kasturba gandhi girls school
-
సర్కారు చేయూత.. చదువుల తల్లి కల సాకారం
ఆదోని రూరల్/ఆస్పరి: చదువుల్లో అత్యుత్తమంగా రాణిస్తున్న ఆ బాలికను పేదరికంతో తల్లిదండ్రులు చదువు మానిపించారు. ఆ చదువుల తల్లి పదో తరగతిలో 537 మార్కులు సాధించినా.. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉన్నా.. ఆ ర్థిక పరిస్థితుల రీత్యా చదువుకు దూరమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ఆమెకు వరమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి గతేడాది జూన్‌లో బాలిక ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో తాను చదువుకుంటానంటూ బాలిక ఆయనకు మొరపెట్టుకోవడంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాలికను కర్నూలు జిల్లా ఆస్పరి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో చేర్పించారు. అడుగడుగునా ప్రభుత్వ ప్రోత్సాహం అందించడంతో తాజాగా విడుదలైన మొదటి ఏడాది ఇంటర్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు 421 మార్కులు సాధించి ఆ బాలిక టాపర్‌గా నిలిచింది. ‘కార్పొరేట్ కళాశాలల్లో చదివితేనే ఎక్కువ మార్కులు’ అనే అపోహను తుడిచిపెట్టేసి ప్రభుత్వ విద్యాసంస్థలో చదివి అత్యుత్తమ మార్కులను సొంతం చేసుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఐపీఎస్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది చదువుల తల్లి నిర్మల. కూలి పనుల నుంచి కాలేజీకి పంపిన ప్రభుత్వం కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు హనుమంతమ్మ, శీనప్ప దంపతులకు నలుగురు ఆడపిల్లలు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించారు. నాలుగో కుమార్తె నిర్మలను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివించారు. పదో తరగతిలో 600కి 537 మార్కులు సాధించి నిర్మల సత్తా చాటింది. అయితే నిరుపేద కుటుంబం కావడంతో ఉన్నత చదువులు చదివించేందుకు నిర్మల తల్లిదండ్రులకు ఆ ర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో ఆమెను చదువు మానిపించి తమతోపాటే కూలిపనులకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటిలోనే ఉన్న నిర్మల ‘సార్ నేను చదుకుంటాను. నాకు సీటు ఇప్పించండి. మా అమ్మానాన్నలు పేదవాళ్లు. డబ్బులు పెట్టి చదివించలేని పరిస్థితి’ అని వేడుకుంది. చలించిపోయిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వెంటనే ఆమెను కాలేజీలో చేర్పించాలని అప్పటి ఎంపీడీవో గీతావాణి, తహసీల్దార్ వెంకటలక్షి్మని ఆదేశించారు. మరోవైపు నిర్మలపై ‘సాక్షి’లో కథనం రావడంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన నిర్మలను తన కార్యాలయానికి పిలిపించారు. నిర్మల ఉన్నత చదువులకు ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పి ఆమెను ఆస్పరి కేజీబీవీలో చేర్పించారు. ప్రభుత్వం అండగా నిలవడంతో రూపాయి కూడా ఫీజు కట్టకుండానే నిర్మల చదువుకుంది. అంతేకాకుండా ఆమెకు మెటీరియల్, పుస్తకాలను కూడా కలెక్టర్ అందించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఓవైపు చదువుల్లోనే కాకుండా మరోవైపు ఆటల్లోనూ నిర్మల రాణిస్తోంది. గతేడాది కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైంది. ఈ క్రమంలో నిర్మలను జిల్లా కలెక్టర్ సృజన ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ కావాలన్నదే నా జీవిత ఆశయం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ సృజన నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కలెక్టర్ మాటలను ఎప్పటికీ మర్చిపోలేను. నా చదువుకు మేడమ్ అన్నివిధాల సహకరిస్తున్నారు. ఐపీఎస్ కావాలన్నదే నా లక్ష్యం. – నిర్మల, విద్యా ర్థిని చాలా గర్వంగా ఉంది.. నిర్మల ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది.. పాఠ్యాంశాలపై ఆసక్తి చూపుతోంది. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రూపకల్పన చేసిన పంచతంత్ర ప్రోగ్రామ్ ద్వారా డైలీ, వీక్లీ, గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం. నిరంతర మూల్యాంకనంతోపాటు విద్యార్థుల సందేహలను నివృత్తి చేస్తున్నాం. ఈ టెస్ట్‌ల్లో నిర్మల మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె సాధిస్తున్న విజయాల పట్ల ఎంతో గర్వంగా ఉంది. – శారున్ స్మైలీ, ప్రిన్సిపాల్, కేజీబీవీ, ఆస్పరి, కర్నూలు జిల్లా -
కస్తూర్బా పాఠశాలలో అగ్నిప్రమాదం.. ఆ ముగ్గురూ ఏమైనట్టు?
వెంకటాపురం(ఎం): కస్తూర్భా గాంధీ పాఠశాలలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో విద్యార్థుల దుస్తులు, పెట్టెలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన గదిలో విద్యార్థులు నిద్రించకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని జవహర్‌నగర్ కేజీబీవీలో సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు చోటుచేసుకుంది. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 280 మంది విద్యారి్థనులు చదువుతున్నారు. వారం రోజుల క్రితం కళ్ల కలక వచ్చి సుమారు 230 మంది విద్యార్థులు ఇంటికి వెళ్లారు. మిగతా వారు పాఠశాలలోనే ఉన్నారు. వారు పడుకున్న పక్క గదిలో సోమవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. టోల్గేట్ వద్ద విధులు నిర్వహించుకుని ఇంటికి వెళుతున్న యువకులకు ఆ మంటలు కనిపించాయి. వెంటనే స్థానిక సర్పంచ్ శనిగరపు రమ భర్త రమేశ్‌కు ఫోన్లో సమాచారం ఇచి్చన యువకులు అక్కడికి చేరుకున్నారు. రమేశ్ పాఠశాలకు చేరుకుని గదిలో నిద్రిస్తున్న 44 మంది విద్యారి్థనులను కిందికి తీసుకువచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలను అదుపుచేయడంతో విద్యార్థులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కళ్లకలక వ్యాధి వచ్చి విద్యార్థులు ఇళ్లకు వెళ్లకపోతే ప్రమాదం జరిగిన గదిలో కూడా చాలామంది నిద్రించేవారని సహచార విద్యార్థులు పేర్కొన్నారు. కాగా, రాత్రి సమయంలో పాఠశాలలో విధులు నిర్వర్తించాల్సిన ఉపాధ్యాయురాలితోపాటు వాచ్‌మన్, ఏఎన్ఎం ఎవరూ విధుల్లో లేకపోవడం గమనార్హం. -
మాట్లాడే పుస్తకాలు వచ్చేశాయ్!
సాక్షి, విద్యారణ్యపురి(వరంగల్) : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని కస్తూర్బాగాంధీ బాలికలు మాట్లాడే బొమ్మలతో కూడిన పుస్తకాలు, మాట్లాడే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొంత కాలం క్రితమే మాట్లాడే ఈ పుస్తకాలు కేజీబీవీలకు చేరగా తాజాగా డాల్ఫిన్ పరికరాలు అందాయి. వీటి వినియోగం, ఉపయోగాలపై హన్మకొండలోని డీఈఓ కార్యాలయంలో కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లకు యునిసెఫ్ రాష్ట్ర సలహాదారు సదానంద్ శిక్షణ ఇచ్చారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో.. 2006 సంవత్సరంలో యూనిసెఫ్ ‘స్విస్’ ప్లస్ కార్యక్రమం కింద విద్యార్థుల్లో మార్పు కోసం మాట్లాడే వంద రకాల పుస్తకాలను రూపొందించింది. ఇందులో పర్యావరణ సమస్యలు, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ, బాలికల సమస్యలు, ఆరోగ్యం, పౌష్టికాహారం, బాలల హక్కులు తదితర అంశాలు ఉంటాయి. పల్లెల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలను సులభశైలిలో చెప్పేలా ఉంటాయి. వీటిని చదివితే వారిలో తప్పకుండా మార్పు వస్తుందనటంలో సందేహం లేదు. దీంతో విద్యార్థు«ల్లో చైతన్యం మార్పు వస్తుందని యూనిసెఫ్ సలహాదారు సదానంద్, అర్బన్ జిల్లా సెక్టోరియల్ అధికారి డి.రమాదేవి అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాల్లో ఉన్న అంశంపై ప్రత్యేకంగా రూపొందించిన డాల్ఫిన్ రూపంలో పరికరాన్ని ఉంచడం ద్వారా ఆ కథనం బయటకు వినిపిస్తుంది. విద్యార్థుల్లో చైతన్యం.. జీవన నైపుణ్యాలు కేజీబీవీల్లోని 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు మాట్లాడే పుస్తకాల్లోని అంశాలు చైతన్యం కలిగిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 63 కేజీబీవీలు ఉండగా.. మాట్లాడే పుస్తకాలు అందజేసిన అధికారులు తాజాగా డాల్ఫిన్ పరికరాలను కేజీబీవీకి ఒక్కటి చొప్పున పంపిణీ చేశారు. అలాగే జిల్లాకో ప్రభుత్వ పాఠశాలకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారని సమాచారం. కొంచెం నవ్వండి బాబు, సైలెంట్ హీరోస్, పని మంతురాలు ప్రతిమ, సిల్లీ సాంబయ్య, బిల్లీగోట్ వంటిç కథనాలతో కూడిన పుస్తకాలు ఉన్నాయి. చదువులో కొత్త విధానంతో మరింతగా మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. -
ఉన్నది 200 మంది.. కానీ రెండే గదులు
సాక్షి, నర్సీపట్నం(విశాఖపట్నం) : కస్తూర్బా పాఠశాలను తొలుత మాకవరపాలెం ప్రాథమిక పాఠశాలలో అరకొర సౌకర్యాల మధ్య ప్రారంభించారు. దీంతో ఏళ్ల తరబడి విద్యార్థులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2015లో భీమబోయినపాలెం సమీపంలో కొండ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషించారు. ఇక నుంచి తమకు వసతి సమస్య తప్పినట్టేనని వారు సంబరపడ్డారు. కానీ ఈ కొత్త భవనంలో విద్యార్థులకు సరిపడిన గదులు లేకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ భవనం ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటికీ అదనపు గదులు నిర్మించక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నాలుగేళ్లయినా అలాగే.. ఈ పాఠశాలకు ప్రస్తుతం తొమ్మిది గదులు ఉన్నాయి. వీటిలో ఐదింటిలో తరగతులు, ఒక గదిలో ఆఫీస్, మరో గదిలో కంప్యూటర్, స్టాఫ్ రూమ్‌గా వినియోగిస్తున్నారు. ఇక మిగిలిన రెండు గదులు మాత్రమే 200 మంది విద్యార్థులు రాత్రి సమయంలో నిద్రించేందుకు ఉన్నాయి. ఇవి చాలక విద్యార్థులు ఉన్న వాటిలోనే తమ సామగ్రిని పెట్టుకుని ఇరుకుగా పడుకుంటున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం మరో రెండు గదులు డార్మెటరీకి, మూడు గదులు గ్రంథాలయం, ల్యాబ్‌కు అవసరం. మొత్తం ఐదు గదులు మంజూరు చేస్తే ఇక్కడి విద్యార్థులకు, సిబ్బందికి పూర్తిగా ఇబ్బందులు తొలగిపోతాయి. అయ్యన్న హామీ ఇచ్చినా.. ఈ పాఠశాలను ప్రారంభించిన అప్పటి మంత్రి అయ్యన్న కొండ ప్రాంతంలో నిర్మించడమేంటని అధికారులను ప్రశ్నించారు. అయితే భవనానికి రక్షణగా చుట్టూ ప్రహరీ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దీంతోపాటు ప్రధాన రహదారి నుంచి పాఠశాల వరకు తారురోడ్డు నిర్మాణానికి కూడా ప్రతిపాదించాలన్నారు. గదుల కొరత కారణంగా మరో మూడు అదనపు గదులను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయిస్తామని కస్తూర్బా పాఠశాలలో నిర్వహించిన సమావేశంలోనే అప్పటిలో ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల అనంతరం రోడ్డు పనులు చేపట్టారు. ఇక ప్రహరీ నిర్మాణం జరగలేదు. ఇక అదనపు గదుల హామీ ఇప్పటికీ అమలు చేయకపోవడంతో నిత్యం విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
బ్రేవ్!
అప్పుడప్పుడు ఓ గుడ్డు.. నెలలో ఓసారి అరటిపండు.. పాల కోటాలో కోతలు.. పక్కదారి పడుతున్న బియ్యం, నూనె, పప్పు దినుసులు.. ఇదీ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో అమలు చేస్తున్న మెనూ తీరు.. పాఠశాలల్లో రోజువారీ నిర్వహణ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉండగా.. విద్యార్థినుల చేత లెక్కలు రాయించి.. నెల చివర్లో వారికి అనుకూలంగా చిట్టా తయారు చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ‘కస్తూర్బా’ల్లో వంట సరుకులు పక్కదారి కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ‘వంట’ దినుసుల నిధులను ఒంటబట్టించుకుంటున్నారు. రోజువారీ నిర్వహణ ఖర్చులను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉండగా.. విద్యార్థినుల చేత తమకనుగుణంగా లెక్కలు రాయించి డబ్బులను బొక్కేస్తున్నారు. తిన్నోళ్లకు తిన్నంత అన్న చందంగా అవినీతికి పాల్పడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఈ తతంగాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. - శంషాబాద్ రూరల్ శంషాబాద్ రూరల్: జిల్లాలో 26 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిన నియమితులైన స్పెషలాఫీసర్లు ఇష్టాసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యాలయాల ఏర్పాటు లక్ష్యం నీరుగారుతోంది. విద్యార్థినులకు అందాల్సిన భోజనంలో వడ్డించే గుడ్లు, పాలు, పండ్లను ఇవ్వకుండానే బిల్లులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిపై ఉన్నతాధికారుల అజమాయిషీ, పర్యవేక్షణ లేకపోవడంతోనే వీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మరో వైపు సిబ్బంది అవినీతిలో ఉన్నతాధికారులకు వాటాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్పెషలాఫీసర్, అకౌంటెంటు కుమ్మక్కై ఒక్కో విద్యాలయంలో నెలకు రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు నొక్కేస్తున్నట్లు సమాచారం. నిధుల భోజ్యం తీరిలా.. విద్యాలయంలోని ఒక్కో విద్యార్థినికి భోజనం, పౌష్టికాహారం అందించడానికి నెలకు రూ.1000 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. విద్యాలయాల్లో విద్యార్థినుల హాజరును బట్టి ఈ మొత్తానికి సంబంధించి నివేదిక పంపిస్తే వీటి బిల్లులు మంజూరవుతుంటాయి. ఇక్కడే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రికార్డులను వారికి అనుకూలంగా మార్చుకుంటూ, విద్యార్థుల గైర్హాజరు, ఉపాధ్యాయుల స్వల్పకాలిక సెలవులను త ప్పుగా చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. విద్యాలయాలు పునఃప్రారంభమై నెల దాటుతున్నా శంషాబాద్ మండలం పాల్మాకుల కస్తూర్బా విద్యాలయంలో ఇప్పటి వరకు కేవలం 10 రోజులు కూడా గుడ్డు ఇవ్వలేదు. విద్యార్థినులు ఇప్పటిదాకా అరటి పండు ముఖం చూడలేదు. పైగా వారికి రోజూ వారిగా అందించాల్సిన పాల కోటాలో కోతలు పెడుతూ లెక్కలు మాత్రం సరిగ్గానే రాసేస్తున్నారు. జూలై నెలకు సంబంధించిన లెక్కలను స్పెషలాఫీసర్ గానీ, అకౌంటెంటు వద్ద గానీ నమోదు చేసుకోకపోవడం గమనార్హం. ఈ బాధ్యతలను ఫుడ్ లీడర్లుగా ఎన్నుకున్న విద్యార్థినులకు అప్పగించారు. ఈ నెల 15 వరకు విద్యార్థినులు (ఫుడ్ లీడర్లు) నమోదు చేసిన లెక్కల్లో 1500 గుడ్లు తేడా కనిపించింది. ఈ లెక్కన ఇప్పటి వరకు గుడ్లలో జరిగిన అవినీతి రూ.7500 లెక్క తేలింది. ఇక రోజూ 25-28 లీటర్ల పాలను తీసుకుంటున్నట్లు సిబ్బంది చెబుతుండగా.. విద్యార్థినులు రాసిన రికార్డుల్లో ఒక్కో రోజు కేవలం 5 లీటర్ల నుంచి 20 లీటర్ల పాలు మించడంలేదు. బాలికలకు ఇప్పటి వరకు భోజనంలో ఒక్కసారి కూడా అరటి పండు ఇవ్వలేదు. ఇక బియ్యం నిల్వలను స్టాక్ పాయింట్ నుంచి పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం. -
అలా సరిపెట్టేసుకోండి..!
ఉడకని అన్నం... నీళ్ల సాంబారు పెదబయలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో అమలుకాని మెనూ పెదబయలు: గిరిజన ప్రాంతమైన పెదబయలులోని క స్తూర్బా గాంధీ బాలికల పాఠశాల... ఇక్కడ 167 మంది విద్యార్థినులు ఉన్నారు... నిబంధనల ప్రకారం వారికి నాణ్యమైన విద్య అందించాలి... తగిన పౌష్టికాహారం అందజేయాలి... మధ్యాహ్నం భోజనానికి అన్నం, సాంబారు, ఒక కూరతో పాటు మజ్జిగ, ఉడికించిన గుడ్డు అందించాలి. అయితే బుధవారం పాఠశాలలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది. ఉడకని అన్నం.. అందులోనూ రాళ్లు.. నీళ్లలా పలుచని సాంబారు, రుచిలేని వంకాయ కూర... ఇదీ విద్యార్థినులకు అందించిన మెనూ. మజ్జిగ, ఉడికించిన గుడ్డు కంచంలో ఎక్కడా కనిపించలేదు. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఆ భోజనమే చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచీ ఇదే పరిస్థితి అని విద్యార్థినులు వాపోతున్నారు. ఎందుకిలా...? మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలోనే మెనూ సరిగా అమలు కాకపోవడం, ఉప గిరిజన సంక్షేమ అధికారి కూడా ఇక్కడే ఉన్నా మెనూ అమలు తీరుతెన్నులపై దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై పాఠశాల ప్రత్యేక అధికారిణి సీహెచ్ సుధారాణి స్పందిస్తూ, కూరగాయల సరఫరాకు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ వాటిని పాఠశాలకు సక్రమంగా అందించట్లేదని చెప్పారు. అందువల్లే మెనూ కొంతమేరకే అమలు చేస్తున్నామని వివరణ ఇచ్చారు. రెండేళ్ల నుంచి నీటి సమస్య... ఈ పాఠశాలలో రెండేళ్ల నుంచి నీటి సరఫరా సరిగాలేక విద్యార్థినులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒకేమోటర్తో నీరు తోడటంతో అందరికీ సరిపోవట్లేదు. ఎక్కువ మంది కాలకృత్యాలకు బయటకే వెళ్లాల్సిన పరిస్థితి. అంతేకాదు మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతుకు గురవ్వడంతో తాగునీటికీ ఇబ్బంది తప్పట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలలో మెనూ పక్కాగా అమలుకు చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థినులు కోరుతున్నారు. -
కొను‘గోల్మాల్’
ఖమ్మం: అక్రమాల పుట్టగా పేరున్న రాజీవ్ విద్యామిషన్ అధికారులు మరోసారి తమ నిజ స్వరూపం బయటపెట్టారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు వంటపాత్రలు, ఇతర వస్తువుల సరఫరాలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లలో చూపించినట్టుగా కాకుండా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నాసికరం వస్తువులు సరఫరా చేసినట్లు తెలిసింది. ఇందులో షాపుల యజమానులతో ఆర్వీఎం అధికారులు కుమ్మక్కయ్యారనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగా నియమితులైన పలువురు కేజీబీవీ ప్రత్యేకాధికారులు దీనిపై ప్రశ్నిస్తే.... ‘ఇది షరా మామూలే.. దీనిపై మీరు ఎక్కువగా మాట్లాడితే ఉన్నతాధికారుల దృష్టిలో పడుతారు’ అని ఆర్వీఎంలో పనిచేస్తున్న ఓ అధికారి బెదిరించడంతో వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. చేసేది లేక ఆ వస్తువులనే వినియోగిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం తెలిసిన జిల్లా ఉన్నతాధికారులు ఆర్వీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను నెలకొల్పింది. ఈ క్రమంలో జిల్లాలో మైదాన ప్రాంతంలో 21, ఐటీడీఏ పరిధిలో 12 కేజీబీవీలు మంజూరు చేశారు. మైదాన ప్రాంతంలో 15 కేజీబీవీలకు అన్ని వసతులతో కూడిన సొంత భవనాలు నిర్మించారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వంట చేసి పెట్టేందుకు ప్రభుత్వం రూ. 35,09,854 మంజూరు చేసింది. ఈ డబ్బులతో ఐరన్ స్టవ్‌లు, అల్యూమిలియం వంటపాత్రలు, గ్రైండర్, ఇడ్లీపాత్రలు, చపాతీ, దోశ పాత్రలు, 10, 5 కేజీల బొగ్నాస్, స్టీల్ బకెట్లు, స్టీల్ బేసిన్లు, రైస్ స్పూన్లు, చెంచాలు, టీ మగ్గులు, ఐరన్ క్యాబ్గిర్, మంచినీటి డ్రమ్ములు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంక్ బాక్సులు, కార్పెట్లు, బెడ్షీట్లు మొదలైనవి కొనుగోలు చేయాలి. ఇందుకోసం ఆయా వస్తువులు సరఫరా చేసే షాపు యజమానుల నుంచి టెండర్లు పిలిచారు. ఏ వస్తువు ఎన్ని కేజీలు ఉండాలి, ఎన్ని లీటర్లు ఉండాలి, ఏ కంపెనీకి చెందినవి సరఫరా చేయాలి అనే వివరాలను టెండర్ నోటీసులో పేర్కొన్నారు. దీనికి సమ్మతించి టెండర్లు వేసిన షాపులను జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. అయితే వస్తువుల సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు తెలియజేసేందుకు షాంపిల్‌గా కొన్ని వస్తువులను తీసుకొచ్చి అధికారులకు చూపించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. తీరా వస్తువులు సరఫరా చేసేటప్పటికి జిల్లా అధికారులకు టోకరా ఇచ్చి పలు నాసిరకం వస్తువులు సరఫరా చేసినట్లు సమాచారం. వీటిలో గ్రైండర్, తాగునీటి డ్రమ్ములు టెండర్లలో పేర్కొన్నవి కాకుండా వేరే కంపెనీవి సరఫరా చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో ఆర్వీఎంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అధికారులకు, షాపు యజమానులకు మధ్యవర్తిత్వం చేసి కమీషన్లు కాజేసినట్లు సమాచారం. కాగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారి ఆర్వీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడంతా షరా మామూలే... నిధుల దుర్వినియోగం, బిల్లులు పెట్టడం, ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, వస్తువుల కొనుగోలులో అవకతవకలు షరా మామూలే అని ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులు చెపుతుండడం విశేషం. ఏళ్ల తరబడి ఆర్వీఎంలో కీలక శాఖలో పనిచేసే ఉద్యోగులు, అక్కడ పనిచేసే ఔట్ సోర్సింగ్ అధికారులను అనుకూలంగా మల్చుకొని నిధులు కాజేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా కృత్రిమ అవయవాల కొనుగోలు, ఫిజియోథెరఫీ సెంటర్లలో ఏర్పాటు చేసిన బల్లలు, కంటిచూపు లోపం గల విద్యార్థులకు సరఫరా చేసిన కళ్లజోళ్లు మొదలైన వాటిల్లో అవకతవకలు జరిగాయని, వాటిని పట్టించుకున్న నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆర్వీఎం ద్వారా కొనుగోలు చేసే వస్తువులు, నిధుల వ్యయంపై దృష్టి సారిస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు దృష్టి సారించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కేజీబీవీ ఎస్ఓల భర్తీలో గందరగోళం!
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: రాజీవ్ విద్యామిష న్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలిక ల విద్యాలయాల(కేజీబీవీ) ప్రత్యేకాధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న వారిలో కొం దరు ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకూ తమనే కొనసాగించాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పటికే ఎంపిైకై నియామకాలను పూర్తి చేసుకుని విధుల్లో జాయిన్ అయిన నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి విద్యాహక్కు చట్టంప్రకారం... ఉపాధ్యాయులు కచ్చితంగా బడిలోనే ఉండాలని ఆర్వీఎం ఎస్పీడీ ఉషారాణి కొన్ని నిబంధనలు అమలు చేశారు. ఇందులో భాగంగా ఫారెన్ సర్వీసు(సంబంధి త ఇతర శాఖల నుంచి పోస్టును తీసుకోవడం), డె ప్యూటేషన్(సర్దుపాటు)పై కేజీబీవీ స్పెషలాఫీసర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెనక్కి పంపేలా చర్య లు తీసుకున్నారు. వారి స్థానాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్ఓ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇటీవల వారికి రాత పరీక్ష నిర్వహించి, నియామాకాలు చేపట్టారు. అడ్డుపడుతున్న పాత ఎస్ఓలు జిల్లాలోని 33 కేజీబీవీలలో 14 రాజీవ్ విద్యామిషన్, 11ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ, మిగిలినవి గిరిజన సం క్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్నాయి. ఎంఈఓలు, రెసిడెన్షియల్ సొసైటీ ప్రిన్సిపాళ్లుగా ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులతో పాటు ఫారిన్ సర్వీసు కింద డి ప్యూటేషన్ కింద పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయు లు కొందరు ప్రస్తుతం ఎస్‌ఓలుగా పని చేస్తున్నారు. ఈ స్థానాల్లో కొత్త ఎస్ ఓలను భర్తీ చేసే ప్రక్రియను ఇటీవల పూర్తి చేశారు. అయితే గజపతినగరం, గరి విడి, మెరకముడిదాం కేజీబీవీలలో సోమ, మంగళ వారం విధుల్లో చేరేందుకు కొత్త ఎస్ఓలు వెళ్లగా వారి కి చేదు అనుభవం ఎదురైంది. తాము కోర్టుకెళ్లాం... 2014 ఏప్రిల్ వరకు కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నాం... మీరెలా వస్తారంటూ అక్కడున్న పాత ఎస్ఓలు వారిని అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక వారు రాజీవ్ విద్యామిషన్ జిల్లా పీఓను ఆశ్రయించారు. ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ఎస్పీడీ విద్యా సంవత్సరం మధ్యలో తమను రిలీవ్ చేస్తే ఇబ్బందులు పడతామంటూ కొందరు కోర్టుకెళ్లిన వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల ని ఎస్పీడీ స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫారెన్ సర్వీసుపై ఎస్‌ఓలుగా వచ్చిన ఉపాధ్యాయులకు 2014 ఏప్రిల్ వరకు ఆయా కేజీబీవీల్లో 9, 10 తరగతులు బోధించేలా చర్యలు తీసుకోవాలని తెలి పారు. స్వచ్ఛందంగా రిలీవ్ కావాలనుకునే వారిని రిలీవ్ చేయాలని సూచించారు. ఇది జీర్ణించుకోని కొందరు పాత ఎస్ఓలు ఎలాగైనా కొనసాగాలనే పంథాతో కొత్తవారికి అడ్డు తగులుతున్నారు. పాతవాళ్లను టీచర్లగా కొనసాగిస్తాం కేజీబీవీలకు ఇన్చార్జి ఎస్‌ఓలుగా ఉన్న ఫారెన్ సర్వీ సు మీద వచ్చిన ముగ్గురిని ఆయా విద్యాలయాల్లో 9, 10వ తరగతి ఉపాధ్యాయులుగా కొనసాగిస్తామని రా జీవ్ విద్యామిషన్ పీఓ జి.నాగమణి ‘న్యూస్‌లైన్’కి తె లిపారు.ఎస్ఓలుగానే కొనసాగించాలంటూ కొందరు కోర్టుకెళ్లిన విషయాన్ని ఎస్పీడీకి నివేదించామన్నారు.