order to officers
-
శివారు భూములకు నీరందించేందుకు చర్యలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో కాలువలను తవ్వి అభివృద్ధి చేయడం ద్వారా చివరి భూములకు సైతం సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు కాలువ తప్ప సబ్ ఛానల్స్‌తో పాటు అన్ని కాలువలను తవ్వి భూములకు సాగునీరు అందేలా చూడాలన్నారు. రైతుల పొలాల గుండా ఫీల్డ్ ఛానల్ ్స తవ్వి ప్రతి రైతు పొలానికి నీరు అందించాలన్నారు. ఎక్కడైనా ఇంకా పొలాలకు నీరు అందకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 11 మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయికి వెళ్లి కాలువలను తనిఖీ చేయాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 197 మైనర్, సబ్‌మైనర్ ఛానల్స్ ఉన్నాయని వాటి ద్వారా పొలాలకు పిల్ల కాలవలు తవ్వి సాగునీరు అందించాలని ఏజెన్సీ ప్రతినిధులను కలెక్టర్ ఆదేశించారు. ఏలూరులో తమ్మిలేరు కాలువ బండ్‌ను ఆహ్లాదకర వాతావరణంలో సుందరంగా తీర్చిదిద్దాలని, అందుకు సంబంధించి ప్లాన్‌ను రూపొందించి 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.సాయిశ్రీకాంత్‌ను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్.షరీఫ్, భూసేకరణ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ పంపిణీ వేగవంతం చేయండి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో రెండు రోజులుగా 4 లక్షల మంది రేషన్ కార్డుదారులకు రేషన్ సరఫరా చేశామని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అధికారులు, రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లాలోని సివిల్ సప్లైస్ అధికారులు, ఆర్డీవోలు, స»Œ æకలెక్టర్లు, మండల తహసీల్దార్లు, డెప్యూటీ తహసీల్దార్లతో మాట్లాడారు. జిల్లాలో 5వ తేదీ నాటికి 100 శాతం రేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి రేషన్ ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రతి ఒక్కరికీ రేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పలు మండలాల్లో రేషన్ ప్రక్రియ ప్రారంభమైనా పంపిణీ మందకొడిగా సాగడాన్ని ఆయన ప్రశ్నించారు. సర్వే సమస్యలను అందరికీ తెలపండి జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే వల్ల వచ్చే సమస్యలను సర్వే సిబ్బంది అందరికీ తెలపాలని, కొత్త సమస్యలు ఎదురైతే ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయో అనే విషయాలు ఒకరికొకరు తెలియజేయాలన్నారు. దీని కోసం గ్రూపు మెసేజ్‌లను, లేదంటే వాట్సప్లను ఉపయోగించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. జిల్లాలో దీపం పథకం నూరు శాతం ప్రతి ఒక్కరికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో గ్యాస్ కనెక్షన్లు లేని వారి సమాచారాన్ని సేకరించాలని జేసీ కోటేశ్వరరావు ఆదేశించారు.