సాక్షి, హైదరాబాద్: రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోనే ఉన్నాయని క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేవని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వర్షాధార పంటల సాగు ఆశాజనకంగానే ఉందని, ప్రాజెక్టులు, చెరువుల్లోకి ఇంకా నీరు రానందున వరి నాట్లు మందకొడిగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంటుందన్నారు. వ్యవసాయ యాం త్రీకరణకు ఈ ఏడాది అధిక నిధులను కేటాయించామని, విత్తనం వేసిన దగ్గర నుంచి పంట కోతల వరకు అన్ని పనులు యంత్రాలతోనే జరి గేలా చూడాలని మంత్రి సూచించారు. యం త్రాల ద్వారా సాగు ఖర్చు తగ్గడంతో పాటు కూలీల కొరతను కూడా అధిగమించ వచ్చన్నారు.
ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి ఒక్కో క్లస్టర్‌కు వ్యవసాయ విస్తరణ అధికారిని(ఏఈఓ) నియమించినట్లు చెప్పారు. ప్రతి క్లస్టర్‌లో సాగుకు అవసరమైన యంత్రాల వివరాలను అధికారులు రూపొందించాలన్నారు. రైతు వేదికల నిర్మాణం వేగం పుంజుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ ఎం.జగన్‌మోహన్, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment