Fertilizer dealers
-
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
నకిలీ గడ్డి మందుల ముఠా అరెస్ట్
సాక్షి, వరంగల్: నకిలి విత్తనాలతో పాటు గడువు తీరిన పురుగుల మందులను విక్రస్తున్న ముఠా గుట్టును వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నకిలీ విత్తనాలు, మందులతో పాటు నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మూడు ముఠాలకు చెందిన 13మందిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అలాగే ఇద్దరు ఫర్టిలైజర్ షాప్ యాజమానులపై కూడా కేసు నమోదయ్యింది. ఈ దాడిలో నిందితుల నుంచి 75 లక్షల విలువైన నకిలీ, గుడువు తీరిన పురుగుల మందు, నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మందుల తయారీకి అవసరమైన రసాయనాలు, ప్రింటింగ్ సామగ్రి, ఖాళీ బాటిల్స్, ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టుబడ్డ మందుల్లో 24 లక్షల రూపాయల విలువైన గడువు తీరిన పురుగు మందులు, 30 లక్షల రూపాయల విలువ గల నకిలీ పురుగు మందులు, 3 లక్షల 53వేల రూపాయల విలువగల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందు ఉన్నట్లు సిపి రంగనాథ్ తెలిపారు. గడువు తీరిన మందులు సైతం విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో నిఘా పెట్టగా ముఠాల గుట్టురట్టయిందని, కల్తీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీరియస్ యాక్షన్ చేపట్టామన్నారు. కల్తీలతో మోసానికి పాల్పడే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తామని పేర్కొన్నారు. మందులు కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలని సిపి రంగనాథ్ రైతులకు సూచించారు. -
డీఏపీ ధర పెంచవద్దు
న్యూఢిల్లీ: డీఏపీ తదితర యూరియాయేతర ఎరువుల గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ)ని పెంచవద్దని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఎరువుల కంపెనీలను ఆదేశించింది. వాటిని పాత రేట్లకే అమ్మాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా యూరీయాయేతర ఎరువుల రేట్లను పెంచడంపై కేంద్రం ఈ మేరకు ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. డీఏపీ(డై అమ్మోనియం ఫాస్పేట్), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ), ఎన్పీకే తదితర నాన్ యూరియా ఎరువుల రిటెయిల్ ధరల నిర్ధారణను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయా ఫర్టిలైజర్ కంపెనీలే ఆ ధరలను నిర్ధారిస్తాయి. అయితే, ప్రభుత్వం ఏటా వాటికి నిర్ధారిత మొత్తంలో సబ్సీడీ ఇస్తుంది. ‘ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే ఎరువుల ధరలను పెంచవద్దని ఫర్టిలైజర్ కంపెనీలకు సూచించింది. గతంలో ఉన్న రేట్లకే వీటిని విక్రయించాలని స్పష్టం చేసింది. దానికి ఆ కంపెనీలు అంగీకరించాయి’ అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. రైతులకు పాత ధరలకే ఆ ఎరువులు లభిస్తాయన్నారు. అంతర్జాతీయంగా ఎరువుల ముడి సరకుల ధర భారీగా పెరగడంతో ఇటీవల ఈ ఎరువుల ధరలను పెంచుతూ ఫర్టిలైజర్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్ 1 నుంచి క్రిభ్కో, ఎంసీఎఫ్ఎల్, జువారీ అగ్రో కెమికల్స్, పారాదీప్ ఫాస్పేట్స్ సంస్థలు డీఏపీ చిల్లర ధరను బ్యాగ్‌కు రూ. 17 వందలకు పెంచాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పాస్ఫరస్, పొటాషియం ఎరువుల ధరలకు ఇచ్చే సబ్సీడీలో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. గత సంవత్సరం నైట్రోజన్(ఎన్)కు కేజీకి రూ. 18.78 చొప్పున, ఫాస్పేట్(పీ)కు కేజీకి రూ. 14.88 చొప్పున, పొటాష్(కే)కు రూ. 10.11 చొప్పున, సల్ఫర్‌కు రూ. 2.37 చొప్పున సబ్సిడీని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగనుంది. -
బె‘ధర’గొడ్తూ!
నేలకొండపల్లి: ఎన్నెన్నో ఆశలతో సాగు పనుల కు శ్రీకారం చుడుతున్న రైతులు ఆదిలోనే బెదిరేట్లుగా ఎరువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి రేట్ల పెంపుపై ఎలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు రాకున్నా..వ్యాపారులు మాత్రం గతంతో పోలిస్తే ఎక్కువ చేసి అమ్మేస్తున్నారు. దీంతో ఆర్థిక భారంతో ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుబంధు, ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాల ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న తరుణంలో ఇలా..ఎరువుల ధరలు పెరగడమేంటని సామాన్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూ.1250 ఉన్న డీఏపీ కట్ట ప్రస్తుతం మార్కెట్ లో రూ.1470 పలుకుతోంది. దీంతో ఒక్కో బస్తాపై అదనంగా రూ.200కు పైగా భారం మోయాల్సి వస్తోంది. ఖరీఫ్ సీజన్ సమీపిం చిన నేపథ్యంలో రైతులు పొలాల బాట పట్టారు. దుక్కులు దున్నుతూ ఇతర పనులు చేస్తూ, వ్యవసాయ పనిముట్లను సిద్ధం చేసుకుంటూ..వారం పది రోజుల్లో రుతుపవనాలు రానుండటంతో ఖరీప్ సాగుకు అంతా సన్నద్ధమవుతున్నారు. అయితే పెరిగిన ఎరువుల ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో పెంచిన లెక్క ప్రకారమే విక్రయాలు జరుపుతుండటంతో ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది సాగు అంచనాలు ఇలా.. జిల్లాలో ఈ సంవత్సర ఖరీఫ్‌లో 2,30,498 హెక్టార్లు సాగు చేసే అవకాశాలున్నాయి. అందులో వరి–59,361 హెక్టార్లలో వేయనున్నారని అంచనా. ఇంకా పత్తి–96,116 హెక్టార్లు, మొక్కజొన్న 3,802 హెక్టార్లు,పెసర–9,249 హెక్టార్లు, కంది–2,340 హెక్టార్లు, మిర్చి–21,250 హెక్టార్లలో పండించే అవకాశాలున్నాయి. ఖరీఫ్‌లో వినియోగం 2.34 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. యూరియా– 72,408 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంది. ఇంకా డీఏపీ–31,561 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 22,946 మెట్రిక్‌టన్నులు, కాంప్లెక్స్ –1,05,560 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ–2500 మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ సీజన్లో వినియోగిస్తారని అంచనా. తగ్గిన భూసారాన్ని పెంచుకోవాలంటే మళ్లీ సేంద్రియం ఒక్కటే మార్గం అంటున్న శాస్త్రవేత్తల సూచనలను అందరూ పెడచెవిన పెడుతున్నారు. సేంద్రియ సాగుపై రైతు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నా..ఆచరణలో ఆశించిన స్థాయిలో అమలు కావట్లేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా..వ్యవసాయాన్ని కాపాడేందుకు సేంద్రియ విధానాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. రైతులపై మోయలేని భారం.. అసలే సాగు పెట్టుబడులు పెరిగి వ్యవసాయం అంటేనే భయపడుతున్న తరుణంలో ఎరువుల ధరలు పెంచడం దారుణం. వీటిని నియంత్రించాలి. రైతుల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వెంటనే ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. – గుడవర్తి నాగేశ్వరరావు, రైతుసంఘం నేత, నేలకొండపల్లి పెట్టుబడి ఇంకా పెరిగింది.. వ్యవసాయం ప్రతి ఏటా భారంగా మారుతోంది. ఒకపక్క పెరిగిన పెట్టుబడి, మరోపక్క కౌలు పెరగడంతో సాగు చేయాలంటేనే భయమేస్తోంది. కౌలు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాలకులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. – కాశిబోయిన అయోధ్య, కౌలురైతు, సింగారెడ్డిపాలెం -
మౌనం వీడేనా?
కల్తీ ఎరువులు రైతులను కలవర పెట్టాయి. జిల్లాలోని యూరియాను కొంతమంది అక్రమార్కులు పక్క రాష్ట్రం ఒడిశాకు తరలించి.. అక్కడ దానికి రంగు వేసి తిరిగి జిల్లాకు తీసుకొచ్చి డీఏపీ ఎరువుగా విక్రయాలు చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ వైనంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. అధికారులు స్పందించారు. అయితే నామమాత్రంగా దాడులు చేసి మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో మంగళవారం వ్యవసాయాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నకిలీ ఎరువుల విక్రయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిస్థితుల్లోనైనా వ్యవసాయశాఖ అధికారులు మౌనం వీడి.. చర్యలకు ఉపక్రమిస్తారో..లేదోనని రైతులు ఆసక్తిగా చూస్తున్నారు. శ్రీకాకుళం, టెక్కలి: జిల్లాలో కల్తీ ఎరువులపై స్వయంగా నేను చెప్పినా పట్టించుకోరు...టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో కల్తీ ఎరువులు విక్రయిస్తున్నారని డీలర్ల పేరుతో సహా ఫిర్యాదులు వస్తున్నా మీరేం చేస్తున్నారు... వ్యవసాయాధికారులు నిద్రపోతున్నారా...డీలర్లతో లాలూచీపడుతున్నారా అంటూ సాక్షాత్ జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏం చేయాలో తేలియక వ్యవసాయ శాఖ అధికారులు కలవర పడుతున్నారు. కలెక్టర్ హెచ్చరికలతోనైనా కల్తీ ఎరువుల బాగోతంపై అధికార యంత్రాంగం స్పందిస్తుందా లేక ఇదంతా మామూలే అని పెడచెవిన పెడతారా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. జిల్లాలో కల్తీ ఎరువులపై ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో వరుసగా కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో వ్యవసాయాధికారులు, విజిలెన్స్ అధికారులు తూతూ మంత్రంగా హడావుడి తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే కలెక్టర్ ధనంజయరెడ్డి మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రస్తావించనట్లుగా కల్తీలకు పాల్పడుతున్న ప్రాంతాలు, డీలర్ల పేర్లుతో సహా పత్రికల్లో ప్రచురితమైనప్పటికీ వ్యవసాయాధికారులు మౌనం వహించడంలో ఆంతర్యమేమిటో కలెక్టర్ హెచ్చరికలో కొన్ని మాటలతో ఏకీభవించక తప్పదు. ఖరీఫ్ ఆరంభం నుంచి పెద్ద ఎత్తున కల్తీ ఎరువులు జిల్లాకు వస్తున్నప్పటికీ వ్యవసాయాధికారులు మాత్రం కనీసం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించలేదనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. మరో వైపు విజిలెన్స్ పరిశీలనతో సైతం పూర్తి స్థాయిలో ప్రగతి లేకపోవడంతో అనేక సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కలెక్టర్ ధనంజయరెడ్డి చేసిన హెచ్చరికలతోనైనా వ్యవసాయాధికారుల్లో చలనం కనిపిస్తుందా...విజిలెన్స్ యంత్రాంగం ఈ మాటలను చాలెంజ్‌గా తీసుకుని సంయుక్తంగా విచారణ చేస్తారా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇన్వాయిస్, ఈ–పాస్ అమ్మకాలపై దృష్టి సారించకపోవడంపై సందేహాలు యూరియా (సూపర్ రకం) లో గ్రాన్యూల్స్ రకం ఎరువును ఒడిశాకు తరలించి అక్కడ డీఏపీ రూపంలో కల్తీ జరిగి మరళా ఆంధ్రా ప్రాంతానికి తరలివచ్చి వాటిని కొంత మంది దళారీలతో గ్రామాల్లో అమ్మకాలు చేసినట్లు గతంలో అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే దీనిపై అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం సర్వత్రా విమర్శలకు నెలవైంది. ఇటీవల కాలంలో విజిలెన్స్ అధికారులు డివిజన్ కేంద్రమైన టెక్కలిలో తనిఖీలు నిర్వహించే సమయంలో కొంతమంది ఎరువుల దుకాణాల డీలర్లు మూకుమ్మడిగా వారి దుకాణాలను మూసివేసి పారిపోయారు. ఈ విషయం అధికారుల కళ్లెదుటే జరిగింది. దుకాణాలను ఎందుకు మూసివేశారనే అనుమానం కూడా అధికారుల్లో రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఇన్వాయిస్, ఈ–పాస్ అమ్మకాలపై అధికార యంత్రాంగం కనీసం దృష్టి సారించలేదనే చెప్పాలి. కల్తీ డీఏపీపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఇన్వాయిస్, ఈ–పాస్ అమ్మకాలపై సమగ్ర పరిశీలన చేస్తే అసలు దొంగలు ఇట్టే దొరికిపోతారనే విషయం సామాన్య ప్రజలకు తెలిసినట్లుగా అధికార యంత్రాంగానికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కల్తీ ఎరువులపై జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి హెచ్చరించిన దానిపై వ్యవసాయాధికారులు, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా సమగ్ర పరిశీలన చేస్తారా లేదా అనే విషయం వారి చర్యలపై ఆధార పడి ఉంటుందనే చెప్పుకోవాలి. -
ఫర్టిలైజర్ దుకాణం ఎదుట రైతుల ధర్నా
నర్సాపూర్‌రూరల్/వెల్దుర్తి(తూప్రాన్) : పురుగుల నివారణకు నకిలీ ముందులు ఇవ్వడంతో వరి పంట ఎండిపోయిందని వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన రైతులు సోమవారం నర్సాపూర్ పట్టణంలోని కపిల్ ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ధర్నా నిర్వహించారు. మానేపల్లి గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మయ్య గత నెలలో తనకు ఉన్న రెండు ఎకరాల వరి పంటకు మొగి పురుగు సోకడంతో కపిల్ ఫర్టిలైజర్ దుకాణంలో నివారణ ముందులు కొనుగోలు చేశాడు. వాటిని పంటపై పిచికారి చేయగా రెండు ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని రైతులు తెలిపారు. గొల్ల లక్ష్మయ్య పంట చేను చుట్టుపక్కల రైతుల పంటకు సైతం మొగిపురుగు సోకగా మెదక్, వెల్దుర్తి, కౌడిపల్లి ఇతర గ్రామాల్లో నివారణ మందులు కొనుగోలు చేసుకొని తీసుకు వచ్చి పిచికారి చేశారు. వారి పంటలో పూర్తిగా పురుగులు చనిపోయాయని, పంట ఏపుగా పెరుగుతోందని తెలిపారు. ఫర్టిలైజర్ దుకాణం యజమాని పురుగుల మందులు రాకెట్, మాక్స్, ఎన్‌ప్యూజ్ అనే మూడు రకాలవి ఇచ్చాడన్నారు. ఆయన సూచన మేరకు వాటిని కలిపి పిచికారి చేస్తే పంట పూర్తిగా ఎండిపోయి చేతికి రాకుండా పోయిందని రైతులు తెలిపారు. నకిలీ పురుగుల మందులు ఇవ్వడంతోనే గొల్ల లక్ష్మయ్య రెండు ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని, అతడికి నష్ట పరిహారం చెల్లించాలని పట్టుబడుతూ దుకాణం ఎదుట ధర్నా చేశారు. కంపెనీ వారితో మాట్లాడి న్యాయం చేస్తానని దుకాణం యజమాని నచ్చజెప్పడంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. ఫర్టిలైజర్ యజమాని హన్మంతరావును వివరణ కోరగా లక్ష్మయ్య నేను ఇచ్చిన మొగిపురుగు మందులతోపాటు గడ్డి మందు కలిపి కొట్టడంతోనే వరి పంట ఎండిపోయిందని తెలిపారు. కంపెనీవారితో మాట్లాడి లక్ష్మయ్యకు నాయ్యం జరిగేలా కృషి చేస్తానని తెలిపాడు. -
ఎరువు భారం 35 కోట్లు
మోర్తాడ్(బాల్కొండ) : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ధర పెరగడంతో రైతుల పరిస్థితి ఢమాల్ అయ్యింది. డాలర్ ధర పెరగడం వల్ల కాంప్లెక్స్ ఎరువుల ముడిసరుకు ధరకు రెక్కలు తొడిగాయి. దీంతో మూడు నెలల వ్యవధిలో మరోసారి కాంప్లెక్స్ ఎరువుల ధర పెరిగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగులో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగానే వినియోగిస్తున్నారు. పంటల దిగుబడి పెరగాలంటే కాంప్లెక్స్ ఎరువులను వినియోగించాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. అయితే ధరలు పెరగడం వల్ల పెట్టుబడులు అధికం అవుతున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా తక్కువ సమయంలోనే కాంప్లెక్స్ ఎరువుల ధరలలో పెరుగుదల కనిపిస్తుండటంతో మూలిగే నక్కపై తాటికాయ పడిందనే చందంగా రైతుల పరిస్థితి తయారైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో కాంప్లెక్స్ ఎరువుల ధర ఒక బస్తాపై రూ.100 నుంచి రూ.173 వరకు పెరిగింది. ఇప్పుడు మాత్రం ఒక బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగింది. గతంలో పెరిగిన ధరల వల్ల ఉమ్మడి జిల్లా రైతులపై ఏటా దాదాపు రూ.50 కోట్ల భారం ఏర్పడగా ఇప్పుడు మళ్లీ ధర పెరగడంతో మరో రూ.35 కోట్ల ఆర్థిక భారాన్ని రైతులు మోయాల్సి వస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల తయారీకి వినియోగించే ముడిసరుకును ఎరువుల ఉత్పత్తి కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. దిగుమతి సరుకుపై డాలర్ ప్రభావం పడుతుండటంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఇఫ్కో ఉన్నతాధికారులు వెల్లడించారు. కాంప్లెక్స్ ఎరువుల ధర పెరగడం వల్ల ప్రతి రైతు ఒక హెక్టార్‌కు రూ.వెయ్యిని ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 2.35 లక్షల హెక్టార్లలో, కామారెడ్డి జిల్లాలో 1.72 లక్షల హెక్టార్లలో పంటలను రైతులు సాగు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ రైతులు కొంత మేర వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. వరి కంటే వాణిజ్య పంటలలోనే కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగా వినియోగిస్తారు. డీఏపీ రకం కాంప్లెక్స్ ఎరువు ధర గతంలో రూ.1,295 ఉండగా ఇప్పుడు రూ.1,345కు చేరింది. 20:20 రకం ఎరువు ధర రూ.960 నుంచి రూ.1,025కు చేరింది. 12:32:16 రకం ఎరువు రూ.1175 నుంచి రూ.1275 కు చేరింది. రైతులు ఎక్కువగా డీఏపీతో పాటు 20:20 రకాన్ని వినియోగిస్తున్నారు. డాలర్ ధరలో మార్పు లేక పోతే కాంప్లెక్స్ ఎరువుల ధరలో తగ్గుదల కనిపించకపోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. డాలర్ ధరలు పెరిగినా కాంప్లెక్స్ ఎరువుల ధరలు మాత్రం పెరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డాలర్ ధరలు పెరగడం వల్లనే.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ధర పెరగడం వల్లనే కాంప్లెక్స్ ఎరువుల ధరల్లో పెరుగుదల ఏర్పడింది. ముడిసరుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందువల్లనే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి. – మారుతి ప్రసాద్, ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించాలి ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించాలి. లేకుంటే రైతులు ఇంకా భారం మోయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను అదుపులో ఉంచాలి. ధరలు పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. – ఒల్లాడపు గంగారాం, రైతు, తిమ్మాపూర్ పెట్టుబడులు అధికం అవుతున్నాయి కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం వల్ల మాకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. రైతులు ఇప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఎరువుల ధరలు పెరగడం వల్ల మరింత ఇబ్బంది పడుతారు. – కొప్పుల భాజన్న, రైతు, మోర్తాడ్ -
అనుమతిలేని బయోమందుల పట్టివేత
నల్లబెల్లి : అనుమతిలేని బయోమందులు, త్రీజీ గుళికలు టాటా ఏసీ వాహనంలో తిరుగుతూ రైతులకు అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో నల్లబెల్లి ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ అసోసియేషన్ నాయకులు, రైతులు వాహనాన్ని పట్టుకొని వ్యవసాయాధికారులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని మామిండ్లవీరయ్యపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకొంది. ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు గొనే వీరస్వామి, ప్రధాన కార్యదర్శి మచ్చిక రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బయో ఫర్టిలైజర్‌కు సంబందించిన గోల్డెన్ త్రీజీ గుళికలు, వేపపిండి బస్తాలను టాటా ఏస్ వాహనంలో ఓ వ్యాపారి తీసుకువచ్చి రైతులకు అక్రమంగా అంటగడుతున్నాడు. ఈ మందులను మండలంలోని మామిండ్లవీరయ్యపల్లి, నాగరాజుపల్లి గ్రామాలలో రైతులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో నల్లబెల్లి ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ అసోసియేషన్ నాయకులు మామిండ్లపల్లి గ్రామానికి చేరుకొని బయోమందుల విక్రయాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా గ్రామాలలో బయోమందులు ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు వ్యవసాయాధికారి పరమేశ్వర్‌కు సమాచారాన్ని అందించారు. దీంతో గ్రామానికి చేరుకొన్న వ్యవసాయాధికారి వ్యాపారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బయోమందులతో పాటు టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. గ్రామాలలో తిరుగుతూ బయోమందులు రైతులకు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. -
చేతులు శుభ్రం చేసుకోక..మహిళ మృతి
మానవపాడు (అలంపూర్): వ్యవసాయ పొలానికి పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడంతో ఓ మహిళ మృతిచెందింది. ఎస్ఐ పర్వతాలు కథనం ప్రకారం.. మండలంలోని చంద్రశేఖర్‌నగర్ కాలనీకి చెందిన చిన్న రామన్న వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంటకు ఎలుకల బెడద ఎక్కువ కావడంతో బుధవారం భార్య పెద్ద ముణెమ్మ(51) గుళికల మందు పిచికారీ చేసింది. ఈ క్రమంలో ఆమె చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకుండానే భోజనం చేసింది. దీంతో బుధవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే మానవపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించగా గురువారం ఉదయం మృతిచెందింది. ముణెమ్మ భర్త చిన్న రామన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఉజ్వల భవిష్యత్తుకు ‘ఎరువు’
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట : ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలు స్వావలంబన దిశగా మరో అడుగు ముందుకు వేశాయి. తాజాగా రైతులకు ఎరువులు అమ్మే వ్యాపారానికి శ్రీకారం చుట్టాయి. ఇందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేయూత అందిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 8 రైతు మహిళా సంఘాలు వివిధ జిల్లాల్లో ఎరువుల వ్యాపారం చేసేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఇవి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ గ్రూప్ (ఎఫ్‌పీజీ)లుగా ఏర్పడ్డాయి. ఇందులో 3 సంఘాలు ఎరువుల అమ్మకాన్ని ప్రారంభించాయి. మహిళా రైతులతోఎఫ్పీజీల ఏర్పాటు.. ఒక్కో గ్రామంలో భూములున్న మహిళా రైతులను ఒక్కో గ్రూప్‌లో 15 నుంచి 20 మంది వరకు ఎంపిక చేసి ఎఫ్‌పీజీని ఏర్పాటు చేశారు. ఒక్కో సభ్యురాలు సభ్యత్వం కింద రూ.500 గ్రామ స్థాయిలోని ఎఫ్‌పీజీ బాధ్యులకు చెల్లించాలి. ఇలా మండల స్థాయిలోని అన్ని ఎఫ్‌పీజీ గ్రూపులు కలిపి ఎరువుల వ్యాపారం చేసేందుకు చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు డైరెక్టర్లను ఎన్నుకున్నారు. వీరి ఆధ్వర్యంలో ఎరువుల వ్యాపారం నిర్వహించి ఇందులో వచ్చే లాభాలను గ్రూప్ సభ్యులందరికీ పంపిణీ చేస్తారు. అంతేకాకుండా ఈ గ్రూప్ సభ్యులు తమ కుటుంబ వ్యవసాయానికి కావాల్సిన ఎరువులను కూడా ఎఫ్‌పీజీ నిర్వహించే దుకాణం నుంచి తీసుకోవచ్చు. అన్ని గ్రూప్‌లనుంచి వచ్చిన సభ్యత్వ రుసుముతోపాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇచ్చే ఆర్థిక సహకారంతో ఎరువుల వ్యాపారాన్ని ప్రారంభించారు. మార్క్‌ఫెడ్ నుంచి ఎరువుల సరఫరా.. రైతు మహిళా గ్రూపులు నిర్వహించే ఎరువుల దుకాణాలకు మార్క్‌ఫెడ్ నుంచి ఎరువులు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రారంభమైన మూడు దుకాణాలకు మార్క్‌ఫెడ్ ఒక్కో దుకాణానికి 20 టన్నుల యూరియా, కాంప్లెక్స్ ఎరువులను అందజేసింది. ఎరువులతోపాటు వరి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ, పెసర్ల విత్తనాలతోపాటు ఆయా ప్రాంతాల్లో రైతులకు ఏరకం విత్తనాలు అవసరమో వాటిని కూడా మార్క్‌ఫెడ్ నుంచి తెప్పించుకుంటామని ఈ దుకాణాల ఎఫ్‌పీజీలు పేర్కొంటున్నాయి. సహకార సంఘాలకు సరఫరా చేసినట్లుగానే ఈ దుకాణాలకు మార్క్‌ఫెడ్ రవాణా ఖర్చులు లేకుండా ఎరువులను అందజేస్తుంది. సెర్ప్ ఇచ్చే నిధులు, సభ్యుల వాటాధనంపై.. ఆ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేస్తారు. ఎరువుల అమ్మకం వ్యాపారంలోకి స్వయం సహాయక సంఘాలు ప్రవేశించడంతో..ఎరువుల కొరత ఉండదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడు గ్రూపులు తొలి అడుగు రాష్ట్రంలో ఇలా ఏర్పడిన ఎనిమిది ఎఫ్‌పీజీలు ఎరువుల వ్యాపారం చేసేందుకు ముందుకొచ్చాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని సంతోష ఉమెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూర్‌లోని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలలో చివ్వెంల ఉమెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీల ఎఫ్‌పీజీలు ప్రస్తుతం ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకం ప్రారంభించాయి. ముందుగా ఈ గ్రూపు సభ్యుల వాటా ధనంతో ఎరువులను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఒక్కో దుకాణానికి సెర్ప్ రూ.10 లక్షలు అందజేసింది. ఇక సిద్దిపేట జిల్లాలోని కొయిర్ (నేలతల్లి) ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, మెదక్ జిల్లాలో కోడిపల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, కామారెడ్డి జిల్లాలో తాడ్వాయి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బన ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, రంగారెడ్డి జిల్లాలో యాచారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీలు త్వరలో ఎరువుల వ్యాపారం ప్రారంభించనున్నాయి. రైతులకు అందుబాటులో ఎరువులు మండలంలోని రైతు మహిళా సంఘాల సభ్యుల వాటాధనంతో దుకాణం ప్రారంభించాం. సెర్ప్ నుంచి కూడా ఆర్థిక సాయం అందింది. రైతులకు ఎలాంటి ఎరువులు కావాలన్నా అందుబాటులో ఉంటాయి. ఇక్కడే ఎరువులు తీసుకోవాలని సంఘంలోని సభ్యులకు చెప్పాం. ఇది ఒక రకంగా రైతులకు సేవ చేయడమే. – ధరావత్ పార్వతి, చైర్మన్, చివ్వెంల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఎరువుల కొరత ఉండదు.. మా సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేశాం. దళారులు రైతులను ముంచకుండా మహిళా సంఘాలు ధాన్యం కొనుగోళ్లు చేసి వెంటనే డబ్బులు ఇచ్చాయి. ఇప్పుడు ఎరువులు అమ్ముతున్నాం. రైతులకు ఎరువులు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నయని చెప్పుకునేలా చేయడమే మా లక్ష్యం. ప్రస్తుతం కొద్ది మొత్తంలో ఎరువులు తెచ్చాం. రానున్న రోజుల్లో రైతులకు ఏ ఎరువులు కావాలో అన్నీ తెప్పిస్తాం. – వేములకొండ పద్మ, వైస్ చైర్మన్, చివ్వెంల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ -
సిండి‘కేటు’
అల్లాదుర్గం(మెదక్) : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఎరువుల వ్యాపారుల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఉమ్మడి అల్లాదుర్గం మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో సిండికేట్ దందా ప్రారంభించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతులకు కావల్సిన ఎరువులు, ఫెస్టిసైడ్, విత్తనాలను ఉద్దేరకు ఇస్తూ ఆ డబ్బుపై అధిక వడ్డీలు వేస్తూ మోసం చేస్తున్నారు. దీనికితోడు రైతులు పంట వచ్చిన తర్వాత ఆ పంటను ఉద్దెర ఇచ్చిన ఫర్టిలైజర్ దుకాణాదారులకే విక్రయించాలనే ఒప్పం దంపై ఎరువులు,విత్తనాలు అరువు ఇస్తున్నారు. ధర కూడా వారు చెప్పిన దానికే అమ్మాలి. ఉద్దెర సొమ్ముకు వందకు రూ. 5 వడ్డీని వసూలు చేస్తూ రైతుల నడ్డి విరిస్తున్నారు. పత్తి కొనుగోళ్ల సమయంలోనూ తూకంలో మోసాలకు పాల్ప డుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ దందా అల్లాదుర్గం ఉమ్మడి మండలంలో ఐదేళ్లుగా యథేచ్చగా కోనసాగుతుంది. ఒక్కో గ్రామం ఒక్కో దుకాణం.. ఉమ్మడి అల్లాదుర్గం మండలంలో సుమారు 45 ఫర్టిలైజర్ దుకాణాలున్నాయి. పేరుకు ఇవి ఉన్నా ప్రతి గ్రామంలో అక్రమంగా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారులంత సిండికెట్‌గా మారి యూరియా బస్తాపై 20, నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఉద్దెర తీసుకున్న రైతులు మాత్రం ఏమీ అనడం లేదు. నగదు ఇచ్చి కొనుగోలు చేసే రైతులు ప్రశ్నిస్తే ఇదే ధరకు ఇస్తాం కొంటే , కొనండి లేకుంటే మీ ఇష్టం అని దురుసుగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల బిల్లు మాత్రం ఉన్న రేటు వేసి, అదనంగా వసూలు చేసేది వేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా ఏమీ లాభం లేకుండా పోతుంది. ఈ వ్యాపారులు అందరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఆ గ్రామంలో వేరే దుకాణాల వారు విక్రయించొద్దని నిబంధనలతో విక్రయిస్తున్నారు. ఒక షాప్ వారు అమ్మే ఊరికి వేరే దుకాణాల వారు అమ్మోద్దని నిబంధనతో విక్రయిస్తున్నారు. గ్రామానికో బ్రోకర్.. దుకాణదారులు ఈ మండలంలో ప్రతి గ్రామంలో కొంత మంది బ్రోకర్లుగా పెట్టుకుని అక్రమ ఎరువులు, విత్తనాలు, ఫెస్టిసైడ్ మందులు విక్రయిస్తున్నారు. వట్పల్లి కేంద్రంగా ఎటువంటి అనుమతులు లేకుండా జీరో దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వ్యాపారి కోటి రూపాయలపైనే ఉద్దెర ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వట్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కల్తీ విత్తనాలు అమ్మడంతో ముప్పారం గ్రామానికి చెందిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు విచారణ జరిపినా ఆ వ్యాపారిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు. అధిక ధరలకు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు అటు వైపు కన్నేత్తి చూడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సిండికేట్ వ్యాపారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తీవ్రంగా మోసం చేస్తున్నారు ఫర్టిలైజర్ షాపు యజమానులు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిలువునా మోసం చేస్తున్నారు. ఉద్దెర పెరుతో అధిక ధరలకు మందులకు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి నకిలీ మందులు, విత్తనాలు అమ్ముతున్నారు. గత ఏడాది నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయాం. – నాగరాజు రైతు, ముప్పారం. చర్యలు తీసుకుంటాం.. ఈ సిండికేట్ అక్రమ వ్యాపరం గురించి మా దృష్టికి రాలేదు. మండల వ్యవసాయ అధికారి ద్వారా విచారణ చేపడతాం. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు ఎరువులకు బిల్లులు తప్పని సరిగా తీసుకోవాలి. అధిక ధరలకు విక్రయించినా, అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. –పరుశురాం నాయక్, జిల్లా వ్యవసాయాధికారి -
అందుబాటులో విత్తనాలు, ఎరువులు: పోచారం
సాక్షి, హైదరాబాద్: రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోనే ఉన్నాయని క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేవని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వర్షాధార పంటల సాగు ఆశాజనకంగానే ఉందని, ప్రాజెక్టులు, చెరువుల్లోకి ఇంకా నీరు రానందున వరి నాట్లు మందకొడిగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంటుందన్నారు. వ్యవసాయ యాం త్రీకరణకు ఈ ఏడాది అధిక నిధులను కేటాయించామని, విత్తనం వేసిన దగ్గర నుంచి పంట కోతల వరకు అన్ని పనులు యంత్రాలతోనే జరి గేలా చూడాలని మంత్రి సూచించారు. యం త్రాల ద్వారా సాగు ఖర్చు తగ్గడంతో పాటు కూలీల కొరతను కూడా అధిగమించ వచ్చన్నారు. ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి ఒక్కో క్లస్టర్‌కు వ్యవసాయ విస్తరణ అధికారిని(ఏఈఓ) నియమించినట్లు చెప్పారు. ప్రతి క్లస్టర్లో సాగుకు అవసరమైన యంత్రాల వివరాలను అధికారులు రూపొందించాలన్నారు. రైతు వేదికల నిర్మాణం వేగం పుంజుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ ఎం.జగన్మోహన్, పాల్గొన్నారు. -
ఎరువులపై ధరల దరువు
నెల్లిమర్ల రూరల్ విజయనగరం : ఎరువుల ధరలు రైతులను కలవరపెడుతున్నాయి. ఒకేసారి పదిశాతం మేర ధరలు పెరగడంతో జిల్లా రైతాంగంపై మరో రూ.7 కోట్ల భారం పడనుంది. వాస్తవంగా జీఎస్టీ అమలు సమయంలో ఎరువుల ధరలు తగ్గుతాయనుకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఎరువులపై ఇచ్చే సబ్సీడీలను ఎత్తివేయడంతో మార్కెట్లో రసాయనిక ఎరువులతో పాటు, పురుగు మందుల ధరలు పెరిగిపోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. పెరుగుతున్న పెట్టుబడి వ్యయం... జిల్లాలో 1.92లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. రసాయనిక ఎరువుల కొనుగోలు కోసం ఏటా రూ.71 కోట్ల దాకా ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం ఎరువుల ధరలు మరో 10 శాతం పెరగడంతో రైతులపై మరో.7 కోట్లు భారం పడనుంది. ఫలితంగా రైతులకు పెట్టుబడి భారం తడిసిమోపెడుకానుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎరువుల నియంత్రణపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎరువులు, పురుగుల మందులపై గత ప్రభుత్వాలు సబ్సీడీలు అందిచేవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎరువులపై ఇచ్చే సబ్సీడీలను పూర్తిగా ఎత్తేసింది. పెట్టుబడి రాయితీ కింద పక్క రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు మాత్రం భూసార పరీక్షలు, చంద్రన్న వ్యవసాయ క్షేత్రాలంటూ ప్రచారం కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తూ పంటల సాగుకు ఎలాంటి సహకారం అందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సూక్ష్మ పోషక ఎరువులను ఉచితంగా అందిస్తామని చెప్పిన ప్రభుత్వం వాటిని కూడా సక్రమంగా పంపిణీ చేయడం లేదని విమర్శిస్తున్నారు. పెట్రో ధరల ప్రభావం.... ఎరువుల ధరలపై పెట్రో, డీజిల్ ధరల పెంపు ప్రభావం ఎక్కువుగా చూపుతోంది. పెట్రో ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి వ్యాపారులు మరింత ధరలు పెంచారంటూ రైతులు చెబుతున్నారు. కొనుగోలు తరువాత వాటిని ఇంటికి తెచ్చుకోవాలంతే రవాణా చార్జీలు భారమవుతున్నాయని అంటున్నారు. రవాణా చార్జీల పెంపు వల్ల ఒక్కో బస్తాపై రూ. 100 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోందంటున్నారు. -
రైతులను మోసగిస్తే కఠిన చర్యలు: అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతూ, తూకాల్లో రైతులను మోసం చేస్తున్న వ్యాపార సంస్థలపై తూనికలు కొలతల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆ శాఖ.. నిబంధనలకు విరుద్ధంగా తూకంలో తేడాలు, విత్తన ప్యాకెట్ల పరిమాణంలో హెచ్చుతగ్గులతో విక్రయిస్తున్న పలు కంపెనీలపై కేసులు నమోదు చేసింది. రైతులకు విక్రయించే విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువుల తూకాల్లో మోసాలకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, చట్టపరమైన చర్యలు చేపడతామని తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఇప్పటికే విత్తనాల కంపెనీల మోసాలపై గతవారంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, 154 కేసులు నమోదు చేసి, రూ.2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు. ఇక మీదట ఏ వ్యాపారి అయినా తూకం పేరుతో రైతులను మోసం చేసినా, చేయడానికి ప్రయత్నించినా సహించబోమని, భారీ జరిమానాలు, అరెస్టులు తప్పవని ఆయన హెచ్చరించారు. రైతులు కూడా తమకు జరుగుతున్న మోసాలపై నేరుగా 7330774444 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. -
తూనిక.. రైతు రక్షణకు పూనిక
సాక్షి, హైదరాబాద్: విత్తనాలు, ఎరువుల కొనుగోలులో రైతులు మోసపోకుండా తూనికలు, కొలతల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 4 రోజులుగా విస్తృత తనిఖీలు చేపట్టింది. కొన్ని విత్తన కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి నడుస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. చాలావాటికి తయారీ లైసెన్సు లేకపోవడమేకాకుండా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఎరువుల బస్తాలపై బరువు సూచికల్లో వ్యత్యాసాలున్నట్లుగా కూడా గుర్తించారు. విత్తనాల తయారీ.. గడువు వివరాలు కూడా సంచులపై లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. తయారీ లైసెన్సులు లేకుండానే కొందరు వ్యాపారం చేస్తున్నట్లు, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందని కంట్రోలర్ అకున్ సబర్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి గడిచిన 3 రోజులుగా జరిపిన తనిఖీల్లో 154 కేసులు నమోదు చేసి, రూ. 2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశారు. ఈ కంపెనీలపై జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. ఇదేవిధంగా మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని నిరంతరం తనిఖీలను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. విత్తన కంపెనీల మోసాలకు సంబంధించి ఏ మాత్రం సమాచారమున్నా రైతులు వెంటనే వాట్సప్ నంబర్‌కు 73307 74444కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
గ్రామగ్రామాన ‘పెట్టుబడి’ దందా!
మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీప గ్రామంలో పదెకరాల భూమి ఉన్న రైతు కృష్ణమోహన్. రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున వస్తుందని ఆశపడుతున్నాడు. ఇటీవల ఓ రోజు ఆ గ్రామ కార్యదర్శి ఫోన్ చేసి ఎకరానికి రూ.400 చొప్పున రూ.4 వేలు ఇస్తేనే పెట్టుబడి సొమ్ము వస్తుందని, లేకుంటే తామేమీ చేయలేమని బెదిరించాడు. రూ.4 వేలు కోసం రూ.40 వేల పెట్టుబడిని పోగొట్టుకోలేక ఆ రైతు గ్రామ కార్యదర్శికి అడిగినంత ముట్టజెప్పుకున్నాడు. మరో రైతు రంగారెడ్డి. ఖమ్మం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈయన గ్రామం. ఇప్పటివరకు భూములకు పట్టాలివ్వలేదు. ఈ నేపథ్యంలో పట్టాదారు పాసు పుస్తకం రావాలన్నా, పెట్టుబడి సొమ్ము అందాలన్నా ఎకరానికి రూ.500 ఇవ్వాలని స్థానిక రెవెన్యూ అధికారి ఒకరు డిమాండ్ చేస్తున్నారని ఆయన చెబుతున్నాడు. దీంతో గత్యంతరం లేక లంచం ముట్టజెప్పుకునేందుకు రంగారెడ్డి సిద్ధమయ్యాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడి దందా సాగుతోంది. వచ్చే నెల 19వ తేదీ నుంచి రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున అందజేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. 1.62 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సొమ్ము అందజేయనున్నారు. సమయం సమీపిస్తుండటంతో అనేకచోట్ల అధికారులు దందాలు మొదలుపెట్టారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులు కొందరు లంచాలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లంచాలు ఇవ్వకుంటే అడ్డుపుల్ల వేస్తారన్న భయంతో రైతులు గత్యంతరం లేక అడిగినంత ఇచ్చేస్తున్నారు. ఈ వ్యవహారం చాపకింద నీరులా జరుగుతోంది. ఇలా అధికారులు లంచం తీసుకున్నారని తమ పేరు, గ్రామం వెల్లడిస్తే పెట్టుబడి సొమ్ము రాదని రైతులు వేడుకుంటున్నారు. లంచం ఇచ్చినా బయటకు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. లంచం ఇస్తే.. మేనేజ్ చేస్తాం.. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా వ్యవసాయ సంబంధిత ఖర్చుల కోసం.. ఖరీ ఫ్, రబీలకు కలిపి ఎకరాకు రూ.8 వేల చొప్పు న ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. డబ్బులిస్తే రైతులకు అందుతా యో లేదోనని భావించిన సర్కారు.. చివరకు చెక్కులు ఇవ్వాలని, అవి కూడా గ్రామ సభ లో ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చెక్కులు పంపిణీ కావడానికే ముందే రైతుల నుంచి లంచాలు వసూలు చేయాలని కొన్ని చోట్ల రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు పన్నాగాలు చేస్తున్నారు. ‘నీ భూమి సాగుకు యోగ్యంగా లేదు. అలా అని రికార్డుల్లో రాసేస్తే నీకు పెట్టుబడి సాయం రాదు. లంచమిస్తే మేనేజ్ చేస్తాం’అంటూ రైతులను బెదిరిస్తున్నారు. ఇప్పటికీ ప్రభు త్వం పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వనందున రైతుల్లో ఆందోళన నెలకొంది. దీన్నే అవకాశంగా తీసుకొని రెవెన్యూ అధికారులు పలుచోట్ల ‘నీకు పట్టాదారు పాసుపుస్తకం, పెట్టుబడి సొమ్ము రావాలంటే ముట్టజెప్పుకోవాల్సిందే’ అంటూ హెచ్చరిస్తున్నారు. భయ పెడుతూ వసూళ్లు సాగిస్తున్నారు. చూసీచూడనట్లుగా రైతు సమితులు పెట్టుబడి సొమ్ము రైతులకు సక్రమంగా పంపిణీ చేయడంలో రైతు సమన్వయ సమితులు కీలకపాత్ర పోషించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒక్కో గ్రామంలో 15 మందితో రైతు సమితులను ఏర్పాటు చేసింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 1.61 లక్షల మంది రైతు సమన్వయ సమితుల్లో సభ్యులున్నారు. అయితే గ్రామాల్లో పెట్టుబడి దందా యథేచ్ఛగా మొదలైనా రైతు సమితి సభ్యులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు రైతు సమితి సభ్యులను కూడా మచ్చిక చేసుకొని దందా కొనసాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. -
ఎరువుల ఖర్చు తగ్గించే సరికొత్త గ్రాఫీన్.
రైతులకు ఉన్న అనేకానేక కష్టాల్లో ఎరువుల ఖర్చు ఒకటి. పోనీ ఇంత ఖర్చు పెట్టి వేసిన ఎరువులు పూర్తిస్థాయిలో ఫలితమిస్తాయా? అంటే అదీ లేదు. వానొస్తే లేదా నీళ్లల్లో కలిస్తే ఎరువులు వాటితో కొట్టుకుపోతాయి. ఈ నేపథ్యంలో అడిలైడ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గ్రాఫీన్ ఆక్సైడ్ పదార్థం ఆధారంగా కొత్త రకం ఎరువులను తయారు చేశారు. భూమిలోకి చేరిన తరువాత ఇవి చాలా నెమ్మదిగా తమ లోపల ఉండే ఎరువులను విడుదల చేస్తాయి. సాధారణ ఎరువులు కేవలం 12 నుంచి 24 గంటల్లోపు వాటిలోని పోషకాలన్నింటినీ విడుదల చేసేస్తాయి. ఈ క్రమంలో అవసరమైన సమయంలో మొక్కలకు ఎరువులు అందే అవకాశం లేకుండా పోతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైక్ మెక్లాగిన్ తెలిపారు. అయితే గ్రాఫీన్ ఆక్సైడ్ ఆధారంగా తయారైన ఎరువులు నెలరోజుల వరకూ పోషకాలను నెమ్మదిగా విడుదల చేసేలా తయారు చేసుకోవచ్చునని మైక్ తెలిపారు. తాము తమ పరిశోధనల్లో జింక్, కాపర్ వంటి సూక్ష్మపోషకాలను గ్రాఫీన్ ఆక్సైడ్ ద్వారా గోధుమ పంటకు అందించారు. సాధారణ ఎరువులతో పండుతున్న పంటలతో పోల్చి చూసినప్పుడు గ్రాఫీన్ ఆక్సైడ్ ఎరువులు వాడిన పంటల్లో ఈ రెండు సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని మైక్ వివరించారు. భూమిలో ఉండే సేంద్రియ కార్బన్ నిర్మాణాన్ని దగ్గరగా పోలి ఉండటం వల్ల గ్రాఫీన్ ఆక్సైడ్ వాడకం పర్యావరణపరమైన సమస్యలేవీ సృష్టించదని మైక్ అంటున్నారు. -
‘ఎరువుల సబ్సిడీ కంపెనీలకే’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యక్ష నగదు బదిలీ కింద ఎరువుల సబ్సిడీ లబ్ధిదారులకు కాకుండా ఫెర్టిలైజర్ కంపెనీలకే విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.లబ్ధిదారులకు రిటైలర్లు ఎరువులు విక్రయించిన అనంతరం సబ్సిడీని ఆయా కంపెనీలకు చెల్లిస్తామని ఎరువులు, రసాయనాల మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు.ఈ వ్యవహారంపై లోతైన విశ్లేషణ జరిపిన నీతి ఆయోగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఎల్పీజీ తరహాలో సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు అందచేయడం ఎరువుల సబ్సిడీ విషయంలో సాధ్యపడదని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో దశలవారీగా ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని ప్రత్యక్ష నగదు బదిలీని ప్రవేశపెడుతుందని చెప్పారు. రిటైలర్లు లబ్ధిదారులకు విక్రయించిన ఎరువుల ఆధారంగా సబ్సిడీని గ్రేడ్ల వారీగా ఆయా ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఆధార్ కార్డులు లేని లబ్ధిదారులు సైతం కిసాన్ క్రెడిట్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులు చూపి సబ్సిడీపై ఎరువులను కొనుగోలు చేయవచ్చని మంత్రి చెప్పారు. -
ఇకపై 45 కేజీల యూరియా బస్తాలు
న్యూఢిల్లీ: యూరియా వినియోగం తగ్గించేందుకు, ఎరువుల వినియోగంలో సమతూకం పాటించే లక్ష్యంతో ఇకపై యూరియా బస్తాల్ని 50 కేజీలు కాకుండా 45 కేజీల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 45 కేజీల బస్తాల అమ్మకం మార్చి 1, 2018 నుంచే అమల్లోకి వచ్చిందని, అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న 50 కేజీల బస్తాల్ని వచ్చే రెండు నెలలు అమ్ముకునేందుకు అనుమతిస్తామని ఎరువుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హెక్టారు పొలానికి బస్తాల లెక్కన యూరియాను రైతులు వాడుతున్నారని, వినియోగం తగ్గించమని చెప్పినా వినడం లేదని.. అందువల్లే 45 కేజీల బస్తాల్ని విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. పన్నులు జతచేయకుండా 45 కేజీల యూరియా బస్తాను రూ. 242కు విక్రయిస్తారని నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. టన్ను యూరియాకు ప్రభుత్వం నిర్ణయించి న రూ. 5360 ధరకు అనుగుణంగా బస్తా రేటును నిర్ణయిస్తున్నారు. కాగా 25 కేజీలకు మించకుండా బస్తాల్ని విక్రయించేందుకు డీలర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ప్యాకింగ్ కోసం 2 కేజీల యూరియాకు రూ. 1.50, 5 కేజీలకు రూ.2.25, 10 కేజీలకు రూ. 3.50, 25 కేజీలకు రూ. 5లు డీలర్లు వసూలు చేసుకోవచ్చు. -
పురుగు మందు కొంటేనే యూరియా!
సాక్షి, హైదరాబాద్: ఎరువుల కంపెనీలు రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాల్సిందేనని షరతు పెడుతున్నాయి. ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచి యూరియాతోపాటు ఇతర ఎరువులను అంటగడుతున్నాయి. దీంతో రైతులు అవసరం లేకున్నా ఇతర ఎరువులను కొంటున్నారు. ఎడాపెడా ఎరువులు, పురుగు మందులు వాడాల్సిన పరిస్థితిని కంపెనీలు రైతులకు సృష్టిస్తున్నాయి. తద్వారా వివిధ ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. రైతులకు సాగు ఖర్చు పెరిగి నష్టం చవిచూసే పరిస్థితి ఏర్పడుతోంది. ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖాధికారులు చోద్యం చూస్తున్నారు. కొంప ముంచుతున్న టార్గెట్లు రబీలో 98 శాతం పంటలు సాగయ్యాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు లక్ష్యానికి మించి నాట్లు పడ్డాయి. సాగు ఊపందుకోవడంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. యూరియా కూడా ప్రస్తుత లక్ష్యానికి మించి అందుబాటులో ఉంది. కాని కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెడుతుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచి అంటగడుతున్నారు. ఖమ్మంలో ఒక ప్రముఖ కంపెనీ రూ.1.08 లక్షల విలువ చేసే ఒక లారీ (400 బస్తాల) యూరియాను డీలర్‌కు అమ్మితే, దాంతోపాటు కచ్చితంగా రూ.50 వేల విలువైన ఇతర ఎరువులను అంటగడుతోంది. ఈ టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నారు. హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు ఏర్పాటు చేస్తున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతోపాటు ఫలానా ఎరువు, పురుగు మందు వాడితే ప్రయోజనం ఉంటుందంటూ రైతులను డీలర్లు మభ్యపెడుతున్నారు. వాస్తవానికి యూరియాతోపాటు ఇతర ఎరువులు, పురుగు మందులను లింక్ పెట్టి విక్రయించకూడదని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ దాన్ని వ్యవసాయాధికారులు అమలు చేయకుండా చోద్యం చూస్తున్నారు. పైగా జిల్లాల్లో కంపెనీలకు, వ్యవసాయాధికారులకు మధ్య సంబంధాలు ఉంటాయి. ఈ తతంగం గురించి తెలిసినా వారు మిన్నకుంటున్నారు. కొందరు వ్యవసాయాధికారులకు కమీషన్లు అందుతుండటం వల్లే ఈ దందా ఇష్టారాజ్యంగా జరుగుతోంది. మండల వ్యవసాయాధికారి ప్రిస్కిప్షన్ ఉంటేనే ఎరువులు, పురుగు మందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా.. అది అమలు కావట్లేదు. గుళికలు కొనాలి యూరియా కొనాలంటే అదనంగా గులికలు కొనాలని వ్యాపారులు అంటున్నారు. ప్రభుత్వం సబ్సీడీపై ఇచ్చే యూరియాపై వ్యాపారులు అదనంగా లాభం పొందడానికి రైతులను ఇబ్బందుల పాలుచేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. –సీహెచ్ రాంచందర్, రైతు సంఘం నాయకుడు, దేవరకద్ర నియంత్రణ ఏదీ ఎరువుల దుకాణాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే రైతులను వ్యాపారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏది కొనాలన్నా అదనంగా ఇతర ఎరువులు కొనాలంటున్నారు. దీన్ని నివారించాలి. –కొండారెడ్డి, రైతు, వెంకటగిరి కఠిన చర్యలు తీసుకుంటాం: యూరియాతోపాటు ఇతర ఎరువులను విక్రయిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై జిల్లా వ్యవసాయాధికారులతో మాట్లాడుతాం. యూరియాతోపాటు ఇతర ఎరువులను లింక్ పెట్టి అమ్మినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ జగన్మోహన్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఇక.. చీటీ ఉంటేనే మందులు!
సాక్షి, తాండూరు : ఇక.. ఇష్టారాజ్యంగా పంటలపై మందుల వినియోగానికి చెక్ పడనుంది. వ్యవసాయాధికారులు అగ్రి వైద్యులుగా మారనున్నారు. ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ దుకాణాలు అగ్రి మెడికల్ షాపులుగా మారనున్నాయి. రైతులు పంటలకు అధిక మోతాదు మందులు వినియోగించి నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీంతో పురుగులమందు దుకాణాలు అగ్రి మెడికల్ దుకాణాలుగా మారనున్నాయి. వ్యవసాయాధికారులు చీటీ ఇస్తేనే ఇకపై మందులు ఇచ్చే పద్ధతి అమలులోకి రానుంది. జిల్లాలో 18 మండలాలు, 501 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 7లక్షల ఎకరాలు సాగుకు అమోదయోగ్యమైన భూములు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1.74లక్షల హెక్టార్లలో కంది, మినుము, వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఏటా పురుగుమందులు వినియోగం పెరిగిపోతుంది. ఇప్పటివరకు రైతులు పురుగుమందులను దుకాణదారుల సూచన మేరకు వినియోగించేవారు. ఈక్రమంలో ఒక్కోసారి అధికమొత్తంలో కూడా ఉపయోగిస్తూ తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన సర్కారు కొత్త పద్ధతిని అమలులోకి తీసుకురానుంది. ఇకపై ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే.. పంటల దిగుబడి అధికంగా రావాలనే ఉద్దేశంతో రైతులు పంటలకు రసాయన మందులను అధిక మోతాదుతో వినియోగించి తీవ్రంగా నష్టపోతున్నారు. పంటకు పురుగు ఆశించిందని నేరుగా మందుల దుకాణాదారులను అడిగి వారు ఇచ్చిన మేరకు పిచికారీ చేస్తుండేవారు. ఈనేపథ్యంలో రైతులకు దుకాణాదారులు నకిలీ మందులను సైతం అంటగట్టేవారు. తద్వారా వేల హెక్టార్లలో పంట నష్టం జరుగుతోంది. ఈనేపథ్యంలో తీవ్రనష్టాలకు గురై కొన్నిసందర్భాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలూ లేకపోలేదు. దీం తో ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చర్యల కు ఉపక్రమించింది. ఇకపై వ్యవసాయ అధికారులు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయా లు చేయకుండా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాదారులకు ఉత్తర్వులు జారీ చేయనుంది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి.. జిల్లాలో ఉన్న రసాయనిక పురుగుమందు, ఎరువుల దుకాణాల్లో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి విత్తనం విత్తే నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు అవసరమైన మందులను వ్యవసాయాధికారులు సూచనల మేరకు దుకాణాదారులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఈఓల కొరత.. జిల్లాలో 501 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 99 వ్యవసాయ క్లస్టర్లుగా ఉండాలి. అయితే, ప్రస్తుతం జిల్లాలో 53 క్లస్టర్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ఒక్కో క్లస్టర్లో 5వేల ఎకరాలకు ఒక ఏఈఓ అందుబాటులో ఉండాలి. కాగా, జిల్లాలో 44 మంది ఏఈఓలు విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయాధికారులకు ఇప్పటికే తలకు మించిన భారం ఉండటంతో పని ఒత్తిడి తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందుల చీటీ రాసి ఇవ్వడం మంచిదే అయినా, ఈ పద్ధతి నిర్వహణలో ఇబ్బందులు తప్పేలా లేవని క్షేత్రస్థాయిలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. చీటీ రాసి ఇస్తేనే మందులు.. రైతులు పండిస్తున్న పంటలకు పిచికారీ చేసేందుకు వ్యవసాధికారులు చీటీ రాసి ఇవ్వాల ని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో ఏఈఓల కొరత ఉంది. ప్రభుత్వం త్వరలో ఏఈఓలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏఈఓలు బీజీగా ఉన్నారు. అయినప్పటికీ ఈ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. –గోపాల్, వ్యవసాయాధికారి,వికారాబాద్ జిల్లా -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
అమలాపురం టౌన్: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు అమలాపురంలోని పలు ఎరువుల దుకాణాల్లో గురువరం ఆకస్మిక దాడులు చేశారు. ప్రధానంగా రెండు ఎరువుల దుకాణాలపై దాడులు చేసి స్టాక్‌లు, బిల్లులను తనిఖీ చేశారు. పట్టణంలోని అనంత లక్ష్మి సీడ్స్, గంగా సీడ్స్‌కు చెందిన ఎరువుల దుకాణాల్లో ఈ దాడులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాగాయి. విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆదేశాల మేరకు సీఐ టి.రామమోహనరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురంలో ఈ దాడులు, తనిఖీలు జరిగాయి. ఈ రెండు దుకాణాలకు ఆయా కంపెనీల నుంచి వచ్చిన ఎరువుల స్టాక్‌కు గోడౌన్లలో ఉన్న స్టాక్‌కు లెక్కలు తేడా వచ్చాయని విజిలెన్స్ సీఐ రామ్మోహనరెడ్డి తెలిపారు. అలాగే రైతులకు అమ్మిన ఎరువులను బిల్లులను కూడా తనిఖీ చేశారు. స్టాక్‌లు, బిల్లుల పరంగా తేడాలు ఉండడంతో ఆ రెండు దుకాణాల్లో రూ.8.33 లక్షల విలువైన ఎరువు బస్తాలను సీజ్ చేశామని సీఐ వెల్లడించారు. ఎరువులు కొనుగోలు చేసి వెళుతున్న కొంత మంది రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఏఓ మహేష్ భగవత్, రెవెన్యూ అధికారులతో కలిసి ఈ తనిఖీలు చేశారు. పట్టణంలోని కొన్ని ప్రముఖ ఎరువుల దుకాణాలను కూడా సోదాలు చేశారు. -
యూరియా.. రైతుపై లేదు దయ
సాక్షి, హైదరాబాద్: ఇలా రాష్ట్రవ్యాప్తంగా యూరియా దందా నడుస్తోంది. ఎరువుల డీలర్లు, అధికారులు, కంపెనీల ప్రతినిధులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి రైతు నోట్లో మట్టి కొడుతున్నారు. రూ.లక్షలు బొక్కేస్తున్నారు. 50 కిలోల యూరియా బస్తా గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) రూ.295 మాత్రమే. ఆ యూరియా బస్తాను దుకాణదారులకు రూ.265కు ఇవ్వాలి. కానీ దళారులు, అధికారులు, కంపెనీల ప్రతినిధులు సిండికేటుగా ఏర్పడి ఎరువుల దుకాణదారులకు అధిక ధరలకు అంటగడుతున్నారు. దీంతో దుకాణాదారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. తగినంతగా యూరియా సరఫరా కావటం లేదని, కంపెనీలు పంపడంలేదని రైతులకు చెబుతున్నారు. యూరియాతోపాటు, కాం ప్లెక్స్ ఎరువుల పరిస్థితి కూడా అలాగే ఉందని ప్రచారం చేస్తున్నారు. కొరత లేదు.. కానీ.. రబీ అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31,92 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 27.07 లక్షల (85%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 15 లక్షల (98%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. సాగు ఊపందుకోవడంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. రబీలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 5.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. అందులో ఇప్పటివరకు 3.59 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలకు ఇవ్వాల్సి ఉండగా, 3.50 లక్షల మెట్రిక్ టన్నులను అందజేసింది. ఇదిగాక పాత యూరియా 1.69 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే అందుబాటులో ఉంది. మొత్తంగా 4.19 లక్షల టన్నులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే ప్రస్తుత లక్ష్యానికి మించి యూరియా అందుబాటులో ఉంది. ఇందులో మార్క్‌ఫెడ్ 1.07 లక్షల మెట్రిక్ టన్నులు, మిగిలినవి వ్యవసాయ శాఖ ద్వారా వివిధ కంపెనీలు జిల్లాలకు సరఫరా చేశాయి. ఇంత అందుబాటులో ఉన్నా సరఫరా వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో దందాలు మొదలయ్యాయి. కమీషన్లకు కక్కుర్తి.. మార్క్‌ఫెడ్ నుంచి ప్రాథమిక సహకార సంఘాలు, దాని లైసెన్సుదారుల ద్వారా యూరియా సరఫరా కావాలి. వ్యవసాయశాఖ అనుమతి మేరకు కంపెనీల నుంచి ఎరువుల డీలర్లకు సరఫరా కావాలి. మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులు, కంపెనీల ప్రతినిధులే సరఫరాలో కీలకం కావడంతో వారే కృత్రిమ కొరత సృష్టించి కమీషన్లు ఇచ్చిన వారికే సరఫరా చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో యూరియాను నల్ల బజారుకు తరలిస్తున్నారు. కింది నుంచి పైస్థాయి వరకు దందాలు జరుగుతుండటం, ముడుపులు తీసుకుంటుండటంతో ఎవరూ నోరు మెదపడంలేదు. ఖమ్మం జిల్లా మార్క్‌ఫెడ్‌కు చెందిన అధికారి ఒకరు ఎరువుల దుకాణాలకు అక్రమంగా యూరియా సరఫరా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అలా సరఫరా చేసినందుకు ఒక లారీకి రూ.10 వేల చొప్పున కమీషన్ వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి. అలాగైతేనే యూరియా సరఫరా చేస్తానని బెదిరిస్తున్నారంటూ వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఆ కమీషన్ ప్రభావం రైతులపై పడుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఒక కీలకమైన ఎరువుల కంపెనీకి సంబంధించిన ఆ జిల్లా ప్రతినిధి ఒకరు యూరియాను కమీషన్లు తీసుకొని దళారులకు అప్పగిస్తున్నాడు. ఆ దళారీ దుకాణాలకు అధిక ధరలకు అమ్ముకుంటున్నాడు. ఈయన పేరు కట్ల రాంబాబు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చెర్ల గ్రామానికి చెందిన రైతు. దుకాణాల్లో యూరియా బస్తా రూ.330 నుంచి రూ.340 వరకు విక్రయిస్తున్నారని తెలిపాడు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పైగా నాణ్యతలేని, నిల్వ చేసిన యూరియాను విక్రయిస్తున్నారని రాంబాబు చెప్పాడు. మిర్యాలగూడకు చెందిన రైతు టి.వెంకటయ్య బస్తాను రూ.350కు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ఇదేమని అడిగితే ఎరువుల దుకాణదారులకే రూ.320కు వస్తుందని చెబుతున్నారని, లాభం వేసుకొని రూ.350కు బస్తా ఇచ్చినట్లు వివరించాడు. తప్పని పరిస్థితిలో కొన్నా నాగార్జున సాగర్ నీటిని ఆరుతడి పంటలకు విడుదల చేయటంతో రెండెకరాల్లో వేరుశనగ వేశా. అందుకోసం ఒక్కో బస్తా యూరియా రూ.330 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చింది. అసలు ధర రూ.295 కాగా ఎందుకింత ధర అని వ్యాపారిని ప్రశ్నిస్తే.. రవాణా చార్జీలు ఉంటాయని చెప్పాడు. దీంతో తప్పని పరిస్థితిలో రూ.330కు యూరియా కొనుగోలు చేయాల్సి వచ్చింది. – బుంగ లింగయ్య, వందనం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా -
అధిక ధరలకు ఎరువులమ్మితే లైసెన్సు రద్దు
సాక్షి, హైదరాబాద్: ఎరువులను అధిక ధరలకు విక్రయించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్లకు లేఖ రాశారు. ఎరువుల కొరతేమీలేదని పేర్కొన్నారు. ఎరువులను గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ) కంటే ఎక్కువ ధరకు ఎక్కడైనా విక్రయించినట్లు తేలితే కఠినచర్యలు తీసుకోవాలన్నారు. డీఏపీ సహా ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు పెంచిన నేపథ్యంలో పాతస్టాక్‌ను పాత ధరల్లోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత ఎరువులను విక్రయించిన తర్వాతే కొత్తవాటిని రైతులకు విక్రయించాలని పేర్కొన్నారు. ఈ మేరకు విక్రయాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే పెరిగిన ధరలు అమలులోకి వచ్చినందున పీవోఎస్ యంత్రాల ద్వారా విక్రయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎరువుల డీలర్లు పాత, కొత్త స్టాకు ధరలను దుకాణాల ముందు రైతులకు కనిపించేలా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఎరువుల దుకాణాలను పర్యవేక్షించేలా మండల వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీచేయాలన్నారు. దుకాణాల రికార్డు బుక్కుల్లో పాత, కొత్త స్టాకు వివరాలు సరిగా ఉన్నాయో... లేవో పరిశీలించాలని సూచించారు. -
సబ్సిడీ విత్తనాలు.. 12 లక్షల క్వింటాళ్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వ్యవసాయ సీజన్‌కు 12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఆయా విత్తనాలను ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై సరఫరా చేయనుంది. ఖరీఫ్‌కు 7.5 లక్షలు, రబీకి 4.5 లక్షల విత్తనాలను సరఫరా చేయనుంది. 2017–18 వ్యవసాయ సీజన్లో 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2018–19 సీజన్లో అదనంగా 2 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. వచ్చే ఖరీఫ్ నుంచి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి పథకాన్ని వర్తింప చేయనున్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. ప్రభు త్వ అంచనా ప్రకారం 1.62 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది. సాగు పెరుగనున్న క్రమం లో విత్తన పరిమాణం కూడా పెంచినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. 17 రకాల విత్తనాలను ఖరీఫ్, రబీలకు ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయనుంది. వీటిని 33 నుంచి 50 శాతం వరకు సబ్సిడీపై రైతులకు అందిస్తుంది. రైతు కోరుకునే విత్తనాలేవీ? ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే కొన్ని రకాల విత్తనాలను రైతులు పెద్దగా కోరుకునే పరిస్థితి లేదు. మొక్కజొన్నలో కొన్ని హైబ్రిడ్ రకాలకు బాగా డిమాండ్ ఉంది. ప్రభుత్వం సరఫరా చేసే మొక్కజొన్నకు డిమాండ్ లేకపోవడంతో రైతులు పెద్దగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. -
ఎరువు.. బరువు
గత ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలించలేదు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పంటలకు చీడపీడలు, దోమపోటు.. అరకొర పంటలు చేతికొచ్చినా గిట్టుబాటు ధర దక్కలేదు. పెట్టుబడి అప్పులకు వడ్డీ పెరిగి తడిసి మోపెడయింది. దీనికితోడు కాంప్లెక్స్ ఎరువుల ధర పెంపు నిర్ణయం రబీ ఆశలపై నీళ్లు చల్లింది. వెరసి రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. బూర్గంపాడు : ఖరీఫ్ కలిసిరాకపోవడంతో రైతులు ఆశలన్నీ రబీపై పెట్టుకుని సాగుకు ఉపక్రమించారు. తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచేందుకు ఆయా కంపెనీలు నిర్ణయించడంతో ఆందోళన మొదలైంది. ఫిబ్రవరి నుంచి ఎరువుల ధరలు పెరుగుతాయని డీలర్లు చెబుతున్నారు. ప్రభుత్వపరంగా ఎరువుల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఎరువుల తయారీలో వినియోగించే ముడిసరుకు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగటంతో ఎరువుల కంపెనీలు ధరలను పెంచేందుకు నిర్ణయించుకున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరలను సుమారు 10శాతానికి పైగానే పెంచేందుకు కంపెనీలు నిర్ణయించాయి. డీఏపీ ధర ప్రస్తుతం రూ. 1100 వరకు ఉంది. దీని ధర సుమారు రూ.125 వరకు పెరిగే అవకాశముంది. రైతులు అధికంగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువు 20:20:00:13 ధర బస్తా ప్రస్తుతం రూ 900 వరకు ఉంది. దీని ధర సుమారు రూ 100 వరకు పెరిగే అవకాశముంది. 28:28:00 ధర కూడా రూ.125 వరకు పెరగవచ్చు. వీటితో పాటు 14:35:14 ధర రూ. 130, 10:26:26 ధర రూ 110 వరకు, 17:17:17 ధర రూ 70 వరకు పెరిగే అవకాశాలున్నట్లు డీలర్లు రైతులకు ముందుగానే తెలియపరుస్తున్నారు. పెరగనున్న ధరలు రబీసాగు రైతులకు భారం కానున్నాయి. రైతులకు పెరగనున్న పెట్టుబడి భారం జిల్లావ్యాప్తంగా రబీలో సుమారు 11 వేల హెక్టార్లలో వరిపంట సాగుచేస్తున్నారు. 1200 హెక్టార్లలో మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ఇవిగాక కూరగాయలు, అపరాలు మొత్తం కలిపి మరో 2500 హెక్టార్లలో రబీలో సాగుచేస్తున్నారు. రబీ పంటల సాగు మొదలై కేవలం నెలరోజులు కావస్తోంది. రైతులు మొదటిధపా ఎరువులు మాత్రమే వేసుకున్నారు. ఇంకా రెండో, మూడో విడతల్లో పంటలకు ఎరువులు వేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచితే రైతులపై ఎకరాకు కనీసం రూ.400కు పైగానే భారంపడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్నటువంటి కాంప్లెక్స్ ఎరువులను పాతధరలకే విక్రయించాల్సిఉంది. కొత్తగా వచ్చేటువంటి ఎరువుల స్టాక్ మాత్రం కొత్తరేట్లలో అమ్మకాలు చేయాల్సిఉంటుందని డీలర్లు చెబుతున్నారు. పెట్టుబడులకు కటకటలాడుతున్న సమయంలో ఎరువుల ధరలు పెంచితే సాగు భారమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలను పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ముద్ర వేస్తేనే ముద్ద!
సాక్షి, మహబూబ్‌నగర్: పంటల సాగుతో రైతులకు అవసరమయ్యే రసాయన ఎరువుల విషయంలో పక్కదారి పట్టకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. అయినా తరచుగా అక్రమాలు బయటపడుతున్నట్లు ప్రభుత్వాలు గుర్తించాయి. గతంలో పలు సీజన్లలో కొందరు వ్యాపారులు ఎరువులను మిక్సింగ్ ప్లాంట్లకు అమ్ముకోవడంతో కృత్రిమ కొరతను ఏర్పడడమే కాకుండా రాయితీ ఎరువులు పక్కదారి పట్టాయి. ఈమేరకు ఈనెల 1నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తె చ్చాయి. రైతు ఆధార్ కార్డుతో వస్తే నంబ ర్ నమోదు చేశాక, వేలిముద్రతో సరిచూసుకున్నాకే ఎరువులు అందజేసే విధానం ప్రస్తుతం జిల్లాలో ప్రారంభమైంది. ఈ విధానం ద్వారా ఎరువులపై కేంద్రప్రభు త్వం ఇచ్చే సబ్సిడీ దుర్వినియోగం కాకుం డా ఉంటుందన్నది ప్రభుత్వ ఆలోచన. జిల్లాలో 192 దుకాణాలు జిల్లావ్యాప్తంగా ఎరువులు, పురుగు మందులు అమ్మే ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులు 192 ఉన్నాయి. ఆయా షాపుల యజమాన్యాలకు నూతన విధానాన్ని అమలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఆధార్ నంబర్, వేలిముద్రల నమోదుకు అవసరమైన పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను 173 షాపులకు వ్యవసాయ శాఖ పంపిణీ చేసింది. అలాగే, ఈ విధానంలో ఎరువుల విక్రయాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కట్టు తప్పితే లైసెన్స్ రద్దు బయోమెట్రిక్ విధానాన్ని పాటించకుండా ఏ వ్యాపారి కూడా ఎరువులను విక్రయించొద్దని అధికారులు ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే లైసెన్సు రద్దు చేయమని కలెక్టర్ రొనాల్డ్‌రాస్ ఇటీవల జరిగిన సమీక్షలో వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వ్యాపారులకు అందజేసిన ఈ–పోస్ యంత్రాల్లో ఆధార్ నంబర్ నమోదు చేయడంతో పాటు రైతు వేలిముద్ర వేశాక సరిపోలితేనే వారికి కావాల్సిన ఎరువులు అందజేస్తారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన యంత్రాలను అందజేశారు. ప్రస్తుతానికి రైతులు నగదు ద్వారానే కొనేలా పీఓఎస్ యంత్రాల సాప్ట్వేర్ ఉందని.. త్వరలోనే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనేందుకు యంత్రాల్లో మార్పులు చేస్తారని డీఏఓ సుచరిత ‘సాక్షి’కి తెలిపారు. ఈ సీజన్‌కు 30 వేల మెట్రిక్ టన్నులు జిల్లాలో వర్షాకాలం చివర్లో భారీగా వర్షా లు కురవడంతో చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో భూగ ర్భ జలాల మట్టం పెరగడంతో బోరుబావుల్లోనూ నీరు లభ్యత ఉంది. అలాగే ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24గంట ల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తుండడం తో ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్లో వరి 30 వేల హెక్టార్లు, వేరుశనగ 30వేల హె క్టార్ల విస్లీర్ణం సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా 30 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని భావించి అందుబాటులో ఉంచారు. ఆధార్ కార్డు ఉంటేనే ఎరువులు రైతులకు ఎరువులు కొనాలంటే దుకాణానికి అధార్‌కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. ఈ విధానంలో రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే మండల వ్యవసాయధికారి లేదా విస్తరణ అధికారులను సంప్రదించాలి. బయోమెట్రిక్ ద్వారా విజయవంతంగా రైతులకు ఎరువులను అమ్మేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా సాంకేతిక సమస్య ఎదురైతే వెంటనే అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా వ్యాపారులు రైతులను ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి -
‘ఆధార్’ ఉంటేనే ఎరువులు
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఎరువుల అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఆధార్‌ను అనుసంధానం చేసింది. ఇకపై ఆధార్ ఉంటేనే రైతులకు ఎరువులను సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియ నేటి నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే జిల్లాలోని ఎరువుల డీలర్లలకు ఆపరేటింగ్ సెల్ మిషన్ల (పీవోఎస్)ను అందజేశారు. అన్ని ఎరువుల దుకాణాల యజమానులు ఈ ప్రక్రియను జనవరి నుంచి కచ్ఛితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి దుకాణాల లైసెన్సు రద్దు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఎరువుల సబ్సిడీ దుర్వినియోగం కాకుండా ఈ పద్ధతి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 1,05,600 మంది రైతులు ఉన్నారు. లక్షా 97 వేల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో లక్షా 32 వేల హెక్టార్లలో పత్తి, 23 వేల హెక్టార్లలో సోయా, 19 వేల హెక్టార్లలో కందులు, 5 వేల హెక్టార్లలో జొన్న, 2 వేల హెక్టార్లలో మినుములు, 16 వందల హెక్టార్లలో పెసరి, 3 వేల హెక్టార్లలో ఇతర పంటలు సాగవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నుల యూనియా, 10 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 15 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 5 వేల మెట్రిక్ టన్నుల పొటాషియం, 5 వేల మెట్రిక్ టన్నుల పాస్పరస్ అవసరం అవుతుంది. అలాగే రబీ సీజన్లో 4,700 మెట్రిక్ టన్నుల యూరియా, 2780 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1900 మెట్రిక్ టన్నుల పొటాషియం, 3,400 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం. ఎప్పటికప్పుడు సమాచారం.. పీవోఎస్ మిషన్లలో రైతుల ఆధార్ నంబర్, వారి పంట భూమి వివరాలను నమోదు చేశారు. రై తుకున్న వ్యవసాయాన్ని బట్టి మాత్రమే ఎరువులలు ఇస్తారు. ఆధార్‌కార్డు లేకుంటే ఎరువులను విక్రయించరు. జిల్లాకు ఎన్ని ఎరువులు వచ్చాయి.. ఎన్ని మంది రైతులు ఏయే ఎరువులు కొ నుగోలు చేశారు. ఇంకా ఎంత స్టాక్ ఉందనే వివరాలు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తోంది. విక్రయించిన ఎరువులకు మాత్రమే డీలర్లకు సబ్సిడీ మొత్తం జమ అవుతుంది. 135 మందికి పీవోఎస్ మిషన్లు.. జిల్లాలో 220 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 135 మంది డీలర్లకు పాయింట్ ఆఫ్ సెల్ మిషన్లను పంపిణీ చేశారు. ఇంకా 85 మంది డీలర్లకు పంపిణీ చేయాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో మిగతా డీలర్లకు పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పీవోఎస్ మిషన్ల ద్వారా ఎరువుల సరఫరా వల్ల అక్రమాలను నివారించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు యూరియా, డీఏపీ ఇతర ఎరువులను ఆయా కంపెనీలు సబ్సిడీ ధరలకే రైతులకు విక్రయిస్తున్నారు. కొంత మంది డీలర్లు రైతులకు విక్రయించకుండా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎరువులు విక్రయించకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే సబ్సిడీ వారి అకౌంట్లలో జమ అవుతుంది. ఇకనుంచి ఇలాంటి అక్రమాలకు చెక్ పడనుంది. నేటి నుంచి అమలు.. ఎరువుల పంపిణీకి ఆధార్ అనుసంధానం పూర్తి చేయడం జరిగింది. నేటి నుంచి అ మలు చేస్తున్నాం. జిల్లాలో 220 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. 135 మందికి పీ వోఎస్ మిషన్లు అందజేశాం. మిగతా వారికి రెండు, మూడు రోజుల్లో అందజేస్తాం. శిక్షణ కూడా ఇచ్చాం. పీవోఎస్ అమలు చేయని డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తాం. -ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి జిల్లాలో.. రైతులు 1,05,600 సాధారణ సాగు విస్తీర్ణం 1,97,000 హెక్టార్లు ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఎరువుల విక్రయాలు (మెట్రిక్ టన్నులలో) యూరియా 35 వేలు డీఏపీ 10 వేలు కాంప్లెక్స్ ఎరువులు 15 వేలు పొటాషియం 5 వేలు పాస్పరస్ 5 వేలు రబీలో అవసరమయ్యే ఎరువులు యూరియా 4,700 డీఏపీ 2780 పొటాషియం 1900 కాంప్లెక్స్ ఎరువులు 3,400 -
ఆధార్ ఉంటేనే ఎరువులు!
సాక్షి, హైదరాబాద్: రైతులు ఎరువులు కొనాలంటే ఇకపై ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఎరువుల దుకాణాలకు 6,641 పాయింట్ ఆపరేటింగ్ సేల్ (పీవోఎస్) యంత్రాలను సరఫరా చేసింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై కలెక్టర్లకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. రైతులు తమ వెంట ఆధార్ కార్డు తీసుకురాకుంటే ఎరువులు విక్రయించకూడదని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని ఎరువుల దుకాణాలకు ఆదేశాలు అందాయి. అమలు ప్రక్రియపై ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. సాంకేతికంగా ఇబ్బందులు ఉన్న చోట చక్కదిద్దారు. కొన్నిచోట్ల పీవోఎస్ యంత్రాలు పని చేయకపోతే కొత్త వాటిని అందజేశారు. సబ్సిడీ పక్కదారి పట్టకూడదనే యూరియా, డీఏపీ తదితర ఎరువులను కంపెనీలు సబ్సిడీ ధరలకే రైతులకు అందుబాటులోకి తెస్తుంటాయి. తాజా నిర్ణయంతో సబ్సిడీ ఎరువులు రైతులకు కాకుండా మిక్సింగ్ ప్లాంట్లు, ఇతర అవసరాలకు వెళ్లకుండా అడ్డుకోవ చ్చు. పీవోఎస్ పద్ధతి ద్వారా నేరుగా లబ్ది చేకూర్చే బదిలీ (డీబీటీ) విధానాన్ని అమలు చేయాలనేది కేంద్రం లక్ష్యం. పీవోఎస్ యంత్రాలను తీసు కోకున్నా, ఈ పద్ధతిని అమలు చేయకున్నా సంబంధిత ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని కూడా సర్కారు స్పష్టం చేసింది. ఈ విధానం ఇప్పటికే అమలు కావాల్సి ఉండగా సరిపడా పీవోఎస్ యంత్రాలు అందుబాటు లో లేకపోవడంతో వాయిదా వేశారు. ఎట్టకేలకు నూతన సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. డబ్బులే చెల్లించాలి.. డీబీటీ విధానంలో ఎరువులు కొనుగోలు చేయాలంటే రైతు ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే ప్రస్తుతానికి డెబిట్ కార్డును ఉపయోగించే పద్ధతిని ప్రవేశపెట్టలేదు. కాబట్టి రైతులు డబ్బులు చెల్లించే ఎరువులు కొనుగోలు చేస్తారు. మున్ముందు డెబిట్ కార్డు ద్వారానే లావాదేవీలు జరిపేలా పీవోఎస్ యంత్రాలను తీర్చిదిద్దుతారు. వాటిలో డెబిట్ కార్డును ఉపయోగించేలా సాఫ్ట్‌వేర్‌ను ప్రస్తుతం ప్రవేశపెట్టడం లేదు. రైతులు పూర్తిస్థాయి లో డెబిట్ కార్డు లేదా రూపె కార్డు కలిగి ఉన్నట్లు నిర్ధారించుకున్నాక పీవోఎస్ యంత్రాల్లో సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే రైతులకు ఒక గుర్తింపు నంబర్ కూడా ఇస్తారు. ఈ వివరాలు పీవోఎస్ యంత్రాల్లో నిక్షిప్తమై ఎరువుల కొనుగోలు లావాదేవీలు నమోదవుతాయి. లావాదేవీల సమాచారాన్ని కేంద్రా నికి సమర్పిస్తే సదరు సబ్సిడీని కంపెనీలకు చెల్లిస్తారు. ఈ విధానంలో సబ్సిడీ చెల్లింపు వ్యవహారం ప్రభుత్వం, కంపెనీల మధ్యనే ఉన్నందున రైతుకు అదనపు ఆర్థిక భారం ఉండబోదని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. -
ఆధార్ ఉంటేనే ఎరువు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు ఇకపై ఎరువులు కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఎందుకంటే ఎరువులు కొనుగోలుకు ఆధార్‌కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆధార్ ద్వారా ఎరువులు కొనే పద్ధతిని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది. రైతులు తమ వెంట ఆధార్ తీసుకురాకున్నా.. ఎవరికైనా ఆధార్ లేకున్నా అట్లాంటి రైతులకు ఎరువులు అమ్మకూడదని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని ఎరువుల దుకాణాలకు ఆదేశాలు అందాయి. అలాగే ఆయా దుకాణాలకు పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్) యంత్రాలను కూడా అందజేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల పీవోఎస్ యంత్రాలను సరఫరా చేయాలని భావించగా.. ఇప్పటికి 5 వేల దుకాణాలకు అందజేశారు. అందులో 3 వేల దుకాణాల్లో పూర్తిస్థాయిలో పీవోఎస్ యంత్రాలను బిగించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కొన్నిచోట్ల పీవోఎస్ యంత్రాలు పనిచేయకపోతే వాటిని మార్చి కొత్త వాటిని అందజేస్తున్నారు. మున్ముందు డెబిట్ కార్డు స్వైప్.. డీబీటీ విధానంలో రైతు ఎరువుల బస్తా కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే మున్ముందు డెబిట్ కార్డు ద్వారానే లావాదేవీలు జరిపేలా పీవోఎస్ యంత్రాలను ఇస్తున్నారు. దాంట్లో ప్రస్తుతం డెబిట్ కార్డును ఉపయోగించేలా సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడంలేదు. రైతులు పూర్తిస్థాయిలో డెబిట్ కార్డు లేదా రూపే కార్డు కలిగి ఉన్నట్లు నిర్థారించుకున్నాక పీవోఎస్ యంత్రాల్లో సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆధార్ ద్వారా, మున్ముందు డెబిట్ కార్డుతో ఎరువుల విక్రయాలు జరుపుతారు. అలాగే రైతులకు ఒక గుర్తింపు నంబర్ కూడా ఇస్తారు. ఈ వివరాలు పీవోఎస్ యంత్రాల్లో నిక్షిప్తమై ఎరువుల కొనుగోలు లావాదేవీలు నమోదవుతాయి. లావాదేవీల సమాచారాన్ని కేంద్రానికి సమర్పిస్తే సదరు సబ్సిడీని కంపెనీలకు చెల్లిస్తారు. ఈ విధానంలో సబ్సిడీ చెల్లింపు వ్యవహారం ప్రభుత్వం, కంపెనీల మధ్యనే ఉన్నందున రైతుకు అదనపు ఆర్థిక భారం ఉండబోదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సబ్సిడీ పక్కదారి పట్టకూడదనే.. యూరియా, డీఏపీ తదితర ఎరువులను కంపెనీలు సబ్సిడీ ధరలకే దుకాణాల్లో రైతులకు అందుబాటులోకి తెస్తుంటాయి. అయితే సబ్సిడీ ఎరువులు రైతులకు కాకుండా మిక్సింగ్ ప్లాంట్లు, ఇతర అవసరాలకు మళ్లకుండా ఈ కొత్త విధానాన్ని కేంద్రం అమలులోకి తీసుకువస్తోంది. పీవోఎస్ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చే బదిలీ(డీబీటీ) విధానాన్ని అమలు చేయాలనేది కేంద్రం లక్ష్యం. పీవోఎస్‌లను తీసుకోకపోయినా, ఈ పద్ధతిని అమలు చేయకపోయినా సంబంధిత ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని సర్కారు స్పష్టంచేసింది. వాస్తవానికి ఈ విధానం ఇప్పటికే అమలు కావాల్సి ఉండగా.. సరిపడా పీవోఎస్ యంత్రాలు అందుబాటులో లేక వాయిదా వేశారు. -
ఎరువులే తింటున్నాం!
సాక్షి, అమరావతి: తొమ్మిది రోజుల పాటు మూడు ఖండాల్లోని మూడు దేశాల్లో ఉన్న ఏడు నగరాల్లో పర్యటించామని, కుదుర్చుకున్న ఎంఓయూల ద్వారా 10 బిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆ విశేషాలను తెలిపేందుకు శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో విదేశీ టూర్లంటే ఎక్కువగా ఐటీ కంపెనీలకు వెళ్లేవాడినని, ఈసారి వ్యవసాయ టెక్నాలజీపై దృష్టి పెట్టానని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతుల కళ్లల్లో దీపావళి చూసేందుకు అమెరికాలో దీపావళి రోజు వ్యవసాయ క్షేత్రాల్లో గడిపానన్నారు. రాష్ట్రంలో వ్యవసాయంలో విపరీతంగా ఎరువులు వాడుతున్నారని, దీనివల్ల అందరూ ఎరువుల్నే తింటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భారతదేశంలో ఎక్కువగా ఎరువుల్ని వినియోగించే రాష్ట్రాల్లో హర్యానా, ఆంధ్రప్రదేశ్‌లు ముందున్నాయని తెలిపారు. ఎరువుల వాడకం తగ్గించమని రైతులకు చెబుతున్నామన్నారు. ప్రపంచం అంతా ఆర్గానిక్ వ్యవసాయంపై ముందుకెళుతోందని దానిపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. గోల్డెన్ పీకాక్ అవార్డు తీసుకున్నానని, ఇలాంటి వాటి వల్ల మనలో నమ్మకం పెరుగుతుందని ఆయన చెప్పారు. విదేశాల్లో పర్యటనల సందర్భంగా తొమ్మిది రోజులు విమానంలోనే పడుకున్నానని, అందులోనే స్నానం చేశానని, అక్కడే ముఖం కడుక్కున్నానని చెప్పారు. కొన్నిరోజులైతే స్నానం కూడా లేకుండా తిరిగానని తెలిపారు. స్తూపం డిజైన్‌కు తొలి ప్రాధాన్యం... రెండు వేల ఏళ్ల నాటి వారసత్వాన్ని ప్రతిబింబించేలా నీటిలో ఉండే అసెంబ్లీ భవనం రెండు డిజైన్లను నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిందని సీఎం తెలిపారు. వాటిలో అమరావతి స్తూపం డిజైన్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ మేరకు మార్పులు చేసి తీసుకురమ్మన్నామని చెప్పారు. హైకోర్టుకు స్తూపాకారం డిజైన్ అందంగా వచ్చిందని దాన్ని ఓకే చేశామన్నారు. సచివాలయాన్ని ఐదు టవర్లుగా నిర్మించే డిజైన్ ఇచ్చారని, అవి ఒకే వరుసలో నిర్మించాలా, లేక రెండు, మూడు వరుసల్లోనా అనే అంశంపై రెండు, మూడు ఆప్షన్లతో డిజైన్లు సిద్ధం చేసి చూపించాలని చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 14 శాతం లెస్‌కు కాంట్రాక్టర్‌కి ఇచ్చారని, ఇప్పుడు అతను దాన్ని పూర్తి చేసే స్థితి లేదన్నారు. 60 సి కింద ప్రాజెక్టులోని కొన్ని పనులను విడిగా అవుట్‌సోర్సింగ్‌కి చేయించే అవకాశం ఉందని, చర్చిస్తున్నామని చెప్పారు. ఫాతిమా కళాశాల విద్యార్థులకు న్యాయం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
ఎరువులా? మారణాయుధాలా?
- ఎరువులు, పురుగుమందులతో ప్రమాదకరమైన ఆయుధాలు - బాంబులు, రసాయన ఆయుధాలు తయారు చేస్తున్న ఉగ్రవాదులు - ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా దాడులు - దేశంలో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న ఎరువులు, పురుగు మందులు - అవి దుర్వినియోగమైతే ప్రజల భద్రతకు ప్రమాదమే! - నియంత్రణ లేకపోవడంపై ఆందోళన.. అవగాహన కల్పించేందుకు చర్యలు - దీనిపై హైదరాబాద్‌లో ఇండో–అమెరికా వర్క్‌షాప్ ► అల్‌కాయిదా ఉగ్రవాదులు 2001 సెప్టెంబర్‌లో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం (డబ్ల్యూటీవో)పై విమానాలతో దాడి చేసి వేల మందిని పొట్టనపెట్టుకున్నారు. అయితే ఆ దాడికి ముందు వారేం చేశారో తెలుసా..? పంటలకు ఉపయోగించే పురుగుమందులను రసాయన ఆయుధాలుగా మార్చి.. రద్దీగా ఉండే ప్రాంతంలో చల్లడం ద్వారా వేలాది మందిని చంపేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎందుకో అది వీలుగాక.. విమానాలతో దాడి చేశారు.. ► 1995లో అమెరికాలోని ఓక్లహామాలో ఉగ్రవాదులు ఒక భవనంపై బాంబుదాడి చేసి 168 మందిని బలితీసుకున్నారు. ఆ బాంబును దేనితో తయారు చేశారో తెలుసా..? పంటలకు వినియోగించే ఎరువులు, పురుగుమందులు కలిపి రూపొందించారు.. ... ఎరువులు, పురుగు మందులు పంటల రక్షణ కోసమే కాదు.. పెద్ద సంఖ్యలో మనుషులను బలితీసుకునే మారణ హోమాలకు ఆయుధాలుగా కూడా మారుతాయని ఈ రెండు ఘటనలు చెబుతాయి. ఉగ్రవాదులు ఎరువులు, పురుగుమందులను రసాయన ఆయుధాలుగా మార్చి 1975 నుంచి 2002 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 146 భారీ విస్ఫోటనాలు సృష్టించారు. వేలాది మందిని బలి తీసుకున్నారు. దీంతో ఎరువులు, పురుగు మందుల వినియోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై చర్చ జరుగుతోంది. వ్యవసాయక దేశమైన భారత్‌లో ఎరువులు, పురుగుమందులను విçస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో... అవి దుష్టుల చేతిలో పడకుండా చర్యలు చేపట్టడంపై భారత్, అమెరికాలు దృష్టి సారించాయి. దీనికి సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో సదస్సు జరిగింది. ఇందులో అమెరికాకు చెందిన ఇంధనశాఖ, స్టేట్ కెమికల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్, పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబొరేటరీ (పీఎన్ఎన్ఎల్)ల∙శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. – సాక్షి, హైదరాబాద్ పురుగు మందులతో మారణ హోమమే భారత్ వ్యవసాయక దేశం. దీంతో ఇక్కడ ఎరువులు, పురుగు మందుల వినియోగం విస్తృతంగా ఉంటుంది. ఇందులోనూ దేశవ్యాప్తంగా ఉపయోగించే వాటిలో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 24% వరకు ఉండటం గమనార్హం. దీంతో ఇక్కడ అవి పక్కదారి పట్టడానికి అవకాశాలు ఎక్కువ. పైగా హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయి. ఉగ్ర వాదులు, మిలిటెంట్ ఉద్యమకారులు, క్రిమినల్ల చేతిలోకి ఎరువులు, పురుగుమందులు వెళితే అత్యంత ప్రమాదం. పురుగు మందుల సాంద్రత పెంచి ఇతరత్రా రసాయనాలు కలిపితే.. విధ్వంసకర ఆయుధాలుగా తయారవుతాయి. పురుగుమందులను అధిక సాంద్రతతో స్ప్రేచేస్తే విష ప్రభావంతో పెద్ద సంఖ్యలో జనం చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎరువులతో బాంబులు ఎరువులు, పురుగు మందులతో బాంబులు తయారు చేయడం సులువు, చవక కూడా.. నైపుణ్యం ఉన్న ఉగ్రవాదులు వాటిని ఉప యోగించి తక్కువ సమయంలోనే బాంబులు తయారు చేయగలరని ఇప్పటికే వెల్లడైంది. యూరియాకు నైట్రిక్ యాసిడ్ కలిపి భారీ పేలుడు సృష్టించే బాంబుగా తయారు చేయవచ్చని చెబుతున్నారు. అంటే మనం పెద్దగా పట్టించుకోని ఎరువులు, పురుగు మందులు ఉగ్రవాదు లు, క్రిమినల్స్ చేతిలో పడితే జరిగే నష్టం చాలా ఎక్కువ. దీంతో అమెరికా, భారత నిఘా వర్గాలు ఇప్పుడీ ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాయి. పక్కదారి పట్టకుండా చూడాలి ‘‘ఎరువులు, పురుగు మందులు ఉగ్రవాదుల చేతిలో పడితే బాంబులు తయారు చేయడానికి ఆస్కార ముంది. దీనిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగు తోంది. పురుగు మందులు, ఎరువుల సరఫరా కట్టుదిట్టంగా ఉండాలి..’’ – డాక్టర్ జీవీఎం శర్మ, ప్రధాన శాస్త్రవేత్త, ఐఐసీటీ, హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేయాలి.. ‘‘పురుగు మందులు, ఎరువులు ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకుండా జాగ్ర త్తలు తీసుకోవాలి. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను ఏర్పా టు చేయాలి. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. డీలర్లను, వ్యాపారులను చైతన్యం చేయాలి. తయారీ యూని ట్లన్నీ భద్రత నడుమ ఉండాలి. దేశంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 66 పురుగు మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా ప్రకటించి, నిషేధించారు. అందులో మన దేశంలో 18 పురుగు మందులపై నిషేధం ఉంది..’’ – పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి -
స్వల్పంగా తగ్గిన ఎరువుల ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) ప్రభావంతో రసాయన ఎరువుల ధరలు కొంతమేర తగ్గాయి. మొన్నటి వరకు 50 కిలోల యూరియా బస్తా ధర రూ.298 ఉంది. జీఎస్టీతో మూడు రూపాయలు తగ్గి.. రూ.295 వద్ద స్థిరపడింది. అలాగే కోరమాండల్ కంపెనీకి చెందిన డీఏపీ ధర రూ.1092 ఉండగా ప్రస్తుతం రూ.1081కి తగ్గింది. 10.26.26 బస్తా ధర రూ.1155 ఉండగా 1044కు తగ్గింది. 28.28.0, 14.35.14 బస్తా ధర రూ.1134 నుంచి రూ.1122కు తగ్గింది. 20.20.0.13 బస్తా ధర రూ,829 నుంచి రూ.821కి తగ్గింది. ఎంఓపీ ధర రూ. 577 నుంచి రూ. 575కు తగ్గింది. ఎంసీఎఫ్‌ఎల్‌కు చెందిన డీఏపీ ధర మొన్నటి వరకు రూ. 1118 ఉండగా 1105కు తగ్గింది. 20.20.0.13 ధర రూ.883 నుంచి రూ.872కు తగ్గింది. క్రిబ్‌కొ డీఏపీ ధర రూ.1086 ఉండగా రూ.1076కు తగ్గింది. ఎంఓపీ ధర రూ.583.25 నుంచి 577.50కి తగ్గింది. పీపీఎల్ కంపెనీ డీఏపీ ధర రూ.1118 నుంచి 1105కు తగ్గింది. 10.26.26 ధర రూ.1082 ఉండగా రూ.1076కు తగ్గింది. 20.20.0.13 ధర రూ.882 నుంచి రూ.872కు తగ్గింది. జువారి కంపెనీకి చెందిన డీఏపీ బస్తా ధర రూ.1123 నుంచి రూ.1105కు, 19.19.19 ధర రూ1081 నుంచి 1071కి, ఎంఓపీ ధర రూ.580 నుంచి రూ.579కి తగ్గాయి. మద్రాసు పర్టిలైజర్స్ లిమిటెడ్‌కు చెందిన 17.17.17 బస్తా ధర రూ.రూ.998 నుంచి 989.50కి తగ్గింది. -
రైతులకు శుభవార్త
ఢిల్లీ: వస్తు సేవాలపై పన్ను(జీఎస్టీ) జూలై 1వ తేది నుంచి అమలులోకి వచ్చింది. రైతులపై ఈ జీఎస్టీ భారం అవుతుందని మొదట నుంచి విమర్శలోస్తున్నాయి. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయలు తీసుకున్నారు. రైతులకు భారం కానున్న ఎరువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ట్రాక్టర్, స్పేర్ పార్ట్స్ పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. -
‘ఎరువుల దుకాణాల్లో బయోమెట్రిక్ తప్పనిసరి’
అనంతపురం అగ్రికల్చర్ : ఎరువుల దుకాణాల్లో బయోమెట్రిక్ మిషన్లు, స్వైపింగ్ యంత్రాలు తప్పనిసరిగా అందుబాటులో పెట్టుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. ఈమేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలై నుంచి డైరెక్ట్ టు బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానం అమలులోకి వస్తుండటంతో కొత్త పద్ధతిలో ఎరువుల అమ్మకాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. మొదట ఎరువులు తర్వాత విత్తనాలు, పురుగు మందులు, ఇతరత్రా ఇన్పుట్స్ అమ్మకాలు ఉంటాయన్నారు. ప్రస్తుతానికి ఎరువులు డీబీటీ పద్ధతిలో విక్రయించాల్సి ఉండటంతో బయోమెట్రిక్, స్వైపింగ్ పరికరాలు మూడు రోజుల్లోగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. రైతు ఆధార్ నెంబర్ ఆధారంగా ఎరువుల పంపిణీ ఉంటుందన్నారు. -
పంట దిగుబడులకు పోషకాలు అత్యవసరం
– ఖరీఫ్ పంటల్లో ఎరువులు యాజమాన్యం చేపట్టాలి – ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్ అనంతపురం అగ్రికల్చర్ : పంట దిగుబడులు రావాలంటే తప్పనిసరిగా పోషకాలు అందించాలని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కోఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. వర్షాధారంగా వేసే పంటలైనా సేంద్రియ, రసాయన ఎరువులతో సమగ్ర యాజమాన్యం చేపట్టాలని సూచించారు. పోషకాలు అత్యవసరం : జిల్లాలో వేరుశనగ 6 లక్షల హెక్టార్లు, కంది, పత్తి, ఆముదం, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, అలసంద, పెసర, కొర్ర, సజ్జ తదితర మిగతా పంటలు మరో రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వచ్చే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా సేంద్రియ ఎరువులు తగ్గించి రసాయన ఎరువులు అధికంగా వాడుతున్నారు. కొందరు రైతులు అసలు ఎరువులు వేయడమే మానేశారు. అయితే పంటకు తగినంత పోషకాలు వేయకుంటే అనుకున్నంత పంట దిగుబడులు రావడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ ఎరువులు వాడకం పెరగాలి. పశువుల ఎరువు, వర్మీ వంటి సేంద్రియ పదార్థంలో ఎన్పీకే, సూక్ష్మపోషకాలతో పాటు 16 రకాల పోషకాలు లభిస్తాయి. సేంద్రియ ఎరువులకు కొంత రసాయన ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్యం ఇలా: + వేరుశనగ పంట వేసే రైతులు ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు, 18 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ పాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) ఎరువులు వేయాలి. ప్రతి మూడు పంటలకు ఎకరాకు 20 కిలోల జింక్‌సల్ఫేట్ వాడాలి. + ఎకరా కంది పంటకు రెండు టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల యూరియా, 125 కిలోల సూపర్ పాస్ఫేట్ వేయాలి. + పత్తి పంట ఎకరాకు దుక్కిలో 150 కిలోల సూపర్ పాస్ఫేట్, 50 కిలోల ఎంఓపీ వేసుకోవాలి. పంట విత్తుకున్న తర్వాత 30, 60, 90 రోజుల సమయంలో ఎకరాకు 35 కిలోల యూరియా చల్లాలి. + ఎకరా ఆముద పంటకు రెండు టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల సూపర్ పాస్ఫేట్, 20 కిలోల ఎంఓపీ వేసుకోవాలి. విత్తుకున్న 30, 60, 90 రోజుల సమయంలో ఎకరాకు 15 కిలోల యూరియా పైపాటుగా వేయాలి. + మొక్కజొన్న సాగు చేసే రైతులు ఎకరాకు ఆఖరి దుక్కిలో 150 కిలోల సూపర్ పాస్ఫేట్, 50 కిలోల ఎంఓపీ ఎరువులు వేయాలి. అలాగే 100 కిలోల యూరియాను రెండు భాగాలుగా చేసుకుని 50 కిలోలు దుక్కిలోనూ తర్వాత 30 నుంచి 35 రోజులు, 50 నుంచి 55 రోజుల సమయంలో మిగతా ఎరువు వేసుకోవాలి. -
ఎరువు.. జీఎస్టీ దరువు
► పెరగనున్న ఎరువుల ధరలు ► జిల్లా రైతులపై రూ.35 కోట్లకు పైగా భారం ► పురుగు మందులు మరింత ప్రియం వస్తు, సేవా పన్ను (జీఎస్టీ) ప్రభావంతో ఎరువులు, పురుగు మందుల ధరలకు రెక్కలు రానున్నాయి. యూరియాతో పాటు అన్నిరకాల రసాయనిక ఎరువుల ధరలు పెరగనున్నాయి. దీంతో వ్యవసాయం భారమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): జీఎస్టీ ప్రభావంతో ఎరువులు, పురుగు మందుల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఏర్పడింది. జూలై 1 నుంచి కొత్త పన్ను విధానం అమలు కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో యూరియా సహా రసాయన ఎరువుల ధరలు ఎంత పెరగొచ్చనే విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. వాస్తవంగా ఎరువుల ధరల కొన్ని నెలల క్రితమే కొంత మేరక తగ్గాయి. ఇప్పటి వరకు అన్ని రకాల ఎరువులపై వ్యాట్ 5 శాతం మాత్రమే ఉంది. జీఎస్టీ అమలైతే ఏకంగా పన్ను 12 శాతానికి పెరుగుతోంది. అంటే పన్ను భారం అదనంగా 7 శాతం పడుతోంది. అదే స్థాయిలో ధరలు పెరుగనున్నాయి. యూరియా బస్తాపై దాదాపు రూ.18, మిగిలిన ఎరువులపై బస్తాకు రూ.60 నుంచి 100 వరకు పెరిగే అవకావం ఉంది. యూరియా భారం రూ.4.07 కోట్లు ఖరీప్ సీజన్‌కు 3,38,077 టన్నుల రసాయన ఎరువులు అవసరమవుతాయి. అన్ని రకాల ఎరువుల ధరలు పెరుగుతున్నా.. ఇంతవరకు యూరియా ధర మాత్రం పెరగలేదు. ఇది రైతులకు ఊరట కల్పిస్తోంది. ప్రస్తుతం 50 కిలోల బస్తా ధర రూ.298 ఉంది. జీఎస్టీ కారణంగా యూరియా ధర రూ. 316కు పెరుగనుంది. అంటే బస్తాపై రూ.18 వరకు పెరుగనుంది. జిల్లాకు 1,13,312 టన్నుల యూరియా అవసరం అవుతోంది. టన్నుపై రూ.360 వరకు పెరుగనుంది. అంటే కరువు రైతులపై రూ.4.07 కోట్లకు పైగా భారం పడే ప్రమాదం ఏర్పడింది. ఇతర ఎరువులు.. జిల్లాకు డీఏపీ 65600 టన్నులు, ఎంఓపీ 16432 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు( ఎన్పీకే) 1,42,733 టన్నులు అవసరం అవుతున్నాయి. 50 కిలోల బస్తాపై గరిష్టంగా రూ.70 వరకు ధరలు పెరుగనున్నాయి. ఈ మేరకు ఎరువుల కంపెనీల ప్రతినిధులు డీలర్లకు సమాచారం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే రైతులపై జీఎస్టీ భారం ఎక్కువగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రైతులు ఎక్కువగా వినియోగించే ఎరువుల్లో డై అమ్మోనియా సల్పేటు( డీఏపీ) ముఖ్యమైనది. ప్రస్తుతం గరిష్టంగా బస్తా ధర రూ. 1155 వరకు ఉంది. ఈ ధర గరిష్టంగా రూ.1221కి చేరే అవకాశం ఉంది. జిల్లాకు డీఏపీ 65600 టన్నులు అవసరం అవుతుండగా రైతులపై రూ. 8 కోట్లకు పైగా భారం పడే ప్రమాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం 28.28.0 ఎరువు 50 కిలోల బస్తా ధర రూ.1134 ఉంది. ఈ ధర రూ.1200 ఆపై పెరిగే అవకాశం ఉంది. 10.26.26, 14.35,14 ఇలా అన్ని రకాల ధరలు పెరుగనున్నాయి. ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులకు పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. భారం కానున్న పురుగు మందుల ధరలు... రైతులకు పురుగు మందులు కూడ భారం కానున్నయి. జిల్లాలో ఏటా దాదాపు దాదాపు 50వేల టన్నుల పురుగు మందుల అమ్మకం అవుతున్నాయి. వీటిపై దాదాపు 18 శాతం వరకు ధరలు పెరిగే ప్రమాదం ఉంది. వీటితో వివిధ కంపెనీల బయో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. -
కర్షకుడిపై జీఎస్టీ కత్తి
► 18 శాతం మేర పెరగనున్న పురుగు మందుల ధరలు ► ఆందోళనలో అన్నదాత ములకలచెరువు: రైతుల సంక్షేమమే తమ ద్యేయమని చెబుతూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నడ్డి విరుస్తున్నాయని అన్నదాతలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పండిన పంటలకు గిట్టుభాటు ధరలు లేక నష్టపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో కేంద్రం తీసుకొస్తున్న జీఎస్టీ( వస్తు సేవా పన్ను) పన్ను విధానం మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాగా మారనుంది. 18 శాతం మేర పురుగు మందులు, ఎరువు పెరగనుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జీఎస్టీతో పురుగు మందులు భారం: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానంలో పురుగు మందులపై 18 శాతం పన్ను భారం మోపనుంది. జూలై 1 నుంచి ధరలు పెరనుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే వివిధ కంపెనీలు ధరలు పెంచేశాయి. యూరియాతో పాటు జింకు, మెగ్నీషియం, బయో ఫర్టిలైజర్స్పై ఐదు శాతం ధరలు పెరగనున్నాయి. పురుగు మందులపై 18 శాతం పెంపు తప్పని సరిగా మారింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఖరీఫ్‌లో సుమారుగా 70 వేల హెక్టార్లలో పంటలు సాగుచేస్తారు. యూరియా, డీఏపీతో పాటు కాంప్లెక్స్ ఎరువులు వాడుతారు. వీటితో పాటు పురుగుల మందులు సైతం వాడుతారు. ఈ నేపథ్యంలో ధరల పెంపు రైతులకు అదనపు భారం కానుంది. జీఎస్టీతో ఎరువుల కంపెనీలు ధరలు అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం యూరియా బస్తా రూ.298 ఉండగా జీఎస్టీతో జూలై 1 నుంచి 315కు పెరగనుంది. అలాగే డీఏపీ రూ.1155 నుంచి రూ. 1217కు పెరగనుంది. పెరిగిన ధరలతో నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు కోట్ల రూపాయలు అన్నదాతలపై భారం పడనుంది. పండిన పంటలకు గిట్టుభాటు ధరలు లేక పెట్టుబడులు దక్కక రైతులు నష్టపోతున్నారు. గిట్టుభాటు ధరలు కల్పించని ప్రభుత్వం ఎరువులు, పురుగుల మందుల ధరలు పెంచడంపై రైతులు మండిపడుతున్నారు. ఇలాగైతే కాడి వదిలేయాల్సిందేనని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై అధనపు భారం ఎరువులు, పురుగుల మందుల ధరలు పెంచడం రైతులపై అదనపు భారం మోపడమే. సాగు ఖర్చులు పెరిగితే వ్యయం మరింత భారమవుతుంది. పండించిన పంట పెట్టుబడులకే సరిపోతుంది. - శంకర్‌రెడ్డి, రైతు, వేపూరికోట. ఇదెక్కడి న్యాయం రైతులు పండించిన పంటకు గిట్టుభాటు ధరలు కల్పించని ప్రభుత్వాలు ఎరువు, పురుగుల మందుల ధరలు పెంచడం దారుణం. దేశానికి వెన్నెముక వంటి రైతులపై భారం మోపడం తగదు. జీఎస్టీ నుంచి రైతులకు మినహాయింపు ఇచ్చి ఆదుకోవాలి. - అంజనప్ప, రైతుసంఘం నాయకుడు, ములకలచెరువు. -
పంట వేస్తేనే ప్రభుత్వ ‘సాయం’!
- లేకుంటే తర్వాతి సీజన్‌కు రైతుకు ఆర్థిక సాయం అందదు - పెట్టుబడి పథకం మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ మేధోమథనం - ఖాళీగా ఉంచి ఎకరానికి రూ.4 వేలు తీసుకుంటామంటే కుదరదు - వచ్చే ఏడాది నుంచి మొత్తం వ్యవసాయ భూమిని సాగులోకి తేవడమే లక్ష్యం సాక్షి, హైదరాబాద్: తమ వ్యవసాయ భూమిలో పంట వేసే రైతులకే పెట్టుబడి పథకం కింద సాయం అందించాలని సర్కారు యోచిస్తోంది. పంట వేయని రైతులకు ఆర్థిక సాయం చేయడం వల్ల ఆ పథకం స్ఫూర్తి దెబ్బతింటుందని భావిస్తోంది. 2018 ఖరీఫ్ సీజన్ నుంచి ఎరువులు, విత్తనాలు, ఇతర పెట్టుబడుల కోసం ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. యాసంగి సీజన్లోనూ రూ.4 వేలు ఇస్తారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉండాలో వ్యవ సాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఉన్నతస్థాయిలో మేధో మధనం జరుపుతోంది. నీటి వసతి లేకపోవడం.. తదితర కారణాలతో కొందరు రైతులు తమ భూములను బీడ్లుగా వదిలేస్తున్నారు. కొందరు సాగు వదిలేసి వలస వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూమి ఉంటే చాలు ఎకరానికి రూ.4 వేలు చొప్పున పెట్టుబడి పథకం వర్తిస్తుందా, లేదా అనే అంశంపై రైతుల్లో అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో రైతు ఏదో ఒక పంట వేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పెట్టుబడి పథకం ప్రారంభించే వచ్చే వర్షాకాల సీజన్లో భూమి ఉన్న ప్రతీ రైతుకు ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేలు సాయం చేయనుంది. అనంతరం ఎవరెవరు సాగు చేశారు, ఎవరు చేయలేదో ఏఈవోలతో సర్వే చేయిస్తుంది. వర్షాకాలంలో పెట్టుబడి సాయం పొంది తమ భూమిని సాగులోకి తీసుకురాలేదంటే.. తర్వాత యాసంగిలో సాగు చేసినా వారికి ఆర్థిక సాయం అందదు. 1.55 కోట్ల ఎకరాల భూమి.. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 55.53 లక్షల మంది రైతులున్నారు. అందులో సన్నచిన్నకారు రైతులు 47.68 లక్షల మంది, మధ్యతరహా రైతులు 7.09 లక్షల మంది, ధనిక రైతులు 16 వేల మంది ఉన్నారు. వారికి 1.55 కోట్ల ఎకరాల భూమి ఉంది. అయితే రాష్ట్రంలో వర్షాకాల సీజన్లో 1.08 కోట్ల ఎకరాలు, యాసంగిలో 37.62 లక్షల ఎకరాలు కలిపి మొత్తంగా 1.46 కోట్ల ఎకరాలు సాగవుతుంది. వానాకాలంలో పంట కోతలు పూర్తయితే అదే భూమిలో యాసంగి పంటలూ వేస్తారు. పత్తి, మిరప వంటి కొన్ని పంటలు మాత్రం యాసంగిలోనూ కొనసాగుతాయి. అంటే సీజన్ మొత్తానికి గరిష్టంగా 1.25 కోట్ల ఎకరాల భూమి మాత్రమే సాగవుతున్నట్లు లెక్క. కొంత భూమిలో ఉద్యాన పంటలు సాగవుతాయి. అలాగే మరో 10 లక్షల ఎకరాలకుపైగా భూమి సాగు కావడంలేదని వ్యవసాయ అధికారులు విశ్లేషిస్తున్నారు. సీజన్ బాగోలేకుంటే ఒక్కోసారి 30 లక్షల ఎకరాల వరకు సాగు జరగదు. ఈ నేపథ్యంలో పెట్టుబడి పథకం దుర్వినియోగం అయ్యే ప్రమాదముందనేది అధికారుల భావన. ఒకవేళ భవిష్యత్తులో సాగునీటి వసతి ఏర్పడితే అప్పుడు సాగు పెరగవచ్చు. ఈ నేపథ్యంలో భూమి సాగు చేస్తేనే సాయం అనే నిబంధన తప్పనిసరిగా ఉంచాలని అంటున్నారు. ఏదో ఒక పంట తప్పనిసరి.. ఇప్పటివరకు బీడుగా వదిలేసిన భూమిలో కనీసం గడ్డి మొక్కలైనా లేదా పండ్ల తోటలైనా వేస్తేనే అధికారులు పరి గణనలోకి తీసుకుంటారు. దీనివల్ల ప్రభు త్వం రాయితీతో ఇచ్చే 84 లక్షల గొర్రెలకైనా ఆహారం లభ్యంకానుంది. అలాగే పర్యావర ణానికి మేలు జరుగుతుందనేది సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. మరోవైపు ఒక్కో సారి సరైన వర్షాలు లేక విత్తనాలు వేసినా మొలకెత్తవు. అప్పుడు పంట వేసిన ఆనవాళ్లు కూడా ఉండవు. అలాంటి సంద ర్భాల్లో తదుపరి సీజన్‌కు రైతుకు ఆర్థిక సాయం అందుతుందా, లేదా అనే అనుమా నాలున్నాయి. ఏదేమైనా మార్గదర్శకాలు ఖరారయ్యాకే స్పష్టత రానుంది. ఇటీవల రైతు సమగ్ర సర్వే ప్రకారం కేవలం 46.17 లక్షల మంది రైతులు మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారు. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. -
ఎరువు బరువు
►కరువు జిల్లాపై పిడుగుపాటు ►అన్నదాతపై జీఎస్టీ భారం ►12శాతం పన్ను శ్లాబులో ఎరువులను చేర్చడంపై ఆందోళన జీఎస్టీ (వస్తు సేవలపన్ను) రైతుకు గుదిబండగా మారనుంది. అన్ని రకాల ఎరువులను 12శాతం పన్నుల శ్లాబులోకి చేర్చడంతో అన్నదాతపై అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఎరువులపై అన్ని రాష్ట్రాల్లోనూ 4 నుంచి 8 శాతం పన్ను పరిధిలో ఉంది. ఇప్పుడు దీన్ని ఏకంగా 12 «శాతానికి పెంచడంతో ఎరువుల ధరలు అమాంతం పెరగనున్నాయి. రైతుల ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న నేటి పరిస్థితుల్లో ఎరువులపై పన్నులు పెంచడం మూలిగేనక్కపై తాటికాయ పడ్డచందంగా ఉందని రైతు సంఘ నాయకులు అంటున్నారు. చిత్తూరు, సాక్షి: దేశమంతటా ఒకే పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో జీఎస్టీ విధానం కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి అమల్లోకి తెస్తోంది. ఈ విధానం కొన్ని వర్గాలకు మేలు చేస్తుంటే దేశానికి వెన్నెముకవంటి అన్నదాతపై మోయలేని భారం అవుతోంది. ఇప్పుడున్న ధరల విధానంతోనే ఎరువులు కొనా లంటే అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో కర్షకులు ఉంటే.. ఎరువులపై మరింత పన్ను వేస్తూ వారి నడ్డివిరుస్తోంది. 12«శాతం పన్ను శ్లాబు లోకి ఎరువులను తేవడంతో టన్ను యూరి యాపై రూ.400, 50 కేజీల డీఏపీపై రూ.125, ఇతర కాంప్లెక్స్ ఎరువులపై టన్నుకు రూ.350 వరకు రైతులపై భారం పడనుంది. ఎరువుల ధరలపై విపరీతంగా ఖర్చుపెరుగుతున్నా..దిగుబడికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఒక్క ఖరీఫ్‌లోనే.. జిల్లాలో ఖరీఫ్‌లో యూరియా 40,539, డీఏపీ 12050, పొటాషియం 8500, కాంప్లెక్స్ ఎరువులు 31,900, పాస్పేట్ 2300 టన్నుల వినియోగం ఉంటుంది. యూరియాపై రూ.16.10 కోట్లు, డీఏపీపై రూ.3.01 కోట్లు, పొటాషియంపై రూ.34 లక్షలు, కాంప్లెక్స్ ఎరువులపై రూ.12 కోట్లు, పాస్పేట్పై రూ.5.75 లక్షలు భారం పడనుంది. ఒక్క ఖరీఫ్‌లోనే రూ.32 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటి వరకు సేంద్రియ ఎరువులు, బయోఫర్టిలైజర్స్పై ఎలాంటి పన్నులు లేవు. వీటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవడంతో వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే సేంద్రియ వ్యవసాయానికి అలవాటు పడుతున్న జిల్లా రైతాంగానికి ఇది ఏమాత్రం రుచించడం లేదు. ఓ వైపు సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతులపై ఒకింత ఒత్తిడి తెస్తూనే పన్నులు వేయడం.. నోటితో చెప్పి నుదిటితో వెక్కిరించినట్లు ఉందని వారు అంటున్నారు. స్పష్టత లేదు.. ఎరువులపై పెరిగిన పన్నును భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. ఒక్క యూరియా బస్తాపైనే సుమారు రూ.20 వరకు పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్‌కే సుమారు జిల్లాలో రూ.16కోట్ల వరకు భరించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా అన్నది అనుమానించాల్సిన విషయం. ఇతర సూక్ష్మపోషకాల కంటే ఎక్కువ సబ్సిడీ యూరియాపైనే ఉండడంతో రైతులందరూ యూరియానే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు యూరియాపై కూడా జీఎస్టీ బండ పడడంతో వినియోగం తగ్గుతుందని రైతు సంఘ నాయకులు అంటున్నారు. -
జీఎస్టీతో ఎరువు మరింత బరువు
-
ఎరువు మరింత బరువు!
యూరియాకు జీఎస్టీ దెబ్బ ► టన్నుకు రూ.300–400 వరకు పెరగనున్న ధర ► 50 కిలోల డీఏపీపై రూ.100–125 వరకు పెరిగే అవకాశం ► ఎరువులపై 12 శాతం జీఎస్టీని నిర్ణయించిన కౌన్సిల్ ► రాష్ట్రంలో వచ్చే సీజన్లో 13.5 లక్షల బస్తాల యూరియా, 2.5 లక్షల బస్తాల డీఏపీ వినియోగం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం కోసం తీసుకువస్తున్న ‘వస్తుసేవల పన్ను (జీఎస్టీ)’తో రైతులపై మాత్రం భారం పడనుంది. ఎరువులపై ప్రస్తుతం 4 నుంచి 8 శాతం మధ్య పన్నులు ఉండగా.. జీఎస్టీలో ఎరువులపై 12 శాతం పన్ను విధించేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో ఎరువులు, సూక్ష్మ పోషకాల విక్రయ ధరలు అనివార్యంగా పెరగనున్నాయి. దీనివల్ల సాగు వ్యయం పెరుగుతుందని, ఎరువుల వినియోగంలో సమతుల్యత దెబ్బతింటుందని ఎరువుల కంపెనీలు వాదిస్తున్నాయి. రూ.100 వరకు పెరగనున్న యూరియా జీఎస్టీలో 12 శాతం పన్ను విధించడంతో.. దేశంలోనే అత్యధికంగా వినియోగమయ్యే యూరియా ధర టన్నుకు ఏకంగా రూ.300 నుంచి రూ.400 వరకు పెరిగే అవకాశముంది. డై అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ) వంటి ఎరువుల ధరలు కొన్ని రాష్ట్రాల్లో టన్నుకు రూ.3 వేల వరకు పెరగనున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎరువులు, సూక్ష్మ పోషకాలపై ఎటువంటి పన్నులూ లేవు. తెలంగాణ వంటి పలు రాష్ట్రాల్లో నామమాత్రపు పన్నులు న్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎరువుల ధరలు ఎక్కువగా పెరిగే అవకాశముంది. ఇక రోడ్డు రవాణాపై 5 శాతం జీఎస్టీ విధించడం వల్ల కూడా ఎరువుల చిల్లర ధరలపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఎరువుల రవాణాపై ఎటువంటి సర్వీసుట్యాక్స్ లేకపోవడం గమనార్హం. వందల కోట్ల భారం.. జీఎస్టీ విధింపుతో ఏయే రకం ఎరువు ధర ఎంతమేర పెరగనుందనే లెక్కలు వేస్తున్నారు. అంతేగాకుండా పెరిగిన ధరలను ప్రభుత్వం భరిస్తుందా లేక రైతులపైనే భారం వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ మొత్తాన్నీ ప్రభుత్వమే భరిస్తే మాత్రం ఖజానాపై వందల కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా. అయితే యూరియా ధరలను ప్రభుత్వమే నియంత్రిస్తోంది. ప్రస్తుతం టన్ను యూరియా ధర రూ.5,630గా ఉంది. ఇది మినహా మిగతా ఎరువులపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ఆయా కంపెనీలే ఉత్పత్తి వ్యయం ఆధారంగా ధరలు నిర్ణయించుకుంటాయి. కాగా రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ కోసం 8 లక్షల టన్నులు, యాసంగి కోసం 5.5 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీంతో పన్ను కారణంగా ధరలు పెరిగితే.. భారం ఎవరిపై పడుతుందనేది ప్రాధాన్యంగా మారింది. డీఏపీ కూడా భారమే.. 50కిలోల డీఏపీ బస్తా చిల్లర ధర రూ.100–125 వరకు పెరిగే అవకాశ ముం ది. ప్రస్తుతం డీఏపీ బస్తా రూ.వెయ్యి వరకు ఉండగా.. జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను తో కలిపి రూ.1,125 అవుతుందని మార్కె ట్వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రభు త్వం అత్యధిక సబ్సిడీ ఇస్తున్న యూరియా కు డీఏపీ సహా మిగతా ఎరువులకు మధ్య ధరలో తేడా బాగా పెరిగే అవకాశ ముంది. దీంతో రైతులు యూరియానే ఎక్కువగా వినియోగించడంపై దృష్టి పెడతారని ఎరువుల కంపెనీలు అంటున్నాయి. దానివల్ల సూక్ష్మ పోషకాలు అందక పంటల దిగుబడులు తగ్గిపోతాయని పేర్కొం టున్నాయి. కాగా రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ సీజన్‌కు 2.5 లక్షల బస్తాల డీఏపీని సరఫరా చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. -
కన్నారెడ్డి కేసు: సర్కారు సీరియస్
లంచం ఇవ్వబోనని చెప్పడమే కాక లంచగొండి అధికారిని ఏసీబీకి పట్టించాలని అనుకున్నందుకు పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కన్నారెడ్డి కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కన్నారెడ్డిని చితకబాదిన కేసులో మోమన్‌పేట ఎస్ఐ రాజు, ఏఎస్ఐ వీరాస్వామితో పాటు హెడ్ కానిస్టేబుళ్లు వెంకటయ్య, శంకరయ్య, కానిస్టేబుళ్లు శివయ్య, రాఘవేందర్‌లను హెడ్ క్వార్టర్స్‌కు ఎటాచ్ చేశారు. ఫెర్టిలైజర్ షాపు అనుమతి కోసం వ్యవసాయాధికారి నీరజను కన్నారెడ్డి కలిశారు. అయితే అందుకు అతడి నుంచి నీరజ రూ. 20వేల లంచం డిమాండ్ చేశారు. లంచం ఎందుకివ్వాలని అడిగినందుకు కన్నారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా నీరజ ఫిర్యాదుతో ఎస్ఐ రాజు, సిబ్బంది కలిసి కన్నారెడ్డిని చితకబాదారు. రాజు దాడితో కన్నారెడ్డి రెండు కిడ్నీలు బాగా దెబ్బతిన్నాయి. దాంతో అతడు హైదారబాద్ ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
వన్నె తగ్గిన పసుపు
క్వింటాల్‌కు రూ.3వేలు తగ్గిన ధర - గతేడాది రూ. 9 వేల దగ్గరలో.. - ఇప్పుడు రూ. 5 వేల వరకే.. - పెరిగిన కూలి రేట్లు, పెట్టుబడి ఖర్చులు - పెట్టుబడులూ గిట్టవంటున్న రైతులు సాక్షి, మహబూబాబాద్: రైతులకు పసుపు పంట కూడా నిరాశే మిగిల్చింది. కనీసం పెట్టు బడి చేతికి అందివచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. గత ఏడాది క్వింటాల్ పసుపునకు రూ.9 వేలు పల కగా.. ప్రస్తుతం రూ.5 వేల నుంచి రూ.6 వేలు మాత్రమే ధర పలుకుతోంది. సోమవారం జిల్లాలోని కేసముద్రం మార్కెట్ పసుపు కాడిరకం గరిష్టంగా రూ. 5,300, కనిష్టం రూ. 4,217 పలికింది. గోళ రకం గరిష్టంగా రూ. 4,900, కనిష్టంగా రూ. 4,170 పలికింది. రాష్ట్రంలో నిజామామాబాద్ తర్వాత మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మార్కెట్లో పసుపు క్రయ, విక్రయాలు అధికంగా జరుగుతాయి. రాష్ట్రంలోనే సాగు విస్తీర్ణంలో కూడా మహబూబాబాద్ జిల్లా మూడోస్థానంలో నిలుస్తోంది. ఆదాయం మాట ఏమో గానీ పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 9,390 హెక్టార్లలో పసుపును సాగు చేశారు. గతంలో ఎకరా విస్తీర్ణంలో సాగు చేయడానికి రూ.50వేల వరకు ఖర్చు కాగా, పెరిగిన పెట్టు బడులు, కూలీల రేట్లతో ఇప్పుడు రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధార ణంగా ఎకరం విస్తీర్ణంలో 20 క్వింటాళ్ల ఎండిన పసుపు దిగుబడి వస్తుంది. ఈ సారి మాత్రం దాదాపు అందరికీ 15 క్వింటాళ్ల దిగుబడే అందుతోంది. దీన్ని మార్కెట్లో విక్రయిస్తే రూ. 90వేలు సైతం రావడం లేదు. పెరిగిన కూలి రేట్లు.... మార్కెట్లో పడిపోయిన ధరకు తోడు కూలి రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి. గత ఏడాది మహిళ కూలీకి రూ.100 ఉండగా, ఈ సారి రూ.250కి పెరిగింది. ఎకరం పంటను తీయడానికి 60 మంది కూలీలకు రూ.15,000 వరకు చెల్లిస్తున్నారు. మార్కెట్లో కూలి రేట్లు పెంచాలని నెల రోజులుగా ఇక్కడి కూలీలు సమ్మె చేస్తున్నారు. అయితే, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూలీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో నెల రోజుల తర్వాత సోమవారం మార్కెట్ ప్రారంభమైంది. శ్రమ అంతా వృథా అయింది పసుపుకు మార్కెట్లో ధర బాగా వస్తుందని పండించాను. విత్తనాల ఖర్చు కాకుండానే రూ.30 వేల పెట్టుబడి పెట్టాను. ఏడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు వచ్చే సరికి క్వింటాల్‌కు రూ. 4,981, గోల రకానికి రూ. 4,500 ధర పలికింది. పెట్టుబడి కూడా రాలేదు. శ్రమ అంతా వృథా అయింది. –బొడ్డుపెల్లి శ్రీను, నెక్కొండ, వరంగల్ రూరల్ జిల్లా ఎకరం పసుపు సాగుకు పెట్టుబడి వివరాలు ► విత్తనం(8 క్వింటాళ్లు) రూ.32,000 ► దుక్కి దున్నేందుకు రూ.3,000 ► సేంద్రియ ఎరువుకు రూ.10,000 ► విత్తనం వేసేందుకు(12మంది కూలీలకు) రూ.3,000 ► విత్తనం వేయడానికి నాగలి కూలికి రూ.800 ► విత్తనం వేసేముందు దుక్కి దున్నేందుకు రూ.1,500 ► కలుపు మందుకు రూ. 300 ► గుంటక దున్నేందుకు(5 సార్లకు) రూ. 3,500 ► మూడు సార్లు కలుపు తీతకు కూలీలకు రూ. 9,000 ► ఎరువులు(యూరియా, పొటాష్) రూ. 5,400 ► పురుగు మందులకు రూ.1,500 ► గుళికలు(దుంపకుళ్లు నివారణకు),ఫంగిసైట్స్ రూ. 3,000 ► పసుపు దున్నడానికి నాగలి కూలి రూ. 6,000 ► భూమి నుంచి పసుపు తీసేందుకు (60 మంది కూలీలకు) రూ.1,5000 ► ఉడకబెట్టడానికి ఆరుగురు కూలీలకు రెండు రోజుల పాటు రూ.7,000 ► ఎండిన పసుపును పాలిష్ చేసేందుకు రూ. 2,000 ► ఎకరం పసుపును పండించడానికి చేతికి అందే సరికి ఇలా మొత్తం పెట్టుబడి దాదాపు రూ. 1,03,000 -
మార్కెట్లకు మాన్సూన్ కిక్
ముంబై: బెటర్ మాన్సూన్ అంచనాలు దలాల్ స్ట్రీట్ లో మెరుపులు మెరిపిస్తున్నాయి. ఈసారి రుతుపవనాలు బాగా ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంతో పోలిస్తే 50 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలపై వాతావరణ శాఖ అనుకూలమైన అంచనాలతో ఎరువులు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ మేకర్స్ ఎఫ్ఎంసిజి కంపెనీలకు మంచి డిమాండ్ పుట్టింది. ముఖ్యంగా ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 2 శాతానికిపైగా లాభాలతోబిఎస్ఇలో టాప్ సెక్టార్‌గా నిలిచింది. బుల్‌రన్‌లో ఇతర సెక్టార్లతోపాటు,ఎరువులు, విత్తనాలు కంపెనీల షేర్లపై మదుపర్ల ఆసక్తి నెలకొంది. కొనుగోళ్ల ధోరణి భారీగా కనిపిస్తోంది. దీంతో అన్నిఫెర్టిలైజర్స్, ఇతర విత్తనాల కంపెనీ షేర్లలో భారీ ర్యాలీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్సీఎఫ్ 4.85 శాతం, కోరమాండల్ ఇంటర్నేషనల్ 2.5 శాతం, జీఎస్ఎఫ్సీ 1.8 శాతం, చంబల్ ఫెర్టిలైజర్స్ 2.4 శాతం, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ 3.66 శాతం, జువారి ఆగ్రో 2 శాతం, అగ్రి టెక్ 4 శాతం పైగా పెరిగాయి. అలాగే జైన్ ఇరిగేషన్, ర్యాలీస్ ఇండియా ఎస్కార్ట్స్ లాభపడుతున్నాయి. దీంతోపాటు స్టాక్మార్కెట్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో జోరు కనిపిస్తోంది. ఈ రంగంలోని దాదాపు అన్ని స్టాక్స్‌లోను కొనుగోళ్లు పెరిగాయి. ఐటీసీ, ఇమామి, బ్రిటానియా షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఈ లాభాల మద్దతుతో నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త ఆల్ టైంని తాకి జోరుమీద ఉన్నాయి. -
రూ.5.62 లక్షలు విలువైన ఎరువుల బస్తాలు సీజ్
అనంతపురం సెంట్రల్ : అనంతపురం తపోవనం సమీపంలోని సీడబ్యూహెచ్సీ గోదాముపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇఫ్కో కంపెనీకి చెందిన 20–2–0–13 రకం ఎరువులు గడువు మీరిన వాటిని కొత్త సంచుల్లోకి మార్పిడి చేసి విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. మొత్తం 564 బస్తాలు సీజ్ చేయగా, వాటి విలువ సుమారు రూ. 5.62 లక్షలు ఉంటుందని అంచనా. రైతులను మోసగించాలనే దురుద్దేశంతో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఎరువులను పాత సంచుల నుంచి కొత్త సంచుల్లోకి మార్పు చేస్తున్నట్లు తేలిందన్నారు. సదరు ఎరువులను శాంపిల్ తీసి అగ్రికల్చర్ ల్యాబ్‌కు పంపనున్నట్లు వెల్లడించారు. తదుపరి చర్య నిమిత్తం డిటెన్షన్ నోటీసు జారీ చేశామని చెప్పారు. తనిఖీలో విజిలెన్స్ సీఐ రెడ్డప్ప, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉమాపతి, స్థానిక ఏఓ వాసుప్రకాశ్ పాల్గొన్నారు. -
అన్నీ లాభాలే
- అన్ని పంటలకూ వాడుకోవచ్చు – ఖరీఫ్‌కు అవసరమైన ట్రైకోడెర్మావిరిడీ సిద్ధం – వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి అనంతపురం అగ్రికల్చర్ : జీవరసాయన ఎరువులైన ట్రైకోడెర్మావిరిడీ, సూడోమోనాస్ ఫ్లోరోసెస్‌లు అటు వ్యవసాయ ఇటు ఉద్యాన పంటలలో విత్తన శుద్ధిగానూ, పిచికారీ మందుగానూ సమర్థవంతంగా పనిచేస్తాయని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. తక్కువ ధరతో అధిక ప్రయోజనాలు కలిగే ఈ రకం మందుల గురించి రైతుల్లో మరింత అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో విత్తన వేరుశనగ పంపిణీతో పాటు విత్తనశుద్ధి మందుగా ట్రైకోడెర్మావిరిడీని పంపిణీ చేస్తున్నామన్నారు. ఇక్కడే తయారు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న బయోకెమికల్ ల్యాబ్ (బీసీ ల్యాబ్)లో వీటిని తయారు చేస్తున్నాము. ఈ ఏడాది ఖరీఫ్‌కు అవసరమైన 80 టన్నుల ట్రైకోడెర్మావిరిడీ, 2 వేల కిలోలు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ సిద్ధం చేస్తున్నాము. విత్తన వేరుశనగ పంపిణీ సమయంలో 75 శాతం రాయితీతోనూ, ఇతర వ్యవసాయ పథకాల కింద 50 శాతం రాయితీతో రైతులకు అందుబాటులో పెడుతున్నాము. ట్రైకోడెర్మావిరిడీ 500 గ్రాముల ప్యాకెట్ రూ.50, సూడోమోనాస్ 500 గ్రాములు రూ.75 ప్రకారం తీసుకోవచ్చు. ఇతరత్రా మందులతో పోల్చిచూస్తే ట్రైకోడెర్మావిరిడీ, సూడోమోనాస్ ఫ్లోరోసిస్ తక్కువకే లభిస్తాయి. రైతులు ఎప్పుడు కావాలన్నా అందించడానికి బీసీ ల్యాబ్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. మరిన్ని వివరాలకు 08554–231713 ఫోన్ నెంబర్లో సంప్రదించొచ్చు. ట్రైకోడెర్మావిరిడీ ఇది పైర్ల ఎదుగుదలకు సహకరించే మిత్ర శిలీంధ్రం. అన్ని రకాల భూముల్లో సాధారణంగా ఉండే జీవకణాలకు విభజించి హానికరమైన శిలీంధ్రాలను అదుపులో పెడుతుంది. విషపూరితమైన కణాలను ఉత్పత్తి చేసి విత్తనాలకు కవచంగా ఉంటూ హానికరమైన శిలీంధ్రాల నుంచి రక్షిస్తుంది. నిర్ధారించిన తెగుళ్లను సమర్థవంతంగా అరికడుతుంది. విత్తనం లేదా భూమి నుంచి సోకే తెగుళ్లను అరికట్టి రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. నులిపురుగులు అభివృద్ధి కాకుండా నిరోధిస్తుంది. రోగ నిర్మూలన కాయకుళ్లు, మొదలుకుళ్లు, మాగుడు తెగులు, వేరుకుళ్లు, కాండంకుళ్లు, ఎండుతెగులు, పసుపుకొమ్మ తెగుళ్లు లాంటి వాటిని నిర్మూలిస్తుంది. శనగ, వేరుశనగ, కంది, పొద్దుతిరుగుడు, టమోటా, సోయాచిక్కుడు, చెరకు, పసుపు, గోధుమ, ఆవాలు, వరి, ఉల్లి, అరటి, తమలపాకు, వంగ, మిరప, చీనీ, కాలీఫ్లవర్, పత్తి, దోస, ఇతర పండ్ల తోటల్లో విరిడీని వాడొచ్చు. విత్తన శుద్ధిగా అయితే కిలో విత్తనానికి 10 గ్రాములు విరిడీ మందు కలిపి వాడాలి. భూమిలో చల్లే విధానం అయితే 100 కిలోల మెత్తని పశువుల ఎరువులో నాలుగు కిలోల విరిడీ పొడి కలిపి దానికి 10 కిలోల వేపచెక్క కలిపి వారం రోజులు నీడలో ఉంచి నీళ్లు చిలకరిస్తూ తెల్లటి బూజు వచ్చేన తర్వాత ఎకరా భూమిలో చల్లుకోవాలి. ఇలా అనేక రకాలుగా ఈ మందులు ఉపయోగపడుతున్నందున వీటి వాడకంపై రైతులు దృష్టి సారించాలి. -
ఎరువులే కాదు విత్తనాలూ కొనుక్కోవచ్చు
♦ రూ.4 వేల సాయంపై మంత్రి పోచారం స్పష్టీకరణ ♦ కౌలు రైతులకూ న్యాయం చేస్తామని వెల్లడి ♦ గ్రామ సభల ద్వారా రైతుల జాబితా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ. 4 వేల సాయం కేవలం ఎరువుల కోసమే కాదనీ, ఆ సొమ్మును సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఇతరత్రా అవసరాలకు పెట్టుబడి ఖర్చుగా రైతులు ఉపయోగించుకోవచ్చని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఆధ్వర్యంలో డీసీసీబీ అధ్యక్షులు, సహకార బ్యాంకుల సీఈవోలతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, రైతులకు ఎన్ని ఎకరాలు ఉందో, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో గ్రామ సభల్లో గుర్తించి జాబితా తయారుచేస్తామన్నారు. ఆ ప్రకారం వారికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. కౌలు రైతులకు ఎలా సాయం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. కౌలు రైతులను అధికారికంగా గుర్తించేలా డాక్యుమెంటు ఉండాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా నేరుగా ఇవ్వడం సాధ్యంకాదని తెలిపారు. ఒకవైపు రుణమాఫీ పూర్తిగా చేసి, ఇప్పుడు పెట్టుబడి ఖర్చు కింద డబ్బులు ఇవ్వడం చరిత్రాత్మకమన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతు యూనిట్‌గా మార్పు చేయాలని తాము కేంద్రానికి సూచించామన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి మోదీతోనూ సీఎం చర్చించారని వెల్లడించారు. ఏఈవో యూనిట్‌గా కొనుగోలు కేంద్రం ఇక నుంచి వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) యూనిట్‌గా కొనుగోలు కేంద్రాలు నడుస్తాయని పోచారం తెలిపారు. అంతేగాక ఏఈవోనే విత్తనాలు, ఎరువులను కూడా రైతులకు అందజేస్తారన్నారు. వచ్చే నెల మొదటి వారంలో ‘మన తెలంగాణ, మన వ్యవసాయం’కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎండీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ భూములను పంట కాలనీలుగా మార్చాలి రాష్ట్ర జనాభాకు అనుగుణంగా వ్యవసాయ భూములను పంట కాలనీలుగా మార్చి రైతులకు లాభాలు, వినియోగదారులకు నాణ్యమై న ఆహార ఉత్పత్తులు అందే విధంగా ప్రణాళి కలు రూపొందించాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏదైనా పంటకు మంచి ధర రాగానే తదుపరి ఏడాది రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేయడంతో ధరలు పడిపోయి నష్టపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించి.. రైతులకు, వినియోగదారులకు లాభం చేకూర్చడానికి ఈ పంట కాలనీలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. -
ఎరువులే రైతు గుదిబండలు
అభిప్రాయం పాలకుల ఆలోచనెప్పుడూ రైతుల కన్నీళ్లకు, కష్టాలకు జవాబు చెప్పే సూక్ష్మస్థాయి శోధనగానే ఉండాలి.. వరుస కరువు, ఎరువుల భారం, ఎదిగిన ఆడబిడ్డల పెళ్లిళ్లు.. ఈ మూడింటి భారం దించిన రోజున సేద్యం దండగ కాదు పండగే అవుతుంది. వ్యవసాయం బతుకు దెరువు మాత్రమే కాదు. అది పల్లె జీవన విధానం. మట్టి మనుషుల సంస్కృతి. దేశ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) వ్యవసాయం వాటా 16 శాతం మాత్రమే కానీ దేశ జనాభాలో 53 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. వ్యవసాయం పండగ కావాలంటే పంటల ఉత్పాదకతలో మెరుగుదల ఉంటాలి. పెరుగుతున్న పెట్టుబడుల వ్యయాన్ని రాబట్టడంతో పాటు లాభాలను చూడగలిగి తేనే రైతు బతుకుతాడు. కానీ ఏ రాష్ట్రంలో చూసినా వ్యవసాయం ఆశాజనకంగాలేదు. దాదాపు 17 రాష్ట్రాల్లో రైతు వార్షిక ఆదాయం రూ 20 వేలే ఉంది. అంటే నెలకు రూ. 1,666లు అన్నమాట. ఇలాగైతే వ్యవసాయం బతకటం చాలా కష్టం. జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య గణనీ యంగా తగ్గుతోంది. 1999 నుంచి 2000 సంవత్సరంలో 60 శాతం ఉండగా.. 2011–12 కు వచ్చే సరికి 49 శాతానికి పడిపోయింది. 2004 నుంచి 2012 మధ్య కాలంలో 3 కోట్లమంది శ్రామికులు వ్యవసాయాన్ని వదిలేశారు. 2019–20 నాటికి మరో 2.5 కోట్ల మంది శ్రామికులు వ్యవసాయాన్ని వదిలిపెట్టవచ్చని అంచనా. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే పంట ఉత్పత్తిలో మెరుగుదల ఉండాలి. పెరుగుతున్న పెట్టుబడుల వ్యయాన్ని రాబట్టడంతో పాటు, లాభాలు చూడగలిగితే రైతు బతుకుతాడు. దేశంలో ఏ ప్రాంతం, రాష్ట్రం కేసి చూసినా మన పలెటూళ్లలో రైతుకు ఎరువులు, విత్తనాలే గుదిబండలు. ఎదుగుతున్న పైరుకు అదును మీద ఎరువులు వేయాలంటే రైతు చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. యూరియా కట్టకైనా, కాంప్లెక్స్ ఎరువుకైనా షావుకారే దిక్కు. షావుకారి దోపిడీకి మా నాయన రామకృష్ణారెడ్డి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో మాకు ఏడు ఎకరాలు ఉండేది. చెరువు కింద భూమి. వరి పండేది. మా కుటుంబానికి జీవనాధారం ఆ భూమే. అప్పటికే అప్పు సప్పో చేసి నాటు పట్టేది. ఇక మందు కట్టలు అంటే మా ఊరి షావుకారు దగ్గరకు వెళ్లాల్సిందే. ఆయన లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మేది. మందు కట్ట ధర మీద రూ 150 ఎక్కువ రాసుకునేటోడు. పంట చేతికి అందే నాటికి దానికి రూ 3 చొప్పున వడ్డీ లెక్కకట్టేవాడు, ఇక్కడ ఇంకో షరతు ఉండేది. చేనులో పండిన పంట మందు కట్టలు ఇచ్చిన షావుకారికే అమ్మాలి. అది కూడా మార్కెట్ ధరతో సంబంధం లేకుండా, ఆయన నిర్ణయించిన ధరకే. ఆ పంటను కూడా మా నాయనే తీసుకుపోయి, సిద్దిపేట మార్కెట్లో అమ్మి డబ్బు తెచ్చి షావుకారు చేతిలో పెట్టే వాడు. అంత దుర్మార్గమైన దోపిడీ ఉండేది. నా యవ్వనపు తొలినాళ్లలో నక్సలిజం వైపు నా అడుగులు పడటానికి ఇలాంటి దోపిడీ ఓ కారణం. పల్లెల్లో ప్రతి రైతు పరిస్థితి ఇదే. దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న రైతాంగం కాళ్లకింది పునాది కదిలిపోతున్న సందర్భంలో పాలకుల ఆలోచనెప్పుడూ రైతుల కన్నీళ్లకు, కష్టాలకు జవాబు చెప్పే సూక్ష్మస్థాయి శోధనగానే ఉండాలి.. తెలంగాణలో 20 ఏళ్ల నుంచి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పందిరి మెట్ల మాదిరిగా పెనవేసుకొనిపోయిన కరువు, అప్పులు, ఆడబిడ్డ పెళ్లి, చేతి వృత్తుల విధ్వంసం, చెరువుల విలుప్తం.. వరుస కరువు, ఎరువుల భారం, ఎదిగిన ఆడబిడ్డ పెళ్లిళ్లే రైతు ఆత్మహత్యలకు కారణం. ఈ మూడింటి భారం దించిన రోజున వ్యవసాయం దండగ కాదు పండగే అవుతుంది. రైతన్న రాజన్న ఆయితాడు. ఇప్పటి వరకు రాజ్య పాలన చేసిన వాళ్లెవరూ ఆ స్థాయి శోధన కాదు కదా కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఉద్యమ నేతగా, పెద్ద రైతుగా కేసీఆర్ రైతు కష్టాలకు మూలాలను అన్వేషించారు. పాలకపక్ష నేతగా అన్నదాత కన్నీళ్లు తుడిచే పరిష్కారం చూపెడుతున్నారు. ఒక్కొక్క సమస్యను విడగొట్టి రైతు కష్టాలు బాపే వైపు అడుగులు పడుతున్నాయి. తెలంగాణ సమగ్ర ప్రగతికి సాగు భూమి, చేతి వృత్తుల అభివద్ధే వెన్నెముకలని ఉద్యమం తొలినాళ్లలోనే గుర్తించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నీళ్లు, నిధులు నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేస్తానని పంతం పట్టారు. రెండేళ్లలో గోదావరి జలాలు తెలంగాణ బీడు భూముల్లోకి మలిపేందుకు కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారు. పల్లెను మళ్లీ పచ్చగా నిలబెట్టే మహాయజ్ఞం చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 36 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేస్తూ నాలుగు విడతల్లో 17 వేల కోట్లు రుణాలు మాఫీ చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఆ పని చేయలేక నిక్కినీల్గుతున్నవేళ.. కేసీఆర్ ఉచిత ఎరువుల పంపిణీ పథకం రైతన్నకు మళ్లీ వ్యవసాయంపై భరోసాను ఇచ్చింది. రాష్ట్రంలో 57 లక్షల మంది సన్నచిన్నకారు రైతుల చేతిలో 1.57 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాలుసరి 25 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు వాడుతున్నారు. వాస్తవానికి రైతులు అవగాహనా లోపంతోనే మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారని, రాష్ట్ర రైతుల అవసరాలకు 17.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరిపోతాయని వ్యవసాయ శాఖ నివేదికలు చెప్తున్నాయి. ఈలెక్కన చూస్తే ఎరువుల సబ్సిడీ మీద రాష్ట్ర ప్రభుత్వానికి యేటా 6,300 కోట్ల భారం పడుతుందని అంచనా. యూరోపియన్ దేశాలతో పాటు బ్రెజిల్, చైనా, ఇండోనేసియా, కజకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, సౌత్ ఆఫ్రికావంటి దేశాల్లో వ్యవసాయం సబ్సిడీలపై భారీగానే ఖర్చు చేస్తున్నాయి. అయితే రైతుకు అత్యంత అవసరమైన ఎరువుల మీద ఏ దేశంలోనూ ప్రణాళికబద్ధమైన విధానాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎరువులపై సబ్సిడీ ఇచ్చి, ఆ డబ్బు నేరుగా రైతు ఖాతాల్లోనే జమ చేస్తోంది. ఈ విధానం భవిష్యత్తులో ప్రపంచ దేశాల సబ్సిడీ అమలుకు ఒక ఆసక్తికరమైన అంశంగా మారనున్నది. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త టీఆర్ఎస్ శాసన సభ్యుడు, రాష్ట్ర శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94403 80141 -
ఈ-పాస్ మిషన్లతోనే ఎరువుల పంపిణీ
- 1 నుంచి పకడ్బందీగా ప్రక్రియ - కర్నూలు సబ్ డివిజన్ డీలర్ల అవగాహన సదస్సులో ఏడీఏ కర్నూలు(అగ్రికల్చర్): మే నెల 1నుంచి రసాయన ఎరువులను విధిగా ఈ-పాస్ మిషన్ల ద్వారానే పంపిణీ చేయాలని కర్నూలు ఏడీఏ రమణారెడ్డి సూచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీపై కర్నూలు సబ్ డివిజన్లోని రసాయన ఎరువుల డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ...డీలర్లకు నాగార్జున, గ్రీన్‌ఫీల్డ్, క్రిప్కో కంపెనీలు ఈ-పాస్ మిషన్లను సరఫరా చేస్తాయన్నారు. ప్రతి డీలరు విధిగా తమ వివరాలను ఈ-పాస్ మిషన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రైతుల ఆధార్ నెంబర్లు, వెబ్‌ల్యాండు వివరాలను కూడా వీటిలో అప్లోడ్ చేస్తామన్నారు. మే నెల 1నుంచి మాన్యువల్‌గా ఒక్క బస్తా కూడా విక్రయించరాదన్నారు. భూసార పరీక్ష పలితాలను బట్టి, సాగు చేసే పంటను బట్టి ఎన్ని బస్తాల ఎరువులు అవసరమో అన్ని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీ చేయలేమని భావించే డీలర్లు ఈ వ్యాపారం నుంచి వైదొలగవచ్చన్నారు. జేడీఏ కార్యాలయ ఫర్టిలైజర్ ఏఓ వేదమణి, సీ.బెళగల్ ఏఓ సురేష్‌బాబు ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు, కల్లూరు వ్యవసాయాధికారులు అశోక్‌కుమార్‌రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎరువులకు బయోమెట్రిక్
- మే నెల నుంచి అమలుచేసే యోచన - రైతులకు పొంచివున్న కష్టాలు ఉదయగిరి: రైతులు ఇప్పటివరకు తమకు కావాల్సిన ఎరువులను నేరుగా ఎరువుల దుకాణానికి వెళ్లి తీసుకునే వారు. కానీ మే నెల నుంచి ఈ విధంగా కొనుగోలు చేసేందుకు వీలుకాదు. దీనికి కారణం ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. దీంతో ఎరువులు కొనుగోలు చేసే రైతు ఎరువుల వ్యాపారుల వద్దనున్న బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్రలు, ఐరిష్ సరిపోలితేనే ఎరువులు ఇస్తారు. లేకపోతే ఎరువులు తీసుకునే అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుంది. ఆ ప్రాంతాల్లో ఈ విధానం విజయవంతం కావడంతో మే నెల నుంచి దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి తేవాలని యోచిస్తోంది. అమలు విదానం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎరువులకు సబ్సిడీలు నేరుగా కంపెనీలకు చెల్లిస్తోంది. అందులో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్రం గుర్తించింది. ఈ అవినీతిని అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేవాలని సంకల్పించింది. ఈ క్రమంలో కంపెనీలు తాము ఉత్పత్తి చేసిన ఎరువులను డీలర్లకు పంపిణీ చేస్తారు. గతంలో అయితే సరుకులు డీలర్లకు అందిన వెంటనే ప్రభుత్వం సబ్సిడీ నేరుగా కంపెనీలకు అందచేసేది. ప్రస్తుత విధానంలో డీలరు నుంచి రైతు కొనుగోలు చేసిన ఎరువులకు మాత్రమే సబ్సిడీని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తుంది. దీంతో ఖచ్చితత్వం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు తిప్పలు తప్పవా! జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాల్లో వివిధ రకాల పైర్లు సాగు చేస్తారు. ఇందుకుగాను ఖరీఫ్ సీజన్లో యూరియా 34,320 మెట్రిక్ టన్నులు, డీఏపీ 9899 మెట్రిక్ టన్నులు, పొటాష్ 7798 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 24,699 మెట్రిక్‌టన్నులు, సింగిల్ సూపర్ పాస్పేట్ 4944 మెట్రిక్ టన్నులు విని యోగిస్తారు. అదేవిధంగా రబీ సీజన్లో 4,93,589 మెట్రిక్ టన్నులు డీఏపీ, 10,583 పొటాష్ 8806, కాంప్లెక్స్ ఎరువులు 14588 మెట్రిక్ టన్నులు, సింగిల్ సూపర్ పాస్పేట్ 6327 మెట్రిక్ టన్నులు వినియోగిస్తారు. ఈ విధానం అమల్లోకొస్తే ఎరువులు కొనుగోలు రైతులకు కష్టతరంగా మారనుంది. ఇప్పటివరకు తమకు అవసరమైన ఎరువులను నేరుగా దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసేవారు. కానీ కొత్త విధానంలో పీబీటీ, ఈ–పాస్ మిషన్‌లో వేలిముద్రలు వేసి ఎరువులు తీసుకోవాల్సివుంది. వేలిముద్రలు పడని వ్యక్తులకు ఐరిష్ ద్వారా ఎరువులు అందచేస్తారు. ప్రస్తుతం రైతులకు కావలసిన ఎరువులన్నీ కొనుగోలు చేయవచ్చు. ఆంక్షలైతే లేవు. కానీ భవిష్యత్తులో ఎరువులు కొనుగోలు కూడా కోటా పద్ధతినే అనుసరించే అవకాశముంది. రైతులకు సంబంధించిన ఆధార్, వ్యవసాయ భూములతో ఖచ్చితంగా అనుసంధానం కావాల్సివుంది. ఆన్లైన్లో ఆ రైతు పేరుమీద ఉన్న భూములకు మాత్రమే ఎరువులు అందించే అవకాశముంది. రాన్రాను వ్యవసాయ అధికారులు ఒక ఎకరాకు సిఫార్సు చేసిన ఎరువులు మాత్రమే రైతులకు అందే అవకాశముంది. ఈ పరిణామం రైతులకు కొంత ఇబ్బందిగా మారవచ్చు. ఈ విధానం మంచిదే అయినప్పటికీ చిత్తశుద్ధితో అమలు ప్రక్రియపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిక్షణ తరగతులు పదిహేను రోజుల క్రితం ఈ విధానం అమలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది వ్యవసాయాధికారులను ఎంపికచేసి విజయవాడలో మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ తీసుకున్న అధికారులు ఆయా వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోవున్న వ్యవసాయాధికారులకు శిక్షణ ఇస్తారు. ఈ వ్యవసాయాధికారులు వారి పరిధిలోవున్న ఎరువుల దుకాణ యజమానులకు శిక్షణ ఇస్తారు. ఏప్రిల్‌లో చివరి వారానికి అన్ని ఎరువుల దుకాణాలకు డీబీటీ, ఈ–పాస్ యంత్రాలను సరఫరా చేస్తారు. మే నెల 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఈ విధానాన్ని కష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాలలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. జిల్లావ్యాప్తంగా దీన్ని అమలు చేసేందుకు మూడు రోజుల క్రితం జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఎంపిక చేసిన అధికారులతో జిల్లాస్థాయి వ్యవసాయాధికారులు సమావేశం ఏర్పాటుచేసి ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు పలు సూచనలిచ్చారు. -
ఎరువులో బోరు మట్టి !
చెన్నేకొత్తపల్లి : మండల వ్యాప్తంగా కల్తీ ఎరువులు హల్చల్ చేస్తున్నాయి. ఎరువులో బోరు మట్టిని కలిపి విక్రయిస్తుండడంతో రైతులు గుర్తించలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన రైతు సూరి గోరు చిక్కుడు సాగు చేశారు. 15 రోజుల క్రితం ధర్మవరంలోని ఓ ఎరువుల దుకాణం నుంచి 17-17-17 రకం కాంప్లెక్స్ ఎరువును కొనుగోలు చేశారు. డ్రిప్ ద్వారా పంటకు అందజేసేందుకు రెండు కిలోల ఎరువును బకెట్ నీటిలో కలిపితే బకెట్ అడుగున బోరు మట్టి పేరుకుపోయి కనిపించింది. దీంతో మరికొందరు రైతులను ఆయన విచారణ చేయగా మరికొందరికి ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు తెలిసింది. అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఎరువుల దుకాణంలో అగ్నిప్రమాదం
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. తిరుమల ఎరువుల దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి రెండు ఫైరింజిన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యవసాయ సేవలు బంద్
► నిలిచిపోయిన ఎరువులు, విత్తన లైసెన్స్ లు ►జిల్లాల పునర్విభజనతో కొత్త ఇబ్బందులు ► ఆన్ లైన్ లో కనిపించని 61 మండలాలు సాక్షి, వరంగల్: పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖలో మార్పులు చేయలేదు. దీంతో వ్యవసాయ విస్తరణ సేవలు, ఎరువులు, విత్తనాల విక్ర యాల కోసం ఇచ్చే లైసెన్స్ ల జారీలో కొత్త సమస్యలు వచ్చాయి. జిల్లాల పునర్విభజన లో మారిన మండలాల్లో విత్తనాలు, ఎరు వుల విక్రయాల లైసెన్స్ ల ప్రక్రియ నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మండలాల్లో విత్తనాలు, ఎరువుల లైసెన్స్ ల జారీ ఆగిపోయింది. ఆన్ లైన్ లో జారీ పారదర్శకత కోసం వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువుల లైసెన్స్ జారీ ప్రక్రియను ఆన్ లైన్ లో జారీ చేస్తోంది.లైసెన్స్ లు అవసరమైన వారు... అవసరమైన గ్రామం, మండలం, జిల్లా పేర్లను పేర్కొంటూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేవారు. అధికారులు వాటిని పరిశీలించి గడువులోపులైసెన్స్ లను జారీ చేసేవారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ పరంగా మండలం, డివిజన్, జిల్లాల యూనిట్లుగా పరిపాలన సాగుతుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక్కో అసెంబ్లీ నియో జకవర్గాన్ని ఒక యూనిట్‌గా మార్చారు. ఉమ్మడి జిల్లా నుంచి మరొక జిల్లాల్లోకి మారిన మండలాల్లో సాంకేతికంగా సమస్య ఉంది. పాత ఉమ్మడి జిల్లాల్లో పరస్పరం మారిన మండలాల్లో వ్యవసాయ శాఖ సేవల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
వ్యవసాయంలో క్యాష్‌లెస్‌కు శ్రీకారం
- ఎరువులు, విత్తన దుకాణాలు, సహకార కేంద్రాల్లో స్వైపింగ్ మిషన్లు - 15 రోజుల్లోగా సిద్ధంగా ఉంచుకోవాలని వ్యవసాయశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రైతులను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. అందుకోసం ఆ శాఖ నూతన కమిషనర్ జగన్మోహన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎరువులు, విత్తన డీలర్లు, దుకాణదారులు 15 రోజుల్లోగా స్వైపింగ్ మిషన్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా రైతుల వద్ద ఉండే డెబిట్ కార్డుల ద్వారానే ఆర్థిక లావా దేవీలు జరపాలని.. తద్వారా వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలని.. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధి కారుల(డీఏవో)ను ఆదేశించారు. ఇక స్వైపింగ్ మిషన్ల సరఫరాకు అవసరమైన సాంకేతిక సహకారం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ)కి లేఖ రాశా రు. రైతులను, వ్యవసాయాధికారులను నగదు రహిత లావాదేవీల వైపు నడిపించేందుకు జగన్మోహన్ జిల్లాల్లో పర్యటిం చనున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రాథమిక సహకార సంఘాలు(ప్యాక్స్), డీసీసీబీల్లోనూ స్వైపింగ్ మిషన్లను అందుబాటులో ఉంచా లని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞపి చేసింది. వ్యవసాయశాఖ నిర్ణయంతో వేలాది స్వైపిం గ్ మిషన్లకు గిరాకీ ఏర్పడింది. ఎరువులు, విత్తన డీలర్లు, ప్యాక్స్‌లు కొత్తగా మిషన్లను కొనుగోలు చేయాలి. 15 రోజుల్లోగా స్వైపిం గ్ మిషన్లు అందుబాటులో ఉంచుకోకపోతే వ్యవసాయశాఖ అధికారులు డీలర్లపై చర్య లు తీసుకునే అవకాశం ఉంది. -
సేంద్రియ ఎరువులు వాడాలి
కలెక్టర్ అరుణ్‌కుమార్ బోట్‌క్లబ్ (కాకినాడ) : రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులు వినియోగం పెంచాలని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా సోమవారం కృషిభవన్‌లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమిలో సారం తగ్గడంతోపాటు రైతులు ఎక్కువ పెట్టుపెడి పెట్టాల్సి వస్తోందన్నారు. ఈ విషయం భూసార పరీక్షల్లో వెల్లడైందన్నారు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూమి సారవంతగా తయారవుతుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకంలో మనరాష్ట్రం ప్రపంచంలోనే ముందంజలో ఉందన్నారు. జిల్లాలోని పలు పంట పొలాల్లో సూక్ష్మధాతు లోపాలు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు రైతులు జింక్, బోరాన్ వంటి వాటిని వేసుకోవాలన్నారు. వీటిని సబ్సిడీపై అందిస్తున్నట్టు చెప్పారు. పెద్దనోట్ల రద్దు కారణంగా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకొంటున్నామన్నారు. రైతులు కూడా రూపేకార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపాలని కోరారు. ప్రస్తుతం రైతులు ధాన్యం అమ్మిన నగదు బ్యాంకుల్లో జమవుతుందని , రైతుల ఖాతాల్లో ఎంత నగదు పడినా దానికి పన్ను కట్టనవసరం లేదన్నారు. వ్యవసాయశాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. పురుగు మందులు కొనుగోలు చేస్తుంటే పలు దుకాణాల్లో బిల్లులు ఇవ్వడం లేదని, సేంద్రియ ఎరువుల వాడడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ డీడీలు వీటీ రామారావు, లక్ష్మణరావు, కాకినాడ ఏడీ భవానీ, వైవీ సుబ్బారావు రైతులు పాల్గొన్నారు. -
‘రబీలో విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: రబీ సాగు కోసం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు విత్తనాలు, ఎరువు లు, పురుగుమందులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. రుణమాఫీతో సంబంధం లేకుండా బ్యాంకుల ద్వారా రైతులకు కొత్త అప్పులు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం లేఖ రాశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 313 మండలాల్లో పంటనష్టం వాటిల్లినా కరువును ప్రకటించకుండా రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం బాధ్యతారహిత ప్రకటనలు చేశారన్నారు. పంటనష్టపోరుున రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.1,350 కోట్లు కరువు సాయం కింద విడుదల చేసిందని, 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. -
ఫెర్టిలైజర్ షాపులపై విజిలెన్స్ దాడులు
► ఒక షాపుపై 6ఏ కేసు నమోదు ►రూ.21.1 లక్షల బయో అమ్మకాలు నిలిపివేత చీరాల టౌన్ : చీరాల పట్టణం, మండలంలో ఉన్న ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై మంగళవారం ఒంగోలు విజిలెన్స్ డీఎస్పీ ఈ.సుప్రజ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకువిజిలెన్స్, వ్యవసాయశాఖ సహకారంతో నిర్వహించిన ఈ దాడుల్లో పలు లోపాలను గుర్తించామని డీఎస్పీ తెలిపారు. పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర, సుభాషిణి, అన్నపూర్ణ, ఆర్కే, బాలాజీ, వెంకటేశ్వర ఫెర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అనుమతి పత్రాలు, స్టాక్ రిజిస్టర్లు, ’ఓ’ ఫారం తదితర లావాదేవీలను పరిశీలించారు. పట్టణంలోని బాలాజీ ఫెర్టిలైజర్ దుకాణంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.21.1 లక్షల విలువ కలిగిన బయో ఉత్పత్తులు కలిగి ఉండటంతో పాటు వీటి అమ్మకాలను నిలిపివేయడంతో, వాటిని అమ్మకూడదని దుకాణదారుడిని హెచ్చరించారు. అలానే ఆర్కే ఫెర్టిలైజర్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు కలిగి ఉండటంతో షాపు నిర్వాహకుడిపై 6 ఏ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స డీఎస్పీ సుప్రజ విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున సర్టిఫైడ్ కంపెనీకి చెందిన ఎరువులు, పురుగు మందులే విక్రరుుంచి రైతులకు అన్ని రకాల బిల్లులు ఇవ్వాలన్నారు. అరుుతే, కొందరు పురుగు మందుల విక్రయదారులు నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా, స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకుండా బయో ఉత్పత్తులను అమ్మకాలు చేస్తున్నారని తమ పరిశీలనలో తేలిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్న స్టాక్‌ను సీజ్ చేయడంతో పాటు అమ్మకందార్లపై కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఈ తనిఖీల్లో వ్యవసాయశాఖ ఏడీఏ కె.రాజకుమారి, ఏవో ఫాతిమాబేగం, విజిలెన్స సీఐ నాయక్, ఎస్సై సాంబయ్య, డీసీటీవో నవీన్, ఎఫ్ఆర్వో బాబు, వీఆర్వోలు శివారెడ్డి, రాంబాబు ఉన్నారు. -
ఎరువుల వ్యాపారి దారుణ హత్య
బంటుమిల్లి: శివాలయానికి వెళ్లి వస్తున్న ఓ ఎరువల వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా బంటుమిల్లి మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటు చేసుకంది. స్థానికంగా నివాసముంటున్న పబ్బిశెట్టి బద్రినారాయణ(45) ఎరువుల వ్యాపారం చేస్తున్నాడు. ఈ రోజు ఉదయం ద్విచక్రవాహనంపై శివాలయానికి వెళ్లి వస్తుండగా.. ఆంధ్రాబ్యాంకు సెంటర్ గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన వివాదం వల్లే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఎరువుల అంగళ్లలో స్వైప్‌మిషన్లు తప్పనిసరి
– వ్యవసాయ శాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్లు తప్పనిసరిగా స్వైప్‌మిషన్లు (పాయింట్ ఆఫ్ సేల్స్–పీవోఎస్) ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. త్వరితగతిన వాటిని ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఏవోలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కరెంటు అకౌంట్లు కలిగిన బ్యాంకుల్లో రెండు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదిలావుండగా.. జేడీఏ ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ వ్యవసాయాధికారి(ఏవో) జే.వాసుప్రకాష్ శనివారం నగరంలోని అన్ని దుకాణాలు తిరిగి స్వైప్మిషన్ల ఏర్పాటు, పనితీరు, సమస్యలపై డీలర్లకు వివరించారు. ఆధార్, పాన్, పిన్, అకౌంట్ నెంబర్ సమర్పించి తక్షణం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా వాటిని రైతులకు అందజేయడానికి వీలుగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. కొన్ని రోజుల పాటు ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్తులో డీలర్లకు, రైతులకు ఎలాంటి సమస్యా ఉండదన్నారు. -
అన్నదాతకు విత్తన కష్టం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : పెద్ద నోట్ల రద్దు అన్నదాతలకు మరిన్ని ఇక్కట్ల పాల్జేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను అధికారులు ఖాతరు చేయపోవడంతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయలేకపోతున్నారు. రూ.500, రూ.1,000 నోట్లను విత్తన దుకాణాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాల వారు స్వీకరించడం లేదు. ఈ నెల 24వ తేదీ వరకు పాత నోట్లను తీసుకోవాలని వ్యవసాయశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అధికారులు ఆ ఉత్తర్వులను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు, విత్తనాలు ఎరువులు కొనే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు బ్యాంకులు, ఏటీఎంలలో చిల్లర అందుబాటులో లేక రైతులకు కొత్త నోట్లు దొరికే పరిస్థితి లేదు. ప్రస్తుతం జిల్లాలో శనగ విత్తనాల పంపిణీ జరుగుతోంది. ఇటీవలే విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 63 వేల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 30 నుంచి 40 శాతం మంది రైతులు విత్తనాలను కొనుగోలు చేయలేదు. విత్తనాలు కొనుగోలు చేద్దామనుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. దీంతో రైతుల వద్ద డబ్బులు అందుబాటులో లేకపోవడంతో విత్తనాలు కొనుగోలు చేయలేకపోయారు. 10 రోజులు దాటుతున్న పరిస్థితి యధాతథంగానే ఉంది. బ్యాంకులు, ఏటీఎంలలో సైతం కొత్త నోట్లు దొరికే పరిస్థితి లేదు. చాలా బ్యాంకులు వాటి ఏటీఎంలు మూతబడ్డాయి. తగినంత డబ్బులు ఎప్పటికి అందుబాటులోకి వస్తోందో కూడా తెలియని పరిస్థితి. దీంతో చాలా మంది రైతులు విత్తనాలు కొనలేక అలాగే ఉండిపోయారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఖాతరు చేయని అధికారులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సంబంధించి రైతుల వద్ద పాత నోట్లను తీసుకోవాలని ఇప్పటికే వ్యవసాయశాఖ కమిషనరేట్ ఈ నెల 15న ఉత్తర్వులిచ్చింది. నవంబర్ 24 వరకు పాత నోట్లను తీసుకోవాలంటూ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినా విత్తనాలు పంపిణీ చేస్తున్న అధికారులు, పాత నోట్లను తీసుకోవడం లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పాత నోట్లు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే పొలాలు బీళ్లుగా ఉంచక తప్పదని రైతులు వాపోతున్నారు. -
బనగానపల్లెలో కౌలు రైతు మృతి
బనగానపల్లె రూరల్: పట్టణంలోని పెట్రోల్ బంకు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌలురైతు దూదేకుల హుసేని(54) మరణించాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పట్టణంలోని కరీంబాగ్ కాలనీకి చెందిన దూదేకుల హుసేని వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండిస్తూ కుటుంబ పోషణ సాగించేవాడు. ఈ క్రమంలో పంటలకు అవసరమైన రసాయనిక మందుల కొనుగోలు కోసం హుసేని ఆదివారం సైకిల్‌పై ఇంటి నుంచి బయలుదేరాడు. పెట్రోల్‌బంకు వైపు వెళ్తుండగా కోవెలకుంట్ల మలుపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హుసేనిని స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మరణించాడు. మృతుడికి భార్య దస్తగిరమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. కాటసాని పరామర్శ.. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కాటసాని రామిరెడ్డి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట జిల్లా వైఎస్సార్ సీపీ డాక్టర్ల విభాగం కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, నాయకులు పెద్దవెంకటరెడ్డి, బాలరాజు, న రసింహరెడ్డి, సురేష్ తదితరులున్నారు. -
ఎరువుల గోదాముపై తూ.కో దాడులు
అనంతపురం సెంట్రల్ : రాప్తాడు మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలోని అవంతి ఎరువుల గోదాముపై తూనికలు కొలతల శాఖ సీఐ శంకర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. జైకిసాన్ కంపెనీ చెందిన 20–20–0–13, 20–0–13 రకాల ఎరువులు బస్తాల్లో భారీగా తూకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రతి బస్తాలో ఐదు కిలోలు తక్కువ ఉన్నట్లు తనిఖీలో తేలిందని సీఐ వివరించారు. అలాగే ఎమ్మార్పీ, తయారీదారుడి చిరునామా తదితర వివరాలు ఏవీ లేకుండా విక్రయిస్తున్నారన్నారు. వీటన్నింటినీ సీజ్ చేసి, కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే అనంతపురం రూరల్ మండలంలో పలు గ్రామాల్లో చౌకడిపోలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ముగ్గురు డిపో డీలర్లపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
సంపులో పురుగుల మందు కలిపిన దుండగులు
ఉంగుటూరు(పశ్చిమగోదావరి జిల్లా): ఉంగుటూరు మండలం ఉప్పకపాడు గ్రామంలోని మంచినీటి సంపులో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. మంచినీటి సంపులో పురుగుల మందు డబ్బా(కంటోల్) ఉండటాన్ని వాచ్‌మన్ గమనించడంతో ఈ విషయం బయటపడింది. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. ఈ విషయంపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ శాపం
– ఎరువులు, కాంప్లెక్స్‌ల్లో భారీ మోసం – నకిలీవి అంటగట్టిన వ్యాపారి – 300 ఎకరాల్లో మిరప.. 200 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్న వైనం – లబోదిబోమంటున్న అన్నదాతలు పెట్టుబడుల కోసం వేలాది రూపాయలు అప్పులు చేసి మరీ పంటలు సాగు చేస్తున్న రైతులను నకిలీ ఎరువులు నట్టేట ముంచుతున్నాయి. పంట ఎదుగుదల లేకపోవడంతో వారికి ఏం చేయాలో దిక్కుతో^è డం లేదు. ఓ ఫర్టిలైజర్ యజమాని నిర్లక్ష్యంతో యర్రగుంటలో రైతుల బతుకులు ఛిద్రం అయ్యాయి. కణేకల్లు : మండలంలోని యరగ్రుంటలో రైతులు మిరప, వరి పంట సాగు చేశారు. పంట ఎదుగుదల, దిగుబడి కోసం స్థానికంగా ఉన్న ఓ ఫర్టిలైజర్ దుకాణంలో రైతులు కాంప్లెక్స్‌లు, ఎరువులు కొనుగోలు చేశారు. వారం క్రితం రైతులు మిరప పంటకు కాంప్లెక్స్‌లను వేశారు. భూమిలో కాంప్లెక్స్ వేసిన తర్వాత ఒక రోజులో అదంతా కరిగిపోవాలి. గాలి, భూమిలో ఉన్న తేమకు కరిగిపోయే గుణం కాంప్లెక్స్ ఉంటుంది. అయితే వారం తర్వాత కూడా కాంప్లెక్స్ కరిగకపోగా మిరప పంట పసుపు పచ్చరంగులోకి మారుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నకిలీ కాంప్లెక్స్‌లు కావడంతో అవి కరగకుండా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. వరి పంట బలం, దిగుబడి కోసం పలువురు రైతులు డీఏపీ, కాంప్లెక్స్‌లు, యూరియాలు వాడినా ఫలితం కన్పించకపోవడంతో ఇవన్నీ నకిలీవేనని రైతులు వాపోతున్నారు. మిరప, వరినాట్లు వేసినప్పటి నుండి ఇప్పటి వరకు రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. పంట కాపు దశకు వచ్చిన సమయంలో ఎదుగుదల లేక పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. స్థానిక ఫర్టిలైజర్ యజమానిపై రైతులు మండిపడుతున్నారు. ఆత్మహత్య తప్ప మరోమార్గం లేదు నాకు 6 ఎకరాల భూమి ఉంది. నాలుగు నెలల క్రితం మిర్చి పంట వేశాను. వారం క్రితం స్థానికం ఫర్టిలైజర్ షాపులో కాంప్లెక్స్‌లు తీసుకొని పంటకు వేశాను. ఉన్నట్టుండి పంట ఎదుగుదల ఆగిపోయింది. పూత కూడా రాలేదు. ఇప్పటి వరకు ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. ఆత్మహత్య తప్ప మరో మార్గం కన్పించడం లేదు. నకిలీ కాంప్లెక్స్‌ల గురించి సదరు యజమానిని నిలదిస్తే నా మర్యాద పోతోంది ఎవరికీ చెప్పుద్దంటూ నాలుగు కాంప్లెక్స్ బస్తాలిచ్చి పంపాడు. – లక్ష్మన్న, బాధిత రైతు వరికి కంకి రాలేదు 28 ఎకరాల్లో డీఏపీ, కాంప్లెక్స్, యూరియా మొత్తం 250 బస్తాలు వాడాను. వరి పంట పెట్టి 3 నెలలైంది. పంట బలంగా ఉండి మేలైన దిగుబడి వస్తుందని ఎరువులు వాడాను. నేటికీ వరికి కంకి రాలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అధికారులు స్పందించి పంటలను పరిశీలించి న్యాయం జరిగేలా చూడాలి. – పి.రామచంద్రారెడ్డి , రైతు, యర్రగుంట పంటలను పరిశీలిస్తాం కాంప్లెక్స్, ఎరువులు, యూరియా వాడి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తాం. సంబంధిత డీలర్ షాపుకెళ్లి స్టాక్ ఎక్కడి నుండి తెప్పించాడు ? ఎప్పుడు వచ్చింది ఇన్వాయిస్ బిల్లులతో సహా పరిశీలిస్తాం. నిల్వ ఉన్న స్టాక్ నుండి శ్యాంపిల్ తీసి ల్యాబ్‌కు పంపుతాం. – మద్దిలేటి, ఏడీఏ , రాయదుర్గం -
కృష్ణపట్నంలో ఎరువుల తయారీ పరిశ్రమ
సాక్షి, న్యూఢిల్లీ: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఎన్పీకే ఎరువుల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఓసీపీ(మొరాకో), ప్రభుత్వ రంగ కో-ఆపరేటివ్ ఎరువుల సంస్థ క్రిబ్కో సంయుక్త భాగస్వామ్యంతో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి మన్సుక్ ఎల్ మాండవ్య సమక్షంలో ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇరు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2019 ఏప్రిల్ నాటికి పరిశ్రమను ఏర్పాటు చేసి, ఉత్పత్తిని ప్రారంభిస్తామని క్రిబ్కో ఎండీ ఎన్.సాంబశివరావు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలంతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకొచ్చిందని చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. -
ఆ‘దేశం’ మేరకే!
* విత్తన, ఎరువుల షాపుల్లో తనిఖీలపై వివక్ష * అధికార పార్టీ నేతల షాపుల్లో శాంపిల్స్ సేకరించని వైనం * మాచర్లలో అడ్డుకున్న టీడీపీ నేత * ఇప్పటి వరకు 560కు పైగా శాంపిల్స్ సేకరణ సాక్షి, అమరావతి బ్యూరో: నకిలీ విత్తనాలు, బయో ఉత్పత్తులను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చేస్తున్న తనిఖీల్లో ‘పచ్చ’పాతం చూపుతున్నారు. అధికార పార్టీ నేతల షాపుల్లో ఎటువంటి తనిఖీలు నిర్వహించడం లేదు. జిల్లాలో రెండు రోజులుగా 560 షాపులకు పైగా తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారు. వీటిలో ఒక్క షాపు కూడా అధికార పార్టీ నేతలు, సానుభూతిపరులవి లేకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. నకిలీ విత్తనాలు, బయో ఉత్పత్తులను నివారించేందుకు అధికారులు, సిబ్బంది 70 బృందాలుగా ఏర్పడి జిల్లాలో రెండు రోజులుగా ఎరువులు, పురుగు మందులు, విత్తన షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. దుకాణాల్లో ఉన్న సరుకును పరిశీలించి శాంపిల్స్ తీస్తున్నారు. ఈ ఆకస్మిక తనిఖీలను జిల్లాలో ఇన్చార్జి జేసీ ముంగా వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కృపాదాసు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 560కి పైగా శాంపిల్స్‌ను సేకరించినట్లు సమాచారం. నకిలి విత్తనాలు, బయో ఉత్పత్తులపై ప్రత్యేకంగా విచారణ బృందాలు ఏర్పాటు చేసి, అందుకు బాధ్యులైన కంపెనీలు, డిస్టిబ్యూటర్లు, డీలర్లతో పాటు వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్లు ధనుంజయరెడ్డి కనుసన్నల్లో సాగుతోంది. ఇప్పటికే వారు నకిలీల వ్యవహారంలో ఉన్న ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. నమూనాల సేకరణలో... ప్రకాశం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన బయో ఉత్పత్తుల షాపులు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేటలో ఉన్నాయి. అయితే ఆ షాపులకు సంబంధించిన శాంపిల్స్‌ను తీయకుండా కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి మెనేజ్ చేసినట్లు దుకాణాదారుల్లోనే చర్చ సాగుతోంది. జిల్లాలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన బయో ఉత్పత్తులకు సంబంధించి శాంపిల్స్ తీయలేదని సమాచారం. మాచర్ల నియోజక వర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత తమకు అనుకూలంగా ఉన్న యజమానుల షాపుల్లో శాంపిల్స్ తీయకుండా స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అడ్డుకున్నట్లు తెలిసింది. షాపుల ఆకస్మిక తనిఖీల్లో సైతం వివక్ష చూపుతున్నారని, అధికార పార్టీ నేత షాపులకు సంబంధించి శాంపిల్స్ తీయక పోవడం ఏమిటనీ కొంత మంది వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. నమూనాలు నిరంతం సేకరిస్తాం.. జిల్లా వ్యాప్తంగా అన్ని షాపులను తనిఖీ చేస్తున్నాం. ఇప్పటికే 500కు పైగా షాపులకు తనిఖీ చేసి షాంపిల్స్ సేకరించాం. పారదర్శకంగా అన్ని షాపులను తనిఖీ చేసి శాంపిల్స్ తీస్తున్నాం. మరో నాలుగైదు రోజులపాటు దాడులు చేస్తాం. – కృపాదాసు, జేడీఏ, వ్యవసాయశాఖ తనిఖీల పేరుతో వేధించొద్దు.. చట్ట పరిధిలోనే వ్యాపారం చేస్తున్నాం. అధికారులకు అన్ని విధాల సహకరిస్తున్నాం. తనిఖీల పేరుతో డీలర్లలను వేధించడం తగదు. రైతులు నష్టపోకుండా నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను విక్రయించేలా అసోసియేషన్ తరఫున కృషిచేస్తున్నాం. – వీవీ నాగిరెడ్డి, ఎరువులు, పురుగు మందుల డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు -
రైతు ఎస్సెమ్మెస్ పంపిస్తేనే సబ్సిడీ
– ఎరువుల సబ్సిడీలో కొత్త విధానం – నేరుగా కంపెనీలకు జమ – ఎరువులు కొన్నట్టు రైతు ఎస్ఎంఎస్ పంపిస్తేనే.. – జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు – వచ్చేనెల 1 నుంచి అమలు జంగారెడ్డిగూడెం : ఎరువులకు ఇచ్చే సబ్సిడీపై ప్రభుత్వం కొత్త విధానం అమలుచేయనుంది. తొలుత ఎరువులకు నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం యోచించినా అది సాద్యంకాదని భావించి కొత్త విధానానికి శ్రీకారంచుట్టింది. దేశవ్యాప్తంగా 8 జిల్లాల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిరే్ధశించింది. వీటిలో రెండు జిల్లాలు రాష్ట్రానికి చెందినవి. ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా కాగా, మరొకటి కృష్ణా జిల్లా. అక్టోబర్ 1 నుంచి సబ్సిడీలపై కొత్త విధానాన్ని అవలంభించాలని ప్రభుత్వం నిరే్ధశించింది. వంటగ్యాస్ లాగానే ఎరువుల సబ్సిడీని రైతుల ఖాతాకు నేరుగా నగదు బదిలీని చేయాలని తొలుత కేంద్రం భావించినా దానిని పక్కన పెట్టింది. అయితే తాజాగా రైతులకు కాకుండా ఆయా ఎరువుల కంపెనీలకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా జమచేసే మొత్తాన్ని అక్టోబర్ 1 నుంచి కేంద్రం ప్రారంభించనుంది. రైతుకు ఎరువులు చేరిన తరువాతే సబ్సిడీ మొత్తం ఎరువుల కంపెనీల ఖాతాల్లో జమ అవుతుంది. ఈప్రయోగాత్మక పథకం అమలుకు దేశ వ్యాప్తంగా 8 జిల్లాలను గుర్తించింది. దీనిలో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ పథకం ద్వారా ఎరువుల దుర్వినియోగాన్ని నిరోధించడంతోపాటు, అసలు దేశ వ్యాప్తంగా ఖచ్చితంగా ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందో కూడా తెలుస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎరువులు పక్కదారి పట్టడం, పక్క రాష్ట్రాలకు తరలి పోవడం, బ్లాక్ మార్కెటింగ్ తదితర అవినీతి మార్గాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎరువులకు ఇచ్చే సబ్సిడీని ఆయా ఎరువుల కంపెనీల నుంచి డీలర్ల ద్వారా రిటైల్ వ్యాపారులకు చేరిన తరువాత కంపెనీ ఇచ్చిన లెక్క ప్రకారం సబ్సిడీని కంపెనీలకు చెల్లిస్తోంది. ఈ విధానంలో ఎరువులు పక్కదారిపట్టడం కారణంగా కేంద్ర ప్రభుత్వంపై సబ్సిడీ భారం అధికంగాపడుతున్నట్లు గుర్తించింది. వీటన్నింటిని అరికట్టేందుకు ఇటీవల ఈపోస్ విధానానికి శ్రీకారం చుట్టింది. దీనిని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కొత్త సబ్సిడీ విధానాన్ని అమలు చేయనుంది. కొత్త విధానంలో రైతులకు అమ్మిన ఎరువులకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుంది. దీనికోసం కంప్యూటర్ ఆధారిత డిజిటల్ నెట్వర్క్ వినియోగిస్తుంది. ఎరువులు అమ్మే సమయంలో రైతుల వివరాలను దీనిలో నమోదు చేయాలి. ఎరువులు కొనుగోలు చేసిన తరువాత రైతు తన మొబైల్‌ఫోన్ ద్వారా ఫెర్టిలైజర్స్ మానిటరింగ్ వ్యవస్థకు ఎస్ఎంఎస్ చేయాలి. ఈ ఎస్ఎంఎస్ అందిన తరువాత ఏ కంపెనీ ఎరువు ఏ రైతు ఎంతకు కొన్నాడో ఆ కంపెనీకి ప్రభుత్వం సబ్సిడీని జమచేస్తుంది. ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈపోస్ వ్యవస్థను ఏర్పాటు చేయగా , తాజాగా కొత్త విధానం కూడా అమలులోకి తేనుంది. దీనికి రైతు ఆధార్ నెంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు రైతులు, కౌలు రైతులు, అన్ని రకాల రైతులు కలిపి సుమారు 5 లక్షల మంది ఉన్నారు. ఖరీఫ్సీజన్లో 1.64 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగిస్తుండగా, రబీ సీజన్లో 2.33 లక్షల టన్నుల ఎరువులను వినియోగిస్తున్నారు. కాగా జిల్లాలో ప్రై వేట్డీలర్లు, సొసైటీల ద్వారా ఎరువులు సరఫరా , డీసీఎంఎస్ ద్వారా ఎరువుల సరఫరా మొత్తం అందరూ కలిపి 1160 మంది డీలర్లు ఉన్నారు. కొత్తవిధానం అమలు సాధ్యమేనాః ఎరువుల సబ్సిడీ లో కొత్త విధానం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ఇది సాధ్యమయ్యే పనేనా అని పలువురు సందేహం వ్యక్తంచేస్తున్నారు. రైతుల్లో అంతగా చదువుకున్న వారు తక్కువగా ఉంటారని, రైతులందరికీ ఎరువులు కొనుగోలు చేసిన తరువాత ఎస్ఎంఎస్ పంపేందుకు సెల్ఫోన్లు ఉంటాయన్నది ప్రశ్నార్ధకమే. దీనికోసం రైతులకు సెల్ఫోన్లు కూడా సమకూర్చాల్సి ఉంటుంది. అంతేగాక ఎక్కువ శాతం కౌలురైతులే ఉంటారు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పవని పలువురు పేర్కొన్నారు. -
నవంబర్ 15కు ముందు వరి నార్లు పోయొద్దు
రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: వర్షాలు కురుస్తున్నాయని రైతులు వరి నార్లు పోయొద్దని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధనా కేంద్రం శనివారం ప్రకటనలో తెలిపింది. నవంబర్ 15 కంటే ముందు వరి నార్లు పోయకూడదని, అంతకు ముందే నార్లు పోస్తే చలికి దిగుబడి రాదని పేర్కొంది. నీట మునిగిన పొలాల్లో నీటి మట్టం తగ్గిన వెంటనే ఎకరాకు 35 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేయాలని శాస్త్రవేత్తలు చెప్పారు. సిఫారసు చేసిన మోతాదుకు మించి నత్రజని ఎరువులు వాడకూడదన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగితే గాలిలో అధిక తేమ శాతం వల్ల సుడిదోమ, కంకినల్లి, అగ్గి తెగుళ్ల ఉధృతి పెరుగుతాయని..రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఎరువుల దుకాణాలపై దాడులు
అనంతపురం సెంట్రల్ : జిల్లా వ్యాప్తంగా ఎరువులు, మందుల దుకాణాలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. బుధవారం తాడిపత్రిలోని మహాలక్ష్మి ఆగ్రో ఏజెన్సీస్‌పై దాడులు చేసి 50 బస్తాల స్వాల్ కంపెనీ ఎరువులను సీజ్ చేసినట్లు సీఐ శంకర్ తెలిపారు. కంపెనీ పేరు, కస్టమర్ కర్ తదితర వివరాలేవీ లేకపోవడం సీజ్ చేసినట్లు వివరించారు. మాతాశ్రీ గార్మెంట్ షాపుపై దాడులు చేసి నిబంధనలకు విరుద్దంగా విక్రయిస్తున్న దుస్తులను సీజ్ చేసినట్లు తెలిపారు. వినియోగదారులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
చేతబడి నెపంతో ముగ్గురి దారుణహత్య!
ఒడిశా: సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలపై విశ్వాసం చెరిగిపోవడం లేదు. మూఢ నమ్మకాలతో సాటిమనుషుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. ఇలాంటి ఘటనలు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లా గుణుపురంలో చేతబడి చేస్తున్నారని నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని విచక్షణ లేకుండా దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. గతకొంత కాలంగా గ్రామంలో ముగ్గురు వ్యక్తులు చేతబడి చేస్తున్నారంటూ పుకార్లు లేచాయి. అది నిజమని నమ్మిన గుణుపురం గ్రామస్తులు.. ఆ ముగ్గురు కుటుంబ సభ్యులకు పురుగుల మందు తాగించి హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఎరువులపై సిగ్నల్ దరువు
భీమవరం : ఎరువుల అమ్మకాల్లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పోస్ విధానంతో రైతులు, వ్యాపారులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ పోస్ యంత్రాలకు సక్రమంగా సిగ్నల్స్ అందకపోవడంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల వాడకం తగ్గించడం ద్వారా ఎరువుల కొరత నివారణ, ఆహార పదార్థాలపై విష ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ విధానం అమలులోకి తీసుకువచ్చినా ప్రభుత్వ నిబంధనలతో రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎరువులు పొందాలంటే ఎరువుల డీలర్లు, సహకార ‡సంఘాల వద్ద పట్టాదార్ పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు నకళ్లను తీసుకువెళ్లి దానిలో నమోదుచేయించుకుని ఎరువులు పొందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రైతులు ఈ పోస్ విధానంలో ఎంత ఎరువునైనా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. సరిగా పనిచేయని సిగ్నల్స్ రైతులు ఎరువులు కొనుగోలు చేయాలంటే వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు), ఎరువుల వ్యాపారుల వద్దకు ఆధార్ కార్డుతో వెళ్లాలి. దాని ద్వారా రైతుకు ఏ ఎరువు ఎంత మొత్తంలో కావాలో ఈ పోస్ విధానం ద్వారా ఆన్లైన్లో దానిని పొందుపర్చి కొనుగోలు చేసిన ఎరువుల మొత్తానికి రశీదు ఇచ్చి ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్ యంత్రాలకు సిగ్నల్స్ సరిగా అనుసంధానం కాకపోవడంతో రైతులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. డీసీసీబీ, డీసీఎంఎస్ సమావేశాల్లో చర్చ ఎరువుల విక్రయంలో ఈ పోస్ విధానం అమలు కారణంగా సహకార సంఘాల్లో ఎదురవుతున్న సమస్యలను ఇటీవల జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్ జనరల్ బాడీ సమావేశాల్లో సహకార సంఘాల ఉద్యోగులు, రైతులు ఏకరవు పెట్టారు. ఈ పోస్ విధానం వేగవంతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే రైతులు సొసైటీలపై అభాండాలు వేసే ప్రమాదముందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయగా చేతిలో సొమ్ము, ఎదురుగా ఎరువులున్నా పంట పొలాలకు వినియోగించుకోలేకపోతున్నామని రైతులు ధ్వజమెత్తారు. కొనుగోలులో కష్టాలు ఈ పోస్ విధానంలో ఎరువుల కంపెనీలు, డీలర్ల నుంచి సహకార సంఘాలు, వ్యాపారులు కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్న ఎరువుకు ఆయా కంపెనీల నుంచి ఎక్‌నాలేడ్జ్‌మెంట్ పొందాల్సి ఉంటుంది. ఎరువులు దిగుమతి చేసిన వాహనదారుడు తిరిగి వెళ్లి ఆయా కంపెనీలు, డీలర్లకు వారు దింపుకున్న మొత్తం వివరాలను తెలిపిన తరువాత వాటిని ఆన్లైన్లో పొందుపరిస్తే స్టాక్ రిజిస్టర్లో చూపిస్తుంది. అప్పటివరకు వ్యాపారులు ఎరువులు అమ్ముకునే అవకాశం లేదు. డీలర్లు, కంపెనీలు వెనువెంటనే ఆన్లైన్ చేయకపోవడంతో స్టాక్ రిజిస్టర్లో చూపించకపోవడం వల్ల తమ వద్ద సరుకు ఉన్నా అమ్ముకునే వీలులేకుండా పోతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి సరికొత్త విధానం ప్రస్తుతం రైతుల భూముల వివరాలను వెబ్‌ల్యాండ్‌లో పొందుపరుస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచి రైతులు ఎరువులు కొనుగోలుకు వెళ్తే వెబ్‌ల్యాండ్‌ను పరిశీలించి దానిలో వివరాల మేరకే ఎరువుల వ్యాపారులు, సొసైటీల్లో ఎరువులను విక్రయించాల్సి ఉంది. భూసార పరీక్షల ఆధారంగా రైతులకు ఎరువులను అందించనున్నారు. రైతులు ఏ ఎరువులు కొనుగోలు చేసినా పూర్తి ధరకే కొనాలి. అనంతరం ఆయా ఎరువులపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. -
రసాయనిక ఎరువులతో ప్రజారోగ్యానికి ముప్పు!
దేశంలో వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం ప్రభావంపై 31 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన స్థాయీ సంఘం (2015-16) అధ్యయనం చేసింది. బీజేపీ ఎంపీ హుకం దేవ్‌నారాయణ్ యాదవ్ అధ్యక్షతన గల ఈ స్థాయీ సంఘం ఈనెల 11వ తేదీన పార్లమెంటు ఉభయ సభలకు నివేదికను సమర్పించింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అతిగా వాడటం వల్ల భూసారం దెబ్బతినడం, పంట దిగుబడుల్లో పెరుగుదల మందగించడంతోపాటు.. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి, పశువుల ఆరోగ్యానికి ముప్పు వచ్చిందని ఆందోళన వెలిబుచ్చింది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించుకుంటూనే.. సేంద్రియ రైతులకు సాంకేతిక సహాయంతోపాటు నేరుగా ఆర్థిక తోడ్పాటునివ్వడం అవసరమని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం.. 1960వ దశకం నుంచి దేశంలో అమలుచేస్తున్న హరిత విప్లవం వల్ల వరి, గోధుమల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగి మన అవసరాలు తీరడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే దశకు చేరామని పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక వివరించింది. 1960-61లో 8.3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014-15 నాటికి 25.27 కోట్ల టన్నులకు పెరిగింది. 1960వ దశకంలో 10 లక్షల టన్నుల కన్నా తక్కువగానే రసాయనిక ఎరువులు వాడేవాళ్లం. 2014-15 నాటికి వీటి వాడకం 2.56 కోట్ల టన్నులకు పెరిగింది. హెక్టారుకు బంగాళదుంపల సాగులో 347 కిలోలు, చెరకు సాగులో 239 కిలోలు, పత్తి సాగులో 193 కిలోలు, గోధుమ సాగులో 177 కిలోలు, వరి సాగులో 165 కిలోల రసాయనిక ఎరువులు వాడుతున్నాం. ప్రజారోగ్యంపై రసాయనిక ఎరువుల ప్రభావం ఎలా ఉంది? అని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ఆరోగ్య పరిశోధనా విభాగాన్ని ప్రశ్నించింది. ఈ విభాగం ఏం చెప్పిందంటే.. మోతాదుకు మించి / అశాస్త్రీయంగా రసాయనిక ఎరువులు పంటలకు వేయటం వల్ల పర్యావరణానికి హాని జరగడంతోపాటు ప్రజల ఆరోగ్యం పరోక్షంగా దెబ్బతింటున్నది. మనుషులతోపాటు జంతువులను కూడా రసాయనిక ఎరువులు తీవ్రమైన జబ్బుల పాలు చేస్తున్నాయి. రసాయనిక ఎరువుల్లో ఉండే పాదరసం, సీసం, సిల్వర్, నికిల్, సెలీనియం, థాలియం, వనాడియం, కాడ్మియం, యురేనియం వంటి భార ఖనిజాలు మనుషుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయని కేంద్ర ఆరోగ్య పరిశోధనా విభాగం పేర్కొంది. ఈ భార ఖనిజాలు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం పనితీరును దెబ్బతీస్తుండడంతోపాటు కేన్సర్ కారకాలుగా మారుతున్నాయి. రసాయనిక ఎరువుల కారణంగా మనుషుల్లో బ్రెయిన్ కేన్సర్, లింఫొమ, ప్రొస్టేట్ కేన్సర్, లుకేమియా, పెద్ద పేగు కేన్సర్ ముప్పు ఆరు రెట్లు పెరిగింది. రసాయనిక ఎరువుల వాడకంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే చాలా ఎక్కువగా ఉందని స్థాయీ సంఘం స్పష్టం చేసింది. రసాయనాల ప్రభావంపై సమగ్ర సర్వే అవసరం వ్యవసాయ ప్రధాన రాష్ట్రాల్లో వ్యవసాయోత్పత్తుల వృద్ధి రేటు 1960-70లలో 8.37% ఉండగా, 2000-2010 నాటికి 2.61%కి తగ్గిపోయింది. సాంద్ర వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోవడం, రసాయనిక ఎరువుల వాడకం బాగా పెరగడంతో భూసారం బాగా క్షీణించింది. జింక్, ఐరన్, కాపర్ వంటి సూక్ష్మపోషకాలు భూమిలో లోపించడం వల్ల, ఆ భూముల్లో పండించిన పంటలు తిన్న మనుషులకు అనేక జబ్బులు వస్తున్నాయని.. మనుషులు, పశువుల్లో ఎదుగుదల దెబ్బతింటున్నదని పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల దృష్ట్యా రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుష్ర్పభావం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఏ విధంగా ఉందో కచ్చితంగా తెల్సుకునేందుకు సమగ్ర సర్వే నిర్వహించాలని స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2025 నాటికి 30 కోట్ల టన్నుల మేరకు మన దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచుకోవాల్సి ఉంది. కాబట్టి రసాయనిక ఎరువులను భూసార పరీక్షల ఆధారంగా సముచితంగా వాడేలా రైతులను చైతన్యవంతం చేయడానికి పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపట్టాలని స్థాయీ సంఘం సూచించింది. ద్రవరూప సేంద్రియ ఎరువులకూ సబ్సిడీ భూసారాన్ని, సూక్ష్మజీవరాశిని పెంపొందించే పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువు, జీవన ఎరువుల వాడకం, పంట మిగుళ్లను తిరిగి భూమిలో కలియదున్నటం వంటి పద్ధతులపై రైతుల్లో అవగాహన కలిగించాలని సూచించింది. రసాయనిక ఎరువుల సబ్సిడీ విధానాన్ని సమూలంగా మార్చాలి. ప్రకృతికి అనుగుణమైన జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు, ప్రభావశీలమైన ద్రవరూప సేంద్రియ (జీవామృతం, పంచగవ్య వంటి) ఎరువులను దక్షిణాది రైతులు ఎక్కువగా వాడుతున్నారు. వీటిని వాడే సేంద్రియ / ప్రకృతి వ్యవసాయదారులకు నేరుగా నగదు సబ్సిడీ అందించే మార్గాలను అన్వేషించాలని, మన దేశానికి అనుగుణమైన విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి స్థాయీ సంఘం సిఫారసు చేసింది. సేంద్రియ సేద్యం చేపట్టే రైతులకు నేరుగా సాయం పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని, పశుసంపదను రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుష్ర్పభావం నుంచి కాపాడేందుకు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వెనువెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థాయీ సంఘం కోరింది. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయంలోకి మారదలచుకునే రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయాన్ని వారికే నేరుగా అందించాలని.. అందుకు అవసరమైన సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించడంతోపాటు పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరులను సమన్వయ పరచి, దీక్షతో ప్రణాళికాబద్ధమైన కృషి చేయాలని కేంద్రానికి స్థాయీ సంఘం సూచించింది. సేంద్రియ సేద్యంలోకి మారే దశలో రైతులకు విస్తరణ సేవలందించే యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని పేర్కొంది. ఎన్‌పిఎం పద్ధతులను ప్రోత్సహించాలని, రసాయనిక పురుగుమందుల వాడకాన్ని నియంత్రించేందుకు పెస్టిసైడ్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని స్థాయీ సంఘం అభిప్రాయపడింది. రైతుసంఘాలు, నిపుణులు, స్వచ్ఛంద / పరిశోధనా సంస్థల ప్రతినిధులతో సంప్రదించి ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968కు ఇప్పటి అవసరాలకు అనుగుణంగా సవరణలు చేయాలని కూడా స్థాయీ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. - పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్ పురుగుమందుల సంగతేమిటి? పంటలపై రసాయనిక పురుగుమందులు విచక్షణారహితంగా వాడటం వల్ల ఎటువంటి ప్రభావం ఉంది? అని కేంద్ర వ్యవసాయ శాఖను పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశ్నించింది. అయితే, రసాయనిక పురుగుమందుల ప్రభావాలపై తమ శాఖ ఎటువంటి అధ్యయనమూ చేయలేదని కేంద్ర వ్యవసాయ శాఖ సెలవిచ్చింది! -
మందులు పిచికారీ చేయండి
కొత్తచెరువు: ప్రస్తుతం వేరుశనగ పంటకు ఆకుమచ్చ, తామర పురుగు, సూక్ష్మలోపాలను నివారించాలంటే మందులను పిచికారీ చేయాలని కదిరి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త శివశంకర్‌నాయక్ తెలిపారు. ఆదివారం మండలంలోని తలమర్ల పొలాల్లో శాస్త్రవేత్తలు పర్యటించారు. తామర పురుగు నివారణకు మోనోక్రోటోపాస్ ఎకరాకు 400 మిల్లీలీటర్లు, ఆకుమచ్చ తెగుళ్లకు ఎక్సప్ కోనజోల్ 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వేమన,చండ్రాయుడు, రైతులు పాల్గొన్నారు. -
620 టన్నుల ఎరువులు సీజ్
గీసుకొండ : నగరంలోని మూడో డివిజన్ ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని ఎత్తుగడ్డ వద్దనున్న అవంతి వేర్ హౌజింగ్ సర్వీసెస్‌కు చెందిన గోదాముల్లో మండల వ్యవసాయ శాఖ ఏఓ శ్రీనివాస్ శనివారం తనిఖీలు చేశారు. ఈసందర్భంగా గోదాముల్లో 2011 సంవత్సరం నుంచి కొరమాండల్ కంపెనీకి చెందిన గోదావరి పాస్గోల్డ్ ఎరువు 569 టన్నులు, గోదావరి రాక్గోల్డ్ ఎరువు 51 టన్నులు నిల్వ చేసినట్లు గుర్తించారు. ఇంతకాలంగా విక్రయించకుండా నిల్వ చేయడంతో, దాన్ని పొలాల్లో చల్లినా ప్రభావవంతంగా పనిచేయదు. దీంతో మొత్తం పాత స్టాక్‌ను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఎరువుల విలువ రూ.46.56 లక్షలు ఉంటుంది. శాంపిల్స్‌ను సేకరించి, హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు ఏఓ శ్రీనివాస్ తెలిపారు. ఎరువుల నాణ్యత తేలే వరకు వాటిని మార్కెట్లో విక్రయించొద్దని సూచించారు. తనిఖీల్లో ఏఈఓలు స్రవంతి, కల్యాణి పాల్గొన్నారు. -
రూటే సెపరేటు
-పాత ధరలకే ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారులు ∙-రైతులకు నాసిరకపు మిశ్రమ ఎరువుల అమ్మకం - ఇటీవల మరికల్లో అధికారుల తనిఖీల్లో వెలుగులోకి.. -డీసీఎంఎస్‌లోనూ అధికధరలకు విక్రయిస్తున్న వైనం - 2610గాను 80శాంపిళ్ల ఎరువులు మాత్రమే సేకరణ -పంట దిగుబడి రాక ఏటా నష్టపోతున్న రైతన్నలు మహబూబ్‌నగర్ వ్యవసాయం:ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించినా.. జిల్లాలో కొందరు వ్యాపారులు మాత్రం పాతరేట్లకే విక్రయిస్తూ రైతులను మోసగిస్తున్నారు. దీంతోపాటు అనుమతి లేని మిశ్రమ ఎరువులను అంటగడుతూ సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోర్టు సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఇటీవల వ్యవసాయశాఖ అధికారులకు సూచించినా చర్యలు తీసుకోలేదు. ఖరీఫ్‌లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో రైతులు పంటలసాగుపై మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అక్రమార్కులు, వ్యాపారులు కలిసి ప్రభుత్వ అనుమతులు లేని నాసిరకం ఎరువులను రైతులకు అంటగట్టేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో వారంరోజుల క్రితం జిల్లా వ్యవసాయశాఖ డీడీఏ(పీపీ) సింగారెడ్డి ధన్వాడ మండలంలోని మరికల్లో అనుమతులు లేని 3.3టన్నుల ఎరువులను డీలర్లు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనతో జిల్లాలో నాసిరకం ఎరువులను విక్రయిస్తున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. పొరుగురాష్ట్రాలు ఏపీ, కర్ణాటక నుంచి రాత్రివేళల్లో గట్టుచప్పుడు కాకుండా డీలర్లకు చేరవేస్తున్నారు. దీంతో అధిక మార్జిన్‌కు ఆశపడిన కొందరు వ్యాపారులు రైతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువగా గద్వాల, ఆత్మకూర్, కొత్తకోట, వడ్డేపల్లి, ధరూర్, నారాయణపేట, మల్దకల్, గట్టు, అయిజ, దౌల్తాబాద్, కొడంగల్, కోస్గి, ఎర్రవల్లి, పెబ్బేరు, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ తదితర మండలాల్లో నాసిరకం ఎరువులను విక్రయిస్తున్నట్లు తెలిసింది. వీటిని కొనుగోలుచేసిన రైతులు పంట దిగుబడి రాక మరింత నష్టపోతున్నారు. పాతధరలకే విక్రయం రైతులను ఆదుకోవాలని కేంద్రప్రభుత్వం గతనెల 16న ఎరువుల ధరలు తగ్గించింది. ఈ రేట్లు అదేరోజు నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో డీఏపీ బస్తాపై ప్రభుత్వం కంపెనీ బట్టి రూ.120 నుంచి రూ.170 వరకు తగ్గించింది. అలాగే మ్యురేట్ ఆఫ్ పోటాష్ ధరలను రూ.250 నుంచి రూ.263కు తగ్గించింది. అయితే ఈ ధరలు జిల్లాలో ఎక్కడా అమలుకావడం లేదు. దీంతో రైతులు ఎరువుల భారం మోయలేక లబోదిబోమంటున్నారు. పాతరేటు కంటే ఎక్కువ ధరలకు డీఏపీ, మిశ్రమ ఎరువులను అంటగడుతున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తెలిసినా స్థానిక నాయకుల రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లా కేంద్రంలో అధికధరలు జిల్లాలోని మారుమూల గ్రామాలు, మండలాల్లో ఎరువులను అధిక ధరలకు విక్రయించడం సర్వసాధారణమే. జిల్లా కేంద్రంలోనూ ఇవే ధరలకు విక్రయిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ రంగసంస్థ డీసీఎంఎస్‌లో రూ.1155కు విక్రయించాల్సిన డీఏపీని బస్తాను రూ.1210కు విక్రయిస్తూ రైతులపై భారం మోపుతున్నారు. ఈ సంస్థ నోటిస్ బోర్డుపైనే డీఏపీ బస్తాకు రూ.1210కు అమ్ముతున్నట్లు రాసి బహిరంగ దోపిడీకి పాల్పడుతోంది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని చాలా దుకాణాల్లో ఇవే ధరలు అమలవుతున్నాయి. -
ఫర్టిలైజర్ షాపుపై స్పెషల్‌స్క్వాడ్ దాడులు
నల్లబెల్లి : మండల కేంద్రంలోని ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ షాపులపై హైదరాబాద్‌కు చెందిన స్పెషల్ స్క్వాడ్ ఏడీఏ మదన్మోహన్ ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు జరిపి తనిఖీలు నిర్వహిం చారు. ఎరువులు కొనుగోలు చేసి తీసుకెళుతున్న రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అలాగే రైతులకు విక్రయించిన ఎరువుల బస్తాలపై ఆరా తీశారు. స్టాక్ రికార్డులను పరిశీలించారు. ఈ దాడుల్లో నర్సంపేట ఏడీఏ శ్రీనివాస్‌రావు, స్పెషల్స్కాడ్ ఏఓ అనిల్‌కుమార్, నర్సంపేట, నల్లబెల్లి ఏఓలు యాదగిరి, పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు
– వ్యవసాయశాఖ విజిలెన్స్ బృందం ఏడీఏ సురేష్‌బాబు వెంకటగిరి : ఎరువుల దుకాణదారులు విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని విజిలెన్స్ బృందం ఏడీఏ రమేష్‌బాబు హెచ్చరించారు. గురువారం వెంకటగిరిలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎరువుల దుకాణాల్లో పురుగు మందులు, ఎరువుల నాణ్యత, అమ్మకం రేట్లు, అమ్మే ఎరువులకు సంబంధించి అనుమతి పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించేలా ప్రభుత్వ కార్యాచరణ రూపొందించిందన్నారు. నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పొదలకూరు డివిజన్లలో తనిఖీలు చేయగా 27 ఎరువులు, 15 పురుగుమందుల దుకాణాల్లో సుమారు రూ.60 లక్షల విలువైన ఎరువులు, సుమారు రూ.50 లక్షల విలువైన పురుగు మందులను దుకాణదారులు అనుమతి లేని కంపెనీల సరుకు అమ్ముతున్నట్లు గుర్తించామని, వాటి అమ్మకాలు నిలుపుదల చేసినట్లు చెప్పారు. వీరికి 21 రోజులు గడువు ఇచ్చి క్రమబద్ధీకరించుకునేలా అవకాశం ఇస్తామని, స్పందించని దుకాణదారుల్లోని ఎరువులను స్వాధీనం చేసుకుంటామన్నారు. తనిఖీల్లో విజిలెన్స్ బృందం సభ్యులు ఎంసీ మద్దిలేటి (ఏడీఏ రాయదుర్గం, అనంతరంపురం జిల్లా) రవీంద్ర (ఏఓ తాడిపత్రి ) డక్కిలి వ్యవసాయాధికారిణి సుజాత, వెంకటగిరి ఏఈఓ ఎస్పీ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులతోనే విక్రయాలు చేయాలి
హిందూపురం రూరల్ : రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు తదితర వాటిని విక్రయం చేసే దుకాణదారులు అనుమతులు తీసుకుని వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు మురళీకృష్ణ పేర్కొన్నారు. గురువారం హిందూపురంలోని బృందావనం ట్రేడర్స్, నందినీ హైబ్రిడ్ సీడ్స్ ఏజెన్సీ, రైతు మిత్ర తదితర దుకాణాల్లో ఆయన తనిఖీలు చేశారు. దుకాణదారుల యజమానులతో ప్రిన్సిపల్ సర్టిఫికెట్, సోర్స్ సర్టిఫికెట్ తదితర అనుమతులు తీసుకున్న తర్వాత విత్తనాలు, ఎరువులు అమ్మకాలు చేపట్టాలన్నారు. రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో వ్యాట్, ట్రేడింగ్ నెంబర్, పరిమితి మించి పోయే కాలం తదితర వాటిని తప్పనిసరిగా బిల్లులో నమోదు చేయాలని ఆదేశించారు. రూ.11,18,375 విలువ చేసే విత్తనాలు, రూ. 6 లక్షల విలువ చేసే పురుగుల మందు, రూ.27,88 716 ఎరువులను దుకాణంలో విక్రయించకుండా తాత్కాలికంగా అనుమతులు రద్దు చేశారు. వీటì అమ్మకాలు చేపట్టాలంటే ప్రిన్సిపల్ ధ్రువ పత్రాలు తీసుకుని చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి రామారావు, స్థానిక ఏఓ శ్రీలత తదితరులు ఉన్నారు. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
నంద్యాల రూరల్: నంద్యాల పట్టణంలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. కర్నూలు డీడీఏ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో మార్కాపురం ఏడీఏ సుదర్శన్‌రాజు, చిత్తూరు జిల్లా ఏఓ అజయ్‌కుమార్, నంద్యాల ఏడీఏ సుధాకర్, ఏఓ ఆయూబ్బాషాల ఆధ్వర్యంలో బుధవారం దాడులునిర్వహించారు. నూనెపల్లెలోని హర్షిత, సాయిసుదర్శన్, నూకల సుదర్శన్, ఆర్కే వెంకటసాయి, డీఎంఆర్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేయగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రూ.45 లక్షల విలువైన ఎరువులు, పురుగు మందులను గుర్తించారు. వాటిని విక్రయించకుండా తాత్కాలికంగా నిలుపుదల చేశామని డీడీఏ ప్రభాకర్‌రావు తెలిపారు. తగ్గిన ధరలకు ఎరువులను విక్రయించకుండా పాత ధరలకే కొందరు అమ్మడాన్ని ఆయన ఆక్షేపించారు. తక్షణమే గోదాముల్లోని పాత స్టాక్‌కు రికార్డులు చూపాలని, ఎరువుల దుకాణాల యజమానులను ఆదేశించారు. ప్రతినెల క్రయవిక్రయాల సమాచారాన్ని ఏఓ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. అనుమతిలేని ఎరువులు, పురుగుల మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బాబోయ్.. వద్దు!
కడప అగ్రికల్చర్ : జిల్లాలోని గోడౌన్లలో ఎరువులు నిండుగా ఉన్నాయని, మళ్లీ కంపెనీల నుంచి ఎరువులు తెప్పించవద్దని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు డి ఠాగూర్ నాయక్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నూతన కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో వివిధ ఎరువుల కంపెనీల ప్రతినిధులు, గోడౌన్ల మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు ఖరీఫ్ అవసరాల నిమిత్తం 92 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 41 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని అన్నారు. కేసీ కెనాల్‌కు నీరు వచ్చే వరకు ఎరువులు తెప్పించవద్దని ఖరాఖండిగా చెబుతున్నామన్నారు. ఈనెలలో కేసీకి నీరు రావచ్చనే సూచనలు ఉన్నట్లు ఉన్నాయన్నారు. అన్ని గోడౌన్లలో ఎరువులు నిల్వ ఉన్నాయని, ఎక్కువ నిల్వ చేయడానికి గోడౌన్లలో అడుగు కూడా స్థలం లేదన్నారు. గోడౌన్లలో స్టాక్ వారీగా, డీలర్ల వారీగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. నగేష్ గోడౌన్లో రాష్ట్ర వ్యవసాయశాఖలోని విజిలెన్స్ కమిటీ వచ్చి తనిఖీలు నిర్వహించగా స్టాక్ వారీగా రికార్డులు సక్రమంగా లేకపోవడంతోఎరువుల సరఫరాను నిలుపుదల చేశారన్నారు. ఏడీలు నరసింహారెడ్డి, జయరాణి, జేడీ కార్యాలయ టెక్నికల్ ఏఓ ప్రభాకరరెడ్డి, కడప ఏఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికాబద్ధంగా ఎరువులు, విత్తనాల సరఫరా
ఖమ్మం వ్యవసాయం: రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సరఫరా చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ సి.పార్థసారధి అన్నారు. గోదావరి అంత్య పుష్కరాల కోసం ఆదివారం భద్రాచలం వెళుతూ మార్గమధ్యలో ఖమ్మంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామస్థాయిలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందించే బాధ్యతను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు అప్పగించామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో వర్షాలు అనుకూలిస్తున్నాయని అన్నారు. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ పి.మణిమాల, ఉద్యాన శాఖ ఉప సంచాలకుడు ఆర్.శ్రీనివాసరావు, సహాయ సంచాలకుడు కె.సూర్యనారాయణ, జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకుడు ఎస్.వినోద్‌కుమార్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సుధాకర్ రావు, స్వరూపరాణి, టెక్నికల్ ఆఫీసర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘మార్కెట్’ ద్వారా 10లక్షల మొక్కల పెంపకం ఏన్కూరు: హరితహారం కార్యక్రమం కింద రాష్ట్రంలోని మార్కెట్ కమిటీల ద్వారా 10లక్షల మొక్కల పెంపకం చేపట్టినట్టు మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి తెలిపారు. స్థానిక మార్కెట్ కమిటీæ కార్యాలయం ఎదుట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మార్కెట్ కమిటీల్లో ఇప్పటివరకు 8.70 లక్షల మొక్కలు నాటినట్టు చెప్పారు. వారం రోజుల్లోగా లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని 180 మార్కెట్ కమిటీలు, 340 సబ్ యార్డులు, 330 నాబార్డ్ గోడౌన్ల పరిధిలో మొక్కలు నాటినట్టు చెప్పారు. గత ఏడాది మార్కెట్ కమిటీల ద్వారా 4.50 లక్షల మొక్కలు వేసినట్టు చెప్పారు. ఉద్యాన శాఖ ద్వారా 23లక్షల మొక్కలు పెంపకం చేపట్టామన్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ వరకు మొక్కలు నాటుతామన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2.50 కోట్ల మొక్కలు వేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 2.10 కోట్ల మొక్కలు నాటినట్టు చెప్పారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఏyీ ఎం వినోద్, హార్టీకల్చర్ డీడీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ కార్యదర్శి నిర్మల, సూపర్వైజర్ రాజా పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణంపై విజిలెన్స్ దాడులు
కదిరి టౌన్ : పట్టణంలోని హిందూపురం రో డ్డుౖ వెపున్న క్రిష్ణా ఎరువుల ఏజెన్సీలో గురువారం సా యంత్రం విజిలెన్స్ అం డ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. కదిరి మం డల వ్యవసాయాధికారి శ్రీహరినాయక్ ఆధ్వర్యంలో విజిలెన్స్ వ్యవసాయాధికారి ఉమాపతి, సీఐ శ్రీనివాసరెడ్డి, ఏసీటీఓ జిలానీబాషా ఆకస్మికంగా ఎరువుల దుకాణంపై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన రికార్డులు, స్టాక్ రిజిష్ట్రరు, గోదాములో నిల్వ ఉన్న సరుకులను లెక్కించారు. దీంతో అక్రమంగా నిల్వ ఉన్న రూ.8లక్షలా 9వేల 467ల విలువ కలిగిన యూరియా, కాంప్లెక్స్, ఇతర ఎరువులను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ అక్రమంగా ఎరువులు నిల్వ వుంచితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
స్టాప్ సేల్..అయితే మాకేం?
– ఎరువుల డీలర్ల ఇష్టారాజ్యం – యథేచ్ఛగా అమ్మకాలు – జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కర్నూలు(అగ్రికల్చర్): తనిఖీల సమయంలో వ్యవసాయ అధికారులు.. నిబంధనలు పాటించని ఎరువుల దుకాణాల్లో అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేయడం(స్టాప్ స్టేల్) సర్వసాధారణం. తిరిగి అనుమతులు ఇచ్చేవరకు ఎరువుల అమ్మకాలు ఎట్టి పరిస్థితుల్లోను నిర్వహించరాదు. అయితే ఎరువుల దుకాణాల డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. స్టాప్సేల్స్ను బేఖాతర్ చేస్తూ ఎరువుల అమ్మకాలు య«థావిధిగా నిర్వహిస్తున్నారు. ఇటీవల జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు(జేడీఏ) ఉమామహేశ్వరమ్మ జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాల తనిఖీలకు ఇంటర్నల్ స్వా్కడ్ బందాలను నియమించారు. ఒక సబ్‌డివిజన్ ఏడీఏను మరో సబ్‌డివిజన్‌లోని ఎరువుల దుకాణాల తనిఖీలకు స్వా్కడ్ అధికారిగా నియమించారు. తనిఖీలు వేగం పుంజుకున్నాయి. ప్రై వేటు డీలర్లకు వ్యవసాయశాఖ ఇచ్చిన లైసెన్స్‌లో ఎరువుల కంపెనీలు ఇచ్చిన ఓ–ఫామ్‌ను నమోదు చేయించుకోవాలి. లైసెన్స్‌లో ఓ– ఫామ్ ఇంక్లూజన్ లేకపోయినా ఆ కంపెనీల ఎరువులను అమ్ముతున్నారు. ఈ విషయం ఏడీఏల తనిఖీల్లో బయటపడింది. ప్రతి ఏటా తప్పనిసరి ప్రై వేటు డీలర్లు ఎరువుల కంపెనీల ఉత్పత్తులను అమ్ముకోవాలంటే ఆయా కంపెనీల ఓ–ఫామ్‌ను ప్రతి ఏటా తీసుకోవాలి. లైసన్స్లో ఓ–ఫామ్ ఇంక్లూజన్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దానిని వ్యవసాయ యంత్రాంగం పరిశీలించి ఇంక్లూజన్ చేస్తుంది. జిల్లాలో హోల్‌సేల్ డీలర్లు 900 మంది వరకు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది ఓ–ఫామ్ ఇంక్లూజన్ లేకుండానే ఎరువుల వ్యాపారం సాగిస్తుండటం గమనార్హం.. స్టాఫ్సేల్స్ ఇచ్చినా.. కర్నూలు ఏడీఏ రమణారెడ్డిని నంద్యాల తనిఖీ అధికారిగా నియమించారు. ఈయన మంగళవారం వివిధ షాపులు తనిఖీ చేయగా ఓ–పామ్ ఇంక్లూజన్ లేకుండానే అయా కంపెనీల ఎరువులు అమ్మతున్నట్లు గుర్తించి రూ. 1.20 కోట్ల విలువ చేసే ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చి వెళ్లారో లేదో యథావిధిగా ఎరువుల అమ్మకాలు చేపట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒక్క నంద్యాలలోనే కాదు డోన్, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి నెలకొని ఉంది. స్టాప్ సేల్ ఇచ్చినా అమ్మకాలు యథావిధిగా జరుగుతున్న విషయం వ్యవసాయాధికారులకు తెలిసినా చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
బాబోయ్.. నకిలీ మందులు!
⇒ పనిచేయని కలుపు నివారణ మందులు ⇒ రూ.వేలు ఖర్చుచేసినా నష్టపోతున్న రైతన్నలు ⇒ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఫర్టిలైజర్ షాపుల యజమానులు ⇒ రైతులకు బిల్లులు ఇవ్వని వ్యాపారులు ⇒ వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ శూన్యం యాలాల: రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు.. కరువుతో అల్లాడుతున్న రైతన్నలకు ఈ సారి కురుస్తున్న వర్షాలతో ఆశలు చిగురించాయి. అయితే, వారి ఆశలను నకిలీ పురుగు మందులు అడియాశలు చేస్తున్నాయి. తాము సాగుచేస్తున్న పంట పొలాల్లో పెరుగుతున్న కలుపు నివారణ మందులు నకిలీవి కావడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. యాలాల మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన భీమప్ప గ్రామ శివారులో ఆరెకరాలు కౌలుకు తీసుకొని కందిని సాగు చేస్తున్నాడు. కంది పంటలో కలుపు మందు పెరగుతుండడంతో ఈ నెల 14న తాండూరులోని అన్నదాత ఫర్టిలైజర్ షాపు నుంచి రూ.3,200 పెట్టి నాలుగు లీటర్ల కలుపు నివారణ మందును కొనుగోలు చేశాడు. దానిని పొలంలో చల్లాడు. అయినప్పటికీ పొలంలో కలుపు శాతం తగ్గకపోగా మరింత పెరగడంతో బాధిత రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికితోడు పొలాల్లో కలుపు నివారణకు కూలీలు లభించక, వేసిన పంట కళ్ల ముందే నష్టపోతుండడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. ఇదే విషయమై ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులను బాధిత రైతు ప్రశ్నిస్తే నిర్లక్ష్య సమాధానం ఇచ్చాడని వాపోయాడు. ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులు మందులు ఇచ్చిన అనంతరం బిల్లులు ఇవ్వకపోగా, కనీసం మందు ఎలా పిచికారి చేయాలి, ఎంత మోతాదులో వాడాలి? ఎలా వాడాలి? తదితర వివరాలు తెలియజేయాల్సి ఉన్నా ఇవన్నీ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు ఫర్టిలైజర్ షాపుల పట్ల వ్యవసాయ శాఖ అధికారులు ‘చూసీచూడనట్లు’ వ్యవహరిస్తుండడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతుల వాదన. ఇది ఒక్క భీమప్ప పరిస్థితే కాదు. మండలంలో వివిధ పంటలు సాగుచేస్తున్న రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. మందులు కొనుగోలు చేసిన అనంతరం షాపు నిర్వాహకులు తెల్ల కాగితంపై ధర మాత్రమే రాసి ఇస్తున్నారు. ఇదేంటని అడిగిన రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిల్లులు ఇవ్వని దుకాణాలపై కఠిన చర్యలు! మందులు కొనుగోలు చేసిన రైతులు బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఏ ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడైనా బిల్లు ఇవ్వకపోతే అడిగి మరీ తీసుకోండి. బిల్లులు ఇవ్వని దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్సులు రద్దు చేస్తాం. తిమ్మాయిపల్లి రైతు భీమప్ప విషయంలో విచారణ జరిపి చర్య తీసుకుంటాం. - గిరిబాబు, మండల వ్యవసాయాధికారి -
వారి రూటే సప‘రేటు’
కడప అగ్రికల్చర్ : రైతులకు చేయితనిచ్చి వారికి వ్యవసాయ శాఖ తరఫున ఏమేమి కావాలో తెలుసుకుని సాయం అందించాలని ఒక్క పక్క జిల్లా సంయుక్త సంచాలకుడు పదే పదే చెబుతున్నా.. ఆ అధికారులు అవేమి చెవికెక్కించుకోవడం లేదు. ‘పచ్చ’ కండువా వేసుకోక పోయినా నరనరాన ఎక్కుంచుకుని పని చేస్తున్నారని రైతులు, ఎరువులు, పురుగు మందుల డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతకం కావాలా?.. చేయితడుపు: ‘సార్..! మా షాపునకు ఎరువులు కావాలి, ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురుస్తున్నందున అవసరం అవుతోంది. మా లెటర్‌కు మీరు అనుమతి ఇప్పిస్తే తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటాం’ అని అడిగితే... చేయి తడిపితేనే సంతకం చేస్తామని మొండి కేస్తున్నారని పలువురు డీలర్లు వాపోతున్నారు. ఇదేంది సార్..! తాము వ్యాపారం చేసుకోకపోతే ఎలా బతికేదని బతిమలాడినా కనికరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మా అన్న లెటర్ ఉందా? అయితే ఓకే’ అని కొంత మంది డీలర్లకు మాత్రం వెనువెంటనే సంతకం చేసి పంపుతున్నారు. ‘అన్నతో ఫోన్ చేయించుకోపో అని మరీ చెబుతుండడంతో మేం ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి, ప్రభుత్వానికి డబ్బులు కట్టి లైసెన్స్‌లు తెచ్చుకుని ఎరువులు అమ్ముకుంటున్నాం’ అని ఏ డీలరైనా ఎదురు ప్రశ్నిస్తే.. వారి దుకాణాలపై పడి తనిఖీల పేరుతో వేధించడం, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. ‘అన్న వద్దకు పోయి అన్నా తప్పు చేశామని చెప్పుకుని పార్టీ మారుతున్నట్లు చెప్పి.. ఒప్పించుకుని ఫోన్ చేయిస్తే ఎలాంటి ఇబ్బందులు పెట్టబోమని ఆ వ్యవసాయాధికారులు తెగేసి చెబుతున్నారు’ అని మైదుకూరు, కడప వ్యవసాయ డివిజన్లలోని ఇద్దరు డీలర్లు ‘సాక్షి’కి ఆవేదనతో తెలిపారు. ఇంత దారుణంగా గతంలో ఏ వ్యవసాయాధికారులు వ్యవహరించ లేదని ఎరువుల, పురుగు మందుల దుకాణదారులు వాపోతున్నారు. ఈ వ్యవసాయాధికారులతో వేగలేక చస్తున్నామని మైదుకూరు, కడప డివిజన్లలోని డీలర్లు తెలిపారు. ‘ఫిర్యాదులు చేశారో ఏవి అమ్ముకోలేరు. జిల్లా వ్యవసాయ శాఖ చైర్మన్ అయిన కలెక్టర్‌కైనా, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులకు, చివరికి రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఏమి కాదు. ఎందుకంటే మా అన్న ఉన్నంత వరకు ఎవరు మమ్ములను ఏమి చేయలేరు.. తెలుసా?’ అని డీలర్ల వద్ద అంటున్నారని తెలిపారు. సీట్లో కూర్చుని విధులు నిర్వహించేది మా అన్న: ‘డీలర్లా...రా..! రైతన్నల్లా...రా! వినండి చెబుతున్నాం. ఇక్కడ విధులు నిర్వహిస్తున్నది మేం కాదు.. మా అన్న. ఆయన మాట ప్రకారమే మేం నడుచుకుంటాం. యాంత్రీకరణ పథకంలో దరఖాస్తులు మీరు మీ– సేవా కేంద్రంలోకి వెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మా చేతికి ఇస్తే మేం పంపుతాం. అందుకు గాను దరఖాస్తు ఫీజు రూ. 1000, అదనంగా మరో రూ. 5000 ఇస్తే యంత్ర పరికరాలు మీకు చేరుతాయి. అలా ఇవ్వకపోతే యంత్రం కాదు కదా.. యంత్రంలోని నట్టు కూడా రాదు’ అంటున్నారని రైతులు ఆవేదన చేస్తున్నారు. దీంతో కొందరు రైతులు చేసేదేమి లేక ముడుపులు ముట్ట చెబుతున్నారు. అన్ని రూపాయల ముట్టచెప్పలేమని, ఆ కార్యాలయాలకు వెళ్లడమే మానుకున్నామని మరికొందరు అంటున్నారు. -
ఎరువుల ధరలు తగ్గింపు
పెగడపల్లి: ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించినట్లు ఏవో కరుణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఐఎల్ కంపెనీకి చెందిన 20ః20 ధర రూ.971 నుంచి రూ. 918, ఎంవోపీ రూ.840 నుంచి రూ.578, డీఏపీ రూ.1244 నుంచి రూ.1155, ఇఫ్కో కంపెనీకి చెందిన 20ః20 ధర రూ.918 నుంచి రూ.866, డీఏపీ రూ.1244 నుంచి రూ.1155, స్పిక్ కంపెనీకి చెందిన 20ః20 ధర రూ. 890 నుంచి రూ.845, డీఏపీ 1195 నుంచి రూ. 1140, ఐపీఎల్ కంపెనీకి చెందిన 20ః20 ధర రూ. 890 నుంచి 819, ఎంవోపీ రూ. 840 నుంచి రూ. 578, డీఏపీ రూ. 1195 నుంచి 1155, ఆర్సీఎఫ్ డీఏపీ ధర రూ.1106గా ఉందని ఆమె వివరించారు. -
అనంతలో జోరుగా ఎరువుల అక్రమాలు
-
ఏమార్చే యత్నం !
సాక్షిప్రతినిధి, అనంతపురం: ఎరువుల కుంభకోణంలో సూత్రదారులైన ఇద్దరు అధికారులను తప్పించేలా విచారణ సాగుతోందా..? వ్యవసాయాధికారులతో పాటు మిక్సింగ్‌ప్లాంటుపై ఎలాంటి చర్యలు లేకుండా చూడాలని ఓ ముఖ్య ప్రజాప్రతినిధి చేసిన ఆదేశాలను విచారణ అధికారులు పాటిస్తున్నారా...? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఎరువుల కుంభకోణంలో మార్క్‌ఫెడ్‌కు వెళ్లాల్సిన 50 శాతం ఎరువులు భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు వెళ్లినట్లు తేలింది. ఈ ఎరువులను అధికారులు సీజ్ చేశారు. వాస్తవానికి కలెక్టర్, జేడీ, ఏడీ పీపీ కనుసన్నల్లో ఎరువుల కేటాయింపులు జరగాలి. ‘సాక్షి’లో కథనాలు వచ్చే వరకూ భాస్కర్‌ఫర్టిలైజర్స్ వైపు అధికారులు కన్నెత్తి చూడలేదు. దీన్నిబట్టే అధికారుల ప్రమేయంతోనే ఎరువులు ప్లాంటుకు చేరినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదిన వచ్చిన రేక్‌లోని ఎరువులను కూడా ప్లాంటుకు తరలించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ‘సాక్షి’లో ‘దారితప్పిన ఎరువులు’ శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో అదేరోజు మధ్యాహ్నం లోపు ఎరువులను ‘సెంట్రల్‌వేర్‌హౌస్’ గోడౌన్ తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలన్నీ బట్టి చూస్తే వ్యవసాయధికారులే 1,300 టన్నుల ఎరువులను దారి మళ్లించారని తెలుస్తోంది. ఈ ఘటనకు ఎరువుల పర్యవేక్షణ చూసే అధికారులు బాధ్యత వహించాలి. అయితే వీరిని తప్పించేందుకు ఇప్పుడు కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ‘మార్క్‌ఫెడ్’ అధికారులు వద్దన్నారు కాబట్టే ఎరువులు ప్లాంటుకు పంపామని కథ అల్లుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మార్క్‌ఫెడ్‌తో పాటు, రేక్ ఆఫీసర్ పాత్రను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి రేక్ ఆఫీసర్ అనే పోస్టు లేదు. లోకల్ ఏఓ లేదా ఏడీని నామినేట్ చేయాలి. ప్రస్తుతం ఏఓగా వాసుప్రకాశ్, రవి ఏడీఏగా ఏడాదిన్నరగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవ్వరినీ రేక్ ఆఫీసర్‌గా నామినేట్ చేయలేదు. ఎరువులను జేడీఏ కార్యాలయ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. అంటే వేల టన్నుల ఎరువులు రైల్వేస్టేçÙన్కు వస్తుంటే అవి ఎవరికి పంపాలి..? కేటాయింపులు ఎవరు చూడాలి..? బాధ్యత ఎవరిదనేది లే కుండా ఇంత కాలం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు కేటాయింపులు కీలక అధికారుల కనుసన్నల్లో జరగడం, విషయం బయటకు పొక్కడంతో బాధ్యులని తప్పించేందుకు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుస్తోంది. కలెక్టర్ నిస్పాక్షికంగా విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
వరుస లాభాలకు బ్రేక్
ముంబైః మంగళవారం నాటి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంచనాలకనుగుణంగానే మదుపర్లు లాభాల స్వీకరణకుదిగడతో ఈక్విటీ సూచీలు నష్టాలను చవిచూశాయి. 111 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 27,166 దగ్గర, నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 8,335 దగ్గర ముగిసింది. దీంతో ఆరు సెషన్ల లాభాలకు ఈ రోజు బ్రేక్ పడింది. ఐటీ, పవర్, ఆయిల్ అడ్ గ్యాస్ స్టాక్స్ నష్టాలు మార్కెట్ ను ప్రభావింత చేశాయి. మరోవైపు ఫెర్టిలైజర్ రిటైల్ ధరలను తగ్గించాలనే ప్రభుత్వం నిర్ణయడంతో ఎరువుల షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. కోరమండల్ ఇంటర్నేషనల్, జువారి అగ్రో కెమికల్స్ 12, 4 శాతం మేర నష్టపోయాయి. అయితే జై ప్రకాశ్ అసోసియేట్స్ 27 శాతం టాప్ గెయినర్ గా నిలిచింది. సంస్థకు చెందిన సిమెంట్ ప్లాంట్లను ఎక్కువ మొత్తానికి అల్ట్రాటెక్ కొనుగోలు చేయడం ప్రతికూల అంశంగా మారింది. అటు బులియన్, రూపాయి విలువ కూడా మైనస్ లో ఉన్నాయి. -
16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. అత్యాచారం
- పురుగుల మందు తాగించి.. తనూ తాగిన నిందితుడు శంషాబాద్ : బాలికను అపహరించిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆపై ఆమెకు పురుగులమందు తాగించారు. అందులో ఓ నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి కాలనీ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీ పక్కనే ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల్లో నివాసముండే ఓ ఆటో డ్రైవర్ కుమార్తె (16) స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. అదే కాలనీలో నివాసముంటూ ఫిల్టర్ నీళ్లు ఆటోలో సరఫరా చేసే జంగయ్య అలియాస్ జంగ్లీ (21)తోపాటు మరో వ్యక్తి కలిసి శనివారం రాత్రి 7 గంటలకు ఆ బాలికను నమ్మించి, బైక్‌పై ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతంలోని ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన దుండగులు, అనంతరం బాలికకు పురుగులమందు తాగించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వీరి నుంచి తప్పించుకొని వచ్చిన సదరు బాలిక సమీపంలోని రాళ్లలో పడిపోయింది. ఉదయం 10 గంటలకు కట్టెల కోసం వెళ్లిన స్థానికులు ఆమెను గమనించి ఆరాతీశారు. మెల్లగా.. తన తండ్రి ఫోన్ నంబరు చెప్పిన ఆ బాలిక వెంటనే స్పృహ కోల్పోయింది. దీంతో వారు బాలిక కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు సేకరించిన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూడడంతో.. ఆ గది పక్కనే స్పృహ కోల్పోయి ఉన్న జంగయ్య కనిపించాడు. భయంతో అతడు కూడా పురుగుల మందు తాగినట్టు గుర్తించిన పోలీసులు అతడిని కూడా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జంగయ్య వెంట ఉన్న మరో వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడు పరారీలో ఉన్నాడు. బాలికతోపాటు నిందితుడు కూడా స్పృహలోకి రాకపోవడంతో పోలీసులు పూర్తి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
ఆరంభంలోనే అన్నదాతకు నరకం
విత్తనాల కోసం గంటల తరబడి పడిగాపులు డిమాండ్ ఎక్కువ.. వచ్చింది తక్కువ ఎరువులదీ అదే పరిస్థితి ఈ లైను చూస్తుంటే వీరేమి తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు టికెట్ల కోసం లైన్లో నిల్చున్న ప్రేక్షకులు కాదు. పుడమితల్లిని నమ్ముకొని రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్లు ఆరుగాలం శ్రమించే అన్నదాతలు. విత్తనాల కోసం వీరుపడుతున్న పాట్లకు ఇవే సాక్ష్యాలు. వర్షాలు బాగా పడతాయంటూ వాతావరణ శాఖ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో కనీసం ఈ సీజన్లోనైనా తమ కష్టాలు గట్టెక్కుతాయన్న గంపెడాశతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. విత్తు దొరక్క మళ్లీ చిత్తవుతున్నారు. విశాఖపట్నం: ఖరీఫ్ దుక్కులు దాదాపు పూర్తికావచ్చాయి. నారుమళ్లు వేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు.రుణమాఫీ పుణ్యమాని బ్యాంకుల్లో పేరుకుపోయిన అప్పులు ఒకవైపు భయపెడుతున్నాయి. మరో పక్క బ్యాంకుల నుంచి ఇంకా చేతికి పైసా రుణం అందక పోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రూ.3 నుంచి రూ.5ల వడ్డీకి అప్పులు చేసి రైతన్నలు విత్తనాలు, ఎరువుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విత్తనాలు, ఎరువుల కోసం యుద్ధాలు చేస్తున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరుతూ అష్టకష్టాలుపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో లక్షా 05 హెక్టార్లకు తక్కువకాకుండా వరి, 37వేల హెక్టార్లలో చెరకు, 42వేల హెక్టార్లలో మిల్లెట్స్ (చిరుధాన్యాలు), 17 వేల హెక్టార్లలో అపరాలు సాగుచేయాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన వ్యవసాయశాఖ అందుకనుగుణంగానే విత్తనాల కోసం ఇండెంట్ పెట్టింది. డిమాండ్ కొండంత.. వచ్చింది గోరంత జిల్లాకు 76 వేల క్వింటాళ్లకు ైపైగా విత్తనాలు అవసరం. జిల్లా వ్యవసాయ శాఖ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు కనీసం 36 వేల క్వింటాళ్ల విత్తనాలైనా కావాలని ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టారు. కాాని జిల్లాకు 20 వేల క్వింటాళ్లు కూడా చేరలేదు. ముఖ్యంగా ఆర్జేఎల్ విత్తనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. డిమాండ్‌కు తగ్గట్టుగా విత్తనాలు కేంద్రాలకు చేరలేదు. ఆర్జేఎల్ రకం విత్తనాలు కనీసం 25 వేల క్వింటాళ్ల అవసరం కాగా, వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి 12,500 క్వింటాళ్ల కోసం ఇండెంట్ పెట్టింది. జిల్లాకు ఇప్పటి వరకు చేరింది మాత్రం 6వేల క్వింటాళ్ల లోపే. దీంతో ఈ రకం విత్తనాలు దక్కించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక వైపు నాట్లు వేసుకునే సమయం ముంచుకొస్తుండడంతో మరో వైపు డిమాండ్‌కు తగ్గట్టు విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. పీఏసీఎస్‌లు, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో విత్తనాలు అందుబాటులో ఉంచారు. డిమాండ్ మేరకు విత్తనాలు రాకపోవడంతో రైతులు ఎక్కడ తమకు దక్కకుండా పోతాయోననే ఆందోళనతో పీఎసీఎస్‌లు, వ్యవసాయ కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. అనకాపల్లి, మునగపాక, రాంబిల్లి, చోడవరం తదితర ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వందలాది మంది రైతులు క్యూలైన్లలో నిల్చుని విత్తనాల దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అనకాపల్లితో సహా పలు ప్రాంతాల్లో పోలీసుల పహరా మధ్య విత్తనాలు సరఫరా చేస్తుండడం కనిపించింది. గతేడాది కూడా ఇదే రీతిలో ఖాకీల నీడలోనే విత్తనాలు, ఎరువులు సరఫరా చేయగా తొక్కిసలాట చోటుచేసుకుంది. అప్పట్లో ఒకరిద్దరి రైతులకు తీవ్ర గాయాలుకూడా అయ్యాయి. అయినా సరే సర్కార్‌లో మార్పు కనిపించలేదు. మళ్లీ అదే సీన్ రీపీట్ అవుతోంది. అనకాపల్లి పట్టణంలోని గౌరీ, అన్నపూర్ణ పీఏసీఎస్‌ల వద్ద బుధవారం విత్తనాల విక్రయాలను ప్రారంభించారు. విత్తన విక్రయ కేంద్రాలను ప్రారంభించడంలో జాప్యం ఏర్పడడం, అదే సమయంలో రైతులు పోటెత్తడంతో తోపులాటలు జరగడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అన్నపూర్ణ పీఏసీఎస్ వద్ద రైతులు తోపులాటలకు గురికాగా బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ రైతులను కంట్రోల్ చేసేందుకు పట్టణ ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలోని పోలీసులు నానాపాట్లు పడ్డారు. ముఖ్యంగా ఆర్జేఎల్ 2537 కోసం రైతులు డిమాండ్ చేయగా ఒక్కో రైతుకు ఒక్కో బస్తా అన్న చందంగా అధికారులు విక్రయించారు. ఎరువుల పరిస్థితి అంతే... యూరియా 2014-15లో 45,253 మెట్రిక్ టన్నులు వాడితే 2015-16లో 42,130 ఎంటీలకు తగ్గింది. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం యూరియా 50,342 ఎంటీలు, డీఏపీ 12,334 ఎంటీలు, ఎంవోపీ 12,096 ఎంటీలు, ఎస్ఎస్పీ 11,670 ఎంటీలు, కాంప్లెక్స్ ఎరువులు 10,889 ఎంటీలు ఇండెంట్ పెట్టారు. కానీ డిమాండ్‌కు తగ్గట్టు ఎరువులు కూడా జిల్లాకు చేరలేదు. ఆందోళన అవసరం లేదు.. జేడీ విత్తనాలకోసం ఇప్పటికే ఇండెంట్ పెట్టాం. అవసరమైన విత్తనాలు జిల్లాకు వస్తున్నాయి. ఇప్పటికే 26 వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధ చేశాం. మిగిలిన విత్తనాలు కూడా అతి త్వరలోనే వచ్చేస్తాయి. విత్తనాల కొరత ఏర్పడుతుందని ఏ ఒక్క రైతు ఆందోళన చెంద నవసరం లేదు. ప్రతీ రైతుకు విత్తనం అందేలా ఏర్పాటు చేస్తన్నాం. - వి.సత్యనారాయణ, జేడీ, వ్యవసాయ శాఖ -
విత్తనం కోసం బజారుకు పోలేదు!
బోరు బావి, ఎద్దులు, యంత్ర పరికరాలు, హైబ్రిడ్ వంగడాలు, ఎరువులు ఇన్నీ ఉంటేనే వ్యవసాయమనే నష్టాల సంద్రాన్ని దాటలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులువి. కానీ, కేవలం వర్షాధార భూమిలో సేంద్రియ పద్ధతుల్లో సాగుచేస్తున్న చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజల సంప్రదాయ మిశ్రమ (కలిపి) పంటలు వినోద అనే మహిళా రైతును విజేతగా నిలిపాయి. వరుస కరువు పరిస్థితుల్లోనూ ఆమె కుటుంబం ఆహార భద్రతకు, ఆదాయ భద్రతకు లోటు లేకుండా.. అప్పుల్లేకుండా సగర్వంగా జీవిస్తున్నది. తోటి మహిళలకే కాదు చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు నడవవలసిన దారిలో ఆమె దీప కళికలా నిలిచింది. ఆహార సార్వభౌమత్వం సాధించుకున్న ఇటువంటి మహిళా రైతులందరికీ జేజేలు పలుకుతూ వినోదను ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఉత్తమ రైతు -2015 పురస్కారంతో సత్కరించింది. ఆమె ప్రసంగపాఠం ఇక్కడ పొందుపరుస్తున్నాం.. నా పేరు వినోద మిదొడ్డి. నాకు 30 ఏండ్లు. పెండ్లి అయ్యి 15 ఏండ్లు అయితుంది. నాకు ముగ్గురు పిల్లలు. ఒక ఆడ బిడ్డ, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. నా దగ్గర 3 ఎకరాల భూమి ఉంది. పార్కం లేదు. బోరు, బావి ఏమి కూడా లేవు. ఒట్టి పునాస పంటలే తీస్తా. ఈ భూమిలో కనీసం 25 రకాల పంటలు పండిస్తాను. 4 రకాల జొన్నలు, 3 రకాల తోగాళ్లు, అనుములు, నువ్వులు, గడ్డినువ్వులు, సజ్జలు, కొర్రలు ఇలా 25 రకాలు పండిస్తాను. నేను ఎన్నడూ నా విత్తనం కోసం బజారుకు పోలేదు. నా విత్తనాలు నేనే దాచిపెట్టి దాన్ని మళ్లి నా భూమిలో పెట్టుకుంటా. దీంతో ఎప్పుడు విత్తనాలకు నాకు తిప్పలు లేదు. నా ఇంటిపెంటనే నా చేనుకి ఎరువు. 2-3 ఏండ్ల నుంచి జెర్రెల ఎరువు కూడ ఇంటికాడనే తయారు చేసుకుంటున్న. అది నాచేనుకే వేసుకుంటా.పిడకల ఎరువు, మేకల ఎరువు ఇట్లా వేరే వేరే ఎరువులు వేసుకొని నా భూమి బలం కాపాడుకుంటూ వస్తున్న. నాకెప్పుడూ సర్కారి ఎరువు కొనే అవసరం రాలేదు. నా భూమి బలంగా ఉంది. మట్టి ఆరోగ్యంగా ఉంది. 10 రకాల పంటలు పెడతా. ఇవన్నీంటితోని నా పంటల మీద ఎన్నడు పురుగులు రాలేదు.. రావు కూడ. ఇట్లా నాకు బయట విత్తనాల అవసరం లేదు. పార్కం నీళ్ల అవసరం లేదు. సర్కారి ఎరువు వద్దు. సర్కారు మందులు అసలే వద్దు. మా కాళ్ల మీద మేము నిలబడి చేసుకునే వ్యవసాయం అంటే ఇదే అని నాకు అనిపిస్తది. ఇటువంటి వ్యవసాయం నేను ఒక్క ఆమెనే కాదు. నా చుట్టు పక్కన ఊర్లలో, మండలాల్లో వేలాది మంది ఆడోళ్లు ఇదే వ్యవసాయం చేస్తున్నారు. అందరుకు చిన్న చిన్న గుడ్డాల 1-2 ఎకరాల భూములు పార్కం లేని పంటలు. అందరూ జొన్నలు, సజ్జలు, కొర్రలు, తొగాళ్లు, అనుములు, నువ్వులు ఇటువంటి పంటలనే పండిస్తారు. బయట బజారు దీన్ని చిన్న చూపు చూస్తే మేము అందరం ఆడోళ్లం కలిసి ఒక మార్కెట్ తయారు చేసుకున్నాము. బయట మార్కెట్ల ఎంత ధర ఉంటుందో దానికన్నా ఎక్కువ ధరకి దీన్ని కొనుక్కొని పట్టణంలో ఉన్న మీ అసోంటోళ్లకు అందజేస్తాం. ఇప్పుడిప్పుడే మా సర్కారు మన తెలంగాణ - మన వ్యవసాయం అనే ఒక పద్ధతిని ప్రారంభించింది అని విన్నాను. అసలు తెలంగాణ వ్యవసాయం అంటే మన వ్యవసాయం. నీళ్లకు ఆశపడని పంటలు. కరెంటు అవసరం లేని పంటలు. బలం లేని భూముల్లో కూడా పండే పంటలు. బయట వస్తువులకు ఎన్నడు ఎదురు చూడని వ్యవసాయం. ఈ సంవత్సరంలో వచ్చిన పెద్ద కరువు లోపల కూడా 3 ఎకరాల భూమిలో నా పంటలతోని 2 ల క్షల రూపాయల ఆముదాని వచ్చింది. నా పక్క చేను యాదయ్య తన 3 ఎకరాల చేనులో బిటి పత్తి వేసి 10 వేల రూపాయలు సంపాదన కూడా చేయలేదు. ఈ యాదయ్య ఆసొంటి రైతులే బీటీ పత్తి, అమ్మేటి పంటల వెంబడి పడి ఉరి వేసుకొని చనిపోతున్నారు. తెలంగాణలో సచ్చిన ప్రతి ఒక రైతుది ఇదే కథ. అయితే నా అసొంటి రైతు ఎవ్వరు ఆత్మహత్య చేసుకోలేదు. నా చుట్టుపక్కల మండలాలలో ఒక్క రైతు కూడా ఇప్పడి వరకు ఉరి వేసుకోలేదు. ఈ పెద్దల సభకు నన్ను పిలిచి నాకు మర్యాద చేసినారు. మీకు చాలా ధన్యవాదాలు. అయితే నా మాటని మీరు పెద్దగా చేసి సర్కారోళ్లకి, యూనివర్శిటోళ్లకు అందరికి వినిపించి మా పంటలకు, మా వ్యవసాయానికి పాత విలువ తెస్తేనే మీరు నన్నిక్కడ పిలిచిన దానికి ఒక మతలబు ఉంటది. ఆ పని మీరు చేస్తారని అనుకుంటున్నా. ఆ పని మీరు చేయాలని ప్రార్థిస్తున్నాను. - మిదొడ్డి వినోద, నాగ్వార్ గ్రామం, రాయికోడ్ మండలం, మెదక్ జిల్లా (వివరాలకు www.ddsindia.com లో వీడియోలు చూడండి) -
అన్నదాత..జర జాగ్రత్త..!
ఎరువుల కొనుగోలులో అప్రమత్తత అవసరం యడ్లపాడు : ఖరీఫ్ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మే నెలలో సగటు వర్షపాతానికి మించి మండలంలో వర్షం కురిసింది. జూన్ ప్రారంభంలోనూ 4 దఫాల్లో 17.8 మిమీ వర్షపాతం కురవడంతో రైతులు భూమిని దుక్కి దున్ని ఎరువులు, విత్తనాల కోసం షాఫులకు వెళ్తున్నారు. అయితే రైతులు ఎరువుల కొనుగోళ్ల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. చాలాచోట్ల నాసిరకం విత్తనాలు కొని పంట ఎదుగుదల లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఎవరో చెప్పారని మొహమాటానికి నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తే మోసపోయే అవకాశం ఉంది. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలతో కొందరు వ్యాపారులు నాసిరకం విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణ మందులను అంటగడుతుంటారు. విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలను మండల వ్యవసాయాధికారి ఐ.శాంతి వివరించారు. విత్తనాల కొనుగోళ్లలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి... గుర్తింపు పొందిన విత్తనాల సంస్థల నుంచి ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తనాల సంచిపై లాట్ నంబర్, కాల పరిమితి తప్పనిసరిగా ముద్రించి ఉన్నవాటినే కొనుగోలు చేయాలి. రైతు కొనుగోలు చేసిన విత్తనాల సంచి ట్యాగ్, బిల్లు రసీదులను పంటకాలం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలియని వ్యక్తుల ప్రోద్బలం, మాయమాటలు నమ్మి విత్తనాల గురించి తెలియకపోయినా కొనుగోలు చేయడం మంచిదికాదు. విత్తనాలు నాణ్యమైనవా కావా అన్నవిషయాన్ని విత్తనాలను విత్తే ముందుగానే మొలకశాతాన్ని పరిరక్షించుకోవడం మంచిది. నాణ్యమైన విత్తనాలను ఇలా గుర్తించవచ్చు... కొనుగోలు చేసిన విత్తనాల సంచి నుంచి 100 గింజలను తీసుకోవాలి. శుద్ధమైన ఇసుకను సేకరించి పళ్లెంలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో రెండు అంగుళాల మందంతో నింపుకోవాలి. అందులో 100 విత్తనాలను సమాన స్థాయిలో ఉంచి తిరిగి ఇసుకతో కప్పాలి. ఇసుకను రోజూ నీటితో తడపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. వారం పదిరోజుల్లో అందులో దృఢంగా, ఏపుగా, ఆరోగ్యంగా పెరిగిన మొక్కలను లెక్కిస్తే 70 నుంచి 80 శాతం మొలకెత్తితే అవి నాణ్యమైన విత్తనాలని భావించాలి. బలం మందులు, పురుగు మందుల కొనుగోలు సమయంలోనూ... బలం మందులు, పురుగు మందులు కొనుగోలు చేసేటప్పుడు ఆయా డబ్బాలపై సీలు సరిగ్గా ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలించాలి. అన్నీ సక్రమంగా ఉన్న వాటిని కొనుగోలు చేయాలి. కొన్న ప్రతిదానికి తప్పకుండా రసీదు అడిగి తీసుకోవాలి. ముఖ్యంగా ఐఎస్ఐ ముద్ర ఉన్న వాటిని విధిగా కొనాలి. వాటితో పాటు మందులు తయారు చేసిన తేదీ, గడువు తేదీ ముద్రించి ఉన్నాయో లేదో గమనించాలి. వ్యవసాయ శాఖ అనుమతులు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి. ఎలాంటి వివరాలు లేకుండా ఇచ్చే ఎరువుల సంచులు కొనుగోలు చేయరాదు. - శాంతి వ్యవసాయాధికారిణి -
ఆశల సాగుకు అడుగు
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు సాగుబాట పట్టిన రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు హన్మకొండ : జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 40 మండలాల్లో వర్షం కురిసింది. సగటున 16.9 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 14 మండలాల్లో 20 మిల్లీ మీటర్లకు పైగా వర్షం కురియగా.. అత్యధికంగా తొర్రూరులో 97.8 మిల్లీమీటర్లు నమోదైంది. కాగా, తొలకరి జల్లులకు రైతులు దుక్కులు దున్నుకుని విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. గతేడాది జూన్‌లో మురిపించిన వర్షాలు తర్వాత ముఖం చాటేశాయి. దీంతో వేసిన విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరిగే సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఎదుగుదల దశలోనే పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో ఈసారి రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా, తొలకరి జల్లులతో మంగళవారం వరంగల్ నగరంతోపాటు జనగామ, పరకాల నియోజకవర్గాల్లోని విత్తన దుకాణాల వద్ద రైతుల సందడి కనిపించింది. గ్రామాల నుంచి వచ్చిన రైతులు తమకు నచ్చిన కంపెనీల విత్తనాలు కొనుగోలు చేసుకుని వెళ్లారు. -
విత్తనాలు, ఎరువులపై నిఘా
♦ పక్కదారి పట్టకుండా చెక్ ♦ ప్రతి దుకాణానికి అధికారి నియామకం ♦ కొనుగోళ్లపై పర్యవేక్షణ బాధ్యత వారిదే ♦ సబ్ డివిజన్ల వారీగా జాబితాలు సిద్ధం ♦ 15 తర్వాత పకడ్బందీగా అమలు ఎట్టకేలకు అధికారులు మేల్కొన్నారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో జిల్లాలో ఏటా ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టడానికి జిల్లా అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా ప్రతి రైతు అవసరాలు తీరేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ప్రతి దుకాణంపై నిఘా కొనసాగించే క్రమంలో ఇన్చార్జీలను నియమించనున్నారు. సదరు అధికారి క్రయవిక్రయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఈ రకంగా రైతులకు కొంతవరకైనా మేలు జరిగే అవకాశం ఉంది. గజ్వేల్: జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 5.40 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. ఇందులో భాగంగానే పత్తి, వరి 90వేల హెక్టార్లు, మొక్కజొన్న 1.30 లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉంది. ఏటా 1.25 లక్షల హెక్టార్లలో సాగయ్యే పత్తి ఈసారి తగ్గనుందని భావిస్తున్నారు. మిగతా విస్తీర్ణంలో కూరగాయలు, ఇతర పంటలు సాగవుతాయని అంచనా. ఇందుకోసం అన్ని విత్తనాలు కలుపుకొని 80 వేల క్వింటాళ్లు, సీజన్ ముగిసే సరికి కాంప్లెక్స్, యూరియా తదితర ఎరువులు కలుపుకొని 1.70 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని గుర్తించారు. సరైన కేటాయింపులు లేక ఏటా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు తమ ఇష్టానుసారంగా పంపిణీ చేయడం వల్ల విత్తనాలు, కాంప్లెక్స్, యూరియా దొరక్క రైతులు రోడ్డెక్కే పరిస్థితులు తలెత్తేవి. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేసే క్రమంలో జిల్లా అధికారులు ఈసారి పకడ్బందీగా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయడానికి చర్యలకు ఉపక్రమించారు. నిత్యం పర్యవేక్షణ.. ఇందులో భాగంగా విత్తనాలు, ఎరువుల దుకాణాలపై నిఘా పెంచే క్రమంలో మూడు నుంచి ఆరు దుకాణాలకో అధికారిని ఇన్చార్జిగా నియమించనున్నారు. వ్యవసాయశాఖకు చెందిన వారు కాకుండా రెవెన్యూ అధికారులను ఇన్చార్జిలుగా నియమించనున్నారు. వీరు ఆయా దుకాణాల్లో నిత్యం క్రయవ్రియాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. విత్తనాలు, ఎరువుల పంపిణీ సందర్భంగా ప్రతి రైతు పట్టెదారు పాసుపుస్తకం నెంబర్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రైతుకున్న భూవిస్తీర్ణాన్ని బట్టి విత్తనాలు, ఎరువుల పంపిణీ చేస్తారు. నిబంధనలు పాటించని దుకాణదారునిపై సంబంధిత ఏఓకు లేదా ఏడీఏకు ఇన్చార్జి అధికారులు రిపోర్ట్ చేయగానే తక్షణ చర్యల తీసుకునేలా ఆదేశాలివ్వనున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే లెసైన్స్ సస్పెండ్ చేయడమో లేదా క్రిమినల్ చర్యలకు వెనకాడవద్దని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని వ్యవసాయ సబ్ డివిజన్ల నుంచి ఏడీఏలు, రెవెన్యూఅధికారులతో కలుపుకొని జాబితాను తయారు చేసి జేడీఏ కార్యాలయానికి అందజేశారు. దీని ప్రకారం 15వ తేదీ తరువాత ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పక్రియను సమర్థంగా అమలు చేసి తమ ఇక్కట్లు తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు. -
మూడో విడత రుణమాఫీ ఎప్పుడు?
- సొమ్ము కోసం బ్యాంకులు.. రుణం కోసం రైతుల ఎదురుచూపులు - ఖరీఫ్ విత్తనాలు, ఎరువులు, సాగు పెట్టుబడులు లేక అన్నదాతల అవస్థలు - రుణమాఫీ నిధులు విడుదల చేయకుంటే బ్యాంకులు రుణమిచ్చే పరిస్థితి లేదు - కరువు సాయం విడుదలపైనా అస్పష్టత.. ఖరీఫ్‌తోనే కష్టాలూ మొదలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌తో పాటు రైతులకు కష్టాలూ మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాలతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కానీ పెట్టుబడులకు పైసా లేని దుస్థితి. రుణం కోసం బ్యాంకులకు వెళితే.. ‘రుణమాఫీ’ మూడో విడత సొమ్ము విడుదలయ్యాకే ఇస్తామంటూ కొర్రీలు పెడుతున్నాయి. రుణమాఫీ సొమ్ముకు, కొత్త రుణాల మంజూరుకు సంబంధం లేదని సర్కారు చెబుతున్నా.. బ్యాంకులు మాత్రం రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళనలో కూరుకుపోతున్నారు. మూడో విడత రుణమాఫీ సొమ్ము విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు మాఫీ పథకాన్ని ప్రకటించింది. 35.82 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.17 వేల కోట్లను మాఫీ చేయాలని నిర్ణయించింది. అందులో మొదటి విడతగా 2014లో రూ.4,230 కోట్లు, గతేడాది రెండో విడతగా రూ.4,040 కోట్లు విడుదల చేసింది. మరో రెండు విడతల సొమ్ము రూ.8,080 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో ఈ ఏడాది మూడో విడత కింద రూ.4,040 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. దీనికి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించినా.. విడుదల చేయలేదు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతుండడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. బోగస్‌లను గుర్తించాకే! మూడో విడత నిధులను విడుదల చేయడానికి ముందు రుణమాఫీ పొందిన బోగస్ రైతులను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. బోగస్ పాసు పుస్తకాలు, బినామీ పేర్లతో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం.. అనర్హులను గుర్తించాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది కూడా. తొలి, రెండు విడతల్లో విడుదల చేసిన మాఫీ సొమ్ములో ఎంత మేరకు అక్రమాలు జరిగాయన్న దానిపై సమగ్ర పరిశీలన చేసే అవకాశాలున్నాయి. ఇక కేంద్రం విడుదల చేసిన ఇన్పుట్ సబ్సిడీ సొమ్మును రైతులకు ఇవ్వడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబించడంపై విమర్శలు వస్తున్నాయి. -
దివాలా సొసైటీలకే ఇవ్వాలా..?
- వాటికి ఎరువులు, విత్తనాల పంపిణీ బాధ్యతపై విమర్శలు - 906 సహకార సొసైటీలకుగాను 400 నష్టాల అంచుల్లోనే - వ్యవసాయశాఖ నిర్ణయంతో రైతులకు తప్పని కష్టాలు సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ప్రాథమిక సహకార సొసైటీ(ప్యాక్స్)ల ద్వారా విత్తనాలు, ఎరువులను రైతులకు సరఫరా చేయాలని రాష్ట్రవ్యవసాయ శాఖ నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక సహకార సొసైటీలు దివాలా అంచున ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల రైతులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 906 సొసైటీలుండగా వాటిల్లో 400 సొసైటీలు నష్టాల్లో ఉన్నాయని, సరైన నిర్వహణ లేక కొన్ని కునారిల్లుతున్నాయని, ఇలాంటి స్థితిలో వాటికి విత్తనాలు, ఎరువులను విక్రయించే బాధ్యత ఇస్తే సమస్యలు తప్పవంటున్నారు. గతంలో అనేక సొసైటీలు ఇలా మార్క్‌ఫెడ్ నుంచి ఎరువులు తీసుకొని డబ్బులు చెల్లించలేదని చెబుతున్నారు. 50 శాతం సబ్సిడీపై...: మండల కేంద్రాల నుంచి కాకుండా గ్రామాల్లో ఉండే సహకార సొసైటీల ద్వారానే విత్తనాలు, ఎరువులను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సహకార సొసైటీల ద్వారానైతే రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో చేరతాయనేది వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్దేశం. ఈ ఏడాది మొత్తం 7.5 లక్షల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేయాలని సర్కారు నిర్ణయించింది. వాటి విలువ రూ.412 కోట్లు. రైతులకు సబ్సిడీ పోను సర్కారు స్వయం గా రూ. 206 కోట్లు భరించనుంది. 2.5 లక్షల క్వింటాళ్ల వరి, 3.75 లక్షల క్వింటాళ్ల సోయాబీన్, 77 వేల క్వింటాళ్ల వేరుశనగ, 70 వేల మొక్కజొన్న, 80 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను సరఫరా చేస్తాయి. అలాగే 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది. బ్యాంకు గ్యారంటీ ఉన్నా... సొసైటీలకు ప్రభుత్వం కేటాయించే విత్తనాలు, ఎరువుల విలువ మేరకు సహకార బ్యాంకులు ప్రభుత్వానికి గ్యారంటీ ఇస్తాయి. బ్యాంకు గ్యారంటీ ఉన్నా నష్టాల బాటలో ఉన్న 400 సొసైటీలు విత్తనాలు, ఎరువులు తీసుకొని ఏ మేరకు వెన క్కు తిరిగి చెల్లిస్తాయన్న ప్రశ్న అధికారుల ను వేధిస్తోంది. అవి చేతులెత్తేస్తే సహకార బ్యాంకులు కుప్పకూలిపోతాయంటున్నారు. గతేడాది మార్క్‌ఫెడ్‌కు కొన్ని సొసైటీలు రూ. 3 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో న్యాయ పోరాటానికి దిగాల్సి వచ్చిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. -
జోరుగా నకిలీ దందా
►రైతులకు కుచ్చుటోపీ.. ►అనుమతి లేని వేరుశనగ విత్తనాల విక్రయం ►పట్టించుకోని అధికారులు దుగ్గొండి : గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు నకిలీ వేరుశనగ విత్తనాలు అంటుగడుతున్నారు. ఇవి నాణ్యమైన విత్తనాలని, ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నామని చెపుతూ అనుమతి లేని సీడ్స్‌ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని మహ్మదాపురం గ్రామంలో స్థానికంగా ఉండే ఓ ఫెర్టిలైజర్ షాపు డీలర్ ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి ట్యాగ్-24 రకం వేరుశనగ విత్తనాలంటూ రైతులకు మాయమాటలు చెప్పి వాస్తవ ధరకన్నా రూ.600 పెంచి అమ్ముతున్నాడు. ఎలాంటి బిల్లులు ఇవ్వడం లేదు. ఇప్పటికే గ్రామంలో వెయ్యి బస్తాల(దాదాపు 300 క్వింటాళ్ల) విత్తనాలు విక్రయించినట్లు తెలిసింది. అయితే కర్నూలు విత్తనాలు అని చెప్పి వరంగల్ మార్కెట్ పరిధిలోని ఓ వేరుశనగ వ్యాపారి వద్ద కొనుగోలు చేసి ట్యాగ్ -24 పేరుతో ముద్రించిన బ్యాగుల్లో నింపి విక్రయిస్తున్నాడని సమాచారం. అధిక ధరకు నాణ్యతలేని విత్తనాలు విక్రయిస్తున్నారని వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి దయాకర్‌ను వివరణ కోరగా ఇతర ప్రాంతాల నుంచి వేరుశనగ విత్తనాలు తెచ్చి విక్రయిస్తున్నారని గత రెండు రోజుల క్రితమే రైతుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. బిల్లులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేస్తే తమ బాధ్యత లేదన్నారు. చట్టవిరుద్ధంగా విత్తనాలు విక్రయిస్తున్న డీలర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పోలీస్ స్టేషన్లో యువతి ఆత్మహత్యాయత్నం
ఏలూరు(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఆదివారం ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బేబీ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏలూరు మండలం వట్లూరుకు చెందిన బేబీ.. తన భర్త వేధిస్తున్నాడంటూ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏలూరు పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ జరుగుతుండగా బాత్రుమ్‌లోకి వెళ్లి ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో బేబీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
జీవామృతం పారింది.. బత్తాయి నవ్వింది!
♦ డిగ్రీ చదివి బత్తాయి సాగులో రాణిస్తున్న యువరైతు ♦ రెండేళ్లుగా ప్రకృతి సేద్యం.. దిగుబడులు సంతృప్తికరం ♦ తోకముడిచిన వేరుకుళ్లు తదితర తెగుళ్లు అతను డిగ్రీ చదువుకున్నాడు. సొంత భూమిలో బత్తాయి తోట సాగు ప్రారంభించాడు. అందరి మాదిరిగానే రసాయనిక వ్యవసాయ పద్ధతులను పాటించాడు. ఏటా తెగుళ్లతోపాటు ఖర్చూ పెరుగుతున్నా.. దిగుబడి నానాటికీ తీసికట్టవుతూ వచ్చింది. విసిగి వేసారి ప్రకృతి సేద్యం చేపట్టాడు. ఖర్చు 80 శాతం తగ్గింది. కానీ, దిగుబడి తొలి ఏడాది కూడా తగ్గలేదు. మరోవైపు బత్తాయిల నాణ్యత పెరిగింది.. ఏ రైతుకైనా ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి..? గోట్ల గౌతమ్ అనే విద్యాధికుడైన యువ రైతు తన 18 ఎకరాల బత్తాయి తోటలో ప్రకృతి సేద్యం చేస్తూ.. తొలి ఏడాది నుంచే రసాయన సేద్యానికి దీటుగా దిగుబడులు సాధిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ మండలం కొత్తపల్లి ఆయన స్వగ్రామం. డిగ్రీ వరకు చదువుకున్నారు. అయినా వ్యవసాయంపై మక్కువతో 2005 నుంచి 18 ఎకరాల్లో బత్తాయి సాగు (రసాయనిక వ్యవసాయం) ప్రారంభించారు. ఐదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాక 2010లో పంట దిగుబడి ప్రారంభమైంది. అదే సమయంలో తామర పురుగు, పచ్చదోమ, తెల్లదోమతో వైర స్ తెగుళ్ల వ్యాప్తి పెరిగింది. తరచూ వేరుకుళ్లు, కాంకర్ వంటి తెగుళ్లు, రసం పీల్చే పురుగులు పంటను ఆశించేవి. వీటిని నివారించేందుకు క్రిమిసంహారక మందులను విరివిగా పిచికారీ చేయాల్సి వచ్చేది. దీని వల్ల ఖర్చు పెరిగేది. శ్రమ ఎక్కువయ్యేది. అంత చేసినా దిగుబడి.. పంట నాణ్యత తగ్గుతూ ఉండేది. రకరకాల మందులను మార్చి మార్చి పిచికారీ చేసినా నెల రోజుల తర్వాత మళ్లీ చీడపీడల దాడి మొదలయ్యేది. వేరుపురుగుతో వేగలేక కొత్తపల్లి గ్రామంలో కొందరు రైతులు బత్తాయి తోటలను నరికివేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటువంటి అననుకూల పరిస్థితుల్లో ఇక రసాయనిక పురుగుమందుల పిచికారీతో చీడపీడల నివారణ సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు గౌతమ్. ఆ దశలో పత్రికల ద్వారా ప్రకృతి సేద్యం గురించి తెలుసుకొన్నారు. 2013లో నాగ్‌పూర్‌లో జరిగిన పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు. మెలకువలను ఆకళింపు చేసుకొని శ్రద్ధగా ఆచరించటం ప్రారంభించారు. చెట్టుకు నెలకు 5-7 లీటర్ల జీవామృతం జీవామృతం తయారీ కోసం ఆరు ఒంగోలు జాతి ఆవులను గౌతమ్ పెంచుతున్నారు. నెలకు 25 వేల లీటర్ల జీవామృతాన్ని తయారు చేసి బత్తాయి మొక్కలకు అందిస్తున్నారు. ఒక్కో చెట్టుకు నెలకు 5-7 లీ. చొప్పున అందిస్తున్నారు. తయారు చేసిన జీవామృతాన్ని వారం లోపలే మొక్కలకు అందిస్తారు. మరో ట్యాంకును ఏర్పాటు చేసి ఫిల్టర్ అయిన జీవామృతాన్ని డ్రిప్ ద్వారా చెట్లకు అందిస్తున్నారు. లీటరు నీటికి 10 నుంచి 20 మిల్లీ లీటర్ల జీవామృతాన్ని కలిపి నెలకోసారి చెట్లపై పిచికారీ చేస్తున్నారు. ఎలాంటి కషాయాలు పిచికారీ చేయకుండానే తెగుళ్ల బెడద తగ్గిపోయింది. ప్రకృతి సేద్యం పాటించినప్పటి నుంచి తోటలోకి ఎక్కువ సంఖ్యలో పక్షులు రావటం మొదలైంది. పంటను ఆశించే వివిధ రకాల పురుగులను తింటూ సహజ కీటక నివారిణిలుగా ఇవి పని చేస్తున్నాయి. తోటలో పెరిగే గడ్డి కూడా బలమే! ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగవుతున్న పండ్ల తోటల్లో చెట్ల మధ్య పెరిగే గడ్డి మొక్కలను దున్నకూడదంటారు గౌతమ్. పెరిగిన గడ్డి వల్ల ఆచ్ఛాదన ఏర్పడి భూమిలో ఎక్కువ కాలం తేమ నిల్వ ఉంటుంది. తేమను ఆధారంగా చేసుకొని పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు భూమి పై పొరలో నివశిస్తాయి. శిలీంధ్రాల బారి నుంచి చెట్లను కాపాడే సహజ రక్ష క కవచాలుగా ఇవి పని చేస్తాయి. వీటిని కాపాడుకోవాలంటే భూమిని దున్నకూడదంటారాయన. ప్రకృతి సేద్యం చేస్తున్న కొందరు పండ్ల తోటల రైతులు జీవామృతాన్ని అందిస్తున్నా... దిగుబడులు ఆశించిన రీతిలో పెరగటం లేదని బాధపడుతుంటారు. తోటను తరచూ దున్నటమే దీనికి కారణం అంటారు గౌతమ్. బత్తాయి తోటలో అంతర పంటగా ఎకరాకు 300 మునగ మొక్కలను పెంచుతున్నారు. మునగ మొక్కలు ఇప్పుడు పూత దశలో ఉన్నాయి. ఖర్చు 80% తగ్గింది.. పంట పండింది.. ప్రకృతి సేద్యంలో 80 శాతం ఖర్చు తగ్గిందని గౌతమ్ తెలిపారు. 18 ఎకరాల తోటకు రసాయన సేద్యంలో ఎరువులు, పురుగుమందులకు ఏటా రూ. 6-7 లక్షల వరకు ఖర్చయ్యేది. అయితే, జీవామృతం తయారీకి అవసరమైన శనగపిండి, బెల్లం కొనుగోలుకు మాత్రమే రూ. లక్ష వరకు ఖర్చవుతోంది. రసాయన సేద్యంలో ఎకరాకు 10-12 టన్నుల దిగుబడి వచ్చేది. ప్రకృతి సేద్యం ప్రారంభించిన ప్పటి నుంచి 9-10 టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తోంది. పంట నాణ్యత బాగుండటంతో గతేడాది రూ. 33 లక్షలకు వ్యాపారులు తోటను కొనుగోలు చేశారు. - శ్రీకర్, గద్వాల న్యూటౌన్, మహబూబ్‌నగర్ జిల్లా ప్రకృతి సేద్యం తోనే బత్తాయి రైతుకు మనుగడ! 18 ఎకరాల్లో బత్తాయి తోటకు రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకానికి రూ. 6-7 లక్షలు ఖర్చయ్యేది. పురుగుమందుల పిచికారీ వల్ల ఖర్చే తప్ప ఉపయోగం లేదు. ప్రకృతి సేద్యంలో ఖర్చు తగ్గి భూమి సారవంతమవుతున్నది. మంచి నాణ్యమైన పంట దిగుబడి వస్తోంది. ప్రకృతి సేద్యంతోనే బత్తాయి రైతుకు మనుగడ. రైతులంతా ప్రకృతి సేద్యాన్ని ఆచరించాలి. - గోట్ల గౌతమ్ (99480 50031), కొత్తపల్లి, గద్వాల్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా. -
సౌరశక్తితో ఎరువులు
వాషింగ్టన్: సౌరశక్తితో ఎరువులను తయారు చేసే వినూత్న పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా సూర్య కాంతిని వాడుకుని నైట్రోజన్ అణువును అమ్మోనియాగా మార్పు చేస్తారు. అమ్మోనియాను ఎరువుల్లో విరివిగా వాడుతారు. ప్రస్తుతం ఈ రసాయన పద్ధతి పూర్తిగా వినియోగంలోకి వస్తే.. రైతులు శిలాజ ఇంధనాలపై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ నేషనల్ రెన్యూవబుల్ లేబొరేటరీ(ఎన్ఆర్ఈఎల్), కొలరాడో బౌల్డర్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని రూపొదించారు. ఇప్పటికే అమ్మోనియాను జీవ సంబంధిత పద్ధతిలో, హేబర్ పద్ధతిలోనూ తయారు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం సూర్యకాంతితో వినియోగించుకుని నైట్రోజన్‌లో అణువులోని రెండు పరమాణువులను విడగొట్టి అమ్మోనియాను తయారు చేయడం సులభం, చౌకయిన పద్ధతని చెబుతున్నారు. -
జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్య
చేవెళ్ల రూరల్ : జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడకు చెందిన గుత్తి మహేందర్ (29) బీఈడీ పూర్తి చేసి మండలంలోని చందనవెల్లి పాఠశాలలో విద్యావలంటీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం చేవెళ్లకు వచ్చిన మహేందర్ తిరిగి ఇంటికి రాలేదు. కాగా.. చేవెళ్ల సమీపంలో గల ఫరా కళాశాల సమీపంలో ఓ చెట్టు కింద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వద్ద తను జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్‌నోట్ దొరికిందని చెప్పారు. రాత్రి నుంచి ఇంటికిరాలేదని కుమారుడి కోసం తండ్రి వెతుకుతున్నాడు. అతని వద్ద లభించిన ఆధారాలతో పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం మృతుడి తండ్రి ఆనందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి చేవెళ్లలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. -
అప్పులెలా తీర్చాలనే బెంగతో..
ధారూరు(రంగారెడ్డి): సాగు భారం కాగా.. అప్పులు తీర్చే దారి కానరాక మనోవేదనకు గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ధారూరు మండలంలోని కేరెళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు యాదయ్య(30) తనకున్న నాలుగెకరాల్లో పత్తి, కూరగాయలు సాగు చేశాడు. పత్తి ఆశించిన దిగుబడి రాలేదు. బోర్లు వేయటానికి, పంటల సాగుకు బ్యాంకు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర తెచ్చిన అప్పులు రూ.3 లక్షల వరకు మిగిలాయి. ఈ క్రమంలోనే భార్య నర్సమ్మ ఈనెల 10న గొడవ పడి, బంధువుల ఇంట్లో జరిగే విందులో పాల్గొనేందుకు ఇద్దరు కొడుకులు మల్లేశ్(5), మణికంఠ(3)లతో కలిసి తాండూర్ వెళ్లింది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన యాదయ్య పురుగుల మందు తాగి పడుకున్నాడు. అర్థ్దరాత్రి సమయంలో తల్లి అతడిని నిద్ర లేపేందుకు యత్నించగా ఎంతకూ లేవలేదు. అప్పటికే మృతి చెందిన యాదయ్యను చూసి కుటుంబసభ్యుల రోదన మిన్నంటింది. -
సాయం చేయండి.. గట్టెక్కుతాం!
♦ సెంట్రల్ పూల్ నుంచి రూ. 212 కోట్లు అడిగిన మార్క్‌ఫెడ్ ♦ అధికారుల నిర్వాకంతో మొక్కజొన్న లావాదేవీల్లో రూ. 220 కోట్ల నష్టం ♦ రూ. 20 కోట్ల మేర పేరుకు పోయిన ఎరువుల బకాయిలు సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్న కొనుగోలు, ఎరువుల లావాదేవీల్లో అధికారుల నిర్లక్ష్యం రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ మార్క్‌ఫెడ్‌ను నష్టాల్లోకి నెట్టింది. 2013-14కు సంబంధించి సకాలంలో మొక్కజొన్నను వేలం వేయకపోవడంతో రూ. 220 కోట్ల మేర నష్టం వాటిల్లింది. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. మార్క్‌ఫెడ్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. మరోవైపు నష్టాలకు బాధ్యులను తేల్చేందుకు విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతోంది. 2013-14కు సంబంధించి రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ రైతుల వద్ద నుంచి 2.7 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను సేకరించింది. కొనుగోలు, ఇతర చార్జీలను కలుపుకుని క్వింటాలుకు రూ. 1,570 మేర మార్క్‌ఫెడ్ ఖర్చు చేసింది. అయితే సేకరించిన ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాల్సి ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీనికితోడు గోదాములు సరిగా లేక మొక్కజొన్న బూజుపట్టి కుళ్లిపోయింది. దీంతో క్వింటాలుకు రూ. 915 మేర తిరిగి రాగా.. మార్క్‌ఫెడ్‌కు రూ. 220 కోట్ల మేర నష్టం వాటిల్లింది. నష్టాలకు బాధ్యులను తేల్చేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో పాటు.. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో 2014-15కు సంబంధించి 4.32 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేసి.. క్వింటాలుకు రూ. 1,450 నుంచి రూ. 1,600 చొప్పున పొరుగు రాష్ట్రాలకు విక్రయించింది. మరోవైపు 2013-14లో వాటిల్లిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ‘సెంట్రల్ పూల్’ నిధుల నుంచి నిబంధనల మేరకు రూ. 212 కోట్లు మార్క్‌ఫెడ్‌కు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రాన్ని కోరింది. ఎరువుల బకాయిలదీ ఇదే తంతు 2013-14లో మార్క్‌ఫెడ్ ద్వారా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సహకార సంఘాలు, ఇతర సంస్థలకు సరఫరా చేశారు. అయితే విక్రయాలు పూర్తయినా రూ.155 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. మార్క్‌ఫెడ్ ఇటీవల సహకార సంఘాలపై ఒత్తిడి తెచ్చి రూ.135 కోట్ల బకాయిలు వసూలు చేసింది. నష్టాలను పూడ్చుతాం గత ఏడాది ఏప్రిల్ నాటికి మార్క్‌ఫెడ్ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 2013-14లో మొక్కజొన్న లావాదేవీల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. ఎరువుల బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాం. సెంట్రల్ పూల్ నిధుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. బ్యాంకు రుణాలు చెల్లించడం ద్వారా మార్క్‌ఫెడ్ ప్రతిష్టను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. -డాక్టర్ శరత్, ఎండీ, మార్క్‌ఫెడ్ -
ఎరువుల వ్యాపారి ఆత్మహత్య
ఆదోని టౌన్: కర్నూలు జిల్లాలో అప్పుల బాధతో ఓ ఎరువుల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. హొలగుండ మండలం వందవాగిలి గ్రామంలో వెంకటేశ్వ ఫర్టిలైజర్స్ పేరుతో గోపాల్ (42) అనే వ్యక్తి షాపు నిర్వహిస్తున్నాడు. రైతులకు పెద్ద మొత్తంలో ఎరువులు, విత్తనాలను అప్పు కింద ఇచ్చాడు. రైతులు తిరిగి చెల్లించకపోవడం.. కంపెనీల నుంచి డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి రావడంతో గోపాల్ సోమవారం ఉదయం ఇంటి వద్ద పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు కోటి రూపాయల మేర గోపాల్ బకాయిలు కట్టాల్సి ఉన్నట్టు సమాచారం. -
ఎరువుల దుకాణంలో అగ్నిప్రమాదం
వేములపల్లి : నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం చౌటుచర్ల గ్రామంలోని ఓ ఎరువుల దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీసాయి శ్రీనివాస ఫర్టిలైజర్స్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల మేర ఆస్తి బుగ్గిపాలైంది. మిర్యాలగూడ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
కీలక పరిశ్రమల వృద్ధిరేటు 3.2%
నాలుగు నెలల గరిష్టం న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ సెప్టెంబర్‌లో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. 3.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అంటే 2014 సెప్టెంబర్ ఉత్పత్తి విలువతో పోల్చితే 2015 సెప్టెంబర్‌లో ఉత్పత్తి విలువ 3.2 శాతం ఎగసిందన్నమాట. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 2.6 శాతమే. తాజా 3.2 శాతం వృద్ధి నమోదుకు ఎరువులు, విద్యుత్ రంగాలు కారణమయ్యాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి (మేలో 4.4 శాతం) మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 38 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఎనిమిది రంగాలనూ వార్షికంగా వేర్వేరుగా చూస్తే... వృద్ధిలో... ఎరువులు: ఈ రంగం వృద్ధి రేటు భారీగా 18.1 శాతం పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ రంగంలో అసలు వృద్ధిలేకపోగా, 11.6 శాతం క్షీణత (మైనస్)లో ఉంది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు 3.9 శాతం నుంచి 10.8 శాతానికి ఎగసింది. రిఫైనరీ ప్రొడక్టులు: ఎరువుల రంగం తరహాలోనే ఈ విభాగం - 2.6 శాతం క్షీణత నుంచి స్వల్పంగా 0.5 శాతం వృద్ధిలోకి మళ్లింది. సహజ వాయువు: ఈ రంగం కూడా -5.8 శాతం క్షీణత నుంచి 0.9 శాతం వృద్ధి బాటకు మళ్లింది. బొగ్గు: వృద్ధి నమోదుచేసుకుంది. అయితే ఈ రేటు 7.6 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది. క్షీణతలో.. క్రూడ్: -1.1% నుంచి -0.1%కి మెరుగుపడింది. స్టీల్: 6.6% వృద్ధి నుంచి -2.5% క్షీణతకు మళ్లింది. సిమెంట్: 3.7% వృద్ధి నుంచి -1.5% క్షీణించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ.. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ ఈ గ్రూప్ వృద్ధి రేటు 2.3 శాతంగా ఉంది. 2014 ఇదే కాలంలో ఈ రేటు 5.1 శాతం. -
రామరాజు దిగుబడులకు రారాజు
♦ పన్నెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ♦ సేంద్రియ ఎరువుతో మామిడి తోటల పెంపకం ♦ అంతరపంటలుగా మినుము, అలసంద, పప్పుధాన్యాలు ♦ ఎనిమిదేళ్లుగా వ్యవసాయంలో అధిక దిగుబడులు గతంలో ఏదైనా మొక్కకు పాదుల్లో నీరు పోస్తే నీటిని పీల్చుకునేదికాదు. పల్లంలోకి నీరు జారిపోయేది. ప్రకృతి వ్యవసాయ విధానాలు మొదలుపెట్టినప్పటినుంచి మొక్కలకు ఎంత నీరు పెట్టినా, భారీ వర్షం కురిసినా మొత్తం నీటిని భూమి పీల్చుకుంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలపాటు ప్రకృతి వ్యవసాయవిధానాలను అనుసరించాను. మొక్కలు బాగా కాపు కాయడం, పురుగులు, తెగుళ్లను తట్టుకోవటం, కాయలు రుచికరంగా ఉండటం గమనించిన తరువాత ప్రకృతి వ్యవసాయ విధానాల మీద నమ్మకం కలిగింది. ఉన్నత చదవులు చదివి ఉద్యోగం చేసినా జీవితంలో సంతృప్తిలేదు కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన భైరవ రామరాజుకు. వ్యాపారం చేసి ఆర్థికంగా నష్టపోయాడు. జీవితంలో నిలదొక్కుకోలేకపోయానన్న అసంతృప్తి! వ్యాపారాన్ని వదిలి సొంతభూమిలో వ్యవసాయాన్ని చేపట్టాడు. కొన్నేళ్లపాటు ఆధునిక పద్ధతుల్లో రసాయనిక ఎరువుల సేద్యం చేశాడు. ఎరువుల అధిక వినియోగంతో భూమి సారాన్ని కోల్పోయి పంట దిగుబడి పడిపోయింది. దీంతో ఏంచేయాలో అర్థంకాని పరిస్థితులేర్పడ్డాయి రామరాజుకి. అందుకే రసాయనిక వ్యవసాయాన్ని వదిలిపెట్టి తనకు తోచిన పద్ధతుల్లో సేద్యాన్ని మొదలుపెట్టాడు. ప్రత్యామ్నాయ వ్యవసాయానికి సంబంధించిన అన్ని పుస్తకాలను అధ్యయనం చేశాడు. ఆ క్రమంలోనే జపాన్ ప్రకృతి వ్యవసాయ పితామహుడు మసనోబు ఫుకుఒకా ‘గడ్డిపరకతో విప్లవం’ పుస్తకం పరిచయమయ్యింది. తర్వాత పాలేకర్ ‘పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం’ పుస్తకాలు రామరాజు ఆలోచనా విధానాన్ని మార్చివేశాయి. వీటితో తన సాగుపద్ధతులకు మెరుగులద్దుకున్నాడు. ఇప్పుడు వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ తోటి అన్నదాతలకు ఆదర్శ రైతుగా నిలుస్తున్నాడు. తన సాగు అనుభవాలు స్వయంగా ఆయన మాట ల్లోనే... మాది కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి. మాది ఏడెకరాల వ్యవసాయం. నేను 1981లో డిగ్రీ పూర్తిచేశాను. కొంతకాలం ఉద్యోగం చేశాను. కానీ, అందులో సంతృప్తి లభించలేదు. 1986 లో మా సొంత భూమిలో వ్యవసాయం మొదలుపెట్టాను. వరి మాగాణి భూమిలోను, పాతకాలంలో వేసిన మా మామిడి తోటలోను పేడదిబ్బ ఎరువులను, రసాయనిక ఎరువులను వినియోగించేవాడిని. మాగాణి భూమి ఏడెకరాల్లో 1 1/2 ఎకరం మెరకగా ఉండే మాగాణి భూమిలో వరి నాటి ఆరుతడిగా ఇచ్చినప్పుడు బాగా దుబ్బు చేసి మంచి దిగుబడులు పొందాను. మిగిలిన 5 1/2 ఎకరాల మాగాణి కొంచెం పల్లంగా ఉండటం వల్ల ఆరుతడి పద్ధతిలో సాగు చేయటానికి ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దిగుబడులు కూడా అంతంతమాత్రంగానే వచ్చేవి. చెట్లపై పురుగుమందులు వాడకం వల్ల వాటి వాసనలతో చాలా ఇబ్బందిగా ఉండేది. పురుగుమందుల్ని స్ప్రే చేసిన వెంటనే జలుబు చేస్తూ ఉండేది. ఈ పరిస్థితుల్లో మాగాణి భూమిని వదిలి మా ముదురు మామిడి తోటల్లో ప్రయోగాలు మొదలుపెట్టాను. రసాయనిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఎన్నో పుస్తకాలు చదివాను. ఆ క్రమంలోనే 1994లో జపాన్ దేశ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు పుకుఓకా ‘గడ్డి పరకతో విప్లవం’ పుస్తకం చదివాను. ఆ అవగాహనతో ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించడం మొదలుపెట్టాను. అందులో భాగంగానే ముందుగా.. విశాలమైన మా ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్లు, ఆకు కూరలు, కూరగాయ మొక్కలకు, జామ, నిమ్మ మొదలగు చెట్లకు ఎండిన వేప ఆకులు, ఇతర పిచ్చి మొక్కల అవశేషాలతో పాదులను మల్చింగ్ చేశాను. దీంతోపాటు గోబర్ గ్యాస్ స్లర్రీని పాదుల్లో వేసి పరిశీలించటం మొదలుపెట్టాను. క్రమంగా నేలలో సేంద్రియ పదార్థం పెరిగి నేల గుల్ల బారింది. కొబ్బరి చెట్లు మంచి పరిమాణంతో గెలలు వేశాయి. అలాగే ఇతర మొక్కలు కూడా ఆరోగ్యంగా ఎదిగి మంచి దిగుబడులనిచ్చాయి. ఈ అనుభవాలతో 2003-04 సంవత్సరంలో ఖాళీగా ఉన్న మా ఎర్ర గరువు భూమిలో మామిడి మొక్కల్ని అధిక సాంద్ర పద్ధతిలో ( మొక్కకు మొక్కకు మధ్యలో 21 అడుగుల దూరం) ఎకరానికి 99 మొక్కల చొప్పున వివిధ పద్ధతులతో నాటాము. ఒక పద్ధతిలో 3్ఠ3్ఠ3 గుంతలు తీసి పూడ్చి వాటిలో మామిడి టెంకలు వేసి అవి మొలకెత్తి మొక్క 2 1/2 అడుగుల ఎత్తు పెరిగిన తరువాత ఆ టెంక మొక్కలకు మంచి కాపు కాసే తల్లి చెట్ల నుంచి సేకరించిన గ్రాఫ్టింగ్ కొమ్మలతో వెనీర్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో (ఇన్సీతూ) అంట్లు కట్టించాను. రెండో పద్ధతిలో టెంకలు నారుమడిలో పోసి వచ్చిన మొక్కలను ముందుగా గోతులు తీసి పూడ్చిన చోట వేసి అవి బ్రతికి 2 1/2 అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత వాటికి పై విధంగా గ్రాఫ్టింగ్ చేయించాను. మూడో పద్ధతిలో మొక్కలు చనిపోయిన చోట మా దగ్గర లేని మామిడి రకాల మొక్కల్ని నర్సరీల నుండి తెచ్చి నాటించాను. ఈ విధంగా మొత్తం 30 రకాల మామిడి మొక్కలను ఈ మూడు పద్ధతుల్లో నాటించాను. అంటు మొక్కలు కొద్దిగా పెరిగిన తరువాత మొదటి ఏడాది నుంచి ఉద్యానవనశాఖ అధికారుల సలహాలతో ఫ్రూనింగ్ చేయిస్తున్నాను. ప్రతి మామిడి మొక్క చుట్టూ పాదులలో పంటల అవశేషాలతో మల్చింగ్ చేశాను. మిగిలిన ఖాళీ భూమిలో అంతర పంటగా మినుము, వేరుశనగ, అలసంద, ఉలవ లాంటి పప్పు ధాన్యాల పంటలను పండించాను. మామిడి పాదుల్లో ఉలవ విత్తనాలు చల్లి వచ్చినమొక్కలను అలాగే వదలివేశాను. విత్తనాలు మామిడి చె ట్లకిందే రాలి మరుసటి ఏడాదికూడా మెలకెత్తాయి. ఉలవమొక్కలు మామిడి మొక్కలకు కావలసిన నత్రజనిని అందిస్తూ సజీవ ఆచ్ఛాదనగా ఉపయోగపడ్డాయి. మామిడి మొక్కలకు నాలుగేళ్ల వయస్సు వచ్చినప్పటినుంచి కొంత భాగంలో (సుమారు 1 ఎకరం) దున్నడం పాదులు చేయడం ఆపి వేశాను. పేడ దిబ్బ ఎరువులు కూడా వేయడం మానేశాను. రసాయనిక ఎరువులు పురుగు, తెగులు మందులు అసలు ఉపయోగించలేదు. పొలంలో పెరిగిన పిచ్చి మొక్కలను కత్తిరించి పాదుల్లో వేయడం మొదలుపెట్టాం. 2008 నుంచి మిగిలిన తోట మొత్తం పై విధంగా చేయటం మొదలుపెట్టాను. గత అనుభవాల మాదిరిగానే మామిడి మొక్కల్లో నేల గుల్లబారటం, సేంద్రియ పదార్థం పెరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరగటం మొదలైంది. పాలేకర్ వ్యవసాయ విధానంలో... ఇదే సమయంలో ఒక స్నేహితుడి ద్వారా 2007లో సుభాష్ పాలేకర్ గురించి విన్నాను. తిరుపతిలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాలేకర్ వ్యవసాయ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నాను. పాలేకర్ జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ విధానం నేను లోగడ అనుసరించిన విధానాల మాదిరిగా ఉండి, ఇంకా ఉత్తమంగా తోచింది. పాలేకర్ పుస్తకాలను చదివి పంటలు బాగా పండటానికి కారణాలను అర్థం చేసుకున్నాను. 2008 నుంచి శ్రీ సుభాష్ పాలేకర్ విధానంలో భాగంగా రెండు దేశవాళీ ఆవులను పెంచుతున్నాను. మొత్తం భూమిలో వాలుకు అడ్డంగా చెట్ల వరుసల మధ్య కందకాలు తీసి జీవామృతం, మల్చింగ్, వాప్స విధానాలను నేటి వరకు పాటిస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఏటా నేలలో ఎన్నో మార్పుల్ని గమనించాను. నేల గుల్లబారడం, వానపాముల విసర్జితాలతో నల్లగా రవ్వలాంటి సేంద్రియ పదార్థం ఏర్పడటం, నేలను కొద్దిగా తవ్వితే అనేక వానపాములు మన కంటికి కనపడుతున్నాయి. ఈ తోటలో చెట్ల వరుసల మధ్య కందకాలకు రెండు పక్కల అంతర పంటలుగా కొంత భాగంలో కూరగాయలు కూడా పండి ంచాను. రసాయనిక వ్యవసాయంలో కన్నా తక్కువ కాకుండా ఆరోగ్యమెన రుచికరమైన పంట దిగుబడులను పొందుతున్నాను. మామిడి మొక్కల ఎత్తు పెరగకుండా ప్రతి ఏటా ప్రూనింగ్ చేయడం వల్ల పెనుతుఫానుల సమయంలో చె ట్లు దెబ్బతినటం గానీ, కాయలు రాలడం కానీ జరుగలేదు. కాయకోత కూడా తేలిగ్గా ఉంది. జీవామృతాన్ని చెట్ల మీద ఉపయోగించడం వ ల్ల ప్రతి సంవత్సరం పూత సమయంలో కొన్ని రకాల ఈగలు, తేనెటీగలు పెద్ద తుట్టెలు పెట్టటం వల్ల పరపరాగ సంపర్కం బాగా జరిగి పంటల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. అనేక జాతుల పక్షులు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని నష్టం కలిగించే పురుగులను ఆహారంగా తీసుకుంటున్నాయి. ఫలితంగా పురుగుల వల్ల కలిగే పంటనష్టం తగ్గిపోయింది. పక్షుల రెట్ట ఎరువుగా ఉపయోగపడుతుంది. తోటలో నీటి సంరక్షణ కోసం 100 ్ఠ 30, 30 ్ఠ 30 అడుగుల వైశాల్యంలో ఆరడుగుల లోతులో రెండు ఇంకుడు గుంతలు తవ్వటం వల్ల భూమిలోకి వర్షం నీరు బాగా ఇంకిపోతుంది. ఫలితంగా చుట్టు పక్కల ఉన్న తోటలు పచ్చదనం పెంచుకోవటం, పనిచేయకుండా ఉన్న పక్క వారి బోరుబావి కూడా తిరిగి పనిచేస్తోంది. చెట్ల కింద మల్చింగ్ చేయడం వల్ల నేల గుల్లబారి గాలికి రాలిన మామిడి కాయలు దెబ్బతినే నిష్పత్తి కూడా బాగా తగ్గిపోయింది. వర్షపు నీరు నేలలో బాగా ఇంకి మొక్కలకు బెట్ట కాలంలో ఉపయోగపడుతున్నవి. ఈ తోటలో ఫలాలు మామూలు వాటికన్నా ఎక్కువ కాలం నిలువ ఉండి రుచిగా ఉండటం వల్ల తేలిగ్గా వినియోగదారులకు అమ్ముకోగలుగుతున్నాం. కాబట్టి రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానాలను నిస్సందేహంగా వారి భూముల్లో అమలు చేయడం వల్ల వారి కుటుంబానికి మిగిలిన మానవాళికి సంపూర్ణ పోషకాలు ఉండే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందిస్తూ మేలు చేసిన వారవుతారంటున్నారు రామరాజు (94401 06567) -
పండ్లతొక్కలే పరమౌషధం
రసాయనిక ఎరువులకు బదులు పండ్ల తొక్కల పొడిని, సారాన్ని సహజ ఎరువుగా పంటకు అందించి భూసారం, దిగుబడులను పెంచటంలో పరిశోధకులు విజయం సాధించారు. తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్తలు మెర్సి, ఎస్, ముబ్సిరాబాను, ఎస్., జెన్నిఫర్, ఐ. ల బృందం మెంతులు, కూరగాయల పంటల కు తక్కువ ఖర్చుతో పోషకాలను అందించి మంచి దిగుబడి సాధించింది. ఈ విధానంలో పెంచిన మొక్కలు రసాయనిక ఎరువులతో పెంచినవాటికన్నా మంచి పెరుగుదలతో, అధిక దిగుబడులనివ్వటం విశేషం. తమిళనాడులోని రామంతపూర్ జిల్లా, కిలకరాయ్ గ్రామంలో ఈ ప్రయోగం జరిగింది. అరటి, దానిమ్మ, కమలా, తీపి నిమ్మ పండ్ల తొక్కల ను సేకరించి వాటి నుంచి పౌడర్‌ను, సారాన్ని తయారుచేశారు. వాటిని నీటితో వివిధ నిష్పత్తులలో కలిపి మిశ్రమాన్ని తయారు చేశారు. 1 గ్రాము పొడిని 100 మి.లీ. నీటికి కలిపి ఎఫ్-1 గా, 3 గ్రాములు పొడిని 300 మి.లీ. నీటికి కలిపి ఎఫ్-2 గా, 6 గ్రాముల పొడిని 600 మి.లీ. నీటికి కలిపి ఎఫ్ -3 అనే మూడు మిశ్రమాలను తయారుచేశారు. వీటిని మూడు రోజులు నిల్వ ఉంచారు. మెంతుల విత్తనాలను ఒక్కో కుండలో వంద చొప్పున ఉంచి శుభ్రమైన నీటితో కలిపిన ఈ మిశ్రమాన్ని రోజూ అందించారు. 45 రోజుల తరువాత ఫలితాలను పరిశీలించారు. భూసారం, పోషకాల పెంపు సుసాధ్యం సేకరించిన మట్టిని పోర్ ప్లేట్ టెక్నాలజీ ద్వారా 24 గంటల పాటు ఇంక్యుబేటర్‌లో ఉంచి అనంతరం సూక్ష్మజీవులను లెక్కించారు. పొటాష్, అయాన్, జింక్ ,విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్, కొన్ని ఇతర మూలకాల సంఖ్య ఈ మట్టిలో బాగా పెరిగింది. నిమ్మ తొక్కలు రోగకారక, హాని చేసే శత్రుక్రిములను నిరోధిస్తాయని తేలింది. సూక్ష్మ పోషకాలను వినియోగించుకోవటంలో ఈపొడి మొక్కలకు సహాయ కారిగా పనిచేస్తుంది. ఈ మూడు సమ్మేళనాల వినియోగంతో మొక్కల పెరుగుదల, తద్వారా అధిక దిగుబడి సాధ్యమేనని ఫలితాలు నిరూపించాయి. రసాయన ఎరువులతో పెంచిన మొక్కలకు భిన్నంగా 15 రోజుల్లో క ణుపుల దశలోనే వీటిలో పెరుగుదలకు సంబంధించిన హార్మోన్లను గుర్తించారు. మొక్కలలో కొత్త కొమ్మలు, ఆకుల సంఖ్య పెరిగింది. వేళ్ల వద్ద మట్టిని పరిశీలించగా నత్రజని, ఫాస్పరస్, పొటాషియంలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఈ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో వరి, ఆవాలు, కాయధాన్యాల పంటలపై, టిష్యూకల్చర్లోనూ ప్రయోగాలకు ఈ బృందం సిద్ధమవుతోంది. రసాయనిక ఎరువులకు బదులు చౌకైన, విషపూరితం కాని పండ్ల తొక్కల ఎరువులను వాడటం ద్వారా భూమి సారం కోల్పోవటాన్ని నిరోధించవచ్చు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల నీటి కాలుష్యం, భూమి నిస్సార మవుతున్న ఈ తరుణంలో ఇలాంటి పరిశోధనల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ తరహా విధానాల దిశగా శాస్త్రీయ పద్ధతిలో మంచి ఫలితాలు రాబట్టిన మొదటి ప్రయోగం ఇదేకావటం విశేషం. భూసారం, దిగుబడులు పెంచే ఈ విధానం అందుబాటులోకి వస్తే రైతులకు మేలు జరుగుతుందనటంలో సందేహం లేదు. -
మరిపెడలో విజిలెన్స్ దాడులు
మరిపెడ (వరంగల్) : వరంగల్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో అనుమతులు లేకుండా బయో పెస్టిసైడ్స్ అమ్ముతున్న రెండు షాపులను సీజ్ చేశారు. సుమారు రూ. రెండున్నర లక్షల విలువ గల పురుగుల మందులు స్వాధీనం చేసుకున్నారు. -
నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్య
వింజమూరు(నెల్లూరు): పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువకుడు నడిరోడ్డుపై మృతిచెందాడు. రోడ్డు మీద పడి కొట్టకుంటున్నా స్థానికులు ఎవరూ స్పందించకపోవడంతో.. అక్కడే మృతిచెందాడు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు బంగ్లాసెంటర్లో బుధవారం జరిగింది. వివరాలు.. కొండాపురం మండలం గొట్టికొండాల గ్రామానికి చెందిన మౌలాలి(28) తాపి మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు బంగ్లా సెంటర్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
హెచ్ఓడీ తిట్టాడని... ఆత్మహత్యాయత్నం
గజ్వేల్(మెదక్): ఇంటర్నల్ పరీక్షల్లో భాగంగా రికార్డులు సమర్పించకపోవడంతో.. ఇంజనీరింగ్ కళాశాల హెచ్ఓడీ, బీటెక్ విద్యార్థిని మందలించాడు. హెచ్ఓడీ తనను అవమానించాడంటూ మనస్తాపానికి గురైన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లోని సయ్యద్ హషీమ్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం చోటుచేసుకుంది. కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌రెడ్డి(19) స్థానిక కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్ పరీక్షల్లో భాగంగా అతడు రికార్డులు సమర్పించలేదు. ఈ క్రమంలో రికార్డులు ఎందుకు రాయలేదంటూ.. హెచ్ఓడీ ప్రవీణ్‌రెడ్డిని గట్టిగా మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అనంతపురం(కల్యాణదుర్గం): ఓ మాజీ ఎమ్మెల్యే వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కల్యాణదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట చోటుచేసుకుంది. పురుగుల మందు తెచ్చుకుని రాజు(30) అనే వ్యక్తి పోలీసుల ముందే తాగాడు. హుటాహుటిన కల్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వాస్తవాలు వెల్లండించడానికి బాధితుడు భయపడుతున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగుల మందు తాగి యువరైతు ఆత్మహత్య
రంగారెడ్డి(చేవెళ్ల): చేవెళ్ల మండలం మడికట్టు గ్రామంలో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బల్వంత్ రెడ్డి(29) అనే రైతు పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆయన కోసం వెతకటం ప్రారంభించారు. ఆదివారం పొలంలో విగతజీవుడై పడి ఉండటం గమనించిన పక్కపొలం వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పక్కనే పురుగుల మందు డబ్బా ఉంది. పంట ఎండిపోవటం, అప్పులు తీర్చే మార్గం తోచకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లీకొడుకుల అనుమానాస్పద మృతి
ఇంద్రకీలాద్రి(విజయవాడ): తల్లీకొడుకులు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ సంఘటన కొత్తపేట పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో సోమవారం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన మండా ప్రకాశ్(24), తల్లి గోవిందమ్మ(48)లు ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో.. స్థానికులు వెళ్లి చూడగా.. ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు. పురుగుల మందు తాగి మృతిచెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ప్రకాశ్ భార్యకు నొప్పులు రావడంతో రెండు రోజుల కిందటే ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం రాత్రి తల్లితో పాటు ఆస్పత్రికి వెళ్లి భార్యను చూసి వచ్చిన అనంతరం ఇద్దరు విగత జీవులుగా మారారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
విజయనగరం: తోటపల్లి సీఎం సభలో దుర్గారావు అనే వ్యక్తి గురువారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దుర్గరావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఎం. రాజాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ
కర్నూలు (అర్బన్) : రైతులకు పెట్టుబడి తగ్గించేందుకు మహిళా సంఘాల ద్వారా ఎరువులను పంపిణీ చేయనున్నామని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పి. విజయకుమార్ చెప్పారు. మంగళవారం ఆయన కర్నూలులో స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఒడిశాలో భారీ వర్షాలతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జలాశయాలు కళకళలాడుతున్నాయన్నారు. కోస్తాంధ్ర, గోదావరి బెల్ట్‌లో కూడా పంటలు బాగానే ఉన్నాయని చెప్పారు. నెల్లూరు, ప్రకాశంతోపాటు రాయలసీమ నాలుగు జిల్లాల్లో వర్షపాతం తక్కువగా ఉందని, 43 లక్షల హెక్టార్ల సాధారణ సాగుకు గాను 13 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనం వేశారని తెలిపారు. ఆగష్టు 15వ తేదీ వరకు ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోతే రైతాంగం ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాల్సి ఉందన్నారు. కర్నూలు జిల్లాలోని తంగడంచె భూముల్లో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు కానుందన్నారు. కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉందని చెప్పారు. -
సేంద్రియ సాగుకు ప్రోత్సాహం
రైతుల కోసం పరంపరగత్ కృషి వికాస్ యోజన అమలు మూడేళ్లలో రూ.5కోట్ల 83 లక్షలను ఖర్చు చేయనున్న ప్రభుత్వం 1950 ఎకరాలలో సాగు చేయించాలని నిర్ణయం వరి, పప్పు ధాన్యాల పంటలకే అమలు నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో సేంద్రియ వ్యవసాయ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరంపరగత్ కృషి వికాస్ యోజన(పీకేవీవై) ద్వారా రైతులను ప్రోత్సహించాలని భావి స్తోంది. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులను సాధించడమే లక్ష్యంగా పథకం అమలు చేయనున్నారు. కేవలం పంచగవ్వ, బీజామృతం, జీవామృతం, బయోపెస్టిసైడ్స్, వేపపిండి, వేపనూనె, వర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువుల ద్వారానే వరి, పప్పుధాన్యాలను పండించాలని జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికలను రూపొందించింది. సేంద్రియ ఎ రువుల ద్వారా పండించి అహారధాన్యాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండడంతోపాటు ఆరోగ్యానికి ఎంతోమేలు చేకూరుతుందడడంతో రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పీకేవీవై పథకం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. 39 క్లస్టర్లుగా విభజన.. జిల్లాలోని 59 మండలాలను కలిపి 39 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్లో 50 మంది రైతులతో 50 ఎకరాలలో(ఒక్కో రైతు ఎకరం) సేంద్రియ వ్యవసాయాన్ని చేయించాలని నిర్ణయించింది. 39 క్లస్టర్లలో 30క్లస్టర్లలో జనరల్ రైతులు, 6 క్లస్టర్లలో ఎస్సీ రైతులు, 3 క్లస్టర్లలో ఎస్టీ రైతుల చేత సేంద్రీయ వ్యవసాయాన్ని చేయించడానికి రంగం సిద్దం చేశారు. ఈ పథకం ద్వారా 1950 మంది రైతులచేత 1950 ఎకరాలలో వరి, పప్పుధాన్యాలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించనున్నారు. మూడు సంవత్సరాలపాటు అమలు చేసే ఈ పథకానికి రూ. 5 కోట్ల 83 లక్షల 5 వేలను ఖర్చుచేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే లబ్దిదారుల ఎంపికను పూర్తి చేసి పంపించాలని జిల్లా వ్యవసాయ శాఖ.. మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. క్లస్టర్లలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించి ఆహార ధాన్యాలను ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేయడానికి అవసరమైన చర్యలను కూడా చేపట్టనున్నారు. సంప్రదాయ వ్యవసాయంవైపు పోవాలి : బి.నర్సింహారావు, జేడీఏ రైతులు సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం వైపు పయనించాల్సిన అవసరం ఉంది. కలుషితమవుతున్న వాతావారణం, తగ్గుతున్న భూసారాన్ని పెంచుకోవడం కోసం రసాయనిక మందులు, ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. భూసారాన్ని పరిరక్షించుకోవడంతో పాటు తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంతమైన ఆహార ధాన్యాలను పండించుకోవడానికి రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి. పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. -
ఎరువు.. బరువు!
- గోడౌన్లలో 24 వేల మెట్రిక్ టన్నులు నిల్వ - వర్షాభావంతో భారీగా తగ్గిన వినియోగం - ఆందోళలో వ్యాపారులు, రైతులు కడప అగ్రికల్చర్ : ఎరువుల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చోవడం, సరిగా పంపిణీ కాలేదని రైతుల ధర్నాలు.. రాస్తారోకోలు, వ్యవసాయాధికారుల సంజాయిషీలు.. ప్రతి ఏడాది ఖరీఫ్‌లో కనిపించే దృశ్యాలు. ఈ ఏడాది వైఎస్ఆర్ జిల్లాలో ఆ దృశ్యాలు కనిపించడం లేదు. రైతుల నుంచి ఎరువుల కొరతనే మాటే వినపడటం లేదు. వరుణుడు ముఖం చాటేయడంతో ఎరువులు భారంగా మారిపోయాయి. వ్యాపారం లేకపోవడంతో అటు మార్క్‌ఫెడ్, ఇటు ప్రయివేటు డీలర్లు ఎరువులు కొనుగోలు చేయలేమని చేతులెత్తేశారు. జిల్లాలో వర్షాలు లేకపోవడంతో పంటలు ఆశించిన స్థాయిలో సాగు కాలేదు. దీంతో ఎక్కడి ఎరువులు అక్కడే నిలిచిపోయాయి. కంపెనీల నుంచి దుకాణాల వారు ముందుగా కొనుగోలు చేసిన ఎరువులను ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రైతులు కూడా ఖరీఫ్ పంటల సాగు కోసం ముందుగా కొనుగోలు చేసి విత్తన సమయంలో వాడటానికి తెచ్చి పెట్టుకున్న ఎరువులు కూడా ఇళ్లలో నిల్వ ఉండిపోయాయి. ఎరువుల దుకాణాల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో మార్కెఫెడ్, ఇతర గోడౌన్లలో కూడా ఎరువుల నిల్వలు మూలుగుతున్నాయి. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ మొదలైందంటే అటు వ్యవసాయాధికారులు, ఇటు దుకాణదారుల్లో వణుకుపుట్టేది. కాంప్లెక్స్ ఎరువులతోపాటు యూరియా ఇతర ఎరువులు దొరకని పరిస్థితి నెలకొనేది. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి బలమైన వ ర్షాలు కురవక పోవడంతో ఎరువులను అడిగే వారే కరువయ్యారని వ్యాపారులు అంటున్నారు. ప్రధాన పంటలైన వరి, వేరుశనగ, పత్తి పంటల సాగు గణనీయంగా తగ్గింది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1.60 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా కేవలం 25,743 హెక్టార్లలోనే సాగయ్యాయి. 75 శాతం తగ్గిన ఎరువుల విక్రయాలు సాధారణంగా ఈ పాటికి పంటల సాగు బాగా ఊపందుకుని ఎరువుల వినియోగం పెరిగేది. మరీ జూలై నెలలో ఎరువుల కొరత పట్టిపీడించేది. జూన్ ప్రారంభంలో విత్తనాలు వేసిన అనంతరం కలుపు తీసి పై పాటుగా ఎరువులను, రెండో విడత పంటల సాగును రైతులు చేపడితే ఎరువులు అందించడం భారంగా ఉండేది. ఈ సమయంలో కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియా, పొటాష్‌ను ఎక్కువగా వినియోగించేవారు. మొత్తంగా ఈ సారి ఎరువుల వినియోగం దాదాపు 75 శాతం తగ్గిందని వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. తక్కువ పదును వల్ల విత్తిన విత్తనాలు మొలకెత్తక పోవడం, మొలకెత్తినవి ఎండిపోతుండటం వల్ల ఎరువుల గురించి రైతులు ఆలోచించడం లేదు. మార్క్‌ఫెడ్‌లో భారీగా నిల్వలు ఎరువులు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం, అవసరం మేరకు ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీ)కు సరఫరా చేయడం మార్క్‌ఫెడ్ బాధ్యత. అయితే ఇప్పటికే కొనుగోలు చేసి ఉంచిన నిల్వలు గోడౌన్లలో పేరుకుపోయాయి. అయినా కూడా ఇండెంట్ మేరకు ఎరువుల కంపెనీలు అమాంతం పంపుతూనే ఉన్నాయి. గోడౌన్లు నిండిపోతుండడంతో ఎక్కడ పెట్టాలో దిక్కుతోచడం లేదని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజరు వెంకటసుబ్బారెడ్డి తలపట్టుకుంటున్నారు. ఇప్పటికీ జిల్లాలోని 12 ప్రాథమిక సహకార పరపతి సంఘాలు రూ.19 లక్షల బకాయిలున్నాయని జీఎం తెలిపారు. అటు పాతబకాయిలు రాక, ఇటు ఉన్న ఎరువులు అమ్ముడుపోక దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎరువులు అమ్ముడుపోవడం కష్టమని సంస్థ రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. -
అమ్మో.. వడ్డీ బకారుసులు..!
‘తీసుకున్న అప్పు రూ. 12లక్షలు.. చెల్లించిన వడ్డీ రూ. 18లక్షలు.. అసలు తీరలేదు సరికదా వడ్డీ కూడా పూర్తికాలేదు.. వడ్డీ బకాసురుడి వేధింపులు అధికం కావడంతో బాధిత కుటుంబం జిల్లా ఎస్పీని ఆశ్రయించాల్సి వచ్చింది’. - ఎమ్మిగనూరు అప్పు పెనుముప్పుగా మారి ప్రాణాలనే హరించే వరకు వ స్తోంది.. ఏకంగా కుటుంబాలనే బలికొంటోంది. అవసరానికి అప్పే గాని దానినే వ్యాపారంగా మలుచుకొని ఎమ్మిగనూరులో వడ్డీ బకాసురులు చెలరేగిపోతున్నారు. రోజు వడ్డీ, వారం వడ్డీ, పక్షం, నెల వడ్డీల పేరుతో అనధికారిక ఫైనాన్స్ దుకాణాలు తెరిచి రెండు చేతులా సంపాదిస్తున్నారు. రూ. 100కి రూ. 9 మొదలు రూ. 30 వరకు వడ్డీ చొప్పున వసూలు చేస్తూ చిరుద్యోగులు, వ్యాపారుల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. ప్రశాంతతకు, అభివృద్ధికి ఆనవాళ్లుగా మారిన ఎమ్మిగనూరులో మూడేళ్లుగా ఈ వ్యాపారం జోర ందుకుంది. గీతానగర్‌కు చెందిన ఓ వ్యాపారి వాల్మీకి విగ్రహం వద్ద ఉన్న ఓ ఎరువుల దుకాణం అధినేత నుంచి రూ. 12లక్షల అప్పు తీసుకున్నాడు. దినసరి వడ్డీ చెల్లింపు కింద ఇప్పటి వరకు రూ. 18లక్షలు చెల్లించాడు. అసలు అలాగే ఉంది. వడ్డీ కూడా తీరలేదు. ఇదేమంటే రోజు వారి వడ్డీయే నూటికి రూ. 9 అని తీరిగ్గా చెబుతున్నారు. అన్న చేసిన అప్పు తీరలేదని తమ్ముడి చేత కూడా ప్రో నోటు రాయించుకోవడం మరీ విడ్డూరం. వడ్డీ పేరుతో అటు అన్నను ఇటు తమ్ముడిని నిత్యం వేధిస్తుండడంతో చివరకు బాధితుడు భార్యాపిల్లలతో సహా తమ మృతికి సాయిరాం ట్రేడర్స్‌కు చెందిన వ్యక్తే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి అఘాయిత్యానికి ప్రయత్నించగా అయినవారు వారించడంతో ప్రాణాలు నిలిచాయి. అధికార పార్టీ నుంచి వత్తాసు.. నాలుగు రోజుల క్రితం బాధితుడు ఎస్పీ వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. అయితే ఎస్పీ ఆదేశాలు ఎమ్మిగనూరు పోలీసులకు చేరకముందే అధికార పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడి ఫోన్ కాల్ మోగింది. ఆ వడ్డీ వ్యాపారి ‘మాకులపోడే’నని, చూసీ చూడనట్లు వెళ్లం డంటూ హుకూం. ఇక పోలీసులు చేసేదేమిలేక దర్యాప్తు కొనసాగింపు అంటూ కేసు నమోదు చేయకుండానే అలా ముందుకెళుతున్నారు. ఒకరా.. ఇద్దరా.. నాగమణి బాధితులు, పంచలోహ బుద్ధ విగ్రహ వ్యాపారులు, జీరోలో సెల్ వ్యాపారం చేసే వ్యక్తులు, ఎరువుల వ్యాపారులు.. ఇలా చాలా మంది ఆ వడ్డీ బకాసురుడి నుంచి సుమారు రూ. 1.5 కోట్ల వరకు అప్పు తీసుకుని వడ్డీ చెల్లింపులకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ప్రతి రోజు వడ్డీ రూపంలోనే ఆ వ్యాపారికి రూ. 4.5లక్షలు వసూలవుతుందంటే పరిస్థితి అర్థమవుతుంది. ఇతడితో పాటు మరో ముగ్గురు కీలక వ్యక్తులున్నారు. ఆటో - మినీ లారీ యూనియన్ ప్రతినిధిగా చెప్పుకుంటూ తనకు తానే సోకాల్డ్ రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి ఇంటి వద్దే అధిక వడ్డీలతో దర్బార్ నడుపుతున్నాడు. మరో వ్యక్తి స్థానిక వీవర్స్‌కాలనీ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఉండగా, ఇంకో వ్యక్తి ఎమ్మిగనూరుకు చెందిన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్‌కు దందాలు చేసిన చోటా వ్యాపారి. వీరితో పాటు పట్టణంలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై జిల్లా పోలీసులు, నిఘా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలిసింది. అధిక వడ్డీలతో అఘాయిత్యాలు.. గత ఏడాది ఓ ఎరువుల వ్యాపారి, ఎస్ఎంటీ కాలనీకి చెందిన పైపుల వ్యాపారి, ఓ పాల వ్యాపారి, ఓ మాంసపు వ్యాపారి అధిక వడ్డీలకు బలవన్మరణం పొందినవారే. రామచంద్రా ఎంపోరియంకు చెందిన రవిప్రసాద్ రూ. 5.6 కోట్లు, ఆయిల్ డిగర్ వ్యాపారి అతావుల్లా రూ. 2.8 కోట్లకు ఇప్పటికే ఐపీ దాఖలు చేశారు. మరో నలుగురు వ్యాపారులు పరారిలో ఉండి ఐపీ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి పట్టణ ఎస్ఐ శంకరయ్యను వివరణ కోరగా గీతానగర్ వాసి రాజు ఎస్పీని ఆశ్రయించి సాయిరాం ట్రేడర్స్ ప్రసాద్‌పై ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేయలేదని, విచారిస్తున్నామని వివరించారు. -
డీసీఎంఎస్ దీనావస్థ
రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న సహకార సంస్థ అది. బ్లాక్‌మార్కెట్ భూతం నుంచి రక్షించేందుకు రూపొందించిన వ్యవస్థ అది. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు వంటివి సకాలంలో అందించి ఆ రంగాన్ని ఎంతగానో ఆదుకుంటోంది. ఇప్పుడు ఆ సంస్థను నిర్లక్ష్యం రోగం కమ్ముకుంది. కోట్లాదిరూపాయల విలువైన ఆస్తులు నిరర్థకంగా మారుతున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలోని రైతాంగాన్ని బ్లాక్ మార్కెట్ భూతం నుంచి రక్షించేందుకు ఏర్పాటైన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లి.(డీసీఎంఎస్) నిర్వీర్యమైపోతోంది. దాళ్వా, సార్వా సీజన్లలో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా చేసే డీసీఎంఎస్ పూర్వవైభవం కోల్పోతోంది. కోట్లాది ఆస్తులున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వాటిని కాపాడుకోలేని దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కేవలం డీసీఎంఎస్‌ల ద్వారా మాత్రమే సరఫరా అయి వాటి ద్వారా వచ్చే కమీషన్ జీతభత్యాలకు ఉపయోపడేవిధంగా వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఐసీడీఎస్, సంక్షేమ హాస్టళ్లు, మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, స్టాంపుల విభాగం, పాఠశాలలు, ఉపాధిహామీ, ఎన్నికల సామగ్రి పంపిణీ తదితర వాటివల్ల భారీగా సొమ్ము సంపాదించిన డీసీఎంఎస్ ఇప్పుడు కేవలం రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు అక్కడక్కడ నిత్యావసర వస్తు విక్రయాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఫలితంగా సిబ్బంది జీతాలకు కూడా ఇబ్బంది పడాల్సివస్తోంది. సంస్థకు నిరుపయోగంగా ఉన్న ఆస్తుల్ని విక్రయించి వచ్చే సొమ్ముతో షాపింగ్ కాంప్లెక్సులు, మిల్లులు, కొత్త భవనాల నిర్మాణం చేస్తే దండిగా సొమ్ము వస్తుందనేది ప్రభుత్వానికి తెలియనిది కాదు. ఖర్చు రూ. 2లక్షలు, ఆదాయం రూ. 58వేలు డీసీఎంఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలతో పాటు నిర్వహణ ఖర్చులకు నెలకు రూ. 2లక్షలు అవసరం. మార్కెటింగ్ ద్వారా కేవలం రూ. 58వేలే వస్తుండడంతో ప్రత్యామ్నాయాలపై ఆధారపడాల్సివస్తోంది. డీసీఎంఎస్‌కు జిల్లా వ్యాప్తంగా అరసవల్లిలో ఏడు గోదాంలు, కత్తెరవీధిలో 2, ఆమదాలవలసలో 5, పొందూరులో 4, రణస్థలంలో 2, నరసన్నపేటలో 5, పాలకొండలో 3, టెక్కలిలో 4, మెళియాపుట్టి(చాపర)లో 2, వీరఘట్టంలో 3, పాతపట్నం సహా చాలాచోట్ల ఖాళీ స్థలాలున్నాయి. వీటిలో చాలాచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వీటిని సరిచేయాలంటేనే తడిసిమోపెడు ఖర్చు. అదే విధంగా ఇప్పుడున్న సుమారు రూ. 100కోట్లకు పైగా ఉన్న ఆస్తుల్లో రూ. 15కోట్ల వరకూ విక్రయించే అవకాశం ఉంది. గతంలో జనపనారను ముడిసరుకుగా చేసేందుకు యంత్రాలు కొనుగోలు చేశారు. ఇప్పుడవి తుప్పుపట్టిపోయాయి. రూ.10లక్షల విలువ చేసే సామగ్రిని విక్రయించేందుకూ అనుమతి రావడం లేదు. వచ్చే సొమ్ముతో నూతన భవన నిర్మాణాలు, ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్ నిర్మాణం చేయిస్తే బావుంటుందని సంస్థ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా పౌరసరఫరాలకు ఇచ్చే గోదాముల అద్దె చదరపు అడుగుకు రూపాయి ఇరవైపైసలే ఇస్తుంటే అదే సంస్థ ప్రైవేట్ గోదాములకు రూ.3 చెల్లిస్తోంది. జిల్లా యంత్రాంగం స్పందిస్తే డీసీఎంఎస్‌కు ఆదాయం పెరుగుతుంది. నాబార్డు సహా ఇతర ఆర్థిక సంస్థలు తమకు రుణ రూపంలో సొమ్ము ఇస్తే చాలా చోట్ల భవనాల్ని కాపాడుకుంటామని, వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించేస్తామని సభ్యులు చెబుతున్నారు. పాలకొండ, చాపర, హిరమండలం, వీరఘట్టం ప్రాంతాల్లో ఉన్న స్థలాల్లో కల్యాణమండపాలు కట్టిస్తే భారీ డిమాండ్ ఉంటుందంటున్నారు. పోనీ ఖాళీ స్థలాల్ని లీజుకివ్వాలంటే రాజకీయ ఒత్తిళ్లు సహా న్యాయపరమైన ఇబ్బందులుంటాయని భయపడుతున్నారు. తమకున్న 11పాయింట్లలో ఏపీసీడ్స్, మార్క్ ఫెడ్ ద్వారా ఎరువులు, విత్తనాలు సేకరించి వాటిని రైతులకు సరఫరా చేయడం ద్వారా వచ్చే కమీషన్‌తోనే కాలం వెళ్లదీయాల్సివస్తోదంటున్నారు. సహకారం లేకపోతే మనుగడ కష్టమే ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే డీసీఎంఎస్ మనుగడ కష్టమే. నాణ్యమైన సరుకులందించాలన్నా, సంస్థ ఆస్తులు పెరగాలన్నా నేతల ముందుచూపు కావాలి. కోట్లాది ఆదాయం నుంచి లక్షలకు పడిపోయింది. రాష్ట్రంలోనే ఆస్తులెక్కువున్న ఇక్కడి డీసీఎంఎస్‌ను కాపాడుకునేందుకు, నిర్వహణ వ్యయం కోసం ఆందోళన చెందాల్సివస్తోంది. నాబార్డయినా ఆదుకుంటే ఆర్థిక పురోగతి సాధిస్తాం. - గొండు కృష్ణమూర్తి, చైర్మన్, డీసీఎంఎస్, శ్రీకాకుళం -
‘ఓటుకు కోట్లు’తో పాలన పడక
-
‘ఓటుకు కోట్లు’తో పాలన పడక
కేసు నుంచి బయటపడటంపైనే సర్కారు దృష్టి ♦ పక్షం రోజులుగా సమయమంతా దానికే వెచ్చిస్తున్న సీఎం, మంత్రులు ♦ కేబినెట్ భేటీలు సైతం తూతూ మంత్రం ♦ రాష్ట్రంలో సమస్యలను పట్టించుకున్న నాథుడే లేడు ♦ ఎరువులు, విత్తనాల కోసం రైతన్నల ఆందోళన ♦ బడులు ప్రారంభమైనా అందని పాఠ్యపుస్తకాలు ♦ నిత్యావసరాల ధరలు పైపైకి.. సాక్షి, హైదరాబాద్: వరుస విపత్తుల తర్వాత తొలకరి వర్షాలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు విత్తనాలు, ఎరువుల కొరతతో సతమతమవుతున్నారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా.. రుణాలందక అష్టకష్టాలు పడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ పుస్తకాలు, యూనిఫామ్‌లు అందకపోవడంతో విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే పూర్తికావాల్సిన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. మరోవైపు కూరగాయలు, పప్పు దినుసుల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చకచకా నిర్ణయాలు తీసుకుని సమస్యల పరిష్కారం దిశగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సిన పాలకులు పక్షం రోజులుగా పాలనను గాలికొదిలేశారు. గత నెల 31వ తేదీన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం బయటపడింది మొదలు రాష్ట్రంలో ఈ పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్నుంచి బయటపడే మార్గాలపైనే సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చల్లో మునిగితేలుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ఒకటీ అరా సమీక్షలు నిర్వహించినా తూతూమంత్రంగానే సాగుతున్నాయి. చివరకు కేబినెట్ సమావేశాల్లోనూ ఈ కేసుల వ్యవహారంపైనే చర్చోపచర్చలు. ఈ నెల 9 తర్వాత తాజాగా బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ‘ఓటుకు కోట్లు’ కేసుపైనే చర్చ తప్ప.. తక్షణం పరిష్కరించాల్సిన ప్రజా సమస్యలపై దృష్టి సారించలేదు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవాల్సిన మంత్రులంతా హైదరాబాద్‌లోనే మకాం వేసి సీఎం చుట్టూ తిరుగుతున్నారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ రైతులు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో వేరుశనగ విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కారు. మొన్నటి వర్షాలతో దుక్కి చేసిన రైతులు వరి విత్తనాలు, ఎరువుల కోసం చాలా అవస్థలు పడుతున్నారు. విశాఖపట్నం జిల్లాకు ఖరీఫ్‌లో 72 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం కాగా వ్యవసాయ శాఖ వద్ద కేవలం 6వేల క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. జిల్లాలో రూ.1,200 కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.5 కోట్లు కూడా ఇవ్వలేదు. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.8,000 కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించాలని జిల్లా అధికారులు రుణ ప్రణాళిక రూపొందించినా ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పంట రుణం ఇవ్వకపోవటం గమనార్హం. సీజన్‌కు ముందే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం నిర్వహించి రుణ ప్రణాళిక నిర్ణయించి లక్ష్యం మేరకు అప్పులిచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన సర్కారు అసలు సమావేశం ఎప్పుడో కూడా నిర్ణయించలేదు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీ అంశాన్ని పూర్తిగా మర్చిపోయింది. గత పక్షం రోజుల్లో అన్ని రకాల పప్పుల ధరలు భారీగా పెరిగాయి. కూరగాయల ధరలైతే ఏకంగా రెట్టింపయ్యాయి. నూనెల ధరలు సలసలా కాగుతున్నాయి. మొన్నటివరకు రూ. 95 ఉన్న కందిపప్పు రూ. 120కి పెరిగింది. పచ్చిమిర్చి కిలో రూ.60 పలుకుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు గోదావరి పుష్కరాల సమయం దగ్గరపడుతున్నా ఉభయగోదావరి జిల్లాల్లో కీలకమైన పనులు అసంపూర్తిగానే మిగిలాయి. స్తంభించిన పోలీసింగ్.. రాష్ట్రంలో పోలీసు పాలన కూడా స్తంభించింది. ఓటుకు కోట్లు వ్యవహారంలో చట్ట ప్రకారం నడుచుకోవలసిన పోలీసులు.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సేవల్లో మునిగి తేలుతున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులంతా గత పక్షం రోజులుగా ఈ కేసు వ్యవహారంపైనే దృష్టి సారించారు. సమయమంతా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కౌంటర్ తయారు చేయడానికే వెచ్చించాల్సి వస్తోందని ఒకవర్గం పోలీసు ఉన్నతాధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాంతిభద్రతల్ని కాపాడటం, చట్టాన్ని అమలు చేయడం తమ ప్రాథమిక విధులని, తాజా పరిణామాల నేపథ్యంలో వీటికి బదులు ప్రభుత్వం కోరుతున్న ‘ఆధారాలను’ సమర్పించడానికే సమయం చాలట్లేదని వ్యాఖ్యానిస్తున్నారు. గడిచిన 17 రోజులుగా రాష్ట్రంలో పోలీసింగ్ దాదాపు నిలిచిపోయినట్లే భావించాల్సి వస్తోందని అంటున్నారు. అన్నీ వదిలి పట్టిసీమకెందుకో..? పంటల సాగుకు అత్యంత ప్రధానమైన విత్తనాలు, ఎరువుల కొరతను పరిష్కరించే మార్గం చూడకుండా, రైతులకు రుణాలపై ఆలోచన చేయకుండా గురువారం సీఎం గోదావరి జిల్లాలకు వెళ్లి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాల సమయంలో పట్టిసీమ లిఫ్ట్‌తో పనేమిటని రైతులు నిలదీస్తున్నారు. వర్షాలు రాకముందే పుష్కర పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోకుండా ఇప్పుడు హడావుడి చేస్తే ప్రయోజనం ఏముంటుందని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. ‘పనిలోపనిగా గురువారం రాత్రి విజయవాడలో మకాం వేసి ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై ముఖ్యమైన నేతలు, అధికారులతో చర్చించారు..’ అని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ‘సాక్షి’తో అన్నారు. -
ఎరువుల నిల్వకు నిధుల కొరత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్‌కు ఎరువులను ముందస్తు నిల్వ(బఫర్ స్టాక్) చేయడానికి రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య (మార్క్‌ఫెడ్)ను నిధుల కొరత వేధిస్తోంది. దీంతో తమవద్ద ఉన్న ఆర్థిక వనరులను పోగుచేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్క్‌ఫెడ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ నిధులు కూడా సరిపోయేలా కన్పించకపోవడంతో మార్కఫెడ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పవని తెలుస్తోంది. 3 లక్షల టన్నుల ఎరువుల నిల్వ... ఖరీఫ్ సీజన్ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎరువుల కొరత రాకుం డా 3 లక్షల టన్నుల ఎరువులను ముందస్తుగా నిల్వ చేసుకోవాలని ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. అందులో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 30వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 20 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ ఉన్నాయి. సాధారణంగా సీజన్ ప్రారంభానికి 3 నెలల ముందు నుంచే ఈ ప్రక్రియ మొదలు కావాలి. ఇప్పటివరకు 2.10 లక్షల ఎరువులను సిద్ధం చేశారు. బఫర్స్టాక్కు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని సర్కారు మార్క్‌ఫెడ్‌కు సూచించింది. అందుకోసం దాదాపు రూ. 500 కోట్లు అవసరమవుతాయని అంచనా. కంపెనీల నుంచి ఎరువులు కొనడం, గోదాములను అద్దెకు తీసుకోవడం, ఎరువులను జిల్లాలకు సరఫరా చేయడం వంటివాటికి ఖర్చు అవుతుంది. అయితే, మార్క్‌ఫెడ్ విభజన జరగనందున రుణం ఇవ్వడానికి సిద్ధంగాలేమని బ్యాంకర్లు చెప్పినట్లు తెలిసింది. ఎరువుల బఫర్‌స్టాక్ నిర్వహించడం మార్కఫెడ్కు తలకుమించిన భారం కానుంది. 3 లక్షల టన్నుల ఎరువుల ముందస్తు నిల్వలో మార్కఫెడ్కు 72 వేల టన్నులు నిల్వ చేసే సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 2.28 లక్షల టన్నుల ఎరువులను నిల్వ కోసం మార్కెట్ కమిటీలు, స్టేట్ వేర్ హౌసింగ్ వంటివాటి గోదాములను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తలకు మించిన భారం కానుంది. -
బెల్టుషాపులు రద్దు చేయాలి
ఇన్ బాక్స్ రాష్ట్రవ్యాప్తంగా కష్టజీవుల శ్రమను బెల్టు షాపులు, గుడుంబా, కల్తీ కల్లు, నాటు సారా వంటివి దోచుకుంటున్నాయి. ప్రకృతి సహజమైన కల్లును స్పిరిట్ తదితర విషపదార్థాలను కలుపుతూ పట్టణాల్లో కల్తీకల్లు అమ్మించి ప్రజల జీవితాలను హరీమనిపిస్తున్నారు. మత్తుకు లోనైన వారు భార్యా పిల్లలను మర్చిపోవడమే కాకుండా నేరాలు ఘోరాలకు పాల్పడటం ద్వారా శాంతిభద్రత లకు భంగం కలిగిస్తున్నారు. 2004కి ముందు టీడీపీ హయాంలో ప్రజలకు మంచినీరు కన్నా బెల్టుషాపుల్లోని మద్యమే ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం బెల్టు షాపులు రద్దు చేస్తూ దశల వారీగా మద్యపాన నిషేధం చేయాలి. రాష్ట్ర ప్రజల జీవితాల్లో మౌలిక మార్పులు రావాలంటే విద్యలో, ఉద్యోగాల్లో, వృత్తుల్లో పొరుగు రాష్ట్రంతో పోటీ పడాలంటే అన్నిటికంటే ముందు బెల్టు షాపులను రద్దు చేయాలి. ఇలా అయితే మాత్రం పరిపూర్ణ ఆరోగ్యవంతులతో కూడిన బంగారు తెలంగాణ నిజంగా సాధ్యమ వుతుంది. బెల్టుషాపులతో పాటు గుట్కా, ఖైని, అంబర్ వంటి విషపదార్థాలను కూడా నిషేధించాలి. కట్టుకున్న భార్య కన్నా వీధుల్లో దొరికే కల్తీ కల్లు, చీప్ లిక్కరే మద్యంరాయుళ్లకి ముఖ్యమై కుటుంబ జీవితం ధ్వంసమవుతోంది. రాష్ట్రంలోని ప్రతి వీధిలో, వాడలో తాగుడు మూలంగా జరుగుతున్న కుటుంబ ఘర్షణలను మనం చూడవచ్చు. లక్షలాది గృహాలను కబళిస్తున్న మద్యపానాన్ని అరికట్టాలంటే, బెల్టు షాపులను రద్దు చేయడం ఒకటే మార్గం. కేసీఆర్ ప్రభు త్వం చిత్తశుద్ధితో సత్వరం స్పందించాలని కోరుతున్నాము. కొలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ కృత్రిమ ఎరువుల కొరత ఒకవైపు అకాల వర్షపాతం లేదంటే అనావృష్టితో కునారిల్లుతున్న తెలంగాణ రైతాంగానికి ఎరువుల కృత్రిమ కొరత వీడని పీడలా దాపురిస్తోంది. ఈ ముప్పేట దాడిని ఎదుర్కొనలేక కుప్పగూలుతున్న రాష్ట్ర రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవడానికి చర్యలు తీసుకోకుంటే వ్యవసాయానికి మంగళం పలికే రోజులు తప్పదు. తెలంగాణ రాష్ట్రం లో ఏర్పడిన ఎరువుల కొరత వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో ఏర్పడిన డిమాండ్ కారణంగా కొందరు వ్యాపారస్తులు, డీలర్లు అక్రమ నిల్వలకు పాల్పడి కృత్రిమ కొరతను సృష్టించి, ధరలను విపరీతంగా పెంచేశారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు, లభ్యం కాని నాణ్యమైన విత్త నాలు, బ్యాంకుల నుండి రుణాలు మంజూరు కాకపోవడం ఇత్యాది కారణాల వలన ఇప్పటికే పలు సమస్యలలో కూరుకుపోయిన రైతాం గానికి తాజాగా ఎరువుల కొరత మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా ఉంది. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామన్న తెరాస ప్రభు త్వం తన మాట నిలుపుకుని తక్షణం ఎరువుల కొరతను తీర్చేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి. రైతు సమస్యల పరిష్కారా నికి, కృత్రిమ ఎరువు కొరత నివారణకు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఎరువుల కర్మాగారాల స్థాపనకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి. సీహెచ్ సాయిఋత్విక్ పాన్‌గల్ రోడ్డు, నల్లగొండ నిరుద్యోగుల వెతలు తెలంగాణలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1, 2 ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తున్నారే కానీ పని మాత్రం జరగటం లేదు. రాష్ట్ర విభజనలో భాగంగా ఉద్యోగుల పంపిణీ పూర్తి కాలేదన్న సాకుతో ఇంకె న్నాళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా వాయిదా వేస్తారు. ఇప్పటికే వేల మంది నిరుద్యోగులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైద రాబాద్‌కు తరలివచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. బీఈడీ, డీఎడ్ తదితర ఉపాధ్యాయ శిక్షణలు పూర్తి చేసుకున్న వారు సైతం డీఎస్సీ లేకపోవడంతో గ్రూప్ పరీక్షలకు సీరియస్‌గా సన్నద్ధమ వుతున్నారు. మరోవైపు ఎమ్మెస్సీ, ఎమ్మే తదితర పోస్ట్ గ్రాడ్యు యేషన్, ఇంజనీరింగ్ కోర్సులు చదివినవారు కూడా ఉద్యోగాలు లేక గ్రూప్స్ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటూ వేలరూపా యలను ఖర్చు పెట్టుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే తెలం గాణ ప్రభుత్వం మరికొన్నాళ్లు ఈ వ్యవహారాన్ని నానబెట్టే ప్రమా దం కనిపిస్తోంది. రాజకీయ ప్రయోజనాలను పక్కన బెట్టి ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల బాగోగులను పట్టించుకుంటే మంచిది. ఇకనైనా ప్రభుత్వం దృఢంగా పూనుకుని లక్షలాది నిరుద్యోగులు ఆశగా చూస్తున్న తెలంగాణ పీఎస్సీ ద్వారా గ్రూప్ 1, 2 ఉద్యోగాల నోటిఫికేషన్‌ను త్వరగా విడుదల చేయాలి. పి.శ్రీనివాస్ అమ్మక్కపేట, కరీంనగర్ -
శాస్త్రీయ వ్యవసాయం చేయండి: కేసీఆర్
* ఫెర్టిలైజర్ షాపు వాళ్లు చెప్పిన మందులు కాదు.. * జూన్‌లో రైతు సమస్యల అధ్యయనం కోసం బస్సుయాత్ర చేస్తా.. * రైతులతో ముఖాముఖిలో సీఎం కేసీఆర్ నల్లగొండ రూరల్: ‘నా ఫాంహౌజ్‌లో పనిచేసే సూపర్వైజర్ మొక్కలకు డ్రిప్ ద్వారా ఫెర్టిలైజర్, నీళ్లు ఇడుస్తడు. డ్రిప్ ద్వారా మొక్కలకు ఐదు నిమిషాలు ఫెర్టిలైజర్ స్ప్రే చేసిన తర్వాత 10-15 నిమిషాలు డ్రిప్ ఆపేస్తడు. ఆ తర్వాత మళ్లీ డ్రిప్ ఇడుస్తడు. అలా ఎందుకు చేస్తున్నావని అడిగా... ‘మధ్య మధ్యలో డ్రిప్ ఆపకపోతే ఫెర్టిలైజర్ కానీ, నీళ్లు కానీ ఎక్కువగా భూమి లోపలికి పోతాయి. మొక్క కంటే కిందికి వెళ్లడం వల్ల ఉపయోగం ఉండదు. మధ్యలో ఆపితే అవి వేర్ల వరకు వెళ్లి పదును చేస్తాయి. మధ్యలో ఆపకపోతే ఫెర్టిలైజర్ కానీ, నీళ్లు కానీ దుర్వినియోగం అవుతాయి’ అని చెప్పాడు. ఇలాంటి వ్యవసాయ మెళకువల గురించి రైతులు అవగాహన పెంచుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని కాకుండా శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి. సేద్యం విషయంలో రైతు నుంచి ఎలాంటి లోపమూ ఉండకూడదు.’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. నల్లగొండ పట్టణంలో ఆదివారం జరిగిన రైతు బోర్ల రాంరెడ్డి కుమారుడి వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్ విందుకు వచ్చిన రైతులు చిలుక విద్యాసాగర్‌రెడ్డి తదితరులతో కలసి భోజనం చేశారు. అన్నం, ఆలుగడ్డ, వంకాయ, పప్పు కూరలు, గుడ్డు, పెరుగు వేసుకుని భోజనం చేసిన సీఎం ఈ సందర్భంగా గంటకు పైగా రైతులతో మాట్లాడి వ్యవసాయ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా రైతు అయిన ఆయన తనతో మాట్లాడిన రైతులకు పలు సలహాలు కూడా ఇచ్చారు. -
లోపలి మట్టిలో పోషకాలపై త్వరలో అధ్యయనం
పీజేటీఎస్ఏయూ స్పెషల్ ఆఫీసర్ డా. ప్రవీణ్‌రావు వెల్లడి చింతల వెంకటరెడ్డి వినూత్న సేద్య పద్ధతికి ప్రశంసలు సమస్య ఎక్కడ ఉందో పరిష్కారమూ అక్కడే ఉంటుందనేది అక్షర సత్యం. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి తన తెలివి తేటలతో రుజువు చేశారు. భూమి లోపలి నుంచి తీసి ఎండబెట్టిన మట్టిని పంటలకు దఫదఫాలుగా వేస్తే చాలని, రసాయనిక ఎరువుల అవసరం లేనేలేదంటూ తన ఆవిష్కరణ ద్వారా చింతల వెంకటరెడ్డి కొన్నేళ్ల క్రితమే చాటిచెప్పారు. ఈ పూర్వరంగంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) స్పెషల్ ఆఫీసర్ డా. ప్రవీణ్‌రావు ఇటీవల కీసర మండలం కుందనపల్లిలోని వెంకటరెడ్డి ద్రాక్ష తోటను సందర్శించి ముగ్ధుడయ్యారు. ఈ ద్రాక్ష పండ్ల నాణ్యత నమ్మశక్యం కాకుండా ఉందని, తియ్యదనం (22% బ్రిక్స్), కాయ పెళుసుతనం చాలా బాగుందన్నారు. కాయలు ఒకే సైజులో ఉండటం, ఆకులు బాగా ఆకుపచ్చగా ఉండటం అరుదైన విషయమన్నారు. ప్రకృతికి అనుగుణమైన రీతిలో సాగుతున్న వినూత్నమైన ఈ సాగు పద్ధతిపై శాస్త్రవేత్తల బృందంతో త్వరలోనే లోతైన అధ్యయనం చేయిస్తానని డా. ప్రవీణ్‌రావు తెలిపారు. ఈ సాగు పద్ధతి అనుసరించదగినదేనని ఇతర రైతులకు తమ యూనివర్సిటీ సిఫారసు చేయాలంటే.. తొలుత శాస్త్రీయ అధ్యయనం చేయడం తప్పనిసరన్నారు. ఎరువుగా వేస్తున్న మట్టి, పంటలకు వాడుతున్న నీరు తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేసి.. దీనిపై తుది నిర్ణయానికొస్తామన్నారు. ద్రాక్ష పరిశోధనా కేంద్రం మాజీ ముఖ్య శాస్త్రవేత్త డా. జీ సత్యనారాయణ, డా. చింతల రాజ్నరసింహారెడ్డి పాల్గొన్నారు. వెంకటరెడ్డి వినూత్న సేద్య పద్ధతిని ‘లోపలి మట్టిలోనే పోషకాల లోగుట్టు’ అనే శీర్షికన గత ఏడాది ‘సాగుబడి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ‘ప్రపంచ భూముల పరిరక్షణ సంవత్సరం’లో ఈ సాంకేతికతపై అధ్యయనం చేయాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించుకోవటం ఆనందించదగిన, అభినందించదగిన విషయం. చెరువు మట్టిని ఎండబెట్టి ఎరువుగా వాడొచ్చు చెరువుల్లో పూడిక తీసిన మట్టిలో భూమి లోపలి పొరల్లో(సబ్ సాయిల్లో) మాదిరిగానే పోషకాలుంటాయి. కాబట్టి, చెరువులో తవ్వి తీసిన మట్టిని కూడా ఎండబెట్టి బస్తాల్లో నిల్వ చేసుకొని.. ఏ పంటకైనా దఫదఫాలుగా వేసుకుంటే నాణ్యమైన, సకల పోషకాలతో కూడిన చక్కని దిగుబడులు సాధించవచ్చని రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి తెలిపారు. -
ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణకు కేంద్రం ఓకే
దేశవ్యాప్తంగా అందుబాటులోఉన్న సంప్రదాయ ఇంధన వనరుల్ని సాధ్యమైనంత మేర వినియోగంలోకి తేవడంతోపాటు గతంలో మూసివేతకు గురైన ఎరువుర కర్మాగారాల్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖపట్నం, మంగుళూరు, కుద్దూర్ నగరాల్లో వ్యూహాత్మక ముడి చమురు (క్రూడ్ ఆయిల్) నిల్వల కోసం రూ. 4,948 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఒకప్పుడు దేదీప్య మానంగా వెలుగొంది, తర్వాతి కాలంలో మూతపడిన ఎరువుల కర్మాగారాలు రెండింటిని పునరుద్ధరించాని కేంద్రం నిర్ణయించింది. వాటిలో ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ కర్మాగారం కాగా, మరోటి బీహార్‌లోని బరౌనీలోని ప్లాంట్. ఇవి రెండూ హిందుస్థాన్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్‌కు చెందినవి. -
పురుగుల భరతం పట్టే ద్విపత్ర ద్రావణం!
- అడవి జెముడు కొమ్మలు, సునాముఖి ఆకులతో - ద్రావణం.. 10 రోజుల్లో సిద్ధం - పంటలపై పిచికారీతో రసం పీల్చే పురుగుల పీడ విరగడ స్థానికంగా అందుబాటులో ఉండే వనరులతోనే రైతులు స్వయంగా ఎరువులు, కషాయాలను, ద్రావణాలను తయారు చేసుకోవడం సేంద్రియ సేద్యంలో ముఖ్యాంశం. సేంద్రియ సేద్యంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి రైతులు నిరంతరం కొత్తదారుల కోసం అన్వేషిస్తూ ఉంటారు. తమ పరిసరాల్లోని చెట్టూ చేమను సేద్య అవసరాల కోసం మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తూ.. ప్రయోగాలు చేసే సేంద్రియ రైతు నిత్యాన్వేషి కొమ్మూరి విజయకుమార్. రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా పారదోలే సరికొత్త ద్విపత్ర ద్రావణాన్ని తమ పంటలపై వాడుతూ, తోటి రైతులకూ నేర్పిస్తున్నారు. ఆకులు, అలములను నీటిలో మరిగించి తయారు చేసే కషాయాల కన్నా.. పులియబెట్టి తయారు చేసే ద్రావణాలు చీడపీడలపై ప్రభావశీలంగా పనిచేస్తున్నాయని ఆయన స్వానుభవంతో అంటుంటారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి వెలంవారిపల్లెకు చెందిన విజయకుమార్(98496 48498) తమ ప్రాంతంలో విరివిగా లభించే అడవి జెముడు, సునాముఖి మొక్కలతో తయారు చేసిన ద్రావణ ం వివిధ పంటలపై రసం పీల్చే పురుగులను చక్కగా అరికడుతున్నదంటున్నారు. విజయకుమార్ ఏమంటున్నారంటే... ఎలా తయారు చేస్తారు? పొలాలు, గుట్టలు, కొండల్లో ముళ్లతో ఉండే అడవి జెముడు మొక్కలు విరివిగా కన్పిస్తుంటాయి. వీటిని మేకలు తింటాయి. ఆ మొక్కల కొమ్మలు కిలో తీసుకోవాలి. సునాముఖి పచ్చి ఆకును కిలో తీసుకోవాలి. వీటిని ముందుగా విడివిడిగా బాగా దంచి, వాటితోపాటు 4 లీటర్ల ఆవు మూత్రాన్ని డ్రమ్ము/తొట్టిలో వేసి బాగా కలియదిప్పాలి. ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచి, అడపా దడపా కలుపుతూ పులియబెట్టాలి. 10 రోజుల పాటు పులిసిన ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. లీటరు ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. అన్ని పంటలకూ ఉపయోగమే.. పెసర, మినుము, కంది, వేరుశనగ... ఇలా దాదాపు అన్ని పంటల పైన ఈ ద్రావణాన్ని వినియోగించవచ్చు. పురుగు ఉధృతిని బట్టి పంటకాలంలో మూడుసార్లు ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వేసవి కాలంలో... పంట 20 రోజుల దశలో ఉన్నప్పుడు మొదటిసారి 100 లీటర్ల నీటిలో లీటరు ద్రావణాన్ని కలిపి వాడాలి. రెండోసారి 80 లీటర్ల నీటిలో లీటరు ద్రావణాన్ని, మూడోసారి 60 లీటర్ల నీటిలో లీటరు ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. చలికాలంలో అయితే.. పంట 15 రోజుల దశలో ఉన్నప్పుడే మొదటిసారి ద్రావణాన్ని వినియోగించాలి. భూమి, మొక్కలు బాగా తడిసేలా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఒకసారి ద్విపత్ర ద్రావణాన్ని తయారు చేసుకుంటే దాన్ని సంవత్సర కాలం వరకూ నిల్వ చేసుకోవచ్చు. రెక్కల పురుగులు.. తెల్లదోమ.. ద్విపత్ర ద్రావణం రెక్కల పురుగుల గుడ్లను సమర్థవంతంగా నాశనం చేస్తుంది. అలాగే తెల్లదోమను కూడా నివారిస్తుంది. తెల్లదోమ నివారణకు ద్రావణాన్ని పిచికారీ చేసే వారు దానిలో కొంచెం సర్ఫ్ పొడిని కానీ లేదా కుంకుడుకాయ రసాన్ని కానీ కలుపుకుంటే మంచిది. ఈ ద్రావణం బాగా పనిచేస్తోంది.. సునాముఖి, అడవి జెముడుతో తయారు చేసిన ద్విపత్ర ద్రావణం పంటలపై బాగా పని చేస్తోందని వేంపల్లె మండలం బుగ్గకొట్టాలకు చెందిన రైతు వెంకట్రాముడు చెప్పారు. సంజీవని ఎరువు, ద్రావణాల వాడకం వల్ల ఖర్చు తగ్గిందని వేంపల్లె మండలం టి.వెలంవారి పల్లెకు చెందిన రైతు పక్కీరప్ప తెలిపారు. - మాచుపల్లి ప్రభాకర్‌రెడ్డి, కడప అగ్రికల్చర్ -
సేంద్రియ వ్యవసాయంపై అపోహలెందుకు?
రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు సాగు చేసే వ్యవసాయ పద్ధతులనేకం ఉన్నాయి. ఈ పద్ధతులను అవలంబిస్తున్న వ్యక్తులు, సంస్థల మధ్య వ్యవసాయంలో రసాయనాల అవసరం లేదనటం వంటి కొన్ని అంశాలపై ఏకీభావం ఉన్నప్పటికీ.. మరికొన్ని విభేదాలు కనిపిస్తున్నాయి. పరస్పర అపనమ్మకాలను, అపోహలను పక్కన పెట్టి.. అనుభవాలను కలిసి పంచుకుంటే సేంద్రియ వ్యవసాయం దిశగా వేగంగా మార్పు వస్తుందంటున్నారు డాక్టర్ జీ వీ రామాంజనేయులు. హరిత విప్లవంతో సమస్యలు ఎదుర్కొన్న తర్వాత, భారత దేశం ఇప్పుడు వ్యవసాయంలో మరో కొత్త విప్లవానికి తయారవుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు, సంస్థలు ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. ఆధునిక(రసాయనిక) వ్యవసాయ పద్ధతుల్లోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఆరోగ్యానికి కలుగుతున్న హానిని గుర్తెరిగి, సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. దీనికి తోడు ఆహార పదార్థాల్లో ఆధునిక రసాయనాల అవశేషాల పట్ల వినియోగదారుల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు ప్రాముఖ్యత కలిగిస్తోంది. అయితే, సేంద్రియ వ్యవసాయం చేయటానికి అవసరమైన వనరులున్నాయా? అని ఒక వైపు, సేంద్రియ వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కంటే ప్రమాదకరం? అని ఇంకొక వైపు ప్రచారాలు సాగటంతో అటు రైతుల్లోను, ఇటు వినియోగదారుల్లోను కొన్ని అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. సేంద్రియ వనరులున్నాయా? సేంద్రియ పద్ధతుల్లో పేడని కేవలం నత్రజని, భాస్వరం, పొటాష్ అందించే రసాయన పదార్థంగా చూడకుండా, గాలి నుంచీ నత్రజని మొదలైన వాయువులను నైట్రేట్ల రూపంలో స్థిరీకరించే సూక్ష్మజీవులను అందించే వనరుగా చూస్తాం. ఈ సూక్ష్మజీవులు పశువుల కడుపులో వుంటూ అవి తినే ఆకులూ, కొమ్మలను జీర్ణం చేసుకోవటంలో సహాయం చేస్తాయి. వీటిని వాడినప్పుడు భూమిలో కూడా అటువంటి పనే చేస్తాయి. దానికి తోడు భూమిలో వుండి.. వాడుకోదగిన రూపంలో లేని భాస్వరం లాంటి పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. అయినా కేవలం నత్రజని, భాస్వరం, పొటాష్ల గురించి ఆలోచించినా, దేశంలో పంట వ్యర్థాలు, పశువుల పేడ రూపంలో చాలానే దొరుకుతాయి. అయితే వీటిని సేకరించటంలో సమస్యలు, ఖర్చులు, శ్రమ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం రసాయనిక ఎరువుల మీద పెడుతున్న 60 వేల కోట్ల సబ్సిడీ (2014లో అది 70 వేల కోట్లు వున్నది. అప్పటి నుంచి భారాన్ని రైతుల మీదకు మార్చారు)లో కొంత భాగాన్ని రైతులకు నేరుగా సబ్సిడీల రూపంలో అందించవచ్చు. దేశీ ఆవు లేకపోతే సేంద్రియ వ్యవసాయం చేయలేమా? దేశీ ఆవు పేడ మాత్రమే వాడాలనే మాట మనకు తరచూ వినిపిస్తూ ఉంది. మిగతా జీవాలు వున్నా వాటి పేడ ఉపయోగపడదేమో అని చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయానికి మారటానికి భయపడుతున్నారు. నిజానికి ఆవు అయినా, గేదె అయినా.. గడ్డి, పచ్చిరొట్టల మీద ఎక్కువగా ఆధారపడినవైతే వాటి పేడని రైతులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అయితే, కష్టమైన వాతావరణంలో కూడా దేశీ ఆవు తట్టుకుంటుంది కాబట్టి, కొత్తగా పశువులు కొనుక్కునే వాళ్లు దేశీ ఆవును కొనుక్కుంటే మంచిది. మార్కెట్లో దొరికే బయో ఫెర్టిలైజర్లన్నిటిలో ఉన్న సూక్ష్మజీవులు పశువుల పేడలో ఉన్నవే. వర్మీ కంపోస్ట్ ప్రమాదకరమా? వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) భూమిలో భారలోహాలను పెంచుతుంది, అసలు వీటి కోసం వాడే విదేశీ వానపాములు అత్యంత ప్రమాదకరం అనే అభిప్రాయం ఉంది. ఇది పూర్తిగా అపోహే. వానపాములలో భూమిపైన పాకేవి, భూమి లోపలికి తొలుచుకు వెళ్లేవి అని.. ప్రధానంగా రెండు రకాలుంటాయి. భూమిలోకి తొలుచుకు వెళ్లే వానపాములను వాడితే కంపోస్ట్ గుంతలో నుంచి భూమిలోకి వెళ్లిపోతాయి కాబట్టి.. నేలపైన పాకే వాటిని వాడతారు. మన దేశంలో సుమారు మూడు వందల రకాల వానపాములు ఉన్నాయి. అందులో కొన్ని పైన పాకేవి, ఇంకొన్ని భూమిలోకి తొలుచుకు వెళ్లేవి. ఈ వానపాములు భార లోహాలను పెంచుతాయి అన్నది కూడా పెద్ద అపోహే. పంట వ్యర్థాలలో అప్పటికే ఉన్న భార లోహాలే కంపోస్ట్లోకి వస్తాయే గానీ.. వానపాములు కొత్తగా భార లోహాలను తయారు చేయవు. పంట వ్యర్థాలు కంపోస్ట్‌గా మారే క్రమంలో మొత్తం పరిమాణం బాగా తగ్గుతుంది. కాబట్టి భార లోహాల మోతాదు కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. అంటే.. కంపోస్టు చేయకుండా ఆచ్ఛాదన(మల్చింగ్) చేసినా లేక భూమిలో కలిపి దున్నినా ఇదే జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయంలో అసలు సమస్యలే లేవా? సేంద్రియ వ్యవసాయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు.. నాణ్యతా ప్రమాణాలు పాటించటంపై సేంద్రియ సర్టిఫికేషన్ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతిలో కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రత్యామ్నాయంగా పీజీఎస్ లాంటి వాటి ద్వారా సర్టిఫికేషన్ పొందవచ్చు. కాబట్టి, అపోహలను పక్కన పెట్టి పరిస్థితులకు అనుగుణంగా, స్థానికంగా దొరికే వనరులతో చేపట్టే సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లే దిశగా రైతులు ప్రయత్నం చేయవచ్చు. అలాగే పరస్పర అపనమ్మకాలను పక్కన పెట్టి, వివిధ జీవావరణ వ్యవసాయ (ఎకలాజికల్ ఫార్మింగ్) పద్ధతులను ప్రోత్సహిస్తున్న సంస్థలు/వ్యక్తులు తమ అనుభవాలను కలిసి పంచుకుంటే.. అందరి విజ్ఞానం పెంపొందుతుంది. ఇటువంటి మార్పును వెతుకుతున్న రైతులతో పాటు ప్రభుత్వం కూడా తోడ్పాటును అందించగలిగితే.. సేంద్రియ వ్యవసాయం దిశగా త్వరితగతిన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు. రాఘవేంద్ర ఫెర్టిలైజర్స్, మారుతి ఫెర్టిలైజర్స్ అనే రెండు షాపుల్లో అనుమతుల్లేకుండా రసాయనిక ఎరువులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ దాడుల్లో సీఐ రాఘవన్, మండల వ్యవసాయ అధికారి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. వెంటనే రసాయనిక ఎరువుల విక్రయాలను నిలిపివేయించారు. -
ఎరువుల దుకాణంలో మంటలు
ఎరువుల దుకాణంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలో చోటుచేసుకుంది. పెద్దపల్లి మండల కేంద్రంలోని జెండా చౌరస్తా ప్రాంతంలో సాయి ప్రసన్న ఎరువుల దుకాణంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల విలువ చేసే యూరియా, అమ్మోనియా ఎరువులు పూర్తిగా కాలిపోయాయి. మంటల వేడికి బిల్డింగ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. -
ఎరువు.. కరువు
నెల్లూరు(అగ్రికల్చర్): రైతన్నకు ఎరువు కరువైంది. ఆందోళన అవసరం లేదు.. అవసరానికి తగ్గట్లు ఎరువులు సిద్ధమంటూ పాలకులు చేసిన ప్రకటనలు నెలకే గాల్లో కలిసిపోయాయి. పర్యవేక్షణ లేకపోవడటంతో అన్నదాతలకు అందాల్సిన సబ్సిడీ ఎరువులను కొందరు వ్యాపారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఈ అక్రమ దందాను అడ్డుకోవాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు వ్యాపారులకే వంత పాడుతున్నారు. సహకార పరపతి సంఘాల (సొసైటీల) ద్వారా ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎరువులను కొందరు అక్రమార్కులు బినామీల పేరుతో తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇటీవల నాయుడుపేట, సంగంలోని సొసైటీ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తుండగా అధికారులు దాడులు నిర్వహించి ఆరుకాణాలను సీజ్ చేయడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో పలుచోట్ల యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తూ వ్యాపారులకే సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఆలస్యంగా వర్షాలు పడటంతో సాగు అలస్యమైందని ఆవేదన చెందుతున్న రైతులపై ఎరువుల ధరలు మరింతభారంగా మారాయి. బినామీ పాసుపుస్తకాలతో.. కోరమాండల్, ఇఫ్కో, క్రిబ్కో కంపెనీలు యూరియాను సొసైటీలు, ఆథరైజ్డ్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాయి. మార్కె ట్ ధర కంటే తక్కువగా రైతులకు అందిస్తున్నాయి. ఒక్కో రైతుకు పాస్ పుస్తకం ఆధారంగా మూడు బస్తాలు చొప్పున అంది స్తారు. ఇదే అదునుగా వ్యాపారులు బినామీ పాసు పుస్తకాలతో ప్రతి రోజు 100 నుంచి 200 బస్తాలు బ్లాక్‌కు తరలిస్తున్నారు. అక్రమదందా సాగుతోంది ఇలా.... జిల్లాకు రబీ సీజన్‌కు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 41,000 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇందులో 50 శాతం జిల్లాలోని 95 సొసైటీలకు, మిగిలిన 50 శాతం ప్రైవేటు డీలర్లకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే అధికారులు అందుకు భిన్నంగా ప్రైవేటు డీలర్లకే అధిక మొత్తంలో యూరియాను కేటాయించారని డీసీసీబీ డెరైక్టర్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో ఫెర్టిలైజర్స్ దుకాణాలు ఉన్నాయి. ఆయా మండలకేంద్రాల్లో ఉన్న ఎరువుల దుకాణాల యజమానులు కొంతమంది రైతుల పాస్ పుస్తకాలను సేకరించి బినామీ పేర్లతో రోజుకు 50 నుంచి 100 బస్తాల యూరియాను తీసుకెళ్తున్నారు. వీరికి ఆయా సొసైటీ డెరైక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారుల అండ ఉండటంతో వీరి దందాకు అడ్డు, అదుపులేకుండా పోయింది. పదిరోజుల క్రితం నాయుడుపేటలోని ఒక ప్రైవేటు దుకాణంలో సొసైటీ ఎరువులు విక్రయిస్తుండగా అధికారులు దాడులు నిర్వహించి ఆ దుకాణాన్ని సీజ్ చేశారు. జిల్లాలో రబీ సీజన్లో 2.76,425 హెక్టార్లలో వరి, మినుము, వేరుశనగ, చెరకు, పత్తి పంటలను ఈ రబీ సీజన్లో సాగుచేస్తారని అధికారులు తేల్చారు. పెరిగిన ఎరువుల ధరలు ప్రధానంగా దుక్కిలో హెక్టార్‌కు రెండున్నర బస్తాల డీఏపీని కచ్చితంగా వేయాలి. డీఏపీ బస్తా రూ.1,181 ఉండగా, ఈ ధర ప్రస్తుతం రూ.1,249కు చేరింది. డీఏపీ బస్తాపై రూ.68 పెరిగింది. 14:35:14 ధర రూ.1,120 నుంచి రూ.1,207కు చేరింది. బస్తాపై రూ.127 పెరిగింది. అదేవిధంగా 10: 26: 26 ధర రూ.1,083 ఉండగా, రూ.1,139 అయింది. 20:20:0:13 ధర రూ.919 నుంచి రూ.956 పెరిగింది. ఒక్కో హెక్టారుకు రైతుపై రూ.200 నుంచి 300 అదనపు భారం పడింది. యూరియా బస్తా కు రూ.284లకు విక్రయించాల్సి ఉండగా రూ.380 వరకు విక్రయిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు : బహిరంగ మార్కెట్లో యూరియా బస్తాపై వ్యాపారులు రూ.80 నుంచి 100 పెంచి అమ్ముతున్నా అధికారులు పట్టించు కోవడం లేదు. కట్టడి చేయాల్సిన వారు వ్యాపారుల ప్రలోభాలకు లొంగి రైతులకు తీవ్ర అన్యా యం చేస్తున్నారు. అధిక రేట్లకు విక్రయించే దుకాణాలపై జిల్లా అధికారులైనా దాడులు చేసి చర్యలు తీసుకోవాలి. - అల్లంపాటి హజరత్‌రెడ్డి, రైతు, నరసాపురం బ్లాక్మార్కెట్లో సొసైటీ ఎరువులు : సొసైటీలకు సరఫరా చేసిన యూరియా ను అధికారులు వారి బంధువులకు, బినామీ రైతుల పేరుతో బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. వ్యవసాయాధికారులు చిత్తశుద్ధితో దుకాణాల్లో స్టాకు రిజిష్టరును పరిశీలిస్తే వ్యాపారుల దందా బయటపడుతుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఈ అక్రమదందాను అరికట్టాలి. - కొప్పోలు వెంకటేశ్వర్లు, రైతు, ఆత్మకూరు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు : కృత్రిమ కొరత సృష్టించి ఎరువుల బస్తా ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించే దుకాణాలపై దాడులు నిర్వహించి సీజ్ చేశాం. సొసెటీలకు కేటాయించిన ఎరువులు బ్లాక్మార్కెట్లో విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. రబీ సీజన్‌కు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. - కేవీ.సుబ్బారావు, జేడీ, వ్యవసాయశాఖ -
బుగ్గితో రాజధాని నిర్మాణం!
రాజధాని నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలో రైతుల నుండి భూ సమీకరణ జరపాలని నిర్దేశించిన ప్రాంతంలో ఇటీవల పచ్చటి పంటపొలాలను, తోటలను దుండగులు బుగ్గిపాలు చేశారు. ఈ అమానుషకాండకు రైతుల అరటి తోటలు, షెడ్డులు, డ్రిప్ ఇరిగేషన్ సామగ్రి, ఎరువులు వగైరా కాలి బూడిదయ్యాయి. సీఎం తక్షణమే విచారణకు ఆదేశించడం సమంజసమే. అయితే ఘటన జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఒక మంత్రి అనుయాయులు రైతులే తమ పంటలను తగులబెట్టు కున్నారని, ఇందులో వైఎస్సార్సీపీ కార్యకర్తల హస్త ముందని చేసిన వెకిలి వ్యాఖ్యల వల్ల బాధిత రైతు లకు పుండు మీద కారం రాసినట్టు అనిపించడం సహజమే. కాబట్టే వారు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఆమోదయోగ్యమైన రీతిలో, వారిని ఒప్పించి సేకరించిన భూము లతో రాజధానిని నిర్మిస్తేనే ప్రజలు హర్షిస్తారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. ఏదిఏమైనా భూములు ఇచ్చేదిలేదని రైతులు చెబు తుండగా, వారిని బెదిరించి అధికారాన్ని ప్రయోగించి భూములను స్వాధీనం చేసుకోవాలని చూడటం అనర్థదాయక పరిణామాలకు దారితీస్తుంది. ప్రభుత్వం విజ్ఞతను చూపాల్సిన సమయమిది. -ఎమ్. ఎస్. రావు గోకివాడ, తూర్పు గోదావరి జిల్లా -
ఏసీబీ వలలో మంచాల ఏఓ
మంచాల: ఫర్టిలైజర్ దుకాణం లెసైన్స్‌కు రూ. 2 వేలు లంచం తీసుకుంటూ మంచాల ఏఓ(అగ్రికల్చర్ అధికారి) లావణ్య ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ఎం.ప్రభాకర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఎల్లమ్మ తండాకు చెందిన యువకుడు సపావట్ దేవరాంనాయక్ ఆరు నెలల క్రితం ఫర్టిలైజర్ దుకాణం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులకు లెసైన్స్ సిఫారసు చేసేందుకు స్థానిక వ్యవసాయ శాఖ అధికారి లావణ్యను సంప్రదించగా గతేడాది అక్టోబర్ 14న రూ. 4 వేలు లంచం తీసుకుంది. నిబంధనల ప్రకారం దేవరాంనాయక్ సభ్యత్వం కోసం రూ.1250, ఎన్ఎస్సీ కోసం రూ. 1000, విత్తనాల కోసం రూ.50, మందుల కోసం రూ. 300 అధికారులకు డీడీ రూపంలో చెల్లించాడు. తిరిగి టిన్ నంబర్ సర్టిఫికెట్ కోసం వెళ్లగా ఏఓ మరో రూ. 4 వేలు ఇవ్వాలని స్పష్టం చేసింది. తాను రూ. 2 వేలు ఇస్తానని దేవరాంనాయక్ చె ప్పి ఈనెల 2న నగరంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నిఘా వేసిన అధికారులు ఏఓ లంచం కోసం డిమాండ్ చేయడం నిజమని నిర్ధారించుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎం.ప్రభాకర్ నేతత్వంలో రంగంలోకి దిగారు. అధికారులు దేవరాంనాయక్కు రసాయనాలు పూసిన రూ.2 వేలు ఇచ్చారు. సదరు డబ్బు ఆయన సోమవారం ఏఓ లావణ్యకు ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. పక్కా వ్యూహంతో.. ఏసీబీ అధికారులు ఏఓ లావణ్యను పక్కా వ్యూహంతో పట్టుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు మంచాల వ్యవసాయ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఏఓ బండలేమూర్‌లో రైతులతో సమావేశం ముగించుకొని మధ్యాహ్నం ఒంటిగంటకు ఆఫీస్‌కు వచ్చారు. దేవరాంనాయక్ ఆమెకు రూ. 2 వేలు ఇచ్చాడు. క్షణాల్లోనే ఏసీబీ అధికారులు అక్కడికి వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఓ లావణ్య నుంచి రూ. 2 వేలు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 7 గంటల వరకు వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే ఉండి వివరాలు సేకరించారు. కాగా ఏసీబీ అధికారులు నగరంలోని వైదేహినగర్లో ఉన్న ఏఓ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఏసీబీ సీఐ సునీల్, వెంకట్‌రెడ్డి, లక్ష్మి, ఏసీబీ సిబ్బంది ఉన్నారు. అవినీతిపరుల భరతం పట్టండి: ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ అవినీతిని అరికట్టేందుకు అందరూ చైతన్యవంతం కావాలి. ప్రభుత్వ అధికారులు సర్కార్ నుంచి వేతనాలు తీసుకుంటున్నారు. వారికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. జనం నిర్భయంగా అవినీతిపరుల సమాచారం 9440446140 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పండి. వారి భరతం మేం పడతాం. గవర్నమెంట్ అధికారికి డబ్బులెందుకు ఇవ్వాలి..? నేను ఎంటెక్ చేశాను. ప్రస్తుతం నిరుద్యోగిని. గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణం పెట్టుకునేందుకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాను. ఏఓ లావణ్యకు గతంలో రూ. 4వేలు లంచం ఇచ్చాను. తిరిగి మరో రూ. 4 వేలు ఇవ్వాలని వేధించింది. చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాను. గవర్నమెంట్ అధికారులకు లంచాలు ఎందుకు ఇవ్వాలి. వారు సర్కార్ నుంచి వేతనాలు తీసుకోవడం లేదా...? - బాధితుడు, సపావట్ దేవరాంనాయక్ -
నల్లబజారుకు సబ్సిడీ ఎరువులు
ధర్మవరం : ఆరుగాలం శ్రమించి అష్టకష్టాలు పడుతున్న రైతన్నలకు సబ్సిడి ఎరువుల సైతం అందుబాటులోకి రాకుండా ఫెర్టిలైజర్ వ్యాపారులు గద్దలా తన్నుకుపోతున్నారు. అరికట్టాల్సిన అధికారులు కుమ్మక్కై వ్యాపారులకే వంత పాడుతున్నారు. ప్రభుత్వం డీసీఎంఎస్ సొసైటి నుండి సబ్సిడితో అందిస్తున్న ఎరువులను బినామీ రైతుల పేరుతో తరలించి అధిక ధరలకు విక్రయించి ఫెర్టిలైజర్స్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాను సాక్షి బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని డీసీఎంఎస్ సొసైటిలో రెండు కంపెనీలకు చెందిన ఎరువులను సబ్సిడితో రైతులకు అందిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున, ఇప్కో కంపెనీల యూరియాలను మార్కెట్ ధర కంటే తక్కువగా రైతులకు అందిస్తున్నారు. ఒక్కో రైతుకు పాసుపుస్తకానికి మూడు బస్తాల చొప్పున అందిస్తారు. ఇదే అదునుగా చేసుకున్న వ్యాపారులు బినామీ పాసు పుస్తకాలతో ప్రతి రోజు వంద నుండి రెండు వందల బస్తాలు నల్లబజారుకు తరలిస్తున్నారు. అక్రమ దందా సాగుతోంది ఇలా.. పట్టణంలో దాదాపు పదికి పైగా ఫెర్టిలైజర్స్ దుకాణాలు ఉన్నాయి. వీరు కొంత మంది రైతులు పాసు పుస్తకాల జీరాక్స్‌లను సేకరించుకుని బినామీ పేర్లతో ప్రతి రోజు 50 నుండి వంద బస్తాలు యూరియాను ఫెర్టిలైజర్స్ దుకాణాలకు చేరవేస్తున్నారు. డీసీఎంఎస్ ఉన్నతాధికారులు అండ పుష్కలంగా ఉండటంతో వీరి దందాకు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. సాధారణ రైతులకు సవాలక్ష ఆంక్షలు పెట్టి ఎరువులను అందించే అధికారులు వ్యాపారులకు మాత్రం అడిగిందే తడవుగా బస్తాలకు బస్తాలు సరఫరా చేస్తున్నారు. ఈ దందాపై పక్కా సమాచారం అందుకున్న ‘సాక్షి’ వీరి బండారాన్ని బయట పెట్టింది. పట్టణానికి చెందిన చిలమకూరి శంకరయ్య ఫెర్టిలైజర్ నిర్వాహకుడు డీసీఎంఎస్ ఆవరణంలో ఒక ఎడ్లబండిపై దాదాపు 50కి పైగా యూరియా బస్తాలు నింపుకుని డీసీఎంఎస్ నుండి ఫెర్టిలైజర్స్ షాపుకు తీసుకువెళ్లారు. అక్కడి నుండి ఫెర్టిలైజర్స్ షాపుకు వెళ్లిన ఎడ్లబండి నుంచి షాపులోకి అన్లోడ్ చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఏవో శ్రావణ్ కుమార్‌కు దృష్టికి సాక్షి తీసుకు వెళ్లగా విచారణ చేయిస్తామని తెలిపారు. అనంతరం షాపు యజమానిని ఎరువులు ఎక్కడి నుండి తెచ్చారని సాక్షి ప్రతినిధులు ప్రశ్నించగా సదరు షాపు యజమాని ఎదో కరువు కాలం వ్యాపారాలు లేవు. డీలర్ వద్ద కొనుగోలు చేస్తే లాభం ఉండదని జవాబిచ్చాడు. తాను మాత్రమే ఈ ఎరువులను కొనడం లేదని అందరూ చేస్తున్న వ్యాపారమే తాను చేస్తున్నానని జవాబిచ్చాడు. అంతలోనే వ్యవసాయ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి నుండి ఫోన్ రావడంతో హుటాహుటిన షాపుకు తాళం వేసి అన్లోడ్ చేసిన బస్తాలను తిరిగి డీసీఎంఎస్ కార్యాలయానికి పంపించి వేశారు. ఈ దందా ద్వారా లక్షల రూపాయలు వ్యాపారులు గడిస్తున్నారని రైతు సంఘం నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసీఎంఎస్ ద్వారా వ్యాపారులు ఓక్కో బస్తా రూ.284కు కొనుగోలు చేసి ఫెర్టిలైజర్ షాపుల ద్వారా బహిరంగ మార్కెట్లో ఒక్కో బస్తా డిమాండ్‌ను బట్టి రూ.350 నుండి 370వరకు విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన అధికారులు మాత్రం వ్యాపారుల ప్రలోభాలకు లొంగి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు చిత్తశుద్దితో పనిచేస్తే దుకాణాలు తనిఖీ చేసేటప్పుడు స్టాక్ రిజిష్టర్‌లో కూలంకషంగా పరిశీలిస్తే వీరి దందా బట్టబయలవుతుంది. పట్టణంలో ఇంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క దుకాణాదారుడిపైన వ్యవసాయ శాఖాధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. -
2015 తెస్తోంది..‘గ్రీన్’ వరి విప్లవం!
చైనా- ఐఆర్ఆర్ఐ కృషితో అందుబాటులోకి రానున్న‘గ్రీన్ సూపర్ రైస్’ వంగడాలు రసాయనిక ఎరువులు, పురుగుమందులు అక్కర్లేదు.. ఉప్పు నీరు సమస్యే కాదు.. కరువు కాలంలోనూ అధిక దిగుబడి! తగ్గనున్న సాగు వ్యయం.. పర్యావరణానికీ మేలు తెలుగునాట అధిక దిగుబడులిచ్చిన 8 ‘గ్రీన్’ వంగడాలు కొద్ది నెలల్లో ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 10 లక్షల హెక్టార్లకు విత్తనాలు అవును.. కొత్త సంవత్సరం వరి చేలల్లో బహుముఖ విప్లవమే తేబోతోంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకపోయినా.. ఉప్పునీటి తాకిడి ఉన్నా.. అంతేకాదు, కరువు మేఘాలు కమ్ముకున్నా సరే.. చీడపీడలను తట్టుకొని.. ఇప్పుడున్న వంగడాల సగటు కన్నా ఎక్కువగా (ఎకరానికి 6 టన్నులకు పైగా) దిగుబడినిచ్చే వరి వంగడాలు రాబోతున్నాయట! ఇవేవో ‘జన్యుమార్పిడి’ వంగడాలేమోననుకునేరు.. సుమా! కాదు. చైనా, ఫిలిప్పీన్స్, భారత్‌లో ప్రభుత్వరంగ సంస్థలే అందిస్తున్న, తిరిగి వాడుకోదగిన విత్తనాలే కాబట్టి రైతులకు భారం కాబోవు. వందలాది దేశవాళీ వంగడాల్లోని సద్గుణాలను నూటికి నూరుపాళ్లూ పుణికి పుచ్చుకున్న వంగడాలివి! అందుకే వీటిని ‘గ్రీన్ సూపర్ రైస్’ అని పిలుస్తున్నారు! ఇదేదో అందమైన ఊహ కాదండోయ్.. ముమ్మాటికీ నిజం. అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం జరుపుకుంటున్న 2015లో ప్రధాన ఆహార పంటైన వరి సాగును గుణాత్మక మలుపు తిప్పగల గ్రీన్ వంగడాలు అందుబాటులోకి వస్తుండడం సంతోషదాయకం. అది ఫిలిప్పీన్స్ దేశం. బొహొల్ ప్రాంతంలో ఒక వరి పొలం. ఉప్పు నీరు మాత్రమే అందుబాటులో ఉన్న ఆ పొలంలో రైతు ధైర్యంగా వరి నాటేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఎడాపెడా వర్షాలు కురిశాయి.. పంట పొట్ట దశకు పెరిగేటప్పటికి నీటి కొరత వచ్చిపడింది. పొలం బీటలు వారింది. కడదాకా చుక్క నీరు అందలేదు... అయినా ఆ పొలంలో హెక్టారుకు 3,300 కిలోల ధాన్యం పండింది! ఈ నాటకీయమైన దిగుబడి ఎలా సాధ్యమైన్నట్లు? ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా అయితే కిలో ధాన్యం కూడా చేతికి రాదు. కానీ, ‘గ్రీన్ సూపర్ రైస్’ ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన ప్రత్యేక వంగడాన్ని సాగు చేయడం వల్లనే ఈ అద్భుతం సాధ్యమైందని డాక్టర్ జాహర్ ఆలి ఇటీవల చెప్పారు. ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో సీనియర్ శాస్త్రవేత్తగా ఆయన పనిచేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడితేనే అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను ఇప్పుడు సాగు చేస్తున్నందున భూములు నిస్సారమవుతున్నాయి. నదులు, సముద్రాలు కలుషితమై మత్స్య సంపద మనుగడే ప్రశ్నార్థకమైంది. ఈ సమస్య పరిష్కారానికి రసాయనిక ఎరువులు, పురుగుమందుల్లేకుండా చక్కని దిగుబడులనిచ్చే ఈ వంగడాల వల్ల రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా భూమి, నీరు, పర్యావరణ కాలుష్యం బాగా తగ్గనుంది. ఇదీ గ్రీన్ సూపర్ రైస్ సంగతి.. వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో వరి సాగును కష్టాల నుంచి గట్టెక్కించడం కోసం ‘గ్రీన్ సూపర్ రైస్’(జీఎస్ఆర్) విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని 1998లో చేపట్టారు. చైనా అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్, ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రపంచ దేశాల నుంచి సేకరించిన 250 దేశవాళీ వరి వంగడాలు, హైబ్రిడ్లలోని మేలైన లక్షణాలను (ఇంట్రికేట్ క్రాస్‌బ్రీడింగ్, బాక్ క్రాస్‌బ్రీడింగ్ పద్ధతుల ద్వారా) ఒడిసిపట్టి కొన్ని ‘గ్రీన్’ వంగడాలను దేశ విదేశీ శాస్త్రవేత్తలు రూపొందించారు. తొలి దశలో 16 దేశాల్లో, మలి దశలో మరో 16 దేశాల్లో ‘గ్రీన్’ వంగడాల రూపకల్పన, ప్రయోగాత్మక సాగు చేపట్టారు. రెండో దశ ఇప్పుడు ముగింపు దశలో ఉంది. ఈ వంగడాలను వివిధ దేశాల్లో వీటిని పండించి చూశారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండా.. ఉప్పు నీరున్నభూముల్లో.. బెట్ట పరిస్థితుల్లో.. చీడపీడలను తట్టుకొని సగటు దిగుబడులకన్నా ఎక్కువ దిగుబడినిచ్చే విధంగా ‘గ్రీన్’ వంగడాలను రూపొందించారు. వివిధ ప్రాంతాల్లో ప్రజల రుచి, ఇష్టాఇష్టాలకు అనుగుణంగా ఉండే వంగడాలను రూపొందించామని డా. ఆలి వివరించారు. సాధారణ వరి వంగడాలు అసలు మనుగడ సాగించలేని పరిస్థితుల్లోనూ సగటుకన్నా అధిక దిగుబడినివ్వడం ‘గ్రీన్’ వంగడాల ప్రత్యేకత. వియత్నాంలో 25 వేల హెక్టార్లు, ఫిలిప్పీన్స్‌లో 5,700 హెక్టార్లలో వీటిని అనేక సీజన్ల పాటు సాగు చేయించారు. ఫిలిప్పీన్స్‌లో ఎకరానికి 6 టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రావచ్చని ఆశిస్తున్నామన్నారు. ఇలా ఉండగా, గ్రీన్ వంగడాల వార్త తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని పశ్చిమబెంగాల్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త, దేశీ వరి విత్తనాల సంరక్షకుడు డా. అనుపమ్ పాల్ పెదవి విరిచారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులతోపాటు సేంద్రియ ఎరువులూ లేకుండానే హెక్టారుకు 5-6 టన్నుల దిగుబడినిచ్చే దేశీ వరి వంగడాలు పూర్వం నుంచే మన దగ్గరున్నాయని, విస్మరణకు గురయ్యాయని ఆయన అన్నారు. ఏది ఏమైనా అనేక వంగడాల్లో సద్గుణాలతో కూడిన గ్రీన్ వంగడాల రాక కచ్చితంగా శుభపరిణామమే కదా..! - పంతంగి రాంబాబు అధిక దిగుబడులిచ్చిన 8 ‘గ్రీన్’ వంగడాలు! జీఎస్ఆర్ మలి దశ పరిశోధనల్లో హైదరాబాద్(రాజేంద్రనగర్)లోని డెరైక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కూడా పాలు పంచుకుందని ప్రాజెక్టు డెరైక్టర్(ఎ) వీ రవీంద్రబాబు ‘సాక్షి’కి వెల్లడించారు. 2011లో కొన్ని ‘గ్రీన్’ వంగడాలను స్వల్ప మోతాదులో రసాయనిక ఎరువులు వాడి అనేక చోట్ల పండించగా.. వాడుకలో ఉన్న వంగడాల కన్నా 11 ‘గ్రీన్’ వంగడాలు అధిక దిగుబడినిచ్చాయన్నారు. నత్రజని, ఫాస్ఫరస్ నిల్వలు తక్కువగా ఉన్న భూముల్లోనూ దిగుబడి బాగుందన్నారు. వీటిలో నుంచి మేలైన 8 వంగడాలను ఎంపికచేసి మళ్లీ పండిస్తున్నామన్నారు. చౌడు, క్షార గుణం కలిగిన భూముల్లోనూ ఒక వంగడం సాగవుతోందని డా రవీంద్రబాబు తెలిపారు. ఈ వంగడాలు 2015 ఏప్రిల్ నాటికి సిద్ధమవుతాయన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి గ్రీన్ వంగడాలు మన రైతులకూ అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు. -
సాగుకు సహకరించని 2014
కాలగర్భంలో మరో ఏడాది గడిచిపోతోంది.. క్షణాలు గంటలై.. గంటలు రోజులై.. రోజులు నెలలై.. నెలలు సంవత్సరమై.. 2014కు కూడా బైబై చెప్పనున్నాం. గతం గతః అనుకుం టే.. ఆ గతంలోని తీపి, చేదు జ్ఞాపకాలెన్నో.. అందులోనూ ఈ ఏడాది రైతన్నకు కలిసిరాలేదు. ఆరంభంలోనే.. విత్తనాలు, ఎరువులు అందక, కరెంటు ‘కట్’కట, రుణాల కోసం రణం చేసినా.. చివరికి యెవుసం ఏడిపించింది. వ్యయప్రయాసాలకోర్చి సాగు చేసిన పంటలను వర్షాభావం కోలుకోకుండా చేసింది. వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే ప్రభుత్వ ‘మద్దతు’ లేక.. దళారుల దందా తట్టుకోలేక.. చివరికి రైతన్న ‘చితి’కి పోయాడు. ఆరుగాలం కష్టపడే అన్నదాతకు అడుగడుగునా అరిగోసే. దుక్కులు దున్నాలన్నా వేలకు వేలు ఖర్చులు. ఆ దుక్కులు తడవాలంటే ఆకాశం వైపు చూపులు. విత్తనాలు కొనాలంటే కల్తీ బాధలు. అవి విత్తాలంటే తట్టుకోలేని కూలి రేట్లు. రేట్లు పెట్టినా ఒక్కోసారి దొరకని కూలీలు. అక్కడితో ఆగకుండా.. విత్తిన విత్తనాలు మొలకెత్తక.. మొలకెత్తిన మొక్కలకు నీటి తడులు అందక.. వానలు పడక.. కరెంటు సరఫరాలు సరిపడా లేక.. ఇలా వేసిన పంట వేసినట్లుగానే ఎండిపోయి.. నష్టాలను మిగిల్చి.. అన్నదాతను కష్టాల కడలిలో ఉంచే వెళ్లిపోతోంది... 2014. ఈ ఏడాదంతే అన్నదాతకు కలిసిరాలేదు. జిల్లాలో గతేడాది అతివృష్టి తీవ్రంగా నష్టపరిస్తే ఈ ఏడాది అనావృష్టితో వ్యవసాయం కరువు కోరల్లో చిక్కుకుంది. ఖరీఫ్‌లో వర్షాలు కురవలేదు. పంటలు నిలవలేదు. నిలిచిన పంటలకు నీటి తడులు అందక చివరికి పశువులకు మేత అయ్యాయి. ఇక రబీ సాగు అన్న మాటే లేదు. విత్తనాలు, ఎరువుల కోసం ఆందోళన ప్రభుత్వం 33 శాతం రాయితీపై సోయా, వరి, ఇతర పప్పుధాన్యాల విత్తనాలు అందజేశారు. ఖరీఫ్ ఆరంభంలో జిల్లాకు 20 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు(450 గ్రాముల ప్యాకెట్) అవసరం కాగా, 17 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందాయి. జూన్‌లో వర్షాలు కురువకపోవడంతో 10 లక్షల ప్యాకెట్లు మాత్రమే రైతులు కొనుగోలు చేశారు. రెండు నెలలు ఆలస్యంగా వర్షాలు కురవడంతో రెండు, మూడుసార్లు విత్తనాలు విత్తుకున్నారు. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో విత్తుకోవడానికి విత్తనాలు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. ఆలస్యంగా కురిసిన వర్షాలతో మొదట వేసుకున్న విత్తనం, ఎరువులు యూరియా, డీఏపీ, పొటాష్ వ ృథాగా పోయాయి. తిరిగి రెండోసారి విత్తుకునేందుకు విత్తనాలు, ఎరువులు దొరక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా యూరియా, డీఏపీ దొరకక పలు మండలాల్లో రైతులు ఆందోళన బాటపట్టారు. పంటకు నీరందని దైన్య స్థితి జూలైలో మొదటిసారి వేసుకున్న విత్తనాలు మొలకెత్తలేదు. ఆగస్టు రెండో వారం నుంచి మరోసారి విత్తనాలు వేసుకున్నారు. మళ్లీ ఆశించిన వర్షాలు కురువలేదు. చిరుజల్లులతో మొలకెత్తిన విత్తనాలను కాపాడుకోవడానికి అన్నదాతలు పడరాని పాట్లు పడ్డారు. వర్షాల జాడలేకపోవడంతో నీరసించిన రైతన్న మొలకలు బతికించుకునేందుకు నీటిని అందివ్వడానికి దూర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్ల ద్వారా డ్రమ్ముల్లో నీటిని తీసుకొచ్చి కుండల ద్వారా కూలీలను పెట్టి మొలకకు నీరు పోశారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 9 వరకు వర్షాలు కురవడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. పంటలపై ఆశలు వదులుకున్న రైతులు మరోసారి వారి సహనాన్ని పరీక్షించుకునేందుకు తిరిగి మూడోసారి పంటలు విత్తుకున్నారు. పత్తి, సోయాబిన్ పంటలు వేశారు. అప్పటికే వరి విత్తనాలు వేసుకొని నారుమళ్లలో పశువులను వదిలారు. వరి నాట్లు వేసుకునే సమయం దాటిపోయినా కొంతమంది రైతులు మళ్లీ ఏదో చిరు ఆశతో నారు అలికి వరినాట్లు ఆలస్యంగా సెప్టెంబర్‌లో వేసుకున్నారు. కానీ ఫలితం అంతంతే. గ తేడాదితో పోల్చితే వరిసాగు 60 శాతం తగ్గింది. ఖరీఫ్‌కు అందని రుణాలు.. ఖరీఫ్ ఆరంభం నుంచి రుణాల విషయంలో గందరగోళం నెలకొంది. జూన్‌లో పంట పెట్టుబడి విత్తనాలకు ఎరువులకు అయ్యే ఖర్చుల కోసం ఎదురు చూశారు. మాఫీ, కొత్త రుణాలు మంజూరు విషయంలో స్పష్టత రాకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పలు చేశారు. గతేడాది 2013-14లో రూ.1,421 కోట్ల రుణాలు 3,16,542 మంది రైతులకు అందించారు. ప్రతి ఏడాది గ్రామీణ బ్యాంకుల్లో ఏప్రిల్ నెలలోనే రుణాలు ఇవ్వడం మొదలవుతాయి. కానీ ఈ ఏడాది ఆగస్టు వరకు కూడా రైతుల చేతికి చిల్లిగవ్వ కూడా అందలేదు. ఈ ఏడాది రూ.2,228 కోట్లని 3.20 లక్షల మంది రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.600 కోట్లు పెంచినా, ఖరీఫ్ సమయం ముగిసినా రైతులకు చేతికి అందకపోవడం గమనార్హం. రుణమాఫీలో 25 శాతం మొదటి విడతగా బ్యాంకర్లకు అందజేయగా.. కొత్త రుణాలివ్వకండా పాత బకాయిలను అందులోంచి తీసుకున్నారు. చివరికి వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఖరీఫ్, రబీ కలిపి 2,41,849 మంది రైతులకు రూ.1,164 కోట్లు రుణం ఇచ్చారు. ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1,693 కోట్ల 74 లక్షలు కాగా, రబీలో రూ.534 కోట్ల 86 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ రబీ సాగు చేసే పరిస్థితి లేదు. కొనుగోలు ఆరంభం అధోగతి పత్తి కొనుగోళ్లు గతేడాది కంటే ముందే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 20న జిల్లాలోని 19 వ్యవసాయ మార్కెట్ యార్డులకు గాను 6 కేంద్రాల్లో ప్రారంభించారు. ప్రభుత్వ మద్దతు ధర తో కొనుగోలు చేయాలని ప్రభుత్వం అదేశాలు ఉన్న సీసీఐ నిరాకరించడంతో ఆరంభంలోనే అధోగతి పాలైంది. పత్తిని ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ తేమ పేరిట కొర్రీలు విధిస్తూ కొనుగోలుకు నిరాకరించడంతో ప్రైవేట్ వ్యాపారులను రైతులు ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువగా క్వింటాలుకు రూ.3,200 నుంచి రూ.3,400 వరకు చెల్లిస్తామనడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. కనీసం మద్దతు ధర కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో ఆందోళనకు దిగారు. కలెక్టర్ స్పందించ... సీసీఐ అధికారలు, వ్యాపారులతో చర్చలు జరిపి మొదటి రోజు నామామత్రంగా రెండు వాహనాల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు. మరుసటి రోజు నుంచి సీసీఐ తేమ శాతంలో కొంత సడలింపుతో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ నుంచి పత్తి, నవంబర్ నుంచి సోయా కొనుగోళ్లు జరుగుతున్నాయి. -
లక్షన్నరకు 1,200లే మాఫీ
మార్కాపురం: పంటల సాగు కోసం బంగారం తాకట్టుపెట్టి బ్యాంకులో లక్షన్నర రుణం తీసుకుంటే.. కేవలం రూ.1,200 మాత్రమే రుణమాఫీ కావడంతోనూ, అప్పుల బాధ వల్లా మనస్తాపానికి గురైన ప్రకాశం జిల్లాకు చెందిన కౌలు రైతు పిన్నిక అచ్చయ్య (53) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు.. మార్కాపురం పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన అచ్చయ్య అమ్మవారిపల్లెలో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి, పత్తి, మిర్చి పంటలు వేశాడు. పెట్టుబడి, ఎరువులు వంటి అవసరాల కోసం పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం తాకట్టు పెట్టి రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. తెలిసినవారి దగ్గరనుంచి మరో రూ.3 లక్షలు అప్పుతీసుకుని సాగు చేశాడు. అయితే విధి అతనికి సహకరించలేదు. బోర్లలో నీళ్లు రాక పంటలు వాడు ముఖం పట్టడంతో అప్పులెలా తీర్చాలనే దిగులు పెరిగిపోయింది. చంద్రబాబునాయుడు లక్షన్నర లోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాననడంతో.. బ్యాంకు రుణమైనా తీరుతుందని ఇన్నాళ్లూ కాస్త ఆశగా ఎదురుచూశాడు. కానీ రుణమాఫీలో ప్రభుత్వ మాయాజాలానికి ఇతనూ బలైపోయాడు. లక్షన్నర రుణంలో కేవలం రూ.1,200 మాత్రమే మాఫీ కావడాన్ని తట్టుకోలేకపోయాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఇంట్లోంచి వెళ్లిన అతను ఆదివారం దరిమడుగు జెడ్పీ హైస్కూల్ సమీపంలో శవమై కన్పించాడు. మార్కాపురం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తూటి కషాయంతో చీడ పీడలు దూరం
శక్తిమంతమైన కీటకనాశినిగా గుర్తించిన విదర్భ కేవీకే వ్యవసాయ పెట్టుబడిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులదే సింహ భాగం. వాతావరణంలో విపరీత మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో పైరు పెట్టడం కంటే దాన్ని కాపాడుకోవడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ రంగంలోని సృజనశీలురు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలూ ఈ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తూటేరు (ఇంపోమియా ఫిస్టులోసా) లేదా తూటి ఆకుల కషాయం శక్తివంతమైన కీటకనాశినిగా గుర్తించారు. తూటేరును లొట్టపీచు, కాంగ్రెస్ కంప, బేషరమ్ అని కూడా తూటి మొక్కను పిలుస్తారు. కంది, మినుము, పత్తి, క్యాబేజీ, క్యాలి ఫ్లవర్, వంగ తదితర పురుగుల బెడద ఎక్కువగా ఉండే అన్ని పంటల సస్యరక్షణకు ఈ కషాయం వాడుతూ సత్ఫలితాలను పొందుతున్నారు. క్యాబేజీ పంటను తీవ్రంగా నష్టపరిచే డైమండ్ బ్యాక్ మాత్పై తూటేరు కషాయం పిచికారీ చేస్తే పంట నష్టం కేవలం 2 నుండి 3 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అయితే, రసాయనిక పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు పంట నష్టం దాదాపు 11 నుంచి 12 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. దీంతో తూటేరు కషాయ వినియోగం విదర్భ ప్రాంతం అంతటా వ్యాపించింది. కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్ల తోటలు సాగుచేసే రైతులు దీన్ని వినియోగిస్తున్నారు. ఆ ప్రాంత రైతుల సామూహిక ప్రయోగాల ఫలితంగా తూటేరు కషాయం పత్తిలో కాయతొలిచే పురుగు, శనగపచ్చ పురుగు, తలనత్త పురుగు, పచ్చపురుగు, రాగిలద్దె పురుగు, డైమండ్ బ్యాక్ మాత్, గొంగళి పురుగు, ముక్కుపురుగులను కాండం తొలిచే పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను నివారించడానికి శక్తివంతంగా పనిచేస్తోందని తేలింది. తూటి కషాయం తయారీ విధానం: ఒక కిలో తూటేరు లేత ఆకులను సేకరించాలి. ఆకులను మెత్తటి ముద్దగా నూరి.. 10 లీటర్ల నీటిలో వేసి 5 లీటర్లకు తగ్గే వరకు మరిగించాలి. కుండలో మిగిలిన కషాయానికి మరో అర కిలో తూటేరు ఆకుల ముద్దను కలిపి.. కషాయం సగానికి తగ్గే వరకు మరిగించాలి. కుండలో మిగిలిన 2.5 లీటర్ల కషాయాన్ని చల్లారనిచ్చి వడకట్టుకోవాలి. 2.5 లీటర్ల కషాయాన్ని 200 లీటర్లలో కలపాలి. లీటరు కషాయానికి 0.5 మిల్లీ లీటర్ల చొప్పున ఎమల్సిఫయర్ను కలిపిన తర్వాత పిచికారీ చేసుకోవాలి. -
ఎరువు.. ‘ధర’వు..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ‘మూలిగె నక్కపై తాటికాయ పడ్డ’ చందంగా.. రైతున్నలకు ప్రభుత్వాలు షాక్‌ల మీద షాక్లనిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కనికరించని ప్రకృతి.. ఆదుకోని కరెంటుతో అన్నదాతలు కష్టాల సాగును నెట్టుకొస్తున్నా.. చివరికి వారికి మిగిలేది అప్పులే. మద్దతు ధర లేక.. మార్కెట్లలో దళారుల దోపిడీతో ఏటా నష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ఖరీఫ్‌లో పూర్తిగా నష్టపోయిన రైతులకు రబీ సాగు మరింత భారం కానుంది. తాజాగా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పది శాతం పెరగడంతో ఆ భారం కోట్లకు చేరింది. ఇప్పటివరకు 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,192 ఉండగా.. పెంచిన ధరతో రూ.1,249కి చేరింది. కాంప్లెక్స్ పాత ధర రూ.919 ఉండగా.. కొత్త ధరతో రూ.955కు విక్రయించనున్నారు. పలు కంపెనీల ఆధారంగా ధరల్లో హెచ్చుతగ్గుతో సరాసరి రూ.50 నుంచి రూ.60 వరకు పెరగనున్నాయి. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం.. ఖరీఫ్ రబీ సాగు కలిపి 20,445 మెట్రిక్ టన్నుల డీఏపీ, 15,214 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ అవసరం పడుతుంది. డీఏపీ ఎరువుకు రూ.48 కోట్లు 25 లక్షల 18 వేలు కాగా, కాంప్లెక్స్‌కు రూ.33 కోట్ల 59 లక్షల 66 వేలు ఇది వరకు చెల్లించారు. పెంచిన ధరతో డీఏపీకి రూ.50 కోట్ల 62 లక్షల 18 వేలు, కాంప్లెక్స్‌కు రూ.34 కోట్ల 59 లక్షల 66 వేలు చెల్లించాలి. దీంతో రైతులపై ఏటా రూ.4 కోట్ల వరకు భారం పడనుంది. ఈ ధరల పెంపుతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కంపెనీలు ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలను పెంచుతున్నా.. తాము పండించిన ధాన్యానికి మాత్రం ప్రభుత్వం మద్దతు ధరలు కల్పించడం లేదం టూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు ధరల నియంత్రణలో విఫలమవడంతోనే ఏటా సాగు భారం పెరుగుతోందని దుయ్యబడుతున్నారు. రబీలో 90,100 వేల హెక్టార్ల సాగు లక్ష్యం.. వచ్చే రబీలో మొత్తం 90,100 వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వే శారు. వరి 25 వేల హెకా ర్లు, జొన్న 22 వేల హెక్టార్లు, మొక్కజొన్న 6,500, శెనగ 36 వేలు, పొద్దు తిరుగుడు 5,800, నువ్వులు 5,200, వేరుశనగ 5,500, పెసర 3,100, గోధుమ 5,500 హెక్టార్లలో సాగవుతాయని అంచనా వేశారు. ఈసారి కరువు నేపథ్యంలో అంత మేరకు సాగయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. ఇప్పటికే ఖరీఫ్‌లో నిం డా మునగడం.. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం.. మద్దతు ధర దక్కకపోవడం.. వెరసి సాగుకు వెళ్లేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ సీజన్‌కు ప్రాజెక్టుల నుంచి కూడా నీరు ఇవ్వని పరిస్థితి ఉంది. -
చెరువులు తవ్వితే చేనంతా వెలుగే
ఎకరానికి 40 ట్రాక్టర్లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. పుష్కర కాలం సాగిన పోరా టం తరువాత ఏర్ప డిన తెలం గాణ రాష్ట్ర సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడానికి ప్రభు త్వం దృష్టి కేంద్రీకరించింది. 3.6 కోట్ల తెలంగాణ ప్రజల ఆహార, వ్యవసాయ అవసరా లను తీర్చడానికి సమస్త శక్తులు కేంద్రీకరించి రాష్ట్రంలో చెరువుల మీద సర్వే చేయిం చింది. 45,300 చిన్న నీటి వనరులు, చెరువులు, కుంటలు ఉన్నట్టు లెక్కతేలింది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలంగాణలోని చెరు వుల, కుంటల పూడికతీత, దాని వినియోగం అం శం మీద పరిశోధన చేయడానికి మిచిగన్ విశ్వ విద్యాలయం (అమెరికా) ముగ్గురు విద్యార్థులు, ఫ్రీడమ్ సంస్థ ఈ ఆగస్ట్‌లో నల్లగొండ జిల్లాలోని 33 గ్రామాలను సందర్శించారు. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనాయి. చెరువులలో పూడిక తీసిన గ్రామాలకు చెందిన 700 మంది రైతులను వారు కలుసుకున్నారు. స్థాని కులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి పంట ఉత్పత్తి పెరుగుదల, భూగర్భ నీటిమట్టం పెరుగుదల, రసాయనిక, పురుగు మందుల వాడకం తగ్గుదల వంటి అంశాలు ఈ ప్రక్రియలో ప్రధానంగా ఉన్నట్టు విద్యార్థులు గమనించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మెట్ట భూముల పరిశోధన సంస్థ పూడిక మట్టిని పరిశోధించింది. రాష్ట్ర వ్యవసాయ, అటవీ, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల మంత్రు లకు, ఇతర అధికారులకు కూడా ఈ పరిశోధనల గురించి విద్యార్థులు తెలియజేశారు. 1,500 కిలోల తలసరి కర్బన ఉద్గారాలతో, ప్రపంచ సగటుకు భారతదేశం దిగువనే ఉన్నం దున, చెరువుల పూడిక ద్వారా రసాయనిక ఎరు వులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించు కోవచ్చు. అలాగే భూగర్భ జలమట్టాన్ని పెంచి, బోర్ బావులకు ఇస్తున్న సబ్సిడీ విద్యుత్ విని యోగాన్ని తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి పూడికతీత ఖర్చులో సుమారు 30 శాతానికి పైగా కార్బన్స్ క్రెడిట్స్ రూపేణా పారిశ్రామిక దేశాల నుంచి తిరిగి రాబట్టుకోవచ్చని మిచిగాన్ విద్యా ర్థులు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు వివరించారు. దహగామ ఆదిత్య (స్టూడెంట్ గవర్న మెంట్ అధ్యక్షుడు), జాన్ మానెట్, లియాన్ ఎన్ పెరా బృందం పూడిక తీతతో కలిగే ప్రయోజనాలను వర్గీకరించి చెప్పారు. అం దులో ముఖ్యమైనవి- ఎకరానికి 40 ట్రాక్టర్లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. అధికోత్పత్తితో ప్రతి ఎకరా సాగు భూమికి అదనం గా 60 మానవ పనిదినాలను పెంచవచ్చు. తక్కు వైన స్థూల, మధ్య సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా సాగు భూమికి అందజేసి ఎరువులు, పురుగు మం దుల వినియోగంలో 80 శాతం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. తెలంగాణలోని 10 జిల్లాల్లోని 45,300 చెరువు లలో ఉన్న పూడిక మట్టిని తొలగించినట్లయితే అదనపు భూసేకరణ ఖర్చులు, చట్టపరమైన పేచీలు, జాప్యాలు లేకుండానే మూడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు సమానమైన నీటిని అదనంగా పొం దవచ్చు. ఉపరితల అదనపు నీటి పారుదల అవకాశాన్ని, ఇప్పుడున్న దానికి రెండింతలకు పెం చవచ్చు. అదనపు భూగర్భ జల మొత్తాన్ని పెం చవచ్చు. మునుగోడు మండలంలోని మెల్మకన్నె గ్రామంలో మూడు సంవత్సరాలలో తీసిన 50 వేల ట్రాక్టర్ల పూడిక మట్టిని 1,200 ఎకరాల సాగు భూమిలో వేసుకున్నారు. ఈ కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయల అదనపు ఫలసాయాన్ని వారు పొందారు. పర్యవసానంగా 140 అడుగుల తోతున ఉన్న భూగర్భ జలాలు 30 అడుగుల పైకి ఉబికి వచ్చాయి. విద్యుత్ వినియోగం మీద ఒత్తిడిని బాగా తగ్గింది. రెండవ పంట గగనమై ఊహించడానికి అవకాశం లేని పరిస్థితులలో పంటలకు సమృద్ధిగా సాగు నీరు లభించింది. దహగామ ఆదిత్య బృందం చేసిన విశ్లేషణలో ఒకే ఒక్కసారి యంత్రాలతో, ట్రాక్టర్లతో పూడిక తీసిన అనంతరం గ్రామీణ ఉపాధి హామీ పథకం సాలీనా సగటున ఇవ్వగలిగిన 42 పని దినాలకంటే రెట్టింపుగా 100 శాతం గ్రామీణ ఉపాధి అవకాశాలు మానవ పనిదినాలు పెరిగినట్లు, అదే పెట్టుబడి మొత్తానికి సమకూరినట్లుగాను వెల్లడైంది. 100 రోజుల ఉపాధిహామీ పథకానికి కేటాయించిన బడ్జె ట్ ఒక్కరికి 10 వేల రూపాయలు. లభ్యమైన దేశీయ సగటు పనిదినాలు ఒకరికి 42 మాత్రమే. తర్వాత ఉపాధి హామీ అవసరం లేకుండానే అధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఎరువుల, పురుగు మం దుల వాడకంలో ఆదాను భూగర్భ నీటి మట్టంలో పెరుగుదలను, విద్యుత్ వినియోగంలో తగ్గింపును, ఫ్లోరోసిన్ నివారణను ఏకకాలంలో సాధించగలదు. నిర్లక్ష్యానికి గురైన రైతుల ఆత్మ హత్యలను నివారిం చి, విలువైన రైతుల ప్రాణాలను కాపాడగలదు. (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నాయకుడు) -
చెరువులు తవ్వితే చేనంతా వెలుగే
ఎకరానికి 40 ట్రాక్టర్లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. పుష్కర కాలం సాగిన పోరాటం తరువాత ఏర్ప డిన తెలంగాణ రాష్ట్ర సాగు, తాగు నీటి అవస రాలను తీర్చడానికి ప్రభు త్వం దృష్టి కేంద్రీకరిం చింది. 3.6 కోట్ల తెలం గాణ ప్రజల ఆహార, వ్యవ సాయ అవసరాలను తీర్చడానికి సమస్త శక్తులు కేంద్రీకరించి రాష్ట్రంలో చెరువుల మీద సర్వే చేయిం చింది. 45,300 చిన్న నీటి వనరులు, చెరువులు, కుంటలు ఉన్నట్టు లెక్కతేలింది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలంగాణలోని చెరువుల, కుంటల పూడిక తీత, దాని వినియోగం అంశం మీద పరిశోధన చేయడానికి మిచిగన్ విశ్వ విద్యాలయం (అమెరికా) ముగ్గురు విద్యార్థులు, ఫ్రీడమ్ సంస్థ ఈ ఆగస్ట్‌లో నల్లగొండ జిల్లాలోని 33 గ్రామాలను సందర్శించారు. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనాయి. చెరువులలో పూడిక తీసిన గ్రామాలకు చెందిన 700 మంది రైతులను వారు కలుసుకున్నారు. స్థాని కులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి పంట ఉత్పత్తి పెరుగుదల, భూగర్భ నీటిమట్టం పెరుగుదల, రసాయనిక, పురుగు మందుల వాడకం తగ్గుదల వంటి అంశాలు ఈ ప్రక్రియలో ప్రధానంగా ఉన్నట్టు విద్యార్థులు గమనించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మెట్ట భూముల పరిశోధన సంస్థ పూడిక మట్టిని పరిశోధించింది. రాష్ట్ర వ్యవసాయ, అటవీ, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల మంత్రు లకు, ఇతర అధికారులకు కూడా ఈ పరిశోధనల గురించి విద్యార్థులు తెలియజేశారు. 1,500 కిలోల తలసరి కర్బన ఉద్గారాలతో, ప్రపంచ సగటుకు భారతదేశం దిగువనే ఉన్నం దున, చెరువుల పూడిక ద్వారా రసాయనిక ఎరు వులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించు కోవచ్చు. అలాగే భూగర్భ జలమట్టాన్ని పెంచి, బోర్ బావులకు ఇస్తున్న సబ్సిడీ విద్యుత్ విని యోగాన్ని తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి పూడికతీత ఖర్చులో సుమారు 30 శాతానికి పైగా కార్బన్స్ క్రెడిట్స్ రూపేణా పారిశ్రామిక దేశాల నుంచి తిరిగి రాబట్టుకోవచ్చని మిచిగాన్ విద్యా ర్థులు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు వివరించారు. సుస్థిర అభివృద్ధికి ఈ పూడిక తీత ప్రాజెక్టు చరిత్రలో ఒక గొప్ప నమూనాగా నిలిచిపో గలదని కూడా వారు వివరించారు. దహగామ ఆదిత్య (స్టూడెంట్ గవర్నమెంట్ అధ్యక్షుడు), జాన్ మానెట్, లియాన్ ఎన్పెరా బృందం పూడిక తీతతో కలిగే ప్రయోజనాలను వర్గీకరించి చెప్పారు. అందులో ముఖ్యమైనవి- ఎకరానికి 40 ట్రాక్టర్లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. అధికోత్పత్తితో ప్రతి ఎకరా సాగు భూమికి అదనం గా 60 మానవ పనిదినాలను పెంచవచ్చు. తక్కు వైన స్థూల, మధ్య సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా సాగు భూమికి అందజేసి ఎరువులు, పురుగు మం దుల వినియోగంలో 80 శాతం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. తెలంగాణలోని 10 జిల్లాల్లోని 45,300 చెరువు లలో ఉన్న పూడిక మట్టిని తొలగించినట్లయితే అదనపు భూసేకరణ ఖర్చులు, చట్టపరమైన పేచీలు, జాప్యాలు లేకుండానే మూడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు సమానమైన నీటిని అదనంగా పొం దవచ్చు. ఉపరితల అదనపు నీటి పారుదల అవకాశాన్ని, ఇప్పుడున్న దానికి రెండింతలకు పెం చవచ్చు. అదనపు భూగర్భ జల మొత్తాన్ని పెం చవచ్చు. మునుగోడు మండలంలోని మెల్మకన్నె గ్రామంలో మూడు సంవత్సరాలలో తీసిన 50 వేల ట్రాక్టర్ల పూడిక మట్టిని 1,200 ఎకరాల సాగు భూమిలో వేసుకున్నారు. ఈ కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయల అదనపు ఫలసాయాన్ని వారు పొందారు. పర్యవసానంగా 140 అడుగుల తోతున ఉన్న భూగర్భ జలాలు 30 అడుగుల పైకి ఉబికి వచ్చాయి. విద్యుత్ వినియోగం మీద ఒత్తిడిని బాగా తగ్గింది. రెండవ పంట గగనమై ఊహించడానికి అవకాశం లేని పరిస్థితులలో పంటలకు సమృద్ధిగా సాగు నీరు లభించింది. ప్రతి క్యూబిక్ మీటర్ చెరువు మట్టికి సమా నంగా సృష్టించిన అదనపు వెయ్యి లీటర్ల నీటి పరి మాణానికి అనుగుణంగా కనీసం ఒక కేజీ నుంచి గరిష్టంగా 2 కేజీల వరకు చేపల ఉత్పత్తిని సాధిం చవచ్చని జాతీయ చేపల పెంపకం అభివృద్ధి సంస్థ తెలియజేస్తుంది. దహగామ ఆదిత్య బృందం చేసిన విశ్లేషణలో ఒకే ఒక్కసారి యంత్రాలతో, ట్రాక్టర్లతో పూడిక తీసిన అనంతరం గ్రామీణ ఉపాధి హామీ పథకం సాలీనా సగటున ఇవ్వగలిగిన 42 పని దినాలకంటే రెట్టింపుగా 100 శాతం గ్రామీణ ఉపాధి అవకాశాలు మానవ పనిదినాలు పెరిగినట్లు, అదే పెట్టుబడి మొత్తానికి సమకూరినట్లుగాను వెల్లడైంది. 100 రోజుల ఉపాధి హామీ పథకానికి కేటాయించిన బడ్జెట్ ఒక్కరికి 10 వేల రూపాయలు. లభ్యమైన దేశీయ సగటు పని దినాలు ఒకరికి 42 మాత్రమే. తర్వాత ఉపాధి హామీ అవసరం లేకుండానే అధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఎరువుల, పురు గు మందుల వాడకంలో ఆదాను భూగర్భ నీటి మట్టంలో పెరుగుదలను, విద్యుత్ వినియోగంలో తగ్గింపును, ఫ్లోరోసిన్ నివారణను ఏకకాలంలో సాధించగలదు. నిర్లక్ష్యానికి గురైన రైతుల ఆత్మ హత్యలను నివారించి, విలువైన రైతుల ప్రాణాలను కాపాడగలదు. (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నాయకుడు) నైనాల గోవర్ధన్ -
తెల్ల బంగారానికి తెగుళ్ల దెబ్బ
ఆకాశాన్నంటిన ఎరువులు, క్రిమిసంహారక మందులతో సతమతమవుతున్న పత్తి రైతుకు పిండి నల్లి, ఇతర తెగుళ్లు కూడా భయపెడుతున్నాయి. ఇప్పటి వరకు పత్తి పంటకు దాదాపు రూ.15 నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా కాయ దశకు చేరుకునే సమయంలో తెగుళ్లు ఆశించడంతో దిగులు పట్టుకుంది. గిద్దలూరు సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో దాదాపు 10,500 హెక్టార్లలో పత్తి పంట సాగుచేశారు. పంట సాగుచేసినప్పటి నుంచి పత్తి రైతులను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. పది రోజుల కిందటి వరకు వర్షాభావ పరిస్థితులతో పంట ఎదుగుదల లేక దిగుబడి తగ్గింది. అనంతరం కురిసిన వర్షాలతో కలుపు మొక్కలు పెరిగి పెట్టుబడి భారం పెరిగింది. వర్షం నిలిచిపోయిన తరుణంలో తిరిగి పత్తి పంటకు దోమ పోటు, పిండినల్లి సమస్య తీవ్రమైంది. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఉధృతి తగ్గడం లేదని రైతులు తెలిపారు. ఈ ఏడాది పత్తి పంట దిగుబడి సగానికిపైగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లతో మొక్క పెరుగుదల నిలిచిపోయి వచ్చిన పూత, పిందెలు రాలిపోతున్నాయి. నివారణకు ఇవీ సూచనలు : పచ్చదోమ నివారణకు థయోమితాక్జిన్ లేదా, ఎసిటమిప్రైడ్ మందుల్లో ఏదో ఒకదానిని లీటరు నీటిలో 0.2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్‌ను 10 లీటరు నీటికి 6 నుంచి 10 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చని వ్యవసాయ అధికారి జి.మీరయ్య సూచించారు. పిండి నల్లి నివారణకు లీటరు నీటికి 3 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేస్తే పూర్తిగా నివారించవచ్చన్నారు. ఆకులు ఎర్రగా మారినట్లు కనిపిస్తే అందుకు కిలో మెగ్నీషియం సల్ఫేట్‌ను పిచికారీ చేయాలన్నారు. -
యూరియా....అంతా మాయ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో రైతులకు యూరియా అందని ద్రాక్షగా మారింది. సాగువిస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయినా యూరియా మాత్రం రైతుల దరికి చేరడం లేదు. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు స్వామి భక్తి ప్రదర్శిస్తూ తెలుగుదేశం ఆధీనంలో ఉన్న సైటీలకు మాత్రమే యూరియా సరఫరా చేస్తున్నారు. దీంతో అవసరమైన రైతులకు యూరియా అందే పరిస్థితి లేకుండా పోయింది. వ్యవసాయ సాగు అంతంత మాత్రంగా ఉన్న సీజన్లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాగు వర్షాభావ పరిస్థితుల వల్ల సగానికి పడిపోయిన సంగతి తెలిసిందే. వ్యవసాయ శాఖ అంచనాలతో చూసినా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. అలాంటప్పుడు ఎరువులు అందుబాటులో ఉండటం సహజం. కానీ జిల్లాలో ఇందుకు విరుద్దంగా జరుగుతోంది. పంటల సాగు తగ్గినా, రైతులకు అదనులో యూరియా దొరకడం లేదు. గత వారం రోజులుగా వరుణుడు కరుణిస్తున్నాడు. గత రెండు రోజులుగా జిల్లాలో సగటున 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. దీంతో పంటలను కాపాడుకోవడం కోసం రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ శాఖ అవినీతి, ఎరువుల వ్యాపారుల దోపిడీతో రైతులకు అందని పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు తొమ్మిది కంపెనీల నుంచి ఎరువులు సరఫరా అవుతాయి. రైల్వే ర్యాకుల ద్వారా వచ్చే ఎరువులు మాత్రమే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా వెళ్తుండగా, రోడ్డు మార్గం గుండా వచ్చే ఎరువులకు లెక్క ఉండటం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు అడిటింగ్ చేసిన తర్వాతే రైతులకు ఎరువులు సరఫరా చేయాల్సి ఉండగా దీనికి భిన్నంగా జరుగుతోంది. ఒంగోలులో డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 25 నుంచి 30 రూపాయలు ఎక్కువకు డీలర్లకు ఇవ్వడంతో దానిపై 50 రూపాయల వరకూ వేసుకుని అమ్ముతున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఒక్కో బస్తాపై 50 నుంచి వంద రూపాయల వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. మామూళ్ల మత్తులో కూరుకుపోయిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మరోవైపు అధికారులు తమ స్వామిభక్తిని ప్రదర్శిస్తూ సొసైటీలకు ఎరువుల కేటాయింపుల్లో పక్షపాతం చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధ్యక్షులుగా ఉన్న సొసైటీలకు యూరియా కేటాయించకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్న సొసైటీలకు కేటాయిస్తున్నారు. దీనిపై నిరసన వెల్లువెత్తుతోంది. సహకార సంఘాలకు ప్రాధాన్యమిస్తూ ఎరువుల విక్రయాల కేటాయింపులు జరపాల్సిన వ్యవసాయ శాఖకు ఇవేమీ పట్టడం లేదు. జిల్లా వ్యవసాయ అధికారులను సంతృప్తి పరిచిన డీలర్లకు, అధికార పక్షానికి చెందిన డీలర్లకు మాత్రమే ఎరువులు అధికంగా కేటాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లారీకి రెండు వేల రూపాయల వరకూ డీలర్లు చెల్లించుకోవాల్సి వస్తోందని సమాచారం. నవంబర్‌లో 16,786 బస్తాల యూరియా అవసరం కాగా అసలు ఎంత స్టాక్ ఉందో వ్యవసాయ శాఖ అధికారులకే తెలియని పరిస్థితి. మరోవైపు యూరియా అక్రమాలపై డీలర్లు అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అయన వెంటనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులో మాట్లాడుతూ పద్దతి మార్చుకోకపోతే రైతుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కురిచేడులో రైతుల పాట్లు గత నెల రోజులుగా యూరియా జిల్లాకు రాకపోవటంతో రైతులు తల్లడిల్లిపోయారు. సోమవారం మండలంలోని కురిచేడు సొసైటీకి ఒక్క లారీ నాగార్జున యూరియా రావటంతో రైతులు ఎగబడ్డారు. వారిని అదుపు చేయటం అధికారులకు తలకుమించిన భారమైంది. మండలంలో 17 ఎరువుల కొట్లు,ఒక గ్రోమోర్ ఉన్నా మండల రైతులకు యూరియా అందించటంలో పూర్తిగా విఫలమయ్యాయి.దీంతో లారీ వచ్చిన సమయంలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపు చేయాల్సి వచ్చింది. -
ఎరువులకోసం తోపులాట
లక్కవరం పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత అమ్మకం నిలిపివేత యలమంచిలి: పుడమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలతో నిండా మునుగుతున్న అన్నదాతలకు ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. హుదూద్ తుపాను ధాటికి సగానికిపైగా పంటలు కోల్పోయిన రైతులు మిగిలిన కొద్దిపాటి పంటలను బాగు చేసుకునేందుకు ఎరువుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రైతులకు అవసరమైన సంఖ్యలో ఎరువులు అందుబాటులో ఉంచడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఎరువుల కోసం సహకార సంఘాల చుట్టూ రైతులు కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అసలే ప్రకృతి వైపరీత్యాలతో కుంగిపోయిన రైతులకు ప్రభుత్వ వైఖరి మరింత దిగులు కలిగిస్తోంది. ఆదివారం యలమంచిలి మండలం లక్కవరం పీఏసీఎస్ వద్ద ఎరువుల విక్రయం తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక్కడ ఎరువులు విక్రయిస్తున్నారని తెలియడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో రైతులు తరలి వచ్చారు. కేవలం 30 బస్తాలు మాత్రమే స్టాకు ఉండటం, 200 మందికిపైగా రైతులు ఎరువుల కోసం అక్కడకు చేరుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఎరువుల కోసం రైతులు ఒకరినొకరు తోసుకోవడం, వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడకు వచ్చిన రైతులను వారించడం పీఏసీఎస్ సిబ్బందికి సాధ్యం కాలేదు. దీంతో యలమంచిలి రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడకు చేరుకుని రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో ఎరువుల విక్రయాన్ని అర్ధంతరంగా నిలిపేశారు. రైతులను పోలీసులు బయటకు నెట్టివేసి గోడౌన్ షట్టర్ దించి తాళం వేయించారు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. కొందరు రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎరువులు కూడా అందించకపోతే తామెలా వ్యవసాయం చేసుకుంటామని ప్రశ్నించారు. -
చీడపీడల నివారణకు వేపాకు రసం ఉత్తమం
* పావు కిలో వేపాకులు రుబ్బి.. 5 లీ. నీరు కలిపి చల్లాలి * నందివర్థనం పూలతో తామర పురుగులకు చెక్ * జీవామృతం వాడితే పంటలకు ఎండు తెగులు రాదు ఇంటి పంట: మహానగరం నడిబొడ్డున అపార్ట్మెంట్లో నివాసం అయినా.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండించే సహజాహారంపై ఆసక్తి ఉంటే చాలు ఉన్నంతలో ఇంటిపంటలను సాగు చేయవచ్చని రుజువు చేస్తున్నారు డాక్టర్ గడ్డం రాజశేఖర్. సికింద్రాబాద్ అడిక్‌మెట్‌లోని అనురాధ అపార్ట్మెంట్ మొదటి అంతస్థులోని సొంత ఫ్లాట్‌లో డా. రాజశేఖర్ కుటుంబం నివాసం ఉంటున్నది. పార్కింగ్ ప్లేస్ పక్కన ఖాళీ స్థలాన్ని బాగు చేసి ఇంటిపంటల సాగు ప్రారంభించారు. నేలలో కొంచెం పశువుల ఎరువు వేసి వంగ, టమాటా, మిరప మొక్కలు నాటారు. చెక్కలతో ఏర్పాటు చేసిన మడిలో ఎర్ర తోటకూర, ఇతర ఆకుకూరలు సాగు చేస్తున్నారు. కొన్ని కుండీల్లో మెంతికూర, పాలకూర, కొత్తిమీర, మునగ సాగు చేస్తున్నారు. వంటింటి వ్యర్థాలను మొక్కల మొదళ్ల వద్ద మల్చింగ్గా వేస్తున్నారు. తన తల్లి శాంతకు ఈ మొక్కలే కాలక్షేపమని రాజశేఖర్ తెలిపారు. రసాయన రహిత సుస్థిర వ్యవసాయంలో అనుభవం ఉన్న శాస్త్రవేత్త కావడం వల్ల రాజశేఖర్(83329 45368) కిచెన్ గార్డెన్ కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇవీ ఆయన చెప్పిన విశేషాలు.. * వేప నూనె కన్నా తాజా వేపాకుల రసం చీడపీడల నివారణకు సమర్థవంతంగా ఉపయోగపడుతోంది. పావు కిలో పచ్చి వేపాకులు తీసుకొని మిక్సీలో/రోటిలో వేసి రుబ్బి.. 5 లీటర్ల నీటిని కలిపి.. మొక్కలపై చల్లుతున్నాం. * వర్మీకంపోస్టు వేసిన కుండీల్లో మెంతికూర వేస్తే.. ఎండు తెగులుతో 20% మొక్కలు చనిపోయాయి. వర్మీకంపోస్టు వాడకుండా ఎర్రమట్టిలో మెంతులు చల్లి జీవామృతం వాడిన కుండీలో ఈ సమస్య లేదు. విత్తనం వెంట వచ్చే ఎండు తెగులు తాలూకు శిలీంద్రాన్ని జీవామృతంలో ఉండే మేలుచేసే సూక్ష్మజీవులు హతమార్చాయన్నమాట. జీవామృతం గ్రోత్ ప్రమోటర్, శిలీంద్రనాశిని కూడా. * నేల మీద వంగ మొక్కలకు జీవామృతం వాడినప్పుడు 6 అంగుళాల పొడవున పెరిగిన వంకాయలు, జీవామృతం వాడడం మానేస్తే 3 అంగుళాలే పెరిగాయి. * వంగ, టమాటా, మిరప, కొత్తిమీర, ఆకుకూరలకు తామరపురుగు సోకుతూ ఉంటుంది. దీన్ని అరికట్టడానికి జిగురుపూసిన తెల్ల ఎరలు వాడుతున్నాను. లేదా తెల్లటి పూలు పూసే మొక్కలు పెంచాలి. నందివర్థనం పూలు పూసినంతకాలం తామర పురుగులు వాటిపైనే ఉన్నాయి. పూలు లేనప్పుడు మిరప, వంగ మొక్కలను ఆశించడం గమనించాను. పెంకు పురుగులు ఆశిస్తే పసుపు ఎరలు వాడాలి. కుండీల్లో మునగాకు సాగు! * పెరట్లో మునగ చెట్టు ఉంటే విటమిన్లు, టానిక్కులు కొనాల్సిన అవసరం రాదంటారు. మునగను కుండీల్లో ఆకు కోసం, కాయల కోసం కూడా పెంచవచ్చు. విత్తనం వేస్తే ఆరు నెలలు, నెల మొక్క నాటితే 5 నెలల తర్వాత నుంచి మునగాకు కోసుకొని కూరల్లో వాడుకోవచ్చు. ఎండబెట్టి పొడి చేసి.. రోజూ కొంచెం కూరల్లో వేసుకోవచ్చు. ఆకు కోసం పెంచితే.. 4 అడుగుల ఎత్తులో పైచిగురును తుంచేయాలి. పక్కకొమ్మలు పెరిగి ఎక్కువ ఆకు వస్తుంది. కాయలకోసం పెంచితే.. 5 అడుగులు ఎదిగిన తర్వాత పై చిగురును కత్తిరించాలి. * మునగ చెట్టు పెరట్లో ఉండకూడదన్న సెంటిమెంటు కొందరిలో ఉంది. బొంత(గొంగళి)పురుగు వల్లే ఇది వచ్చి ఉంటుంది. బొంత పురుగు రాకుండా చేయడానికి ఓ చిట్కా ఉంది. మొక్క 6 నెలలు పెరిగిన తర్వాత.. కింది నుంచి 2 అడుగుల ఎత్తు వరకు పాలిథిన్ పేపర్‌ను చుట్టి.. దానిపై నూనెను పూస్తే బొంత పురుగు చెట్టెక్కలేదు. బొంతపురుగులు మొక్క మొదట్లో మట్టిలో ఉండే గుడ్ల నుంచి పుట్టుకొస్తాయి. ఆ గుడ్లను తవ్వితీసి నాశనం చేస్తే సమస్యే ఉండదు. * కమలాల్లో కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి, క్యారెట్లలో కంటే 4 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ, పాలల్లో కంటే 4 రెట్లు ఎక్కువ క్యాల్షియం, అరటిపండ్లలో కంటే 3 రెట్లు ఎక్కువ పొటాషియం, పెరుగులో కంటే 2 రెట్లు ఎక్కువ మాంసకృత్తులు మునగాకులో ఉన్నాయి. * మునగాకును పప్పులో, సాంబారులో వేయొచ్చు. వేపుడు చేయొచ్చు. మునగ కాయల్లో కన్నా ఆకుల్లో పోషకాలు ఎక్కువ. మునగ పువ్వును చట్నీ చేయొచ్చు. * మునగాకు పొడి చేసేదిలా: లేత మునగాకును కడిగి, నీడలో ఆరబెట్టాలి. గలగలలాడేలా ఆరిన మునగాకును పొడి చెయ్యాలి. పొయ్యి మీద నుంచి దించిన తరువాత కూరలు, చారు వంటి వాటిల్లో వేసి కలపాలి. -
పార్కు ప్రారంభం
బెంగళూరు : మారుతీమందిర వార్డులోని కెనరాబ్యాంక్ కాలనీలో ఏర్పాటుచేసిన పార్కును ఆదివారం రాష్ట్ర రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ ప్రారంభించారు. ఈ పార్కును రెండన్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.3 కోట్లతో నిర్మించారు. ఇందులో యువకులు, వయోవృద్ధులు వ్యాహ్యాళికి వెళ్లడానికి అన్ని సదుపాయాలు కల్పించారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆటపరికరాలు ఉన్నాయి. మహాత్మాగాంధీతో పాటు ఇతర నాయకులు విగ్రహాలతోపాటు కెనరాబ్యాంక్ వ్యవస్థాపకులు అమ్మెంబల్ సుబ్బారావ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కును వినియోగించుకుని ఆహ్లాదం పొందాలని పేర్కొన్నారు. అంతకు ముందు నగరమేయర్ శాంతకుమారి వినాయక లేఔట్లో ఉన్న పార్కులో పొడిచెత్తను వేరుచేసే యంత్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ వీ.సోమణ్ణ, ఎమ్మెల్యే ప్రియాకృష్ణ, డెప్యూటీమేయర్ కే.రంగణ్ణ, స్థానిక కార్పొరేటర్లు వాగీశ్ప్రసాద్, మోహన్‌కుమార్, ఉమేష్ శెట్టి పాల్గొన్నారు. -
సాయం చేసేదెవరు!
ఆదర్శ రైతులను తొలగించిన ప్రభుత్వం ఎంపీఈవోల నియామకానికి ఖరారు కాని విధివిధానాలు వ్యవసాయ సమాచారం ఇచ్చేవారు కరువు ఆందోళనలో అన్నదాతలు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు అన్నదాతలను రోజురోజుకూ మరింత కుంగదీస్తున్నాయి. హామీల వర్షంతో ఆశలు రేపిన పాలకులు కొద్దికాలంలోనే వాటిని వమ్ము చేశారు. హామీలను అమలు చేయకపోగా, రైతులకు అన్ని విధాలా ఉపయోగపడుతున్న ఆదర్శ రైతు వ్యవస్థను కూడా తొలగించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో సాగు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరు సాయం చేస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు/మచిలీపట్నం : రైతులకు మరో కష్టం వచ్చిపడింది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినా.. సకాలంలో సాగునీరు రాకపోయినా అష్టకష్టాలు పడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ద్వారా కనీస సేవలు కూడా అందకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి రైతులకు కనీస సమాచారం కూడా అందడం లేదు. ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేయడమే ఇందుకు కారణం. ఎరువుల వినియోగం, సబ్సిడీ పరికరాల సమాచారం తదితర అంశాలపై రైతులకు సమాచారం సకాలంలో అందేది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేయటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సమాచారం ఇచ్చేవారు కరువు ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు కల్పిస్తున్న ప్రయోజనాల గురించి క్షేత్రస్థాయిలో వివరించేవారు కరువయ్యారు. పెద్ద రైతులకు మినహా సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ శాఖకు సంబంధించిన సమాచారం అందని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వం నియమించిన ఆదర్శ రైతులను ప్రస్తుత పాలకులు తొలగించారు. వారి స్థానంలో ఎంపీఈవోలను నియమిస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేయటంలో జాప్యం చేస్తోంది. ఎంపీఈవోల నియామకం ఎప్పటికి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో మండలంలో 50 మంది చొప్పున ఆదర్శరైతులు ఉండేవారు. దీంతో గ్రామస్థాయిలో రైతులకు సకాలంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండేది. వ్యవసాయ శాఖ సబ్సిడీపై అందించే వరి విత్తనాలు, యంత్రపరికరాలు, జిప్సం, యూరియా తదితర ఎరువుల వివరాలను ఆదర్శరైతులు తమ పరిధిలోని రైతులకు తెలియజేసి అవసరమైతే వారే వెంటపెట్టుకుని తీసుకెళ్లేవారు. రైతులకు అన్ని విధాలా సాయం చేసేవారు. ప్రస్తుతం ఆదర్శరైతులు లేకపోవడంతో మండల వ్యవసాయాధికారి లేదా వ్యవసాయ విస్తరణాధికారులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలోని 49 మండలాల్లో సగానికి పైగా మండలాల్లో వ్యవసాయశాఖ విస్తరణాధికారులు లేరు. పంటలకు తెగుళ్లు వ్యాపించిన సమయంలో ఎలాంటి మందులు వాడాలి, ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలనే విషయం తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళితే అధికారులు, సిబ్బంది కనిపించడంలేదని రైతులు చెబుతున్నారు. ఎంపీఈవోల నియామకంలో జాప్యం ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం ప్రతి మండలానికి నలుగురు, ఐదుగురు వ్యవసాయ విస్తరణ అధికారి(ఎంపీఈవో)లను కాంట్రా క్టు ప్రాతిపదికన నియమించనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయ విభాగం లో డిప్లమో చేసిన వారిని ఈ పోస్టుల్లో నియమిస్తారనే ప్రచారం జరుగుతోం ది. దీనికి అనుగుణం గా స్పష్టమైన ఉత్తర్వులు జారీ కాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలొస్తేనే ఎంపీఈవోల నియామకా నికి అవకాశం ఉంటుం దని వ్యవసా య శాఖ అధికారులు చెబుతున్నారు. మొక్కుబడిగా కార్యక్రమాలు ప్రతి మంగళ, బుధవారాల్లో ‘పొలం పిలుస్తోంది’, ప్రతి నెల 16వ తేదీన వ్యవసాయ మార్కెట్లలో రైతులకు సలహాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని విధిగా రెండు గ్రామాల్లో నిర్వహించాల్సి ఉంది. ఈ సమాచారాన్ని రైతులకు అందించే వారు లేక మొక్కుబడిగానే జరుగుతోంది.