రేషన్ షాపులకు సమైక్యల సహకారం
- జిల్లాలో ప్రారంభం కానున్న కొత్తవిధానం
- జిల్లా వ్యాప్తంగా 421 షాపుల్లో ఏర్పాటు
- ఈపాస్‌లు, ఐరీష్‌ల నిర్వాకంతో డీలాపడ్డ డీలర్లు
మదనపల్లె: ప్రజా పంపిణీ వ్యవస్థలో పౌరసరఫరాల శాఖ నూతనంగా అవలంబిస్తున్న విధానాల్లో సమైక్య మహిళలు కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే ఈ కొత్త విధానాలతో ఇటు వినియోగదారులు, అటు రేషన్ డీలర్లకు చుక్కలు కనబడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలనే లక్ష్యంతో ఆ శాఖ మరో కొత్త విధానానికి నాంది పలకనుంది. సాంకేతిక సమస్యల వల్ల ఈపాస్, ఐరీష్‌లు పనిచేయకపోవడంతో రేషన్ వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు తీసుకోవ డం వారికి ఇబ్బందిగా మారింది. అయితే ఈ కొత్త విధానం వల్ల వారికి కొంత ఊరట లభించనుంది. తొలిరోజుల్లో ఈపాస్, ఐరీష్ లతో సరుకులను పంపిణీ చేస్తారు. వేలిముద్రలు పనిచేయని వారికి, మ్యానువల్‌గా ఇచ్చేవారికోసం ఒక్కోషాపులో ఇద్దరు సమైక్య లీడర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రాలను ఆదేశాలు అందాయి. సమైక్య లీడర్లు మ్యాన్యువల్‌గా తీసుకునే వారిని గుర్తించి సరుకులు ఇవ్వాలని డీలరుకు సిఫార్సు చేయనున్నారు. జిల్లాలో మే నెల మొదటి వారం నుంచి రేషన్ షాపులలో ‘ఈపాస్‘ విధానాన్ని అమలులోనికి తెచ్చిన విషయం తెల్సిందే. జిల్లా వ్యాప్తంగా 2,891 రేషన్‌షాపులుండగా, వాటిలో ప్రయోగాత్మకంగా 421షాపుల్లో ఏర్పాటు చేశారు. ఇదే షాపులకు సమైక్యలీడర్లు కూడా సహకారం అందించనున్నారు.
సమస్యలను అధిగమించేందుకే సమైక్యల సహకారం...
రేషన్ షాపుల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకే సమైక్యల సహకారం తీసుకోనున్నామని సీఎస్‌డీటీ అమర్‌నాథ్ అన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈపాస్‌లు, ఐరీష్‌ల కు సాంకేతిక సమస్య లు వస్తున్నాయని డీ లర్లు తమ దృష్టికి తె స్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సమై క్య లీడర్ల లిస్టుకోసం మున్సిపల్ అధికారులకు లేఖ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విధా నం ఎంతమాత్రం విజయవంతం అవుతుందో వేచిచూడాల్సిందే.