రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. తిరుమల ఎరువుల దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి రెండు ఫైరింజిన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.