Fair Price Shops
-
రేషన్‌షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
తాడేపల్లిగూడెం: పలు రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారులు శనివారం దాడి చేశారు. సరుకులను సీజ్ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని షాపు నంబర్ 30, 57, 58, 79 ల్లో దాడులు చేశారు.రికార్డుల్లో భారీగా అవకతవకలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆయా షాపుల వద్ద మొత్తం రూ.24,138 విలువైన సరుకులను స్వాధీనం చేసుకుని, పక్క షాపులకు అప్పగించినట్లు విజిలెన్స్ ఎస్ఐ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. -
పెద్దోళ్ల ‘చౌక’ దందా
చౌకగా దొరికే రేషన్ బియ్యాన్ని వండుకుని ఆకలి తీర్చుకుంటూంటారు నిరుపేద వర్గాల వారు. అది వారి నిత్యావసరం కూడా. అలాంటి వారి కడుపు కొట్టాలనే ఆలోచన ఎంతటి కఠిన హృదయం ఉన్న వారికి కూడా కలగదు. కానీ.. కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం అంతకంటే మించిపోయారు. రేషన్‌బియ్యం, కిరోసిన్‌ను బొక్కి, జేబులు నింపుకోవాలనేది వారి దురాలోచన. అంతటితో ఆగ కుండా రేషన్ డీలర్లతో ‘చీకటి ఒప్పందాలు’ కూడా చేసేసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థనే తమ దుకాణంలా మార్చుకుని, పేదల బతుకులను అపహాస్యం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో విజయవంతమైన బయోమెట్రిక్ విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేసి ప్రజా పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టాలని సీఎం చంద్రబాబు గొప్పగా చెబుతారు. అయితే ఆయన పార్టీకే చెందిన, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు మాత్రం చౌకధరల దుకాణాలపై పడి పైసలేరుకునే చీకటి ఒప్పందాలతో ప్రజాపంపిణీని అవినీతిమయం చేస్తున్నారు. చౌకధరల దుకాణాల ద్వారా జరిగే ప్రజాపంపిణీలో అవినీతికి ఆస్కారం ఒకింత ఎక్కువగానే ఉంటుంది. ఇందుకు పూర్తిగా రేషన్‌షాపు డీలర్లనే తప్పు పట్టలేం. కార్డుదారులు కూడా బాధ్యులే. అటువంటి వ్యవస్థ ఆసరాగా చేసుకుని కొందరు ప్రజాప్రతినిధులు తమకున్న ‘అధికార బలం’తో నెలవారీ మామూళ్లకు బరి తెగిస్తున్నారు. చౌకధరల దుకాణాల నిర్వాహకులు కూడా ఎంతో కొంత సర్దుబాటు చేసుకుంటే చాలనే ముందుచూపుతో వారి ఆదేశాలకు జీ హుజూర్ అంటున్నారు. జిల్లా కేంద్రం కాకినాడ సిటీ, దాంతో కలిసి ఉండే కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఈ రహస్య ఒప్పందాలు ఖరారై, వసూళ్ల పర్వానికి తెర లేచింది. కాకినాడ నగరంలో 117, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 111 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి నిర్వాహకులు, నియోజకవర్గాల్లో ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య మూడు దఫాలు జరిగిన చర్చలు కొలిక్కి రావడంతో వసూళ్ల పర్వం ప్రారంభమైంది. ఇందులో రెండు రకాల ఒప్పందాలు జరిగాయి. నెలకు ఒక నియోజకవర్గం నుంచి నగదు రూపంలో కొంత, మిగులు బియ్యం అమ్మకాలుగా కొంత. ఉదాహరణకు కాకినాడ నగరంలోని దుకాణాల నుంచి నెలకు రూ.1.20 లక్షలు, 23 క్వింటాళ్ల బియ్యం, కాకినాడ రూరల్‌లో రూ.90 వేలు, 22 క్వింటాళ్ల బియ్యం ముట్టజెప్పాలనేది వీరి మధ్య కుదిరిన ఒప్పందం. ఇది ఈ నెల నుంచి ప్రారంభం కావాలనే అంగీకారం కుదిరిందని విశ్వసనీయ సమాచారం. ఈ ఒప్పందం ప్రతి నెలా పక్కాగా అమలు జరిపేందుకు ఒక్కో దుకాణం నిర్వాహకుడు రూ.1000 నుంచి రూ.1300 వంతున భరించేలా నిర్ణయించారని తెలియవచ్చింది. ఈ రెండు ఒప్పందాలు కాకుండా మరో కీలకమైన ఒప్పందం మరింత విస్మయాన్ని కలిగిస్తోంది. కొందరు డీలర్లు కార్డుదారుల నుంచి కిలో బియ్యం రూ.13, కిరోసిన్ రూ.24కు కొనుగోలు చేయడం పరిపాటి. బహిరంగ మార్కెట్లో బియ్యం రూ.16, కిరోసిన్ రూ.30 వంతున అమ్ముకుంటూ ‘నాలుగు పైసలు’ వెనకేసుకుంటున్నారు. ఆ సొమ్ము నుంచే అన్ని స్థాయిల వారికి ముట్టజెప్పుకొనే పరిస్థితి. నెలాఖరున ఒకటి, రెండు క్వింటాళ్ల బియ్యం, 10 లీటర్ల కిరోసిన్ మిగులుతున్నట్టు చూపుతూ, సంచుల అమ్మకాలు సహా మిగిలిన సర్దుబాట్లతో డీలర్లు గట్టెక్కుతున్నారు. ఇక ముందు వాటిని కూడా అధికారులకు చూపించాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు ఎదురైతే తాము చూసుకుంటామని ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారని తెలిసింది. ఇక్కడ మరో తిరకాసు కూడా ఉంది. మిగులు బియ్యం, కిరోసిన్ కూడా తాము సూచించే తమ వారికి మాత్రమే, అది కూడా వారు చెప్పే ధరకే విక్రయించాలనే షరతు అమలుచేస్తున్నారు. ఇందుకు సమ్మతించకుంటే మిగులు బియ్యం మార్కెట్లో విక్రయించే చర్యలపై ఉక్కుపాదం మోపుతామనే హెచ్చరికలతో నిర్వాహకులు దిగివచ్చి ఒప్పందాన్ని ఖాయం చేసుకున్నారని చెబుతున్నారు. ఇప్పటి వరకు మార్కెట్లో పీడీఎస్ బియ్యం కిలో రూ.16, కిరోసిన్ లీటరు రూ.30 వరకు అమ్ముకుంటున్నట్టుగానే అనుమతించాలన్న నిర్వాహకుల ప్రతిపాదనను ప్రజాప్రతినిధులు తిరస్కరించారని సమాచారం. నిర్వహణ నుంచి తప్పుకోమంటే తప్పుకుంటాం, ఆ ప్రతిపాదన కష్టసాధ్యమని చేతులెత్తేయగా కాకినాడకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త రంగంలోకి దిగి ఉభయుల మధ్య సమన్వయం సాధించారని సమాచారం. చివరకు కిలో బియ్యం రూ.14, కిరోసిన్ లీటరు రూ.25 వంతున ప్రజాప్రతినిధులు నిర్ణయించిన వారికే విక్రయించాలనే ఒప్పందానికి వచ్చారు. ఈ రకంగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు బరితెగింపు ఆనోటా, ఈనోటా బయటకు పొక్కడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. -
అన్నదాతపై నకిలీల వల
- రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద - దుకాణాలపై కొరవడిన నిఘా - నట్టేట మునుగుతున్న రైతులు - పట్టించుకోని ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఒంగోలు టూటౌన్: జిల్లాలో ఎరువులు, విత్తనాల దుకాణాలపై అధికారుల నిఘా కొరవడింది. కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు, ఎరువులతో అన్నదాతను నిలువునా ముంచుతున్నారు. అక్షర జ్ఞానం లేని రైతులను ఏదోఒక విధంగా నాణ్యత పేరుతో దోపిడీ చేయడం పరిపాటిగా మారింది. నకిలీల బెడద నుంచిరైతులను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. - జిల్లాలో 12 వ్యవసాయ డివిజన్లున్నాయి. సుమారుగా 500 వరకు విత్తన దుకాణాలు, 670 ఎరువుల దుకాణాలు ఉన్నాయి. లెసైన్స్ లేని దుకాణాలు సైతం లేకపోలేదు. ఏయే దుకాణంలో ఎంతెంత నిల్వలున్నాయో కూడా అధికారులకు తెలియని పరిస్థితి. - కొంతమంది వ్యాపారులు ఎరువులకు అనుమతులు కూడా లేకుండా బ్లాక్ మార్కెట్‌గా అమ్ముతూ పట్టుపడుతున్నారు. ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు విజిలెన్స్ అధికారులు నామమాత్ర దాడులతో సరిపెట్టుకుంటూ మమ అని పిస్తున్నారు. ఆ తరువాత విత్తనాలు, ఎరువుల దుకాణాలపై నిఘా లేకపోవడంతో వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. - ప్రభుత్వం కూడా సీజన్లో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండటం అన్నదాతకు శాపంగా మారింది. దీంతో ప్రైవేట్ వ్యాపారుల హవా కొనసాగుతోంది. - ఇటీవల ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తేనే అనేక అక్రమాలు వెలుగు చూశాయి. గిద్దలూరు, కంభంలలో రెండు దుకాణాలపై దాడులు చేసి 28 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. అనుమతులు లేని కారణంగా 87 టన్నుల ఎరువులను నిలుపుదల చేశారు. - యర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల్లో వ్యవసాయ అధికారుల బృందాలు దాడులు చేశాయి. 24 లక్షల 67 వేల విలువైన విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ జె మురళీకృష్ణ తెలిపారు. నకిలీవని అనుమానం వచ్చిన విత్తనాలను లేబొరేటరీకి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. - ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో కోట్ల రూపాయలను ఎరువులు, పురుగుమందుల, విత్తనాల కొనుగోలుకు రైతులు కుమ్మరిస్తున్నారు. రైతుల్లో ఎక్కువగా నిరక్షరాస్యులు కావడంతో విత్తనాలు, ఎరువుల దుకాణ దారుల చేతిలో నిత్యం మోసపోతూనే ఉన్నారు. ఏది నకిలీదో.. ఏది మంచిదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. - పురుగు మందులు, ఎరువులు, విత్తనాలపై చైతన్య పర్చాల్సిన అధికారులు మిన్నకుంటున్నారు. పైగా ఎరువుల వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై దాడులకు వెనకాడుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై నిఘా ఉంచి రైతులు మోసపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నల్లబజారుకు.. నీలి కిరోసిన్
- చౌకధరల దుకాణాల్లో రెండు నెలలకోసారి సరఫరా చేస్తున్న కిరోసిన్ - నిత్యవసర సరుకుల పరిస్థితీ అంతంతే - మామూళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు గిద్దలూరు: చౌకధరల దుకాణాల ద్వారా పేదలకందించే నిత్యవసర వస్తువులు పక్కదారి పడుతున్నాయి. అరకొర వస్తువులు సరఫరా చేస్తున్నా.. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. డీలర్లు రెండు నెలలకు ఒకసారి ఒకనెల కిరోసిన్ పంపిణీ చేస్తూ..అందులోనూ సగం పక్కదారి పట్టిస్తున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో మునిగి తేలుతూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్డుదారులు దీనిపై అధికారులను నిలదీసినా పట్టించుకున్న పాపాన పోలేదు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 194 రేషన్‌షాపులుండగా అందులో 65,500 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా లక్షా 31 వేల లీటర్ల కిరోసిన్ సరఫరా అవుతుంది. గిద్దలూరు మండలంలో ఉన్న 25 వేల రేషన్‌కార్డులకు 50 వేల లీటర్ల కిరోసిన్ ప్రతినెలా కేటాయిస్తారు. ఇందులో 50 శాతం కార్డుదారులకు కూడా కిరోసిన్ సక్రమంగా అందడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం కిరోసిన్ పంపిణీపై నెలకొక విధానాన్ని అమలు చేయడ మూ డీలర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. - మొదట దీపం గ్యాస్దారులకు కిరోసిన్ నిలిపేశారు. తిరిగి గ్యాసు కార్డుదారులకు రెండు లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లోలీటరు, గ్యాస్ లేని వారికి రెండు లీటర్ల కిరోసిన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా ఆ కార్డుదారులకు కిరోసిన్ సక్రమంగా వచ్చిన దాఖలాల్లేవు. - మొదట మండల కేంద్రాల్లో నాలుగు లీటర్లు పోయాలన్నారు. తరువాత నాలుగు నుంచి రెండు లీటర్లకు కుదించారు. ప్రస్తుతం అది కూడా అమలు కావడం లేదు. - ఇక గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ మరింత అధ్వానంగా తయారైంది. దీనిపై కార్డుదారులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే వారిపై దాడులు చేయడం, రేషన్ కార్డులు రద్దు చేయించడం జరుగుతోంది. సదరు డీలర్లకు రాజకీయ నాయకుల ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. 29వ తేదీన కిరోసిన్ సరఫరా: కిరోసిన్ హోల్‌సేల్ డీలర్లు చౌకధరల దుకాణాలకు ప్రతి నెలా సరఫరా చేయాల్సి ఉన్నా రెండు నెలలకొకసారి నెలాఖరులో కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. దీంతో ఒక నెల కిరోసిన్‌ను పక్కదారి పట్టించి హోల్‌సేల్ డీలర్ టోకుగా అమ్మేసి స్థానిక అధికారులకు, డీలర్లకు కొంత ముట్టచెబుతూ తన జేబులు నింపుకుంటున్నాడు. ఈనెలలో కిరోసిన్ ఎందుకు రాలేదని కార్డుదారులు డీలరును ప్రశ్నిస్తే తహశీల్దారును అడగమని, తహశీల్దారును అడిగితే స్టాకు రాలేదంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇందుకు కారణం మార్కెట్లో నీలి కిరోసిన్ ధర లీటర్ రూ.40 నుంచి రూ.45 వరకు పలకడమే. డీలర్‌కు లీటరు కిరోసిన్‌ను రూ.14.75కు హోల్‌సేల్ డీలర్లు సరఫరా చేస్తున్నారు. దానిని రూ.15 కు కార్డుదారులకు విక్రయించాలి. లీటరు కిరోసిన్ కార్డుదారులకు విక్రయిస్తే డీలర్‌కు వచ్చేది 25 పైసలు మాత్రమే. అదే కిరోసిన్‌ను పక్కదారి పట్టిస్తే లీటరుకు రూ.25 నుంచి రూ.30 వస్తాయి. దీంతో డీలర్లు అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అవినీతి జరుగుతోందిలా... - కిరోసిన్‌ను డీలరుకు పోసే సమయంలో విధిగా రూట్ అధికారి ఉండాలి. కానీ, ఇది ఎక్కడా అమలు కావడం లేదు. రూట్ అధికారికి అందేది అందుతుండటంతో వారు నోరు మెదపడం లేదు. - గిద్దలూరు ప్రాంతంలో ప్రతినెలా సరఫరా చేయాల్సిన కిరోసిన్‌ను రెండు నెలలకు ఒకసారి ఒక నెల కిరోసిన్‌ను అదీ నెలాఖరులో సరఫరా చేస్తున్నారు. - ట్యాంకరు నుంచి డీలరు తనకు కేటాయించిన కిరోసిన్‌లో సగమే తీసుకుని మిగిలిన కిరోసిన్‌ను అందులోనే ఉంచేసి హోల్‌సేల్ డీలరుకు అమ్మేసుకుంటాడు. ఇలా మిగిలిన కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలుతోంది. - ట్యాంకర్ ద్వారా రాత్రిపూట కిరోసిన్ చౌకదుకాణాలకు సరఫరా అవుతోంది. కిరోసిన్ సరఫరా జరిగిన మరుసటి రోజు తనిఖీ చేస్తే డీలర్ల అవినీతి బయటపడుతుంది. - తహశీల్దార్ కార్యాలయంలో ఏ కార్యక్రమం జరిగినా ఆ ఖర్చంతా తామే భరించాల్సి ఉంటుందని, ఇది కాక నెల వారీ చెల్లింపులు ఉంటాయని, ఇదేమీ రహస్యం కాదని డీలర్లు చెబుతుండటం గమనార్హం. ఇలాంటి లొసుగుల వలన అధికారులు వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో డీలర్ల అవినీతి పెచ్చుమీరుతోంది. - డీలర్లు అక్రమంగా తరలించే సరుకులను పోలీసులు పట్టుకుంటే తప్ప రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వయానా పట్టుకున్న పాపానపోలేదు. ఇలా డీలర్లు, రెవెన్యూ అధికారులు కార్డుదారులను మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఏఎస్ఓ వివరణ: ఈ విషయమై జిల్లా ఏఎస్ఓ ఖాదర్మస్తాన్ను వివరణ కోరగా ట్యాంకర్ వెంట కచ్చితంగా రూటు ఆఫీసర్‌గా ఆర్ఐ వెళ్లాల్సి ఉందని, కిరోసిన్ లోడ్ కావడం ఆలస్యమైందన్నారు. ప్రతినెలా నెలాఖరులోగా కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయాలన్నారు. ఈవిషయం తన దృష్టికి రాలేదని.. విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప‘రేషన్’
చౌకధరల దుకాణాల్లో సరుకుల పంపిణీ నెలాఖరులోనూ ఆన్లైన్ అలాట్మెంట్ ఇవ్వని వైనం డీడీలు తియ్యకుండా మిన్నకున్న రేషన్ డీలర్లు టీడీపీ నేతల ఒత్తిడే కారణమని అనుమానాలు..! మరో రెండు రోజుల్లో డీడీలు తీయిస్తామంటున్న అధికారులు జూలై కోటాపై కార్డుదారుల్లో ఆందోళన గుంటూరు : చౌకధరల దుకాణాల్లో జూలై నెల సరుకుల పంపిణీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రేషన్‌షాపులకు ఈ నెల అలాట్మెంట్ను ఆన్లైన్ చేయకపోవడం.. ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో డీలర్లు డీడీలు తీయక పోవడం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రతినెలా 18వ తేదీలోగా అలాట్మెంట్లు పూర్తయి డీడీలు తీయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇక సరుకెప్పుడు దిగుమతి అవుతుందో.. వచ్చే నెల కోటా తమకెప్పుడు అందుతుందోనని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల భారం పేదలపై పడకుండా వారికి బియ్యం, పామాయిల్, పంచదార, కిరోసిన్, కందిపప్పు, కారం, చింతపండు, పసుపు, గోధుమపిండి వంటితెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకేనా..!.. జిల్లాలో అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా లేని వ్యక్తులు నిర్వహిస్తున్న చౌకధరల దుకాణాలను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకే అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, అలాట్మెంట్ ఇవ్వకుండా నిలిపివేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న డీలర్ల వద్ద నుంచి షాపులను లాగేసుకున్నారని, పర్మినెంట్ డీలర్లను సైతం రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలుస్తోంది. అలా చెయ్యని వారి దుకాణాలపై రెవెన్యూ అధికారులతో దాడులు చేయించి, వారంతట వారే వదులుకునేలా చేస్తున్నట్లు ఆరోపణలు వినివస్తున్నాయి. కార్డుల తొలగింపు ప్రక్రియ వల్లే ఆలస్యం... రేషన్ డీలర్లకు సరుకుల అలాట్మెంట్ ఆలస్యం కావడంపై డీఎస్వో రవితేజా నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చౌకధరల దుకాణాల్లో సరుకులు తీసుకోని కార్డుదారులను గుర్తించి, తొలగింపు చేపట్టామని, ఈ ప్రక్రియ వల్లే సరుకుల అలాట్మెంట్ చేయడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలస్యమైందని సమాధానమిచ్చారు. జిల్లాలో సోమవారం కొన్ని మండలాల తహశీల్దార్లు వారి వద్ద ఉన్న కార్డు దారుల ఆధారంగా డీలర్లతో డీడీలు తీయించారని చెప్పారు. మిగతా మండలాలు, పట్టణాల్లోనూ రెండు రోజుల్లో డీడీలు తీయించి సరుకుల పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. . నూతన మద్యం విధానంలో దుకాణాల లెసైన్స్‌లను ఐదు శ్లాబులుగాను, బార్ లెసైన్స్ విధానాన్ని మూడు శ్లాబులగాను నిర్ణయించారు. కొత్త విధానం అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ప్రస్తుతం తెచ్చిన విధానాన్ని చూసి కొత్తసీసాలో పాత సారా నింపినట్లు ఉందని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల..జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలు, 187 బార్లు ఉన్నాయి. వీటిని లాటరీ విధానంలో కేటాయించేందుకు సోమవారం నోటిఫికేషన్ విడుదలయింది. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. 28వ తేదీన గజిట్ నంబర్ల ఆధారంగా లాటరీ విధానంలో దుకాణాల కేటాయింపు జరుగుతుంది. పెరిగిన ఫీజుల ప్రకారం బార్లను యథాతధంగా రెన్యువల్ చేస్తారు. జిల్లాలో రూ.32.50 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న మద్యం దుకాణాలు 119 ఉండగా, రూ.34 లక్షలు ఉన్న దుకాణాలు 103, రూ. 42 లక్షలు ఉన్న దుకాణాలు 85, రూ.64 లక్షలు ఉన్న దుకాణాలు 35 ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో రూ.35 లక్షలు లెసైన్స్ ఫీజులు ఉన్న బార్లు 98 ఉండగా, రూ.38 లక్షలు లెసైన్స్ ఫీజు ఉన్న బార్లు 89 ఉన్నాయి. బెల్టుషాపులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో మద్యం వ్యాపారులు ఈసారి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. -
పేదలపై పామాయిల్ భారం
కె.గంగవరం, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ లేదనే సాకుతో పేదలకు రాయితీలో చౌకధరల దుకాణాల ద్వారా అందించే పామాయిల్ పంపిణీని నిలిపివేశారు. ఏప్రిల్, మే నెలల్లో వారికి పామాయిల్ పంపిణీ కాలేదు. దాంతో అధికరేట్లకు బయటమార్కెట్లో పామాయిల్‌ను కార్డుదారులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. మండలంలో 35 వేలమంది లబ్ధిదారులు ఉన్నారు. కిలో పామాయిల్ రాయితీపై రూ. 40కు లభిస్తుండగా బహిరంగ మార్కెట్లో రూ.60 నుంచి రూ.70 అవుతోంది. దాంతో కిలోకు రూ. 20 నుంచి రూ. 30 వరకు పేదలపై అదనపు భారం పడడంతో వారు విలవిల్లాడుతున్నారు. రెండు నెలల పాటు పామాయిల్ పంపిణీ నిలిపివేసిన ప్రభుత్వం జూన్‌లో కూడా అందించే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రప్రభుత్వం రాయితీ పామాయిల్‌ను రాష్ట్రాలకు సరఫరా చేయకపోవడంతోనే లబ్ధిదారులు ఆయిల్ పంపిణీ జరగలేదు. మండలంలో సుమారు 35 వేల మంది లబ్ధిదారులకు నెలకు కిలో చొప్పున పామాయిల్ పంపిణీ చేయాల్సి ఉంది. ఉన్నతాధికారులు రెండు నెలలుగా ఎన్నికల విధుల్లో ఉండడం, రాష్ట్రానికి రావల్సిన కోటాపై సందిగ్ధత తొలగే వరకు పామాయిల్ పంపిణీ చేయకపోవచ్చని తెలుస్తోంది. కొత్త సర్కార్ కొలువుతీరే వరకు పామాయిల్ సరఫరా జరగకపోవచ్చని లబ్ధిదారులు అందోళన చెందుతున్నారు. 200 మందికి అందని నిత్యావసర సరకులు.. మండలంలోని సుమారు 200 మందికి నిత్యావసర సరకులు అంద లేదు. పౌరసరఫరాల కీ రిజిస్టర్లో పేర్లు నమోదు కాకపోవడంతో వీరికి ఈ పరిస్థితి తలెత్తింది. తమకు కార్డులున్నప్పటికీ సరకులు అందడం లేదని వారు వాపోతున్నారు. అధికారులు స్పందించి తమకు నిత్యావసర సరకులు అందేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.