వెంకటాపురం(ఎం): కస్తూర్భా గాంధీ పాఠశాలలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో విద్యార్థుల దుస్తులు, పెట్టెలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన గదిలో విద్యార్థులు నిద్రించకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని జవహర్‌నగర్ కేజీబీవీలో సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు చోటుచేసుకుంది.
కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 280 మంది విద్యారి్థనులు చదువుతున్నారు. వారం రోజుల క్రితం కళ్ల కలక వచ్చి సుమారు 230 మంది విద్యార్థులు ఇంటికి వెళ్లారు. మిగతా వారు పాఠశాలలోనే ఉన్నారు. వారు పడుకున్న పక్క గదిలో సోమవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
టోల్‌గేట్ వద్ద విధులు నిర్వహించుకుని ఇంటికి వెళుతున్న యువకులకు ఆ మంటలు కనిపించాయి. వెంటనే స్థానిక సర్పంచ్ శనిగరపు రమ భర్త రమేశ్‌కు ఫోన్‌లో సమాచారం ఇచి్చన యువకులు అక్కడికి చేరుకున్నారు. రమేశ్ పాఠశాలకు చేరుకుని గదిలో నిద్రిస్తున్న 44 మంది విద్యారి్థనులను కిందికి తీసుకువచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఈలోగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలను అదుపుచేయడంతో విద్యార్థులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కళ్లకలక వ్యాధి వచ్చి విద్యార్థులు ఇళ్లకు వెళ్లకపోతే ప్రమాదం జరిగిన గదిలో కూడా చాలామంది నిద్రించేవారని సహచార విద్యార్థులు పేర్కొన్నారు. కాగా, రాత్రి సమయంలో పాఠశాలలో విధులు నిర్వర్తించాల్సిన ఉపాధ్యాయురాలితోపాటు వాచ్‌మన్, ఏఎన్‌ఎం ఎవరూ విధుల్లో లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment