ప‘రేషన్’
చౌకధరల దుకాణాల్లో సరుకుల పంపిణీ
నెలాఖరులోనూ ఆన్‌లైన్
అలాట్‌మెంట్ ఇవ్వని వైనం
డీడీలు తియ్యకుండా మిన్నకున్న రేషన్ డీలర్లు
టీడీపీ నేతల ఒత్తిడే కారణమని అనుమానాలు..!
మరో రెండు రోజుల్లో డీడీలు తీయిస్తామంటున్న అధికారులు
జూలై కోటాపై కార్డుదారుల్లో ఆందోళన
గుంటూరు : చౌకధరల దుకాణాల్లో జూలై నెల సరుకుల పంపిణీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రేషన్‌షాపులకు ఈ నెల అలాట్‌మెంట్‌ను ఆన్‌లైన్ చేయకపోవడం.. ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో డీలర్లు డీడీలు తీయక పోవడం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రతినెలా 18వ తేదీలోగా అలాట్‌మెంట్లు పూర్తయి డీడీలు తీయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇక సరుకెప్పుడు దిగుమతి అవుతుందో.. వచ్చే నెల కోటా తమకెప్పుడు అందుతుందోనని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల భారం పేదలపై పడకుండా వారికి బియ్యం, పామాయిల్, పంచదార, కిరోసిన్, కందిపప్పు, కారం, చింతపండు, పసుపు, గోధుమపిండి వంటితెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకేనా..!..
జిల్లాలో అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా లేని వ్యక్తులు నిర్వహిస్తున్న చౌకధరల దుకాణాలను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకే అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, అలాట్‌మెంట్ ఇవ్వకుండా నిలిపివేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న డీలర్ల వద్ద నుంచి షాపులను లాగేసుకున్నారని, పర్మినెంట్ డీలర్లను సైతం రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలుస్తోంది. అలా చెయ్యని వారి దుకాణాలపై రెవెన్యూ అధికారులతో దాడులు చేయించి, వారంతట వారే వదులుకునేలా చేస్తున్నట్లు ఆరోపణలు వినివస్తున్నాయి.
కార్డుల తొలగింపు ప్రక్రియ వల్లే ఆలస్యం...
రేషన్ డీలర్లకు సరుకుల అలాట్‌మెంట్ ఆలస్యం కావడంపై డీఎస్‌వో రవితేజా నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చౌకధరల దుకాణాల్లో సరుకులు తీసుకోని కార్డుదారులను గుర్తించి, తొలగింపు చేపట్టామని, ఈ ప్రక్రియ వల్లే సరుకుల అలాట్‌మెంట్ చేయడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలస్యమైందని సమాధానమిచ్చారు. జిల్లాలో సోమవారం కొన్ని మండలాల తహశీల్దార్‌లు వారి వద్ద ఉన్న కార్డు దారుల ఆధారంగా డీలర్లతో డీడీలు తీయించారని చెప్పారు. మిగతా మండలాలు, పట్టణాల్లోనూ రెండు రోజుల్లో డీడీలు తీయించి సరుకుల పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. . నూతన మద్యం విధానంలో దుకాణాల లెసైన్స్‌లను ఐదు శ్లాబులుగాను, బార్ లెసైన్స్ విధానాన్ని మూడు శ్లాబులగాను నిర్ణయించారు. కొత్త విధానం అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ప్రస్తుతం తెచ్చిన విధానాన్ని చూసి కొత్తసీసాలో పాత సారా నింపినట్లు ఉందని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు.
నోటిఫికేషన్ విడుదల..జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలు, 187 బార్లు ఉన్నాయి. వీటిని లాటరీ విధానంలో కేటాయించేందుకు సోమవారం నోటిఫికేషన్ విడుదలయింది. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. 28వ తేదీన గజిట్ నంబర్ల ఆధారంగా లాటరీ విధానంలో దుకాణాల కేటాయింపు జరుగుతుంది. పెరిగిన ఫీజుల ప్రకారం బార్లను యథాతధంగా రెన్యువల్ చేస్తారు. జిల్లాలో రూ.32.50 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న మద్యం దుకాణాలు 119 ఉండగా, రూ.34 లక్షలు ఉన్న దుకాణాలు 103, రూ. 42 లక్షలు ఉన్న దుకాణాలు 85, రూ.64 లక్షలు ఉన్న దుకాణాలు 35 ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో రూ.35 లక్షలు లెసైన్స్ ఫీజులు ఉన్న బార్లు 98 ఉండగా, రూ.38 లక్షలు లెసైన్స్ ఫీజు ఉన్న బార్లు 89 ఉన్నాయి. బెల్టుషాపులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో మద్యం వ్యాపారులు ఈసారి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.