ఎరువుల దుకాణంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.
ఎరువుల దుకాణంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలో చోటుచేసుకుంది. పెద్దపల్లి మండల కేంద్రంలోని జెండా చౌరస్తా ప్రాంతంలో సాయి ప్రసన్న ఎరువుల దుకాణంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల విలువ చేసే యూరియా, అమ్మోనియా ఎరువులు పూర్తిగా కాలిపోయాయి. మంటల వేడికి బిల్డింగ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి.