రేషన్ పంపిణీ వేగవంతం చేయండి
రేషన్ పంపిణీ వేగవంతం చేయండి
Published Tue, Aug 2 2016 10:20 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో రెండు రోజులుగా 4 లక్షల మంది రేషన్ కార్డుదారులకు రేషన్ సరఫరా చేశామని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అధికారులు, రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లాలోని సివిల్ సప్లైస్ అధికారులు, ఆర్డీవోలు, స»Œ æకలెక్టర్లు, మండల తహసీల్దార్లు, డెప్యూటీ తహసీల్దార్లతో మాట్లాడారు. జిల్లాలో 5వ తేదీ నాటికి 100 శాతం రేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి రేషన్ ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రతి ఒక్కరికీ రేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పలు మండలాల్లో రేషన్ ప్రక్రియ ప్రారంభమైనా పంపిణీ మందకొడిగా సాగడాన్ని ఆయన ప్రశ్నించారు.
సర్వే సమస్యలను అందరికీ తెలపండి
జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే వల్ల వచ్చే సమస్యలను సర్వే సిబ్బంది అందరికీ తెలపాలని, కొత్త సమస్యలు ఎదురైతే ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయో అనే విషయాలు ఒకరికొకరు తెలియజేయాలన్నారు. దీని కోసం గ్రూపు మెసేజ్‌లను, లేదంటే వాట్సప్‌లను ఉపయోగించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. జిల్లాలో దీపం పథకం నూరు శాతం ప్రతి ఒక్కరికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో గ్యాస్ కనెక్షన్‌లు లేని వారి సమాచారాన్ని సేకరించాలని జేసీ కోటేశ్వరరావు ఆదేశించారు.
Advertisement