అమలాపురంలో ఎరువుల దుకాణంలో స్టాక్, బిల్లులు తనిఖీలు చేస్తున్న విజిలెన్స్ సీఐ రామ్మోహనరెడ్డి
అమలాపురం టౌన్: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు అమలాపురంలోని పలు ఎరువుల దుకాణాల్లో గురువరం ఆకస్మిక దాడులు చేశారు. ప్రధానంగా రెండు ఎరువుల దుకాణాలపై దాడులు చేసి స్టాక్‌లు, బిల్లులను తనిఖీ చేశారు. పట్టణంలోని అనంత లక్ష్మి సీడ్స్, గంగా సీడ్స్‌కు చెందిన ఎరువుల దుకాణాల్లో ఈ దాడులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాగాయి. విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆదేశాల మేరకు సీఐ టి.రామమోహనరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురంలో ఈ దాడులు, తనిఖీలు జరిగాయి.
ఈ రెండు దుకాణాలకు ఆయా కంపెనీల నుంచి వచ్చిన ఎరువుల స్టాక్‌కు గోడౌన్లలో ఉన్న స్టాక్‌కు లెక్కలు తేడా వచ్చాయని విజిలెన్స్ సీఐ రామ్మోహనరెడ్డి తెలిపారు. అలాగే రైతులకు అమ్మిన ఎరువులను బిల్లులను కూడా తనిఖీ చేశారు. స్టాక్‌లు, బిల్లుల పరంగా తేడాలు ఉండడంతో ఆ రెండు దుకాణాల్లో రూ.8.33 లక్షల విలువైన ఎరువు బస్తాలను సీజ్ చేశామని సీఐ వెల్లడించారు. ఎరువులు కొనుగోలు చేసి వెళుతున్న కొంత మంది రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఏఓ మహేష్ భగవత్, రెవెన్యూ అధికారులతో కలిసి ఈ తనిఖీలు చేశారు. పట్టణంలోని కొన్ని ప్రముఖ ఎరువుల దుకాణాలను కూడా సోదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment