేషన్‌షాపులకు కేటాయించారు. దీనివల్ల చాలా కార్డులు కంటి పక్కన ఉన్న షాపు కాకుండా ఎక్కడో ఉన్న షాపుకు మళ్లాయి.
ఆపరేటర్ల అండతో..
రేషన్‌కార్డుల డేటా ఎంట్రీ విషయంలో ప్రైవేటు ఆపరేటర్ల ఇష్టారాజ్యం సాగుతోంది. కొందరు డీలర్లు ఆపరేటర్లను మచ్చిక చేసుకుని తమ పనులు చక్కబెట్టు కుంటున్నారు. ఈ విషయంలో ఎవరికి అందాల్సిన వాటా వారికి పక్కాగా అందుతుండటంతో నాలుగు నెలలుగా ఈ దందా కొనసాగుతోంది. ఈ వ్యవహారం బాగుండటంతో పకడ్బందీగా అమలు చేసేందుకు కొద్ది రోజుల క్రితం కాజీపేట సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో డీలర్లు, అధికారులు సమావేశమైనట్లు సమాచారం. విషయం వేరే వారికి తెలియకూడదని, అవసరాన్ని బట్టి రోటేషన్ పద్ధతి పాటించాలని సయోధ్య కుదుర్చుకున్నట్లుగా సమాచారం. దీనితోపాటు ఎక్కువ కార్డులు పొందిన డీలర్లు అదనపు మొత్తంలో ముట్టచెప్పాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.