స్టాప్ సేల్..అయితే మాకేం?
– ఎరువుల డీలర్ల ఇష్టారాజ్యం
– యథేచ్ఛగా అమ్మకాలు
– జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
కర్నూలు(అగ్రికల్చర్): తనిఖీల సమయంలో వ్యవసాయ అధికారులు.. నిబంధనలు పాటించని ఎరువుల దుకాణాల్లో అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేయడం(స్టాప్ స్టేల్) సర్వసాధారణం. తిరిగి అనుమతులు ఇచ్చేవరకు ఎరువుల అమ్మకాలు ఎట్టి పరిస్థితుల్లోను నిర్వహించరాదు. అయితే ఎరువుల దుకాణాల డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. స్టాప్‌సేల్స్‌ను బేఖాతర్ చేస్తూ ఎరువుల అమ్మకాలు య«థావిధిగా నిర్వహిస్తున్నారు. ఇటీవల జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు(జేడీఏ) ఉమామహేశ్వరమ్మ జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాల తనిఖీలకు ఇంటర్నల్ స్వా్కడ్ బందాలను నియమించారు. ఒక సబ్‌డివిజన్ ఏడీఏను మరో సబ్‌డివిజన్‌లోని ఎరువుల దుకాణాల తనిఖీలకు స్వా్కడ్ అధికారిగా నియమించారు. తనిఖీలు వేగం పుంజుకున్నాయి. ప్రై వేటు డీలర్లకు వ్యవసాయశాఖ ఇచ్చిన లైసెన్స్‌లో ఎరువుల కంపెనీలు ఇచ్చిన ఓ–ఫామ్‌ను నమోదు చేయించుకోవాలి. లైసెన్స్‌లో ఓ– ఫామ్ ఇంక్లూజన్ లేకపోయినా ఆ కంపెనీల ఎరువులను అమ్ముతున్నారు. ఈ విషయం ఏడీఏల తనిఖీల్లో బయటపడింది.
ప్రతి ఏటా తప్పనిసరి
ప్రై వేటు డీలర్లు ఎరువుల కంపెనీల ఉత్పత్తులను అమ్ముకోవాలంటే ఆయా కంపెనీల ఓ–ఫామ్‌ను ప్రతి ఏటా తీసుకోవాలి. లైసన్స్‌లో ఓ–ఫామ్ ఇంక్లూజన్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దానిని వ్యవసాయ యంత్రాంగం పరిశీలించి ఇంక్లూజన్ చేస్తుంది. జిల్లాలో హోల్‌సేల్ డీలర్లు 900 మంది వరకు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది ఓ–ఫామ్ ఇంక్లూజన్ లేకుండానే ఎరువుల వ్యాపారం సాగిస్తుండటం గమనార్హం..
స్టాఫ్‌సేల్స్ ఇచ్చినా..
కర్నూలు ఏడీఏ రమణారెడ్డిని నంద్యాల తనిఖీ అధికారిగా నియమించారు. ఈయన మంగళవారం వివిధ షాపులు తనిఖీ చేయగా ఓ–పామ్ ఇంక్లూజన్ లేకుండానే అయా కంపెనీల ఎరువులు అమ్మతున్నట్లు గుర్తించి రూ. 1.20 కోట్ల విలువ చేసే ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చి వెళ్లారో లేదో యథావిధిగా ఎరువుల అమ్మకాలు చేపట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒక్క నంద్యాలలోనే కాదు డోన్, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి నెలకొని ఉంది. స్టాప్ సేల్ ఇచ్చినా అమ్మకాలు యథావిధిగా జరుగుతున్న విషయం వ్యవసాయాధికారులకు తెలిసినా చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.